Sunday, September 11, 2016

సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !


సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
రుజుమాటల నాడుచు చ
ట్టు జబ్బలను బట్టి వెనుక టుప్పని బేల్చున్
:)
నిజమును పలుకగ తగదూ !
సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
శుభోదయం
జిలేబి

151 comments:



  1. బండిన మామిడి తాండ్రలు
    దండిగ యుండెను జిలేబి దర్శన మిచ్చెన్
    మెండుగ గొనుడీ నాడే
    యెండన పెట్టిన మిఠాయి హెచ్చగు స్వీటూ !

    జిలేబి

    ReplyDelete


  2. అడుసును తొక్కుచు కాళ్లను
    కడుగుచు మరిమరి జిలేబి కలతలు యేలన్
    విడువవలె కోరికలనూ
    గడుపవలెను సుఖముగ మనుగడ మేలుగనన్

    జిలేబి

    ReplyDelete

  3. అయిపోయిన పెళ్లికి బా
    జ యేల వినుమా జిలేబి జాగ్రత్త వలెన్ !
    పయనము సాగించు సుమీ
    భయమేలమనకు భరించు బతుకును మేలౌ !

    జిలేబి

    ReplyDelete


  4. జీవితము గాజు పెంకుల
    పై వడివడి నడక, మంచు పై నడకగ నీ
    వే విరచించు కొనవలెను
    దోవే దైనా తపించు ధోరణి గాంచన్!

    జిలేబి

    ReplyDelete

  5. నూతులు చెరువులు పూడ్చిరి
    గోతులు జనజీవనమ్ము ఘోరంబయ్యెన్
    దాతలనుమరిచిరీ ! ఆ
    ధాతను గూడా మరిచిరి దారుణ మిదియే !

    జిలేబి

    ReplyDelete



  6. జీవితము వేగమయమాయె, జీవి బతుకు
    బండి కొల్లేరు చెరువాయె, పార్థు డచట
    గీత నిస్సారమని చెప్పెఁ, గృష్ణుఁ "డౌర!
    మనుజులను మార్చు టెట్లని" మదిని తలచె !

    జిలేబి

    ReplyDelete


  7. వినుమా దుబాయి మగడా !
    'మని' లేదా మాకు పంపు; మగవాడైనన్
    కనవలసిన బాధ్యత నా
    దనిచెప్పెగదా జిలేబి తరుణము గనుచున్

    జిలేబి

    ReplyDelete


  8. ఆ రామభక్తి గతి మన
    సారా గనవలె జిలేబి, సాంఖ్యము తెలియన్
    నోరార జపించవలెను,
    భారము నీదే యటంచు భక్తిని గొనుచున్ !

    జిలేబి

    ReplyDelete

  9. గొడుగులివి పుట్ట గొడుగులు
    నడుగడుగున కన్పడునుగ నడయాడు పథం
    బడుగుగ నుండునివి గదా !
    గడగడ సూపుగ జిలేబి గాంచెను టేష్టూ :)


    జిలేబి

    ReplyDelete


  10. కోపము తాపము వలదో
    యీ ! పద మీదారి బోవ యీ లోకంమీ
    దే! పోరీ ! ధర్మాగ్రహ
    మే పాఠముగా జిలేబి మేలును గనుమా !

    జిలేబి

    ReplyDelete
  11. Why you did not publish my comment?

    ReplyDelete

  12. అంతే నండీ ! రాముని
    చెంతకు చనుటకు యెవరికి చెల్లును మనసూ !
    వింతగు లోకపు కలకల
    మంతయు తనదే యనంగ మనుజుడు మనునూ !

    జిలేబి

    ReplyDelete


  13. శతకము వెంకన్నదిదీ !
    పద, సరకును పంపుమోయి పదకము చూస్తాం,
    తితిదే యనె! రామా ! నీ
    శతకము నేనొంటిమిట్ట శరణుగ నిత్తున్ !

    జిలేబి

    ReplyDelete


  14. రద్దీ గానుండనిదీ
    యొద్దికయగు రామ భక్తి యోగము ! రామా
    అద్దరి చేరను నేర్పుము
    విద్దెను వేడుచు గొలుతును విభుడవు గానన్

    జిలేబి

    ReplyDelete


  15. మరణము తరువాయి మనుజు
    డు రణగొణల నడుమ పూర్వపు మతిని గొనియుం
    డు, రుజువులగు పించెనుగా !
    మరు జన్మ రహస్యములిక మన్నిక గనునూ

    జిలేబి

    ReplyDelete


  16. జీన్సుల మార్చగ వచ్చెను
    జీన్సు తయారీల నందు జీవుడు మారెన్
    బౌన్సగు నో తక్దీరూ ?
    చాన్సుల బోవును జిలేబి చాలిక బాబా :)

    జిలేబి

    ReplyDelete


  17. ఈ మారణ హోమానికి
    ఆ మూలము దేశవిభజన నిజము గనుమా!
    ఆ మూలాగ్రము తక్దీ
    రే మారెనుగా జిలేబి రేవడి యగుచున్

    జిలేబి

    ReplyDelete


  18. వాతము చేయగాను తెల వారగ మేల్కొని యుండగా ను తా
    యాతన గాంచెనోయి నొక యాముగ, మిత్రులు సాయమివ్వగా
    భీతిని చెంది పెండ్లి యన భీరువు గాకయు తాను మందు మా
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  19. ఆ తాండ్ర బాబు తాండ్రా !
    వాతలు బెట్టెడు లలామ వగ లే మాయెన్ ?
    కోతల మాటలు యేతా
    వాతా కనరాలె యెందు వల్ల‌ జిలేబీ‌ :)

    జిలేబి

    ReplyDelete

  20. వనితల పతిమీది వలపు
    అనితర సాధ్యము మగండ్ల కదిసుల భముగా
    దు నిజమిది యే జిలేబీ !
    గునగున నడయాడు ముద్దు గుమ్మలు వారే !

