Saturday, March 4, 2017

ఉత్పలమాల సాటియగు ఉత్పలమాల జిలేబి యే గదా !



ఉత్పలమాల సాటియగు ఉత్పలమాల జిలేబి యే గదా !
 
 
 
స్థావరమౌ వికుంఠపురి సన్నిధి వీడి వరమ్ము నొందగా
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై
పావనిలక్ష్మి గూడెజత, పన్నగ లక్ష్మణుడాతనిన్ సదా
సేవలగాంచ మోక్షమను సేవను గూర్చెను యుద్ధమందునన్ !


శుభోదయం
జిలేబి






202 comments:



  1. ఏ పద మావిడెట్లు గను, నెవ్వరి కైనను యర్థ మౌన? తా
    నో పలు కట్ల వేయ యిటు నోటన వేరొక యర్థ మొచ్చునే
    రేపగ లెల్ల పద్య ముల రేసుగ గాంచు జిలేబి మేడమా
    యే! పద సర్దు కోవలెను యెంచగ మేలగునయ్యలారహో !

    జిలేబి

    ReplyDelete


  2. సాగగ జీవితంబు మనసాత్మజునిన్దలచంగ మేలిమై
    మ్రోగగ గంటలున్, హృదిని మోహము వీడగ, భవ్యమౌ సుధా
    సాగరమందు దేలి మది సారములెల్ల మనోజ్ఞ వీక్ష్యమై
    త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్

    జిలేబి

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. త్రాగిరి దేవ దానవులు , త్రాగిరి యఙ్ఞములందు రుత్వికుల్
      త్రాగిరి నాడు నేడు మహరాజులు నేతలు , తప్పుగల్గుచో
      త్రాగుదురా ? మహాత్ము , లమృతత్వ మహత్వము లబ్బె నేమొ ! ఆ
      త్రాగిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్ .

      Delete
  3. ఉత్పల మన్న నాపదల కోర్చి సమున్నతి పైకి లేచుచున్
    ఉత్పలతన్ వికాసముల నొందును చెర్వున తెల్ల గల్వయై ,
    సత్ఫలమైన కార్యముల చక్కి వచించెద రుత్పలమ్మటం చీ
    యుత్పలమాల సాటియగు నుత్పలమాల జిలేబియా ? హితా !

    ReplyDelete
    Replies


    1. తిట్టారా ? :)


      కొండ గుర్తుకోసం అట్లా రాసుకున్నానండీ :) అంతే !


      జిలేబి

      Delete
    2. ఉత్పలమంటే కలువ . కలువ పెరిగి పూవుగా పరిమళించే దశ వరకూ అనేక అవరోధాలు . ఐనా , ప్రతి సారీ అధిగమించి తల యెత్తుకుని నిలవడం కలువ గొప్పదనం . మీరూ కలువతో పోల్చుకున్నారు మరి ! అందుకే అలా అడిగా .

      Delete


    3. హమ్మయ్య !

      కొంత నిభాళించుకున్నా :)


      జిలేబి

      Delete


  4. బాలకుమార! లోలకపు పాటిగ తానగుచున్ ధనమ్ము సం
    చాలన మెల్ల గూర్చి సహ చర్యము గాను‌ జిలేబి బోలు నా
    రీ,లవ లేశ మైన తను రీఢము గాన క సేవ గానెడున్
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కూళల కేల మ్రొక్కవలె ? కోటికి కోట్లు ప్రజా ధనమ్ముతో
      పాలసులైన పాలకులు పండుగ జేసుక దోచుకొందుకా !
      మేలును గీళ్లు పంచుకొని మిమ్ము తరింపగ జేయు తల్లులన్
      స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిధ్ధరన్ .

      Delete


  5. వెంకటరాజ ! మీకవిత వేగమునంద లి మాధురీఝరిన్
    శంఖపునాద గానమున సాక్షిగ శంభుని రావమెల్లెడన్
    శంకరివీక్ష్య పాదముగ సాధన గాంచె ను సుమ్మి నాదమై
    యింకను మీరు పద్యములు యిత్తురు గాక జిలేబి లూరగన్

    జిలేబి

    ReplyDelete
  6. బిరబిర రాయు కందమైనా
    భరనభభరవ మాలైనా
    జిలేబికి జిలేబియే సాటి :)

    ReplyDelete
    Replies


    1. బిరబిర కందంబైనన్
      భరనభ భరవగ జిలేబి బంధంబైన
      న్నరయగ జిలేబికి జిలే
      బి రసంబటు సాటిగాద బిరబిర బరుకున్ :)

      జిలేబి

      Delete


  7. జీవిత మెల్ల సాధనగ చింతనగాంచు జిలేబి సాధ్యమౌ
    భావిత రమ్ము మేలగును భాగ్యవిధాత సుమేరు రూపమై
    మావిడి గాయ కాలమున మామిడిపండు యగున్, విభావరిన్
    రేవులు తీరు గాంచునటు రేయిపగళ్ళు సమాన రీతినిన్

    జిలేబి

    ReplyDelete


  8. భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై,
    నార్యుల గాంచె,రాజువలె నా గుజరాతును నేలె, నేతయై
    శౌర్యము, గట్టి వాక్పటిమ, చక్కగ నందరితో సమాఖ్య, చా
    తుర్యము జేర్చి దేశమున దూకొనె గాద జిలేబి మోదియై !

    జిలేబి

    ReplyDelete


  9. యోచన సారమైవెలుగ యోగముగానక నమ్ము మయ్యరో
    నీచదశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్,
    మాచనవర్యుడా వినుము మానినిపల్కుల, విద్య యొక్కటే
    సాచివిలోకితంబవదు ! సాధనజేయవలెన్ జిగేల్మనన్!

    జిలేబి

    ReplyDelete


  10. మాచనవర్యుడా ! జనుల మానసమెల్లను దోచి నావు సు
    మ్మీ! చరితార్థుడా! చదువ మీకథ మా హృదయంబు జల్లనెన్
    యోచన జేయ దీక్షితుడ , యుత్తమమై మన జీవనమ్ము నన్
    సాచివిలోకితంబగుచు శాంభవి హస్తము గాన్పడెన్ సదా !

    జిలేబి

    ReplyDelete


  11. ఓమునివర్య ! లక్ష్మణుని యూర్మిళ పెండ్లి గొనంగ హాలియౌ
    రామునకున్; సహోదరి ధరాసుత సీత గదా తలంపగ
    న్రాముని తమ్ముడా భరతు నాలియ మాండవికిన్; కవీశ్వరా
    కోమలి కోడలయ్యె నదికో శ్రుతకీర్తి సుమిత్రకున్ గదా !

    జిలేబి

    ReplyDelete

  12. ఉత్పలమాల

    దోచితి వమ్మ మామదిని దోగురు గానుచు గారవమ్మునన్
    నీ చిరునవ్వు మోముగన నెమ్మది గాంచితి నమ్మ రాధికా,
    వీచిన మందవాతమున వీగెను శైలము దూది భంగిని
    న్నో చినదాన! బోయెనటు నోపిన తాపము వీడుచున్నటన్‌


    జిలేబి

    ReplyDelete


  13. ఎప్పటి కైన మేలగును యెన్నటి కైనను భేషుగానగున్
    గొప్పల కీడు జేసియటు కోటికి మింటికి యెక్కు వారలన్
    చప్పున నేల మీదికటు చట్టన నెట్టి మదంబు తీఱుచన్
    తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్

    జిలేబి

    ReplyDelete


  14. అమ్మయు నొక్క తేయనుచు నాతనికిన్ తెలియంగ బోవకన్
    నెమ్మది గాన లేక మది నెంజిల బోవగ కర్ణుడచ్చటన్
    తమ్ముల మీద మత్సరము దాల్చె ; సధర్ముడు రాముడుద్ధతిన్,
    నమ్మి విభీషణుండు శర ణంబన, కొంతయు గూడ గానలే !

    జిలేబి

    ReplyDelete


  15. జాణల చూడగన్ వలపు జాలము మేనిని చుట్టి వేయు నా
    ఘ్రాణము జేయు పుష్పముల గండుక లాడుచు గుండు తుమ్మెదల్
    రాణములై, జిలేబి, మజ ! రాసము మన్మధు సౌమనస్యమౌ
    బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్

    జిలేబి

    ReplyDelete


  16. కోతల రాయులెల్లరు వృకోదరు సాటి జిలేబి జేతురే ?
    మూతుల మీసమెల్లనటు ముఖ్యముగాదు సమన్వయంబునన్
    హాతువు గాంచి నేర్పుగొని హాకపు తీరు రణమ్ము జేసిని
    ర్భీతినిగొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్ !

