Sunday, June 14, 2020

శ్యామలీయ కందోత్పలములు


శ్యామలీయ కందోత్పలములు

వికసిత మానసమున నెల
తుక! తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలే
బి కుశాగ్రబుద్ధి తో నే
య కందపద్యము గురువుల యాశయు తీరన్!


అలవోకగ సాగ పద
మ్ములు సత్పుర వాసి! వ్రాయుము పసందుగ శ్యా
మల రాయు కోరిరే నీ
కలవాటైనట్టి విద్దె కందమ్మె కదా!



చినుకులవలె కురియుచు సో
మున నుత్పల మాల పాదము వినూత్నపు రీ
తిని కంద మందు తా నొల
క నిబిడమై సొబగులీన కలమున్ గొనుమా


కలకల లాడవలెన్ మిల
మిల నుత్పతితంబు గా నిమిడి నున్ననగా
నిల కాంతులీనగావలె
జిలేబి! యర్పించుకొనవె చీర్సుల తోడై!

***



తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలేబి కుశాగ్రబుద్ధితో
సత్పుర వాసి, వ్రాయుము పసందుగ శ్యామల రాయు కోరిరే
నుత్పల మాల పాదము వినూత్నపు రీతిని కంద మందు తా
నుత్పతితంబు గా నిమిడి నున్ననగా నిల కాంతులీనగా



ఫ్యాక్టరీ పద్యాలు :)


జిలేబి


Wednesday, June 10, 2020

మాలిక రౌడీ వారికి విజ్ఞప్తి



విన్న పాలు వినవలెను.

అయ్యా/ అమ్మా లక్కు పేట రౌడీ/ కల్నలు ఏక లింగము గార్లకు

నా బ్లాగు కా మింట్ లు, మరియు శంకరాభరణము బ్లాగు కామింట్లు మళ్ళీ మాలిక లో కనబడు నట్లు మ్యాజిక్ చేయగలరు.


విన్నపాలను విన వలెను.


ఇట్లు
భవదీయ
జిలేబి

Thursday, June 4, 2020

నల్ల చంద్రుడు



నల్ల చంద్రుడు


నల్ల చంద్రుడు
తెల్ల మబ్బుల 
మాటున.

తెల్ల వారె 
రాత్రి మాటున.



జిలేబి



Monday, June 1, 2020

ఏది నీది ?

ఏది నీది ?

నువ్వు పీల్చే గాలి నీది కాదు
నువ్వు నీ దనుకున్న శరీరం ‌నీది కాదు

గట్రా గట్రా వేదాంతం కాదోయ్

నీ సంపాదన నీది . దాని ననుభవించే హక్కు నీది.

ఇహలోకపు సంపాదన యిక్కడి వరకు. ఆ పై పూజ్యం. ఎరిగి మసలుకో జీవితం‌ సుఖమయం


ఆది భౌతిక మైన సంపాదన కంటికి కనిపించనిది.  అది కూడా వస్తుందను కోవచ్చు. కానీ ప్రూఫ్ లేదు వస్తుందో రాదో !
ఓ విధంగా బెట్టింగ్ అనుకో కాయ్ రాజా కాయ్!



వేదాంతం
అనబడు గుండుసున్న
జిలేబి

Thursday, May 21, 2020

రిలయన్స్ షేర్ 1200 వందలకు కొనుక్కోవడం ఎలా ?



రిలయన్స్ షేర్ 1200 వందలకు కొనుక్కోవడం ఎలా ? 

ఈ మధ్య రిలయన్స్ షేరు మార్కెట్టు లో టాక్ ఆఫ్ ది టవున్ అయిపొయింది. మా తాత గారు కూడా అబ్బో నాకు ఆ రైట్స్ షేరు కావాల్సిందే నేనా షేరు ౧౨౫౦ రూపాయలు పెట్టి కొనే కొంటాను అని మంకు పట్టినారు. 

ఈ మంకు చూసి ముచ్చటేసి తాతగారు ౧౨౫౦ రూపాయల కెందుకు కొన్ని రోజులు ఆగండి ౯౯౯ రూపాయలకే మార్కెట్టు లోకి వచ్చును ! అప్పుడు జీ భర్ కొనేసు కోవచ్చంటే సుతరామూ కుదర దంటారు. నాకిప్పుడే కావాలె అంటూ మంకు ! 

