Friday, March 5, 2010

శ్రీ కృష్ణ విలాపం

స్వామీ శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా యమునా తీరే - తన పద హారు వేల మంది గోపికలతో కొలువై ఉండగా ఎవెర్ హ్యాపీ బ్లిస్స్ ఆనందా స్వామిజి గారు - ఉండేలు దెబ్బకి పరారి ఐ వచ్చిన కుందేలు వలె కృష్ణా జీ ముందు ధబీల్మని ప్రత్యక్షమై -

హేక్ కృష్ణ- ఇదేమి నన్నిలా జనాలు వెంట పడి తరిమేలా చేస్తివి? నేనేమి పాపం చేసినాను- నువ్వేమో ముగ్గురు భామల తో చాలక పదహారు వేల మంది గోపికలతో ఉంటె - ఆ హా కృష్ణ విలాసం - అంతా విష్ణు మాయ అని జనాలు పోగిడేరు?
మరి నేను ఒక్కగానొక్క రాగ రంజిత హృదయేశ్వరి తో నా లోకం లో ఉంటె వాడెవడో నీవు శకుని కుటిలత్వాన్ని మాయ బజార్ లో అదేదో దర్పి ణి లో చూపెట్టినట్టు - నన్ను నీ కర్మభూమి లో నీ కర్మ నీదే అన్న రీతిలో నడి రోడ్డులో నిలిపేడు? ఇది ఏమైనా న్యాయమా స్వామీ ? అంటే

క్రిష్ణులవారు తన యోగ నిద్రని కాసేపు పక్కకి పెట్టీ - కళ్ళు మూసుకుని అవలోకించి - భక్తా - ఈ మధ్య నన్ను నీవు మరీ మరీ తలచుకుంటూ ఉంటివి - దేశం లో ఎడా పెడా భగవద్గీతల సభలలో నా గురించి మరీ పొగిడి తివి - ఆ హా నా భక్తుడు ఇంతగా నన్ను పొగిడే గదా అని నేను నిన్ను ఓ క్షణం తలిస్తిని. మరో మారు తలిచేలోపు మా సత్య - స్వామీ భక్తులని మరీ ఎక్కువైగా తలవకండి ప్రాబ్లెం - అని చెప్పడం తో భక్తులని తలిస్తే ఏమి ప్రాబ్లెం అని ఓ క్షణం ఆలోచనలో పడితిని.

ఇంతకీ ఇదన్న మాట సంగతి - మరీ రసగ్నుడవే అని సరే అయినదేమో అయినది ఇక కావాల్సిన కార్య మేదో చూడు అని సలహా ఇచ్చేరు పరమాత్ముల వారు- అంతా విష్ణు మాయే - నా చేతి లో ఏముంది అని కృష్ణు ల వారు ఆ యోగ మాయని ఓ క్షణం తలిచేరు.

ఈ కృష్ణుడు కూడా నన్ను కాల రాసాడే అని ఎవెర్ హ్యాపీ స్వామిజి గారు ఇంకా ఏమి చెయ్యడం - అని స్వామీ వారి మీంచి తన దృష్టిని యమునా పైకి - ఆ పై పదహారు వేల గోపికల పై కి చూపులని సారించేడు. గోపికలలో రాగ రంజితాలు ఆతనికి గోచరించినై.
ఆ హా అర్థమైంది - యోగ మాయ ఉద్దేశం ఇదన్న మాట అని భాష్యం చెప్పుకుని - గోపికలు - మీకు వ్రిందావనం గురించి చెబ్తాను ఇలా రండి అన్నాడు.

అదిగో అప్పుడే మొదలైంది - శ్రీ కృష్ణులవారి "విలాపం" ! ఆ కాలం లో శంకరుడే భోలా శంకరుడని అనుకుంటిని - ఈ కలి యుగం లో నన్నే ఈ మానవుడు - భోల్తా కొట్టిన్చాడే - అని -

వారి విలాపాన్ని విని - కల్కి భాగావాను ల వారు- "వరదా" - నేను నీకు కలి గీత నేర్పిస్తాను ఇలా రా నాయనా అని ' వరదా- భగవంతునికి భక్తునికి అనుసంధాన మైనది అంబికా అగరొత్తులు మాత్రమె కాదు - అంబిక "గరం" ఒత్తులు కూడా అనడంతో-

- కృష్ణుల వారు మూర్చ పోయి "హా సత్యా" - అంటే - హుష్ కాకి- సత్యమే లేచి పోయింది. !

చీర్స్
జిలేబి.

