Thursday, November 8, 2012

వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివితే తెలియును లే!

వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివి అనుభవించితే  తెలియును లే! !

ఈ మధ్య ఎవరో ఒక అజ్ఞాత మానవుడు శంకరాభరణం బ్లాగు కామెంట్లు వ్యాఖ్యల పేజీ లో ఎక్కువై పోయిందని పేచీ పెట్టాడు!

మొదట్లో చాలా సీరియస్ గా బ్లాగులు గట్రా చదివే దాన్ని. ఆ పై ఈ వ్యాఖల పేజీ కనబడింది. ఏమిటో అని చూస్తే, కొన్ని రోజుల తరువాయి బ్లాగుల లిస్టు కన్నా ఈ వ్యాఖ్యల పేజీయే  మరీ రంజు గా ఉన్నట్టు అనిపించింది.

వా హ్ వా హ్  అనుకున్నా.

ఈ వ్యాఖ్యలు ఇచ్చే కిక్కు బ్లాగ్ టపా కూడా ఇవ్వదేమో మరి అన్నంత గా వ్యాఖ్యలు మాత్రమె చదివే దాన్ని.

ఈ పైత్యం నాకు మాత్రమె ఉందనుకున్నా !

కాదన్నమాట !

వ్యాఖ్యలు చదవి టపా చదివే వాళ్ళూ ఉన్నారన్న మాట నాలా మరి ! ఈ కేటగరీ వాళ్ళే ఎక్కువేమో మరి ? అగ్రిగేటర్ వాళ్ళు (మా హారం రెడ్డి గారి లాంటి వాళ్ళు, కాకుంటే సంకలిని శాస్త్రీ ) ఏమైనా ఓ 'విచారణ' కమిటీ వేసి ఈ విషయం తేల్చి చెప్పితే బాగుణ్ణు ! కామెంటు పేజీలకి ఎక్కువ  క్లిక్కులు వస్తాయా లేక బ్లాగు పేజీ కి ఎక్కువ క్లిక్కులు వస్తాయా అని అన్న మాట !

ఆ మధ్య 'ప్రవీణుడు' వరసబెట్టి కామెంటులు రాసే వాడు. ఈ మధ్య ఈ అబ్బాయి మరీ కనిపించటం లేదు మరి ! ఏమయ్యాడో మరి ప్చ్ !  అసలు ప్రవీణుడి కామెంట్లు లేక కామెంటు పేజీ లు మరీ 'సన్న' బడి పోయేయి !

సో,
వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివితే తెలియును లే!

అబ్బా, చూడండి, కామెంట్లకి ఎంత పవరు ఉందో, కామెంటు చదివి ఓ టపా రాసేసా నొచ్!

దురదస్య దురదః జిలేబీ నామ్యాః దురద గొంటాకు హ!


చీర్స్
జిలేబి.

14 comments:

  1. కొన్ని సార్లు టపా శీర్షిక ఆసక్తికరంగా అనిపించకనో, మరో కారణం వల్లో టపా చదవకపోయినా దానిపై వచ్చిన కామెంట్లు ఆసక్తికరంగా వుండి ఆ టపాలో ఏముందా అని చదువుతాను. చాలామందీ ఇలాగే అనుకుంటాను.

    ReplyDelete
  2. దురదస్య దురదః జిలేబీ నామ్యాః దురద గొంటాకు హ!

    ===========================================

    కెవ్వు కేక: !

    ReplyDelete

  3. :) ఏమిటో..ఇలా దురద గొంటాకు రాసేసారు.

    ReplyDelete
  4. ఐతే కామెంట్లు చదివే దురలవాటు దురదగొండాకు తగిలినట్లు చాలా మందికుందనమాట, నాకే ఉందేమో అనుకున్నా :)

    ReplyDelete
  5. మరి నాకూ ఉందా దురదరోగం....:-)


    ReplyDelete
    Replies
    1. ఆ ఓరినాయనోయ్ అజ్ఞాత మీకు ఓ చురక వేశాడు కదా. :D

      Delete
  6. కామెంట్లు చదివాకే అండి, నా బ్లాగ్ అయినా మరో బ్లాగ్ అయినా..హ,హ...

    ReplyDelete
  7. బ్లాగులలోనూ ఆంక్షలేల???
    ఎవరికెంత దురద వుంటే అంత గోక్కొందురుగాక??

    ReplyDelete
  8. ఈ దురద నాకే అనుకున్నా....వ్యాక్యలు పేజీ నేనొక్కడినే చూస్తా అనుకునే వాణ్ణి...

    ReplyDelete
  9. వ్యాఖ్యల గురించి చెప్పాలంటే మీ వ్యాఖ్యలనే చెప్పాలి. ఒకప్పుడు మీ వ్యాఖ్యలను పట్టుకుని టపాలు చదివేదాన్ని. ఆ వ్యాఖ్యల పేజీ ఆరోజుల్లో కళకళలాడుతుండేది. మరోసారి ఆ వైభోగం చూడాలని వుంది జిలేబిగారు.

    ReplyDelete
  10. అజ్ఞాతల నిర్మొహమాటంగా వుండే కామెంట్లు బాగుంటాయ్. జిలేబి వారి కామెంట్లు, బ్లాగు చదవాలంటేనే ఏదో బద్ధకం, ఆవులింతలొచ్చేస్తాయి, అదేంటో! yawaaanssss :))))

    ReplyDelete
  11. అంతేగా మరి:) టపాలు రాసేదెందుకుటా!!!

    ReplyDelete
  12. రచయతల అంతరంగం ( ఒకే కోణం లో) టపా లలో కనిపిస్తే ,
    చదువరుల రియాక్షన్ ( విభిన్న కోణాల్లో) కామెంట్స్ లో కనపడుతుంది.

    చాలామంది కామెంట్ పేజి ని కూడా చదువుతారు.
    అంతే కాదు ,
    ఒక కామెంట్ వ్రాసి ఆ టపాకి కామెంట్స్ కి చందా ( సబ్స్క్రిప్షన్) తీసుకుంటారు
    దీనివలన క్రొత్త కామెంట్స్ అన్నీ మెయిల్ కి వచ్చేస్తాయి.

    ReplyDelete