బ్లాగ్ వీక్షకులకందరికి
శ్రీ వికారి నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు !
శ్రీలు పొంగ గాను శ్రీవికారి శుభముల్
విరివి గాంచు గాక విదురులార !
కామనలివి యేను కవివరు లార! పు
రికొను గాక నెల్లరి కవనములు!
శుభాకాంక్షలతో
విరివి గాంచు గాక విదురులార !
కామనలివి యేను కవివరు లార! పు
రికొను గాక నెల్లరి కవనములు!
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteచెఱకు గడకు మావి చిగురుటమ్ము దొడిగి
పుడమి నాట విడిచె పోకి రొకడు
ప్రకృతి రమణి తనువు పరవశించి యిలకు
నవ వసంత శోభ లవతరించె .
❤ మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు ❤
శ్రీ వెంకటరాజారావు లక్కాకుల
ReplyDeleteక్షేమము గా నుగాది యిక శ్రీలను గూర్చగ దేశమంతయున్
వేమరు గైన వృద్ధి పృథివిన్ప్రభలొల్కగ భాసితంబుగా
కామన లివ్వి పండితుల కాహక నాదము విస్తృతంబుగా
రేమగడిన్ వళక్షముగ రిచ్చలు సేయవలెన్ సభాస్థలిన్!
జిలేబి
రిచ్చలు సేయమని దీవించారా ? హతవిధీ...ఏదిచ్చినా తీసుకోవలసినదే కదా ? ధన్యవాదాలు !
Delete
Deleteఈ ఉగాది దేశమంతా క్షేమంకరముగా శ్రీలను గూర్చాలి . వేమరు అంటే వేయి మార్లు . ఆతరువాత గైన అంటే ? రెండో పాదం పెద్దలు వివరించాలి . ఇక , సభాస్థలిలోని పండితులకొక బాధ్యత ఇవ్వబడింది .
అదేమంటే , వీళ్లు విస్త్రృతముగా కాహక(కాహళ ?)నాదము చేస్తూ , కొమ్ముబూర ఊదుతూ , రిచ్చలు
(టెర్రర్) సృష్టిస్తూ ఉండాలి . ఆపకూడదు .
ఈపద్యంలో నాకర్థమైనంతవరకు పరమార్థమిది .
ఇంకా , రేమగడిన్ , వలక్షముగ మిగిలి పొయ్యాయి . నా మేథో పరిధి ఈమాత్రమేమరి . కవయిత్రి మన్నించాలి .
Deleteవామ్మో ఇంత అర్థమయ్యిందా ! అంటే 75 శాతం ప్యాసన్న మాట :)
జిలేబి
మీరా ? నేనా ?
Deleteఇంతకూ ఉగాది పచ్చడి తిన్నారా , గడుసు కోయిల
గుడుసు పద్యాలు రాస్తోంది .
పేరే వికారి , రాకయు
Deleteపోరాటము వేళ , నాంధ్ర భూమికి , యిది ఏ
తీరుగ పరిణామ మగునొ ?
ఆరంభము రచ్చ రచ్చ , అంత్యం బెటులో ?
Deleteరాకయు పోరాట వేళా అంటున్నారు పిట్ట రెట్ట టైము చూసి వస్తున్నారాండీ లక్కాకుల వారూ ?
జిలేబి
రెట్ట టైము ఇంకా తేలలేదు . కార్తాంతికులు తేల్చేదాకా
Deleteతొందరపడి రావద్దు . మీకు మరీ తొందరెక్కువ . రెట్ట వేయించుకోవాలనే ఆరాటమూ అధికము .
This comment has been removed by the author.
Delete
ReplyDeleteసిరులొలుకంగ దేశమిక శ్రీకరమై వెలుగొంద రాష్ట్రముల్
విరివిగ పాడిపంటలు సువిద్రితమందున చేరగావలెన్
కరిముఖ! వేడుకొందుమయ కావవలెన్ జనులన్ సదా విసా
రి రువణమున్ సమగ్రముగ, రిక్తతయున్ తను గాక బ్రోచుమా!
జిలేబి
నాకు పద్యాలు రావు కానీ మామూలు గానే చెప్పేస్తాను.
ReplyDeleteమీకు మీ కుటుంబసభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
Deleteనాకీ పద్యాల్ రావం
డీ కాబట్టి శుభముల్ వడి బడయగ జిలే
బీకిన్ బ్లాగ్జనులకు నా
ఆకాంక్షలివియె యుగాది యానందముగాన్ !
జిలేబి
ReplyDeleteఅబ్బా! నరసింహా రా
వబ్బబ్బా సూపరండి పరకాయములం
దబ్బున మీ తలకాయిని
రబ్బరులా సాగదీసి రాసేస్తారే :)
నారాయణ!
జిలేబి
ఏవిటో, చిన్నప్పట్నుంచీ అంతేనండీ 😌 . విఠలాచార్య గారి సినిమాల ప్రభావమా మజాకానా 🐎🐅🐆🐘 🦁.
Delete(నారాయణానా, నారదానా 🙂?)
😎
ReplyDeleteమీలాంటి సీనియర్లె సు
మీ లక్షణముగ వలయును మించారంగన్
మాలోకంబుగ తిరిగెడు
భూలోకము కావగాను బులుసువరార్యా :)
జిలేబి
ReplyDeleteతనకు విద్యాబోధన చేసిన గురువును తూర్పారబడుతూ ఔరంగజేబు వ్రాశాడన్న ఉత్తరాన్ని ఈ క్రింది లింక్ లో చదవచ్చు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు గారి పరిశోధనట. 1910 లో "భారతి" సంవత్సరాది మాసపత్రికలో ప్రచురించబడిందట.
ఉత్తరంలోని అంశాలు, దాని క్రింద లక్ష్మణరావు గారు వెలిబుచ్చిన అభిప్రాయాలూ ఆసక్తికరంగానూ, ఈనాటికీ సమకాలీనంగానూ ఉన్నాయి.
(బ్లాగర్ రమణరాజు గారి "చిత్రకవితాప్రపంచం" బ్లాగ్ నుండి సేకరించిన టపా. chitrakavitaprapancham.blogspot.com రమణరాజు గారికి ధన్యవాదాలు)
మాతృభాషలో విద్యాబోధనావశ్యకత :: ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము
పెద్దలు నరసింహరావుగారు మంచి విషయము ప్రస్తావించి తిరి . ఆ పాదుషా కున్నపాటి మాతృభాషాభిమానము
Deleteమన పండితుల కున్న , తెలుగు గ్రామ్యమని ఈసడింప
బడకుండెడిది . ధన్యవాదాలు .
అమ్మా అసలే వికారి నామ సంవత్సరం. కొంచెం దయ ఉంచండి. మీ పద్య గుళికలు మోతాదు తగ్గించండి.ఎండలకి పెజానీకం బుచికోయమ్మ బుచికి గా ఉన్నారు.
ReplyDelete
Deleteనామంబాయె వికారి సు
మా!మా తలకాయ లేల మరితినుట జిలే
బీ మాతా ! బుచికీలము
మేమమ్మా వదిలివేయి మెలగాడులమే :)
జిలేబి
ReplyDeleteతన్మాత్రల తత్వము, విడి
యన్ముని పద్యముల వీడి యావగ భళిరా
సిన్మా పాటల రాయగ
సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్!