    జిలేబి

    ReplyDelete


  17. వారిని జూడ తూగె మది వాకలువేసె మరింత గానటన్
    సారము గాంచె జీవితము, సాజము గాద సమీచికిన్ జిలే
    బీ, రస రమ్య వేళనటు బింకపు పట్టును వీడి ముద్దమం
    దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్ !

    జిలేబి

    ReplyDelete


  18. చారణుడాడ, నట్టువము సాధన జేసిరి యిర్వురున్నటన్
    జోరుగ జోడు గట్టి యట జొంపపు మాటున ముద్దులాటలన్
    జేరుచు సోర పిల్లడటు చెంపకు గంధము బూయగన్నలం
    కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ !

    జిలేబి

    ReplyDelete


  19. కామము, నీతిబాహ్యమగు కార్యము, దోపిడి దుష్టచర్యలున్
    రాముని రాజ్యమందుఁ గనరావు గదా! శ్రుతి ధర్మపద్ధతుల్,
    సామము హెచ్చుగా జనులు సత్యము శాంతము యజ్ఞయాగముల్
    నేమము గాంచిరౌర, భళి, నెమ్మికి మారగు పేరు నేటికిన్ !

    జిలేబి

    ReplyDelete


  20. తానము తప్పె కర్షకుడి తాహతు తగ్గె జిలేబి కొంతయున్
    వానలు లేక, యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్
    మీనము లన్ని జీవములు మిక్కుట మైనటి యెండ తాళక
    న్నా నవ వృష్టి కై కొలువ నప్పతి పూన్ప పరామృతమ్మునౌ !

    జిలేబి

    ReplyDelete


  21. పొద్దటు రాక ముందు తను పోటి గనన్ శుభ కృత్య మెల్ల తా
    యొద్దిక గాను జేసి మది యోగపు సాధన గాన మేధయు
    న్నద్దరి తోడ్ప డన్ ప్రజల నాడిని బట్టుచు మోదియై భళా
    నిద్దుర పోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్


    జిలేబి

    ReplyDelete


  22. చల్లగ గావు మయ్య మము చక్కగ బేర్చితినౌ జిలేబి నై
    మెల్లన నెమ్మి గానుము సుమేధయు నిచ్చుచు మమ్ము సర్వదా !
    యల్లన గాంచి నాను నిను యందరి రాజువి దండలేల! నే
    నల్లని మల్లెలన్ గొని ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్!

    జిలేబి

    ReplyDelete


  23. వారిజ నేత్రి పద్యముల వాలుగకంటి జిలేబి వేగమై
    సారము గాంచినాననుచు సన్నిధి గాన సువర్ణ బిందువౌ
    వారిశు డచ్చటన్ వణికి వాతలు తప్ప, విమందనమ్ము‌ దా
    గోరి, జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై!

    జిలేబి

    ReplyDelete


  24. తిన్నగ జేయ పూజలను తీరుగ నయ్యెను నెమ్మి , నీశ్వరి
    న్నన్నులమిన్న సాకతము, నద్భుతమయ్యెను యన్నపూర్ణయై
    మన్నన వృద్ధి గాంచనట, మానస మెంతొ యనంత మై చెలీ!
    అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్

    జిలేబి

    ReplyDelete

  25. ఇప్పటి దాక చూచితిమి యిచ్చట కొంత తెలుంగు మాటల
    న్నప్పక పోయి నన్ నరయ నర్థము గాక జిలేబు లైననౌ !
    చెప్పెను నేడు యమ్మ గద చెంగట యర్థము గాని గోలయై
    కొప్పుల నాటి లోలలను గుంభన గానటు పద్య పేర్పులన్ 🙂

    జిలేబి

    ReplyDelete


  26. వీరుల మానసాంబుధిని వీకొనగాను నిరాశ, కావలెన్‌
    తీరగు రీతి యూరటయు, తిమ్మయు గానగ మేని, వారికిన్
    జోరుగ సాగ జీవితము జోకము లేక, జిలేబులూర స
    త్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్ !

    జిలేబి

    ReplyDelete


  27. గాయము గాంచెనౌ మదియు కాలపు సాయము బోవగన్నిటన్
    న్యాయము గాదు భారతి వయస్యులు తెక్కలిపాటు లోనవన్
    పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే
    చేయన యత్నమున్ గురువు చేర్చును లబ్ధిని సోవసీయముల్

    జిలేబి

    ReplyDelete


  28. ఓమధురాధిపా! వినయ మోహన! మా చిరకాల మిత్రమా!
    శ్రీమయ మౌ శుభమ్ములను శీఘ్రము గా జను లెల్ల దూకొనన్
    చీమల గొల్చినన్ గలుగు శ్రీకర సంతత భోగభాగ్యముల్
    నీమది నిల్పుచున్ పనుల నీమము గా సరి జూడ సామ్యమై !

    జిలేబి

    ReplyDelete


  29. అన్నులు మిన్నగన్ మదియు యా పర మాత్ముని గాంచ కోరినన్ ,
    కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్
    మిన్నగ గావలెన్ మనము, మిక్కుటమై తగు కాంతి పుంజమున్
    తిన్నగ జూడనౌ తపము తీవ్రము జేయ వలెన్ జిలేబి సూ !

    జిలేబి

    ReplyDelete

  30. ప్రోడ!జిలేబి ! శీతల తపోనిధి బ్రోచెను లోక మెట్లు సూ ?
    గూడెను పార్వతిన్నెవరు కూర్మిని జేర్చన లోక మెల్లెడన్ ?
    వాడని పువ్వులన్ తొడుగు వాడిమి కృష్ణుడు చంపె నెవ్వరిన్ ?
    గాడిద నెక్కి; శంకరుఁడు; కంసునిఁ జంపె దయావిహీనుఁడై.

    జిలేబి

    *శీతల తపోనిధి -> శీతలాదేవి - Goddess of small pox;

    ReplyDelete


  31. వీనియ నందు తంత్రులటు వీనుల విందుగ జేయు నాదమై
    జ్ఞానము, భక్తి కర్మల సజావుగ జేయ వలెన్ జిలేబి, ఓ
    మానిని! నీవు మేలుగను మార్గము జీవన మందునన్ సదా
    ధ్యాన మొనర్చుటే! మిగుల యజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్!

    జిలేబి

    ReplyDelete


  32. రోసము వేడి తాపములు రొష్టులు తీవ్రతరమ్ము గానగున్
    వేసవి కాలమందు, చలి వెక్కసమై వడకించు నెల్లర
    న్నాసిక గాను దిబ్బడ మనమ్మది డీలగు శీతకాలమున్
    వాసము సూవె బందిగము, వారుణి వాహిని పారు నెల్లెడన్ !

    జిలేబి

    ReplyDelete


  33. ఆముని వాటికన్ మయిల యైపడి యుండెను లేమ గాద?"ఆ
    రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య" చిత్రమే
    యీ మినుకున్ గనంగ సుమ, యీవిధమై యన కారణంబదే
    దో మరి గానరాదు! భళి దోగ్దృల ధోరణి చిత్ర భావముల్ !

    జిలేబి

    ReplyDelete


  34. పాగెము గానవచ్చె గద భాగ్యముగా కృప, సోవసీయమై
    సాగగ యత్నమెల్లనట, సాధన జేయగ మానసమ్మునన్
    యోగము గూడి వచ్చె సుమ, యోగ్యత నొంద జిలేబియై భళా
    మూగ, బిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్

    జిలేబి

    ReplyDelete


  35. గుండెలు మండియెల్లరట గూటికి జేరిరి గాదె ! ఓ కవీ !
    బండెడు బందె మధ్య పద బంధపు చల్లని గాలి బీల్చుచున్
    మెండుగ చెప్పినావు గద మెల్లన జూచితి వయ్యరో కలన్
    మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్ ?

    జిలేబి

    ReplyDelete


  36. సంద్రము లో జనింపగను చంకుర మై గ్రహియించె నెవ్వడో ?
    మంద్రము గాను గాధిజుని మాటగ రాముడదేమి జేసెనో ?
    ఇంద్ర తనూజుడా రవిజునిన్ హత మార్చగ మెచ్చె నెవ్వడో ?
    ఇంద్రుఁడు; సీతకై ధనువు నెత్తెను; శల్యుఁడు మేలుమే లనన్ !

    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  37. స్వాంతము గూడి మేనియటు సాజము గోర, జిలేబి, యా ఉమా
    కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో ?
    వింతగ లోకమెల్ల సరి వీణియ జేర్చగ, కోకిలమ్మ యున్
    చెంతన జేర, చంద్రుడటు చీకటి దోలుచు నవ్వె నెందుకో ?


