నిజమిది కాదు కాదనుచు నివ్వెర పోవు విధమ్ము జోరుగా ప్రజలు తిరస్కరించిరిదె, పద్యకవిత్వము నన్నిరీతులన్ సుజనులు చేవచేర్చినది శోభల గూర్చునటంచు చెప్పి వ చ్చి జయమటంచు ఘోషలను చేసిరి సభ్యుల మెచ్చుచున్ భళా
Objection ☝️ మీరు jk గా అన్నా కూడా “బాపనోళ్ళు” అనే మాట అంగీకారయోగ్యం కాదండి జై గారూ. బ్రాహ్మణులు అనడం మర్యాద, అలా అనడాన్ని ... టీవీలో గ్రీన్ టీ వాణిజ్య ప్రకటనలో శ్రద్ధా కపూర్ చెప్పినట్లు ... “అలవాటు చేసుకోండి”.
రెండవ సంగతి .... దూదేకుల వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ పనిముట్లను, వాళ్ళు సమాజానికి చేసిన సేవను జ్ఞాపకం చేసుకున్నాం, అంతే గానీ వాళ్ళ “మీద” పడలేదు. గమనించ ప్రార్థన.
గురువు గారూ, equal opportunity offender చిన్ని ప్రయత్నం నచ్చనట్టుంది. దూదేకులోళ్ళ గురించి గిరీశం ఉవాచ గుర్తు చేద్దామన్న సంకల్పం తప్ప ఇంకే పాపమూ లేదు, గురజాడ మీదొట్టు.
అసలే రోజులు బాలేవు, సాంఘిక మీడియాలో పెద్ధ కులపోల్లు అందరికీ గుర్రం జాషువా గుర్తొస్తున్న ఈ తరుణంలో గబ్బిలాలు జాగ్రత్త పడాలేమో.
“బాపన” శబ్దం తప్పేం గాకపోవచ్చు రాజారావు మాస్టారూ, కానీ అదే “బాపనోళ్ళు” అన్నప్పుడు ధ్వని మారిపోలా? హేళన, చులకన మిళితమైనట్లు వినిపిస్తుంది. అందువల్ల “బాపనోళ్ళు” అనే పదం మర్యాదపూర్వకమైనది కాదు అని పైన అన్న నా మాటల అంతరార్థం.
సుఖము గా వర్ధిలిరయ వసుధను జనులు రాముఁ డేలఁగఁ, జచ్చిరి ప్రజలు వేలు రావణుండేల గా లంక , రామ రావ ణుల నడుమ చిరమరయిది నుతిని జేతు రామ రామ యనుచు నవిరామ మయ్య!
భారతదేశమన్న మన పల్లెలు వాడలె విన్న కోటరా యా!రవళించినారు జనులందము గాతొలు దొల్తగా భళా తీరుగ వంట చేసి వసతిన్ ససి తోడుగ; నేడు చూడగా బారులు పూటకూళ్లె పరిపాటిగ మెక్కిరి కాదె బువ్వలన్
కరోనా కారణంగా తమ ఊళ్ళల్లోకి ఎవరూ రాకుండా ముళ్ల కంచెలవీ అడ్డుపెడుతున్నారట గ్రామస్థులు. ఈలెక్కన రాబోయే క్వార్టర్ లో పంక్చర్లు వేసేవాడి బిజినెస్ బావుంటుంది. అలాగే సైకిల్ స్కూటర్ టైర్లు తయారుచేసే కంపెనీల షేర్లు కొనొచ్చు!!
చుండము తోడు చేర సఖి స్తోత్రము మంత్రము చెప్పి స్వాములై పండితులంచు చేరువయి పైటల మాటును చూరగాంచి నీ గండల పైన నమ్మకపు కాండము పైన సవారి! మాలినీ పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్!
కవులు రసైక లాలసులు , కావ్యకలాప మనోఙ్ఞవర్తనుల్ , కవులు సమాజ చేతనకు గట్టి పునాదులు , కాని , యెందుకో ? చవి యొక యింత లేని , యొక చట్రమునందున జిక్కిరే ! కనన్ , కవి తతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్?
సంస్కారం గురించి ల...బూతులు వ్రాసిన గీ పండితుడే సెప్పాల, "ధూ మీ బతుకులు చెడ" అని తిడితే సమ్మగుంటాది అని సెప్పినారు గందా, దిష్టి తీసిన నిమ్మకాయలేరుకుని లెమన్ టీ చేసుకు తాగే మిడతం బొట్లు!
> పైన యేది కలదో క్రింద అదియే కలదు. ఐతే సంధులు సరిగా చేయండి "పైన నేది కలదో క్రింద నదియే కలదు" అని. లేదా పూర్తిగా విసంధిగా వ్రాయండి. ఆఁయ్!. (పైనన్, క్రిందన్ అని ద్రుతయుక్తరూపాలు గుర్తుచేసుకోండి మరి)
నామది కోరె రాజ! పదు నాలుగు వత్సరముల్ వనమ్ములం దా ముని వాటికల్ తిరిగి ధామము చేరమటంచు నాజ్ఞని మ్మా! మన రాజ్యలక్ష్మిని కుమారుడు నాభరతుండు చేగొనన్ రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్!
ReplyDeleteఆహా యేమి నాట్యమాడినావే నిఫ్టీ చిలుకా :)
న భూతో! న భవిష్యతి యో తెలియదు !
ఆహా ఆల్గో ట్రేడిం
గా! హమ్మో! ఇట్ల పెనము గాలుస్తుందా!
నీ హావభావములు ని
ఫ్టీ హైటెక్కయె జిలేబి ఫ్రీ ఫాల్ అండ్ అప్!
Jokes apart who Shaved and who Saved the Market ? Only insiders will know probably :)
జిలేబి
ReplyDeleteఅత్యున్నతమై వెలుగును
ప్రత్యుపకారమ్ము సలుపఁ, బాపము దక్కున్
హత్యాసదృశ్యమగునను
నిత్యము నుపకారమున్ కనికరము మరువన్
జిలేబి
ReplyDeleteసత్యమరిష్టతాతికి విశాలత జూపగ, పాడిగానగున్
ప్రత్యుపకారమున్ సలుపఁ, బాపము దక్కుట తప్ప దెప్పుడున్
హత్యను చేసినంతయె విహాపితమున్ మరువంగ మానవా!
నిత్యము ధర్మమార్గమును నెమ్మిని చేర్చుచు స్వీకరింపుమా!
జిలేబి
ReplyDeleteనీ వూరేది జిలేబీ ?
నీ వాడేదోయ్ జిలేబి ? నీ వున్నావా
కో వాడిస్ రమణీ? యే
తావాతా తాత ప్రశ్న! దా! బదులిమ్మా !
ఆల్గో వుందా లేదా ?
ట్రేడింగ్ జరుగుతోందా లేదా ? :)
జిలేబి
ReplyDeleteచేతులు కలుప తగదికన్
జోతలె మేల్గాంచునింక! చువ్వనగ కరో
నా, తియతీపిగ వందన
మే తక్షణపు శరణమయె మేవడి తోడై
జిలేబి
ReplyDeleteమౌనము వీడుచు వచ్చిరి
నీ నోటికి తాళమేను నీరజ నేత్రా
యే నాటి దమ్మ బంధము
యీనాడీ కుక్కజట్టి యిమ్ముగ రగిలెన్ :)
జిలేబి
ReplyDeleteఅనువు నమస్కారములే
మనకిక మేలని కరోన మాకొని నేర్పం
గను మనసంస్కృతియె జనుల
కనుకూలంబయె బతుకను కంద జిలేబీ
జిలేబి
ReplyDeleteఛందోగోపనము
భళి యిటాలియనాఫీస్టు! ప్రభలొలికెడు
నాదు భాష సజీవమౌ "నచ్చతెలుగు
పద్యమున నాంగ్లపదములె, హృద్యములగు"
రీతి పొసగి తెనుగు వలె రిక్కలిడును!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
ఆంగ్ల మేమి, యే భాషైనా తెలుగులో పొసగు !
ఆంగ్లపదాలిస్తే పూరణ చేయగలరా అంటే కాయ్ రాజా కాయ్ అనగల సత్తా వున్న పండితులు, దానికి పొత్తు గూర్చు భాష తెనుంగు.