    జిలేబి

    ReplyDelete


  21. ఔరా ! వజ్ర జిలేబీ !
    కారా గారపు కలముల కార్ఖానాలన్
    బారా తెరిపించితివీ !
    పారుడు పారా హుషారు పరుగిడి బోవన్ :)

    జిలేబి

    ReplyDelete


  22. ఎవరండి జిలేబీ ! ? మా
    పవరేంటోతెలియదోయి! పారుడు చెప్పె
    న్నవకత వకలకు చెల్లుగ
    ను వజ్రమును వజ్రము గొని నూరితి నోయీ :)

    జిలేబి

    ReplyDelete


  23. కాయలతో బొబ్బాసిని
    మాయల హాసిని జిలేబి మంచిని తెలిపెన్
    సోయగపు బొమ్మ గాదా,
    గాయములేల మదిలోన గాయము మనదే ?

    జిలేబి

    ReplyDelete

  24. తూగోజీ యంటే య
    న్నీ గొప్పలుగాదుటోయి ! నిక్కము నిదియే
    మా గూడ్సుబండి వారలు
    బాగుగ మేలయిన తాండ్ర బడసిన వారూ :)

    జిలేబి

    ReplyDelete


  25. పతియే దైవము నాతని
    గతియే సతికిన్ జిలేబి గౌరవ మున్నూ !
    మతిగొనుమా మాలిని పర
    పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్ ?

    జిలేబి

    ReplyDelete


  26. బూదర బూదర బొమ్మలు !
    యీదరి మారగ జిలేబి యిప్పుడు బాగౌ !
    సోదరుడు చెప్పెనోయీ
    ఖాతరు చేసెద సజావు గను చిత్రమ్మూ :)

    జిలేబి

    ReplyDelete


  27. అభ్యర్థన! ఆహ్వానము !
    సభ్యత్వము వలయు వారు సఖులై మా సౌ
    రభ్యము గానన్ బ్లాగ్వి
    ద్యాభ్యాసంబు గరయంగ దాపుల రండూ :)

    జిలేబి

    ReplyDelete


  28. ఆహా ! మాలిక యేమి మూత బడెనూ ! ఆధారమే లేక తా
    ప్రాహారంబుల మూసియుంచెను గదా ! బ్లాగ్లోక మే బోసి బో
    యే! హా ! యేమిది విష్ణుమాయ! గనుమా యేమయ్యెనో, యేక లిం
    గా, హర్మ్యంబును సర్ది వేగముగ మా కామింట్ల సారించుమీ

    జిలేబి

    ReplyDelete


  29. హా ! యింత కాలముగ యీ
    కాయము నందున జిలేబి కన్పడెనుగదా !
    ధ్యేయము నీవని తెలియక
    సాయము నీదు వలయునను సారము గనకన్ !

    జిలేబి

    ReplyDelete

  30. ఆ చింతచెట్టు క్రిందన
    యే చింతా లేక మేథ్సు యేకాగ్రతగా
    యోచన! కొత్తమ్మన్నా
    గాచెను పుస్తక ములిచ్చి కన్నీళ్ల కథల్ !

    ReplyDelete


  31. రాజమహేంద్ర వరము! యీ
    రోజున అవధాన శంకరుండగు పించెన్ !
    ఓ జవ్వనులార సెభా
    షూ! చక్క సుమీ ! స్వరూప ! శుభసూచకమూ !

    జిలేబి

    ReplyDelete


  32. వివరములను మెయిలున పం
    పి వరము గనుమా జిలేబి పిడికెడు మెతుకుల్ !
    సవివరముగ తెలిపినను వి
    ధవిధము నభ్యర్థనలను దంచిరి‌ సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete

  33. మీతో మీరుగ బతుకవ
    లే! తోడుగ నీడగాను లేకను నెవరూ
    సాతాను వోలె వలదూ !
    మీ తావుల్మీరుగాన మీకిది సమయం !

    జిలేబి

    ReplyDelete


  34. మదనుని పదముల పెదవులు
    నదుముకొ‌నుచు మురి సెనోయి నర్జున మంత్రం!
    కదనమున కలువ చెలువక
    నుదోయి సుందరి జిలేబి నున్నతి గానన్!

    జిలేబి

    ReplyDelete


  35. పుట్టగొడుగులా బ్లాగుల
    గుట్టలను టపాలకేల గురువా బుచికీ :)
    బుట్టల జేరును కాలపు
    ఘట్టమునగదా జిలేబి ఘనతల్ గూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  36. తమరి బతుక్కాహ్వానం
    బు మరితెలియునానిమస్సు ? బుచికీ యనగన్
    గమనిస్తున్నా మరియొక
    సమయంబిట్లా యనంగ శాస్తీ శాల్తీ :)

    జిలేబి

    ReplyDelete


  37. ఓ చాకిరేవు ! నిను జూ
    చీచాన్నాళ్లయ్యెనోయి ! సెటయిరు పద్యాల్
    మాచక్కగనిమ్మా బా
    బూ! చంద్రునికి తగురీతి పువ్వుల రువ్వుల్

    జిలేబి

    ReplyDelete


  38. భామిని దినచర్యలటన్
    స్వామీ మీరేమి జేయ సమయంబని సీ
    తామాతను గనవచ్చిరి ?
    రామస్వామి యని సీత రమ్మనెనోయీ !

