Monday, September 1, 2025

Will AI Ring Deathbell for online ad biz Revenue ?

After a long time !

Recently one of long standing Telugu blogger / aggregator asked why no blog posts ?

That triggered a thought process :)

Think of a devil devil comes before :)

 

Going by the way search engines google etc are summarizing the user query results into just at top as summary generated by so called AI , I wonder will this be bringing in death bell to advertsement revenues.

Websites  churn media info content thus attracting mass views and clicks which eventually give them ad income.

Once users stop going beyond AI generated content during search, which would suffice majority of user query output expectations, how these sites going to survive in order to be in biz without their being ad biz revenue?

Eventually these sites when they start losing user visits and thus ad income may die. If so who is going to churn content and so how AI going to get content ? 

A general thought ! Bhasmasura Hastha!

Or digging your own well ?


Welcome to "add" your "views" :)

-+-+-+-+--


గూగులమ్మి అనువాదము :)


చాలా కాలం తర్వాత!

ఇటీవల ఒక తెలుగు బ్లాగర్ / అగ్రిగేటర్ బ్లాగ్ పోస్ట్‌లు ఎందుకు లేవని అడిగారు?

అది ఒక ఆలోచన ప్రక్రియను ప్రేరేపించింది :) 

అదిగో దెయ్యమంటే~ నిజంగానే దెయ్యం   వస్తుందని :)

 

గూగుల్ సెర్చ్ ఇంజన్లు మొదలైనవి యూజర్ క్వెరీ ఫలితాలను పైభాగంలో AI ద్వారా రూపొందించబడిన సారాంశంగా సంగ్రహిస్తున్న తీరును పరిశీలిస్తే, ఇది ప్రకటనల ఆదాయాలకు మరణవార్తను తెస్తుందా అని నేను ఆశ్చర్యపోతున్నాను.

వెబ్‌సైట్‌లు మీడియా సమాచార కంటెంట్‌ను రంగరించి వీలైనంత వీక్షణలు మరియు క్లిక్‌లను ఆకర్షిస్తాయి, ఇది చివరికి వారికి ప్రకటన ఆదాయాన్ని ఇస్తుంది.

వినియోగదారులు శోధన సమయంలో AI ఉత్పత్తి చేసిన కంటెంట్‌ను దాటి వెళ్లడం ఆపివేసిన తర్వాత,( ఇది వినియోగదారు ప్రశ్న అవుట్‌పుట్ అంచనాలకు సరిపోతుంది),  ఈ సైట్‌లు ప్రకటన వ్యాపార ఆదాయం లేకుండా వ్యాపారంలో ఎలా మనుగడ సాగిస్తాయి?

చివరికి ఈ సైట్‌లు యూజర్ సందర్శనలను కోల్పోవడం ప్రారంభించినప్పుడు ప్రకటన ఆదాయం తగ్గవచ్చు. అలా అయితే కంటెంట్‌ను ఎవరు క్రియేట్ చేస్తారు మరియు AI కంటెంట్‌ను ఎలా పొందుతుంది? 

ఒక సాధారణ ఆలోచన! భస్మాసుర హస్తము లా వుందా?

లేక మీ సొంత సమాధి తవ్వుకుంటున్నారా?


మీ "వీక్షణలను" "జోడించడానికి" స్వాగతం :)

Cheers 

జిలేబి.

Friday, March 7, 2025

జిలేబి సింగోరూ జిందాబాద్!

 

మా శ్రీ మాన్ ( కాపీ పేష్టోత్తమ గురోన్మణి ) "తాతగారి" 

ఇన్ స్పిరేషన్ తో ఇకపై నేను కూడా :) " ఇలా ప్రొసీడైపోతా

వుండా :))


#ఋణానుబంధరూపేణా


కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది బోర్డు మీద తెలుగులో వ్రాసిన రాజస్థానీ మిఠాయి దుకాణం అని. మిఠాయి దుకాణం అన్నాము కదా అక్కడ బోల్డు మిఠాయిలు ఏమీ ఉండవు. దొరికేది వేడి వేడి బెల్లంజిలేబి మాత్రమే. ఆ ఒక్క వెరైయిటీకే అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం.

