Monday, October 17, 2016

మకుటా రామ ! - వయాంగ్ కులిత్ - The Legacy of Rama's Crown - భాగం - 1

 
 
మకుటా రామ ! -
 
The Legacy of Rama's Crown
 
వయాంగ్ కులిత్

ఉపోద్ఘాతం -

మన దేశం లోని తోలు బొమ్మలాట లాంటిది ఇండోనేషియా లోని వయాంగ్ కులిత్ (Wayang Kulit).

ఈ వయాంగ్ కులిత్ జావా సంస్కృతి కి సంబంధించినది. జావా, బాలీ ద్వీప సమూహం లో ఇప్పటికి బతికి న సంస్కృతికి ప్రతీక. United Nations declared this as an World Heritage to be preserved.

జావా ద్వీప జనబాహుళ్యం లో ఉన్న నమ్మిక  ప్రకారం జావా లో సంతతి పరీక్షిత్ వారసులు గా చెప్పుకోవడం కద్దు.

వీరి పురాతన భారత యుద్ధ - భారత కథ సుమారు పది/పదకొండో శతాబ్దం లో వ్రాయ బడింది. ఇది పురాతన జావా భాష లో వ్రాయ బడింది. ఈ శైలి ని కాకవిన్ అంటారు (ట!). (Ka Kawin or Ke Kawin).

ఈ వయాంగ్ కులిత్ లో ముఖ్యం గా భారత దేశపు భారత రామాయణం లో నించి వచ్చే పాత్రల తో తోలు బొమ్మలాట ఉంటుంది.

మధ్య మధ్య లో సులుకున్ (శ్లోకం ? ) అంటూ సంస్కృత, పురాతన జావా పద జాలం కలిసిన వి కనబడతాయి. (ఇవి ఛందో బద్దం గా ఉండటం విశేషం ) 

ఒక రాత్రి మొత్తం (సుమారు ఆరు గంటల పాటు ) సాగుతుందట ఈ తోలు బొమ్మ లాట.

అట్లాంటి ప్రదర్శన లో ఒకటి మకుటా రామ !.

రాముని కిరీటం  అన్న కథా వస్తువు ఆధారం గా మహా భారత కాలపు నాయకుల ను పెట్టుకుని నీతి , సంస్కృతి , మంచీ చెడ్డా చెప్పు కునే టట్లు ఉంటుంది.

ఈ ఆట లో ముఖ్య పాత్రలు

అర్జునుడు - ఇతనికున్న యితర పేరు మన భారత దేశం లో లేనిది(నాకు తెలిసినంత వరకు)   -  జనకుడు . . జ్లామ్ప్రోంగ్ ; మార్గన; పెర్మది (పెర్మది, జ్లామ్ప్రోంగ్ జావా పేర్ల లా ఉన్నాయి).

సాదేవ (సహదేవుడు); నకుల;

శకుని - సంగ్కుని అన్న పేరు తో ఉన్నాడు !

ధర్మ రాజు - పుంత దేవ అన్న పేరుతో కనబడ తాడు.

దుర్యోధనుడు - మరో పేరు - జగపితాన ; (జగత్పిత ?)

దుర్సాసన (దుశ్శాసనుడు) ; కార్తమరామ ; చిత్రాక్ష ; చిత్రాక్షి; దుర్మగతి   (కౌరవ సంతానం ) - చిత్రాక్ష, చిత్రాక్షి కవలలు (మగ వారు).

బాణోవతి -   దుర్యోధనుని భార్య భానుమతి  వీరి ప్రకారం బాణోవతి !

లెక్ష్మణవతి - లక్ష్మణ - దుర్యోధనుని కూతురు;

దుర్ణ (ద్రోణ)- ఇతర పేరులు - ద్విజ వర ; కుంభాయన ;

భీష్మ- గంగా దత్త  ;

అశ్వత్థామ ;

కర్ణుడు - యితని యితర పేర్లు - సూర్యపుత్ర; సూర్యాత్మజ ; బసు కర్ణ;

అర్జుని భార్య సుభద్ర కు వీరి ప్రకారం పేరు సెంబద్ర ; మరో పేరు లారా ఇరెంగ్ ! ; సింతవక - సెంబద్ర మగ వేషం లో మారినప్పుడు పేరు; (ఎందుకు మారింది ? కథా విషయం లో కి వెళితే తెలుస్తుంది :))

నారద  - (నారదుల వారు లేకుంటే కథ ఎట్లా మరి !)

భీమసేనుడు; ఇతని యితర పేరులు - భ్రాతసేన ; ఆర్యసేన;

మహంబీర ! - గరుడుడు ( గరుడ లేకుంటే మరి ఇండోనేషియా ఎట్లా ! ) ;


క్రేస్న - కృష్ణ - హరిమూర్తి ;

ఈ తోలు బొమ్మ లాట లో రామాయణ కాలానికి చెందిన వాళ్ళూ కనడతారు -

విభీషణుడు- మరో పేరు గుణవాన్ ;

విభీషణుడి కొడుకు - భీషవర్ణ ;

కుంభకర్ణుడు ; అతని భార్య కిశ్వణి ! (కుంభకర్ణుడి భార్య పేరు మొదటి సారి వినడం!) ;

అనోమోన్ - హనుమాన్ - మన హనుమంతుల వారు .

వాయు సంతానం గా, హనుమాన్ వారితో బాటు జాజల్వ్రేక (అసురుడు) ; కువర - పాము; సితుబంద - ఏనుగు;


కేశవసిద్ధి - తపస్వి - రామ మకుటాన్ని భారత కాలం లో వారికి అంద జేయ డానికి వేచి ఉన్న  తపస్వి.

