ధమాల్ ధమాల్ డబాల్ డబాల్ !
ఏమోయ్ మనవడా, అంత విచారం గా ఉన్నావ్ ? అడిగా మా వాణ్ని, ఇంటికి వస్తూనే ఉస్సురు మన్నాడు వాడు.
వచ్చింది అర్ధ రేతిరి దాటి.
చేసే పని 'పాడు' మాలిన (పని పాటా లేని అనాలా లేక పాడు మాలిన పని అనాలా?) ఐటీ ఉద్యోగం. దేశాన్ని అభివృద్ధి కి తెచ్చిన 'సాఫ్ట్ 'వేరు' బ్యాక్ ప్యాకు మానవుడు!
'ప్చ్' అన్నాడు.
ఏమిరా అన్నా?
'నేను ప్రో ఏక్టివ్ కాదటే ' అన్నాడు వాడు.
అంటే ఏంట్రా మనవడా ? అడిగా.
' అంటే, నేనన్ని ట్లో నా అంతగా చొరవ గా దూసు కెళ్ళడం లేదటే ? '
అంటే ?
అంటే, తెల్ల మొగం పెట్టాడు వాడు.
పోనీ లేరా భోజనం చేసి పడుకో అన్నా
ఆకలి లేదే అన్నాడు ' ఈ ఇయర్ నా బోనస్ ధమాల్ ధమాల్ డబాల్ డబాలే' విచారం గా ముఖం పెట్టేడు.
వాణ్ని గమనించా.
నిండా ఇరవై నాలుగు కూడా దాటలేదు. మానవుడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. నడి సంద్రం లో నావ లా, చుక్కాని లేని పడవలా తెల్ల ముఖం పెట్టి ఉన్నాడు. ప్రపంచం లో ని భారం మొత్తం వాడి తల మీదే ఉన్నట్టు ఉంది.!
ప్చ్..
"We had everything, twenty years go, but just little of everything and yet we were happy. Now, we have more of everything, but little is gratifying the soul"
జిలేబి.
అయ్యో! బోనస్ పోయిందా :) Even today we are having every thing,but lack patience, interest and consistency. we are making ourselves busy, I don't for what this rat race is going on and on on on
ReplyDeleteమనవడు అంటున్నారు కదండీ ,అలానే అనిపిస్తుంది ,మా అక్కకి ( తను IT ఉద్యోగం వేలగబెడుతుంది లెండి ) దీపావళి కి సెలవే ఇవ్వలేదు ,నేను భవిష్యత్తు లో ఆ గుంపులో కలిసే వాడినే :)
ReplyDelete"చేసే పని 'పాడు' మాలిన (పని పాటా లేని అనాలా లేక పాడు మాలిన పని అనాలా?) ఐటీ ఉద్యోగం." ---ఖండిస్తున్నాను...ఇదేమి బాలేదండి.
ReplyDeleteజలతారు వెన్నెల గారు నాకు అలానే అనిపిస్తుంది అండి ,మరీ అంత తిసికట్టా IT ఉద్యోగమంటే ?
Delete@కష్టే ఫలే వారు,
ReplyDeleteమా బాగా సెలవిచ్చారు!
జిలేబి.
హర్ష గారు,
ReplyDeleteవెల్కం తో వెల్కం!
జిలేబి.
జలతారు/హర్ష గారు,
ReplyDeleteఅవునంటే కాదనిలే, కాదంటే అవునని లే!
ఉన్న మాట అంటే ఉలిక్కి పడడం సహజం!
దీనికి మాత్రం మీరేమీ చెప్పలేదండోయ్!-"దేశాన్ని అభివృద్ధి కి తెచ్చిన 'సాఫ్ట్ 'వేరు' బ్యాక్ ప్యాకు మానవుడు"!
ధన్యవాదాలు. కొంత రైమింగ్ కోసం ఆ పదం వాడడం తప్పించి సదుద్దేశమే!
ఐటీ వాళ్ళ జీవిత భారాలు ఒక్కొక్కపుడు కొంత 'సర్రిలియస్టిక్' గా ఉందే అని పించి అలా రాయడం జరిగింది! ప్రతి నాణేనికి రెండు వైపులు! బొమ్మా బాగుంది, బొరుసూ అప్పుడప్పుడు 'బోరింగు'!
జిలేబి.