                                     ***

ఆ దుకాణం యజమాని పేరు ధరమ్ వీర్ సింగ్. 1971లో తన ముప్ఫై ఏళ్ళ వయస్సులో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో రెండు కాళ్ళను మోకాళ్ళవరకూ దేశానికి ఇచ్చేసి... ఓ సైనికుడిగా గర్వంగా తిరిగిన ఊర్లో, సానుభూతిగా బతకడం ఇష్టంలేక... తల్లిని, భార్యను, పదేళ్ల కొడుకు మహావీర్ సింగ్ ని తీసుకుని మా కాకినాడకు వచ్చేశారు. 


కాకినాడకు వచ్చిన మూడేళ్లకు చిన్న కొడుకు ఓంవీర్ సింగ్ పుట్టాడు.

                                   ***

మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకు ఉండవలసింది పట్టుదలే అని నిరూపిస్తూ తన భార్య, తల్లితో కలిసి మిఠాయి దుకాణం మొదలుపెట్టారు.


బంగారు రంగులో, బెల్లం పాకంతో... వేడి వేడిగా... కరకరలాడుతూ అమృతానికి సరిజోడులా ఉండే ఆ జిలేబి రుచి గుర్తుకు వస్తే చాలు మా కాకినాడ జనాలు ఆ దుకాణం దగ్గర జేరిపోయేవారు. 

                                   ***

ప్రతీ ఆగష్టు పదిహేనుకి, జనవరి ఇరవై ఆరుకి తన దుకాణం  దగ్గర జండా ఎగురవేసి అక్కడికి వచ్చే జనాలకు ఉచితంగా జిలేబి పంచేవారు. 


సినిమా రోడ్డులో ఉండే కోకనాడ అన్నదాన సమాజంలో జరిగే నిత్యాన్నదానానికి ప్రతీ ఆదివారం తన వంతుగా పదికిలోల జిలేజీ ఇచ్చేవారు.


ఆయన గొప్పదనం.... చేతి రుచి రెండూ తెలిసిన మా కాకినాడ జనాలు ఆయన్ని ముద్దుగా జిలేబి సింగోరు అని పిలిచే వాళ్ళు. 

                                     ***

అప్పుడెప్పుడో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కట్టించిన స్కూల్లో చేరి, బాగా చదివే పెద్ద కొడుకు మహావీర్ సింగుని ఎలాగైనా పూణే దగ్గర ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడిమీలో చేర్చి, మహా వీరుడులా చూడాలి అనుకునే వారు. 


మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. బాగా చదివే మహావీర్ తాను డాక్టర్ కావాలని కోరుకున్నాడు. 


తన ఇష్టాన్ని తనలోనే ఉంచేసుకుని మహావీర్ ని అతను చదవాలి అనుకునే మెడిసిన్ లోనే చేర్చారు ధరమ్ వీర్ గారు.  

                                   ***

అలుపన్నది తెలియని సూర్యుడు ఉదయిస్తూ... అస్తమిస్తూనే ఉన్నాడు. అతనితో కలిసి కాలం పరిగెడుతూనే ఉంది.

                                   ***

చదువులో అన్నకు తగ్గ తమ్ముడిగా ఉండేవాడు ఓంవీర్.  చిన్నప్పటి నుండి లెక్కల్లో ఎంతో ముందు ఉండేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కొట్లో ఉండి... అక్కడికి వచ్చే మనుషుల మనసులను చడవడం అలవాటు చేసుకోసాగాడు. 

                                    ***

ఓరోజు ధరమ్ వీర్ గారి తల్లికి బాగా సుస్తి చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అక్కడ డాక్టర్లు ఏదో స్ట్రైక్ లో ఉండటంతో సమయానికి సరైన వైద్యం దొరకక ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.


జరిగిన సంఘటన ఆ తండ్రీ కొడుకుల మీద చాలా ప్రభావాన్నే చూపించింది. 

                                   ***

మెడిసిన్ ఐన తర్వాత ఆ మిఠాయి దుకాణం దగ్గరే కేవలం ఐదు రూపాయల ఫీజుతో ఆసుపత్రిని మొదలుపెట్టారు మహావీర్ సింగ్. హస్తవాసి అంటారు చూడండి... అది నిజం అన్నట్లు ఎంతటి రోగమైనా సరే ఆయన చెయ్యి పడగానే తగ్గిపోయేది. అసలు ఆయన మన చేయి పట్టుకుంటే చాలు... మన రోగం సగం తగ్గిపోతుంది అనే నమ్మకం కలిగింది మా అందరికీ. నెమ్మదిగా ఆయన్ను మా కాకినాడ జనాలు ఐదు రూపాయల డాక్టరుగోరు అనడం మొదలుపెట్టారు.


