సుధయొప్పె సుధా కుండలి
క!ధన్యమయ్యెను జిలేబి! కదనము జేయన్
పదముల బేర్చెను; జగణము
సదనపు విషయముల పైన చతురత జేర్చెన్
క!ధన్యమయ్యెను జిలేబి! కదనము జేయన్
పదముల బేర్చెను; జగణము
సదనపు విషయముల పైన చతురత జేర్చెన్
చీర్స్
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteనరకము యెందు గలదనుచు
పరిపరి విధముల జిలేబి పరిశోధించెన్ !
అరరే ! కనులయెదుట కద
లు రక్కసి యిదే, మనుజుని లూటీ స్థలమే !
---+++---
పర్వతముల మధ్య రగిలె
సర్వములను భోక్త జేయు సలసల అగ్నీ !
పర్వము వోలె కనబడెను
అర్వాచీనపు నెగళ్ల అందము గూడన్ !
జిలేబి
ReplyDeleteఅందాల యెడారి నడుమ
వింతల గొల్పుచు నిలచెను వేడుక గన మా
నందమగు తామరవలెన్
కొంతయు కాంక్రీటులేక క్రొంగొత్తగనౌ !
జిలేబి
ReplyDeleteఖాండవ దహనము వోలెన్
అండకొనుచు కా లిఫోర్నియా రాష్ట్రములన్
యెండిన యడవులు దండిగ
మండగ కలిగించె నష్టమా దేశమునన్
జిలేబి
నీలి రంగులో, అంతంత పరిమాణంలో అయితే ఈ ఖతి బాగానే వుంటుంది. కానీ, మీరు కవితలు వ్రాసే పరిమాణంలో, నల్లరంగులో అయితే అంత స్పష్టంగా వుండదు. అక్షరాలను నీలిరంగులోకి మార్చి, పరిమాణం కొంత పెంచితే ఈ ఖతిని అంగీకరించవచ్చేమో, ప్రయత్నించండి.
ReplyDelete....శ్రీనివాసుడు
Deleteసిరి లేని వాసా
అంకోపరి యందు ఫాంటు సాయిజు ని పెంచి చూడవలె :)
జిలేబి
అంత శ్రమ ఏల జిలేబీ మాతా! తమరే ఖతిని నీలిరంగుకు మార్చి, అక్షర పరిమాణమును పెంచినచో మాకీ కడగండ్లు తొలగును కదా?
Deleteచదువుటకు నయనమ్ములు బహు చీకాకు పడుచున్నవి.
@ శ్రీనివాసుడు gaaru,
Deleteయు.జి. ఎంతో క్లిష్టమైన దానిని అతి సులువుగా అర్థమయ్యేటట్లు చెపితే,
రాణి శివశంకర శర్మ ఎమిటండి ప్రతిదానిని ఇంత క్లిష్టతరం చేస్తూ రాస్తాడు.
సారంగలో రాసిన
"తండ్రి లేని దేవుడు లేని అనాథ లోకం!"
ఈయన గురించి ఎమైనా వివరాలు తెలిస్తే చెప్పండి. అసలికి ఈయన ఎమి చెప్పాలనుకొంటాడు, ఈ విశ్లేషణలకి ఎమైనా అర్థం ఉందా?
ReplyDeleteనిజమును పలుకగ వలదో
యి! జనులకు వలయు జిలేబి యింపగు పలుకుల్
రుజుమాటల నాడగ చ
ట్టు జబ్బలనుబట్టి వెనుక టుప్పని బేల్చెన్ :)
జిలేబి
ReplyDeleteకొబ్బరి చిప్పల బూచీ
లబ్బురముగ గాంచెనోయి లచ్చిందేవీ
యిబ్బడి ముబ్బడి గాగని
దబ్బున గింగిరులు తిరుగ దమ్ములు బోయెన్ :)
జిలేబి
ReplyDeleteఒకరినొకరు హత్తుకొనుచు
సకలము మరిచిరి జిలేబి చల్లని వేళన్ !
వికల మనస్కుల యెద సా
వకాశముల నెరపు మేని వాచక మిదియే !
జిలేబి
ReplyDeleteగార్దభ క్షీరానికి గిరాకీ బాగా ఉందని పాటల పాడి పాలను పిండు తున్నారని ఓ మాటు టపాలో కష్టే ఫలే మాచన వారు రాసారు ; ఆ నేపధ్యం లో
బానల కొలదిగ పాలను
వీనుల విందయిన పాట వినగా నిత్తున్
మానక జిలేబి రమ్మా
గానము సేయంగనొప్పు గాడిదలకడన్
జిలేబి
బ్లాగులోకంలో వేలమంది ఉన్నారు అంత మర్యాద ఇవ్వవలసినవాడైతే ఇస్తాము కదా ? మీరు కూడా నన్ను వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. వాడి పరిధిని మించి వ్యవహరించాడు. వాడు ఎలా వ్రాసా(స్తా)డో నాకు తెలుసు,వాడికి తెలుసు. వాడికి చప్పట్లు కావాలంటే రెండు చేతులూ కలిసి తీరాలి ! లేదు కూపస్థమండూకంలా పడి ఉంటాను అని వాడంటే అది వాడి ఖర్మ ! మీరు బాధపడిపోనవసరం లేదు.వయసుకి గౌరమివ్వాలని మాత్రం చెప్పకండి.నాకు వయసు పట్టింపులు లేవు. అక్కడ వాడు వ్రాసింది ఇక్కడ ప్రస్థావించబట్టే వాడిని తిట్టవలసి వచ్చింది. దానికి నా బాధ్యత లేదు.నా కళ్ళబడ్డ ప్రతి అన్యాయాన్నీ ప్రశ్నిస్తూనే ఉంటాను. అది నా నైజం !
ReplyDelete
ReplyDeleteనాలుగు వాక్యముల టపా
మా లావగు ఖాళి లైన్లు మాష్టారు గనన్
మేలుగ చదువన కష్టము
జాలము నందున జిలేబి, సరిజేయమనెన్ !