లింబుక , చంగిక - వీళ్ళు కామెడి ట్రాక్ - లంబూ జంబూ లాగా అన్న మాట ! (మాయా బజార్ గుర్తొస్తుందా? )

సరే కథాక్రమం బెట్టిదన !

(సశేషం!)

Thursday, October 13, 2016

కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)


 
 
 
కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
అరచూపు! వాలుచూపు బె
దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
బి రుసరుస చూపు తా కను
లెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
చీర్స్
జిలేబి
 






Saturday, October 8, 2016

సరస్వతీ నమస్తుభ్యం !

 
సరస్వతీ నమస్తుభ్యం !
 
 

చిత్రం - శ్రీ కేశవ్ - ది హిందూ దినపత్రిక కార్టూనిస్ట్
 
 
పలుకుల తల్లి ! మినుకుగొ
మ్మ!లచ్చి కోడలు ! జిలేబి మాటలబోటీ !
నిలచితి వమ్మ ! జనులమన
ముల మేలగు రీతిగాను ముంగటి రమణీ !
 
జిలేబి


Friday, October 7, 2016

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !


విజయ దశమి శుభాకాంక్షలతో


చిత్రం - శ్రీ కేశవ్ - హిందూ దినపత్రిక కార్టూనిస్ట్

జిలేబి

Wednesday, October 5, 2016

వై నాటీజ్ మై క్వొశ్చెన్ !

 
 
వైనాటీజ్ మై క్వొశ్చెన్ !


పుల్లెల శ్యామ్ గారి మణిప్రవాళ కందం
ఆంధ్రామృతం బ్లాగు లో చదివాక !


శ్యామ్ గారి కందం :-

ఐ నో సమాఫ్ద పీపుల్
మే నాటెంజాయ్ ద తెలుగు మీటరినింగ్లీష్
వై నాటీజ్ మై క్వొశ్చెన్
హౌ నై సీజ్ దట్ రిథం యిననదర్ లాంగ్వేజ్ !


జిలేబి సరదా జవాబు :)


వైనా టీజ్ దై క్వొశ్చెన్ !
ఐనో బట్యిఫయిటెల్యు ఐవిల్ బీస్మాష్డ్ :) 
ఫైనర్ దస్కిల్ గోస్ సర్ 
ఫైనర్ వి బికం ద తెలుగు ఫైర్బ్రాండ్ దట్జ్ వై :)

చీర్స్
జిలేబి
(వెరీ నాటీ :)

Saturday, October 1, 2016

ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !


ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !
 

ఫోటో : కర్టసీ : ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్
 
సర్జిక లాప్రేషన్లన్
గర్జించెను, భరతదేశ ఘనతయు గూడన్
తర్జని జూపగ నార్మీ,
ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !
 
 
 
చీర్స్
జిలేబి  

Wednesday, September 28, 2016

పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !


పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
 
తరచూ హరి తానొక్కటి
ని రమించుచు కోరుచు కమనీయంబుగన
న్నరసియు సొలసియు వేరొక
పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
చీర్స్
జిలేబి

Tuesday, September 27, 2016

శరముల సారింతునోయి సమరసము గనన్ !


గీతోపదేశం !

 
Painting - Courtesy- Shri Keshav of The Hindu Fame
 
ముందు:
 
హరివిల్లువలె మనమ్ము స
మరసము గానవలెనుగద !  మైత్రీం భజరే !
గరళంబు కత్తికట్టుట!
శరముల సారింపగ హృది సరియన లేదే !
 
తరువాయి :
 
హరి! విల్లువలె మనమ్ము ను
సరి జేసెదనోయి మేలు  సఖుడా ! కృష్ణా !
గరళం బైనన్ త్రాగెద ! 
శరముల సారింతునోయి సమరసము గనన్
 
 
 
శుభోదయం
జిలేబి

Sunday, September 11, 2016

సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !


సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
రుజుమాటల నాడుచు చ
ట్టు జబ్బలను బట్టి వెనుక టుప్పని బేల్చున్
:)
నిజమును పలుకగ తగదూ !
సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
శుభోదయం
జిలేబి

Monday, September 5, 2016

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !





న్యూస్ కర్టసీ  :_ ఈనాడు న్యూస్  "మింటిన" వారు  - సిరిలేనివాసు :)

ముంబయి: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల పదార్థాలు ఉపయోగించి వినూత్నంగా బొజ్జ గణపయ్యలను తయారు చేస్తారు. మట్టి, బియ్యం, చాక్‌పీస్‌, ఛాక్లెట్‌లు ఇలా రకరకాల వాటితో చేసినవి చూస్తూనే ఉంటాం. కాని ముంబయికి చెందిన కొందరు కళాకారులు జిలేబీల గణపయ్యను తయారు చేశారు. పసుపు రంగులో ఉన్న ఈ జిలేబీల గణనాథుడు సందర్శకులను తెగ ఆకట్టుకుంటుంది. సోమవారం వినాయకచవితి సందర్భంగా ముంబయిలోని ఓ వీధిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.


బ్లాగ్ వీక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !

వార్తా ప్రదాత శ్రీ సిరిలేని వాసుల వారికి నెనర్లు !


గణపతి జిలేబి బప్పా !
ననుదినము కొలుతుము మంచి నడతయు గనగన్
వినుమా విన్నప మిదియే !
జనులందరిని గనవయ్య చక్కగ నీవే !



శుభోదయం
జిలేబి