డాకినీ శాకిని బ్లాగిని - హాం ఫట్

ఈ మధ్య నేను మరీ బ్లాగులు ఎక్కువ రాసేస్తున్నని - ఇంటి పని వంట పని గమనించడం లేదని అసలు వీటికన్నిటికి కారణం ఎ భూతమో పిశాచామో జిలేబి ని పట్టి పీడించడమే కారణమని మా ఇంట్లో వారు తీర్మానించేసుకుని ఓ బ్లాగ్వాదిని పిలిపించి మంత్రం వేయించేరు - ఆ బ్లాగ్మంత్రవాది ఇలా మంత్రోచ్చార ణతో మొదలెట్టగానే -
హాం ఫట్
హ్రీం ఫట్
హాం హ్రీం క్రీం
డాకిని
శాకిని
బ్లాగిని
పో పో వదిలిపెట్టు పారిపో -
జిలేబి ని వదిలి పెట్టి పో -
హాం హ్రీం క్రీం - డాకిని బ్లాగిని శాకిని హాం ఫట్ - హ్రీం ఫట్- క్రీం ఫట్
అనటం తరువాయి నేను మూర్చ పోయాను.
మా వాళ్లకి భయమేసి - ఆ బ్లాగ్మంత్ర వాడిని పంపించేసి ఆ పై నన్ను మూర్చ నించి లేపడం తరువాయి వెంటనే నేను ఈ టపాలు వ్రాసే తీరుతానని శపథం పట్టటం తో - ఇదేమి పొయ్యే గాలం రా భగవంతుడా- డోలు పోయి ధమరుకం వచ్చే అని మా వారు తలపట్టుకుని కూర్చూంటే - ఈ టపాలు ముగించెయ్యడం జరిగింది. అయిన కుక్క తోలు వంచడం ఎవరి తరం? - నలుగురు నవ్వి తే నేమి - మా బ్లాగ్ పిచ్చి మాదే - ఎవరి పిచ్చి వారికి ఆనందం కాదా మరి? మా వారు మాత్రం ఆ ఈనాడో లేకుంటే హిందూ నో తలక్రిందుల చదవగా లేనిది మేము బ్లాగ్ వ్రాస్తే వచ్చిందా తంటా- జిందాబాద్ బ్లాగినీ సమాజం -

చీర్స్
జిలేబి.

Thursday, March 4, 2010

శరత్ 'కాలమ్'

రవేగం స్వప్న రాగలీన స ' దృశ్యం '
సజ్ఞ రాగిణి - తస్మా
త్ ప్రియా సమాగమం - బ్లాగ్ 'విహారే'
కానవచ్చు ఆ నె
వంక అంద
మ్
శరత్ 'గాలం'
శరత్ 'కాలమ్'

చీర్స్
జిలేబి.

Wednesday, March 3, 2010

ఉడిపి హోటలు - ఉడాలు టపాలు

ఈ టపాలు రాయడానికి చాలా ఆలోచించి రాద్దామా వద్దా అన్న సందేహం లో పడి సరే రాద్దాం అన్న ఆలోచనతో రాస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుత చిత్తూరు పరిస్తితి ని చిత్రీ కరించదు. ఈ ఉడిపి హోటలు ఓ ముప్పై ఏళ్ళ క్రితం బ్రాహ్మణ వీధిలో ఓ ఇరవై ఏళ్ళ క్రితం జండా మాను వీధిలో ఆ పై బజారు వీధిలో ఉండేది. ఆ పై ఈ హోటలు మూత పడిందో లేదో నాకు తెలీదు. కాని ఈ ఉడిపి హోటల్లు సాంబారు - అదీ తెల్లవారి ఆ హోటల్ కెళ్ళి రెండు ఇడ్లీ ఒక బకెట్ సాంబార్ తో లాగిస్తే దాని మజా వేరు ! ఆ కాలం లో ఆంద్ర పత్రిక ఎర్రయ్య గారి అంగిట్లో - వారి అంగడి దినపత్రికలు- వార పత్రికలూ అలకరించిన ఓ "పత్రికా వనం" అన్నాతక్కువే- అరువుకి చదివి - ఈ హోటల్లో రెండు ఇడ్లీ ఓ బకెట్ సాంబార్ లాగించిన రోజులు - "సాంబార్" జ్ఞాపికలు! అప్పట్లో ముదిగొండ శివ ప్రసాద్ గారి చారిత్రాత్మక సీరియల్లు ఓ త్రిల్ చదవడం. పేపర్ లో సీరియల్ - డైలీ సీరియల్ ఓ రోజు చదవక పొతే అదోలా అయిపోయేది. ఇప్పుడూ తెలుగు పత్రికలూ ఆన్ లైన్ లో చదువు తాము అనుకోండి - అయినా తెల తెల వారి - ఆ పేపర్ వాసనతో - ఆంద్ర పత్రికా కాకుంటే ఆంద్ర ప్రభ చదవడం లాంటి జ్ఞాపకాలు- వాటి తో పాటు - పిచ్చా పాటి- ఇట్లాంటివి - ఈ కాలం లో కొద్ది తక్కు వే అనిపిస్తాయి. తెల తెలవారి హారం - కూడలి లో ముఖం పెట్టేసి బర్రుమని మౌస్ ని సాగాదీయ్యడం వేరే టెక్నిక్ !