జిలేబి
ReplyDeleteచేనేత చీర లందము
తానే యంబాసిడరనె తాజా జవుళీ
రాణి గద స్మృతి యిరానీ !
ఈనాటికి నిచ్చెనోయి యీ ట్వీటుయిటన్ !
జిలేబి
ReplyDeleteహోదా ప్యాకేజీ లా !
మాదా కవళము జిలేబి మాదారి యిదే !
వాదోపవాదముల జో
లే దోబూచ పలుకులకు లెక్కలు తేలన్
జిలేబి
ReplyDeleteఅన్న మునకు జనులు అలమటించిరి దేశ
మునను ప్రభువు జెప్పె మురిపెముగను
జనులకు వలయునది జవసత్వము గనుక
సున్న మున్నఁ జాలు నన్నమేల!
జిలేబి
ReplyDeleteబాటిళ్ల బిస్లరీలన
పూటుగ కల్లోయ్ జిలేబి పూర్తిగ కథలన్
వేటుల జూపున్ జూడూ
ఘాటగు కథనములు వచ్చు గబగబ నేడే !
జిలేబి
ReplyDeleteఅయినను పోవలె హస్తిన
పయి పంచెను జాపి బిలువ ప్రముఖుల లెల్లన్
అయినను జరిపెద పుష్కర
ము యిచట మేలుగ జిలేబి ముందుకు బోవన్
జిలేబి
ReplyDeleteఓహోహో చిలకమ్మా
ఆహాహా పంచదార అందాలమ్మో
బాహాట కొంటె గుట్టుల
లాహిరి జూడన్ జిలేబి లైకులు జేర్చెన్ !
జిలేబి
ReplyDeleteవారెవ్వా ! చీనా బ
స్సుర్రోయ్ ! మాజికు జిలేబి సూపరు జూడన్
బర్రని గాడీ లన్మీ
డుర్రని బాయెను కమాలు డుంటక బండీ !
జిలేబి
ReplyDeleteహనుమంతరావు గారివి
అనుదినపు హరాజికాల అల్లరి పలుకుల్
గనుడీ తరగని బ్లాగున్
వినువీధిన హాస్యజల్లు వీచిక గానన్ !
జిలేబి
ReplyDeleteటీవాలా లెక్క మరో
టీ ! వాహ్ క్యాబాత్ ! జియెస్టి ! టీమది మోడీ
గా వా రెల్లరి విజయము !
యావత్తిక మేకినిండియా వేగమునన్
జిలేబి
ReplyDeleteఔరా జిలేబి చతురత !
మారా మారీగ పద్య మాలను బేర్చెన్ !
హోరా హోరీ లందున
దారము లేకుండ పుష్ప దామము లల్లెన్ !
జిలేబి
ReplyDeleteరైల్వే కాంట్రాక్టర్లట!
హల్వా తింటూ జిలేబి అందల మెక్కెన్
కల్వపు ధాటికి సబ్సిడి
నిల్వల తీరుల తెలుపును నిక్కము నేడే !
జిలేబి
ReplyDeleteనా మాటగ హోదానిడు,
ఈమా పుష్కరపు వేడి యీరము గానన్ !
దామోదర దాస్ మోడీ
నామాలిడకమునుపిత్తు నమనము మేలౌ !
జిలేబి డిల్లీ లో మోడీ తో :)
జిలేబి
ReplyDeleteమానాన్నే నాకొక దా
వానలమగు మొదటి శత్రువనియను కొంటిన్
నా నడతలు మారంగన్
తానయ్యె గదా జిలేబి తాజూబ్ తండ్రీ !
జిలేబి
ReplyDeleteకోతి నిజాయతి గానగ
ఆ తరుచరములు జిలేబి ఆహ్లాదముగన్
మా తరు జూలంబులు మే
లౌ తమకము వీడి చెప్పె లౌక్యము గాంచన్ !
జిలేబి
ReplyDeleteచిటపట చిటపట చిరు జ
ల్లు టపటప కురిసె చెలువ కలువలు విరిసెనూ !
పిటపిట లాడిన వయసున
వటువును దోచెను జిలేబి వలపుల రాణీ !
జిలేబి
ReplyDeleteబెత్తాము మాస్టరింకను
పత్తా కానంగ రాలె, పద్యంబులు ని
స్సత్తువగ వేచె నోయీ,
మెత్తటి కందము జిలేబి మేలుకొలుపులౌ :)
జిలేబి
ReplyDeleteగురుడా కన్యా రాశిన్
పరుగుల జేరగ జిలేబి ఫలితము మేలౌ
తరుగును టెర్రరిజములున్
పెరుగును శాంతి సుఖములును భేషుగ సుమ్మీ
జిలేబి
ReplyDeleteకందకు లేని దురద లీ
చిందుల రాయుళ్లకేల చెప్పు జిలేబీ ?
డెందము నింపెడు మాచన
సుందర సొబగగు టపాల సొమ్మందరిదీ
జిలేబి
ReplyDeleteరాధా అందించు పెదవి
మాధుర్యంబు లొలకించ మానస వీధిన్
నాధుని నీదరి జేర్చుచు
నాదామృత సారమరయ నాకము గానన్ !
జిలేబి
ReplyDeleteమార్వాడీ లెక్కలు యే
లార్వాచీనంబు తల్లి లాలన యొజ్జా !
సర్వాంగ భూషిత మయపు
పర్వపు దినమందు యేల పయిసల బేరాల్ :)
జిలేబి
ReplyDeleteమాలిక మళ్లీ బిగుసు కొ
నే! లింగము గారు చూడనే లేదాయే !
మా లుకలుకల నిక యెవరు
వాలు కనుల జూడు జాల వలయము నందున్ :)
జిలేబి
ReplyDeleteఅకటా వికటపు దురదా!