జిలేబి
అందరికి శ్రీవికారి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDelete"జిలేబి" గారు, మీకొక ఛాలెంజ్ (ఈ రోజుల్లో ప్రతిదాన్నీ "ఛాలెంజ్" అనడం మామూలైపోయింది కదా) 🙂. మాగంటి వంశీమోహన్ గారు తన "జానుతెనుగు సొగసులు" బ్లాగ్ లో ఏప్రిల్ 5, 2019 నాడు పెట్టిన ఒక టపా ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
ReplyDelete"కుల, ప్రాంత నమూనాలు - పెయింటింగుల రూపంలో" https://janatenugu.blogspot.com/2019/04/18.html
ఈ టపాలో క్రింది వాక్యం చూడండి. అదే మీకు ఛాలెంజ్. ఎదుర్కోండి 👍. మీరు చెయ్యగలరు 🙂.
"మీలో ఎవరన్నా అరవం వచ్చినవాళ్ళుంటే - ఆ అరవంలో రాసున్నదానిని దాని పైన ఇంగ్లీషులో రాసున్నదానిని తర్జుమా చేయండి (Leave alone the obvious - like maratha, arab etc etc...)"
😎
Deleteఆంధ్రులు తెలివైన వారు :)
జిలేబి
ReplyDeleteఅంతా భ్రాంతి తెలుసుకొన
నెంతయు మేలగు భ్రమరుడ ! నెమ్మియె లేదీ
వింత జగత్తున విను పర
కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్!
జిలేబి
ReplyDeleteये नशीली जीवन ये अनिश्चय जीवन इक सप्ना है !
భ్రాంతియిదేను జీవితపు పాగడ కొన్నిదినమ్ములే గదా
వింతయిదేను కౌతుకము వీగును కొన్నిదినమ్ములందు పో
గంతయు రాకమానదు వికారపు పోకడ లేలనో యనై
కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో!
అనైకాంత - అనిశ్చయ
जिलेबी
ReplyDeletePity the boys who pray for jilebis :)
తంతుగ వెర్రి గాంచు భవతారిణి తానెయటంచు నమ్ముచున్
పంతము వీడడాతడు గభాల్మని ప్రేయసి!దేవి! యంచు ని
శ్చింతగ నమ్మి లాహిరిని చెంగట గాంచుచు వేగిరమ్ముగా
కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో!
जिलेबी
ReplyDeleteనారదా!
తంతానొరేయ్ మనుజుడా
గంతకు తగ్గట్టి బొంత గదపెన్మిటిగా
చెంతకు వచ్చునెటులరా
కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్?
జిలేబి
ReplyDeleteశాంతియు సౌఖ్యము గాంచును
కాంతను బెండ్లాడి, నరుఁడు, గాంచు నరకమున్
దొంతిగ తనపలుకులనే
సుంతయు మీరంగ నౌర చువ్వన రాజా!
జిలేబి
పంతాలెందుకు భామా !
ReplyDeleteకాంతను పెండ్లాడి నరుడు గాంచు , నరకమున్
సాంతము జయించి , మదన సు
ఖాంతామృతపాన తృప్తి , ఘనముగ బ్రతుకున్ .
ReplyDeleteబిరియానీ పులిహోరా
సరె! యీ రెండింటిలోన సారూ నచ్చిం
దరయగ తిన్నారాండీ
మరెప్పుడైన తెలుపండి మర్మంబరయన్ :)
జిలేబి
ReplyDeleteబిరియానిని మరి తినలే
ను! రుచియు నప్పదయ నేననుకొనెద వంటో
ళ్ళురవంత కారణముగా
సరిగా చేయని మనుజుల సంగటిగా సూ :)
జిలేబి
ReplyDeleteఅంతా రామమయముగా
వింతలు వాట్సప్పులోన విరివిగ సాగెన్
ముంతనెవరు దోచిరకో
కాంతా రమణీ జిలేబి కాయ్ రాణీ కాయ్ :)
జిలేబి
ReplyDeleteఅడగండి పత్రికను మీ
రడుగుచు కడగండివారి రచ్చను స్వామీ
చెడుగుడు లాడిరి గాదే
తొడుగుగ నజ్ఞాత యంచు తోయుచు పేరున్ :)
జిలేబి
ReplyDeleteఈవీ యెమ్మును టేంపరు
గావించి రనుచు నెపమ్ము గట్టిగ వేయం
గా వారెవ్వా బ్యాలె
ట్టే వాటికి బదులటంచు టెంకణ మిడిరే :)
జిలేబి
ReplyDeleteలోకేశుడిన్ ప్రముఖునిగ
మాకై చేయ నుపముఖ్య మంత్రిగ భళిరా
ప్రాకు నతడి ప్రాబల్యము
మేకై తా నిలబడునయ మేల్మిగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteమీ సామాన్యుడి కోరిక
నా సామీ తీరవలె యనగ భళి హస్తం
బే సహకరించ వలెనో
యీ! సాకారంబగునకొ యీ కల వైవీ :)
జిలేబి
జిలేబిగారి పద్యాల ఇన్‌స్పిరేషన్-తో రేషన్-గా రాజకీయాల్ని రేషనలైజ్ చేస్తూ ఓ తవిక -
Deleteసైకిలు-ఫానూ-కమలం-హస్తం
తేడా చూచుట చాదస్తం,
రాజకీయాల చరిత్ర సమస్తం
ఎంత తవ్వినా ఆస్తవ్యస్తం.
సార్ ,
DeleteYvR గారూ ,
రాష్ట్రమంతా డబ్బులు పంచడంలో పార్టీల కార్యకర్తలు
బిజీగా ఉన్నారు . ఇంతకు ముందైతే చాటుమాటుగా
ఉండేది . పోలీసు భయం ఉండేది . ఇప్పుడవేమీ
లేవండీ . పంచడం వారి బాధ్యత . తీసుకోవడం
మంది (వోటు)హక్కు . తెదేపా వాళ్ళకు వెసులు
బాటు ఎక్కువగానూ , వైసీపికి కూసింత తక్కువగానూ
నిధులు సమకూర్చుకున్నట్లు అనిపించింది . అంతా
బాహాటమే . పట్టపగలే ఇంటింటికీ రావడం , ఎలక్షన్ కమీషన్ పంచిన స్లిప్ చూపిస్తే , డబ్బులివ్వడం .
మీరన్నట్లు తేడా చూచుట చాదస్తం . ఎన్నికలచరిత్ర సమస్తం
ఎంత తవ్వినా ఆస్తవ్యస్తం.
మాస్టారు, ప్రభుత్వాలు సరిగా పనిచెయ్యకపోయినా ఒక దేశంగా ఇండియా బాగా వుందనే అర్ధంలో, "India is a functioning anarchy," అని పూర్వం John Kenneth Galbraith అనే అమెరికన్ రాయబారి అన్నాడట. ఇప్పుడు మీరు చెప్పిందాన్ని బట్టీ "Anarchy is functioning in India" అనాల్సిన రోజు కూడా వస్తుందేమో అనిపిస్తోంది.
DeleteAnarchy is ruling in India అనడం ఇంకా సరేమో YVR గారూ?
Deleteదేశం దారి తప్పిన “పరిస్థితి కనిపిస్తోంది” 🙁.
తెదేపా అభిమానులకి వైకాపా ఎక్కువ పంచినట్లు కనిపిస్తుంది. వైకాపా అభిమానులకి తెదేపా విరగబడి పంచేసినట్లు అనిపిస్తుంది.