వాడేమో జూన్ నెలలో ఇవ్వ బోతాడు. కాబట్టి జూన్ నెలలో రిలయన్స్ షేరు ఎట్లా ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవడం ? అన్న దాని మీద ఈ టపా అన్న మాట. !

ముఖ్య గమనిక- మీరు నిజంగానే ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవాలె అనుకుంటే నే ఈ మార్గాన్ని ఎంచుకోండి :)  

Advices are subject to market risk and all risk on your own. Zilebi has no liability what soever 

అనెడు పూర్వ నో పూచీ కత్తు టపా ఇది. 

ఏమి చెయ్యాలె ? 

డబ్బులు సరాసరి ఓ రెండు లకారాలు మీ బ్రోకింగ్ అకౌంట్ లో పెట్టేసు కోండి. మిగిలిన నాలుగు లకారాలు మీ బ్యాంకు అకౌంటు లో వుండే టట్టు చూసుకోండి. ఉల్టా పుల్టా అయి మీరు నిజం గానే ౧౨౦౦ కొనవలసి వస్తే కొనుక్కోవడానికి . 


ఆ తరువాయి  

మార్కెట్టు స్లయిడింగ్ దినాన  రిలయన్స్ షేరు జూన్ ౧౨౦౦ పుట్ ఆప్షన్ కనీసం  ఓ యాభై రూపాయలైనా  పలికే రోజు ౧౨౦౦ జూన్ పుట్ ఆప్షన్ ఓ కాంట్రాక్టు ( ఒక కాంట్రాక్టు ౫౦౫ షేర్లు ) అమ్మండి. ఇలా అమ్మడం ద్వారా ప్రీమియం మీకు ౫౦౫ * ౫౦ రూపాయలు వస్తుంది అంటే ౨౫,౨౫౦ రూపాయలు. 

ఇప్పుడు జూన్ నెలాఖరు ఆప్షన్ ఎక్పైరి కి వైట్ చేయండి. ౧౨౦౦ వందలకు వస్తే  అప్పటికి మీకా యావ స్టాకు కొనుక్కోవాలే అని ఇంకా ఉంటే ఆప్షన్ డబ్బులు పోను మిగతా డబ్బులు పెట్టి కొనుక్కోండి. 

లేదూ రాలేదూ అంటే ఆ ఇరవై ఐదు వేలు దక్కిందే లాభం అనుకోవడమో దానితో ఆ నాటికి ఎన్ని షేర్లు ముఫత్ లో వస్తే కొనుక్కోవడమో చేసుకోండి :) 


ఇట్లు 

జిలేబి 

జాం బజారు జగ్గు నా సైదా పేట్టై కొక్కు :) 

Friday, May 15, 2020

కొంత హాయిగా నవ్వుకుందామా


ఎంజాయ్ !




చీర్స్
జిలేబి

Saturday, March 14, 2020

God on the Hill ( ఏడు కొండల సామి)


God on the Hill


You are just about as much as one imagines you to be.
As they say, the more dough, the more bread.

From God on the Hill
by Velchuri Narayana Rao
Annamayya keertana - Entha Mathramuna Evvaru Talachina...




జిలేబి

Friday, March 13, 2020

Oh My Nifty! Oh My Sensex!


Oh My Nifty!
Oh My Sensex!


Dow Tanks nearly 10%!
What next ?
Welcome Friday the 13th!
Oh my Nifty! Oh my Sensex :)

ఓ నిఫ్టీ! సెన్సెక్సూ!
మీ నాట్యము చూడగాను మేవడి తోడై
లేనా దేనా బ్రోక
ర్లీ నాడదె వేచినారు లేవండర్రా :)



Friday the 13th :)
శుభోదయం
జిలేబి

Saturday, February 29, 2020

జిలేబి వివరములు


పేరు - జిలేబి

తదితర వివరములు


ఇట్లు
జిలేబి

Thursday, February 20, 2020

నక్షత్రాల కిటికి





నక్షత్రాల కిటికి

ఆకాశం 
నక్షత్రాల కిటికీ 
వెనుకనుండి
జిలేబి తో కనులు 
కలుపుదామని చూస్తోంది

జిలేబి ముసుగు తన్నుకొని
జోగుతోంది.



శుభోదయం
జిలేబి