    ReplyDelete


  39. చాడీల్జెప్పెనుగా జిలేబి గనుమూ ! చానల్ల వార్తల్గనన్
    గూడారంబుల నాడి తాను గనెనో గోప్తంబు ఘోరంబు, పూ
    బోడీజంటలు జోకులాడు విధమౌ, బోన్సాయి మాటల్గనూ
    మోడీ డ్రాకుల యే యటంచు తెలిపెన్ బో నాడ యన్నానిమస్

    జిలేబి

    ReplyDelete


  40. హరియిచ్చెను పలుకులనూ
    హరి పలికెనుగద జిలేబి హరిహరి యనవే !
    హరి యించుక కదులగ నను
    సరించు నాతని మనంబు సపదిగనంగన్

    జిలేబి

    ReplyDelete


  41. నరుడే చంపెను గద నొక
    గరుడుని, నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
    పురుగుల చంపుచును హరీ !
    శరణుశరణు గొలుతునయ్య ! చక్కగ జూడన్ !

    జిలేబి

    ReplyDelete


  42. అమ్మోయ్! జిలేబి అమ్మోయ్ !
    యేమ్మోయ్ ! లేదా పనియని యేదీ ? హాంఫట్ !
    బామ్మా ! చంపకు వదుల
    మ్మమ్మో! పనియుంది నాకు! మంచిది చౌద్రీ :)

    జిలేబి

    ReplyDelete


  43. జ్యోతీ వలబోజుకు మా
    జోతలు ! మళ్ళీ జిలేబి జోరు టపాలన్
    ఖ్యాతిని గాంచన్ తన బ్లాగ్
    ఖాతా నందు నిడునోయి? కమ్మగ మేలౌ :)

    జిలేబి

    ReplyDelete


  44. మీరు టపాకుసరిపడౌ
    సారము నిచ్చిరి జిలేబి చక్కగ వేయన్ :)
    వేరొక టపాను వ్రాసెద
    కారా గారపు తుపాకి కలకల లాడన్ :)

    జిలేబి

    ReplyDelete


  45. పనిలేనట్టుంది జిలే
    బిని బాదండి జనులెల్ల బిరబిర రండూ :)
    కనులను తెరువుము‌ చిలకా
    కను ముందరకన్పడొక్క కరుణా మాయీ‌:)

    జిలేబి

    ReplyDelete


  46. ఒత్తుల సైతము తప్పై
    నొత్తగ బెత్తము గొనెదవు నోర్చితి వేలా
    కత్తి జిలేబిని ? గుండ
    మ్మత్తల జోలి వలదోయి మస్తుగ బేల్చున్ :)

    జిలేబి

    ReplyDelete


  47. రాజీ ప్రశ్నే లేదోయ్ !
    మాజీ దేవుడు జిలేబి మళ్లీ జేరెన్ !
    పూచీ మాదీ ఆ ప్యా
    కేజీ మొత్తము గనంగ కేంద్రము నొదలన్ :)

    జిలేబి

    ReplyDelete

  48. పబ్బిల్లలను జిలేబియు
    పబ్బపు దినముల గడగడ పట్టుగ జేయన్
    జబ్బలు బట్టుకునెను! ఓ
    యబ్బో తళుకులు బెళుకుల యమ్మో సొగసే :)

    జిలేబి

    ReplyDelete


  49. నిత్యము చచ్చే వాడికి
    సత్యము తెలియును జిలేబి సర్దుకు పోనూ !
    గత్యంతరంబు లేకను
    నత్యంతవసరముగాంచి నడచుకొనునుగా !

    జిలేబి

    ReplyDelete


  50. కార్డూ కాణీ బేడా !
    బోర్డమ్మేలా జిలేబి భోషాణంబు
    న్నార్డరు గావించమ్మా !
    బార్డరు గీసిన టపాల బాగుగ గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  51. ఎవరెవరిని తలచిరి యే
    ల వారిని తలచిరి కలలల కనులన కనన్ !
    నవనవ లాడవలెను భువి
    కువకువ లాడవలెనోయి కుందన బొమ్మల్ !

    జిలేబి

    ReplyDelete


  52. అద్దెకు గర్భా లు గలవు
    పెద్దబి జినెసుగ జిలేబి పేరును బడసెన్
    వద్దు పురిటి నొప్పి, వలయు
    ముద్దు లొలుకు బిడ్డలోయి మురిపెము గానన్

    జిలేబి

    ReplyDelete


  53. సినిమా ఒకమాదిరిగా
    అనవసరంబగు ఫయిట్లు అతి లేకుండా
    మనసుకు హాయిగ ఉందీ
    జనులకు నచ్చును జిలేబి జనతా గారేజ్ !

    జిలేబి

    ReplyDelete


  54. పవనుడు దిద్దిన కాపుర
    ము! వచ్చె పాకేజి మూట ముచ్చట గానన్
    నవనవ లాడెను చంద్రుడు
    కవాతులను భాజపా సుఖకరము జేయన్ :)

    జిలేబి

    ReplyDelete

  55. రావణ కాష్టము లాంటిది
    చావదు తగ్గదు జిలేబి చవుకగ ధరలూ !
    పోవాలికదా మనుజుల
    బేవార్సగు నడవడికలు బెస్టగు లైఫుల్ !

    జిలేబి

    ReplyDelete


  56. అన్నట్టు దిష్టి బొమ్మలు
    మిన్నగు వ్యాపా రమోయి మీజే బులనా
    డున్నెప్పుడుదస్కంబూ
    మన్నిక గాంచుచు జిలేబి మరిమరి మేలౌ !