Deleteనిజానికి అన్ని ప్రధాన పార్టీలు కొద్దో గొప్పో పంచుతున్నాయని వినికిడి. అయితే ప్రతిఒక్కరిచేతిలో డబ్బులు పెట్టేంత సత్తా, స్థాయి ఏ పార్టీకి లేదు. అందుకే ఎక్కువమంది ఓటేస్తే ఈ ప్రలోభాల ప్రభావం తగ్గించగలం.
VNR సర్! అంత వరకూ వెళ్తే ఎవరో మహానుభావుడో / భావురాలో రాకపోరులెండి🙏. ఇంకా ఎవరూ రాలేదు కనక ఆ పరిస్థితి రాలేదనే నమ్ముదాం.😊
Deleteసూర్య, మీరన్నది ప్రాక్టికల్-గానే వుంది. అందరి చేత వోట్లు వేయించడం, అదీ ఇష్యూ-బేస్డ్ గా వేయించడం ఎలా అనేదే పెద్ద సమస్య.
Delete>>ఎక్కువమంది ఓటేస్తే ఈ ప్రలోభాల ప్రభావం తగ్గించగలం.
DeleteHats off
ప్రతిఒక్కరిచేతిలో డబ్బులు పెట్టేంత సత్తా, స్థాయి ఏ పార్టీకి లేదు.
Deleteఆంధ్రాలో రెండు ప్రధాన పార్టీవారు పబ్లిక్ గా పగలే ఇళ్ళకెళ్ళి మరీ పంచారు.85 percent polling.
తెలంగాణాలో రైతు బంధు ఇచ్చారు. ఇక్కడ (తెలంగాణాలో)ఇంటినుండి కదలడానికి కూడా బద్దకించారు.ఆడో రకం ఈడోరకం.
ReplyDeleteప్రేయసి తో ప్రియుడు :)
బాహాటమ్ముగ నా యొడి
లో హాహాకారముల్ పొలోమని విలపిం
చే హొనరులు చూడంగన్
మోహన! రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా!
జిలేబి
ReplyDeleteఓ మిత్రుడి యేడ్పు అతని హితునితో :)
దేహమ్మును మరిపించును
మోహన రాగమ్ము ! ఖేదమును గూర్చుఁ గదా
స్నేహితుడా పెడబొబ్బలు
వాహిని గాయేడ్పులున్ను వనితలదౌరా:)
జిలేబి
ReplyDeleteఅంభస్సారము పుట్టెను
రంభా! శివ సంగమమున; రక్కసి పుట్టెన్
శంభళి చేరగ మనుజుని
హంభము సాయంసమయము హావడి చేయన్ !
జిలేబి
ReplyDeleteకంభము లాంటి పుత్రుడు సఖాకలిగెన్ వెనకయ్య గా సుమా
రంభయు శంభుఁడున్ గలియ; రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్
శంభళి చేరగా విటుని సాయపు వేళను కర్మ పక్వమై;
లంభనమైన వాక్యము భళావిరుపయ్యె జిలేబి ముక్కగాన్!
జిలేబి
ReplyDeleteఇదె! ఓట్లపండగ! జిలే
బి! దిగిరి బరిలో ప్రజలు! విభిన్నమగునుకో
కుదురనకో సరియగు ప్రభు
త? దారి గాంచునకొ భారతాంబ తనరగాన్ !
జిలేబి
అనంతపూర్ బెట్టింగ్ లో ఇద్దరు మృతి..
Deleteఏట్లో మునిగి చనిపోయేవాళ్ళని చూసాం. మరీ ఇలా బెట్టింగ్ లో మునిగి చనిపోవడమేంటో.
Delete
ReplyDeleteఈ కీర్తన లెల్లను బుచి
కీ కావయనాది ! రామ కీర్తన లవ్వీ
సాకారంబుగ జేసిన
శ్రీకరు డతడేను వ్రాసె చిత్రమ్ముగ రా !
జిలేబి
ReplyDeleteపెద్దలు బుద్ధిగ పద్యపు
మిద్దెలు కడుతుండగా సమీరా! కామిం
ట్లద్దరి బ్లాగ్లోకమ్మున
"దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?"
జిలేబి
ReplyDeleteకనకా! అనుష్క! ప్రియమణి!
మనల జనులు కొల్వ బ్రహ్మ మహిలో పుట్టిం
చెను సినిమా తారలుగా !
సినిమా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
జిలేబి
ReplyDeleteఅనుకోమాకిక బేల యంచు రమణీ ! యత్యద్భుతంబైనదీ
సినిమా లోకము రావె రావె లలనా! చెందామరల్కాంతిగా
కనకా! రాశి! అనూష్క! ప్రీతి! అమలా! కాజల్! సమంతా! త్రిషా!
సినిమా దేవత ప్రేమమూర్తిఁ ! గొలువన్ జేకూరు సత్సంపదల్!
జిలేబి
ReplyDeleteసవరణ తో
అనుకొన వలదిక బేలగ
పనిలేదనుచు నరుడ! భగవతి భార్గవి! భీ
మ! నగజ! సని!వింధ్యా వా
సిని, మా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
ReplyDeleteసని! సతి! సత్య! సినీ వా
లి! నగజ! శ్యామల! ధిషణ! చలిమలకొమిరె! కా
ళి!నికుంభిలా! శిఖరవా
సిని! మా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
జిలేబి
ReplyDeleteగనుడయ్య బయోపిక్కుగ
పనిలేకయు దర్శకులు గబగబాల్మనగా
మనమోడీజీది! భళా
సినిమా దేవత గొలువగ చేకూరు సిరుల్ !
జిలేబి
ReplyDeleteతెలియదు సర్దేశాయీ !
తెలియదు షెర్లాకు హోమ్సు! తెలియదు వాట్సన్
తెలిసినచో యేమి యొరుగు
జిలేబి నాకు ? పద! పోవె చీర్సుల రమణీ :)
జిలేబి
ReplyDeleteవెడలె నయినుస్టయిను గురు
డడడా యింటర్వునకు బడాయిగ తననే
నడిగారట శబ్ధపు దొం
దడియెంత? వలయున బుద్ధి దానికనెనటన్ !
జిలేబి
ReplyDeleteపాకాన పడిందండీ
మీ కవితా పటిమయున్ సుమీ సీతమ్మా !
శ్రీకామేశ్వర రావ
య్యే కనుల పడంగ మెచ్చి యిది భేషనిరే !
జిలేబి
ReplyDeleteసైకిలు ! ఫ్యానూ హస్తం
బా కమలము! బుర్ర తిరిగె వాటి అజెండా
బాకాల చూడగ జిలే
బీ! కానిది కాక నిన్ను విడుచునకొ సఖా :)
జిలేబి
పద్యాలతోనే ప్రచారం చెయ్యాలని ఈసీవాళ్ళు రూల్ పెడితే అసలు ఎన్నికల రణరంగం శాంతిస్తుందేమో !!
Delete
ReplyDeleteనా ధన్యవాదములివీ !
సాధన చేసితి గురువులు సజ్జనులు జిలే
బీ ధగడమియ్య గనరే
రాధనమున్ చేర్చగాను వ్రాయుచు సరసన్ !
జిలేబి
ReplyDeleteమీ పూరణ బాగున్నది !