నిగర్వుల మనుచు జిలేబి నిన్నిట్లనుటా ?
అకటా కన్యా రాశిన్
నికటమగు గురుడు యనంగ నిదియా ఫలితం :)
జిలేబి
ReplyDeleteశోధిని వేగమును మన వ
రూధిని మేల్గాంచె నోయి రూపసి మేలౌ
చోధన శక్తియు గూడన్
మీ దైనందిన స్రవంతి మెచ్చితి మోయీ !
జిలేబి
ReplyDeleteభారత కాలపు కథలను
నారాధించుచు జిలేబి నవనవ సుజనా
సారాంశములను మరువకు
కారా గారపు స్రవంతి కనకన గనదోయ్ !
జిలేబి
ReplyDeleteఇతరులను నా స్వరూపము
గ తెలువక తలచిన నేమి గలుగును సుమ్మీ !
కుతకుత లుడుకుచు రాముని
వెతుకుచు సాటి మనుజులని వెరచుట మేలౌ ?
జిలేబి
సిరిలేని వాసా
ReplyDeleteమీ యూ ట్యూబ్ లింకు కి ఇచ్చట స్థలము
అంకో పరినొక వైపుగ
అంగట దోసెను జిలేబి వార్చగ సిరులే
చెంగట రెట్టింపయ్యెను
చెంగున కందపు సుగంధ చేవయు గూడన్
జిలేబి
ReplyDeleteఓయీ హరిబాబూ నీ
వూ యీ శ్యామన్న వారి ఉబ్బసములకున్
సాయము బట్టితి వా ! హా
మాయ యెవరిని విడిచెనుగ మానిని గనవే !
జిలేబి
ReplyDeleteతన భర్త ధర్మ రాజా
దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ
మనగన్ పాంచా లిగనెన్
తన భాగ్యంబుగను సర్వదా శ్రీకృష్ణున్
జిలేబి
ReplyDeleteపొగిడిన బెడిదము, బెడిదము
తెగిడిన, సరసపు పలుకులు తెరమరు గగుచున్
బిగిసెను కరములు చకచక
భగభగ కనకన జిలేబి భగణపు గతియా !
జిలేబి
ReplyDeleteఆరు లక్షల వీక్షణ లందు పంచు
కొనుచు తన యనుభవముల కోట గట్టె
గదర తెలుగు పంచదశ లోకమున మేలు
గాను సెహభేషు భండారు గట్టి గాను
జిలేబి
ReplyDeleteచెప్పడము నాకు ధర్మము
అప్పడమువలె నలుగుదుము టప్పున మీరున్
గొప్పలకు బోక సఖుడా
చప్పున వైదొలగుబోస చక్కగ వినుమా
జిలేబి
ReplyDeleteచేపల బజారు గనరే !
దాపున వచ్చిన జిలేబి దాష్టీకములున్
గోపకుమారుడలక గనె
మాపటికి ఠికాణ బందు మానిని వినవే !
జిలేబి
ReplyDeleteబ్లాగులు వేదిక కావోయ్
మాకు, యిక టపాల మూట మాగట్టిగ రా
మా కట్టెద మోయీ, చా
లీ కష్టే ఫలము, విధి బలీయము గాదే !
జిలేబి
పేగులు లాగుట కాదోయ్ / చీకులు కాల్చుట కాదోయ్ / మోకులు లాగుట కాదోయ్
Deleteతమరిట, ఇక టపాల మూటల మా గుట్టుగా రా(య),
బట్టగ ఖేదమోయీ, చా
లీ నష్టే కిలుము, ఇది జిలేబీయము గాదే !
లోల...
:)))
ReplyDeleteబ్లాగుకు ప్రత్యామ్నాయం
బే కావలె సాహితీ కుబేరుని వినతీ !
మీ కనిపించిన సలహా
మాకు తెలియ జేయమనెను మాటల రేడూ !
జిలేబి
ReplyDeleteశృంఖలము లందు చిక్కెను
పంఖా లేకయు తెలుంగు బ్లాగులు గదవే !
పుంఖానుపుంఖములుగా
శంఖము లూదిన గురువులు చట్టని చనిరే !
జిలేబి
ReplyDeleteప్లాస్టిక్కు వలన చిక్కకు
బెస్టుగ వాటిని విడువుము బెటరోయ్ లైఫూ !
ఘోస్టులగుదుము మనము ఆ
బీస్టుల జోలెను గొనంగ భీకరముగనన్ !
జిలేబి
ReplyDeleteతెలిసిన భూతము మేలోయ్
తెలియని మాయా ప్రపంచ తీరుల కన్నన్
కలకాల సాహితీ సుమ
ములను పరిమళింప కేలు మోడ్చెద రామా
జిలేబి
ReplyDeleteలార్డులబకు దాసుల వా
రార్డరులను ఖాతరేల రమణీ జెయ్లే ?
బార్డరు దాటిన పిచ్చో
ళ్లార్డర్లకు విలువనివ్వ లాడూ మేమే :)
జిలేబి
ReplyDeleteపాడేరయ్యా రామా
నేడే మా శ్యామలీయ నెంజిల బోవన్
గూడెను శోభయు శుభములు
చూడగ మేలౌ జిలేబి శుభదిన మిదియే !
జిలేబి
ReplyDeleteకొలువు తీర్చి లక్కాకుల గురువు నమర
పలుకు లందలి పదములు పదనిసలన
నడచె నిచట తేట తెలుగు నాట్య రాణి
పద్దెపు కుసుమములనిట పంచి బెట్టి!
జిలేబి
ReplyDeleteగ్రహసంచారములు గదా
అహరహమూ మన గమనపు హద్దుల గనునోయ్
విహరించి బట్టిరి గదా
మహాద్భుత కధల జిలేబి మన్నిక గూడన్!
జిలేబి
ReplyDeleteలార్డులబకు దాసుల వా
రార్డరులను ఖాతరేల రమణీ జెయ్లే ?
