అంకోలం నిజబీజసంతతి , మరి అవకేడో తత్వం గురించి ఏమంటారు ?
మా బ్లాగ్ గురువులు జిలేబీ శతక కర్త శ్రీ శ్యామలీయం వారు శంకర భగవత్పాదుల వారి శ్లోకం ఒకటి ఉదహరించారు.
అదీ ఎక్కడ ఉదహరించారంటారు మరి? శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగు లో .
వారు చెప్పినది ఇక్కడ మళ్ళీ పొందు పరుస్తున్నాను. (కాపీ యే అనుకోండీ, అయినా మంచివి అన్నీ మనం రాయాలంటే మరి కుదరదు, కాబట్టి అప్పుడప్పుడు 'కాఫీ' ఆయ నమః !)
కోట్:
శ్రీశంకరభగవత్పాదులవారి శివానందలహరిలో యీ అంకోలం ప్రసక్తి వచ్చే శ్లోకం ఒకటి ఉంది.
అంకోలం నిజబీజసంతతి రయస్కాతోపలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధుహ్ సరిద్వల్లభం
ప్రప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యచ్చతే.
తాత్పర్యం: అంకోలం అంటే ఊడుగ చెట్టు. దాని విత్తనాలు ఆ చెట్టును వదలి పోవట, సూది అయస్మాంతాన్ని అంటుకు పోతుంది వదలదు. పతివ్రత భర్తను అంటిపెట్టుకునే ఉంటుంది. లత చెట్టును వదలి ఉండదు. నదులు సముద్రం కోసమే పరుగులు పెడతాయి. అలాగే మనసు కూడా నీ పాదాలను చేరి ఉండటమే భక్తి అని చెప్పబడుతుంది.
అసలీ శ్లోకం భక్తికి మంచి నిర్వచనం.
అన్ కోట్ !
ఆ మధ్య అవకేడో (దీనికి తెలుగు వాచకం నాకు తెలియదు. ఎవరైనా చెప్ప గలరు) గురించి చదివా. అవకేడో బీజాలు దాని దరిదాపుల్లో నో కాకుంటే ఆ అవకేడో ఫలం ఉన్న గదిలో ఉంచితే నే చాలట, ఆ అవకేడో తన మృదుత్వాన్ని, తన
తాజా దనాన్ని పోగొట్టు కోకుండా ఉంటుం దట. .
వాటి బీజాలు అవి ఫలాన్ని చేరి ఉండక పోయినా ఆ ఫల తాజా దనాన్ని నింపి ఉంచు తాయట.
ఈ నేపధ్యం లో , అంకోల బీజాలు ఒక విధమైన పరిణితి గలిగి ఉంటే, ఈ అవకేడో బీజాలు మరో విధమైన పరిణితి గలిగి ఉన్నాయి.
సృష్టి లో విచిత్రమైన ది మనకు అంతగా కంటికి అగుపించక పోయే ఇట్లాంటి మరిన్ని వింతలు ఉన్నాయో మరి !
శుభోదయం అందరికీ !
అంకోలా అవొకేడో అం అః !
అహంత్వా సర్వ భూతేషు ....
చీర్స్
జిలేబి.
Hello Zilebi Garu,
ReplyDeletehttp://youtu.be/kZDPo1WowDo
Just a day before yesterday
ఈ ఫలం గూర్చి తెలుసుకున్నాను.
ఈ video clip ద్వారా
మీరు చూడండి అందరకి పరిచయం చేసారు కదా!
?!
జిలబిగారు బ్లాగ్లోకంలో ఎక్కడ వున్నా టపా లన్నీ తాజాగా వున్నట్లుగానాండీ?
ReplyDeleteమనకి తెలియనివెన్నో ప్రకృతిలో....
ReplyDeleteనమస్కారమండీ జిలేబి గారూ తెలుగులో అవకాడో ను వెన్నపండు అంటారటండీ.
ReplyDelete