    జిలేబి

    ReplyDelete


  57. నిను మేల్కొలుపు ప్రభాతము
    ను నేను నిను నిదురపుచ్చి నోలల్లాడిం
    చిన జోలపాట విడలే
    ను నిను నగుదునౌ సమాధి నువ్వే నేనౌ !

    జిలేబి

    ReplyDelete


  58. తనువేడ్చెను తానేడ్చెను
    మనసేడ్చెను మదియు నేడ్చె మరిమరి యేడ్వన్
    కనులేడ్చెను మిన్నేడ్చెను
    చనయేడ్చెను చనకనేడ్చె సత్తేడ్చెనుబో‌!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అభినందనలు. పద్యం బాగుంది.నాకు నచ్చింది

      Delete


  59. అరె పాపం చిరు కోపం
    సరదాగా నవ్వవోయి సారీ ఐయాం
    వెరిసారి ! పెదవి కందే
    వర కొకసారి కొరకంగ వరమీ సారీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంతాశా?
      ఏంటీ వేళ! పద్యాలింత బాగున్నాయి ? :)

      Delete


  60. సెప్టెంబరు పున్నమికి
    న్నప్డే టిచ్చిరి జిలేబి నాందీ యురినిన్ ,
    కప్టీగ సోల్జరుల ముద
    రప్టము గావించిరోయి రగిలెన్నగ్నీ !

    జిలేబి

    ReplyDelete


  61. అంగపు మార్పుల గనుచున్
    చెంగున నెగిరెను జిలేబి చేవయు గూడన్ !
    గొంగళి మారెను చిలుకై
    సింగా రంబుల గొనంగ సీతాకోకై !

    జిలేబి

    ReplyDelete


  62. ఆకాశంలో మామిడి
    నీకాశంబు కథ జెప్పె నియతియు తెలిపెన్ !
    యేకోశానగు లాజిక్ ?
    మాకే మైనా తెలుపుడు మంచిగ మీరూ :)

    జిలేబి

    ReplyDelete


  63. ఈశ్వరుడే నీవాడై
    నా స్వాంతము మరువకోయి నావారే యం
    తా స్వపర భేదము గనన్
    భాస్వంతముగా జిలేబి భాసిల్లవవోయ్!

    జిలేబి

    ReplyDelete


  64. కోటయ్యకాజ, గట్టిప
    కోడీ ! గూడెను జిలేబి కొట్టెను కత్లీ !
    వాడీ వేడిగ పొద్దుట
    పా! టప్పనుచున్ ఘుమఘుమ పాల్కోవానోయ్ !

    జిలేబి

    ReplyDelete


  65. క్రెడిటుల నిచ్చిరి కార్డుల
    వడివడిగా నిచ్చిరిగద వరమనుకొనుచున్
    పడిపడి ఖర్చుల చేయుచు
    సుడిగుండంబున జిలేబి చూరై పోయెన్ !

    జిలేబి

    ReplyDelete


  66. ఎన్నెన్నో చిలుకలు రా
    మన్నను నమ్మెను జిలేబి మరియాదగనన్ !
    విన్నావా కన్నావా
    మిన్నుకెగసినావ, నావ మీదున్నావా ?

    జిలేబి

    ReplyDelete


  67. అప్పడు యిప్పుడు యెప్పుడు
    దెప్పుడు మాటల మగండు దెసపడి యనగ
    న్నప్పట్లాయున్నావని
    కొప్పుల యందపు జిలేబి కోరలు జూపెన్ :)

    జిలేబి

    ReplyDelete


  68. యేలడ్డూ కావాలోయ్ ?
    బేలా! వినుమా జిలేబి భేషగు రీతిన్
    యేలాటి పప్పు లైనా
    మేలౌ లడ్డు, వలబోజు మేలుగ తెలిపెన్ :)

    జిలేబి

    ReplyDelete

  69. ఆందోళనకూ మానసి
    కాంతయు నెంజిల గనంగ కారణము సమ
    స్యందున మనము మునుగుటే !
    యెందును చిక్కక దొరకక యేమర మాకోయ్ !

    జిలేబి

    ReplyDelete


  70. నేనెప్పుడుపుట్టేనూ ?
    తానొప్పుగ బుట్టి యొజ్జ దారియు గనెనూ!
    మానెప్పుడు నితరులకున్
    ప్రాణాధారము, జిలేబి పారుడటులనే !


    జిలేబి

    ReplyDelete


  71. కుసుమ సముదాయమున పు
    ష్ప సరళుల వివరము పేరు చక్కగ బేర్చెన్
    పసయున్న టపా హిమజా
    ప్రసాదు గారిది జిలేబి భవ్యము గానన్

    జిలేబి

    ReplyDelete


  72. మాలిక గుర్రము నెక్కెను
    బాలుడనానిమసు చిర్రు బర్రుల నేడ్చెన్
    మేలిమి పద్యము లనుగాం
    చే లుకలుకలాడెనోయి చేవయు లేకన్ !

