పృషోదరాదీని యథోపదిష్టమ్ !
(पृषोदराऽदीनि यथोपदिष्टम् )
మొన్న ఓ శార్దూలం సమస్యా పూరణ మై వస్తే ,
ఊతంబెవ్వడు అంటూ జోష్ తో మొదలెట్టేసి యతి స్థానం లో
చిక్కుకుని కుస్తీ పడి గూఢోత్ముడు అన్న పదాన్ని ఆంధ్ర భారతి లో 'డిస్కవర్' చేసేసి వేసేసు కున్నా :)
మామూలుగా గూఢ + ఆత్మ - గూఢాత్మ విని ఉన్నాము గాని గూఢోత్ముడు అన్నది చాలా తక్కువ.
ఏదో బాగుందే అనుకుని కిట్టించేసి ( యతి కోసం తంటా లు :)) వేసేస్తే కంది వారు సందేహం లేవ దేసేరు - గూఢోత్ముడు ఏమిటి అని :)
మనకేమి తెలుసు ! ఏదో ఆంధ్ర భారతి ఉవాచ కాబట్టి సరియే అయి వుండా లనుకుని అట్లే వదిలేసా .
ఈ పద్యాన్ని అట్లే మన బ్లాగు లో వేసేసు కుంటే అదే ప్రశ్న ని శ్రీ మాన్ లక్కాకుల వారు కూడా అదే ప్రశ్న లేవ దీయటం తో
అరె యిదేదో మరీ చిక్కు సమస్యే కామోసు అనుకుని గూగులిస్తే
(पृषोदराऽदीनि यथोपदिष्टम् )
పృషోదరాదీని యథోపదిష్టమ్ !
పాణిని - అష్టాధ్యాయి - సూత్రము - 6-3-109 అంటూ కొంత 'జిలేబి' మయము గా ఒకటి కనబడింది.
యేమి దీని అర్థము అనుకుని మళ్ళీ ఆంధ్ర భారతి ని అడుగ గా
పృషోదరుడు - అనగా వాయుదేవుడు ( బాన కడుపు గలవాడు కామోసు :) అన్న దీన్ను, ఉపదిష్ట అంటే తెలుపబడినది అన్న అర్థమూ కనబడినది :) అంటే పృషోదర గట్రా లాంటి పదాలు పండితులు వాడేరు కాబట్టి వాటిని సరియే అని తీసు కోవాలని పాణిని ఉవాచ :)
(జిలేబి ఏ పదం రాస్తే అదే సరి కామోసు : జేకే - సూక్షి పదం లా :)
మొత్తం మీద దీని అర్థం ఏమిటంటే 'సో కాల్డ్ పండితులు వ్యాకరణ సూత్రానికి కట్టు బడని కొన్ని ప్రయోగాలు 'వారు చేసేరు' కాబట్టి అట్లాంటివి సరియే అని అనుకోవాలి అని అర్థమని భాష్య కారులు తెలిపేరు
ఈ గూఢోత్ముడు అన్న పదం బై ది వే కఠోపనిషత్ లో వస్తుంది
एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते ।दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥१२॥
(కఠోపనిషత్ 1-3-12)
హమ్మయ్య జిలేబి నీవు కూడా పండితుల జాబితా లోకి ఎక్కి పోయేవనుకున్నా :)
పృషోదరాదీని యథోపదిష్టమ్ !
చీర్స్
జిలేబి
పిశాచి
(పిశాచి కూడా జగణమే అది కూడా ఈ కోవలోకి వస్తుందట : ఓపిక వుంటే ఈ యూట్యూబు వాచ్ చేయుడీ !)
ఊతంబెవ్వడు? ప్రత్యగాత్మగను గూఢోత్ముండుగా నంతరా
త్మై తావన్నది లేక కందువగ క్షేత్రంబై నిరాకారుడై
వాతాహారవిరోధి నెక్కి యజుడై, బ్రహ్మై, జిలేబీయమై
సీతా! వల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్!
జిలేబి
సమర్ధించుకునే తెలివి ఉన్నవాడు నుంచుని ఉచ్చ పోసినా అనాచారం కాదని "అప్పాలాచార్య సన్నిధౌ అనాచార భయం నాస్తి" అనే సూత్రంలో ఎప్పుడో చెప్పేశారు:-)
ReplyDeleteఒకసారి హేతువాది ముసుగు కప్పుకుంటే జన్యుపరమైన వారసత్వం వల్ల కొందరికి బ్రహ్మాండమైన తెలివితేటలు వస్తాయనే రేసిస్టు ధియరీల్ని కూడా మోసెయ్యొచ్చునని దేవరాజు మహారాజు గారు నిరూపిస్తున్నారు కదా"-(
అంతా నారదీయమే!
హకా
ReplyDeleteA. L. -आत्मन् (the compound word being गूढोत्मन् thus accounted for in Sk.; भवेद् वर्णागमाद् हंसः सिंहो वर्णविपर्ययात् । गूढोत्मा वर्णविकृतेर्वर्णलोपात्पृषोदरः) the Supreme soul
http://avg-sanskrit.org/sutras/6-3-109.html
జిలేబి
ReplyDelete" లలితమ్మాయ్" గారి "త్వామనురజామి" కూడా దీని లెక్కలో జమవేసేసు కోవచ్చు :)
జిలేబి
చూడగ నీ గూఢోత్ముడు
ReplyDeleteగూఢముగా దాగి సూక్ష్మగోచరుడగుటన్
మూఢుల కెట్లగుపడు కడు
బాడబులకు గాక బుధుడ ! బ్రహ్మం బగుటన్ .
ReplyDeleteయోచన చేయండయ్యా
పాచన యేల యుపవాస ప్రహసన లేలా ?
చూచేడు శివుడు నన్నే
యాచకు లార శివ రాత్రి యని జంబములా ?
జిలేబి
తప్పని సరి వ్యాఖ్య. మన్నించాలి.
ReplyDeleteజిలేబి గారు,
ఏష సర్వేషు భూతేషు
గూఢో౽౽త్మా న ప్రకాశతే
దృశ్యతే త్వగ్ర్యయా బుధ్ధ్యా
సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః
ఇక్కడ గూఢోః + ఆత్మా --> గూఢో౽౽త్మా.
సర్వేషు భూతేషు ఏష ఆత్మా గూఢోః, న ప్రకాశతే. అన్ని భూతములయందు ఆత్మ గూఢముగా నున్నాడు. ఇంద్రియములకు ప్రకాశము కాడు (వాటిచే ఏవిధముగానూ తెలియబడడు).
అంతే కాని గూఢోత్ముడు అనే పదం ఎక్కాడా లేదు. ఆంద్రభారతి నిఘంటువులో గూఢోత్ముడు అని ఉండి ఉంటే అది అచ్చుతప్పు కావచ్చును.
హరిబాబు గారు,
అప్పాలాచార్య సన్నిధౌ అనాచార భయం నాస్తి" అనే సూత్రం అన్నది పొరపాటు. చాటువు ఇది:
అపశబ్దభయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ।
అనాచార భయం నాస్తి తిష్ఠన్మూత్రస్య సన్నిధౌ॥
(ఈ వ్యాఖ్యను బట్టి నేను మరలా వ్యాఖ్యలు వ్రాయటానికి సుముఖంగా ఉన్నానని కాదని మనవి. ఉపనిషద్వవహారం వచ్చింది కాబట్టి పొరపాటు సరిచేయటానికి వ్రాయక తప్పలేదు.)