బార్డరు దాటిన పిచ్చో
ళ్లార్డర్లకు విలువనివ్వ లాడూ మేమే :)
జిలేబి
ReplyDeleteజ్యోతిష శాస్త్రము సత్యము
కాదన గలవా జిలేబి గానుము వార్తల్
వేదన సౌఖ్యము భువినా
క్రోదన లెల్లన్ మిహిరుని కొంకర సుమ్మీ !
జిలేబి
ReplyDeleteహరిబాబని యొక బ్లాగరు
వరుసగ కామింటులాడ వడివడి గానన్
పరుగిడి వచ్చెను సుమ్మీ
పరులకు హితమును గరుపుచు పాడుపని గనన్
జిలేబి జర భద్రమ్ము సుమ్మీ :)
ReplyDeleteహమ్మయ్య బతికి పోయా :)
జిలేబి
ReplyDeleteఅదిగో భువి కంపించెను!
నిదిగో యోగీశ్వరులిట నిక్కము గనిరీ !
విధి రాతల తీరును మా
ర్చ దమ్మెవరికి గలదోయి రాశీ ఫలమౌ !
జిలేబి
ReplyDeleteస్పాముల హరిబాబితడూ
రామా శ్యామునికి బంటు రావడి జేయన్
భామా మణి బాలాగున
కోమాళి వలెన్ కమింటు గోడుల జొచ్చెన్ :)
జిలేబి
ReplyDeleteపిలిచెను గదరా కృష్ణుని
అలిగిన వేళన గురుండు అద్దరి బన్నా !
తొలగెను మానస నసలూ
వెలసెను గుండెన కదంబ వీచికలున్నూ !
జిలేబి
ReplyDeleteరామా శ్యాముని మీదకు
మా మనసును జేర్చితిమిర, మానస చోరుం
డా మురళీ కృష్ణుని లీ
లా మాధుర్యపు పసందు లాహిరిని గనన్ !
జిలేబి
ReplyDeleteచెలువారాధ్యుడనెనురా
కలకలములను చెలరేపు కామింటొచ్చెన్
లలనా, శ్యామల రావూ
మిలమిల మెరిసే సమాస మిదియే మగునో ?
జిలేబి
ReplyDeleteతెలుగునకు సంస్కృతంబును
నలవోకగ కలుపరాదు నమ్ము జిలేబీ !
కలకాలము భాష నిలువ
నిలలో నూతన వరవడి నిక్కము వలయున్
జిలేబి
ReplyDeleteస్పాముల రేడోయ్ హరిబా
బూ! ముచ్చు పనుల జిలేబి బూచోడివలెన్
తా మూలనక్కి జేయున్
కోమాళి మనుజుల తోడు కోమలి కేలన్ :)
జిలేబి
ReplyDeleteగేదెల వోలెన్ తరిమిరి
పేదలకు ఋణముల నివ్వ పెద్దలు మేలౌ !
బాధగ నమ్ముడు బోయిన
గేదెయు పూజారివార్ని గెంతుచు కుమ్మెన్ :)
జిలేబి
ReplyDeleteపూరించెను సారథి శం
ఖారావము వడవడ వణికారెల్లరటన్
గారెను రక్తము యేరుగ
పారె, పసందో ? సమరస భారత మెపుడో ?
జిలేబి
ReplyDeleteముప్పది రెండుకు రెండుగ
నొప్పిన కందము జిలేబి నొకపరి గనుమా
అబ్బురమగు పదబంధము
అప్పటి కవుల గణితంబు అద్భుతము గదా !
జిలేబి
ReplyDeleteఅరుబది నాల్గు కళలవలె
అరుబది నాల్గనగ మాత్ర లా కందంబూ !
పరిపరి విధముగ పదముల
సరితూకంబు గణితంబు చక్కగ కలిసెన్!
జిలేబి
ReplyDeleteనిండగు చంద్రునిఫోటో
మెండగు వ్యాసము పసందు మేలిమి గద! పూ
చెండుల వేళన గుండ్రని
గండర గండడని రమణి గబగబ బిలిచెన్ !
జిలేబి
ReplyDeleteబెల్జియము నగర మందున
గుల్జారుల బరచిరోయి ఘుమ్మను వేళన్!
దిల్జోయీ నయ్యెగదా
అల్జడి వలదిక జిలేబి ఆనందమిదే !
జిలేబి
ReplyDeleteరాకేందు శశి వదనయై
తా గోముగ మాటలాడి తరుణియు నివ్వన్
జాగారము జేయు పతికి
కాకర కాయల రసమ్ము కడు మధురమగున్
జిలేబి
ReplyDeleteబామ్మా బామ్మా రావే
బొమ్మల పెండ్లిన జిలేబి వోలెన్ రావే
కొమ్మా రావే రావే
రెమ్మా రావే కచేరి రేబగలికనూ !
జిలేబి
ReplyDeleteనీ బలము నీకు తెలియదు
కాబోలనుకుని జిలేబి కాస్తా లాగిం
చా బో ! కుదేలు మనకుం
డా బోలే నా యుసురులు సంద్రా లమ్మో !
జిలేబి
ReplyDeleteటీ కప్పు లో త్సునామీ !
మాకు తిరుపతయ్య గుండు మళ్ళీ కనిపి
స్తో కథని గుర్తు జేస్తోం
దీ! కన రారే పవనుడి ధీమా ! జైహింద్ !
http://varudhini.blogspot.com/2011/02/blog-post_08.html
జిలేబి
ReplyDeleteఅయిదొందల పోస్టులతో
మయికపు పద్మార్పితముల మల్లిక గూర్చెన్ !
మయిజారు చిత్ర రమణిన్
సయిగల మేనిన్ గనంగ సయ్యంటిమిగా !
జిలేబి
ReplyDeleteఅమరికగ చిత్ర పించను
నమర్చ నటుల పదహారు నంబరు దేశం
బు,మనది, గనంగ ఔరా
మెమొరాండము నివ్వ వలయు మేలిమి గానన్ !