    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  38. నేరము జేయు వాని దరి నెక్కొను ధారణి గాద నాతడౌ
    సోరణి దివ్వియల్ నడుమ శోభిలు చీకటి లోన కార్యమున్
    నేరుపుగాన దీర్చు ! భళి! నేర్వదగున్ ప్రణిధిన్నటంచు నా
    జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో

    సావేజిత
    జిలేబి

    ReplyDelete

  39. కొందరు పేరడీలు మరికొందరు హాస్యము జల్లి పద్యముల్
    కొందల మంది కొంద రివి కూడ లిఖింపు మటన్న కోరికల్
    కొందరు నవ్వు లాపుకొన కుండని కారు ప్రయాణముల్ భళా !
    మందిని మంత్ర ముగ్థులుగ మార్చెగదా ! లలితమ్మ బాపురే !

    -లక్కాకుల రాజారావు

    కొందరు పెద్దలున్ కవులు కొందరు కొందరు పండితోత్తముల్
    కొందరు వాగ్విదాంవరులు కొందరు వాదవిహారవిక్రముల్
    కొందరు సర్వమున్ తెలిసికొన్న మహాత్ములు కొంద రజ్ఞ్లులున్
    వందన మెల్ల వారలకు వాదము లోర్వగ నేర నల్పుడన్

    -శ్యామలీయం

    కొందరు వైవియారులన, కొందరు రావులు శ్యామలీయులున్
    కొందరు దీక్షితుల్లటన, కోవిదు లౌ లలితమ్మలున్ సుమా !
    కొందర హో జిలేబులట గోడనుచున్ విలపించు కొందరున్ !
    వందన మమ్మ వారి కభివాదము లొప్పు శుభాంగి సర్వదా !

    -జిలేబి

    పేరడీ ల ప్రహసనం :)

    ReplyDelete
    Replies
    1. "కొందరు వైవియారులన, కొందరు రావులు శ్యామలీయులున్
      కొందరు దీక్షితుల్లటన, కోవిదు లౌ లలితమ్మలున్ సుమా !
      కొందర హో జిలేబులట! కొందరటన్ నరసన్నలున్ భళా !
      వందన మమ్మ వారి కభివాదము జెప్పు శుభాంగి సర్వదా"

      అన్నది మీరు ఈరోజు YVR గారి బ్లాగ్ లో వ్రాసిన పద్యం.
      అదే పద్యం పైన మీ బ్లాగ్ లో వేసుకునేప్పుడు "నరసన్నలున్" అనేది మార్చేసి, మీ పేరడీలనుంచి నన్ను తప్పించినందుకు థాంక్సండి జిలేబి గారు.

      Delete
    2. రాజారావు గొరూ మన్నించాలి. నేను మీ పద్యాన్ని చూడలేదు. అనుకరణ చేయలేదు. ఐనా ఇటువంటివి కొత్తవీ కావుకదా.

      Delete


  40. రాజులు వీరులెల్లరన రావడి ఉత్తరు డచ్చటన్ గనన్
    తేజము ధైర్యమున్విడచి తేకువ ముప్పిరవన్ రథంబునన్,
    హా!జమలించి,యాతనికి హావడి బోవ బృహన్నలే సుమా,
    గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి, గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై !

    జిలేబి

    ReplyDelete


  41. ఓసరసీ! జిలేబి ! పద మొప్పదు యర్థము గాదు యే పసా
    వాసన లేకయున్ యతియు ప్రాసయు లేకయు చంపకంబగు
    న్నీసర బాణముల్లరరె ! నింగిని తాకిన నేమి పద్యముల్
    కోసుల దూరముల్ పరుగు కోతికి గుర్రము పేరు నిచ్చునే :)


    జిలేబి

    ReplyDelete


  42. నాతి జిలేబి పద్యముల నాట్యవినోదములన్ గనంగ నౌ
    రా! తమకమ్ము జూచి తల రాతగ బోరుమనన్ కవీశ్వరుల్
    కోతుల కెల్ల నమ్మకము కొండొక చో గలుగంగ యీశ్వరా
    రాతికి కండ్లు గిఱ్రుమనె వ్రాలె తనూలత భస్మ శేషమై!


    జిలేబి

    ReplyDelete


  43. రంగి!జిలేబి! కాలమిది రంగుల దుస్తుల తో జనావళిన్
    బెంగల దీర్చెదమ్మనుచు పీఠములాశ్రమముల్ సమూహము
    ల్లాంగన రంజితమ్ముల విలాసములన్ మజ గాంచుచున్, భళా,
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్

    జిలేబి

    ReplyDelete


  44. బింకము లేక నివ్వెరగు భీతమృడీకము గాదు లేమలౌ
    వంకలు గాంచి మీదపడు వ్యాఘ్రపు బుద్ధుల నెల్ల బాదునౌ !
    జంకదు మిమ్ము గాంచి సుమ ! జాణతనమ్ముల గుబ్బతిల్లెడౌ
    జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో!

    జిలేబి

    ReplyDelete


  45. మిద్దెలు గట్టి పెద్దలకు మిక్కుట మై పరమోన్నతిన్నిడ
    న్నద్దరి చేర దయ్య ! విను నమ్ము, నిమీలనమున్ మహాశయా
    శుద్ధము గాను పిండముల సూక్ష్మము జేర్చ సహాయమౌ, గనన్
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై

    జిలేబి

    ReplyDelete


  46. రోడ్ సైడ్ రోమియో మొర !

    అన్నుల మిన్నగాంచితిని యచ్చెరు వుల్లట చేరి పాఱగన్
    కన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్,
    పెన్నిధి యై పదంపడుచు పేరడ గించెను మిత్రమా భళా
    తన్నులు తప్పె చక్షువులు తామరకంటిని జూడనౌ సుమా

    జిలేబి

    ReplyDelete


  47. ఘల్లన గుండెజారెననఘా! మది తూగగ రేయి చంద్రునిన్
    తల్లజ మైనకాంతిగని తామరకంటి నిడూర్పు లన్నటన్
    మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే
    కల్లయు కాదు చిత్తరువు గాదు సుమా మధురాపతిన్ గనన్!

    జిలేబి

    ReplyDelete


  48. సోరణగండి వెల్తురున సోగతనమ్ముల మత్తుగానుచు
    న్నో రమణీ జిలేబియ ! మనోరమ ! గాంచితివా కలన్? యెటన్
    భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్?
    సారవమున్ భళీ యనుచు చక్కగ గట్టితి వమ్మ సోదరీ !

    జిలేబి

    సోరణగండి - గవాక్షము

    ReplyDelete


  49. తమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి, ముదంబున తానె పెద్దయై
    యమ్మణి సోదరుండనుచు యాతము దెల్పి, జిలేబి, గానవే,
    కమ్మని పల్కులెల్లెడను కాదను లేదను మాట బల్కడౌ
    నెమ్మిని బంచునౌనితడు, నేర్పరి యౌ యని చెప్ప గన్ భళీ!

    జిలేబి

    ReplyDelete


  50. చూచితి మీదు నేత్రముల, చూసిన పీఠములన్నియున్ కవీ
    వేచెను మానవీయతను వేగిర వృద్ధిని గాంచ నోయనన్
    తోచిన రీతి చెప్పితిని, తోయజ మాలల రూప మై సుమా
    నోచిన నోము లన్నియును నోర్మిని పెంచ వలెన్జిలేబులై !

    జిలేబి

    ReplyDelete


  51. రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే?
    ఏవణికన్గొనన్ మదిని యేలిక చేసిన యీ సమస్యకున్
    వావిరి యౌ సమాంశములు వచ్చుట లేదు సుమా సురంటియై!
    దేవర! శంకరాభరణ దీపక! యెట్లు జిలేబి చేయనౌ!

    జిలేబి

    ReplyDelete


  52. అద్యతనీయమందు భళి యద్భుత మైనటి సాఫ్టు వేరుతో
    గద్యము లన్ జిలేబి సరి గాంచుచు యత్నములెల్ల జేయగన్
    విద్యగ శ్రద్ధ జూప గను వింగడ మై, మదిలో సరాగమై
    పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్!

    జిలేబి

    ReplyDelete


  53. రాగిణి! జీవనమ్ము తవరాజము మేల్పడు నోయి రమ్యమై
    నాగుల పూజ సేయు నెలనాగలకున్, నరకంబు ప్రాప్తమౌ
    భోగము లెల్ల గాంచి మజ భోక్తము జేయ! జిలేబి మేలుకో
    వే! గవనమ్ము తోడ తిరు వేంకట నాధుని మేలు గొల్వుమా!

    జిలేబి

    ReplyDelete


  54. అంగక మిచ్చి నాడు యనిలంబును నింపుచు యూపిరై సదా
    రంగడు మానసమ్ము నట రంగుల రాట్నముగా చరించెనౌ
    బెంగను వీడు మమ్మ తిరు వేంకటనాథుని మానసంబె యా
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా!