    జిలేబి

    ReplyDelete

  73. అన్నా నిమస్సు తనగో
    తిన్తాను పడెను జిలేబి తిక్కయు కుదిరెన్
    తిన్నగ నుండక బోయిన
    తన్నులు తప్పవు కదోయి తకరా రేలన్ :)

    జిలేబి

    ReplyDelete


  74. దోమలను తరిమెదననుచు
    తామరి యొకరాష్ట్రమున సుతారము గానన్
    తా మరిమరి సేదయు దీ
    రా, మన సారు గద కేజ్రి రయ్యనె దోమల్ :)

    జిలేబి

    ReplyDelete


  75. అన్నా నిమస్సుల హవా
    కన్నా వా ? ఆ జులాయి కన్నపు దొంగల్
    మిన్నగ హైజాక్జేసిరి
    కన్నా నీపవరు తెలియ కన్నా నొగ్గేయ్ :)

    జిలేబి

    ReplyDelete


  76. ప్లాస్టిక్కు మనీ ఓ యూ
    బీ ! స్టిక్కరు వోలె నతుకు బీస్టది గదవే !
    గోష్టీ లందున పేరు, ప్ర
    తిష్టా దక్కున్ జిలేబి తిన్నదరగదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  77. బాపును దైవంబనుచున్
    కోపము లన్నూ జిలేబి కోరిక లున్నూ
    తాపము గాంచుచు జేసెన్
    పాపము తెలియదు విభుండు పరిగణనగొనూ !

    జిలేబి

    ReplyDelete


  78. మల్లియ పువ్వుల వానల
    జల్లున తడిసిన మనంబు చక్కగ వీణన్
    జల్లన మోగించగ తన
    నుల్లము గాంచెను జిలేబి నుత్సాహంబూ‌!

    జిలేబి

    ReplyDelete


  79. ఓయీ అన్వేషీ సై
    టాయెన్నోయీ వయిరసు టాంకూ కర్కా
    ళీయా ! బాహుబ లయ్యెను
    భాయీ కంప్యూ టరిచట బాగుగ జేయీ :)

    జిలేబి

    ReplyDelete

  80. ఓయన్వేషీ నీ బ్లా
    గాయెన్నోయీ వయిరసు గార్బేజ్ ! కర్కా
    ళీయా ! 'బాహు' బలయ్యెను
    భాయీ మా లాపుటాపు బాగుగ జేయీ :)

    జిలేబి

    ReplyDelete


  81. రేపటి సొమ్మును నేడు యె
    లా పారుడు ఖర్చు జేయు ? లాజికు లేదే !
    వ్యాపా రంబుల లాభము
    గాపాడగ యేమి మాయ గావించిరి బో !

    జిలేబి

    ReplyDelete


  82. వీణా తంత్రుల గణపతి
    గానము బాజా భజంత్రి గావించె నిటన్ !
    మా నగుమోముల సామీ,
    మా నాజూకు వెనకయ్య మంచిగ జూడూ !

    జిలేబి

    ReplyDelete

  83. అత్కములైన కావ్యముల ధారణ గాంచుచు నందు రమ్యతన్
    సత్కవితానురాగముల సామ్యము గాంచిరి సారమొప్పగన్
    సత్కవు లెల్ల ; మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
    ఆత్కడి జేయు ముష్కరులనానిమసుగ్రపువాదులచ్చటన్


    జిలేబి

    ReplyDelete


  84. మోదీ యొక యంత్రంబౌ !
    కాదే త‌న వల్లయేది! ఘర్షణ గూడెన్
    జోదూ ! సెల్ఫీ యంత్రము
    నీతడు రాహుల్వువాచ నీరజ నేత్రీ !

    జిలేబి

    ReplyDelete

  85. జీన్సుల మార్చగ తరమా !
    జీన్సుల వేషము జిలేబి జీవుడు మారెన్
    చాన్సుగనౌ తక్దీరు,రొ
    మాన్సుల భరత భువినందు మనుజుల తీరున్ !

    జిలేబి

    ReplyDelete


  86. మూడు పెడళ్ళన సైకిలు
    మాడు పగులునట్లు తిట్లు మాథ్సుల జీరో
    నాడెను, సెప్టంబరు పో
    రాడెను త్వామనురజామి రాయన రాయన్ !


    జిలేబి

    ReplyDelete


  87. పదినోళ్ళబడిరి చంపిరి
    కుదిపిరి ముష్కరులు! వీరి కుత్సిత కుహనా
    గదమాయింపులకు బెదుర
    రు దమ్ముగల మా జవాన్లు రొమ్ముద్రొక్కున్ !

    జిలేబి

    ReplyDelete


  88. వరమాల వేయి మెడలో
    సరసిజ రమణీ జిలేబి సామజ గమనా !
    వరమీయ వేల! వేళా
    యెర,సుముహూర్త సమయంబు యెనగొన రమ్మా !

    జిలేబి

    ReplyDelete


  89. చిత్రపు మణిప్రవాళము,
    కత్రీన కయిపుల జల్లు, కామింటులనన్
    పత్రిక లందున జాలపు
    చిత్రము లందున గనంగ చీర్సనుచుండూ !

    జిలేబి

    ReplyDelete


  90. నందమూరి రామారావు! నటుడు, "గాడు",
    మేలు చేవక లిగియున్న మేథ, రాజ
    కీయ పరిణితి గలనేత, కీలకంబు
    నతని స్పూర్తియు దేశమునకును మనకు !

    జిలేబి

    ReplyDelete


  91. రంభా ! రోసా ! రాణీ !
    గుంభన వలయును జిలేబి గునగున వలదోయ్ !
    డాంబిక మువలదు! చేతల
    గంభీరత వలయు రమణి గౌరవము గనన్ !

    జిలేబి

    ReplyDelete


  92. నిన్నెవరు నమ్మెదరనుచు
    నన్నును నిన్నును జిలేబి నమ్మక నెవరిన్
    కన్నుల నమ్మక కానని
    కన్నడి నీ నమ్మక తను కానగ వీలౌ !

    జిలేబి

    ReplyDelete


  93. పాకయ్యె జిలేబీ యే
    కాకీ ! దుష్కార్యములను కనిరందరునూ
    తోకను ముడువక యున్న తు
    పాకీ బదులిచ్చునోయి పగగొన మాకూ !

