Tuesday, June 5, 2012

A women's favorite position is CEO!

"ఏమమ్మాయ్, ఏం ఉద్యోగం చెయ్యా లనుకుంటున్నావ్ ?" చాలా కాలం మునుపు మా నాన్న గారు అడిగేరు.

ఇంట్లో అమ్మ, బామ్మల 'స్టేటస్' వారి 'దాక్షీకం' చూసిన దానిని కాబట్టి, సూటిగా చెప్పేసాను- Nothing less than CEO నాన్న గారు అని.

'అర్థం అయి పోయింది, మీ బామ్మ ఇంపాక్ట్ నీ పై చాలా ఉందని ' అన్నారు నాన్న గారు.

కాదా మరి, మా బామ్మ ఇంట్లో సర్వాధికారిణి! ఆవిడ మాటలు మా నాన్న గారు కూడా ఎప్ప్పుడూ కాదన లేదు. మరి ఆవిడ పెంపక మాయే మనది!

ఇంతకీ ఈ విషయం ఇప్పుడు చెప్పటం ఎందుకు అంటారా ?

ఆ మధ్య రాసాను , మా మనవరాలు డిగ్రీ చేత పుచ్చుకుని, వారి 'పురచ్చి' తలైవి, లాప్ టాప్ ఇస్తే, దాంట్లో సినిమాలు చూస్తో కూర్చుంది అని.

ఆ మనవరాలు ఈ మధ్య వస్తే, 'ఏం, పిల్లా, ఏముద్యోగం చెయ్యాలను కుంటున్నావ్ ? అన్నా.

చెప్పిందే తడవు, తడ బడ కుండా చెప్పేసింది, 'Nothing less than CEO ' అని!

హమ్మోయ్, చర్విత చర్వణం! ఈ బామ్మ ఇంపాక్ట్ మరీ కొనసాగు తోనే ఉందన్న మాట మరి!

ఇంతకీ CEO అయి ఏం చెయ్యా లను కుంటున్నావ్ మరి అన్నా కొంత గిల్లి చూద్దామని. .

'నీలా , సబ్బాటికల్ చేద్దా మను కుంటున్నా బామ్మ అంది టప్పున.

ఔరా, ఈ కాలం అమ్మాయిలూ మరీ గడుసు వారే.

సరే, పెళ్లి, వగైరా ...?

పెళ్ళా, ఇప్పటికి వద్దన్నాడు తను' అంది చాలా కాష్యుల్ గా.

ఎవరే తను?

బాయ్ ఫ్రెండ్.

వామ్మో, మరో మెట్టు ఎక్కేసేరు ఈ కాలం అమ్మాయిలు మరి.

ఎవరే బాయ్ ఫ్రెండ్ ?

పరిచయం చేస్తాలే, సమయం వచ్చినప్పుడు అంది, మధ్యలో తను లాప్ టాప్ లో చాటింగ్ జరగటం అప్పుడే గమనించా నేను. ప్రొఫైల్ లో ఓ అబ్బాయి ఉన్నాడు.

ఉమన్ ఎంపవర్మెంట్ మరి.

చీర్స్
జిలేబి.

13 comments:

  1. భలే!
    జిలేబీగారు టపటపా వ్రాసేస్తారు టపాలను.
    శ్యామలీయం బ్లాగులో ఒక్కొక్క టపా వ్రాయటానికీ నాకు చచ్చి పుట్టినంత పని అవుతోంది మరి.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      మీరు రాసేది కాలగతి న నిలిచేది. కాబట్టి వాటికి అంత ప్రయత్నమూ మీదిన్ను!

      మరి ఇక్కడ, జిలేబీ ఖబుర్లు టైం అండ్ టీం పాస్ చాయ్ ఖబుర్లు. కాబట్టి టప టప లాడించడం సులువు!

      చీర్స్
      జిలేబి.

      Delete
    2. @జిలేబి!

      మీలో ఈ స్పృహ ఉన్నది చూశారు, ఐ like it very much

      Real చీర్స్ to you
      :)

      ?!

      Delete
  2. వుమన్ ఎంపవర్మెంట్ మీ గడపలోకొచ్చేసింది!!! పండగే!!!

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      తప్ప లేదు మరి! కాలగతి న అన్నీ గడప లో కి గడ గడ వచ్చసేయి మరి !

      జిలేబి.

      Delete
  3. New blog of future is taking birth. Jangiri?!?!

    ReplyDelete
    Replies
    1. తెలుగు భావాలు గారు,

      అంతేనేమో ! కాకుంటే ఫ్యూచర్ బ్లాగ్ కాబట్టి పేరు మరి కొంత వెరైటీ గా - అట్లాగే ఉంటుందేమో మరి !

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. రాబోయే కొత్త బ్లాగు పేరా? 'బి లేజీ' యేమోౕ

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      'బీ లేజీ' ఆల్రెడి పేటెంట్ అయిపోయిందండోయ్! మాదే మరి. !

      చీర్స్
      జిలేబి.

      Delete
  5. ఈ రోజు బ్లాగ్ లోకం అందరి పోస్ట్ లతో కళ కళ లాడుతుంది.
    నేను మాత్రం CEO కావాలనే కోరుకుంటాను. ఇందులో అసలు సందేహం వలదు.
    చీర్స్ జిలేబీ!

    ReplyDelete
    Replies
    1. వనజ వనమాలీ గారు,

      మా బాగ చెప్పేరు! ఆల్వేస్ టాప్ అన్న మాట!

      చీర్స్
      జిలేబి.

      Delete
  6. బామ మాట బంగారు మూట...
    అచ్చు తప్పులు క్షమించండి
    బామ్మ బాట బంగారు కోట ;)

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు,

      అంతే అంతే! బంగారు మూట అండ్ బంగారు కోట మరి!

      జిలేబి.

      Delete