ఆంద్ర పత్రికా ఇప్పట్లో లేదు. వాళ్ళ వారపత్రిక కూడా లేదు. కాని జ్ఞాపకాలు మాత్రం ఇంకా ప్రస్ఫుటం గా ఉన్నాయ్. ఈ విషయం గురించి ఆలోచిస్తే - జ్ఞాపకాలు అన్నవి మన మెదడులో ఓ లాంటి "చిప్" లా నిబడీ కృతమై కావాల్సినప్పుడు ఫ్లాష్ లా వచ్చేలా రావడం అన్నది మనిషి జీవితం లో ముఖ్య విషయం లా అనిపిస్తుంది. ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, March 2, 2010

అదిగో పులి- అల్లదిగో పులి వేచి చూస్తోంది

హైతి చిలి నడిరాత్రి ఉలికి పాటు
గోళం చలి మయం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

యూరోపు దేశాల ఊగిసలాట
అమెరికా ఆర్ధిక మాంద్యం
ఆసియా అటో ఇటో తేలని పరిస్తితి
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

ప్రపంచ దేశాల సంక్షోభం
భూమాత గగ్గోలం
త్సునామీల గందర గోళం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

జిలేబి

Saturday, February 27, 2010

అయస్కాంతం -

ఐశ్వర్యం తో వయసు
కనకం తో కాంతం
వెరసి అయస్కాంతం

మమత జుక్ జుక్ రైలు బండి
ప్రణబ్ ఫైనాన్స్
వెరసి 'బంగ్లా' ఖాతం!

సర్దార్జీ - ముఖర్జీ-బెనర్జీ
వెరసి "సోనార్" భారత్
మేరా భారత్ నేటి భాగోతం !

చీర్స్
జిలేబి.

Tuesday, February 16, 2010

జల పుష్పం

నిప్పు వేడి
గాలి వేగం

సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు

మేఘ గర్జన
ఋతువుల రాగం

అన్నీ నేనే అన్నది జల పుష్పం

ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !

(మంత్ర పుష్పం ఆధారం )

జిలేబి

Thursday, February 11, 2010

సౌగంధికా పరిణయం

ఈ మధ్య భీమాంజనేయ యుద్ధం చిత్రం చూడటం జరిగింది. ఈ చిత్రం లో కథ స్థూలం గా నలకూబరుని సౌదామిని పరిణయం - దాని పర్యవసానం గా భీమాన్జేయుల మద్ద్య యుద్ధం జరగటం లాంటి సంఘటనలతో కథ నడుస్తుంది. సౌగంధిక పుష్పం - కుబేరుని శివార్చన మొదలైన సన్నివేశాలతో సౌగంధిక పుష్పం తీసుకు రావలసిన సౌదామిని నల కుబేరుని ప్రేమలో పడి శివార్చానకి ఆలస్యం గా రావడం అందులోను పూజ అప్పుడు కుబేరుడు ఒక సౌగంధిక పుష్పం తగ్గడం గమనించడం, ఆ పుష్పం సౌదామిని శిరుస్సులో ఉండడం, సౌదామిని ని శపించడం, సౌదామిని భూలోకం లో రావడం లాంటి విచిత్ర సన్నివేశాలతో కథ రమ్యం గా జరుగుతుంది.
ఈ చిత్రం చూస్తున్నప్పుడు వచ్చిన సందేహం ఏమిటంటే - సౌగంధికా పరిణయం అన్న మరో కథ ఉందా? లేక ఈ సౌదామిని నలకుబెరుల కథనే సౌగంధికా పరిణయం అంటారా?
మీ కెవరికైనా తెలిసిన చెప్పగలరు

జిలేబి.

Wednesday, February 3, 2010

ఆలోచనా స్రవంతి

మనసులోని మర్మమెల్ల తెలిసిన వారెవరైనా ఉంటారంటారా? ఎట్లాంటి టైటిల్ బ్లాగ్ లో రాయాలో ఆలోచన లేకుండా మనసులోనించి వచ్చే ఆలోచనలకి అక్షరం రూపం ఇవ్వగలడం సాధ్యమా? అంటే వచ్చే ఆలోచనలని ఏవిధమైనటువంటి నిబంధనలకి కట్టుబాట్లకి తావివ్వకుండా అక్షర రూపం చెయ్యడం అన్నటువంటి సాధనా ప్రక్రియ ఉందంటారా
ఆలోచించి చూస్తే ప్రతి మనిషి అక్షర రూపమివ్వడానికి మునుపు తన ఆలోచనలకి ఓ సామాజిక పరమైన లేకుంటే సిద్దాంతిక పరమైన కట్టుబాట్లని పెట్టుకుంటా డేమో? ఎందుకంటే ఆలోచనలని యదా తధంగా ప్రచురిస్తే అది ఒక ద్రౌపది లాంటి రచన ఐతే దాన్ని విశ్లేషించడానికి లేక విమర్శించ డానికి ఎల్లప్పుడూ జనం ముందు ఉండ వచ్చు. కాకుంటే అది ఒక రామాయణ విష వృక్షం అవ్వచ్చు.

ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, February 2, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

బ్లాగ్ భాన్ధవులకి
నూతన సంవత్సర శుభాకాంక్షలతో

మీ
జిలేబి.