గ్రుచ్చమటంచు పొత్తవని కొంటెపదమ్ముల నీయ దీప్తినే
తెచ్చిరి కైపదమ్ములను దీర్చి వధానులె తేనెలొల్కగా
నచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదమ్ములె శోభగూర్చు, రా,
విచ్చును తేటగీతివలె, వీనులవిందగు నిక్వణమ్ముగా!
నిక్వణము - వీణానాదము.
జిలేబి
ReplyDeleteతాతగారి కాననపు దిగులు :)
మాయను కనుగొన నా తర
మాయెను కాదే! జిలేబి మాయ కనుగొనన్
చేయని యతనము లేదే
ఈయమ అనపర్తివాసిని కలదొ లేదో
జిలేబి
ReplyDeleteగోకి గోకి రోదనలేలా :)
రోదనలు పలు రకమ్ములు!
వాదనలను చేసి రోసి వా యనుట, జిలే
బీ దాష్టీకమను కినుక
తో దారిని బోవు వారి తో మొరలిడుటా !
జిలేబి
ReplyDeleteసమ వుజ్జీ బాటాయే
సుమా కరోనాకు పల్కె సూర్యుడె సుమ్మీ
గమగమలాడె జిలేబీ
చమత్కృతి యననిదియేను చక్కగనమరెన్
జిలేబి
పలికినది సింహుడు ... సూర్యుడు కాదు.
ReplyDelete
ReplyDeleteఓహో పలికినది సింహుడకో :)
సమ వుజ్జీ బాటాయే
సుమా కరోనాకు పల్కె సూటిగ సింహుం
డమరెను పోవె జిలేబీ
చమత్కృతి భళారెయనగ చక్కగ కుదిరెన్
జిలేబి
ReplyDeleteచిత్రములు మరెన్నిటిని వి
చిత్రము గా నేను చూచి చింతిలెదనకో!
మైత్రి యనుకొంటిమయ రా
యా!త్రిప్పె గిరగిర మమ్ము యాయమయె సుమా :)
జిలేబి
ReplyDeleteవెదజల్లినాను పద్మా
నిదురను బిచ్చముగ నీకు నెమ్మది గా పో
వదురక నిదుర జిలేబీ
కుదిరిన పిదప సభలోన కూవుచు రావే :)
జిలేబి
ReplyDeleteమీదే దేశంబో సూ
ర్యా? దాపున గలరకొ ఉదరథి తొలిగడపన్?
లేదా మలిగడప తలమ
కో? దబ్బున కనబడి వెస కుర్రొయనెదరే :)
జిలేబి
ReplyDeleteఆలోచనలన్ మునుగుచు
తేలుచు పద్మా వసింప తెమ్మర వోలెన్
తూలుచు నిదుర తనంతట
మేలుగ వచ్చునకొ రమణి మేధా జీవీ :)
జిలేబి
ReplyDeleteసుజనులు శంకర వర్యుల
నిజమగు ప్రోత్సాహము కృషి నెక్కొలిపె భళా
సజనుల వేదిక నెట్లౌ
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్?
జాల్రా
జిలేబి
ReplyDeleteనిజమిది కాదు కాదనుచు నివ్వెర పోవు విధమ్ము జోరుగా
ప్రజలు తిరస్కరించిరిదె, పద్యకవిత్వము నన్నిరీతులన్
సుజనులు చేవచేర్చినది శోభల గూర్చునటంచు చెప్పి వ
చ్చి జయమటంచు ఘోషలను చేసిరి సభ్యుల మెచ్చుచున్ భళా
జిలేబి
ReplyDeleteOh my Nifty will you dance today baby :)
మూడు వేల పాయింట్లాయె ముచ్చటగ జి
లేబి, డౌజోన్సు తగ్గింపులే బజారు
లోన! నిఫ్టీ భళారె మరొక్క మారు
నేడు సర్క్యూటు బ్రేకుని నెప్పుకొనున?
జిలేబి
ReplyDeleteకళ్ళాలు గయ్యనుచుండు ; తల్లి చాడీలను చెప్పు :) నడుమ మురారి ఫ్యూచర్ సేఫ్ :)
హోడంబీ జీవితమ
మ్మా!డంబంబనుకొనకు సుమా! ఓ యమ్మా!
చాడీలవేలనే? నే
కోడలి వైపుంటిననుచు కోపింపకుమా
జిలేబి
ReplyDeleteతల్లా పెండ్లామా ? Stay tuned to future :) మధ్యతరగతి మానవుడి Decision :)
హోడము జీవితమ్మను మహోదధి దాటగ నాదు నేర్పిద
మ్మా!డబుడుక్కు డుక్కనుచు మాటికి మాటికి యా జిలేబియున్
క్రీడగ కాలుబంతి వలె కీసర బాసర మీరు తన్నగా
జోడుగ మేలు మార్గమిదె! జోతలు ! నిబ్బరికించు మమ్మరో!
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా!
జిలేబి
ReplyDeleteఓ కవీశుని నివేదన
బేడయు లేదు కరమ్మున
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా
హోడము సాగవలెను త
ల్లీ! డింగరుడ దయనుకురిపించుము లక్ష్మీ
ReplyDeleteదూది నేకుటెట్లు :)
దూది నేకేది కాదకో ? దూది నేకు
నదియె రాయ! జిలేబిని నాల్గు రోజు
లనగ నేకుచున్నారుకదా! నిరూప
ణగ సుమీ చిత్రమిది నమ్ముడయ్య సామి :)
జిలేబి
రాణీపేటకి పోయి వెతుకుతున్నారని భోగట్టా ! ఎవరినైనా గెలవనిస్తారా మీరు ? మీరూ కందాలతో మేకులేస్తున్నారుగా ?
Deleteబాపనోళ్లందరూ దూదేకులోళ్ళ మీద పడ్డారా? డామిట్ అగ్రహారాల కథ ఇట్టా అడ్డంగా తిరిగిందేమిటి చెప్మా
Deletejk
Objection ☝️
Deleteమీరు jk గా అన్నా కూడా “బాపనోళ్ళు” అనే మాట అంగీకారయోగ్యం కాదండి జై గారూ. బ్రాహ్మణులు అనడం మర్యాద, అలా అనడాన్ని ... టీవీలో గ్రీన్ టీ వాణిజ్య ప్రకటనలో శ్రద్ధా కపూర్ చెప్పినట్లు ... “అలవాటు చేసుకోండి”.
రెండవ సంగతి .... దూదేకుల వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ పనిముట్లను, వాళ్ళు సమాజానికి చేసిన సేవను జ్ఞాపకం చేసుకున్నాం, అంతే గానీ వాళ్ళ “మీద” పడలేదు. గమనించ ప్రార్థన.
గురువు గారూ, equal opportunity offender చిన్ని ప్రయత్నం నచ్చనట్టుంది. దూదేకులోళ్ళ గురించి గిరీశం ఉవాచ గుర్తు చేద్దామన్న సంకల్పం తప్ప ఇంకే పాపమూ లేదు, గురజాడ మీదొట్టు.
Deleteఅసలే రోజులు బాలేవు, సాంఘిక మీడియాలో పెద్ధ కులపోల్లు అందరికీ గుర్రం జాషువా గుర్తొస్తున్న ఈ తరుణంలో గబ్బిలాలు జాగ్రత్త పడాలేమో.
చక్కని కందానికి కులమే
Deleteయెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తండ్రీ?
దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రా ?
చీపర పాపర తీగల
Deleteచేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ
కాపు కవిత్వపు కూతలు
' బాపన 'కవి వరుల చెవికి ప్రల్లదంబిడునే ?
రామలింగ కవి భట్టుమూర్తి కవిని అధిక్షేపించిన
సందర్భం
బాపన తప్పేం గాదు .
This comment has been removed by the author.
Delete// “ప్రల్లదంబిడునే” // అనాలా “ప్రమదంబిడునే” అనాలా?
Delete“బాపన” శబ్దం తప్పేం గాకపోవచ్చు రాజారావు మాస్టారూ, కానీ అదే “బాపనోళ్ళు” అన్నప్పుడు ధ్వని మారిపోలా? హేళన, చులకన మిళితమైనట్లు వినిపిస్తుంది. అందువల్ల “బాపనోళ్ళు” అనే పదం మర్యాదపూర్వకమైనది కాదు అని పైన అన్న నా మాటల అంతరార్థం.
