ఏ పాదములను సేవించ నిశ్చింతగా జనుల జీవితములు సాగిపోవు ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ ర్మమ్ము నిల్ప నవతారము ధరించె ఏ పాదముల స్పర్శ ఈ భరతావనిన్ పరమ పావనగాగ విరియ జేసె ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు నిరతము మునులు ధ్యానించి పొంది
రట్టి పరమాత్మ పాదము లందు , పూని మనసు నిల్పితి , కననయ్యె కనుల యెదుట కృష్ణ పరబ్రహ్మ , గోపికా బృంద సహిత రాస కేళీ వినోద విలాసనముల .
-
ReplyDeleteపశ్యామి! పాహి దుర్గే!
దృశ్యాదృశ్యపు వివేక దృంహిత వైరా
గ్యస్యాది సాధనకు స
స్యశ్యామల సంపదలకు శాంకరి ప్రణతుల్
-
ReplyDeleteఏది విదేశమేది ? ఏది దేశమేది :)
చాలా హాశ్చర్యమయెన్
మీలో "బా" వుకత యెంత మించారె! విదే
శాల నివసించినను వే
షాలేయక మరువ లేదు సంస్కృతిని సుమీ!
రామచంద్రుని బాణము , రాజసమున
ReplyDeleteవెలిగి , చెడుపయి మ్రోగించె విజయ భేరి ,
గాన , విజయదశమి నేడు , కాంక్షదీర
ఘన శుభాకాంక్ష లందింతు , కరము 🙏 మోడ్చి .
-
ReplyDeleteచాన్స్ దొరికితే చాలు :)
భండారువారి నెంబరు
తిండాడగ దొరికె ! కాలు చేయుడి! ఫారి
న్నుండి తిరిగి వచ్చిరి గా
దండిగ కాహళపు గుడ్లు దట్టింపదగున్ :
-
ReplyDeleteయేసు గలడెల్ల చదువుల
యేసు గలడు భూతనాధునిగ నలినజుడై
యేసు గలడు మన ప్రభునిగ
యేసుని ప్రార్థింప దక్కు నే హలె లూయా!
-
ReplyDeleteపెద్దలు వినరా ? వారికి
సుద్దుల నేర్పంగ మనకు సులభతరమ్మా ?
తద్దయు బండి టకుటకుల
నిద్దుర పట్టునకొ మనకు నీరజనేత్రా !
మునగచెట్టు, మునగచెట్టు 😳
Deleteసుద్దులు నేర్పంగ జనిన
Deleteతద్దయు వినువారె తమరు ? తంటా మీతో ,
హద్దులు లేవాయె తమకు ,
యెద్దేవా సేయు టొకటె యెరుగుదురు , కదే !
-
ReplyDeleteహా! మందు పాటలయొ లే
వే! మగువల మదిని విరహ వేదనలయొ లే
వే! మా బండిదొర! యెచట?
వేమార్లు పిలువను రారె! వినరా! తెలుపన్
వలదయ్య వ్యావహారిక
ReplyDeleteములు గ్రాంధికమె తగు పద్యములకున్ లక్కా
కుల రాజన్నా! గురువ
ర్యుల మాటలు వినవలె నెపుడున్ ఖ్యాతి గనన్
గురువర్యు లెవరు మనకున్ ?
ReplyDeleteగురువులకే గురువు శాస్త్రి , గూబలు వగులున్ ,
గురువీ ' రాజా ' , తక్కొరు
గురువంటిర , వాడు గుడ్లగూబ గదన్నా !
-
ReplyDeleteఎవరా గురువులు ? ననుమిం
చు వరేణ్యులెవరు ? తెలిపినచో గూబల్వా
యు వరకు వాయించెద; నే
నెవరన్ ? నెల్లూరు రాజు నే పువుబోడీ !
వి లే క రి / వి లే ఖరి అంటే ఏమనుకున్నావోయ్ ?
ReplyDeleteతస్మాత్ జాగ్రత్త !
అతి వర్జయేతని జిలే
బి తెలివిడిగొనవె విలేకరి తలచినచొ నీ
దు తలయెగురు ! మంచిగ ఉం
డు తిక్క పనులువలదు చెడుగుడులాడకుమా
-
ReplyDeleteపనిలేని జిలేబి యొకతె
పనిగట్టుకు పద్యములను వ్రాయన్ గురువుల్
కనికరము జూపి సరె నే
ర్వని సభలో తలము నిచ్చి రన్నా రాజా!
గురువులకు పంగ నామా
ReplyDeleteలరయంగా బెట్టువారె , అచ్చపు శిష్యుల్ ,
తిరుపతి కెళ్ళక , ఇంటనె
గొరిగి మరీ , నామ మెట్టు , గొప్పగ విబుధా !