ReplyDeleteతస్సా దియ్య జిలేబీ
బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్,
బుస్సని నాటో నెక్కియు
డస్సులు కొట్టుచు జపాను డర్రున చేరన్ :)
జిలేబి
ReplyDeleteతస్సాదియ్య! జిలేబీ
గుస్సా మత్ హోన; అమ్మకూచీ వినవే
విస్సన్న చెప్పె సరి సరి
బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్!
జిలేబి
ReplyDeleteఅస్సాము రాష్ట్రమున నరె
బస్సే సాధనము గద; దుబాయినిఁ జేరన్
డస్సితి తిన్సుకియా లో
నుస్సురనుచు నేరు బస్సును నధిష్టింపన్!
జిలేబి
‘‘తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్లకే ఎక్కువ తెలియదు’’
ReplyDeleteఅంటున్నారు ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారు. వీరు గత దాదాపు 50 ఏళ్ళుగా అమెరికాలో పలు యూనివర్శిటీలలో తెలుగు భాష ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు ప్రముఖులలో ఒకరు.
వీరిని ఇంటర్వ్యూ చేసినవారు పరుచూరి శ్రీనివాస్ గారు.
మొదటి విడత ఇవాళ్టి (11-మార్చ్-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) దినపత్రికలో నాలుగవ పేజ్ లో "వివిధ" అనే కాలమ్ లో వచ్చింది. ఆసక్తి గలవారు ఈ క్రింది లింక్ లో చదువుకోవచ్చు.
‘‘తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్లకే ఎక్కువ తెలియదు’’ https://www.andhrajyothy.com/artical?SID=735363
Deleteఅమెరికా వాసులు చెబితేనే అందము చందము:)
జిలేబి
అంతేగా, అంతేగా 🙂.
Deleteఈ విషయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన స్పందన (వీరు కూడా అమెరికా నివాసే) "జానుతెనుగు సొగసులు" బ్లాగ్ లోని రెండు పోస్ట్ లు చూడవచ్చు.
"వలస ఆధునికత మన సాంస్కృతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది" అంటున్న వెల్చేరు నారాయణరావు గారు. వారితో పరుచూరి శ్రీనివాస్ గారు జరిపిన ఇంటర్వ్యూ రెండవ విడత / తతిమ్మా భాగం ఈరోజు (సోమవారం 18-03-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) దినపత్రికలో "వివిధ" విభాగంలో వచ్చింది (పేజ్-4). ఆసక్తి కల వారు ఈ క్రింది లింక్ లో చదవచ్చు 👇.
Deleteమొదటి విడత ఈ నెల 11 న వచ్చింది - పైన అదే తేదీనాటి నా వ్యాఖ్యలో దాని లింక్ ఇచ్చాను ("తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్ళకే ఎక్కువ తెలియదు").
"వలస ఆధునికత మన సాంస్కృతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది" https://www.andhrajyothy.com/artical?SID=741509
ReplyDeleteవిరియు శారదప్రాభవ విభవమచట!
తేనెలూరుతెన్గు పలుకు తేటగీతి
గానచట జిలేబులగును! గాన నెటుల
నాగఫణి శర్మ సుకవి యనం దగండు?
జిలేబి
ReplyDeleteడొంక తిరుగుళ్ళవేలా?
బొంకుచు పల్కెడు జిలేబి బొమ్మాళీ యే
వంకర టింకర మాటల
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్?
జిలేబి
ReplyDeleteముండా కొడుకులతో నా
రెండింటికిని చెడినట్టి రేవడి యగునా
దుండగులతోడు చర్చలు
దండగ దుర్గేశ్వరా! పదండి పదండీ :)
నారదా!
జిలేబి
ReplyDeleteఎవరితో అనుబంధం రాసుకోవాలె :)
అదియు నిదియు నన్ని యనుచుకాకన్ మాన
ధనముఁ గోరువాఁడె ధన్యజీవి
భువిని పురుషు లందు పుణ్యపురుషులు వే
రౌ జిలేబి తెలిసి రాసు కొనవె
జిలేబి
ReplyDeleteమార్పు సహజమయ్యా! ఈ
కూర్పులు చేసెడు జిలేబి కుహనా కిచిడీ
చేర్పుల పండితులందురు
నేర్పుగ భాషతమవలన నిలచెననుచు సూ :)
జిలేబి
ReplyDeleteగ్రామీణ ప్రజల నాలుక
పై మించారునయ భాష ! పండితు లేమ
న్నా మా మాటయి దే! ఈ
సామాన్యులవల్లనే పసందై నిలచెన్ !
జిలేబి
ReplyDeleteఓయమ! మన భాష బడు
ద్దాయి చదువరులగు పండితమ్మన్యుల మో
చేయి యనుచిత ప్రవర్తన
చే యీ కాలమున తాను చిక్కుల బడెనే !
జిలేబి
ReplyDeleteమన భాషాస్రోతస్విని
తను మూలము గాంచె ప్రజల తరళపు నాల్కన్
తనరారె జిలేబియగుచు
జనాళి గ్రామ్యంపు సొంపు చక్కదనాలన్ !
జిలేబి
ReplyDeleteఈ అమ్మాయి యలారా
ఆ అమ్మాయో యిలార! అంటూ తిరిగే
ఆ అబ్బాయిలకంకిత
మీ అమ్మణి యరటిపండ్లు మింగుడుపడగాన్ :)
జిలేబి
ReplyDeleteఅరె! శకారుని కిలని ధీటైన దెవరు
బొంకఁగా? హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు
సత్యమొక్కటినే శీల సంపదవలె
గాచె? పలుకవే చిలుక చకచక యనుచు !
జిలేబి
ReplyDeleteమాలిక లో బగ్గండీ
జాలము లో కనబడు భళి సరిజేయగ సు
మ్మీ లా వైమరి యొకమా
రీలా నండి కనుగొంటి రేతిరి సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఆకులు రాలెడు కాలము
లో కన్నులు ముక్కు చెవియు లోపము గానన్
మాకంద మెక్కడయిక ! చి
కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!
హాచ్ హాచ్ ఒక్కటే తుమ్ములు :)
జిలేబి
ReplyDeleteఓ కవిరాట్! రాజన్నా!
షోకుగ వృత్తమును గట్టి షూషూ యనిరే :)
ఆ కాకులెత్తు కెళ్లా!
ఈ కంద జిలేబిపైన నింత యరులకో!
జిలేబి
యరులకో......meaning ?
Delete
Deleteఅభిమానము
ReplyDeleteదత్త పది - హలో హాయ్! గుడ్ బై
భారతార్థం లో
కుచేలుని ఒడయురాలు తనతో
ఇహలోకమ్మున హాయన
మహో వ్రజకిశోరుడు! వినుమ యనుంగుడు! బై
సి హలధరుని సోదరుడత
డు; హసత్తుని మేలుకొలిపెడు పనిని గొనుమా !
***
గుడుగుడు బైసణ మీటుచు
నడుగడున విడువక ధరుని నారదుడహ! లో
గడ పన్నుగడని ధృతరా
ష్ట్రుడి కొల్వున హా! యటంచు సుంకుల చేర్చెన్!