శ్రీనరసింహరావు గారూ ,
Deleteప్రమదంబిడునే అనేదే కరక్ట్ .
బాపనవారు - బాపనవాళ్ళు - బాపనోళ్ళు
హేళన ? వ్యావహారికం .
ఏకిన మేకై కూర్చొను
Deleteనేకనిచో దారమవదు నేయును కథనాల్ ,
ఆకున కందరు పొందరు
పోకను మా హితులు గెలుపె పోరాటములో .
అగ్ర తాంబూలం పుచ్చుకునే పెద్ధ కులస్థుడి మీద దుష్ట సర్కారోళ్లు కేసులేస్తే అయ్యగారి బిరాదరీయులు ఉగ్రనరసింహులై అగ్రహారమునందు నిరసనగా యాగము చేయు విధంబెట్టిదనిన:
Deletehttps://twitter.com/kesineni_nani/status/1240116456467173376
ReplyDeleteచేతులెత్తి మ్రొక్కితి జోత సేసి నాను
మీకు రీ టైర్డు కుంకని మీవలెనయ
సాములార నా పాటల సాముగరిడి
మీకు నచ్చెనదియె సుమీ మేలుబంతి
జిలేబి
ReplyDeleteపనిలేని బ్యాంకరులచట
పనిగట్టుకుని జవరాండ్ర పై పాటలతో
తనివారు పేరడీలన్
మినుకారెడురీతి గట్టి మించారిరి పో :)
జిలేబి
ReplyDeleteముసలిది నా కలమయ్యా
పస, పదునున్న దిపుడన్ను పవనకుమారా!
దుసికిల బారదెపుడు భళి
మిసమిసలాడు నెపుడున్నమితముగ సుమ్మీ
జిలేబి
ReplyDeleteఏమి చేతునయ్యరొ లింగ ఏమి చేతు ?
ఏమి చేయమాకు కొమర యేమి వలదు
కన్నులను మూసుకొనుమయ కరుణ జూప
మనుచు ధ్యానము చేయుమా మార్దవముగ!
జిలేబి
ReplyDeleteపారాసిటమాల్ చాలోయ్
పారు కరోనాయె నిన్ను వదిలి సుమా మా
సారూ సై మీ కేసీ
యారూ వాక్రుచ్చినారయా వినుడయ్యా !
జిలేబి
ReplyDeleteకవిరాట్ కందివరార్యా
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో
తవణించెడు రీతి భళి వి
డువకనరె యనుదిన మడుగడుగు దండాలే !
జిలేబి
ReplyDeleteచవులూరించెడు రీతి కైపదములే జవ్వాదులద్దుళ్ళతో
డవిరామమ్ముగ శంకరాభరణ మందాడంబరంబాయెనే
కవిరాట్ కందివరార్య! తీఱుగడయే కాన్పట్టదే సేవలో
కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?
శుభాకాంక్షలతో
జాల్రా
జిలేబి
ReplyDeleteబ్లాగ్లోకంలో పేరడీ కింగ్ బండి వారి సొబగు గానములు
జవరాలా బండి వరుల
కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో
చవులూరు పేరడి వరుస
జవగట్టుచు వచ్చు వారి శర్కరి లోనన్
జిలేబి
ReplyDeleteడర్నా మత్ మానవుడా!
కర్నా కుఛ్ నహి సిరఫ్ ఝుకానా సిర్ యే
మర్నా మిట్నా తేరీ
జర్నీ కా వృత్త హై భజరె గోవిందా !
జిలేబి
కలబడు జిలేబి మననా
ReplyDeleteల్కలుతడవన్ పలురసముల కానకకోపం
బులహాస్యామృతదాతై
తలపన్ దాంతుండుశాంతధర్మాంబుధుడై
గాదిరాజు మధుసూదన రాజు
ReplyDeleteWill stock market be closed and given vacation ? :)
రోలరు కోస్టరులో డౌ
చాలదు చాలదని దుమికె జారుడు బండన్
కేళీ వినోదములవలె
సేలున్ షార్ట్సేలు సేలు సేలయె నకటా!
జిలేబి
ఆర్థిక మాంద్యం వచ్చి మరింతమంది నిరుద్యోగులైతే బ్లాగుల్లో విజిటర్లు పెరుగుతారేమో!
Delete// “ ఆర్థిక మాంద్యం వచ్చి మరింతమంది నిరుద్యోగులైతే బ్లాగుల్లో విజిటర్లు పెరుగుతారేమో!” //
Deleteమీరు గొప్ప ఆలోచనలు వస్తుంటాయి సూర్యా 😁😁.
Deleteరీటైర్డు వాళ్ళ ఖాతాలో కొత్త జమా :)
ReplyDeleteGap down opening 6.30% down DowJones !
Oh my Nifty will you open below 8000 mark today ? :)
జారెను ఇరవై వేలును
నోరగ డౌ జోన్సు నేడు నువ్వానేనా
రారమ్మంచు బజారు ఖ
రారుగ పోటీనిపడుచు రఫ్ఫాడునకో :)
ఆప్షన్స్ ఎక్సపయిరీ గురువారమునకు
శుభోదయము
జిలేబి
ReplyDeleteమాత! కరోనా! యేతా
వాతా నీవే జిలేబి వమ్మా దేశాల్
జోతలిడెను! దేవాలయ
మీ తరుణమ్మున వలయు సుమీ నిను కొలువన్
Any takers for writing Ashtottata sata naamaavali ? :)
జిలేబి
ReplyDeleteనేటి డౌ జోన్స్ సందియపు నాట్యము :)
ఊగుచుండె నదిగదిగో వూతునా య
టంచు డౌ జోన్సు! నిఫ్టీయె టక్కరివలె
నేడు నాట్యమాడి వెడల నేర్పు గాను
శుక్ర వారమదిగొ వచ్చు చుండె రమణి :)
జిలేబి
ReplyDeleteపాత కాపు కత :)
పాత కాపును నేనండి ! వా యటంచు
కవితలను చదువుచు నేడ్చు గట్టి పిండ
మున్ను నేనండి ! బుచికియు ముచ్చటగ సు
మా, జిలేబిని వాయించు మడిసియున్ను :)
మొగాంబొ ఖుష్ :)
జిలేబి
ReplyDeleteఅటు నిటుల తూగి యాటని నమ్మ బలికి
నాపె డౌజోన్సు! నేడిక నమ్మ బలుక
నిఫ్టి యన్నియు బాగని నిజము నిజమ
టంచు విశ్లేషకులు వత్తురమ్మ రమణి :)
జిలేబి
ReplyDeleteదీని పేరు కరోన యంట
దీని వాటము ప్రబలమంట
ప్రతిలేని వైరసంట దీనిని గంటిరే
ఆతతాయి యంట ప్రాణముల తీయునంట
ధృతిని బోడికొండ యంట దుష్టురాలంట
సతతమశాంతి చేర్చు విసపరి జిలేబియంట
అతిగ విస్తరించు అవ్వ యంట! గంటిరే
ఎక్కడో చదివినట్టుందే :)
జిలేబి
ReplyDeleteఆ కోరల్ నువు జాపు ఠీవి , జనులన్ హాంఫట్ యనన్ చంపు సూ
క్ష్మా కారమ్ము, జిలేబి జిత్తులు మహామాయావి చేష్టల్, వెసన్
లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటినే ఓ కరో
నా కైమోడ్పుల గొల్తు నక్కజముగా నన్జేర సర్వార్థముల్ !
ఎక్కడో చదివినట్టుందే :)
జిలేబి
ReplyDeleteజై శ్రీరామ్!
సుఖము గా వర్ధిలిరయ వసుధను జనులు
రాముఁ డేలఁగఁ, జచ్చిరి ప్రజలు వేలు
రావణుండేల గా లంక , రామ రావ
ణుల నడుమ చిరమరయిది నుతిని జేతు
రామ రామ యనుచు నవిరామ మయ్య!