-
ReplyDeleteప్రభొ! తమకు తెలియని విషయ
ము, బుంగ నామమ్ముల విధములు గలవా రా
జ! బుడిబుడి మేమెరుగుట త
డబడి తడబడి పదముల గెడన్ జేర్చుటయే
ఏముంది , తెలుగు పద్యము
ReplyDeleteగ్రామీణ పదాల తోడ గ్రాలగ వలయున్ ,
నామాల వాళ్ళ శష భిష
లేమాత్రము లెక్క సేయ నేల వయస్యా ?
-
ReplyDeleteమీరెటుల బల్కగ నదియె
సారూ సరి యగు గురువులు చల్లని రావుల్
మీరు! యతి, ప్రాసల హొయలు
నేరుపు తెలిసిన విదురులు నెవ్వడి తోడై
వృత్తి రీత్య దప్ప - గురువు , విదురు డవను ,
ReplyDeleteనన్ను తమనుండి వేరుగా సన్నుతించ
వలదు వలదన్న శషభిషల వారితోడ ,
వారి స్థానాల నెన్నడూ వదులు కోరు .
-
ReplyDeleteకాను విదురుడ జిలేబీ
మౌన గురువునంతయే సుమా శషభిషలా
స్థానపు వారిది ! తెలివిడి
లే నా కటువంటివి! వదిలెయ్యవె సుమతీ!
-
ReplyDeleteఅప్పడాలు బడాయి పోవడము తాత
మాట చెల్లక పోవడ మన్న ది మన
కెల్ల తెలిసిన విషయమె కించుక వడి
యాల విషయమె సమఝౌలె హంసయాన :)
తమకే దిష్టము ? విబుధా !
ReplyDeleteఘుమ ఘుమలగు అప్పడాల ? గుయ్యను కఱ్ఱా ?
చిమ చిమ వడియాలా ? ఆ
చిమ చిమలను వేపు కాడ ? చిఱ్ఱెత్తిందా ?
-
ReplyDeleteవిబుధా! ఇష్టంబేదీ ?
పెబువులు మీకు తెలియనివి వేరుగలద రా
జ! భవాంబుధి దాటన్ ధ
ర్మభాగినికొక పతి పతికి రమణి యొకతయున్
అప్పడాలకఱ్ఱ అతివయై వర్థిల్ల ,
Deleteబొప్పిగట్టు మగని బోడిగుండు ,
ధర్మపత్ని గిత్ని ధరణిలో తగదండి ,
పరగ నోటి యదుపె పతికి రక్ష .
జీవిత సత్యం బాగుంది. కొంచెం భయం ఉండాలి .
Delete-
ReplyDeleteఊహల ఊయల లో ఓ
హోహో తిరుగాడగా సహోదరులారా
బాహత్తరి మోబైలను
మాహేంద్రపుజాలమున సమాధియె సుమ్మీ
-
ReplyDeleteకనిపించె నంతటయు గల
డనువాడు నిమేషము! గలడని నమ్ము క్షణ
మ్మున మాయమయ్యెను మరల
కనిపించు నెదుట ? తెలివిడి గలవారెవరో!
-
ReplyDeleteబానిసలయ్యిరి ఫోనుకు
మేనుమరిచి మీడియా సమేతము సోషల్
గానిదు రోయిరి జనులయొ!
పైనూరిరి మేటరు వడి వరుస జిలేబీల్
సారూ ! ఉన్నారా ? , ఆ
ReplyDeleteసారుల చర్చకు - మెకాలె చర్చకు - అయ్యో ?
మీ రెళ్ళంగా బోవరు ,
వేరేదో ' హింసా వినోద ' వీక్షణ ముందా ?
ఏ పాదములను సేవించ నిశ్చింతగా
ReplyDeleteజనుల జీవితములు సాగిపోవు
ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ
ర్మమ్ము నిల్ప నవతారము ధరించె
ఏ పాదముల స్పర్శ ఈ భరతావనిన్
పరమ పావనగాగ విరియ జేసె
ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు
నిరతము మునులు ధ్యానించి పొంది
రట్టి పరమాత్మ పాదము లందు , పూని
మనసు నిల్పితి , కననయ్యె కనుల యెదుట
కృష్ణ పరబ్రహ్మ , గోపికా బృంద సహిత
రాస కేళీ వినోద విలాసనముల .
ఉన్నావా? అసలున్నావా?
ReplyDeleteఉంటే కళ్ళు మూసుకున్నావా?
Happy deepavali. ఎటుపోయావూ?
ReplyDeleteఈ వరూధిని యెటువోయె ? యేలనో మ
ReplyDeleteవునము వహియించె ! , మిత్రమా ! ఉన్న
పలము రమ్ము , మీబ్లాగు దీపాల మయము
సేయగా , శుభాకాంక్షలు , శ్రీలు - మీకు .