    జిలేబి

    ReplyDelete


  55. ఇంపగు పల్కు లెల్ల గని యిచ్చటి పద్యపు కైపు పోడిమల్
    సొంపుల నేర్చి పాదముల సోగుల గాంచుచు వారి పద్ధతిన్
    మంపుగొనంగ జూచి మజ మత్తిలి ముంగటి కైపదావళీ
    సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్

    జిలేబి

    ReplyDelete


  56. సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్
    నింపెద నూత్న రీతిగన నీ యమరావతి! మాన్యతన్ గనన్
    పంపెద మిమ్ము సింహపురి పట్నము మీరహహోయనన్ భళీ
    యింపగు నా ప్రణాలికలు యిమ్ముగ నాంధ్రులకౌ జిలేబులై!

    జిలేబి

    ReplyDelete


  57. ఆముకొనంగ సేననఘ,యా‌ రణరంగములోన చంపెనా
    భీముడు; యుద్ధరంగమున భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్
    తామునుపున్ శిఖండి నిడి, తాకుచు బాణపు శయ్య బేర్చుచున్
    తామరచూలి రాత యన తాతను కూల్చె కిరీటియేయటన్!

    జిలేబి

    ReplyDelete


  58. బాలకుమార! చక్కగను భారము దీరగ మేలు గానగన్,
    వేలకు వేలు వచ్చు మన వెల్లువ గాంచు తలంపు లన్నిటిన్
    మూలములోన ద్రుంచగను ముమ్మడి యోగము లెల్ల జేయగన్,
    పాలకు తైలమట్లు నిలువన్, వెలుగొందు ప్రజాళి గుండియల్

    జిలేబి

    ReplyDelete


  59. జాణుడు కంజరుండతడు జాగరణుండతడౌ, మగండయెన్
    వాణికి, నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్
    జాణత యెన్నగాను భళి; జహ్నువు ఱేడు, జిలేబి, లక్ష్మికిన్!
    బాణము, కార్ముకమ్మువలె భర్తయు,భార్యయు గాద సర్వదా !

    జిలేబి

    ReplyDelete


  60. వీరులకున్ జిగేల్మ నుచు వీరర సమ్ముల జేర్చు‌నాతడున్,
    పౌరులకున్ జిగీషల సెబాషన మెచ్చెడు రీతి పద్య మం
    దారములెల్లజేర్చు,ముగుదల్ మనమున్ మజ దేల్చు ప్రీతుడౌ
    చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే

    జిలేబి

    ReplyDelete


  61. శ్రీరమకున్ మగండతడు, శ్రీయుత యగ్రజుడాయె తీరుగన్
    గౌరికిఁ, గేశవుండు; పతి గావలె శంకరుఁ డన్న! గావలెన్
    సారస గర్భుడున్ ధవుడు శారదకున్ వినుడన్న! గావలెన్
    మారుడు యింటియాతడు సుమా‌ రతికిన్!భళి కైపదంబయెన్

    జిలేబి

    ReplyDelete


  62. ఆతడు రావణుండు! తన యామి యవజ్ఞకు మారువేషమున్
    సీతను దొంగిలించెఁ గద, శ్రీరఘురాముఁడు దండకాటవి
    న్నాతురతన్ కురంగమును నాతుకకై వెనుకాడుచుండగన్!
    హా! తరమా జిలేబి విధి హాతువు తీరును మార్చగన్ సుమీ !


    జిలేబి

    ReplyDelete


  63. సుద్ధుల చెప్పి రయ్య సయి చుక్కల చూపి ప్రభుత్వమెల్లెడన్,
    మద్దెల మోతలన్ కొనుడు మన్నిక గోల్డును బాండ్లరూపమై,
    యద్ది సువర్ణ మాలికయె యైన ధనుల్ కొనరైరి గాయిటన్,
    ముద్దుగ యర్ధహారముల మూటలగట్టి జిలేబులయ్యిరే !

    జిలేబి

    ReplyDelete


  64. వింత కథాస్రవంతియది ! వీరులు పాండుకుమారు లయ్యిరా
    కుంతికి; వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదము
    న్నెంతయు సౌబలేయి! సయి నెమ్మిగ నుండిరి వైపరీత్యమై
    కొంతయు నచ్చిరాక విధి కోరల మగ్గిరి! భారతమ్మదే !

    జిలేబి

    ReplyDelete


  65. న్యాయము గాదు కంది వర ! నాణ్యము గా జనులెల్ల నేలుచున్
    స్వీయము గాను కావ్య ముల చిప్పిలు తెల్గున గూర్చె నాతడే !
    తా యెలమిన్గనన్ తెలుగు దైన్యము వీడక నిల్చె నయ్య! యే
    రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్?

    జిలేబి

    ReplyDelete


  66. స్వీయముపొత్తముల్ చదువ చింతయులేదు! విభావ మెట్లయా
    జేయుట! నామగండనుచు చెప్పుట యెట్లు, కవీశ శంకరా,
    రాయల వారికిన్? దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగ
    న్నీయనయత్నముల్ గనడు నిండుసభాస్థలి యయ్యెగాదయా!

    జిలేబి

    ReplyDelete


  67. వెల్కం బెక బెక భాస్కర రామ రాజుల వారికి :)



    భాస్కర రామ రాజు మజ వచ్చిరి బ్లాగుల కున్ జిలేబియా !
    హస్కుల కాల మై వెలుగు హాతువు గాన్పడెనౌ జిలేబియా !
    మస్కర కైపు వ్యాఖ్యలకు మస్తుగ కాలమిదే జిలేబియా !
    నస్కులు చేయు వారలకు నప్పు జిలేబులికన్ జిలేబియా !


    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  68. ఆ వనమాలి సేవలను తావుల దప్పగ భావమై యిలన్
    రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ ! సఖుఁడా! బలారికి
    న్నా వనధీశులా చిరికి, నాకపు రేడుగ నిల్చె నాతడే !
    కైవశమున్గనెన్ భువిని కామితుడై, పరమాత్మ లీలగన్ !

    జిలేబి

    చిరి- అగ్ని

    ReplyDelete
  69. Dear Friends,

    You will be pleased to know that My book (ప్రపంచం ఒక నిరంతర "భోగయాత్ర!!") is now live on Kinige and is available to every reader around the world.

    You can now access My book here at this link
    http://kinige.com/kbook.php?id=8520

    I request you to please visit the homepage of My eBook at the above link and send me your feedback.

    You can now share This ebook name link with your readers, fans, friends, family members and others. You can also send this link to media whom you are approaching for a review in their columns.

    We hope you enjoy my book!
    Yours sincerely
    hari.S.babu

    Please encourage your readers to rate for the book in above link
    p.S:Thanks for the 2 unknown visitors who downloaded the Book

    ReplyDelete


  70. లవలవ శబ్ద మాయెనట ! లావుగ చీలగ దోని, యగ్రమాం
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్,
    కువలయ మై పటుత్వమున కూర్మిగ గాంచెడు రాము నాత్మజున్
    లవముగ చూడ గాను సయి లావుగ దోచె సుమా మదిన్ భళా !

    అగ్రమాంస - హృదయము
    వతి - దీపము
    అగ్రమాంసవతి - హృదయపు దీపము

    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  71. నాలుగు వేల కోట్ల దరి నాట్యము లాడెను ఖర్చు మీడియా
    కై లెస హైలెసా యనుచు కార్యము లెంతగ యయ్యెనో‌ గదా
    హైలెస!మన్కి బాతుల సహాయము దేశము లోన దక్కెనా ?
    వేలకు వేలు బూడి దయి వెంగళ మాయెన? భాజపా యకో ?

    జిలేబి

    ReplyDelete


  72. చట్మని చెప్పె మత్తు గొని, చక్కని చుక్కను చూడ, సుందరీ!
    కుట్మలదంతి! నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్
    మట్మట లాడ కోయి భయ మయ్యెను సూవె ! కుమారి రా దరిన్,
    పట్మని రమ్మ, పెండ్లి సయి పట్టుగ చేసుకొనన్ జిలేబియా !

    జిలేబి

    ReplyDelete


  73. కన్నులు కాచెనమ్మ సయి కన్నడు గాన్పడ డమ్మ మాలినీ
    పున్నమివేళయయ్యె నికఁబూర్తిగఁజంద్రుఁడు‌ మాయమయ్యెడిన్
    వన్నువ గాన వచ్చె గద! వాహిని యై పొరలెన్ జిలేబియా
    యన్నులు మిన్నగాను పిరియమ్ము సదా యవనారి కై మదిన్ !