జిలేబి
Deleteసాధువు వేషములోని అర్జునుడు
అహ! లోలనయన ! ప్రియ! ర
మ్మ! హాయిగ గుడుగుడు గుంచ మాటల లాడన్
సహజీవనమ్ము సాగిం
ప హసితముఖియా! సుభద్ర! బైడాలమకో !
జిలేబి
Deleteనేటి భారతం జీపీయెస్ వారి వృత్తానికి కందం :)
చనె డింపులమ్మ హాయిగ
వినెరా మెండుగ హలోలు ! విడ్డూరము చూ
చెను గుడ్డలు లేని శిశువు
లను! తిట్టగ భాజపా భళా బై యనె బో :)
జిలేబి
ReplyDeleteరామ రాజ్యము గలదోయి రాజిలుచు భ
ళి భళి థాయిలాండున నెప్డు లెస్సగాను
రాజులమరిరి నామము రామునిదట
గాంచి తెలుసుకొనండయ్య గాడి తప్పి
న చిరుజీవులార! జనుల నాడి యిదియె!
జిలేబి
ReplyDeleteధ్వంసము చేసుకొని మెయిని
పుంసత్వము వృద్ధినొందు పువ్వారంచున్
కంసారిని మరచుచు సం
సంసారుల కెందులకొ వసంతోత్సవముల్?
జిలేబి
ReplyDeleteమారుని బాణపు వేగము
పారగ హృదినిండి పోవు పడతుక తోడై
జోరుగ చెప్ప వలదు సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్!
జిలేబి
ReplyDeleteఆరిన తాపపు కవివరు
లారా! రమణుని రమణుల లసమానంబౌ
తీరని కోరికలవి !సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?
జిలేబి
ReplyDeleteమౌని - శ్రీకందిశంకరయ్య గారికి
శుభాకాంక్షలతో
సుధ లొల్కెడు తేట తెనుగు
మధురిమలన్ తేలియాడి మాకందంబై
విధగా నిడు కైపదముల
మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్!
జిలేబి
ReplyDeleteఅయ్యా అనానిమస్సూ
కుయ్యో మొర్రో యటంచు కూతలవేలా!
భయ్యా తింగిరి పేరే
మయ్యా? నీ పాసగూల! మర్యాదగొనన్ :)
జిలేబి
ReplyDeleteఏంచేసెన్ మోడీ? మూ
పించేడూ, యెన్ జివోల పీకయణచె త
ప్పించి మరేమ్రా తా సా
ధించేడూ ? ప్రశ్న వేసె తింగరి బుచ్చీ :)
జిలేబి
This comment has been removed by the author.
Delete
ReplyDeleteఏమీ చెయ్యక పోవట
మేమె ముసల్దాన మోడి మేలగు ధ్యానం
బే మూలమంచు చెప్ప
ట్లా మాటికిమాటికిన్ పటాటోపముగా :)
జిలేబి
# "జిలేబి" గారు
Deleteమన deletion wizard గారు ఎప్పుడు తన ఏ కామెంట్ delete చేస్తారో తెలియదు కదా. తీరా మనం స్పందించిన తరువాత వారు తన కామెంటుని ఛపక్ చేసేస్తే మన వ్యాఖ్య మాత్రం dangling గానూ, సందర్భం లేనట్లుగానూ కనిపించే ప్రమాదం ఉంటుంది. ఆలోచించగా ... చించగా .... దీనికి రెండు పరిష్కారమార్గాలు తోస్తున్నాయి. (1). వారు delete చేసుకుంటే మనం కూడా మన వ్యాఖ్యను delete చేసెయ్యడం; (2). మనం మన స్పందన వ్యాఖ్య వ్రాస్తున్నప్పుడు వారి వ్యాఖ్యను కాపీ చేసి (దాని time stamp తో సహా) దాన్ని మన వ్యాఖ్య ప్రారంభంలో అతికించెయ్యడం. దాని కింద మన వ్యాఖ్య వ్రాయడం 😎.
నాకు మాత్రం రెండో మార్గం శ్రేయస్కరం అనిపిస్తోంది. ఆ విధంగా ముందుకు పోదాం, ఏమంటారు 🙂?
ఇంతోటి వ్యాఖ్యలకు టైంస్టాంప్ కూడా కావాలా వి కో న గారూ ? మనం చచ్చి మళ్ళీ పుట్టి వీటిని చూసుకుంటామా ? ఎకో గణేష్ బ్లాగ్ లో వ్రాసాను వెతుక్కోండి.
Deleteనీహారిక గారి వ్యాఖ్య 👇
Delete"నీహారిక Mar 24, 2019, 12:33:00 AM
ఇంతోటి వ్యాఖ్యలకు టైంస్టాంప్ కూడా కావాలా వి కో న గారూ ? మనం చచ్చి మళ్ళీ పుట్టి వీటిని చూసుకుంటామా ? ఎకో గణేష్ బ్లాగ్ లో వ్రాసాను వెతుక్కోండి."
====================
నా జవాబు 👇
టైంస్టాంప్ కావాలా అంటే ... కావాలి మరి, ఎందుకంటే నేను కాస్త ఎక్కువే systematic లెండి. ఏవిటో చిన్నప్పట్నుండీ అలా అలవాటయిపోయిందండీ. అన్నీ అలా ... అలా ... కరక్ట్ గా ఉండాలి రికార్డ్ లో నా మటుకు😎 .
ఇక మళ్ళీ పుట్టడం అంటారా ... మరు జన్మల్లో కూడా ఇదే వ్యాపకమా 😳 ? ఈ జన్మలో చేస్తున్నది చాల్లెద్దురూ 😔.
నేను వేరే ఎక్కడికీ వెళ్ళి వెతుక్కోను. మీరు ఇక్కడ delete చెయ్యడం ఏమిటి, వేరే చోట వెతుక్కోమని మామీద కన్నెర్ర చెయ్యడమేమిటి? నో. నో. వెతుక్కోవలసిన అవసరం లేదు, లేదంతే ☝️(మీరు delete లు కొట్టడాలు గణనీయంగా తగ్గించండి).
🦁 in "తల కో న", "పెంచల కో న"
(నా ఇంటిపేరుని రెండుగా విడగొట్టటం మానెయ్యండి 😡)
Deleteనే సిస్టమేటికు మరీ
నౌ! సిస్టరు! విన్నకోట నరసింహారా
వై సాగించితి యానము
కూసింత రిటయిరుమెంటు కొండగ నండై :)
తలకోన , పెంచలకోన , భైరవకోన , పంచలింగాలకోన..... అన్నీ పవిత్రమైన క్షేత్రాలే .
Deleteవీటితో వికోన కు పోలికేమిటో ?
అర్థమవలా .