జిలేబి
ReplyDeleteచామను కోరి విజ్ఞతయె చచ్చిన రావణు కారణమ్ముగా
వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ, రాముఁ డేలఁగన్
నీమము తోడు జీవితము నెక్కొన క్షేమము గా సుఖమ్ముగా
రాముని ప్రస్తుతించి భళిరా జనులెల్లరు నిల్చిరే భువిన్!
జిలేబి
ReplyDeleteOh My Nifty what a sterling dance performance today :)
ఎక్కితి వమ్మా నిఫ్టీ
అక్కజముగ నెక్కుచుండె నా డౌజోన్సున్
నిక్కముగ కరోనా తై
తక్కలు బాజారులోన తగ్గునకొ యికన్ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteరవ్వపడనివ్వదే! మా
యవ్వయె లేదాయె చేరె నవ్వల తృటిలో
చివ్వున చిలుకయె యెగురను
దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
నెవ్వలు దీర్చి యందరికి నెమ్మిని చూపుచు నాదరమ్ముతో
వెవ్వెఱలాడు వారి మది వెల్తిని దూరము పాఱనొత్తె! మా
యవ్వయె చేరగా ప్రభుని నాసమయమ్మున మాగృహమ్ములో
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్
జిలేబి
Deleteఇవ్వాళ ఆకాశవాణిలో చదివారంట !
జిలేబి
ReplyDeleteవెల్కం బెకబెక
హరిబాబొచ్చిరి సభలో
మరలా గలగలలు వచ్చు మస్తుగ సుమ్మీ
చిరుజీవియు వచ్చు వెనుక
పరుగుల చువ్వనగ తీయు పట్టాకత్తీ :)
జిలేబి
ReplyDeleteDow slides another 1000 :)
Nifty zoomed on Friday.
Black Monday 23rd Mar ?
ఓ నా డౌ జోన్సూ! మర
లానా! ఈవారము పదిలంబాయెను కా
దే నీ రికార్డు మరలా!
పూనగ డాకిని కరోన బ్రువ్వటబాబా!
జిలేబి
ReplyDeleteబాకీ తీర్చే సానో
యీ! కష్టేఫలి టపాను యిచ్చేసానో
యీ! కామింట్లేమైనా
మీకై మీరివ్వవలె సుమీ యన రండోయ్ :)
జిలేబి
ReplyDeleteజనతా కర్ఫ్యూ పాటిం
చిన మేలగును జనులార శీఘ్రముగ కరో
న నలతలు తొలగు దేశ
మ్మున! మోదిపలుకుల విని సుముఖతను గనుడీ !
జిలేబి
ReplyDeleteమన సాంప్రదాయమే మే
లు! నమస్కారమె మనకు పలువిధములన్ మే
లొనరించు విదురుల పలుకు
లను వినుడి జిలేబులార లబ్ధిని గానన్
జిలేబి
ReplyDeleteవడల సీజను :)
అలసంద వడలను తిరుప
తిలోన తిన్నాను వెల యదియె పది రూపా
యలె యిస్కాన్ గుడి లోనన్
భలే రు చికరమ్ముగా జబర్దస్తు సుమీ
జిలేబి
ReplyDeleteఅందరికిన్ మేలైనది
వందే మాతర మనుటయె, పాపమ్మగురా
జిందాబాదుజిహాదని
కొందలపరచి జనులను ప్రకోపించుటయే
జిలేబి
ReplyDeleteకుందాపూరు జిలేబి సత్యమిదియే కొవ్వెక్కిపోవేసుమా
సందేహించకు దేశసంపదను విస్తారమ్ముగాదోచుకో
జిందాబాదను ప్రక్కదేశమునకోయ్ జిమ్మన్దగున్ ద్వేషమున్
వందే భారత మాతరమ్మనుట పాపమ్మౌను నేరం బగున్!
జిలేబి
ReplyDeleteచిందించు ద్వేషమున్ బల్
సందేహమ్మేల దేశ సంపద నొడుచన్
జిందాబాదను ద్రోహికి
వందే మాతర మనుటయె పాపమ్మగురా
జిలేబి
ReplyDeleteసందేహించకు వేదభూమియిది విస్తారమ్ముగామేలురా
వందే భారత మాతరమ్మనుట, పాపమ్మౌను నేరం బగున్
జిందాబాదని ప్రక్క దేశములతో చేతుల్ వినాశమ్ములన్
చిందింపంగను కల్పి స్వార్థులగుచున్ జిమ్మంగ ద్వేషమ్ములే
జిలేబి
ReplyDeleteఈ బందులు యిబ్బందులు
కాబట్టి వలదనుకోకు కంద జిలేబీ
ఆబగ చూచె కరోనా
నీ బతుకిక దాని చేత నీల్గారు సుమా
జిలేబి
ReplyDeleteఉండే యోగాలు చాలక సరికొత్త దుషట యోగములకు నామధేయములిడిన మా బ్లాగ్జ్యోతిష్కులకు జై :) వారి టపా శ్యామలీయము వారినే కదిలించినట్టుంది :) వారున్ను రాసి " దు లిపేసారు" :)
సరికొత్త దుష్ట యోగము
ల రహస్యముల తెలిపిరి ఫలమ్ములను జిలే
బి రవల బ్లాగ్జ్యోతిష్కులు!
సరి! శ్యామలరాయరున్ను జత పడి చనిరే :)
జిలేబి
ReplyDeleteభారతదేశమన్న మన పల్లెలు వాడలె విన్న కోటరా
యా!రవళించినారు జనులందము గాతొలు దొల్తగా భళా
తీరుగ వంట చేసి వసతిన్ ససి తోడుగ; నేడు చూడగా
బారులు పూటకూళ్లె పరిపాటిగ మెక్కిరి కాదె బువ్వలన్
జిలేబి
ReplyDeleteకత్తి, బాకు, డాలు, విల్లు
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం
***
కీచకుని మాట గా
అందకత్తియ! యెగబాకు టంబరంపు
వీధి ననుచేరి, యావిర్భవిల్లు విరహ
మున మునక లేల? నీ మగండ్లు నిను వీడి
రాయె; రా! డాలుకొను నన్ను రావె రమణి!
***
నేటి భారతం
అరెవో సాంబా! కుపితుడ!
పెరిగెనురా పరిఢవిల్లు పెనుభూతముగా
మరిమయె చైనాకత్తియ
కరోన గురిగా దడాలు కరణమ్మెదియో?
జిలేబి
ReplyDeleteనీహారిక ప్రశ్నించెను
బాహాటమ్ముగ విదురుల పడతి జిలేబీ
స్వాహా యటంచు ఘృతమును
దోహదముగ వేయవే కుదురుగా నిపుడే
జిలేబి
ReplyDeleteప్రోత్ఫుల్లతని సుజను కెడ
సత్ఫలము లభించు, నీచ సాంగత్యమునన్
సత్ఫలముదక్కదయ ! ప
శ్యత్ఫాలుని నామధేయ సరి పూరణయో?
జిలేబి
ReplyDeleteకడకంటన్ గను కంది శంకరు కెడన్ కందమ్ముగా నేర్వగా
కడు లాభంబగుఁ గాదె, నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్
కడగండ్లేను సుమా జిలేబి! సుజనుల్ కాణాచి వారల్ !భళా
యడియాలమ్ము జనాళి మేలుకొరకై యావత్తువారే సదా!
జాల్రా
జిలేబి
ReplyDeleteపశ్యత్ఫాలుని నామధేయ సుజనా వాగ్దేవి పుత్రా నమో !
జిలేబి
ReplyDeleteThe Financial వైకుంఠపాళి :)
అరె మళ్ళీ డౌజోన్సర
రె రయ్యన నెగిరెను నింగి రేపేమగునో
తరుగుట పెరుగుట మాతా
కరోన నీదు దయయే ప్రకటముగ సుమ్మీ :)
జిలేబి
ఈ పెరగడం తిరగడం సునామీ కెరటాలు లాంటివి. వాతావరణం స్థిరపడేవరకు వేటకు వెళ్ళొద్దని అనుభవజ్ఞుల సలహా!