    జిలేబి

    ReplyDelete


  74. కన్నడి రాసలీల కథ గానము జేసిరి మేలుగన్ భళా
    యన్నులమిన్న నాట్యములయా! పరిణాయకుడయ్యె తోడుగన్
    కన్నులవించిజోదు సయి కార్ముక మున్ మరి యెక్కుపెట్టగన్
    వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁజేసెను సుందరాంగికిన్

    జిలేబి

    ReplyDelete


  75. వాదన కైన సూరి, రసవత్తర మైన పదమ్ము తో భళా
    లేదను వాడె ; దాత మఱి లేదని చెప్పని వాడె ; లోభియౌ
    మోదము చెందడమ్మ యడిమోహము వీడడు కాటిలోననౌ
    రాధనమున్ జిలేబి మధురానుభవమ్ముగు పొందగన్ దగున్!

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. *మధురానుభవమ్ముగ

      Delete


  76. మిన్నగ వ్యాస భారతము మేటిగ తెల్గున వ్రాసె నాతడే
    నన్నయభట్టు! కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్
    నెన్నగ షట్పదమ్మునట నేర్పుగ నాతడు నారణప్ప యౌ !
    మన్నిక గాంచె గాధలవి మానవు లన్ తగు రీతి నిల్పగన్ !

    జిలేబి

    నారణప్ప - కుమార వ్యాసుడన్నది కలం పేరు ; వ్యాసభారతాన్ని భామినీ షట్ఫదములోన కర్నాట భారత కథా మంజరి గ కన్నడీకరించాడు(అసంపూర్తి గా పది యాశ్వాసాలు).

    జిలేబి

    ReplyDelete


  77. కారుమొగిల్పసౌ నొడలు, కమ్మగ వేణువు నూదు వాడటన్
    మేరుసమానుడాతడయె! మేమరుగాయెను గొల్ల పల్లికిన్
    వారధి యయ్యెగాద సయి వర్ధిల నెల్లరు! "కృష్ణ! బేగనే
    బారని" చెప్పగానె విని బాపఁడుసంతసమందెఁ జూడుమా!

    జిలేబి

    ReplyDelete


  78. అల్లన నేలచూలి మనసా రఘురామునిగాంచెనమ్మరో!
    నల్లనిమేనికాంతి హరి నారిని మీటగ నించువింటిచెం
    చల్లన మిట్టకోల సయి చక్కగ మీటె మహీజకమ్మ! పూ
    విల్లది రాఘవుండయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే

    జిలేబి

    ReplyDelete


  79. భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్
    సూర్యుడు పొద్దు జేర్చెనయ,చొక్కము ఫిల్టరు కాఫి తేదగున్!
    ఆర్య! జిలేబిపల్కువినుడయ్య నిజమ్మిదియేకదయ్య! సౌ
    కర్యముగాను కైపదపు కైపుల చూడగ నాకు సాయమై

    జిలేబి

    ReplyDelete


  80. గావుము తల్లితల్లివిగ! కాంతుని వీడితిమమ్మరోయనన్
    రావణుఁ, బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా
    స్థావరమౌ వికుంఠమును చట్టని వీడి, జిలేబి, రాఘవున్,
    దావము చేరి భర్త సయి తాను విముక్తిని గూర్చి బ్రోచెనే

    జిలేబి

    ReplyDelete


  81. సాగరఘోష వ్రాసెనిల సాంఖ్యుని భక్తుడు!పోతనార్యులే
    భాగవతంబు వ్రాసె నల; ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్,
    పాగెముగాన యాంధ్రులట భారతమున్ మజ తీర్చి దిద్దిరే !
    లాగరి యొగ్గి నేర్వ దగు లక్షణ మైనవి లేమ యీ కృతుల్ !

    జిలేబి

    ReplyDelete


  82. అద్యతనీయ మైనది సయాటగ నేర్పును మేళ వించుచున్
    పద్యము వ్రాయువాఁడు ; చెడి పాతక మందును సత్కవీశ్వరా
    విద్యల నేర్వ లేక సయి విస్తృత కౌశల మున్గ్రహింపకన్
    సద్యపు మంచి పల్కుగనజాలని మానవుడే సుమా యిలన్

    జిలేబి

    ReplyDelete


  83. దుఃఖము సౌఖ్యమెల్ల నిల దొర్లు జిలేబియ చక్రమైగనన్
    దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్
    దుఃఖితు లెల్ల రున్ మదిని దుర్భర మై వెలయంగ వారికిన్
    దుఃఖము తీర గాధ లను తోచిన రీతిని చెప్పి గాచుమా!

    జిలేబి

    ReplyDelete


  84. వర్షము నందు జూచితిని వాగుల వంకల నెల్ల నౌర! నా
    తర్షము దీరలేదు గద! ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
    హర్షము గల్గె మేలు మజ హాయిగ నుండెను తీర లేదయా
    తర్షము ! మానికమ్ము మరి దప్పిక తీరగ మంచి నీరమే !

    జిలేబి

    ReplyDelete


  85. అందము గా జిగేలు మని యంబర మందున జాలు వారుచు
    న్నందెను గాద జాబిలియె నవ్యత గాంచి భళా జిలేబి! క
    న్విందుల గొల్పు చున్నిలన నిండుగ మెండుగ పండు గైయటన్
    సుందరి నీదు కేలు నట చుక్కల రాయడు వెల్గె గాదుటే !

    జిలేబి

    ReplyDelete



  86. "ధన్యత గల్గె గాద మన ధాత్రికి గుళ్ళను నిల్పె నిచ్చట
    న్నన్యుల వల్ల కాదయ సనాతన ధర్మము గావగాను! సౌ
    జన్యుడితండు!" దుష్టుడగు జంబుక మున్కొనియాడి రే! కవీ!
    మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో!

    జిలేబి

    ReplyDelete


  87. ఆఱవిడిన్ జిలేబి మజ అయ్యరు గారిని మాటకారియై
    సోరణి దివ్వె వెల్గు సయి సొంతము చేసుకొనన్సయాటలన్,
    వారము శుక్ర వారమది ! పారుడు, నుల్లపు వాటికన్ పట
    చ్చోరుడె, పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్!

    జిలేబి

    ReplyDelete


  88. రాసిరి మాచనార్యులట రమ్మ ! జిలేబియ ! వృద్ధులెవ్వరో
    కాసిని మంచి పల్కు ల జగమ్మున నేర్వుము మేలగున్ జనా
    వాసము నందు జీవనము వాసిగ నుండును నీకు తేగడై
    రాసిగ వెల్గు నీదు సయి రాతలు కోతలు మేలుగాంచుచున్ !

    జిలేబి

    ReplyDelete


  89. జాఘనిరాయుడున్ కలిసె జానకి రాముని లక్ష్మణున్ సదా
    శ్లాఘము జేయగన్నతని చల్లని రూక్షపు నీడలో! భళా
    రే! ఘన కీర్తి నెల్ల నిల రేబవలున్కొనియాడ గన్ ప్రభో
    రాఘవ! నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్!

    జిలేబి

    *ఇదేదో మరీ కిట్టింపాయ నమః అయినట్టుంది :)

    ReplyDelete


  90. క్రౌర్యము జూప తాటకను కాననమందున మట్టు బెట్టె,నౌ
    దార్యుడయెన్నహల్యకు సదాగతి నిచ్చియు విల్లు ద్రుంచెనౌ
    శౌర్యము చూపి;జానకిని శాలిని యైగన కోసలాధిపునిన్
    భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావనరామమూర్తికిన్.

    జిలేబి

    ReplyDelete


  91. కోసలాధిపున్

    ReplyDelete


  92. ఇంకయు యింక యింక యని నీశుని వేడ జిలేబియా, మదిన్
    శంకయు తొల్గగన్ విభుని సన్నిధి పెన్నిధి యయ్యె నుల్లము
    న్నంకిత భావమే నిలువ నాత్మయు రూఢిగ వెల్గగన్ భళా !
    పంకజమందు చంపకము భాసురమాయెను సుందరాంగికిన్

    జిలేబి

    ReplyDelete


  93. వారలు పృచ్చకాళి సయి వారకు లౌనని ఛీత్కరించునా
    ధారణ లేనివాఁడె; యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
    వారల మాన సమ్ము లను వాంఛిత రీతిని సేద దీర్చుచున్
    కోరిన పద్య మెల్ల సమ కొల్పుచు పేర్మిగ జూచు ప్రాజ్ఞుడే !


    జిలేబి

    ReplyDelete


  94. కోట రాజశేఖరుల వారి అద్బుతః!


    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2578
    సమస్య :: *ధారణ లేని వాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్.*
    ధారణ కలిగి యుండడమంటే ప్రధానంగా తన అవధాన పద్యాలను బుద్ధియందు ధరించి తిరిగి అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉండటం. అటువంటి ధారణ లేనివాడే అవధానిగా వర్ధిల్లుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అమరకోశంలో *’’సంస్థా తు మర్యాదా ధారణా స్థితిః’’* అని అంటూ సంస్థ , మర్యాద (సీమ,హద్దు), ధారణ, స్థితి అనే నాలుగు పదాలను సమానార్థకాలుగా తెలిపియున్నారు. సమస్యలోని ధారణ అనే పదానికి సీమ (హద్దు) అనే అర్థమును చెప్పుకొన్నట్లయితే *ధార, ధోరణి, ధిషణ, ధైర్యము, ధారణ అనే పంచ ధకారాలను* ఒక హద్దు అనేది లేకుండా కలిగియున్న అవధాని మాత్రమే అద్భుతమైన రీతిలో వర్ధిల్లుతాడు అని చెప్పే సందర్భం.