ReplyDeleteశుభోదయం
చాన్నాళ్ళుగా మా లక్కు, పేట రౌడీ మాలికాధ్యక్షుండు బ్లాగ్దేశంలో సైలెంటు అబ్సర్వర్ గా మారి పోయేరు వారికిదే అంకితం :)
బోడీ పూబోడీ బ్లా
గ్లాడీ వినవమ్మ మాలికాధ్యక్షుండే
రౌడీ! మా లక్పేటన్
రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్ :)
జిలేబి
మాలికను మొదలు పెట్టీ
Deleteబ్లాగ్లోకపు సేవ యంటే
బ్లాగ్ బ్లాగ్ కూ వీరంగాలూ
ముదిరిపోతున్నాయి లింగా
ఏమి చేతుర లింగా, ఏమీ చేతురా 🙁🙁
(my apologies to Mangalampalli garu 🙏. ఈ paraphrasing లో ఉన్న అన్ని దోషాలూ నావే)
అనుకుంటూ ఉన్నాడేమో పాపం అంత లావు "రౌడీ" కూడా 😀😀
(j k 🙂)
ReplyDeleteవీథిబడిని మాస్టారుగ
యాథార్థ్యము తప్ప పలుకు యౌవను డచటన్
పాథము రగిలింప మయిని
వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్!
జిలేబి
ReplyDeleteఎవరై నా మత మెందుకు
జవరాలా మారుతారు చప్పున చెప్మా
తవమున్ చేయగ పల్కని
ధవుడిన్ గ్రక్కున విడుచుట తరమే సుమతీ :)
జిలేబి
ReplyDeleteహరుడు గౌరితో వెలసె సింహా! చల, మున
కన్ గొనెను తాను హరి పాద కమలమగుచు!
నాల్క పైన పలుకుటెలనాగ నిల్చె;
పడతి చెంతలేని మగడు బతుక గలడె?
జిలేబి
దేనికైనా టైంరావాలని కొందరంటారు. టైం స్టాంప్ ఉండాలని కొందరంటారు. ఎవరి విధానాలు వారివి!!
ReplyDelete
ReplyDeleteవినరా ! వికోన వినరా
కనరా నీహారిక పలుకన్ సరియే నె
ప్డును! సాంఖ్యక శాస్త్రము తె
చ్చెను ప్రూఫుగ చూపగా కచేరీలో సూ :)
జిలేబి
"వినరా" భారత వీరకుమారా, విజయము నీదేనూ 👍🙂
Delete🦁
ReplyDeleteమనలో తెలివన్నది ఓ
మనిషీ లేకున్న చాలు మత్తుని దింపే
ఘన గురువు లొచ్చెదరు రా
వినరా నాపల్కు రామ వినరా వినరా :)
జిలేబి
ReplyDeleteగణపతి అను గోపబాలకుని మనో భావన
అఘ్నయు తప్పించుకు ద
ద్రుఘ్న సమీపమునకు తను తుర్రుమనగ నౌ
పఘ్నము వలని తనకికన్
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్ !
జిలేబి
ReplyDeleteఆయన మావారండీ !
ఆయన నాకన్న గొప్ప గా వ్రాస్తారం
డీ!యిది యే సత్యము సు
మ్మీ!యీయాల్టికి కబుర్ల మిసమిసలివియే :)
జిలేబి
This comment has been removed by the author.
Delete
ReplyDeleteముక్కల చేయుచు తకధిమి
లెక్కల సరిజేయ దిగి భళితలతిరిగి తా
గుక్కను త్రిప్పను లేకయు
చక్కా బోయెను జిలేబి చమకు చమకహో :)
జిలేబి
ReplyDeleteకమల పెనిమిటి శశాంకుం
డమలిన స్నేహితుడతండు! డాబన్నది లే
దు! మరి జిలేబీ చెప్పెద
కమలాప్తుడు చంద్రుడనుట కల్ల యెటులగున్?
జిలేబి
ReplyDeleteఅదె! కర్ణ పిశాచి చలువ
పద గుడ్డిగురువుల పనిని బట్టితి నౌరా
సదమల గురువులిలని లే
రు దరిమిలా గాన జోకరులరరె హోరాస్ :)
జిలేబి
ReplyDeleteబయలు దేరి దేశాటన భక్తిగాను
గౌతమీ స్నాన మొనరించెఁ, గాశి కేఁగి
గంగలో మునిగె జిలేబి కర్మ ఫలము
ల సరి జేసుకొనంగ చాలమిని వీడి!
జిలేబి
ReplyDeleteర్యాగింగుచెయ్యనా ? ఓ
బ్లాగుల కామింట్ల రాణి పదపద పోవే
దాగుడు మూతల లాడన్
సాగదు నీయాట పో ! కసబుస బుసబుసా :)
జిలేబి
తళ తళమ్మని మెరయు
Deleteదవళ దంతపు పంక్తి
చుక్కలనే చుల్కనగ
వెక్కిరించుచునుండే ..!!
ReplyDeleteమెరిసెడు దవళపు పంక్తికి
యరరే తగిలెను వరుసగ నబ్బో దెబ్బా
సిరిసిరి మువ్వకు వేసిరి
మరి తాళమ్మదె జిలేబి మహిలో సుదతీ :)
జిలేబి
ఏమని పొగడగలను
ReplyDeleteమేమని వర్ణించను
క్రొంజెక్కుటద్దాల కుండలంబుల
ధగధగలతో నీ నేత్రములు
మిరిమిట్లు గొనె..!!
Deleteసోడాబుడ్దీ కళ్లాద్దాలా ? :)
జిలేబి
ReplyDeleteనా రాముడు నన్ను జిలే
బీ రాత్రింబవలు మెచ్చి ప్రేమగ చూడన్
ప్రేరణ చేర్చన్ మేల
మ్మా రస రమ్యమగు నాదు మాటలు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఅమెజాన్లో ప్రచురించా
గమనింతురుగాక నవల కాసులు చెల్లిం
చి మరి కొనుడీ చదువుడీ
జమజెట్టి శరత్తు నవల చక్కగ నిపుడే :)
జిలేబి
ReplyDeleteఇరువురు చంద్రులరరె తమ
పరువుల పోగొట్టుకొనుచు పరుగిడిరిగదా
తిరిపెంబెత్తుకొనుచు నో
ట్ల రయముగా మ్రింగ గ్రక్కటంచు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఇంతటి విద్వత్తు నెటుల
సొంతము చేసుకొనినావు సోకులు మాడన్
నంతయు నంగాంగము లా
సాంతము వర్ణింపగాను సారించితివే :)
జిలేబి
ReplyDeleteరాతల లోని నిజాయితి
చేతల లో కానరాదు! చేర్చను చర్చన్
మూతన్ బెట్టిరట తిరగ
మోతగ పోనిక జిలేబి ముంగట పోనే :)
జిలేబి
కబరీభరమ్మును చూచి
ReplyDeleteకవి కన్నీరొలుకు
చారు ముఖమును చూచి
శశి మబ్బు మాటుగొను
Deleteనీహారికన్ గనన్ జను
లాహాకారములు జేసి లాంగ్జంపై కో
లాహలముగ పరుగిడెదరు
బాహాటమ్ముగ తెలుపుచు భయమును సుదతీ :)
జిలేబి
Deleteఏమి లావణ్యమో
మేమి తారుణ్యమో
ఎన్నెన్ని లోకాలలో
ఎంతెంత వెదకినా
ఇంతటి అందాన్ని చూడగలమా .. !
ఈ అందమును వర్ణింపగలమా..!
Deleteచూడగలవా సఖి జిలే
బీ డమడమలాడు రీతి భీభత్సములన్
క్రీడావినోదముగ జీ
రాడగ నందములు సూవె రసరమ్యముగా :)
జిలేబి
గాడుపు ఈడ్చి కొడుతుంటే
Deleteఎవళ్ళకి కనిపిస్తుంది?