తనకు మందుల కంపెనీలు శాంపిల్స్ గా ఇచ్చే మందులనే రోగులకు ఇచ్చేవారు. ఓ పాతిక రూపాయలు ఉంటేచాలు... ఆపరేషన్ కాని, ఎంత పెద్ద రోగానికైనా ఆయనతో వైద్యం చేయించుకోవచ్చు అనుకునేవాళ్ళు మావాళ్ళు.

                                   ***

దుకాణం పెట్టిన కొత్తలో రోజుకి పాతిక ముప్పై కిలోలు అమ్మే వ్యాపారం... ప్రస్తుతం రోజుకి మూడు వందల కిలోలకు పైగానే పెరిగింది.


దుకాణం నుంచి వచ్చే లాభాలలో చాలామటుకు ఆసుపత్రి నిర్వహణకే ఖర్చు పెట్టేవారు ఆ కుటుంబం.

                                    ***

ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్న వేళ మహావీర్ గారు తమ్ముడు ఓంవీర్ కూడా తనలాగే డాక్టర్ చదివితే ప్రజలకు ఇంకా సేవ చెయ్యొచ్చు అన్నారు. అది విన్న ధరమ్ వీర్ గారు ఉబ్బితబ్బిబ్బైపోయి చిన్న కొడుకు వైపు చూశారు.


తనకు తినడానికి రొట్టెలు పెడుతున్న అమ్మకు, నమస్కరించి తండ్రి వైపు తిరిగి నేను డాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు అని ఓంవీర్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.


అన్నయ్యా మీరు చేస్తున్న సేవ నిరాకాటంగా సాగాలి అంటే మన మిఠాయి దుకాణం కూడా కొనసాగుతూనే ఉండాలి. నేనూ చదువుకోసం దుకాణం వదిలేస్తే... నాన్నగారి తర్వాత మనం ఆ దుకాణాన్ని వదిలేసుకోవాలి. అలా చేస్తే ఇప్పుడు ఆసుపత్రి ద్వారా మీరు చేస్తున్న పనులు ఏమీ చేయలేము. మన ఆసుపత్రి ద్వారా మీరు చేసే సేవ ఎల్లకాలం జరగాలి అంటే... మన మిఠాయి దుకాణం కూడా ఎల్లకాలం నడవాలి. అందుకని నేను మిఠాయి దుకాణం బాధ్యతలు తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు.


చిన్నవాడైనా ఎంతో ముందు చూపుతో అతను చెప్పిన మాటలు వింటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. 

                                     ***

ఆ సంవత్సరం సంక్రాంతికి మా కాకినాడ ముస్తాబు అవుతోంది. 


కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉండే ఆ మిఠాయి దుకాణం, పక్కనే ఉన్న ఆసుపత్రి కొత్త రంగులు దిద్దుకుంటుంన్నాయి.


ఏ జన్మలోని ఋణానుబంధమో... ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడి జనాల కోసం తపనపడే... జిలేబి సింగోరు, ఐదు రూపాయల డాక్టరు గార్ల ఋణం మా కాకినాడ జనాలు ఎప్పటికీ తీర్చుకోలేరు.


వాత్సాపు కథనం కాపీ పేషిత! 

తరుమృగనయని

జిలేబి

Wednesday, January 22, 2025

జై జై జై ట్రంప్ ! నాలుగేళ్లు :)

 

వచ్చిండు ట్రంపమెరికా

కిచ్చిండోయ్ కిక్కు రాజకీయాల్ మారన్

బుచ్చమ్మ తూలికయొ వా

క్రుచ్చెన్ పోగాలమొచ్చె క్రొవ్వారుగనే


శుభోదయం

అందరికీ ట్రంప్ నూత్న వత్సర

శుభాకారాల్ మిరియాల్

ఢమాల్ ఢమాల్ నిఫ్టీ 

రష్యా చీనీ భాయీ భాయీ 

హెచ్చు గ హెచ్చు ఒన్నుకు ఢోకా వస్తుంద(ట)

పుడితే పిల్లల్ నో మోర్ పౌరసత్త(ట)


మరో నాలుగేళ్ల సంబడాల్


జిలేబి



Wednesday, December 11, 2024

ఏకాదశి మోక్షద!