జిలేబి
ReplyDeleteఅక్కడ పప్పూ పవనుం
డిక్కడ మోడీ జిలేబి డీడీ డాండాం !
లెక్కలు తేలుస్తామోయ్
డొక్కలు చీల్చెదము మేము డుండుం డాండాం
జిలేబి
ReplyDeleteరాహువు సూర్యుడు చంద్రుడు
బాహాటము సింహ రాశి భాగం బయ్యెన్
రాహువు గతినా చంద్రుడు
ఓహో రేపే ఖగోళ పోకడ దాటున్ !
జిలేబి
ReplyDeleteఇస్తే ఇవ్వండీ మా
దోస్తీ మాదే జిలేబి దోబూచులనన్
కుస్తీ వలదోయ్ మోడీ !
మస్తీ మనకందరికిక మాటలు మళ్ళీ !
జిలేబి
ReplyDeleteబ్లాగు నందున యేమిటి బలుక వలెను
మేము చెప్పెదము నటులే మీరు రాయ
తగును హరిహరీ ! లేకున్న తన్ను లిత్తు
ము నరుడా హెచ్చరిక విను ముచ్చట గను :)
జిలేబి
ReplyDeleteబంధముగ నేది తలచెన్ ?
బంధములకు తానెటులు కబంధము గానన్ ?
బంధముగ నేమి జేసెన్ ?
జందెమ్మును, విడిచి, యజ్వ జన్నము జేసెన్
జిలేబి
ReplyDeleteభంభం బోలే శంఖము
అంభోదర మయ్యెనోయి అద్భుత గానం !
శంభో శివ శంభోయన
అంభస్సారము జిలేబి ఆనంద మదిన్ !
జిలేబి
ReplyDeleteఎవ్వడు తానై యుండెను ?
ఎవ్వడు తననే తలచెను ? ఎవ్వడు ఎవరిన్
కవ్వముగా చిలికెను తా
సవ్వడి జేయక హృదయపు సంకేతముగా !
జిలేబి
ReplyDeleteయిందు గలదందు లేదని
సందేహము వలదు చూపు సారించిన మే
రంతా , సందుల, సినిమా
లందుల గలదోయ్ లలామ లావణ్యవతీ :)
జిలేబి
ReplyDeleteప్రాణముల నిచ్చు వాడును,
ప్రాణములను గొనెడువాఁడు పరమాత్ముండౌ,
ప్రాణస్యప్రాణంబౌ
ప్రాణము నాదని జిలేబి పరిణితి గనవే !
జిలేబి
ReplyDeleteకలడనునతడు కనబడ గమనము గను
కన్ను లన్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను
కన్ను లందు కనబడుచు కలలను గన
బడుచు తృటికాల మందున బడయ వచ్చు !
జిలేబి
ReplyDeleteతలపైన భారమును మో
సె లలితబాల చదువ వలసిన సమయమునన్ !
విలవిల లాడిన చిన్నా
రుల యీ నాటి కథలివ్వి రూపము లివ్వీ !
జిలేబి
ReplyDeleteయిచ్చిరి సెయింటు హుడ్డును
మెచ్చుచు వాటికను వారు మేలౌ థెరిసా !
వచ్చును కలకత్తాకున్
హెచ్చుగ పేరూ ప్రతిష్ట హే మమతా బేన్ !
జిలేబి
ReplyDeleteఊర కున్నను లేకున్న నుండు నోయి
నాద మయమగు మన మోక్ష నాధు డచట!
వేదన బడుచు జీవన వేదమును మ
రువకు గురుని పాదములందు రుజువు గాను !
జిలేబి
ReplyDeleteసుల్తాను శర్మ యనుచున్
బోల్తా కొట్టించె నోయి, పోరడి పేరూ
చల్తా ఫిర్తా నామూ
మిల్తా జుల్తా సునా సుమీ లగ్తా హై :)
జిలేబి
ReplyDeleteఔరా సెక్యూలరు శా
స్త్రీ ! రేతిరిపగలనక కరకర కమింటెన్
పారా హుషారు హోరుగ
జోరుగ జేసెను గదోయి సుల్తానిచటన్ :)
జిలేబి
ReplyDeleteసింధూ , గోపీ చందూ
చందము గాంచిరి జిలేబి చక్క నొలంపి
క్సందున! కొండకు చని రా
నందము గాన పెరుమాళ్ళ నందున జూడన్ !
జిలేబి
ReplyDeleteసీమాంధ్ర ఆత్మ గౌరవ
మే మా లక్ష్యము జిలేబి మేలు కొనెనుగా!
జాము పొడిచెనూ పవనుడి
లో మా పవరు, సిరియూ, చలో జనసేనా !
జిలేబి
ReplyDeleteకలకత్తా కని దేవత
వెలసెను మదరు థెరిసా !కవీశ్వర జత ప
ల్కుల, నామావళి, స్తోత్రం
బులనగ మన జనులనోట పూజల గొనునూ !
జిలేబి
ReplyDeleteసాయం కాలంబా రా
యే !యమ్మ జిలేబి నిదురయే బోవు సుమీ !
ఓ యన్నానిమసూ యిక
యీ యమ్మ నిదురయు లేక యెన్నాళ్లుండున్ :)
జిలేబి
ReplyDeleteరామేచ్చ ! యెలా జరగా
లో మనకందరికి రాసె లోకేశుడటన్ !
రామాయని జపముల నే
నీమము గా జేతు వందనీయుని గానన్ !
జిలేబి
ReplyDeleteవలబోజా నాటి టపా
వల వేసిగనెను భళిభళి వంటా వార్పూ !