Delete
ReplyDeleteశార్వరి ఆగమనంతో ప్రపంచాన్ని వికారంగా మారుస్తున్న కరోన వీడుతుందని ఆశిస్తో
శుభాకాంక్షలతో
వికటాట్టహాసముల సూ
క్ష్మకృమియె నెదిరింప గా సుమా మనుజులనే
యకటా! ఏమని చెప్పుదు
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
***
సకల జనుల పోరామియు
నిక పోవుటకు పరమాత్మ నిమ్మళమును జే
ర్చ కరుణ జూపవలయు ఆ
నక "కోయీ రోడ్డు పైన నా నికలే" జీ!
జిలేబి
కరోనా కారణంగా తమ ఊళ్ళల్లోకి ఎవరూ రాకుండా ముళ్ల కంచెలవీ అడ్డుపెడుతున్నారట గ్రామస్థులు. ఈలెక్కన రాబోయే క్వార్టర్ లో పంక్చర్లు వేసేవాడి బిజినెస్ బావుంటుంది. అలాగే సైకిల్ స్కూటర్ టైర్లు తయారుచేసే కంపెనీల షేర్లు కొనొచ్చు!!
ReplyDelete
Deleteమీరు చెప్పినారే అని టీవీయెస్సు మొటారు కొంటే ఒకే రోజులో ఐదు శాతం లాసు పెరిగే అప్ ట్రెండ్లో :) ఏమి చేయమంటారు :)
జిలేబి
అమ్మేసి RITES కొనండి. రైల్వేలు అభివృద్ధి చెందితే ఇదీ పెరుగుతుంది.
Deleteఅసలు Indus ind bank కొనాల్సింది. ఇవాళ 47శాతం పెరిగిందిగా!
DeleteThis comment has been removed by the author.
Delete
ReplyDeleteవీడిన నాటి బ్లాగ్ ఉస్తాదులు ఉస్తాదిణీలు మళ్ళీ కరోనా దయచే కనబడుతున్నారు :)
ఓయి కరోనా నీదయ
చే యీ బ్లాగ్లోకమునకు చేరువయి భళా
మాయమ్మైన నెటిజనులు
రాయుటకున్ తిరిగి వచ్చి రమ్మ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమనుజు డారడుగుల పైని మంకుఘటము
మాలిని కనులు రెపరెప మసకలాడె
హత్తుకొనమటంచు ఫలితమాయె పెండ్లి
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర
జిలేబి
ReplyDeleteఆ మనుజుండు మంకు ఘటమాయెను ప్రేముడి హెచ్చుగానగా
కోమలి కన్బొమల్ ముడిచి కోరిక మీరగ సైగ చేయగా
కాముని వింటి బాణపు ప్రకంపన తాకగ పాణిబంధమున్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
జిలేబి
ReplyDeleteశార్వరీ నామ మాయెను చక్కబెట్టు
నవ్య వత్సరమిదె! కరోనా యనంగ
రాదె తల్లి! "కొరోనా"యె వ్రాయ వలెను
నేటి పాఠమ్ము లాయెను నిదుర పొమ్మ
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
If you can't go outside go inside !
అవకాశమ్మిది దేశముల్ జనులు సాహాయ్యమ్మునే నొందగా
తవరాజమ్మగు ధ్యానమార్గమున సంస్థానమ్ములో శుభ్రమై
న వతండమ్ముల రీతి స్వస్థతకు ప్రాణాపానులన్కొల్వగా
నవ వాసంత శుభాగమంబిది కరోనా నామ నూత్నాబ్దమౌ!
వతండ- వనతి ఏకచరో భవతి ఒంటరిగా
ప్రాణాపానులు - అశ్వినీకుమారులు
జిలేబి
ReplyDeleteమా బ్లాగ్జ్యోతిష్కుల మాటగా -
When you cant go out, go out anyway, because you cant go in.
And be thrashed by the police. Then you will go in (to your house).
లాటీ దెబ్బల మ్రోతలె
పో టెంకణమిడుట నేర్పు పోకిరి నరులా
రా! టక్కున ధ్యానంబ
ల్లాటప్పా వచ్చునా పిలపిల పడంగన్ !
జిలేబి
ReplyDeleteమేడిపండు చూడ మేలిమి గానుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పైన చూడ బాగు బాగనిపించెడు
పండు మంచిది, తినఁ బనికిరాదు!
జిలేబి
ఓ పావు మాత్రమే నాది :)
ReplyDeleteచుండము తోడు చేర సఖి స్తోత్రము మంత్రము చెప్పి స్వాములై
పండితులంచు చేరువయి పైటల మాటును చూరగాంచి నీ
గండల పైన నమ్మకపు కాండము పైన సవారి! మాలినీ
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్!
జిలేబి
ReplyDeleteఇదియేమి చిత్రమో సఖ!
సదనంబును చూడగ భళి సాహిత్యముప
ట్లదిటముగ తన్మయత్వపు
మదిరాపానరతులు గద మాచర్ల జనుల్!
జిలేబి
ReplyDeleteచైంచిక్ జాల్రా :)
సదనమ్మందు ప్రకాశ మైన ముఖముల్! సాహిత్యమీమాంసకుల్
కుదురైనట్టి వికాసవీచికలతో కూటమ్ము గా దోచెడిన్
పదునైనట్టి కరాళికా ప్రతిమలున్! ప్రావీణ్యులై సాహితీ
మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా!
జిలేబి
ReplyDeleteమదినిండుగ నవధానపు
మదిరాపానరతులు గద మాచర్ల జనుల్
కుదురుగ కూర్చొని వీక్షిం
చెదరందువకో నడుమ కచేరి ఢమాలో?
జిలేబి
ReplyDeleteపిచ్చెక్కె నింట కూర్చొని
వచ్చెడు వాట్సాపుల చదువంగ కరోనా
తచ్చాడె రాకమునుపే
గుచ్చుచు మదిలోన పద్మ! గునపము వలె పో
జిలేబి
ReplyDeleteపుట్టిన కొమరుల్లారా మీరట్లా బలము పడయటానికి కారణము, దైవసంభూతులవడానికి కారణము గట్రా గట్రా కారణము వర్జినిటీ యే !
ఇతిహాసమ్ముల చదువ ప
డతులను వక్రీకరించి డంబమ్ములతో
డు తరించెడు కట్టుకతలె!
పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్!
జిలేబి
ReplyDeleteVirginity thy name is Divinity
ఇతిహాసమ్ముల ధోరణుల్ ధరణిలో నెంతేనియో చిత్రముల్!
సుతులన్ గొప్పగ నిల్ప దేవతలతో శోభాయమానమ్ముగా
కతలన్ గట్టిరి చేతనైన విధముల్ కావ్యమ్ములన్ వ్రాసిరే
పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై
జిలేబి
ReplyDeleteసిగరెట్టు దొరక లేద
య్య గట్టిగ కరోన వేటయ సకలజనులన్
పగబట్టి చీల్చెనయ్యా
సగటుమనిషి బతుక లేక చతికిలబడెనే
జిలేబి
ReplyDeleteహమ్మయ్య!
తృషితముగ శివుడు త్రాగెను?
మిషనొక్క మెతుకును జూచి మేవడి తోడై?
ఋషులను కాచె రఘుపతియె?
విషమును; హరి మ్రింగె; మురియ వేల్పులు దితిజుల్!
మెతుకు కథ అక్షయ పాత్ర కథ
జిలేబి
ReplyDeleteమా శంకరునికి సాటి యెవరీలోకములో!
తృషితుని గా ఋతంబరుడు తృప్తిగ నెల్లరు చూడగానటన్
విషమును మ్రింగె, మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్
పషిణి కటంకటమ్మునకు వాసిని లక్ష్మి కరమ్ము గైకొనెన్
లషణము లక్షణమ్మును భళారె జిలేబియ తెల్పుగాదుటే!
జిలేబి
ReplyDeleteవీడు వాడెవడయ్యరొ విదుర రాడు
రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు?
మానసంబున తలచు సుమా మనుజుడు
మీదు రాముని కల్యాణ మిపుడె యనుచు!
జిలేబి
ReplyDeleteశ్యామల రాయడాతడయె జానకి తోడయె శోభగూర్చగా
నీమము తప్పకన్ జనుల నిండుగ చూడగ వచ్చువేళ నే
నేమని చెప్ప నమ్మ నరుడే సృజి యించె కరోన! మైథిలీ
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!