    కూరిమితోడ నా యమరకోశము జూచుచు, చెప్పబూనితిన్
    ధారణయన్న *సంస్థ* యగు, *ధారణ* యౌ, *స్థితి* యౌను, *సీమ* యౌ,
    ధారణ యన్న ‘’సీమ’’ యను తత్వమునే తలపోయ, *ధార* లో
    నారయ *ధోరణి* న్ *ధిషణ* యందున *ధైర్యము* నందు *ధారణ* న్
    *ధారణ లేని వాఁడె , యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్.*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (24.01.2018)

    ReplyDelete


  95. చాల మహేంద్ర జాలమిల ! చాతురి తో మెలుగన్దగున్ సుమీ !
    కాలము గడ్డు కాలమిది ! కర్తృత యెల్ల నొనర్చు మమ్మ ! ఓ
    మాలిని! యన్వహమ్ము లనుమా వినుమా స్తవ నీయ సత్కథల్,
    మాలిక యై మదిన్నదియె మాన్యము గా నిను గాచు సర్వదా !

    జిలేబి

    ReplyDelete


  96. గాబర యేల, యేసు కథ గట్టిగ నెచ్చట జూడ మేలగున్ ?
    సాబుతు గా మహమ్మదు ప్రసారము దేశము లెట్లు గాంచెనో
    ఓబను వీడి చెప్పుమిక బొప్పన భట్టు రచించె నేమియో ?
    బైబిలులో; ఖురానుఁ గని; భాగవతంబు రచించె నింపుగన్!

    ReplyDelete


  97. బాబయ! ఐలయా! గలదె భారత దేశపు మూల మెచ్చటన్ ?
    సాబుతు జేసి నావటగ శంకరు డుండెను మక్క లోనెటుల్ ?
    పోబడి గాంచినావటగ పోతన గాదకొ బొప్పనయ్యటన్?
    బైబిలులో; ఖురానుఁ గని; భాగవతంబు రచించె నింపుగన్!

    జిలేబి

    ReplyDelete


  98. దోచుచు విద్య పేరిట పదోన్నతు లన్గను మాయమాటల
    న్నోచిన దాన ! వీరి కథ నోపరి గాన సమాజమున్ భళీ
    యోచన చేసి చూడ కలయో మరి వైష్ణవ మాయ యోగదా
    కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్!


    జిలేబి

    ReplyDelete


  99. ఆః! ఖిల గాంచి వాన సయి తాకిన దూకుచు, రైతు గాంచునౌ
    దుఃఖమె; స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతినిచ్చెడిన్
    జః, ఖలుడౌ మగండు తన జవ్వనమున్గమనింప బోవగన్
    దుఃఖమె! దుఃఖ మే రమణి దుమ్మరమాయెను జీవితమ్ము‌నన్ !


    జిలేబి

    జః - మన్మథుడు
    ఖలుడు - దుష్టుడు

    మన్మథుడు, దుష్టుడున్నగు మగడు

    ReplyDelete


  100. తాతల నాటి గాధలని తట్టని తిట్టకు మా జిలేబి‌, సా
    బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్,
    కోతలు కాదు రమ్యమగు కోమల తత్వము నేర్వ వీలగు
    న్నీతర మున్త రించు నవి నీమము లన్ నెలగొల్పు చు‌న్నకో!

    జిలేబి

    ReplyDelete


  101. అర్కుడ నేను నైయయిటి మాస్టరు నమ్మ జిలేబి యమ్మరో
    బర్కిలి సిగ్రెటుల్వెలుగ భారతపౌరుల తీర్చి దిద్దితిన్
    మర్కట మైతి నిచ్చట సమస్యల పూరణ మత్తులో భళా
    సర్కసు లిట్టివెన్నెరుగ శాస్త్రిని భౌతికమందునన్ సుమీ

    ReplyDelete


  102. లక్ష్మి! జిలేబి!కైపదములన్ పలు తీరుల జేయ పూరణల్,
    సూక్ష్మము చెప్పె దన్ విను సుశోభిత యూర్మిళ పెండ్లి యాడెనా
    లక్ష్మణుఁ; బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా
    సూక్ష్మత తో ధనుస్సు నట చూర్ణము సేసిన కౌసలేయుడిన్ !

    జిలేబి

    ReplyDelete


  103. సుద్దులు చెప్పు వారలట శోభిల జేయగ సత్యమార్గమున్
    బుద్ధిగ మేలు కైపులట పుంఖిత మై వెలుగొందగన్ భళా
    కద్దమి చందమామ వలె గాన్పడ గా నిలలోజిలేబి‌ , యే
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    జిలేబి

    ReplyDelete


  104. కాటును వేయు వారలట, కంటికి నింపుగ గాన లేమలన్
    ధాటిగ దీటు గా నడచ ధైర్యము మానసమందు చేదుచున్
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్
    మాటల రూప మందు తన మానము కాచుకొనన్ కవీశ్వరా !

    జిలేబి

    ReplyDelete


  105. పంకజ నాభ సోదరికి భర్తను జూడగ కొంత సందియం
    బింకను! శక్తి వంతుడగు భీషణు డీతడ కో? సదాశివున్
    శంకగ గాంచ శక్తి యట శక్తికి శక్తిని గూర్చు వాడు, ఆ
    శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్!

    జిలేబి

    ReplyDelete


  106. షోకుల బోవు చిత్రముల సోయగముల్ సయి లేని వాద్యముల్
    బాకుల వంటి పల్కులను భాగ్యముగా మన లోన దూర్చుచున్
    మేకుల దించి గొట్టి మన మేనినటన్ పెకలించి వేయు, ఆ
    కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్!


    జిలేబి

    ReplyDelete


  107. జై బోలో గురు మహారాజ్ కీ



    చేసిరి శంకరాభ రణ సేవను మీదగు రీతి లోనయా
    వాసము జేరి సత్కవులు వాసిని రాసిని పెంచి రయ్య! సా
    వాసము పేర్మి గా బడసి వాహిని యై వెలసెన్ బిరాదరీ !
    మీ, సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!


    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  108. రోసము తోడ బల్కితివి రో! తెలగాణను తెచ్చినావయా !
    మా సము లెవ్వ రో యనుచు మాటలు తేనియ లూరగానయా
    చేసిరి భాష పెంపు నకు చేవను గూర్చు మహాసభాస్థలిన్ !
    మీ, సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!

    చీర్స్ టు కేసీఆర్
    జిలేబి

    ReplyDelete


  109. రోసము గాను గొట్టె తొడ రొమ్ముల చీల్చుచు శాత కర్ణియై !
    వేసెను చెంప పెట్టు నటవే యభిమానిని గాంచి ద్రిప్పుచున్
    మీసములన్, గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
    రాసులు పోసి నట్టి మన రాష్ట్రపు నేతల తీరు తెన్నులన్ :)


    చీ టు కిట్టిగాడు
    జిలేబి

    ReplyDelete


  110. ఆసకురాల! కోమలియ నాధుని గట్టిగ జుట్టి ద్రిప్పుచున్
    మీసములన్ గనంగగలమే, యిక మేదిని నెందు గాంచినన్
    హాసము లొల్కు పద్యముల హావణి! జేజి జిలేబి ! మాలినీ
    లాసము లేల నమ్మ! విను లాగరి యొగ్గి సుమా నిజమ్మకో :)

    ஜிலேபி

    ReplyDelete


  111. అచ్చెరు వయ్య మేమిచట బాగడమై నిలిచాము వారికి
    న్నిచ్చెన లాంటి వారమయ ! నేతలు నాయకు లయ్యిరయ్య మా
    స్వచ్చపు విద్యలన్ బడసి; సన్నిధి పెన్నిధి గాను గాంచగ
    న్నిచ్చిరి కొంద రైనను దనివ్వుగ గౌరవమున్ జిలేబులై!


    జీపీయెస్ వారికి
    జిలేబి :)

    ReplyDelete


  112. పేరుచు సేవలన్ మదిని పేర్మిగ చేర్చుచు భక్తి మార్గమున్
    వారిజ నేత్ర గూర్చె నట వాంఛిత పుష్పములన్ విరాట్టుకై
    నారవిడిన్నిదేశమున నాంత్రము జేయుచు మత్తు గానటన్
    దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్!