నీకూ అవుపడదూ నాకూ అవుపడదు:
చెట్లు జుట్లు విరబోసుకుని
తలలొగ్గి ఊగుతుంటే
అయ్యొ గాలిరా నానా!!
అనుకోడం తప్పించి.
Deleteతంతోందమ్మీ గాడుపు
వింతేముంది కనబడని విధినాటకమే
కొంతైన గాలి రాదా
చెంత యనుకొనుట మనకిక చెలియా మేలౌ :)
కొట్టుకొచ్చిన పదాలకు కొట్టిన కందాలు :)
జిలేబి
గాలి సావిట్లోకొస్తే
Deleteఎవరు చూడొచ్చేరు?
నువ్వూ చూళ్ళేదూ నేనూ చూళ్ళేదు:
ఆకులు గలగల్లాడితే
తడి బట్టలు అల్లాడితే
అబ్బ గాలే అమ్మలూ!
అనుకోడం తప్పించి.
చాటుగా ఉమ్మేస్తే
Deleteఎవరు చూడొచ్చారు?
వాడూ చూడలేడు,వీడూ చూడలేడు.
లాలాజలం ఆగనంటుంటే
పూలతొట్టి రమ్మనంటుంటే
ఉమ్మనీకి తొట్లున్నాయి కవర్ చేయనీకి చెట్లున్నాయి
అనుకోడం తప్పించి!
This comment has been removed by the author.
Delete
Deleteచాటుగ ఉమ్మేస్తేనో
మాటున పొడిచేయగాను మరి చూడొచ్చే
పోటు మడిసెవరు? తొట్టియు
చాటుగ చెట్టాయె మాటు చా! ఉమ్మేసేయ్ :)
జిలేబి
ReplyDeleteతెలుగు రాష్ట్రాలలోనే కాదు టాప్ క్లాస్ వరల్డు బీటర్ :)
తెలుగు నిలుచునో యనెడు సందియపు దినము
ల మన శంకరయ్య చలువ లక్షణముగ
సరసి, యెటు చూడగనచట శంకరాభ
రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన!
జాల్రా జిలేబి
చుట్టు ప్రక్కల గల పుట్ట తేనియ ద్రావ
Deleteగుట్టు దెలియలేరు బిట్టు భిగిసి
పెట్టెలో చెద గుమి పట్టి మట్టి దినుచు
తెనుగు నిలుప గలరె ? ఘనులు ! చాలు .
Deleteనారదా !
తేనియలు తాగి త్రేన్పుల తేలనేల
నిక్క మైన మట్టిని నమ్ము నీలవేణి
మేల్మి గాన పండితుల సమీక్ష వలయు
నీకు నారాయణయనెద నీలవేణి :)
జిలేబి
ReplyDeleteచేయ రేల రామభజన చెలులు ? గాన
చెంగటయతడేను ప్రభువు చేర్చుకొనగ
మిమ్ము నిక్కమిదియె సూవె మీరవలదు
నాదు పల్కుల నెపుడు పునాది యిదియె !
జిలేబి
ReplyDeleteసావిట్లో కొస్తేను హ
వా వనితా యెవరికి యనుభవమగు నమ్మా
పీవపు గతియు జిలేబీ
నా వలువల గలగలల వినా తెలియదుగా :)
జిలేబి
ReplyDeleteనన్ను మెచ్చుకున్నట్టి శ్రీ నరస రాయ
పొర్లి దండాలు మీకయ్య పొంగుకొచ్చె
నయ్య యభిమానము తమపైనన్! జిలేబి
పద్యము చదువ మరుజన్మ వరము లేదు :)
జిలేబి
ReplyDeleteమీరు డిసర్వింగండీ !
పేరు బుచికియైన నేమి పెద్ద క్రిటిక్క
య్యా! రాస్తూంటా రాండీ
మీరే మైనన్? జిలేబి మించారేలా ?
జిలేబి
ReplyDeleteఆకలిని గొన్న వారికి నన్న మగుచు
భక్తి గా భజియింపగ భగము గాను
చీకటిని మించు; వెలుఁగున్నదా కనులకు
నిత్యముక్తుని కొలువంగ నీరజాక్షి !
జిలేబి
ReplyDeleteవిశ్వామిత్రుడు రామునితో
రామ! రాజ్యాన ధర్మము, రాక్షసమ్మె
ధూర్తులకు! శిష్టులకదియే తూపరాణి!
ధర్మమును రక్ష సేయగ ధాత్రి నిలుచు
నెల్లకాలము మేల్మిగ నెమ్మి బడసి !
జిలేబి
రామ రామ చిల్లి రంధ్రమ్ము తూమని
Deleteఅజగరమని యర్థ మందు కలదు
తూపరాణి యనగ పాపమా శిష్టుల
కేది నప్పు తుందొ యెవరి కెఱుక ?
Deleteజలదారియదియె లక్కా
కులకవి రాయా జిలేబి కుదిరెన్ పాక
మ్ము లలంతికా మయముగా
వలదన్న మరియొక పదము వార్చెదనయ్యా :)
జిలేబి
లలంతికా meaning ?
DeleteThis comment has been removed by the author.
Deleteచెఱువు నుండి నీళ్లు బయటకు (పొలాలకు) వదలే
Delete' తూము '
లలంతిక = neck place ,గొలుసు
Deleteఐనా పై పద్యంలో ఈ పదంగానీ , అర్థంగానీ
పొసగలేదు . అంత పెద్ద కవయిత్రి వాడేరు గనుక ,
ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు .
ఇక , సకియా - సఖియా
అభి మాషం మషం కుర్యాత్ ,
ఛందో భంగ నకారయేత్ - అని ఆర్యోక్తి .
సకియా వాడుక కరెక్టేనా ?
Deleteతూమురాణి ని తూమరాణి అని కూడా వ్రాయవచ్చా ?
వ్రాసింది మీరే అయితే లక్కాకులవారిని చెప్పమంటారేవిటీ ?
మా తెలుగు మాష్టారన్నట్లు నిక్షేపమ్మున వ్రాసినవారు చెప్పక అర్ధమవదు.
Deleteవ్రాయటము వరకే మా పని :) అర్థములను వివరించుట అయ్యవారల పని :)
జెకే :)
సకియ
చెలికత్తె.
"క. సకియఁ గనుమొఱఁగి మధుకర, చికుర నిజారామవాటిఁ జేరి ప్రసూనాం, బకధాటీ శుకఘోటీ, నికరాటీకనము మనము నివ్వెఱపఱపన్." వసు. ౩, ఆ.
జిలేబి
# “జిలేబి” గారు
Deleteసర్జన్ల బాపతన్నమాట మీరు? కోయటం వరకే వారి పని, కుట్లు వెయ్యడం వేరే డాక్టర్ల పని. అలా ఉంది “వ్రాయటము వరకే మా పని” అన్న మీ చిద్విలాసం 🤣
ఇక మీరడిగిన “తూమురాణి”, “తూమరాణి” పదాలు నిఘంటువులో కనబడలేదు, నీహారిక గారు. తూము అనే అర్థంలో ఉన్నవి ఇవి 👇. రాజారావు మాస్టారేమంటారో?
==============
Source :- ఆంధ్రభారతి
“తూపరాలు, తూపరాణము, తూపరాణి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
tūparāṇa
n.