కైపదముల పూర్తి చేయు కైపులు కూడన్
మీ పద్యముల్ జిలేబీ
బాపురె యుర్రూతలే సభాసదులకహో :)
జిలేబి
మీ పూరణ బాగున్నది
ReplyDeleteమీ పూరణ యద్భుతమ్ము మీరో సూపర్
మీ పూరణ కడు ప్రశస్థ
మో పూబోణీ జిలేబి యోహోహోహో .
Deleteలక్కాకుల కవి రాయా!
వక్కాకులు సున్నమున్ ప్రవాహము గాంచెన్
చక్కగ కంద జిలేబియు
మిక్కుటముగ సంతసించె మేస్టారయ్యా! :)
జిలేబి
గొంటొక్కలు మంట సుమా
Deleteపంటికి మలబడవు మరియు పండాకులు మీ
యొంటికి పడునా సున్నపు
తంటా లేలా జిలేబి తమరికి , వొదిలెయ్ .
ReplyDeleteఏల చెమటలు గ్రక్కున దేల మండు
వేసవిని? మిక్కిలిగఁ జలి వేయుటేల
శీతకాలములో "బిలేజీ"యనంగ
ప్రకృతి మాయనరయ మన వల్ల కాదు!
జిలేబి
ReplyDeleteఎన్నిక ల ప్రాంగణమ్మున
మన్నిక గా పద్యపు నియమావళి చేయన్
వన్నియలుదీరు దేశం
బన్నన్నా కొల్వు చేరి పద్యంబరయన్
జిలేబి
వహవ్వా!వహవ్వా!👏👏👏
Deleteఅప్పుడింక మీరే ఛీీఫ్ ఎలక్షన్ కమిషనర్ జిలేబిగారూ 🤗
Deleteఆదామ్ ! :)
జిలేబి
మధ్యలో "ఆదామ్" ఎక్కడ నుండొచ్చాడు?
Deleteలేక "ఆదాబ్" అని మీ కవిహృదయమా?
ReplyDeleteనేనే బ్రహ్మ! సరస్వతి
నేనే ముక్తిని మరణము నేనే శివుడిన్
నేనే శక్తియు నేనే
నేనే విష్ణువు సనాతనియునేనౌరా!
జిలేబి
మేమే ఆదామవ్వయు
Deleteమేమే సైతానులమును మేమే గాడెస్
మేమే మేమే అన్నియు
హేమా హేమీలు మేమె ఎఱుక కలిగెనా ?
ReplyDeleteఅదిగో దేఖో చంద్రుడు
అది నీదేను వ్యవసాయ మచ్చట చేయన్
సుదినము త్వరలో కలదోయ్
పదరా కాంగ్రేసుకే టపాల్మని ఓటేయ్ :)
జిలేబి
ReplyDeleteవేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమిచిత్రమో?
మా సిరి కందివర్యులు,సమాశ్రిత సజ్జనులెల్ల పద్యముల్
కోసుల కొద్ది వ్రాయుచు ప్రకోపపు లాహిరి లోన సాగుచున్
దోసిలిపట్టి ధారగను తోయముతో చలిగాడ్పు చేర్చగాన్!
జిలేబి
ReplyDeleteబుచికీ గారూ! నిజమే!
రచనా సౌందర్యమసలు రవ్వంతయు లే
దు! చ! పిచ్చిపాటలు సుమా
కిచకిచ లాడె సినిమాల కీసర బాసై :)
జిలేబి
ReplyDeleteవాత్సాపు ఫేసు బుక్కూ
వత్సా డౌనాయెనయ్య వారెవ్వా ఆ
వాత్సల్యపు నిన్స్టా గ్రామ్
తత్సత్ బ్రహ్మార్పణంబు తరుణి జిలేబీ
జిలేబి
ReplyDeleteఅదిగో ట్విట్టరు కళకళ
సదనంబున జోరుగాంచె సహచరు లరరే
వదనమ్ము చాటు చేయగ
కదిలెన్ హ్యాష్టాగు లివ్వు గాంచి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteతందాన తానా :)
తానా అంటే తందా
నానా యను గురువులనగ! నాబత్తులికన్
చానా గిట్టు జిలేబీ
శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై!
జిలేబి
ReplyDeleteమీనాక్షీ! వినుమమ్మ వ్యాసుడగుచున్ మించారు రీతిన్ భళా
యేనాడైనను నిల్చు కావ్యముగ సాయింపన్ సఖీ దీటుగా
శ్రీనాథుండు రచించె భారతము; మా శ్రీనాథుఁ డౌరా యనన్
పానారమ్మును నోటబట్టి పలుకుల్ పారించి కట్టెన్ కథల్!
జిలేబి
ReplyDeleteసరసంపు ముదిత కాంగ్రెసు!
పరువంపు మగసిరి నాది! పండిన హస్త
మ్ము! రసికుడనేను విడువని
వరుఁడను! నా కేల వధువు వల దనె నతఁడున్!
ReplyDeleteఅలలవలె సాగు కవితల
నలవోకగ వ్రాయన యతనము చేయుచు తా
నిలలోని విషయములను స
కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.!
జిలేబి
ReplyDeleteసతతము నేనెలుగెత్తుచు
నతిగా రేయింబవలు సనాతనుడిని నే
వెతుకుచు వేసారితి! మర
చితి, లోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్!
జిలేబి
ReplyDeleteమతమేదైనను మానవత్వమొకటే! మత్తైన భావాలతో
సతతంబీ భువిలోన మందమతులై సైతానులైబోవనే
ల? తగాదాలిక యేల? కొట్టుకొని పాలార్చన్, విమర్దింపగాన్,
చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్?
జిలేబి
బాగా చెప్పారు. మరి ఈ క్రింది విడియో చూసి ఆనందించండి.
Deleteఅనంతపురం జిల్లా పెనుగొండలోనున్న కియా మోటార్స్ మూలంగా ఆఊళ్ళో వెలిసిన కొరియన్ రెస్టారెంట్స్ లో భారతీయులకు ప్రవేశం లేదట. Shades of British practices in colonial India?? కార్పొరేట్ బావుటా క్రింది వెలుస్తున్న నియో-కలోనియలిజం??
(నేనంటున్నది రెస్టారెంట్ల గురించి గానీ గెస్ట్-హౌస్ ల గురించి కాదు)
విదేశీ కంపెనీలున్న ఇతర చిన్న ఊళ్ళల్లో కూడా రేపు ఇదే అవమానమా?
అనంతపురంలో కొరియన్ల జాతి వివక్షతా??
DeleteWhat a shameless Indian administrative service !
రెస్టారెంట్ కి డ్రెస్ కోడ్ ఉండొచ్చేమో కాని జాతివివక్ష ఉండకూడదు. అయినా కొరియాలో మనవాళ్ళు రెస్టారెంట్లలో తినట్లేదా ఏమిటి?
Delete
ReplyDeleteస్థితియతడే! లయకారకు
డతడే! ఈశుడతడే! వడకుమల జడధా
రి, త్రిధాముడతండేను! వి
చితిలో బరమేశు డిచ్చు జిరసౌఖ్యంబుల్!
విచితి - అన్వేషణ
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారికి :)
గతిలేక ఖర్గపూరున
హితమగు భుక్తికి వెతుకుచు హేరాలముగా
మెతకుల కై రగిలింపగ
చితి లోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్!