అల నాటి కిక్కు లీనా
టి లలామ పలుకుల వంట టెక్కులు వేరౌ :)
జిలేబి
ReplyDeleteహరిబాబు టపాలిక రా
యరటా! అహహా ! జిలేబి యమ్మయొకతియే
కరవాలము బట్టి టపా
ల రగడ జేయును గదోయి లబ్జుగ యిచటన్ :)
జిలేబి
ReplyDeleteనాలాటి యర్భకులు యీ
బాలాగున రాసుకుంటు బాగా ఉంటే
మీలా టుద్దండులిట ట
పాలకి స్వస్తి పలుకుచు గబగబ విడుచుటా !
జిలేబి
ReplyDeleteమాయింట వినాయకుడికి
సాయముగా పందిరినట చక్కగ వేయన్
ఖాయముగ శోభ వచ్చెను
గా ! యాహూ ! వీరి చిత్ర గరిమను గనుడూ
జిలేబి
ReplyDeleteవ్యాఖ్యలను వేయ రాదని
విఖ్యాతము గావలదని విదురుని వోలెన్
ప్రఖ్యాతము గావలద
న్నా ఖ్యాతిగనౌ టపాకు నా జోహార్లూ !
జిలేబి
ఒకప్పుడు జిలేబి వ్యాఖ్యకోసం అందరూ ఎదురు తెన్నులు చూసేవారంటే అనుమానమా? తంపులు పెట్టేస్తోంటే తలుపులు మూసుకుంటున్నారు, మీరు మనసులు మూసుకున్నారు. నేటికీ జిలేబి అంటే అందరికి అభిమానమే, తంపులు లేకుంటే! :) రండి తలుపులు తీస్తాం :) :)
Delete
Deleteకామెంట్ మాడరేషన్ ఎందుకుపెట్టాల్సివచ్చిందో చెప్పగలరా? మీకిష్టమైతేనే ఈ కామెంట్ ప్రచురించండి, ఎవరూ మిమ్మల్ని కాదనలేదు, మీరే మనసు మూసుకున్నారు, ఇప్పుడు తలుపులూ మూసుకున్నారని తెలిసింది. :)మనసులు, తలుపులు మూసుకోకండి, మందిలో కలవండి.
శర్మ గారు,
Deleteనెనర్లు !
శోధిని ప్రొడక్షన్ టెస్టింగ్ జరుగు తోందండీ ! అందుకని కామెంట్ మాడరేషన్ :)
చీర్స్
జిలేబి
Deleteశర్మ గారు,
నెనర్లు రండి తలుపులు తీస్తాం అన్నారు ; రిక్వెస్ట్ పంపించా మళ్ళీ మీకు
చీర్స్
జిలేబి
ఏదీ? మీ ప్రొఫైల్ రాలా మెయిల్లో. మీఊరు పేరు వగైరా! అవి పంపండి అప్పుడు నేనే పంపుతా ఆహ్వానం
Delete"తాడి చెట్టెందుకు ఎక్కేవురా?" అంటే "దూడగడ్డికోసం" అన్నాడట అలాలేదూ
Delete
Deleteస్వామీ రిక్వెస్టిచ్చా
యేమీ రాలే జిలేబి యెట్లా యిత్తున్ :)
భామా యే వూరూ ? పే
రేమిటి ? ఓయీ లలామ రెష్యూమ్ తెలుపూ :)
జిలేబి
Deleteరిక్వెస్ట్ ఇవ్వమంటారు ; ఇస్తే నో రిప్లై :) ఎన్నదా చేసేది స్వాములూ :)
రిక్వెస్ట్ చేసిన విధంబెట్టిదన -
వర్డు ప్రెస్స్ లో లాగిన్ అయి మీ బ్లాగుని క్లిక్ చేసితిని
ఆ పై వర్డుప్రెస్స్ ఓయీ జిలేబి యిది ప్రైవేటు బ్లాగు ; నీకు తాళము వలయునన్న రిక్వెస్ట్ ఓనర్ అను బొత్తాము ను నొక్కమనెను
నొక్కగా అది చెప్పెను - ఓయీ జిలేబి నీ రిక్వెస్టును కస్టే ప్లే వారికి పంపించితి వారు నీకు కీ వార్చెదరు అనెను
యిట్లు
భవధీశాలి
జిలేబి
ReplyDeleteమనసు రమణుని గన రమణి
తనువా నరసింహమును జతగన తపించెన్
కనుదోయి సదా నవ మో
హన రాముని నిలుప సీత హాయిని బొందెన్ !
జిలేబి
ReplyDeleteలాకేత్వమ్మూ దాక్కొ
మ్మూ! కేక గదా జిలేబి ముద్దుగ నాన్న
మ్మా కాలపు కథలనగన్
మాకూ బామ్మ గురుతొచ్చె మధురపు రోజుల్
జిలేబి
ReplyDeleteఅబ్బో, భోళా శంకరు !
అబ్బాయేమో దయామయ జిలేబి సుమీ !
పబ్బపు రోజున పిల్లలు
సుబ్బరముగ జోకులెయ్య చూచుచు నవ్వూ !
జిలేబి
ReplyDeleteహా ! మెక్సికోన గ్రహణము
తామెచ్చెను బో జిలేబి తరమగు ఫోటో !
ఆ మాచన వారి టపా
లో మా బాగు గలదోయి లోచన పథమూ !
జిలేబి
ReplyDeleteవిజ్ఞుడనో కానో , చిం
తా జ్ఞాన మయమగు కాంతి తామర చెలినో !
ఆజ్ఞాపన నీదై రా
మా, జ్ఞానము బడయమేలు మాణీకముగా !
జిలేబి
ReplyDeleteచల్లగ బుడతడు పుట్టెను
తల్లికి, మీసములు మొలిచెఁ దండ్రికి, లేవే
లల్లీ నీ తమ్ముడితడు!
అల్లీ బిల్లీ యనంగ ఆడుకొనంగన్ !
