ఆవుకి మేత పెట్టండి, పుణ్యం మూట కట్టు కోండి (అనబడు నగదు బదిలీ కథ)
మా అమ్మే, మా తల్లే, ఏమి బుర్ర రా బాబు ముంబై కర్ లకి అనుకోకుండా ఉండ లేక పోయా!
అయ్యరు గారు, నేనూ కలిసి మాటుంగా వెళితే, అక్కడో పెద్దావిడ , ముఖాన ఐదు రూపాయల బిళ్ళంత (పూర్వ కాలం లో 'రూపాయ బిళ్ళంత ' కుంకుం బొట్టు అనేవారు, ఇప్పుడు, ఇన్ ఫ్లేషన్ ఎక్కువై పోయింది కదండీ అందుకని అన్న మాట , ఐదు రూపాయలంత బొట్టు అనడం) కుంకుం బొట్టు పెట్టి, ముందర ఆవుకి కావలసినంత మేత, దాణా పెట్టు కుని ఉంది. ఆవిడ ఎదుట ఓ మాంచి బొద్దైన ఆవు మేత మేస్తోంది.
మా అయ్యరు వేష కట్టు చూసి 'సామీ, మాడు కు సాప్పాడు పోడు , పుణ్యం వరుం' అంది వచ్చీ రాని అరవం లో.
ఇద్దరికీ అర్థం కాలే. చూస్తే ఆవిడ ఆవు లా ఉంది అక్కడ ఉన్న ఆవు. ఆవిడ మేత పెట్టు కోవాలి గాని మేము పెట్టడం ఏమిటి అని హాశ్చర్య పోయా.
'అంబ దు రూబా, ఒరు కట్టు, మస్తు పుణ్యం , ఐనూరు రూబా క్కూడ పన్న ళాం , आप को माता जी पूर्ण आशीर्वाद देंगे '
ఔరా, ఈవిడ తెలివే తెలివి!. ఆవు తనది, దాణా తాను పెడితె అది ఆవిడ కర్తవ్యం. మనం పెడితే పుణ్యం ! కర్తవ్యానికీ పుణ్యానికీ మధ్య వ్యత్యాసం సో, నగదు బదిలీ అన్న మాట అనుకున్నా.
సో, కొంత డబ్బు పెట్టి ఆవుకి మేత పెట్టి కూసింత మూట పుణ్యం కట్టు కున్నాం.
'మాతాజీ ఉంగలుక్కు భలా కరే ' అంది ఆవిడ.
నగదు బదిలీ కి ఇంత మహత్వం ఉన్నదన్న మాట !
మరి , దేశ మాతాజీ, నగదు బదిలీ కార్యక్రమం లో ఎంత పుణ్యం వస్తుందో మరి ! అబ్బా, ఊరికే అన్నారా, మేరా భారత్ మహాన్ అని, భారత దేశం కర్మ భూమి అని !
పుణ్యం సంపాదించు కోవడం మరింకా ఏ దేశం లోనూ కుదరదు సుమీ భారత దేశం లో కుదిరి నంతగా !
చీర్స్
జిలేబి
ముంబై musings!
That is INDIA called Bharat
ReplyDeleteVery poetic by comparison and contrast.
ReplyDeleteHearty greetings
ఆ తల్లి ఎవరో దురదృష్టవశాత్తూ ఎం.బి.ఎ. లాంటి పట్టా ఏది తీసుకోలేదనుకుంటా. లేకపోతే ఈపాటికి ఏ ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలోనో ఉండి, కర్మ భూమిలో జనాలకు పుణ్యం కిలోల లెక్క సేవింగ్స్ అకౌంట్స్ లో వేసేస్తూ ఉండేది.
ReplyDelete