నేనెవరు అన్నారు రమణ మహర్షి వారు . who am I ?
నేనెవరు ? అన్నా మా అయ్యరు గారితో.
జిలేబీ అన్నారు వారు.
మరి పూర్వ జన్మలో నేనెవరిని ?
చచ్చాం పో. ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం. కాబట్టి పూర్వ జన్మలో కూడా నీవె నా జిలేబీ వేమో ? అన్నారు శ్రీ వారు.
అంతే నంటారా ?
కాదనడానికి నాకు ధైర్యం చాలడం లేదు సుమీ అన్నారు అయ్యరు గారు ! జిలేబీ యా మజాకా మరి ?
జోక్స్ అపార్ట్,, చాలా సీరియస్ టపా ఇది. పూర్వ జన్మలో మీ రెవరు అని తెలుసు కోవటం ఎలా ? అసలు పూర్వ జన్మ అంటూ ఉందా ? (ఉందనే వాదన ఎక్కువే మరి కాబట్టి ఉంది అనుకోవాలి )
ఈ ప్రశ్న ఎందు కొచ్చింది అంటారా ? శ్రీ సత్యనారాయణ శర్మ గారి పునర్జన్మలు - అప్పనాచార్య సర్ థామస్ మన్రో ఒక్కరేనా అన్న టపా చదివాకా మరి !
ఈ విషయం మీద చాలా రీసెర్చ్ అమెరికా లో జరిగినంతగా ఇంకెక్కడా జరిగి ఉండదేమో మరి. ఆ మద్య మా హిందూ వారు పాస్ట్ లైఫ్ ఆఫ్ గ్రేట్ మెన్ మీద ఒక పుస్తకం రివ్యు చేసారు. అందులో మన అబ్దుల్ కలాం గారు ఇంతకు మునుపు జన్మలో ఏమై ఉండే వారని ఆ పుస్తక రచయిత విశ్లేషించారు . అంతే కాక జవహర్ లాల్ నెహ్రు గురించి కూడా విశ్లేషించి నట్టు గుర్తు.
అట్లా , ఈ విషయం కొంత సీరియస్ గా ఆలోచించ వలసిన విషయం మరి ! ఏమంటారు మరి ?
సరే ఈ విషయం లో స్వామీ శివానంద (డివైన్ లైఫ్ సొసైటీ సంస్థాపకులు ) గురించి చదివిన ఓ సంఘటన ఇక్కడ రాసి నేనూ గాయబ్ అవుతాను మరి !
స్వామీ గారిని ఓ విదేశీయుడు అడిగాడట (ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఈ విదీశీయులకి ఎట్లా తడతాయో మరి ?) - పూర్వ జన్మలో నేనెవరో ఎట్లా తెలుసు కోవడం అని ? అందుకు స్వామీ గారు , పూర్వ జన్మ గురించి నీ కెందుకోయ్ , మరిచి పోయి, ఈ జన్మలో నువ్వేం చెయ్యాలో అది చూడు అంటే, వాడు కుదరదు నాకది తెలుసుకోవాలి అని పట్టు బడితే నువ్వు డైరీ రాయడం మొదలెట్టు అంటే ఇవ్వాళి టి వి ఇవ్వాళ రాయి. రేపు రేపటికి ఇవ్వాళి టికీ చేర్చి రాయి. వారాంతం లో ఆ వారం మొత్తం మీదా కలిపి రాయి. ఇట్లా రాసుకుంటూ పోతే అంటే ఓ సంవత్సరం పాటు చేయి. వారాంతం లో ఆ వారం జరిగిన వాటిలో నీకు గుర్తు ఎంత ఉండేదో చూడు. ఇట్లా చేసుకుంటూ పోతే నీ జ్ఞాపక శక్తి పెరుగు తుంది. అంటే నీ మెదడు పదును పట్టిందన్న మాట . ఆ పై నీకు పూర్వ జన్మ జ్ఞాపకాన్ని బయటికి తీయడానికి వీలవ్వొచ్చు అన్నారట !
మరి ప్రయత్నించి చూద్డా మంటారా ?
శుభోదయం !
చీర్స్
జిలేబి.
:) :)
ReplyDeleteమంచి "టిప్" చెప్పారు. థాంక్ యు !!
Thank you "Zilebi" Memory Tip !
ReplyDeleteThanks a lot for key Madam, I will try for it :-)
ReplyDeletewho knows?
గత జన్మలో పోతూ పోతూ ఎక్కడైనా నిధి దాచి పెట్టానేమో?
?!
బాబ్బాబు ఎందుకో ఏమో గారూ .. మీ డైరీ కాపీ ఒకటి నాకు కూడా పంపండి. ఏమో ఏం చెప్పగలం. దహా.
ReplyDelete