    ఆరవిడి - అలవాటు
    నిదేశము సమీపము

    జిలేబి

    ReplyDelete


  113. పారవలెన్ సదా హృదిని భాగ్యము గా వెలుగై కళల్ యనన్
    మారిన కాల మందు సయి మానస మున్ నులి వెట్టి ద్రోయుచున్,
    శారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై,
    చేరుచు పద్య రూపముగ, చేర్చుచు నందరి నొక్క సీమనన్ !

    జిలేబి

    ReplyDelete


  114. యయేవం వేద !

    కొంతయు నేర్వ లేదు సయి కోరిక మాత్రము గల్గె నీశుడిన్
    వింతల జూడ; మానసము వేచెను తోడుగ ధ్యాన మార్గమున్
    చెంతన జేర్చ సాధనగ చేరెను నమ్మిక సాధ్య మయ్యెగా
    నెంతయు యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే !

    జిలేబి

    ReplyDelete


  115. నిష్టగ గొల్చె భానుమతి నీమము తప్పక భార్య గానయా
    దుష్ట సుయోధనున్ ; వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్
    నిష్టగ గొల్చి నాత్మ భవు నింటి మగండిని గోర పూర్వజ
    న్మేష్టము పంచ పాండవుల నిప్పుడు పొందుచు తన్వి భర్త్రికై !


    జిలేబి

    ReplyDelete


  116. వింగడమై శుభమ్ముగను వేంకట నాథుని సన్నిధిన్నటన్
    మంగళ నాదమెల్లెడల మంగళ సూత్రము కంఠమందునన్
    ముంగిట ముద్దులొల్కు సతి మోము, లలాటముపై భళారె బా
    సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా!

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. *ముద్దులొల్కు పతి మోము

      Delete


  117. మిక్కిలి వేగమేల కవి ? మీదగు రీతి జిలేబులన్ గనన్
    లెక్కయె; యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్
    చక్కగ రాక మానసపు ఛాయను చూపక బోవ నిందల
    న్నెక్కువ తెచ్చు నీకు సయి నెమ్మది బొమ్ము కవీశ్వరా !వినన్!

    జిలేబి

    ReplyDelete


  118. కక్కురితిన్ జిలేబులగు కాంతల పొన్నుల నెల్ల గోరుచున్
    లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్
    గ్రక్కున వీడు నాశలను, కాంక్షగ నీశుని సన్నిధానమున్
    టక్కున బట్టు నేర్పు గను టంకము లేల జనార్ధనా! వినన్ !


    జిలేబి

    ReplyDelete


  119. గోతుల తవ్వ గాను సయి కొట్నము జేరెద రయ్య, మిమ్ము మీ
    రీతుల నీసడింతురయ రీఢము గాంచుచు వీపువెన్కనే
    జీతము లేని కొల్వులని సీ యనువారలు గూడ నుందురే,
    ఖాతరు జేయ రాదు కవి కందివరా యటు వంటి వారినిన్

    జిలేబి

    ReplyDelete


  120. బాలకుమారికిన్ వయసు!పాంగెపు రీతిగ అల్లుడిన్గనన్
    కాలము శోభలన్ గొలుప, కష్టపడంగ, రవంత తండ్రియే
    మాలిని కై వరున్వెదుక, మంచిగుణమ్ముల నార్యుచే తలం
    బ్రాలను పూలుబూసినవి రమ్య సుగంధములన్ వెలార్చుచున్!


    జిలేబి

    ReplyDelete


  121. కుందకమెల్ల గాంచెనట కోరెను రాష్ట్రపు పెంపు నాతడే
    చందురుడాతడౌ జనుల చక్కదనమ్మును కోరెనాతడే
    దందడి జేయుచున్ గునిసి దాంతము లెల్లను జూపెనాతడే
    నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్!

    జిలేబి

    ReplyDelete


  122. చేరిరి వెంకటేశ్వరుని చేర్చిరి జోతల నెల్ల మేలుగన్
    వారల వీరలన్ గనుచు భవ్యము గానట చక్క గాను పూ
    జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
    కోరిరి వింత గాను శఠగోపము బెట్టగ అష్ట లక్ష్మినే !

    జిలేబి

    ReplyDelete


  123. అన్నువ లన్న పెండ్లమన నామడ దూరము బోవునాతడే
    కిన్నెర కంఠి యొక్కతెయు గీటుచు కన్నుల బిల్వ మక్కువన్
    తిన్నగ చేసుకొందునని తిగ్మము తాళక నూగిబోవగా
    పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్ !

    జిలేబి

    ReplyDelete


  124. మామనసున్ చెలీ సఖియ మార్చితివే‌ జవ రాల ! నీదుపై
    ప్రేమయె పొంగిపొర్లె; నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
    కాముకుడా జిలేబి కయిగట్టిగ బట్టుచు ముద్దు లిమ్మనన్
    లేమయు లెంపకాయనిడ లెక్కకు లెక్కయు దేలెబో భళీ!

    జిలేబి

    ReplyDelete


  125. పైత్యము బట్టు గాదయ సుపాణిని జేర్చెడు పద్యపాదముల్
    స్తుత్యపు లాఘవమ్ము సయి సుందర పూరణలెల్ల గానకన్
    సత్యమిదే కవీశ్వరుడ! సందియమేల ! సభాస్థలిన్ భళా
    నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా

    जिलेबी

    ReplyDelete


  126. నిత్యముఁ గావలెన్, మనకు నెమ్మది గల్గ సమస్య, మిత్రమా
    స్తుత్యము జేయు బుద్ధి సయి శోభల జేర్చెడు మానసమ్ము తా
    ముత్యపు కాంతి యై వెలుగ ముంగిట నిల్చిన వారు లన్నుగా
    జాత్యపు అంబుజానన సజావు జిలేబి సెబాసనంగబో!


    జిలేబి

    ReplyDelete


  127. భత్యము లేని గొల్వు గద ! భాగ్యముగా తెలుగైన నేర్తునే !
    జాత్యపు రీతి ప్రాంగ ణము ఛందపు కైపుల నేర్వ వచ్చునే !
    సత్యము చెప్పి నావు గద ! శంకర వర్యుడ మేలు మేలుగన్
    నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!

    జిలేబి

    ReplyDelete


  128. ప్రత్యహమున్ ప్రభుత్వమట వారుణి వాహిని గొల్చుచుండెగా
    నత్యధికమ్ము గా ములుగు నందు జిలేబుల నెల్ల జేర్చగన్
    సత్యమిదేనయా వినుమ! చక్కగ మత్తును గొల్పు మాధ్వియే
    నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా

    జిలేబి

    ReplyDelete


  129. అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే
    వెళ్ళెద నూరికిన్నిదియె ఫెళ్లను కైపద మయ్యలారహో
    చల్లగ పూరణమ్ము లిట చక్కగ నిల్పి పరస్పరమ్ము మీ
    రెల్ల విచారణల్ గనుడు! రేపటి కొచ్చెద చూచెదన్ సుమా!

    జిలేబి

    ReplyDelete


  130. ఇచ్చిరిగా జిలేబి సయి మెచ్చెడు రీతిని కైపదమ్ముగా
    నచ్చెరు విద్ది తారలట నాకస మందున బారుగానగన్
    తచ్చన కాదు సూవె మజ తంత్రము కాదు భళారె చిత్రమై
    వచ్చె నుగాది పర్వమిల, "భాద్రపదా" న చిగుళ్ళు వేయగన్!



    *భాద్రపదా - పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర
    ఉగాది ఉత్తరాభాద్ర లో వస్తోంది


    జిలేబి

    ReplyDelete


  131. పోరితి నయ్య కైపదపు పోడిమి గాంచి జిలేబి యేసుమా!
    కారణ మెద్ది తోచక సుఖమ్ముగ పృచ్ఛితి నాప్త మిత్రుడా!
    ఓరి! శకారుడా! యెవరి నొంచెను కర్ణుడు యుద్ధమందునన్?
    "భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై!"
    జోరు జవాబు గాంచితిని జోతల జెప్పితి నయ్య నిప్పుడే


    శకారునికి జై :)

    జిలేబి

    ReplyDelete


  132. మాసటియౌ వినాయకుడు మాన్యుడు పుత్రుడెవారికో సుమా?
    బాసమగండెవండు చెలి? ఫల్యపు బాణమువేయువాడు?గొ
    మ్మా!సఖియా జిలేబి యభిమన్యుడి చుట్టరికమ్ము సీరికిన్?
    వాసిగ గౌరి కాత్మజుఁడు; బ్రహ్మ; యనంగుఁడు; శౌరి కల్లుఁడౌ

    జిలేబి

    ReplyDelete


  133. నామజపమ్ములన్ గనుచు నమ్ముచు నిత్యము భక్తి తోడుగన్
    నీమము తప్ప కన్ బతుకు నీడ్చుచు కన్నుల ముందు గాను వి
    శ్వామృత మున్తృణమ్మని సుశారదుడిన్మదిలోన్జిలేబి, య
    ర్చీమయె ముద్దులాడె నల శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్!