జిలేబి
G P Sastry (gps1943@yahoo.com)ఏప్రిల్ 16, 2019 12:45 PM
Deleteఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పితరున్ జేర్చెడి నెన్నికల్ చితులహో! భీభత్సమున్ జేసెనే
స్తుతమౌ ఫెడ్రలు ఫ్రంటు జేరుచును భల్ స్త్రోత్రమ్ముజేయండహో!
గతుకుల్ దాటుచు మోడివర్యునినటన్ కాల్పించి మోదమ్మిడున్
చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్
చంద్రకళావతంసుడు = kcr
Deleteవిడువను నే చంద్రుని నే
విడువను వాడి కొమరుని "కవితలల్లెద" నే
విడువక ననుదినము జిలే
బి డమ డమా వృత్తముల సభికులు ముదముగాన్ :)
జిలేబి
ReplyDeleteరెస్టారెంట్లకు ఓకే
మాస్టారూ డ్రెస్సుకోడు! మన్నింపగ రా
దీ స్టుపిడిటి, జాతి వివ
క్షా! స్టాప్చేయదగునా దుకాణము చేష్టల్!
జిలేబి
ReplyDeleteప్రాఙ్నగమన తొలిదెస మల!
ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్
వాఙ్నియమముకాదు సుమీ,
ప్రాఙ్నగ మున దాగినట్టి బ్లాగు జిలేబీ !
జిలేబి
ReplyDeleteకూసింతసేపు కూర్చోం
డీ! సారీ సీరియల్ వడి! మనసు మమతా
ఈ సమయములో వస్తోం
దీ సక్కగ పోవలెన్ వదిన సూడ సుమీ :)
జిలేబి
బెంగాల్ అధినేత దీదీ మమతా బెనర్జీ గారి మీద సీరియల్ వస్తుందా, కొత్త విషయం తెలిసింది!
Delete
ReplyDeleteపండగ సేస్కో అంటే
వండగ వంట చవిచూచి వరుసగ చెప్పన్
గుండమ్మా యిక కొరతల
దండకముగ సూవె లేమ దబ్బున నేర్వన్!
జిలేబి
ReplyDeleteగమనిక! రాముని విషయ
మ్ము మాత్ర మే చర్చచేయ మోదము మాక
మ్మ!మరియి తరమ్ములు తగదు
సుమా! జిలేబి వినవమ్మ సూచనలివియే :)
జిలేబి
ReplyDeleteబెంగాలధినేత పయిన
చెంగా! సీరియలు కలద! సెహభేషు సుమా!
రంగుల బుల్లి తెరనికన్
చెంగట కూర్చొని గవనము చేర్తున్ చూడన్ :)
జిలేబి
ReplyDeleteఅసలా మొగుడిని పస్తుగ
ప్రసాదపు సమయము దాక పడివేయదగున్
దెసతెలియని పెన్మిటి భళి
పసందుగ కలదనుచు విడువక తినునింకన్
జిలేబి
ReplyDeleteఆ దిక్కుమాలిన లఫం
గా దండగ సీరియళ్ళ గానన్ మీయిం
ట్లో దాని వసతి చేయగ
రాదా నీహారికా కరంటు కలదుగా :)
జిలేబి
ReplyDeleteచెంగావి రంగు చీరను
బంగారు జిలేబి కట్టి పడవేయన్ తా
రంగస్థలమ్మున పతిని
బింగో బింగొయని నోడె ప్రీతిగ నతడే :)
జిలేబి
ReplyDeleteఅల్లోపతిమందును నే
నల్లా వాడంగ తగ్గె నమ్మా జబ్బే !
పుల్లాయి హోమియోపతి
సల్లంగానట్లు జ్వరము సరిజేయునకో :)
జిలేబి
ReplyDeleteగిఫ్టుల నందింపంగా
సాఫ్టవుతారిక జనుల్ బసంతీ వినవే
త్రిఫ్టదియేను జిలేబీ
ఫిఫ్టీ పర్సెంటు నీకు పిమ్మట వచ్చున్ :)
జిలేబి
ReplyDeleteబీయెస్సెన్నెల్కరె యే
మాయెన్ ? బ్యూరోక్రసీ సుమా కారణమౌ!
మా యందరి బాధ్యతగా
సాయపు సేవలను మరిచి సర్కారవగాన్!
జిలేబి
ReplyDeleteతిందామంటే దొరకదు
వందన మన్నను దొరకని బతుకాయెనుగా !
ముందో మసాల దోసెను
చందమ్ముగ వేసి తెండ్రి చకచక రమణీ :)
జిలేబి
ReplyDeleteవంట కళాత్మక మైనది!
ఘంటాపథమున పలికెద గరిట మహత్తున్
డంటక డంటక యనగా
తంటా యేమంటె నాకు వంట తెలియదే :)
జిలేబి
ReplyDeleteఒక సంస్థ సుదీర్ఘపు కథ!
సకలము తానై నిలిచె వసతిగ జిలేబీ
టకటక హైటెక్కును చే
ర్చక, వైటెలిఫెంటుగా నరరె కూలె సుమా!
జిలేబి
ReplyDeleteఏముందీ బూడిదయే
ఈ మూసకు, బహుమతియకొ, యీతవికకు హూ !
ఏమోయి వ్రాయి చూద్దా
రీ మచ్చుకు కవితయొకటి రివ్వున నిపుడే :)
జిలేబి
ReplyDeleteకవయిత్రిగారు రాసిన
ది వనము లన్గూర్చి గాద! దిగులేలనయా
కవనములాస్వాదింపద
గు! వాహరిపువువలె గుర్రు గుర్రులవేలా :)
జిలేబి
ReplyDeleteఈ మాటలోన వ్రాయం
గీ మాటలకు వెల కొంత గిట్టేదయ్యా
సోమరుల బ్లాగు లోకము
లో మా వెల, వెలవెలా! చలో నరసన్నా :)
జిలేబి
ReplyDeleteఏడడుగు లేసి బొటబొట
యేడవ కండీ జిలేబి యేడని నరులా
రా! డాబుసరి వలదయా
దాడీ పెంచుకొనవలదు దారిద్ర్యముగా :)
జిలేబి
ReplyDeleteఅరె!మూర్ఖత్వము వృద్ధి గాన తృటిలో నావేశముల్ హెచ్చుగా
నరిషడ్వర్గ మొసంగ, శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా
పరమాప్తుండతడే జిలేబి మనకైవారమ్ము స్తోత్రమ్ములన్
వరదా కావుమటంచు వేడ మనలన్ ప్రత్యంతమై గాచునే!
జిలేబి
ReplyDeleteవేలి పైన చుక్క వేసితి నోటును
కాలి పైపడునకొ కత్తి వేటు ?
చాల మంది వచ్చి చక్కంగ పోయిరి
బాల ! మార్పు చెందు భారతమ్ము ?
జిలేబి
ReplyDeleteఆ నడుము పైన మచ్చ వ
రానన అలిగెను నలిగెను రవ్వంత సుమా
మీనాక్షి! జిలేబీ విన
వే నా మాటల వినంగ వేగిర రావే :)
జిలేబి
ReplyDeleteశివుని,చలిమలకుమార్తెను,
సువర్ణవర్ణుని, సిరిని వసుంధరను, జిలే
బి! వృకోదరుని, భళి కమల
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా!