A water course, a drain. నీళ్లు బయటికి వచ్చు తూము.”
================
🦁
ఇంత పెద్ద చిల్లి నెంతేని ముదముగా
Deleteశిష్టుల యెడ వాడె చివురు బోడి ,
మురిసెను గురుదేవ మూర్తి యామోదించి ,
అక్క ! నీవు గ్రేటు , అక్కజముగ .
వలదన్న మరియొక పదము వార్చెనయ్యా :)
Deleteతూపరాణి meaning ???
ReplyDelete
Deleteలక్కాకుల వారే చెప్పాలి ఈ పదానికి వ్యుత్పత్తి :)
జిలేబి
పాము+రేడు = పాపరేడు
Deleteనాము + చేను = నాపచేను
వేము+ కొమ్మ = వేపకొమ్మ
ఇలానే
తూము + రాణ = తూపరాణ
ReplyDeleteఒక హాయైనభరోసా
సకియా గెలిపించవోయి చక్కని నవ్వై
సకలము నీవేనాకిక
వకాలతును పుచ్చుకొంటి వనితా నీకై :)
జిలేబి
సకియా or సఖియా ?
Delete
ReplyDeleteసినిమా పాటల పాడెన
ననుకొని సన్నాసికాద నన్తగ దయ్యా
మనసే ముఖ్యమని తెలుసు
కొనండి మూఢులవకండి కోవిదులారా !
జిలేబి
What is the base of this poem ?
Delete
Deleteసీక్రెట్ :)
జిలేబి
ReplyDeleteధగధగమెరిసెడు మోమా
యె! గళము సొబగులలరారె! యేమనెదనయా
జగణపు జిలేబి పాడగ
నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్!
నగములు - చెట్లు తలలూపె
జిలేబి
ReplyDeleteమంచి ప్రజా ప్రతినిధులను
సంచయమున్ చేసుకొనగ చరితార్థులమా ?
కించిత్తైనను బుద్ధిగ
మంచి జనుల నెన్నుకొను సమాజము కలదే ?
జిలేబి
ReplyDeleteనిగ్గ దీసి అడుగుతాను నేను జనుల
సిగ్గు లేని జనుల నిప్డె చెప్ప వలయు
వారు సంజాయిషి త్వరగ వదల నింక
నేను నీహారి కన్రా పనిగొన విడువ :)
జిలేబి
ReplyDeleteజండా పాతవలెనురా
కొండారెడ్డి జగనన్నకు మనము సాయం
బండగ పద సైకిలు లే
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్!
జిలేబి
ReplyDeleteజండాపాతవలెన్ జనాళి మనకై జైజై యనంగన్ పదా
కొండాడన్ జగనన్న సాయము పదా! కొట్టాలె నోట్లన్ పదా!
తిండాడాలె సు సైకిలోళ్ళు పదరా దిక్కామొగాలైన లే
కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్!
జిలేబి
ReplyDeleteమా అయ్యరు జంబునాథన్ కృష్ణ స్వామి మహా కార్మేఘము :) கருப்புதா எனக்கு பிடிச்ச கலரு :)
నా కయి బట్టి పెన్మిటిగ నాకెదు రాడక నెప్డు జై జిలే
బీ! కమలాక్షి ! యంచు నిల భీముని పాకము వండి వార్చు కృ
ష్ణా! కిను కేల కాళిమయె చందము మవ్వము నీకు రా! పగల్
చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే!
ஜிலேபி
ReplyDeleteరాధా యీసునసూయలు
రాధనమును చేర్చవమ్మ రమణీ వినవే
సాధించుము యవనారిని
శోధన చేయుచు విడువక సొగసరి పిల్లా :)
జిలేబి
ReplyDeleteచవులూరెడు విధములు తా
కవనమ్మును బీకు నతడు కన్పడ నేదై
న వరుస పదమ్ములని నా
కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో!
జిలేబి
ReplyDeleteదిక్చక్రమ్ముల కావల
దృక్చరణమ్ములను చాపి దృంహితమగు ప్ర
త్యక్చేతనుడి కెడన్ తన
వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్!
జిలేబి
Deleteశ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి ఉవాచ
జిలేబీ గారు దుస్తర ప్రాస పారావారమును సమ్యగృగ్వాగ్గుంఫన నౌక తో గోష్పదీకృత భంగి నుత్తరించినారు. అభినందనలు.
Deleteసమ్యక్, రుక్, వాక్, గుంఫనమను నౌక తో
సముద్రమును ఆవు దాఁట కలుగు గుంట లా చేసి ...
ReplyDeleteఏమి చేసినా ఓడ వలసినదే :)
డేక్చాలన్ తను పేర్చి వడ్డనలతో డింకీలు కొట్టెన్ సుమా
వాక్చాతుర్యముఁ జూపి క్రొత్తడి కెడన్ ప్రాణేశు; వ్యర్థుండయెన్
వాక్చాతుర్యము తోడు బోధకుడయా ; వావాదులన్తోడుగా
వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!
జిలేబి
ReplyDeleteజగత్సాక్షి సాక్షిగా దృక్కర్మ ప్రత్యక్షిగా కర్మ తగలడెన్
దిక్చక్రమ్ముల కావలన్ కుదరముల్ ధీంధీంయనంగన్ వెసన్
ప్రాక్చైతన్యుడు దృంహితమ్ముగ నుషస్ వాజేన గాంధర్వమై
దృక్చాతుర్యము గాంచి తేరు నడుపన్, దృక్కర్మ ప్రత్యక్షిగా
వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!
జిలేబి
“కుదరముల్ ధీంధీంయనంగన్” .... గుఱ్ఱములు సకిలిస్తాయి గానీ ధీంధీం యనడమేమిటండి, “జిలేబి” గారు ? 🤔
Deleteపండిత కవులీ ఫీట్లను
ReplyDeleteపండింతురుగాక ! బోథపడునా? విహితా !
దండిగ దయగదుర , నెదర
మండితముగ భావ మిడిన మాన్యత గలుగున్ .
Deleteనిండుగ మీరుండగ మా
కండగ నర్థముల తెలుప కావాలా వే
రొండు నిఘంటువులు సభా
మండప కవిరాట్ విదుర! సుమాంజలి రాజా !
జిలేబి
ReplyDeleteపారావారంబై వి
స్తారంబై దుస్తరంబసాధ్యంబగు ప్రా
సై రాజిల్లెడు కైపద
పూరణ సులభముగ చేసె పూబోడి సుమా!
జిలేబి
ReplyDeleteసకిలించును గుర్రమ్ములు
తకిటతధిమి ధీంధిమిదిమి తాళాలేమం
డి? కవనపు జిలేబీ కా
స్త కనికరము చూపుడమ్మ సభని తెలుగుపై :)
గుర్రాల రెక్కల చప్పుడు ధీం ధీం అనేయేమో టకటక అనేలా :) యేదో బావుందని వేసు కున్నామంతే :)
జిలేబి
ఓహో, రెక్కల గుఱ్ఱాలా? “ధీంధీం” వాటి రెక్కల చప్పుడా? అలాక్కానివ్వండి, కవుల ఊహాశక్తికి అవధులేమున్నాయి 🙏?
Delete(అన్నట్లు “టకటక” అంటే వాట్ల గిట్టల చప్పుడు కదా?)