జిలేబి
ReplyDeleteఅర్చకులు బిలిచిరి రామ రాయటంచు
"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
పొండి " పోలీసులు తరిమి పొంక పడిరి
పో కరోన మహిమ నాట బోవ కపురు!
జిలేబి
ReplyDeleteఇంటి పట్టున పడియుండని మగ రాయ
ల కదె నేర్పెనయా గూరల తరుగుట జి
లేబులకు నేర్పె సహనము లెస్స గాను
పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు!
జిలేబి
ReplyDeleteఇల్లే కదా స్వర్గసీమ :)
ఏనాడైనను కాయగూరల ముఖమ్మే చూడ లేదాయె వా
డై నట్టింటను బుద్ధిగా తరిగె జోడై భార్యతో! ఓర్పునౌ
రా నాంచారులు నేర్చిరే పెనిమిటుల్ రాపాడ తోడై సదా
నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్!
జిలేబి
ReplyDeleteపోయె కైకూలి! మదురువు పోయె! తిండి
పోయె! జీతము కోతాయె! పోయె వితతి!
పోయె మార్కెట్టు వృద్ధియు పోయె నెట్లు
పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు?
జిలేబి
ReplyDeleteనానా రీతుల నాశనమ్ము జనులున్మాదుల్వలెన్ మారిరే
చీనాలో జనియించె కుందకము కొంచెమ్మైన లేదాయె నౌ
రా నైరాశ్యపు పల్కులేల నరుడా రాపాడెరా! యెట్లురా
నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్?
జిలేబి
ReplyDeleteవెలిగించుడి తొమ్మిది గం
టల కిక దివ్వెలను చూపుటకు బంధములన్
పలకండి ముక్త కంఠము
తొలగవలె త్వరితము కోవిదు కరోనాయే
జిలేబి
ReplyDeleteఅట రికార్డింగులున్ లేదయా కవవిర
కారణమ్మా కరోనాయె! కైపదముల
పలుకు రాదయ్యె నాకాశవాణి నోట
అరరె లేదు సమస్యల యానవాలు!
జిలేబి
ReplyDeleteకుయ్యోమొర్రొయటంచు వ్రాసితిమయా కొంతైన పూరించుచున్
భయ్యా వచ్చె కరోన కూడుకొనుచున్! పాటింప కర్ఫ్యూలనే
హయ్యారే! సరికొత్త పూరణలులేవాయెన్ సుమా శార్వరిన్!
అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్!
జిలేబి
ReplyDeleteవయ్యారమ్ముగ కైపదమ్ములకు భావస్ఫోరణంబైపదాల్
పయ్యాడంగను వెల్లువై విరిసెనా వాక్కాంత కారుణ్యమై
లయ్యాలన్ శనివారముల్ గడిచె కూలార్చెన్ కరోనాసురీ!
అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్
కరోనాసురీ - పదానికి credit goes to జెజెకె బాపూజి గారు.
జిలేబి
ReplyDeleteమేనుమరపించు సేలను
మానిని పెండ్లికి ధరించె, మాసిన చీరన్
జానువడుచుచు విడుచుచున్
చానలు చేయంగ మురిసి సందడి తోడై
జిలేబి
ReplyDeleteబాసను చేసె చిన్నపుడు "భారతి నెచ్చెలి! వత్తు తప్పకన్
క్రోసుల దూరమైనను నిరోధము దాటుచు నీదు యూఢికిన్"
కాసుల కూడబెట్టుకొని కానుక గైకొని దూరభారమై
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను, పెండ్లిఁ జూడఁగన్!
జిలేబి
ReplyDeleteబకరా లొత్తురు వేగము
గ కరములన్ మోడ్చి చదువగాను టపాలన్
పకపక నవ్వుల తేలి చ
మకు చమకనుచు చనెదరు సుమా తుష్టులుగా
జిలేబి
ReplyDeleteఅన్నిటికీ కరోనా యే మూల కారణము
చైనా కరోన కారణ
మై నాట దుకాణములు సమస్తము బందై
చేనేత పొడయు దొరకక
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్!
జిలేబి
ReplyDeleteAll programs deferred
తొలగని కరోన బాధల
కలఁగిరి యష్టావధానిఁ, గని జనులు సభన్
కలవర పడి వలదిపుడని
కలచిరి వేరెప్పుడైన కానింతుమనన్
జిలేబి
ReplyDeleteసహనమ్మన్నది కానరాదు త్రుటిలో సంఘమ్మునే తిట్టి బో
సి హసించున్ తన పద్యమాలికలతో చిర్రెత్తు ధాంధూంయటం
చు హఠారంబుగ నూగిపోవును వెసన్ సోన్మాదుడై దోచగా
నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
జిలేబి
ReplyDeleteతొలుదొల్తగునవధాన
మ్మిల భారతి దయ కమికిలి మెతుకుల కొరకై
యిలువాకిలి విడిచితినన
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్!
జిలేబి
ReplyDeleteఅద్దాలమేడ పైనో
గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో?
పెద్ద అరిందముడివకో
మొద్దువలెన్ దూషణలకొ ముతజిర్ తలపో?
జిలేబి
ReplyDeleteఅంభశ్చారపు పోకడై యిపుడు నీ వారిందవైనావు నీ
రంభారావిడి పొద్దుగూకుల ప్రచారాల్చేయ చానల్సులే
జంభాల్కొట్టుచు మోడి పై కొడిమెలన్ జవ్వాడుచున్చేయుటా?
స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే?
జిలేబి
ReplyDeleteచూడుము జిలేబులవలె కచోరి జాంగ్రి
లవలె బల్పసందుగ నుజ్జ్వలాంగి! పప్పు
బిల్లలవలె సమస్యలు ప్రీతి మీర
మూడు మూడు మూడును మూడు గూడె నిచట
డబల్ త్రీ డబల్ త్రీకి
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteచూడు! జిలేబు లివ్వి రుచి చూడుము భేషుగ పప్పు బిల్లలై
వేడిగ బల్పసందుగ రవీసు సమోస గులాబుజాములై
చేడియ! మానసమ్మును కచేరి వలెన్ ప్రకటించు నీటుగా
మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్
జిలేబి
ReplyDeleteప్రీతిని భళి మనువాడగ
నాతని చేయగ తపమ్ము నాతియు భళిరా
జోతల కిరాతికి పురా
రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా!
జిలేబి
ReplyDeleteరీతిగ మానసమ్మును పరీక్షయు చేయుచు నేండ్లకొద్దిగా
జోతల తో కఠోరముగ జోగిని యై దృఢమైన లక్ష్యమై
నాతియె చేయగా తపము నాతని పెన్నిధి గా భళా పురా
రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చగన్
జిలేబి
ReplyDeleteపిల్ల యొకటి చూడ ప్రియము మీరంగను
పిల్లికి జనియించె, నల్లకోఁతి
దారి బోవు చుండి దానిని చూచి గృ
హమున కేగి చెప్పె నందరికిని
కత కంచికి మనమింటికి :)
జిలేబి
ReplyDeleteఈస్టుమన్ కలరు చిత్రము వెండితెర పై నేడే చూడండి
అల్లెను రాజమౌళి సినిమా కథ యొక్కటి వాపితమ్ముగా
తొల్లి మహేంద్ర బాహుబలి తుమ్మగ దాని ప్రకంపనమ్ములన్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టె,రా
లల్లి ! జిలేబి ! పద్మ! కమలా!పువుబోడియ! చూచెదమ్ము రా!
జిలేబి
ఎల్ల బుధప్రకాండులకు నిల్లిదె పూరణకోసమస్య, మా
Deleteపిల్లికి నల్లకోఁతియునుబెబ్బులికిన్శునకంబుఁబుట్టె ,రా
జిల్ల కవిప్రకాండులు ! రచింపుడు మేథలు క్రింద మీద , గా
సిల్ల , పనేమి లేదుగద , చిత్తపు తీటలువోవ రేవగల్ .
Deleteమాదిరి కైపదముల నిం
పాదిగ పూరింప చేయు పట్టుగలదు ! సం
పాదన పూజ్యము ! రాజ
న్నా! దమ్మున్నట్టి శంకరార్యులు విదురుల్!