జిలేబి
ReplyDeleteఆవకాయ పోయె నౌర వెల్లుల్లియె
కాస్త పుంజుకొనెను కతని చూడ
విసివి కొనెడు కైపు విశ్వస్త వేంచేసె
విశ్వదాభి రమణి విను జిలేబి :)
జిలేబి
ReplyDeleteరంగములో విశ్వస్తయె
చెంగున దుమికెను జిలేబి చేవయు గూడన్
రంగస్థలమున నాయిక
భంగిమలన్ కేళికలిక ప్రచురత గనునో :)
జిలేబి
"మిత్రులందరికీ ..... గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు" అని వాట్సప్ లో తిరుగుతున్న గ్రీటింగొకటి (ఈ క్రింది లింక్ లో చూడచ్చు) నాకు ఫార్వార్డ్ చేస్తూ నా మిత్రుడు "ఈ రకమైన సందేశాలను ఏమనాలో తెలియటం లేదు" అని విచారం వ్యక్తం చేశాడు (నా మిత్రుడు హిందువే). ఏసుక్రీస్తు శిలువపైనుండి అన్న ఆఖరి మాటలు "Father forgive them, for they know not what they do" అనుకోవడమే మనం కూడా చెయ్యగలిగిన పని అని జవాబిచ్చాను.
ReplyDeleteవ్యాపార సంస్కృతి కమ్మేసిన ఈ తరం వారికి ... ప్రతిదీ ఒక ఈవెంటే, గ్రీటింగులు చెప్పేసుకోవడమే, డాన్సులు చేసెయ్యడమే, సెలెబ్రేట్ చేసేసుకోవడమే ... మాత్రమే తెలుసునేమో అనిపిస్తుంది. గ్రీటింగులు చెప్పేసుకుంటున్న ఆ సందర్భం ప్రాముఖ్యత గురించి అవగాహన లేదు, తెలుసుకుందామనే కుతూహలం లేదు. అసందర్భంగా కూడా గ్రీటింగులే. కొన్నేళ్ళ క్రితం ఒక టీవీ ఛానెల్లో ఆ ఏంకరిణి ఈ చెవి నుండి ఆ చెవి దాకా నవ్వుతూ హాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పింది. దాని మీద క్రైస్తవులు అభ్యంతరం తెలిపారని గుర్తు. తరువాత తగ్గిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇ-గ్రీటింగ్ కార్డులదీ అదే ధోరణి. Father ............
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు (ట) 😳
విడిపోయిన దంపతులకు కళ్యాణం జరిపించుకుంటున్నాం కదండీ...అలానే గుడ్ ఫ్రైడే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పాపుల కోసం విడిపోవడమూ, చనిపోవడమూ ఒక్కటే !
ReplyDeleteసారూప్యాలు తీసుకురావడంలో మీకు మీరే సాటండి . అయినా మీరు అయోధ్య అభిమాని కదా, మరి ఇలా అంటారేమిటి?
Delete
Deleteఅంతే మరి.. వారికదే వరమైనది🙏
🐯అయితే మీకు నీహారిక గురించి తెలిసింది చాలా తక్కువ అన్నమాట !
Deleteమరే, అయినా అంత “వీజీ” కూడా కాదుగా ।
Delete
ReplyDeleteనేనే రాజుని మంత్రిని
నేనే! సైనికుడయినను నేనే చీఫై
నా నేనే! చౌకీదా
రైనా మానసపు చోరుడైనను నేనే :)
జిలేబి
ReplyDeleteఏ రోజైతే శుభ్రత
తో రాణించు చిరుతిండ్లు ధూళియు లేకన్
భారతదేశములో నపు
డేరా స్వచ్ఛత మనకపుడే వెలుగౌరా !
జిలేబి
"స్వచ్ఛభారత్" 👇??
Delete19-04-2019 నాటి Deccan Chronicle (Hyd) main paper page-4 లో Civic Blues అనే కాప్షన్ తో వచ్చిన ఫొటో 👇. ఆనందిద్దామా?
స్వచ్ఛత??
ReplyDeleteజేగురు పాడొంకాయల
హో! గుత్తొంకాయలివ్వి ఓరబ్బబ్బో!
జైగురు కష్టేఫలి బో
లో! గున గునరావె రా కిలోయైన కొనన్ :)
జిలేబి
ReplyDeleteఅన్నుల మిన్నగ లచ్చియు
మిన్నగ పంటలను కూర్చు మేదిని వలయున్
మన్నిక గాచెప్పెదెనయ
చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్!
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteవిను! కన్నయ నన్నువిడిచి
చనలేదే క్షణమయినను ! చల్లని కాజే
సెనొకో ? వినలేను సుమీ
చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?
జిలేబి
ReplyDeleteమునిమాపువేళ సంపం
గి నవ్విన సమయములో రగిలిన సెగలతో
చిన దాని పైన నరరే
చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్!
జిలేబి
ReplyDeleteఅనఘా! తాకంగనె వి
ల్లును భళ్ళున విరిగెనట పలురకములుగ! నీ
శునిమాయ? నయోధ్యాపురి
చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?
జిలేబి
భలే వ్యాసం అండీ 😀 👇
ReplyDelete=============
ఇవాళ్టి Deccan Chronicle (Hyd) ఆంగ్ల దినపత్రికలోని Hyderabad Chronicle supplement page-2 "City Life" పేజ్ లో "Heights of Hypocrisy" అని ఒక చిన్న వ్యాసం వచ్చింది. ఒక DC Correspondent గారు వ్రాశారట (వారి పేరు వ్రాయలేదు). ఆసక్తి గలవారు ఈ క్రింది లింక్ చూడండి 👇.
సారాంశం ఏమిటయ్యా అంటే ... ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా వారి ప్రచ్ఛన్న ప్రత్యర్థులు కొందరు - మోదీ, జగన్, కెటీఆర్, రామ్ గోపాల్ వర్మ - చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారట. ఈ కరస్పాండెంట్ గారి దృష్టిలో అది ఆ నలుగురి hypocrisy ట.
నామటుకు నాకు ఈ వ్యాసం హాస్యాస్పదంగా ఉంది. పరస్పరం ఎంత దుమ్మెత్తిపోసుకుంటున్నా కూడా ఎదుటి మనిషికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఒక మర్యాద, సంస్కారం. దాంట్లో ఈ కరస్పాండెంట్ గారికి హిపోక్రసీ కనిపించడం వారి విజ్ఞత అనుకోవాలా?
అసలు ఇటువంటి వ్యాసాన్ని ప్రచురించడానికి ఎడిటర్ గారెలా ఆమోదించారో? ఏమైనా దురదృష్టకరం.
చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొందరిది "Heights of Hypocrisy" ట 😳
ఆ రాసిన వ్యక్తి ఇంతకుముందు గోదావరి ఒడ్డున గొబ్బెమ్మలమ్ముకునే వృత్తి వెలగబెట్టి ఉండొచ్చు. ఊరికే వస్తాయా దరిద్రగొట్టు ఆలోచనలు!
Deleteబాగా చెప్పారు.
Delete
ReplyDeleteఅనఘా! కన్నడు వీడలేదు క్షణమైనానన్ను !బొంకేలనో
చినవాఁడే యొనరించెనా యిటుల? ఛీఛీ! పెక్కు దుష్కృత్యముల్
పనిలేకన్ పసి వాని దంచు పలుకుల్ పల్కంగ నాస్వాంతమా
యెనొకో? ముద్దుల గోప బాలుడితడాయెన్వెన్నదొంగాయెనో?