Deleteక్రింద చూడుడు ;)
జిలేబి
ReplyDeleteమరువగ నేల సంస్కృతిని మాలిని రాగిణి శోభలొల్కగా
నరె! రమణీ! కళింగ! లలనా! మన పూర్వపు గాధ రీతిగా
కరిముఖుఁ డబ్ధినందనకు కన్న, కుమారుఁ డనంగుఁ డన్నయున్,
శరజుడు కాగ పుత్రునిగ శాంకరి కమ్మరొ సాదరమ్ముగాన్ !
జిలేబి
ReplyDeleteటకటక డెక్కల చప్పుడ
గు కందపు జిలేబి ధిమి యగును రెక్కల ధా
టికద! నరసన్న తను ప
ట్టుకొనంగా విడువడమ్మ టూతండునెయిల్ :)
జిలేబి
ReplyDeleteకంది వారి పల్కు కాదన కమ్మరో
శతకమునిక వ్రాయి సకల జనులు
పారి పోవ నీదు పద్యముల చదివి
విశ్వదాభిరమణి విను జిలేబి :)
జిలేబి
వేమ విభుని రమణి విశ్వద యను వాద
Deleteమొకటి కలదు విహిత! ముదముగాదు
విశ్వదాభిరమణి విను జిలేబి , యనుట ,
విశ్వ వినుత రమణి విను జిలేబి .
Deleteబాగు బాగు బాగు వరలెడు మకుటము
బాగు ! తేలి కైన పదము లివ్వి
దరువు వేయ గాను ధనధన ధిమిధిమి
విశ్వ వినుత రమణి విను జిలేబి
జిలేబి
శ్యామలరాయుని పలుకు చంధస్సు లొలుక
ReplyDeleteలక్కాకుల పలుకు చల్లగాను
టక టక మ్రోగునట్లు ధిమి ధిమి మ్రోగునా
భావి భారత ప్రజ భాగ్య దాత !
ఈ పద్యంలో తప్పులు సరిచేయుడీ !
Deleteపద్యంలో తప్పు లేవీ లేవండి
శంకరాభరణం లో రాసేయండి ఇవ్వాళ సమస్యా పూరణ ఇంతకు ముందు ఓ రోజు రాసి ఆపేసారెందుకనో ?
జిలేబి
ఇంతకుముందు చెప్పాను, శంకరాభరణంలో వ్రాసింది నేను కాదు. ఇది పేరిడీ పద్యం కదా ? శంకరాభరణంలో వ్రాయాలంటే చంధస్సు తెలియాలి. ఇపుడు నేర్చుకున్నా రాదు.
Deleteమీకన్న (వయస్సులో) పెద్దవారు సరదాగా నేర్చుకు(కుంటు)న్నారు . ఇదేమంత బ్రహ్మ విద్యేమీకాదు , గురుదేవులూ అఖ్ఖర్లేదు ,
Deleteనాలుగు వేమన పద్యాలూ , వాటి లయ గ్రహించి
ప్రాక్టీస్ చేస్తేచాలు . లయ పట్టేస్తే , ఆ ఙ్ఞానం అటు
వైపుగా లాక్కెల్తుంది . ఆల్ ది బెస్ట్ .
శ్యామలన్న పలుకు ఛంధస్సు లొలికినా ,
ReplyDeleteఘోటకముల గిట్ట ధాటి గాను
టక టక యనుగాని , పక పక నవ్వరా
ధిమి ధిమి యను బుధుల తీరు దెలిసి
ReplyDeleteపార్వతి says to లక్ష్మి :)
నాదు భర్త నైన నాయాన గా ద్వార
మందు నిలిపి వేసె మాట దాట
డమ్మ విఘ్నముల నెడపునితడేనమ్మ
కరిముఖుండు, లక్ష్మి! కన్నకొడుకు!
జిలేబి
ReplyDeleteఇంతకు మునుపే చెప్పా
సాంతముగా నాదికాదు సభలో పద్యం
బింతయు జిలేబి వినవే
కాంతా నా వల్లకాదు కాదే రాయన్ :)
జిలేబి
ReplyDeleteఅరరె! తెలగాణ బిడ్డ చంద్రా! వినవలె
మంచి మాట నెల్లరికిని మనవి! మేలు
తల్లికిం దిండి నిడుట! వ్యర్థమ్ము సుమ్ము
దీనిపైన చర్చలిక సుదీర్ఘముగను!
జిలేబి
ReplyDeleteపనికి మాలిన కొడుకని వాని జూచి
తల్లి, కిం, దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము
తలచు? తనదు ప్రేమ యలవి ధాత్రియు ధరి
యించు భారము రీతి పయికొనుకాద!
కిం - ఎవతె?
జిలేబి
తల్లికిం దిండి నిడుట! వ్యర్థమ్ము సుమ్ము !
ReplyDeleteఆకటికి తాళలేక భయానకముగ
చచ్చిన పిదప యేటేట జనము కొఱకు
మాతృపిండం దదామ్యహ మనుట మేలు .
This comment has been removed by the author.
Delete// "తల్లికిం దిండి నిడుట! ....." //
Deleteబాగా చెప్పారు రాజారావు మాస్టారు. మనిషి బతికున్నప్పుడు సరిగా చూసుకోక, మనిషి పోయిన తరువాత కర్మ ఘనంగా చేశాం ప్రతేడూ శ్రద్ధగా ఆబ్దీకం పెడుతున్నాం (మాతృపిండం కానివ్వండి, పితృపిండం కానివ్వండి) లాంటి మాటలు చెప్పేవారిని నేను కూడా హర్షించను.
Deleteஏழுதினவரை கேக்கணும் :)
ஜிலேபி
మాకేల ఈ ద్రవిడసేవ "జిలేబి" గారు? ఇంతకూ ఈ మాటలకర్థమేమిటి? :(
ReplyDeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete# నీహారిక గారు
ReplyDeleteహ్హ హ్హ, థాంక్యూ. కానీ పరిచయం లేని భాషలో ఆవిడ (“జిలేబి” గారు) ఏదో వ్రాయడం (తిట్టడం??) ఏమిటి, మీరేమో అనువాదం మాత్రం చెప్పి భాష్యం చెప్పమని నన్నడగడమేమిటి? బాగుందండీ.
ఇంతకీ మీరన్న ఆ ఆరున్నొక్క నెంబరుకు సంబంధించిన క్లారిటీ ఇవ్వండి ... ఆ నెంబర్ మనుషులా, గంటలా (bells) తేల్చుకుని చెప్పండి.
ఏడుగురిని ఒకేసారి తన్నగలిగిన వ్యక్తి “రథి” అనుకుంటే నలుగుర్ని ఒకేసారి తన్నగలను అని మీరంటున్న దాన్ని బట్టి మీరు “అర్థరథి” అన్నమాట 😀.
Deleteపరిచయము లేని యా భా
ష రాయనేల మన పైన ? శష్కులి యర్థం
బరయంగలేక పోయే
ము రమణి నీహారికా సముచితముగ సుమీ:)
జిలేబి
This comment has been removed by the author.
Delete"జిలేబి" గారు, మళ్ళీ పద్యం వినిపించడమే గానీ మీర్రాసిన ఆ తమిళ ముక్కలకు అర్థమేమిటో చెప్పరన్నమాట 😡?