నారదా
చాన్నాళ్ళయ్యె తలచుకొని :)
జిలేబి
ReplyDeleteతాత గారి విన్నపాలు :)
ప్రతి వత్సరమిక యేప్రిలు
నె తరము గా లాకుడవును నెలగా గుర్తిం
చి తమ తమ నెలవుల మెతక
మెతకగ నివసించవలెను మేధాజీవుల్
జిలేబి
ప్రతి సంవత్సరం ఒక పది రోజులు లాక్ డౌన్ పెడతామని కేటీఆర్ ఈ రోజు ప్రకటించారు.
Deleteశుభం పలకరా బ్రాహ్మడా అంటే....
You are incorrigible, నీహారిక గారు.
Deleteసామెత చెప్పానండీ...
Deleteపున్నమొచ్చింది శుభం పలుకు గడీల దొరా అంటే అమాస వచ్చేదాంక జీతగాళ్లను చావిట్ల కట్టి పడేసి బడితె బట్కోని ఘడీకి నాలుగు పీకురా పీరిగా అన్నడంట!
Deleteకొత్త "సామెత" బాగుందాండీ?
కొత్త "సామెత" బాగుందాండీ?
Deleteఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance చేసినట్లుంది.
ReplyDeleteఅవధానిగ సరి కొత్తగ
నవతారము! శంకరార్యు నవ్యపు కైపుల్
కవనమ్ము వెల్లి విరియ, స
భ వర్ధిల శుభంకరముగ, ప్రణతుల చీర్సుల్ !
అప్రస్తుతానికి వచ్చేదా :)
అష్టావధానులందరు కలిసి గురువు గార్ని ఓ పట్టు పట్టండి . దుష్టాదిదుష్ట ప్రాస కైపదమివ్వవలె :)
జిలేబి
ReplyDeleteతేడా రాన్ మాకు కుదుర
దాడంబరముగ వివాహమవ్వాలె సుమా
వాడుక కట్నంబివ్వగ
గాడిదను, వివాహమాడెఁ గాంత ముదమునన్!
జిలేబి
ReplyDeleteహమ్మయ్య ! ఏమి యెండలో!
ఏడిద వారి పెండ్లియట! వేడుక వాడుక కట్నమీయగా
గాడిదనున్, వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడె, రా
చూడగ పోయి వత్తుమని సోదరి బిల్వగ బండి యెక్కియే
ర్పేడున నెండ తీండ్రము సురీల్మను వేళని చేరినామయా
జిలేబి
ReplyDeleteఅవధానములకు నెలవా
యె వాట్సపు సమూహములె మయికొలుపగ కరో
న విదురులకు నేస్తంబై
కవనమ్ములె వెల్లివిరియగాను జిలేబీ
జిలేబి
ReplyDeleteఈ తతి యేమో తెలియదు :) ఔనౌనని ఒప్పేసుకుంటే నన్ను కూడా సెహబాషని మెచ్చేసుకుంటారు :) కాబట్టి జాల్రా యే సరి :)
అవునా? సరియేనాండీ?
అవునవును సరిసరి యే సుమా వినుడయ్యా
కవిరాట్టులనన్ సరియే
కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్!
జిలేబి
ReplyDeleteఅవునవు నోయ్ జిలేబి సరియన్న కవీశ్వరు లెల్ల మెత్తురే
కవులకు జాల్ర వేయుమిక కాదన కోయ్ సరి జోదు నిల్వగా
నవసర మైన తెక్నికు సనాతన మైనది స్తోత్ర పాఠముల్
కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్
జిలేబి
కవులు రసైక లాలసులు , కావ్యకలాప మనోఙ్ఞవర్తనుల్ ,
Deleteకవులు సమాజ చేతనకు గట్టి పునాదులు , కాని , యెందుకో ?
చవి యొక యింత లేని , యొక చట్రమునందున జిక్కిరే ! కనన్ ,
కవి తతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్?
Deleteకైపదముల కిక్కు జిలే
బీ పక్వరసమునకన్న వెగ్గలము! భళా
రే పండితుల విడువని సు
రాపానమ్ము చవి చూడ రఫ్తారఫ్తా :)
నారదా బారో!
జిలేబి
సంస్కారం గురించి ల...బూతులు వ్రాసిన గీ పండితుడే సెప్పాల, "ధూ మీ బతుకులు చెడ" అని తిడితే సమ్మగుంటాది అని సెప్పినారు గందా, దిష్టి తీసిన నిమ్మకాయలేరుకుని లెమన్ టీ చేసుకు తాగే మిడతం బొట్లు!
Delete
ReplyDeleteశనికుజ గురుయోగమ్ముల
పని! భూకంప మదిగదిగొ వచ్చెను చూడం
డి! నిజమని నమ్ము డీ! న్యూ
సుని చూచి ముడెట్టినాను సోదిని గనుడీ :)
జిలేబి
శ్రీకృష్ణుని భార్యలలో
ReplyDeleteరాకాశశి 'నీల' యొకతె , ప్రకటించిన యీ
నూకాలు 'నీళ' యెవరో
తేకువ గల బుధుల కైన తెలియునొ లేదో ?
Deleteనెట్టన యల్ల లచ్చి యల నీళభూసతి యుండ నీవు నీ, నెట్టికసీలపై మనసు నిల్పుట కేమనవచ్చు." ఆము. ౬, ఆ.
నీలా సుందరీ పరిణయం
Deleteకూచిమంచి తిమ్మకవి
ReplyDeleteఅరరే సామాన్యుండా
ఖరహతితో ధన్యుఁడయ్యెఁ, గాలుఁ డలరుచున్
చెరకు విలుకాని కాల్చెను
పరాచకము పనికి రాదు పరమాత్మునితో!
ఖర హతి - కామ దేవుని పోటు
జిలేబి
ReplyDeleteనరునికి రక్తి పెక్కువయె నాతుక చేరగ లేసు మూలమై
ఖరహతిఁ గాంచె ధన్యతను, గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్
విరివిలుకాని కాల్చె మది వీడగ ధ్యానము! నిత్యముక్తుడా
హరుని కెడన్ పరాచకములాడుట తొయ్యలి శోభ నీయదే!
జిలేబి
ReplyDeleteఅంతా సినీ మాయ :)
విష్ణువు రామారావే?
కోష్ణపు చూపుల నటియకొ? కూచి జిలేబీ,
కృష్ణ, నటుడు, సావిత్రిని?
కృష్ణుఁడు; సావిత్రిఁ ; గూడి కిలకిల నవ్వెన్!
జిలేబి
ReplyDeleteమాలాదీపక సన్నివేశములతో మాయాబజార్ చిత్రమం
దాలావాటి ఘటోత్కచుండు తనివిన్ దానారగింపంగనే
పోళీలా యరిసెల్ జిలేబుల భళీ పువ్వాటు కల్యాణరా
కేళీమగ్నత నుండి, నవ్వెనఁట యా కృష్ణుండు, సావిత్రితోన్!
జిలేబి
ReplyDeleteమైలవరపు వారి పూరణ
నీళాభూకమలాలయాప్రథితతన్వీకామితానంతరిం...
ఛోళీనిత్యసమాగమోత్సుకమతిస్తుత్యుండు విష్ణుండు భ..
క్తాళిన్ దుస్థితి గాంచుచున్ కనులు మూయన్., వింత స్వప్నమ్మునన్
కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
***
నీళాభూకమలాలయాప్రథితతన్వీకామితానంతరింఛోళీనిత్యసమాగమోత్సుకమతిస్తుత్యుండు !
వామ్మో !
ఇట్లాంటివి పోచిరాజు వారి బ్రాండు ట్రేడుమార్కున్ను! మైలవరపు వారు కూడా ఈ త్రోవ పట్టేసారేంటి యివ్వాళ :)
జిలేబి
***
నీళా- విష్ణుభార్యలలో నొకతె
భూ - భూదేవి ?
కమలాలయా లక్ష్మి
ప్రథిత - వారలతో ప్రసిద్ధిగ
తన్వి - తనివోవు
కామితానంత - ఎనలేని కామిత
రింఛోళి -
సమూహముతో
నిత్య సమాగమ ఉత్సుక మతి స్తుత్యుడగు విష్ణువు
ఇన్ సింపిల్ - విష్ణువు కలగాంచె :)
హమ్మయ్య!