జిలేబి
ReplyDeleteనా మాటకాదండీ ; ఆర్జీవీ మాట
అనితర సాధ్యముగా తెలు
గు నాట పార్టీని బెట్టి గుప్పిట రాష్ట్రం
బునునిల్ప, కూఁతుమగఁడా
చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్ !
జిలేబి
ReplyDeleteకన్నడి వలలో పడటానికి కారణమతడా నా మదియా !
గోపెమ్మలార చెప్పండి !
అనుమానమేను! నా చ
ల్లను కొల్లయు గొట్టి మీదు లసితముఖుండై
మనసునుదోచుచు చిలుకుచు
చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?
జిలేబి
ReplyDeleteమనువాడి ముచ్చటలు తీ
రి నిండు మూణ్ణెల్లు కాలె! రివ్వున వేవి
ళ్ళననేమందును మదిదో
చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్?
జిలేబి
ReplyDeleteగోదారొడ్డున నమ్మే
డా దారెంబడిని తా పిడకల జిలేబీ
లేదా గొబ్బెమ్మలకు బి
రాదరిగా నిల్చినాడ రాస్కెల్ వీడూ ?
జిలేబి
ReplyDeleteఅరుణాచలేశ్వర శివ య
నరాద! సత్వరముగాను నరుడా మోక్షం
బరయ నతనిలోన మునిగి
వరముగ నతడిని బడయగ వారధి గానన్ !
జిలేబి
ReplyDeleteపేరును గాంచు జిలేబీ
"నారాయణ" యనినవాఁడు; నవ్వుల పాలౌ
"నారా" యనయనిన సుమా
హేరాళముగనెలుగెత్తు యిందీవరుడిన్
జిలేబి
ReplyDeleteషేరింగు మహోత్సవముగ
బోరింగగు వేళలోన పొంతన లేకన్
కోరిందల్లా షేర్ చే
సే రభసలయాత్ర !ఘోష సెహబేషు సుమీ :)
జిలేబి
ReplyDeleteఅందము మాండలికమయా!
చందము వచనకవితలు పసందైనవి! మా
డెందంబందాడెడు మా
కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ!
నారాయణా!
జిలేబి
ReplyDeleteఎందుల కీ యతుల్! సుజన! యెందుల కయ్యరొ ప్రాసగీసలున్
చందము లెందుకయ్యరొ ప్రజాళికి కొంతయు బుద్ధికెక్కదే!
డెందము చక్క గాన గనుడీ వచనమ్ములు మేలు సూవె! మా
కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా!
నారదా!
జిలేబి
ReplyDeleteడెందంబాక్రోశింపగ
చందము గిందముల చేర్చి చంపుదరొకొ ? మా
కెందులకయ్య జిలేబులు?
కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ!
జిలేబి
ReplyDeleteఅందంబైనది కందము!
మందిర మరువదియు నాల్గు మాత్రలకదియే!
సందియములేక చెప్పెద,
కందమ్మునఁ బ్రాస, "వలదు గద" యప్పకవీ!
వలదు గద - ఆధిక్యమైన గద - బడిత
జిలేబి
ReplyDeleteవందనమిదియే కవివరు
లందరికి నమో! నమో! యెలమితోడుగ నా
చందములనేర్పిరే! మా
కందమ్మునఁ బ్రాస వలదు గద యప్ప! కవీ!
జిలేబి
ReplyDeleteపుల్కా కోర జిలేబిన్
కల్కత్తాకాళివలె ముఖమ్మును దాల్చెన్
మిల్కాసింగై పరుగిడి
నుల్కగ మారి యెగిరితి వినూత్నముగ వెసన్
జిలేబి
ReplyDeleteజాల్రా జిలేబి
అందము గాంచు చక్కని ప్రయాసల కోర్చుచు నేర్పుతోడుగాన్
కందమునందుఁ బ్రాస నిడఁగన్; వల దప్పకవీ యెఱుంగుమా
సందియ మేల నయ్య నుప జాతుల ప్రాసలు! నేర్పుగాన ప్ర
స్కందము! నేర్వు చందమును కందివరార్యుల చెంత చేరుచున్!
జిలేబి
ReplyDeleteట్విట్టరు లోకెంటరయితి
గట్టిగ తగిలెనయ షాకు కాకుల గోలే
చట్టని రాలే బయటకు
గుట్టుగ జరిపేస్తను కత గుడుగుడు గుంచెమ్ :)
జిలేబి
ReplyDeleteఎన్నికల వేడి లోన
న్నన్నా దొంగయని చెబ్తి నన్నా నొగ్గే
యన్నా!చెవులట్టుకొనెద
నన్నా నామాట కేడ నా విలువుందీ :)
జిలేబి
ReplyDeleteతోబా తోబా అంటూ
బీబీ నీవే జిలేబి వీయని యనుచున్
కాబూలీవాలా మా
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్!
జిలేబి
ReplyDeleteసుతరాము పడదు వెల్లు
ల్లి తమస్సును చేర్చునది! కలియబెట్టునయా
పతనమగు మానసము కూ
డ! తరళమును ద్రోలు! మా కెడవలదు వలదోయ్ :)
జిలేబి
ReplyDeleteపడదా వెల్లుల్లేనూ ?
అడడా! కష్టమ్ము సూవె! ఔరా! తెలుగో
డ! డపట్! వెల్లుల్లివలయు
హడలెత్తించకయ జనుల హద్దరిబన్నా :)
ReplyDeleteఅదిగో స్విట్జరు లాండున
కదిగది గో జగనుడేగె కాస్త రిలాక్సై
పది దినముల్ గడుపంగన్
తుదకు తిరిగి వచ్చునంట దువ్వాడంగన్ :)
జిలేబి
ReplyDeleteనువ్వుల నూనెను వాడుదు
రవ్వవ్వా నావకాయ రంజుగ తేలన్
రవ్వలనెక్లెసు రమణీ
చువ్వన గాశెనగనూనె స్టోరీయేంటో :)
జిలేబి
జిలేబిగారికి సరదాగా, ఒక ఛందస్-ఫ్రీ పద్యం -
Deleteలవ్వాడిన అయ్యర్సార్!! బ్లా
గ/గ్గువ్వకు మనసాయెను
రవ్వలపైనిదేమి వింత? హ
వ్వవ్వా!!నెక్లెసొకటి కొనితెండయ్యా!!
😀
Deleteఛందస్ఫ్రీపద్యమిదే
వందారుడ పేర్చినాను వామ్మొ జిలేబీ
కుందనపు బొమ్మ! యిది గో
చెందామర నెక్లెసిద్ది చెంగట నీకై :)
జిలేబి
అదేంటండీ రవ్వల నెక్లెస్‌ని తామరపూలదండ చేసేశారేం? అయ్యరుగారు"వందారు జనవత్సలాయైనమః,"అనేశారా😜?
DeleteYVR ఛందస్ ఫ్రీ పద్యానికి ఛందోబధ్ధత .....
Deleteలవ్వాడిన అయ్యరు ! బ్లా
గవ్వకు మనసాయె నేమొ కడు రవ్వలపై ,
రవ్వల నెక్ లే సొక్కటి
చివ్వున కొనితెండు మోము చిరు నవ్వొలుకున్ .
