Thursday, August 9, 2012

జిలేబీ లు చుట్టడం ఎలా ?

"డబ్బులు సంపాదించడం ఎలా " అనే పుస్తకం రాద్దామను కుంటున్నా నండీ అయ్యరువాళ్" అన్నా మా అయ్యరు గారితో.

"ఇదిగో జిలేబీ , జిలేబీ లు చుట్టడం ఎలా అని టపా రాస్తే చదువుతారు గాని డబ్బు సంపాదించడం ఎలా అని నువ్వు రాస్తే ఎవరన్నా చదువుతారా? అదీ గాక, నువ్వు డబ్బులు సంపాదించే సత్తా గల భామిని (బామ్మ అన బోయి మనకెందుకు తంటా, చిక్కు అని నాజూగ్గా భామిని అని నట్టు ఉన్నారు ) వైతే ఇట్లా బ్లాగులు టపాలు రాస్తూ కూర్చుంటా వా ?" అని మా అయ్యరు గారు ముసి ముసి నవ్వులు నవ్వేరు.

"ఏమండీ, దేశం లో , ఎంత మంది డబ్బులు ఎలా సంపాదించడం అనడాని పై ఎన్నెన్ని పుస్తకాలు రాస్తున్నారు ? వారంతా డబ్బులు సంపాదించాక రాస్తున్నారా ? లేక డబ్బులు సంపాదన కోసం ఆ పుస్తకాల్ని అమ్మితే వచ్చే డబ్బుల కోసం రాస్తున్నారం టారా ?" అన్నా.

రెండు రకాల జనాభా వున్నారనుకో అన్నారు మా అయ్యరు గారు.

"భర్త బాధితుల్లారా ఏకం కండీ అని ఎవరైనా నా పుస్తకం రాస్తే దాని అర్థం ఏమిటి మరి ? రాసిన వాళ్ళు  మొగుడి  బాధ, తంటా భరించలేక తన బాధను వెళ్ళ గక్కేం దుకు రాస్తున్నట్టే కదా అర్థం. దానితో బాటు ఏదైనా డబ్బులు రాలితే గీలితే గిట్టు బాటు  కూడాను" అన్నా.

'అబ్బా, ఈ 'ఆండోళ్ళు' ఏ టాపిక్ పై రాసినా మొగుళ్ళని రచ్చ కీడ్చనిదే ఊరుకోరు సుమీ' అని ఉసూరు మన్నారు మా అయ్యరు వాళ్.!

ఇంతకీ ఏ డబ్బులెలా సంపాదించడం అన్న పుస్తకం మాట ఎందుకంటారా ? ఈ మధ్య మళ్ళీ సబ్బాటికల్ తరువాయి ఉద్యోగం లో కి రావడం తో మొఖం మొత్తింది. యాధృచ్చికం గా పన్నెండు నెలల్లో రిటైరు ఎలా అవ్వటం అన్న ఒక పుస్తకం కనబడ్డది. ఔరా, మనకి కావాల్సిన పుస్తకమే మరి ఇది అని ఆశ పడి డబ్బులు వదిలించు కుని పుస్తకం కొని చదివితే రామ రామ, అంతా అరగ దీసిన ఇరగ దీసిన సమాచారమే అందులో.

'బాగా కష్ట పడండి. డబ్బు ఒక గోల్ గా పెట్టుకోమాకండి. డబ్బు అన్నది ఒక మాధ్యమం మాత్రమే. మీకు నచ్చినదేదో దాన్నే చేస్తూ ( నచ్చినదేదే దాన్నే చేస్తూంటే ఉన్న ఉద్యోగం కూడా హుష్ కాకీ అయ్యేటట్టు ఉన్నది మరి!) అందరికి సహాయ కారి గా ఉండండి..... లాంటి జిలేబీలు ఈ పుస్తకం లో చదివి, ' ఛా, ఈ పాటి పుస్తకం మనం కూడా రాయ లేమా అని ఓ ధైర్యం వచ్చేసి,

దానికి ఓనమాలు గా ఈ జిలేబీలు చుట్టడం ఎలా అన్న జిలేబీ చుట్టా నన్న మాట !

మొత్తం మీద మీరు కూడా జిలేబీలు చుట్టడం మొదలెట్టండి మరి !

చీర్స్
జిలేబి.

3 comments:

  1. జిలేబీలు కొత్తగా వేసే పద్ధతి ఉండదండి, పద్ధతి పాతదే. :) Old wine in new bottle.

    ReplyDelete
  2. ఓ స్వీట్ చేయడం ఎలాగో నేర్చేసుకున్నా మీ పుణ్యమా అని:-)

    ReplyDelete
  3. ha ha. good one.
    పూర్వకాలంలో అంబటిపూడి పుస్తకాలని ఉండేవి, బస్టాండుల్లోనూ సంతల్లోనూ అమ్మే వారు .. అలాగే .. ఇప్పుడు XYZ for Dummies అని వస్తున్నాయి కదా!!

    ReplyDelete