జిలేబి
ReplyDeleteబంతి వలె తిరిగె డా పూ
బంతిని గాంచిన విధాత పరితోషముతో
కొంత గతిమార్పు చేయగ
నింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్
జిలేబి
ReplyDeleteసకలము దేవదేవుని ప్రసాదము! కర్మఫలమ్ము తోడుగా
ను కలిసి వచ్చి జీవులకు నూతన మైన శరీరమందు జీ
వకణము లెల్ల వర్ధిలును వాంఛలె వాటము జూపు చూడనా
సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై!
జిలేబి
ReplyDeleteమొట్టమొదటి పోలీసమ్మణ్ణి :)
కాంతయె పోలీసాయెను
వింతగ చూచిరి మనుజులు విరిబోణినటన్
సుంతయు గుసగుసలాడిరి
యింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్
జిలేబి
ReplyDeleteమాహేంద్రజాలము
వింతగ జపించె హాంఫట్!
దంతముల కదలిక రమణి తనువును మార్చెన్
కాంతులు విరజిమ్మగనా
యింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్
జిలేబి
ReplyDeleteణిసిధాత్వర్థములిక లే
వు! సరసములు లేవు లేవు పూబోడీ ప
ద్మ! సవాలు విసిరెను కరో
న! సివంగులమనుకొనగ పనంటిని త్రోసెన్
ReplyDeleteవలదంటివి నాడేమో
బలుపని నేడో కరోన వలన వలదు పో
కులుకులని త్రోయుచున్ వల
పుల కెసరెట్టితివి చిగురు బోడీ పద్మా!
నారదీయము
జిలేబి
ReplyDeleteక్రియెటివ్ గా పద్మార్పిత
సయాటల కరోన వేళ సాగించుకొన
మ్మ యిదే మంచిముహూర్తము
కయాటలకు పోకుమా ప్రగల్బమ్ములతో :)
జిలేబి
ReplyDeleteబ్రాండంబాసిరనగ మీ
రండీ పద్మార్పితా ఖరారుగ యిట్లా
ఖండితముగ వ్రాయుటలో
నండి జిలేబి ప్రణతులివి యందుకొనండీ :)
జిలేబి
ReplyDeleteపెద్ద చిక్కు వచ్చి పెనుభూతముగ మీద
పడిన విధము గాను పద్మ వ్రాసి
నారె! మీకిది తగునా జిలేబి ? వలపు
కూడ వలదనుటయకో శుభాంగి :)
జిలేబి
ReplyDeleteరండి చూడండి వెండితెర పయిన సిని
మా జిలేబి హీరోయిను మాంఛి థ్రిల్ల
రు కథ! సస్పెన్సు తుదిదాక రూఢి గాను
తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ!
నడిరేయి హత్య సినిమా టైటిలు :)
జిలేబి
ReplyDeleteమిడ్ నైట్ మర్డరర్స్ చిత్రము నేడే చూడండి :)
మునుగడ చూచి యుండరు ప్రమోదిత నాయిక గాను థ్రిల్లరి
ద్ది! నవల "అర్ధరాత్రి మణిదీపము" స్కంభనమైన చిత్రమి
ద్ది!నడక తీరు చూడవలె దిమ్మడచంగ జనాళి చూతురే
"తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"
జిలేబి
ReplyDeleteబరువెక్కిన హృదయమ్ము త
నరుచు తడిసిన పదముల నినాదములు జిలే
బి, రివాజు కాని కవిత ! నె
నరులమ్మా పద్మ నా మనసు దోచితివే!
జిలేబి
ReplyDeleteవంకర టింకర నరులకు,
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
తంకవపు స్థాయి మెరమెర
కుంకటి కనులకగుపడుటకు సుమా సుదతీ
జిలేబి
బొంకేమి కాదు , నిక్కమె ,
Deleteశంకరునకు తోకగలదు , చర్చింపంగన్
శంక వల , దనేక ఘటన
లుంకించిగ , తెలియబట్టె , లోగడ , బుధులూ !
Deleteసాక్షాత్తు ఆదిభిక్షువుతోనే సంబంధం వున్న రాజావారన్న మాట మీరు ధన్యులు సుమీ
జిలేబి
ReplyDeleteదూరము మగడా దూరము
క్వారంటైను సమయమ్ము కార్యమునకు నో
నో! రతి నిర్వేదము మే
లౌర జిలేబులకు నేను లావిక కానోయ్
జిలేబి
ReplyDeleteపైన యేది కలదో క్రింద అదియే కలదు
అరరే రావణు కుంకలార వినుడీ యాద్యంతమున్ తోక యే
పరిశీలింపగ మిన్ను నీరు చిరియై ప్రాకట్యమైకన్బడెన్
నరులందాత్మగ హృత్తుగా వలయమై నాట్యంబుచేసెన్ గనన్
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్!
జిలేబి
> పైన యేది కలదో క్రింద అదియే కలదు.
Deleteఐతే సంధులు సరిగా చేయండి "పైన నేది కలదో క్రింద నదియే కలదు" అని. లేదా పూర్తిగా విసంధిగా వ్రాయండి. ఆఁయ్!. (పైనన్, క్రిందన్ అని ద్రుతయుక్తరూపాలు గుర్తుచేసుకోండి మరి)
ReplyDeleteచర్రున చేయందుకొనన్
కుర్రతనపు జ్ఞాపకాలు కూతలిడెనిదే
గుర్రనకుమా జిలేబీ
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
జిలేబి
ReplyDeleteచనుమా యిప్పుడె యేటివార దళముల్ సాధించి తెమ్మా జిలే
బి! నసాళమ్మున కెక్కి కిక్కు తనరన్ పీయూషమై నెక్కొనన్!
మునిమాణిక్యపు ధర్మపత్ని ! లలనా ముద్దార రమ్మా దరిన్
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
జిలేబి
ReplyDeleteచర్రున బ్రాకె జనాళిని
బర్రున నింట పడవేసె పడతి జిలేబీ
వర్రీ కరోన వేళని
మఱ్ఱాకున విడెముఁదినఁగ మనసాయె సఖీ!
జిలేబి
ReplyDeleteఅర్రులు చాచిరి సుమ్మీ
చిర్రావూరి విదురులు, బుచికియు, జిలేబీ
జుర్రుకొనంగరసములా
మఱ్ఱాకున విడె ముఁదినఁగ మనసాయె సఖీ!
జిలేబి
ReplyDeleteబాల్ బేక్ ఇన్ ది కోర్ట్ :)
ఈ ముక్క చెప్పడానికి
మీ మనసెట్లొప్పెనో సుమీ కవి వరులా
రా! మానవులారా శ్రీ
రామునికి వనంబులుండ రాజ్యంబేలా!
జిలేబి
ReplyDeleteకైకేయి మాట గా
నామది కోరె రాజ! పదు నాలుగు వత్సరముల్ వనమ్ములం
దా ముని వాటికల్ తిరిగి ధామము చేరమటంచు నాజ్ఞని
మ్మా! మన రాజ్యలక్ష్మిని కుమారుడు నాభరతుండు చేగొనన్
రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్!
జిలేబి
రాముని సీత వేర్పరచరాదు వచోవిధినైన , సీత శ్రీ
Deleteరాముని ప్రాణ , మామె విన , రామకథాగతి లేదు , మూర్ఖుడా !
'రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్!'
ఏమిది ? బుధ్ధి మాంద్యమయెనేమి ? హరీ హరి ! పాపమౌ వినన్ .
ReplyDeleteవేసవి సెలవుల ననుభవ
మీ సమయమ్ము కలిగెను సుమీ మనకు కరో
నా సాయముగా అన్న
న్నా సాగిలబడెదమిక మనము రండన్నా!
నేనన్లే :)
జిలేబి
ReplyDeleteఅవలీలగ లేపుచు నా
నవనీ ధరమును చిటికెన నందకుమారుం
డవధారముగ నిలుప కే
శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్!
జిలేబి
ReplyDeleteఅవసరమా నమన్యమని యాదవుడాతడె ప్రశ్న లేవదీ
సి వలదనంగ, వర్షమును చిత్రముగా కురిపింప జేయ కా
చి వరలి కొండనెత్తి పయిచేయిని చూపుచు ఢీకొనంగ,కే
శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్!
జిలేబి