 

ఏకాదశి! మోక్షద! కృ

ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ

సాకల్యము జీవితమున

మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!



జిలేబి.

గుండు మామి 

సర్వం గుండు మయమే.




Friday, October 11, 2024

టాటా జనుల మది నిండుగా నీవె సుమా !

 

టాటా అనుట సులభమా

బాటయు బాసటయు నీవు ప్రజల ప్రగతికిన్

మేటి గమికాడవు! రతను

టాటా! జనుల మది నిండు గా నీవె సుమా


జిలేబి



Sunday, June 30, 2024

కల్కి ౨౮౯౮ ఒరు కన్నోట్టం

 


భగభగ మండెను నిప్పులు 

ధగధగ లాడె సినిమా వధలనేకమ్ముల్

జగడములకు కొదవేలే

దు! గడగడాకొట్టుకొనిరి దుష్టప్రజలున్



జిలేబుల్స్

Monday, March 25, 2024

విన్నకోట విదుర వినుమ రాయ!!

 


కామింటు కింగు వారి మకుటము పై 

శతకమునకు నాందీ పలకడమైనది‌.


కేజ్రి వాలు వెడలె కేజు లో ఎక్సైజు
కేసు మాయ యీడి క్రేకు చేయ
అన్న యేమొ తీవ్ర మైన చింత పడెను
విన్నకోట విదుర వినుమ రాయ! (౧)


***


నిఫ్టి చార్టు లోన నిండు చుక్కయొకటి
కన్బడెనని జ్యోస్య కారు లచట
పైన పోవు ననిరి పైపైకి పోకడ
విన్నకోట విదుర వినుమ రాయ! (౨)




ఇట్లు

పనిలేని ......

జిలేబి


Saturday, February 10, 2024

విప్లవ తపస్వి! పీవీ! భారత రత్న!

 

ప్రావీణ్యానికి పట్టము!

పీవీ! విప్లవ తపస్వి! వికసిత భారత్

నీ వదలని పట్టాయెన్

భావితరానికి వెలుంగు  భారతరత్నా!



https://www.telugubooks.in/te/products/viplava-tapasvi-p-v


జేజేలు


జిలేబి

Saturday, December 30, 2023

నీ, నా భేదము లేని కంబుధరుడా! నిన్మ్రొక్కెదన్ కావుమా!

 


తానైవెల్గెతివీవు విశ్వ మున నాద్యంతంబుగా వేణునా
దానందమ్ముగ కాలవాహినిగ కాంతారమ్ము గా వేదమై
ప్రాణంబై జనులెల్ల తృప్తి గొను సారంగమ్ముగా నిక్కమై
నీ, నా భేదము లేని కంబుధరుడా! నిన్మ్రొక్కెదన్ కావుమా!




శుభోదయం

జిలేబి

Friday, August 18, 2023

మందస్మిత వదనారవింద దరహాసోజ్జ్వలనముఖులమై వెలగటమెలా?

 

ఒక వాత్సాపు కథనం :)


అన్ని కాపీ హక్కులు అందరివి.


*తెలుగు - యొక్క గొప్పతనం* 


♦️ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

తేట తేట తెనుగులా....


♦️ మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.

పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది


♦️ ఏలాఅంటే

=======

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.


♦️ క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం

♦️ చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం

♦️ ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం

♦️ త థ ద ధ న……నాలుక కొస భాగం

♦️ప ఫ బ భ మ……..పెదవులకు

♦️ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా

♦️ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.

సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది


♦️తెలుగు భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.


♦️తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ 

సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.

మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేము.


♦️తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.


♦️తెలుగులో మాట్లాడండి. .


♦️తెలుగులో వ్రాయండి. . .


♦️తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..


♦️తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . .


ఇదండీ తెక్నీకు :)


ఇట్లు

మంద్ స్మిత్  వదన్ హాఫ్ విండ్

దరసల్ హౌస్ ఉజ్జ్వల్ ఉంద్ మికి :)