జిలేబి
ReplyDeleteమా కలకత్తా దేవత
మీకట్లా యేలనోయి మింగుడు పడదూ :)
బాకా ఊదగ దండిగ
కాకా బట్టగ జిలేబి కాగల రోయీ :)
జిలేబి
ReplyDeleteలస్సీ దొంగను పట్టగ
బస్సను ఆర్నెల్లనాటి భాగోతంబుల్
బుస్సని బయటకు రాగన్
తుస్సనె ఝుంకారపు సడి తుమ్మెద నచటన్
జిలేబి
ReplyDeleteప్రైవేటు వనపు పువ్వులు
తావియు తగ్గుచు జిలేబి తంకవము గనున్ !
ఆ విడి మొక్కల దెంత హ
డావిడి ఆ రిక్తపూల డాంబికమదియే !
జిలేబి
ReplyDeleteకమ్మగ చెప్పిన కవనము
తెమ్మర వోలెను పదములు తేటగ విరియన్,
వామ్మో జిలేబి ఆహా
రమ్ము, జనాళికిఁ గడు మధురమ్మగును గదా!
జిలేబి
ReplyDeleteపదహారు ఫలంబుల నో
ము దక్షతగ నాచరించి ముదమును గనుమా !
కదలిక వచ్చును మగడికి,
ముదితుడి పలుకుల జిలేబి ముద్దులు గనునూ !
జిలేబి
ReplyDeleteమూడు పువ్వు లార ! ముద్డగు ఆరు కా
యలుగ మీరు గలరు ! అదిరెను గద !
చెట్లకి మనుషులకి చేవ నీయని పూల
కాయల యుపయోగ కార్య మేమి :)
జిలేబి
ReplyDeleteగట్టిగ బట్టుచు పాదము
యెట్టి విధంబైననేమి యీశుని గానన్
ఉట్టికెగురుము జిలేబీ !
పట్టిన పట్టు విడువకు సపదిగను నతనిన్ !
జిలేబి
ReplyDeleteరుజువౌ తున్నవి జోస్యా
లు!జనుల జీవనము లందు లుంగారాలన్ !
సజయిది గదవే వారికి
నిజ యోగీశ్వరుల మాట నిక్కము వినుమా !
జిలేబి
ReplyDeleteమెట్ట వేదాంతములకివి మేటి రోజు
లాయె ! రాముని పాదములగన నెవరు
గలరు ! రామయని పలుక గగన కుసుమ
ములను గానవచ్చు నిమిషమున జిలేబి !
జిలేబి
ReplyDeleteఆ రామపాదముల పెను
మారు తడివి తడివి మేని మాయను విడుమా !
ఆరామ మతడు విను, మన
సారా గనుమా జిలేబి సంపత్తుగనన్ !
జిలేబి
ReplyDeleteసర్వమతంబుల సారము
పర్వదిన మనంగ గంటి బండి పొలయకన్ !
గర్వమణిగెను జిలేబీ
సర్వము కృష్ణార్పణమట చక్కగ తెలిసెన్ :)
జిలేబి
ReplyDeleteయే రాగ తాళములు తెలి
వే రాలేదాయె మాకు ! వేల్పని మనసా
రా రాముని నమ్ముచు నే
నారామముగా పలికిన నా పలుకులివీ !
జిలేబి
ReplyDeleteలూటీ గదా జిలేబీ !
సూటిగ తెలిపిరట సదరు సూదికథలనూ !
కోటల వెనుకను దాగిరి
మూటల కొలది మన దస్కముల నొక్కుచునూ !
జిలేబి
ReplyDeleteలక్షల లెక్ఖన వచ్చిరి
వీక్షకు లిక్కడ జిలేబి విధిగా కామిం
తాక్షతలు వేసె లాయరు
కక్షల కార్పణ్య లోక కథలను చదువన్ !
జిలేబి
ReplyDeleteనాలుగు రోజుల వైరా
గ్యాలను వదిలి హరిబాబు ఘంటా రవమై
బోలెడు సనాతనపు ధ
ర్మాల టపాల మొహరించి రావడి జేయున్ :)
జిలేబి
ReplyDeleteమస్తుగ వస్తుంది జబ
ర్దస్తుగ డబ్బులు జిలేబి రయ్యన వాటా
బిస్తరు పరిచెన్ స్విస్సుల
కుస్తీ లెక్ఖలను నమ్మి కోకను వదిలెన్ :)
జిలేబి
ReplyDeleteహరితో జగడంబేలా
హరియించు నిను హరిబాబు హరి సరి యనవే
హరినామామృతము విడువ
గరళము తప్పదు జిలేబి కాదన మాకే :)
జిలేబి
ReplyDeleteఆ మాట చెప్పడానికి
ఈ మాచన కలమునందు యీరము మేలౌ
పామర జనులకు తెలియన్
కోమల మయమగు జిలేబి కోరెను సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteబిస్మిల్లాహిర్రహ్మా
న్నస్మిన్నభివాదయే యనంగన్ రామా
తస్మాత్మమయేవాత్మా
విస్మయ లోకాన్ననంగ విభుడును వేరౌ ?
జిలేబి
ReplyDeleteనెమ్మది గా చస్తున్నా !
అమ్మణ్ణీ నీ చిరునగువా కత్తివలెన్
కమ్మని మాటల సూదులు !
రమ్మని చంపెను జిలేబి రక్కసి యగుచున్
జిలేబి
ReplyDeleteరాముడు వలదంటాడు త
నేమో! దేవుడిని వేడ నెంజిలి ద్రోలున్
రాముని పాటలు మేలౌ
గోముగ తడుమును జిలేబి గోలమరేలన్ :)
జిలేబి
ReplyDeleteతరముల అంతర ముల నం
దు రమణి మారెను జిలేబి దూరా లెన్నో
చరవాణి వోలె చట్టున
చురుకమ్మా లతికవోలె చుక్కల కెగిరెన్ !
జిలేబి
ReplyDeleteప్రకృతి దరహాస ముల తా
సుకృతిగ సత్యము జిలేబి సుందర మీ లో
క కృతిన్ గావించగ శివ
ము ! కృతజ్ఞతలివి శివోహము ! శివోహముగా !