Delete
Deleteవినిపించేరండీ మ
ళ్ళి నూతనముగ మరియొక గిలిగిలి పదాల్ వా
ర్చిన పద్యంబంతే గా
ని నేనడిగినట్టి దానికేమి జవాబో ?
జిలేబి
You are incorrigible "జిలేబి" గారు 😬.
Delete----------------
నీహారిక గారు, మీకు ఆ భాష తెలుసల్లే ఉంది. కాబట్టి అర్థం మరింత వివరంగా చెప్పండి ప్లీజ్. "జిలేబి" గారు మనల్నేమన్నా తిడుతున్నారా?
Deleteమీకా భాష తెలిసిన
ట్టే కనబడుతోంది మాకు! టెంకణమిదియే
మీకిక నీహారికగా
రూ కాస్త తెలుపుడి యేమిటో యర్థంబౌ ?
జిలేబి
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Delete# నీహారిక గారు
Deleteథాంక్స్.
పైన రాజారావు గారి "తల్లికిం దిండి నిడుట! ....." పద్యం మీద నేను వ్రాసిన వ్యాఖ్యకు, దాని క్రిందనే "జిలేబి" గారు పెట్టిన ఏడుగురిని తన్నడం అనే ఈ అరవానికి సంబంధం ఏమిటో తెలియడం లేదు. వివరించమని "జిలేబి" గారిని అడగడం ... గోడకేసి మన తల బాదుకోవడం ... రెండూ ఒకటే. కాబట్టి వారికి మరింత వినోదం కలిగించడం అనవసరమని ఇక ఇక్కడితో ఈ చర్చ ఆపేస్తున్నాను.
Deleteఓహో ! ప్రాబ్లెమ్ ఇదన్న మాట ! ఆ భాష జవాబు నీహారిక కండి రావు గారు ! తానడిగె -
"ఈ పద్యానికి తెలుగు అర్ధం చెప్పండి జిలేబీ గారు" అని దానికై నా జవాబది .
మీ వ్యాఖ్య క్రింద రావడంతో వచ్చిన చిక్కన్న మాట ఇది.
ఇప్పుడర్థమయింది డిలీట క్వీన్ డెలీటు కొడితే కామింట్లకు తలా తోకా లేకుండా ఆ రిప్లై తగలడేది !
కావున మీ పంథాలో ఆ జవాబు- నీహారిక గారి కామింటు కని గమనించవలె !
ఇట్లు
జిలేబి
పెద్దలు నరసింహారావు గారు ఇంతగా అభ్యర్థించినా ,
Deleteఅరవ మొత్తుకోళ్ళు చింతగుగ్గిళ్ళులానే మిగిలిపోయింది .
Deleteఅరవంపు మొత్తుకోళ్ళకు
నరసింహారావుగారి న్యాయంబగు ప్ర
శ్నరవళికి చింత గుగ్గి
ళ్ళరరె జవాబుగ మిగిలె ఫలముగ జిలేబీ :)
జిలేబి
# "జిలేబి" గారు
Delete// "ఆ జవాబు- నీహారిక గారి కామింటు కని గమనించవలె !" //
అప్పిడియా? చరిదా.
Deleteఓహో! ప్రాబ్లెమిదన్న మాట లలనా నొచ్చేరు సింహంబు గా
రే! హా! రమ్మిక మెత్తటైన పదముల్ రేకుల్ వలేనొత్తుమా
బాహాటమ్ముగ కోరుమా క్షమను నిర్వాకంబు చేసింది చా
లే! హాంప్నా మరి కొంత తగ్గగ సుమా లివ్వించు కైవారమున్ :)
జిలేబి
అపశబ్దభయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ।
Deleteఅనాచార భయం నాస్తి తిష్ఠన్మూత్రస్య సన్నిధౌ॥
ReplyDeleteఈ యెన్నికలల లో ప్రజ
లే యిక ఓడేది సుమ్మి లేకితనమ్ముల్
మాయని చూపే మాటల్
శ్రేయో ప్రేయములులేని చెడుగుడులాటల్
జిలేబి
చెఱకు గడకు మావి చిగురుటమ్ము దొడిగి
ReplyDeleteపుడమి నాట విడిచె పోకి రొకడు
ప్రకృతి రమణి తనువు పరవశించి యిలకు
నవ వసంత శోభ లవతరించె .
❤ మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు ❤
ReplyDeleteఇట్లాంటి దే ఎక్కడో చదివి నట్టుంది సినబ్బా :)
బాపడ నేను , పుట్టువున బ్రహ్మముహూర్తము నాదిగా , భువిన్
ప్రాపును గాంచి నాడను శుభంకర వేదము నాదిగా, మహిన్
స్థాపిత మైతి నేను పురుషాకృతి గాంచిన వాడి మోముగా
వ్యాపిని సర్వదేశముల వంతెనగా మన దేశ భాగ్యమై !
జిలేబి
ReplyDeleteరామాయణము చదివినా
రీ మా పిలకాయలేను రేమద్దుల వా
రే! మంచిగ చెప్పిరిటుల
చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్!
రావణుడెట్లా వానరుల చేతిలో ఓడె అంటే రేమద్దుల విద్యాార్థుల సమాధానం :(
జిలేబి
ReplyDeleteవేగేదెవరండీ రో
జా గారి కెడ మరియాద జాగ్రత్తగ తా
మై గాచుకొని జిలేబీ
పాగల్ఖానాయె మేలు పదపద పోదాం :)
జిలేబి
ReplyDeleteరండయ్యా జై గారూ
రండీ మీరింక రాలె రయ్యననుచు నే
నండీ చూస్తుండాను సు
మండీ యాంధ్రా యనంగ మంటయదేలా :)
జిలేబి
ReplyDeleteతెలగాణా వెలగాలని
బలమ్ము గా కోరుకొనుడు ప్రక్కన నుండే
బలహీనముగ నిపుడుగల
బలవంతుడు బాగుపడగ బాధపడకు సూ :)
జిలేబి
ReplyDeleteమీ కెందుకండి జై గా
రూ కంగాళి, యుబలాట రువ్వన్ మాపై
సాకు దొరకగన్ రాళ్ళను?
ఠాకూరు బడామడిసివటంచు తలంపో ?
జిలేబి
"ఠాకూరు" అంటే పోలీసు డీజీపీయా? ఆయనపై అభియోగాలు కోకొల్లలు
Delete
ReplyDeleteఅదిగో ఉద్యమ సింహం
బదిగో జైగొట్టు తెలుగు పడతి జిలేబీ
ఇదె జైగొట్టుచు ముక్కల
పదముల బేర్చుము కవితకు పారాణిగనౌ :)
జిలేబి
ReplyDeleteఇబ్బందనిపించెనయా
పబ్బం బాయెను వికారి పలుకుటదెట్లో !
తబ్బిబ్బయ్యిరి బుచికీ
అబ్బో "మల్లీ" ని గంటినరె మరె యెచటో :)
జిలేబి
ReplyDeleteసొల్లండి టెల్గు లోనన్
సొల్లు కబుర్లను బిరబిర సొబగుల నిపుడే
పల్లె ప్రపంచపు రావ్ సాబ్
మళ్ళీ మళ్ళి యవియే సమాధానంబుల్ :)
జిలేబి