    జిలేబి

    ReplyDelete


  94. మంచి యిహపరము లంతయు
    మించగ మంచి మనసు యెడ మించిన కీడున్
    కొంచెము యతిధిగ యుండగ
    కంచెను దాటక జిలేబి కమ్మగ బోవున్

    జిలేబి

    ReplyDelete

  95. హరిసమ్మతిగొని సన్మతి
    హరిహరి యనుచున్ జిలేబి హారము దాల్చెన్
    పరిపరి విధముల నామము
    సరాగములు రామ రామ చక్కనిదౌనో ?

    జిలేబి

    ReplyDelete


  96. డొక్కాసీతమ్మ కథల
    పక్కన నేటి మన సాటి ప్రజలన్ జూడన్
    కక్కుర్తిగుర్తు కొచ్చెను
    పక్కాగను నాటి జనుల పరిణితి మేలౌ !

    జిలేబి

    ReplyDelete


  97. నాటి కథలను చదివెనూ
    సాటిగ రాసెను జిలేబి సంస్కృతి తెలుపన్ !
    నేటి జనులెల్ల యర్థము
    దీటు గరయ నాంధ్రభారతిన్జూడవలెన్ !

    జిలేబి

    ReplyDelete

  98. మనకు మనం యుద్ధానికి
    కనకన మన కూడదోయి కవ్వింపు గనన్
    తను మన మీదకు వచ్చిన
    అనుమతి అసలు వలదోయి ఆయుధము గొనన్ !

    జిలేబి

    ReplyDelete


  99. మా సీమలోని నువ్వుల
    కూసింతగ నూగులంచు కొండంతవలెన్
    తా సైజగు ముద్దల బా
    యే! సిరి సరకు కొని తాను యెలబారెనుగా

    జిలేబి

    ReplyDelete


  100. వరదన్న చలువ యమునా
    సుడి గుండములా జిలేబి చుడిదారయ్యెన్ !
    వరదొచ్చె, హైదరాబా
    దు రోడ్డుల వెడల లలామ ధుమధుమ లాడెన్ !

    జిలేబి

    ReplyDelete


  101. మూకుమ్మడి జనవాహిని
    మూగిరి దుమికిరి జిలేబి ముందుకు బోవన్
    మా కరమోడ్పులు యొంటెల్
    శ్రీకరమై నడచెను క్రమశిక్షణ గనుచున్ !

    జిలేబి

    ReplyDelete

  102. చంపుతనని వచ్చిన వా
    డింపుగ మారె రమణ గురుడి దయగనెగదా !
    పంపెను నింటికి స్థిమితము
    నింపెను గాయత్రి జపము నిష్టయు గూడన్ !

    జిలేబి

    ReplyDelete


  103. ఒక్కటి యొక్కటి యొకటే
    పెక్కు విధంబుల జిలేబి పేర్మిని గనెనూ
    చిక్కుముడి విప్పగ తెలియు
    నక్కిన సూక్ష్మముగ విభుడనంతుడు రమణీ !

    ReplyDelete

  104. రెండేళ్ల మునుపు చెబితీ
    గండము గలదే జిలేబి గమనిక వలయూ!
    నిండెను హైదర బాదున
    దండిగ చెరువులు వరదల దంచుడు వర్షం !

    జిలేబి

    ReplyDelete


  105. ఎవ్వరు నీవన నేనన
    నెవ్వరు నీవే జిలేబి నేనై యుండన్!
    కవ్వము పెరుగును చిలుకగ
    జవ్వని మరచుచు తనువును జావళి యయ్యెన్ !

    జిలేబి

    ReplyDelete


  106. గండర గండడు నతడౌ
    కొండల దేవుడు జిలేబి కోరిన దిచ్చున్
    గుండెల నిండుగ నింపుము
    భండన భీముడు బిరబిర బసగన వచ్చున్

    జిలేబి

    ReplyDelete

  107. పగటి కల గనెను యొజ్జయు
    సగము నిదురలో జిలేబి చక్రము తిప్పన్
    జగముల నేల్జడ్జీవరు
    డగణిత లెక్కల గనంగ డామ్మని బోయెన్ !

    జిలేబి

    ReplyDelete

  108. టీ కప్పులోకొక చినుకు
    తా కప్పును వీడిపడగ తాదాత్మ్యతగ
    న్నా కరుణామయుని తలపు
    నా కన్నులరయ జిలేబి నామది గనెనూ !

    జిలేబి

    ReplyDelete


  109. మిన్నా గువోలె వచ్చుచు
    పున్నాగునుగని జిలేబి పులకాం కితగా
    గన్నాశ్రేష్ఠుండనియెన్
    సున్నమిడవె యన్నమేల చుట్టంబునకున్

    జిలేబి

    ReplyDelete


  110. రాజకీయ నిరుద్యోగి వ్రాసె పుస్త
    కమును, రంజిల్ల జేసె రకరకముగను,
    "విభ" "జన" కథను తెలిపెను వివరముగను,
    ఉండవల్లి అరుణ కుమారుడు, జిలేబి !

    జిలేబి

    ReplyDelete

  111. బ్లాగ్ గాంధీ వారి బ్లాగు పుట్టిన రోజుకి శుభాకాంక్షల తో !