జిలేబి
జిలేబి గారు, దయచేసి మీరు పద్యాలను ఆపండి. నాలాంటి సామాన్యులకి అవి అర్థం కావు. పండితులకి కూడ పెద్దగా నచ్చినట్టు లేవు.
ReplyDeleteఈ పద్యాల గొడవలో మీకే సొంతమైన పదాల విరుపులతో కూడిన కామెంట్లని మిస్సవుతున్నాము.
జిలేబి గారు, దయచేసి మీరు పద్యాలను ఆపండి. నాలాంటి సామాన్యులకి అవి అర్థం కావు. పండితులకి కూడ పెద్దగా నచ్చినట్టు లేవు.
ReplyDeleteఈ పద్యాల గొడవలో మీకే సొంతమైన పదాల విరుపులతో కూడిన కామెంట్లని మిస్సవుతున్నాము.
ReplyDeleteపక్షులమరె కన్బొమ్మగ
పక్షియమరె పెదవినగవు పరమాత్మునిగా !
హా! క్షణమిదే జిలేబి ని
రీక్షణ వలదోయి మేటి రింఛోళి గనన్ !
జిలేబి
ReplyDeleteశతమానంబుగ పాటల
వితరణ జేసెను జిలేబి విదురుడు గనవే
సతతము నాతడు పిలిచెను
జతగన లక్ష్మయ్య యవనిజ సమేత విభున్ !
జిలేబి
ReplyDeleteబిట్కా యిన్బ్లాకు చెయిను
మట్కా లందును జిలేబి మరిమరి గలదోయ్
జట్కా బండి కరెన్సీ
వీడ్కో లివియే మరిమరి వేగము గానన్ :)
జిలేబి
ReplyDeleteఓయీ సతోషి నకమో
తో యీ క్రిప్టోకరెన్సి తోమాల గనన్
కాయిను బిట్లను తెచ్చితి
వోయి యనానిమసు గద నవోదయ లక్ష్మీ !
ಜ಼ಿಲೆಬಿ
ReplyDeleteనీ పేరేమీ ? వయసే
మీ? ప్లేసెక్కడ ? జిలేబి, మీదే మాదీ,
సాపేక్ష హోము మేకరు
మా ప్లేసో పంచదశపు మాయా లోకమ్ !
జిలేబి
ReplyDeleteమోడీ భజనల జేయుము
వేడిగ వాడిగ జిలేబి వేయించుచు టీ
తోడుగ నాస్వా దించుచు
జోరుగ కామింటుమోయి జోకుల రామా :)
జిలేబి
ReplyDeleteసరసపు పలుకుల సుందరి
విరసము వలదే జిలేబి విడివడ నేలన్
దరిరమ్మా ప్రియసఖి, నా
కొరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ :)
జిలేబి
ReplyDeleteఅమ్మాయి ! కులాసా యే
నమ్మా ! బ్లాగుకు ప్రయివసి నాడితి నమ్మా!
బొమ్మాళీల కలకలం
బమ్మా ! తప్పితిని బాగు బలి గాకుండన్ :)
జిలేబి
ReplyDeleteఇదియే మేలని నీవం
టి దినకరుని నాడినాను డిండిమ యనుచున్
చెదరని మనంబు తోడుగ
నదురక బెదురక కుదురుగ నమనము జేతున్
జిలేబి
ReplyDeleteనా నుంచే మా శిస్తు
న్నా నా యీమెయిలు వలదు నాకా పనుల
న్నా నచ్చదోయి! వినుమ
మ్మా నా మాటను జిలేబి మంచిగ చెబ్తా :)
జిలేబి
ReplyDeleteబాగుంది ! చిన్న మాట సు
మా! కోరితి కీర్తనలను మరికొన్నియిటన్
మాకందరికీ తెలుపుము
మా కొండలరాయుడన్నమయ్య పలుకులన్
జిలేబి
ReplyDeleteఆఖరి పేరా యిప్పుడు
లేఖరి జేర్చెను జిలేబి లెస్సగ గనుమా !
వైఖరి మారెను జనులకు
ఆ ఖరకరుడచట తెలిపె అద్దరి బన్నా!
జిలేబి
ReplyDeleteబైబిలు నేనూ చదివా !
గాభర వలదోయ్ జిలేబి గట్లన్నీ గు
న్నై భళి ! మోరీ తో ట్యూ
స్డే బుక్కును చదువు మోయి సేంపల్ గానన్ !
జిలేబి
ReplyDeleteపైనుండిస్తాంబుల్ విం
తైనన గరమౌ జిలేబి తైజస మనగన్
వాణిజ్యకేంద్రముగనూ
ఈ నగరమ్మీస్టువెస్టు లీడేర్చుసుమీ !
జిలేబి
ReplyDeleteతప్పక ప్రయత్నమును మది
యొప్పగ జేతును జిలేబి యోగము గానన్ !
గొప్పలకు బోయి నితరుల
మెప్పుల బడయుటకు గాదు మేఘజ్యోతిస్!
జిలేబి
ReplyDeleteమంత్రా లను సెల్ఫోనుడు
తంత్రమయముగా చదువుచు తా మనిషయ్యెన్ !
యంత్రముగా మారెను బో
మంత్రములను మరిచి నరుడు మాయా నగరిన్
జిలేబి
ReplyDeleteనీయయిడీ తో రాయీ !
దాయని బిలుచును జిలేబి దాపరి కాలే
లా యన్నానిమసూ! దా
నీ యంతగ నీవు బయట నిక్కము తెలియన్ :)
జిలేబి
ReplyDeleteమా కంది శంకరార్యుల
దా కామింటాంగ్ల భాష తారస బడెనూ ?
లేక యిదిమరియెవరి దై
నా కామింటా ! జిలేబి ఆశ్చర్యంబౌ!
జిలేబి