Deleteఛందోబద్ధత యిదిగో
మూందూ వెనుక సిజరింగు ముద్దుగ చేయన్
కందంబు పారె వైవీ
వందారనుడి గురువులకు బంగరు కొండా :)
జిలేబి
Y(?)ఛందస్సను YVR మాటలు
DeleteLove ఛందస్సను LVR నోట పద్యములయ్యెన్
నెనరులు మాస్టారు 🙏
ఛందోబద్ధత ఇచ్చిన మాస్టారికి 🙏లు
Deleteబంగరుకొండా అన్న మా స్టార్‌కి (జిలేబిగారికి) 🙏లు
Deleteవై ఛందస్సన్నా! వై
వీ ఛందస్ సింపులయ్య ! విస్తారముగా
మై ఛాయ్స్ కందంబగున
య్యా;ఛంగ్లీపట్టు! నేర్పి యస్ అని పిస్తా :)
జిలేబి
ReplyDeleteఏదండీ వాడాలే!
ఆదరణీయా! మహోదయా తెలుపుడయా
మోదంబైనది, సరియే
దో!దారితెలుపుడయా సుదూరపు రమణా !
జిలేబి
// " నాటి సుబ్రహ్మణ్య మూర్తి యే కదా కొండ పై ని నేటి వెంకన్న ? " //
ReplyDelete(వేరే బ్లాగ్ లో మీ కామెంట్)
-------------------------
ఇది యేమి స్ధలపురాణం, "జిలేబి" గారూ?
Deleteహాశ్చర్యం ! విన్నకోట వారీ ప్రశ్న అడగటం !
జిలేబి
ముందు నా సందేహం తీర్చండి, ఆ తరువాత "హాశ్చర్య" పడుదురు గాని.
Deleteఇది యేమి స్ధలపురాణం, "జిలేబి" గారూ?
DeleteMe too....
ReplyDeleteవడగళ్ళవాన చిత్రము!
గడగడలాడించె జనుల కలికాలమిదే!
పడగొట్టగ ప్రకృతిని మను
జుడు తన వంతుగ విభుడు రుజువయె జిలేబీ
జిలేబి
ReplyDeleteఉల్లి?మరీనూ! ఆవిడ
లొల్లి యదేలమనకిక ! బులుసు సారూ ! వె
ల్లుల్లి తినువారు తక్కువ
మల్లే అనిపించెనయ్య మాకు నిజముగాన్
జిలేబి
మీరు పద్యాలతో కొట్టినా సరే వెల్లుల్లికే జై కొడతాం. ...... మహా
Delete
Deleteవేదపు కాలము నాటిది
సాదరముగ చెప్పెద నరసన్నా వినుడీ
ఆదరణ గాంచె నుల్లి ని
నాదము గా లొల్లి చేసి నరులే కొలువన్ :)
జిలేబి
Deleteమీరండీ పద్యంబుల
తో రౌడీయిజము చేయ తోబా అనమం
డీ! రైటుగ వెల్లుల్లి స
దా రక్షౌ! నొక్కి చెప్పెదమ్ము జిలేబీ :)
జిలేబి
Deleteవెల్లుల్లి లేని కారము
కంద జిలేబీవంటి భామామణియున్
అయ్యరు వంటి దైవము
బ్లాగ్లోకపు వైరి వంటి రాణియు గలరే !
శభాష్ 👌
Delete
DeleteQualified to enter Sankarabharanam :(
జిలేబి
DeleteMeets perfectly Kanda meter :)
Shukriyaa...shukriyaa !
Delete
ReplyDeleteఅస్సామ్లో ఉన్నప్పుడు
మిస్సవకన్ ఆవనూనె మించారగ మే
ధస్సుకు కలిపి అచారున్
తస్సా దియ్యా రుచిగ కతల రాసితిమీ :)
జిలేబి
ReplyDeleteఅక్కోయ్! నన్జూడంగన్
ఫక్కున నవ్వకు సుమా సభనికవులే! లా
జిక్కేమి లేక యనరే !
కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే!
జిలేబి
ReplyDeleteటక్కుటమారి విద్యల తటాల్మని బాపనకుక్క నచ్చటన్
కొక్కుగ మార్చి కొమ్ములను కూర్చి వినోదము గావెసన్ భళా
కుక్కగ మార్చి మాంత్రికుడు కుర్రన, నోటిని వెళ్ళబెట్టుచున్
కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై!
జిలేబి
హమ్మయ్య!
ReplyDeleteకుక్కగొడుగులన్ చూసిరి
మక్కువ గా తీసుకొనిరి! మవ్వంపనుచున్
చెక్కుచు కందంబొక్కటి
కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే!
జిలేబి
ReplyDeleteఅంత పురాతన మూర్తిగ
వింతగ నన్ను నిలబెట్టి వెంగడమనిరే !
కొంతయు లేదే జాలి ర
వంతయు లేదు కనికరము వనితారమణీ :)
జిలేబి
ReplyDeleteకొత్త రుచుల వెనుకబడే
సత్తా లేదు! ఉబలాట, సంగడి లేదే!
కొత్తావకాయ పిరిమిని
మొత్తమసలుకే జిలేబి మోసమగునకో !
జిలేబి
చెయ్యి మార్చచ్చు. :)
ReplyDelete
ReplyDeleteపేరును మరి చెప్పుటకే
నౌరా నామోషి యయ్యె నా ఓటు సమా
చార మనానిమసూ నీ
కౌరౌరా యేలరా ! ముఖము దాచుకు పో :)
జిలేబి
ReplyDeleteఅనుమానమేల నయ్యా
గినాయె! కష్టేఫలిని! జిగిని చూడంగన్
మన బామ్మ జిలేబీదే
యనిపిస్తోందయ్యరో సయాటగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteలొల్లియె లేని జిలేబీ
వెల్లుల్లియె నరసరాయ వెనువెంట పడన్
తల్లియె గూర్చని మంచిని
చల్లగ చేగూర్చు నదియె చక్కగ మీకున్ !
జిలేబి
ReplyDeleteఆవకాయల కోరితెచ్చిరి బ్లాగువీరులు జోరుగా
ఆవనూనెల శెన్గనూనెల నానబెట్టగ చూచిరే
చేవగల్గిన ముద్దుగుమ్మవు చేరుచున్ దరి వ్యాఖ్యగా
నీ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా!
Bridging the gap :)
జిలేబి
ReplyDeleteఓ యబ్బో యేమి టెక్కో :)
మా సీమచిగురు నరస
న్నా సిత్రము చేవ గల్గి నాణ్యత తోడై
వాసిని గాంచెను మొక్కై
రోసములకు పేరుగాంచె రోడ్డున పడెనే :)
జిలేబి
ReplyDeleteనా సొమ్ములు పోనాయండీ :)
నా కామెంట్లేడా పో
యే! కాస్తా చెప్పుడయ్య! యేమండీ వై
వీ కామింట్లేడ! జిలే
బీ కావించెనయ వర్డు ప్రెస్సే రాయా :)
జిలేబి
ReplyDeleteకవితే అంటా వీవూ
తవికే నంటాను నేను తస్సాదియ్యా
ప్లవమును! హైకూ అంటే
నవ! పైకూ అనెదను కవనము, పనిలేకన్ :)
జిలేబి
ReplyDeleteమీ యక్షరాలు కరువై
ఓయమ్మో పద్మ మాకు పోయెన్ మతియే
సాయము బట్టుము రావే
గాయంబైన మది మాది గావు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteరావాలి ప్రజల లో న
ర్రా విధిగా మార్పు సు! అదిరాక జిలేబీ
యే విధమగు మార్పులు రా
వే! వివరములెరిగి నోట్ల వేయంగ దగున్ !
జిలేబి