    ఒజ్జకును శుభాకాంక్షలు !
    పజ్జము గొనుమా జిలేబి పట్టుగ నిచ్చెన్ !
    అజ్జా ! మాచన ! వినుమా
    సజ్జన పువ్వులను పంచ సంపద పెరుగున్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  112. నరసింహారావు లచట
    కురిపించిరి గా ప్రశంస కువలయ నయనీ !
    అరెరే లలామ కామిం
    టు రేయినగనుచు ముదంబు టుమ్రీ లయ్యెన్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నా పేరు (🤔?) చెబుతూ పద్యరత్నం వ్రాసారు మంచిదే, కానీ అంత పొడుగు పేరు పద్యంలో ఇమడడానికి ఛందస్సుకి అనుగుణంగా ఉందంటారా, లేదా "దూసుకెళ్తా" అనే స్టైల్లో పద్యం తయారు చేసేసారా? (ఛందస్సు గురించి నాకేమీ తెలియదులెండి, ఎల్లాగూ మీరే ఓ సారి నన్ను పండిత పుత్రా అని దీవించారుగా 😡)

      Delete


  113. వివరణలను కోరె చిలుక
    కవి పదముల గని జిలేబి కమ్మగ చదివీ !
    నవనవ లాడు తెలుగు పద
    కవితా కవివరు పలుకుల కా యీ స్థితియున్ !

    జిలేబి

    ReplyDelete


  114. నాతియె కేంద్రము! రాముని
    నాతియె జానకి; నహల్య నా పాదములన్
    తా తాకెను; మండోదరి
    చేతన కలిగె హరి, రామ చేవయు యొకటే !

    జిలేబి

    ReplyDelete


  115. దారుణ కాండకు ధీటుగ
    నా రణ రంగము జలంబు నాపుట యనుచున్
    భారత్ జలాస్త్ర మొక్కటి
    సారించునటా ప్రశస్త సాయుధము గనన్ !

    జిలేబి

    ReplyDelete


  116. దారిన పారెను నదివలె
    బారులు తీరగ జిలేబి బాయ్బాయ్ యనుచున్
    కారులు! జనవా హినికిన్
    తేరుచు బోవగ రథములు తేరులు బండ్లూ :)

    జిలేబి

    ReplyDelete


  117. దైవము దైవము దైవము
    యావత్కాలము జిలేబి యవనారిని తా
    కావగ బిల్చుచు యోగం
    బావల విడుచుచు తపించ బసగన తరమౌ !

    జిలేబి

    ReplyDelete


  118. దయగొన వయ్యా రామా !
    పయనము నీదే శరవ్య పరిపూర్ణమనన్ !
    శయనపు వేళన నినుదలు
    వ యోగ నిదురను గనంగ వరమును నిమ్మా !


    జిలేబి

    ReplyDelete


  119. వ్యవసాయంబును జెయ్యము!
    కవళంబమ్మా యనంగ కడుపున నకలా
    డ వణకుచు వత్తురు గదా
    చవట నగరవాసులున్ను సర్కారున్నూ :)

    జిలేబి

    ReplyDelete


  120. ఏమాయెను కంటికి రా
    యే మాయను జేసినావు యేమని చెబుదూ
    యేమీ హాయి జిలేబీ
    నామది నిదురగన లేక నా దొరను గనన్ :)

    జిలేబి

    ReplyDelete


  121. జాపాను దేశ కట్టడ
    మే పాటివి చూడుడిచట మేలగు రీతిన్
    కాపాడిరా ప్రకృతిని
    న్నా పాటవములనుగాన నాశ్చర్యంబౌ !

    జిలేబి

    ReplyDelete


  122. నగరానికి యేమయ్యిం
    ది ? కుండ పోతయ్యె వరద దిగ్భ్రమ చేర్చె
    న్నగణిత కట్టడములతో
    అగత్యముల తెచ్చుకున్న హైదరబాదూ !

    జిలేబి

    ReplyDelete


  123. కలయిక సంతోషాన్ని
    చ్చు ! లబ్జు ప్రస్థాన మిచ్చు చుండును దుఃఖం!
    వలచెద వేల‌ జిలేబీ
    కలబోతల విడి వడుటల కారణ మేదీ ?

    జిలేబి
    (ఆర్యదేవుని చతుశ్శత శాస్త్రము (1:20) నించి స్వేచ్చానువాదం)

    ReplyDelete


  124. మనసున రాముని తలచుట
    కు నొడిన లొల్లాయి జోలకును, మది తా న
    ల్లిన కవితలకున్నీ బ్లా
    గ్వనమున దిరుగుటకు, లేవె పద్ధతులు గనన్ :)

    జిలేబి

    ReplyDelete


  125. గ్రహణము బట్టెను భాస్కర !
    అహరహ మద్భుత గభస్తి! యరనిమిషం బా
    మిహిరుడు చంద్రుని మాయన్
    విహితము వీడెను జిలేబి విధియన నిదియే !

    జిలేబి

    ReplyDelete


  126. గ్రహణము బట్టిన భాస్కర !
    అహరహ మద్భుత గభస్తి! యవనత మయ్యెన్
    మిహిరుడు చంద్రుని మాయన్
    మహిలో కనబడుట లేదు మా,చనవరుడూ :)

    జిలేబి

    ReplyDelete


  127. జాణనుర యని యజమానిని బిలుచుచు
    జవ్వనపు జిలేబి జాము పొడువ
    వేళ మీర గాను వేకువ వేళన
    వాన కురియ మురిసె బడకటింట

    జిలేబి

    ReplyDelete


  128. యెలబారి పోయె మగడం
    చు లతాంగి కలతయు జెందు చుండగ తట్ట
    న్నలరారుచుండు కొమరుడు
    గలగల నవ్వగ జిలేబి కనులు చెమర్చెన్ !

    జిలేబి

    ReplyDelete


  129. మోడెము యడిక్ష నొచ్చెను
    ఆ డాటరు బాబుగారు ఆరా తీసెన్
    చూడగ టపాల ముచ్చట
    తోడుగ బాగుందనంగ దురదయు బోయెన్

    ReplyDelete


  130. తాబేలును తిన నక్కయు
    తా బోవగ కమఠమునకు తట్టెను మార్గం
    బౌ! భూరిగ మెత్తబడుదు
    బాబాయ్ నీట ననుముంచు ! భళిరా బతికెన్ :)

    జిలేబి

    ReplyDelete


  131. అనఘా ! యిమిడిరి కందము
    న నేడు మన విన్నకోట నరసింహా రా
    వు! నవనవ లాడిరి గదా
    మన వారిచ్చట జిలేబి మన చనవరులూ :)


    జిలేబి

    ReplyDelete


  132. జామున జిలేబి గాంచెను
    తామర మొగ్గలను తాక తా వాడెనటన్ !
    కౌముది, సుకుమారీ యీ
    తామస మది యేలనోయి తమకంబేలన్ !

    జిలేబి

    ReplyDelete


  133. చమురది వేదిక గాగ
    న్నమరెను నగరము జిలేబి నాకము వోలెన్
    కమలిన వాసన లెటులన్
    సమసారము జేసిరిగద సజ్జను లారా !

    జిలేబి

    ReplyDelete


  134. హరుడా రామ జపము జే
    సె! రుజువు హరి జేసె హరుని సేవయు గానన్
    హరియును హరుడును నొకటై
    సరిసమ మయ్యిరి జిలేబి సరసన గనుమా !

    జిలేబి

    ReplyDelete



  135. మానవలదోయి పయనము
    మానగ నేదియు గనంగ మానిని తరమౌ !
    మానది పెరుగుచు చుట్టుత
    కాననమగు రీతి నీవు గనమగు మోయీ !

    జిలేబి

    ReplyDelete

  136. చిత్తము లోపల నున్న న
    రోత్తము డా రాముడంటి రో! విను మోయీ
    చిత్తపు రీతి నతని పరి
    గెత్తించి నటునిటుతిరిగి గెంతను వలదూ !

    జిలేబి

    ReplyDelete

  137. కన్ను మలపకుండా వెలి
    గెన్నేయని జూడగా డికేటీ పట్టాల్
    కన్నుల జూపుచు నార్పిరి
    యెన్నిక వేళన జిలేబి యీదిన మమ్మో :)


    జిలేబి

    ReplyDelete


  138. మహిళల కు గర్భధారణ
    మహిలో కమలహుజ యాపు మన్నిక యినదీ :)
    సహితమగు వీర్యము గొనుడు
    బెహతరు బిడ్డలు పవుండ్ల బేరము సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  139. కందము లో కిట్టించగ
    గంధపు తావిగనవచ్చు కామింటులనన్
    బిందాసుగ చెప్పవలెన్
    బంధము గాంచగ పదముల బంధము గానన్ !

    ReplyDelete


  140. దూషణ విమర్శ వేరౌ
    పాషాణమువలె జిలేబి పరుషము వలదోయ్ !
    ఘోషా వీరులు జోరుగ
    వేషా లేసిరి గనంగ వేరౌ వేరౌ :)

    జిలేబి

    ReplyDelete


  141. అయిదంతస్తుల వంతెన
    నయగారంబులొలికించె నవ్యపు రీతిన్ !
    హొయలన సోయగములనగ
    పయిదలి నడుమందమువలె పరిపరి రీతీ :)

    జిలేబి

    ReplyDelete

  142. హరివిల్లువలె మనమ్మున
    సరళంబవ్వవలెను గద సఖుడా ! కృష్ణా !
    గరళంబు కత్తికట్టుట!
    శరముల సారింపను హృది సరియన లేదే !

    ReplyDelete


  143. ఉల్లి తరుగుచుండెను దరిరా గన్నీరు
    కన్నబిడ్డ కంట గార, మిడెను
    తల్లి చీర కొంగు తడిజేసి కన్నుల!
    తల్లి చేయు సేవ నుల్లి జేయు ?

    జిలేబి

    ReplyDelete


  144. చిరుతిళ్ళు! యటుకులు !మురుకు
    లు!రుచికరము! పాలకాయలు, చెరుకు గడ లా
    విరికుడుము లూచ బియ్యము
    మరి,జంతిక!వెన్న జున్ను మామిడి పండూ :)

    జిలేబి

    ReplyDelete


  145. పోలవరము మనకు వరము !
    చాలదు పనిజోరు! మీరు సాధించవలెన్
    కాలపరిమితిది! చంద్ర
    న్నా! లక్షల డబ్బులిచ్చు నాబార్డున్నూ !

    జిలేబి

    ReplyDelete

  146. తరచూ హరి తానొక్కటి
    ని రమించుచు కోరుచు కమనీయంబుగన
    న్నరసియు సొలసియు వేరొక
    పరమును గాంచును జిలేబి పరమావధిగన్ !

    జిలేబి

    ReplyDelete


  147. భక్తజనకోటి పాలిటి
    భోక్తవు సుగుణాభిరామ భువి,దివి లోనన్ !
    వ్యక్తంబవ్యక్తంబగు
    శక్తివి పరమాత్మముడవు సకల జనులకున్ !

    జిలేబి

    ReplyDelete

  148. వంతెన ఛేదించుచు తా
    వింతగ మొలిచెనొక మొక్క వీధిని గనుమా !
    చింతన వలయు జిలేబీ,
    నంతయు పరమాత్ముడా యనంతుని లీలౌ !

    జిలేబి


    ReplyDelete