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. అర్చి - కాంతి కిరణము
      అర్చీమయె - ఆ కాంతి కిరణమే

      Delete


  134. అమలిన కంటకమ్మకట! ఆరని మంటయు !పంచపాండవుల్
    సమసిన మేలు! సొమ్మ సిలి సంలయనమ్మున స్వప్నమందునన్,
    రమణి జిలేబి, దుష్ట కురురాజు, రణంబునఁ జంపె భీమునిన్
    తమసపు విష్ణుమాయ గద దాటతరమ్మగునే జనాళికిన్!

    జిలేబి

    ReplyDelete


  135. మేలుగ బల్కు మయ్య కవి ! మెచ్చుదు రెల్లరు కంది వర్య !నం
    ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్
    నీలకముల్? జిలేబులయ ! నీమము తప్పక లాంఛనమ్ములన్
    సాలువ కప్పి యిత్తురయ, సాంకవ మద్ది సుశోభలొప్పగన్ !

    జిలేబి

    ReplyDelete


  136. అల్లన మెల్ల గాను మజ మాలిక లో కథ గట్టి వచ్చె తా
    మెల్లగ నిప్పుడే సుదతి మేలగు గాధ యిదే‌ మరొక్క మా
    రల్లె జిలేబి శంకరుని ప్రాంగణమందున గోల చేయుచున్
    "మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై"

    జిలేబి

    ReplyDelete


  137. కల్లయు కాదు సుమ్మి సహకారము చేయు స్వభావ మయ్యెడి
    న్నల్లన పుష్ప మొక్కటి మనస్సున నెంచగ బంధమున్ మనో
    వల్లభుడాయె నాతడట వాసిగ బుట్టగ పుత్ర రత్నముల్,
    మల్లియ తీగకున్ గలిగె మామిడి కాయలు నేత్రపర్వమై

    జిలేబి

    ReplyDelete


  138. వడివడి గా పదమ్ములను పట్టిక జూచుచు నింపగానయా
    గడినుడి తీరు గాంచె, సయి, గట్టిగ మారుచు నచ్చటన్ భళా
    వడియము లెల్ల నెండినవి; వాన లవారిత రీతిగాఁ బడన్,
    బడబడ వాటి నన్ని టిని, పట్టుగ సర్దితి చక్కగానయా !

    జిలేబి

    ReplyDelete


  139. అడిగితి గోము గా సయి సయాటల నయ్యరు గారి నయ్య! తా
    గడగడ దేశ మెల్ల చని గామిడి యంత్రము తెచ్చి రందునన్
    వడియము లెల్ల నెండినవి; వాన లవారిత రీతిగాఁ బడ
    న్బడబడ వేగ మైన సయి నాకు భయమ్మిక లేదు గా భళా

    జిలేబి

    ReplyDelete


  140. మడకను దున్నె నామగడు; మానిని బేర్చగ మండుటెండలో
    వడియము లెల్ల నెండినవి; వాన లవారిత రీతిగాఁ బడన్
    పడకిలు సర్దినాడు సయి పాలుషి చేరెను మోదమొందుచున్
    చిడిముడి లేని జీవులకు చేవయు గూర్చును సంజ్ఞ యే గదా!

    జిలేబి

    ReplyDelete


  141. ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ, గిరీటి, నిర్దయ
    న్నాపతు లెల్ల వీరులు వినాశకుడిన్ ఖలు దుస్స సేనుడి
    న్నాపక జూడ నచ్చట! సనాతన ధర్మము గావ పోత్రమున్
    శ్రీపతి కృష్ణుడిచ్చెను సుశీలము చేర్చుచు భారతమ్మునన్

    జిలేబి

    ReplyDelete


  142. నీమము గాదు సోదరుడ! నీకు శరణ్యమొసంగు నయ్య శ్రీ
    రాముఁడు! గోరె రావణుని రమ్మని, సీతను దొంగిలింపఁగన్
    కామము వీడుమా యనుచు కైకసి మూడవ పుత్రు డాతడే
    సామము చెప్పుచున్! వినక చచ్చెను వింశతి బాహుడున్ సుమా !

    జిలేబి

    ReplyDelete


  143. ఒక్కడు ఒక్కడు మా రవితేజుడే :) బెంగాలు టైగర్ :)


    బక్కగ నుండు జూడన! తుపాకి వలెన్ రవితేజ రాజిలె
    న్నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
    చక్క సినీ జగత్తు మజ శాల్తిర కొట్టును బిల్చి దబ్బనన్
    పిక్కల పై విలన్లట గుభిల్లను కైపుల వీరుడాతడే!

    జిలేబి

    ReplyDelete


  144. దండుగ సేయమాకు వనితా,హరిమన్,దరి రమ్మ నీకనన్
    చెండుల మల్లిచెండులను చెంగలి చేర్వ జిలేబి తెచ్చినా
    మెండుగ నీ కరంకమున మెచ్చినిడన్! మురిసెన్ ప్రియమ్ముగా
    పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో :)

    కరంకము - తల
    జిలేబి

    ReplyDelete


  145. శాంతము లేక సౌఖ్యమును సాంఖ్యపు మార్గము లేక యోగమున్
    కొంతయు బొంద వీలగున ! కోరిక లెల్లెడ నిల్పినావు! యే
    కాంతకు మ్రొక్కినం గలుగుఁ గామిత సంపద లెల్ల శీఘ్రమే?
    వింతగు జీవితమ్మిదియె వీగకు వెంగలి యై సహోదరా!


    జిలేబి

    ReplyDelete


  146. కాలపు పోకడన్ కనులు కాయలు గాయుచు తోయ జాక్షలున్
    వేలకు వేలు నెక్కొనిరి వేండ్ర జిలేబులు లేమ లెల్లరున్
    పూల ధరింప నిష్టపడు ముగ్ధలు; లోకమునందు నుందురే
    చాలికతో మగండ్లు సయి సన్నిధి జేరుచు కొప్పు లో నిడన్ ?

    జిలేబి

    ReplyDelete


  147. జూదము లొడ్డ గా నరరె చూకురు గల్గెను రాష్ట్ర శోభకున్
    మాదము గూడగన్ జనులు, మాన్యత, ధీమక శక్తి చూడరే,
    మోదమునందరే! ప్రజలు, మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్
    ఖేదము చెంది నిల్తురయ, కేవడముల్ గొని కత్తి కట్టగన్

    జిలేబి

    ReplyDelete


  148. అల్లన కౌసలేయుడగు రాముని యస్త్రము ఛేదనమ్ము తా
    నుల్లము పొంగ జూడగ వినూత్నపు కాంతుల లోక మాత ,యా
    తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెద
    న్నెల్లలు లేని సంతసము నెక్కొన నందరికిన్ జిలేబియా!

    జిలేబి

    ReplyDelete


  149. జిలేబిని కోరి కపటాంజలి జీపీయెస్ వారి ఆలోచన

    గ్రక్కున కాళ్ల పైన బడి, గాలము వేయ జిలేబికిన్ భళా
    మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్
    మిక్కిలి మోద మున్ గనెను మేవడి చూడన, బామ్మ చెప్పెగా
    చక్కటి యొజ్జ యీతడుసజావుగ నీతని కిత్తుమయ్యరో!


    జిలేబి

    ReplyDelete


  150. చక్క ప్రతిజ్ఞ చేసెను సుసాధ్యము చేతును శౌరి పుత్రికన్
    ప్రక్కన నాదు గాదిలిగ పాటిగ నిల్పెద లక్ష్మణుండనే!
    తొక్కెద పాండుపౌత్రునిక దొమ్మిని మేలుగ గెల్తు భార్యగన్
    మ్రొక్కె బతివ్రతా సుతుడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్!

    జిలేబి

    ReplyDelete


  151. ఇవ్వాళ బుర్ర మరీ మొరాయిస్తోంది జవాబు రాలే !:)


    బేలనయా !జిలేబినయ ! బెట్టుగ పట్టుగ చూచితిన్ జవా
    బేలనకో సలీసుగను బెంగలిడంగను తట్టలేదయా!
    జాలము "గూగులించితి"! సజావుగ తేలక పోయెనెట్లనో
    నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో?

    జిలేబి

    ReplyDelete


  152. సేలు! జిలేబి సేలనుచు సీతయు చెప్ప తురంగవేగమై
    నేలను తాకకే వెడలి నేర్పరి గా నుచితంబు నాల్గుకు
    న్నాలుగ నన్కొ నన్నుతుక నాఱగ సేలలు గోలుమాలయే
    నాలుగు రెండు నయ్యెనట!నల్లనివాని కదేమి చిత్రమో,
    బేల, జిలేబి పెన్మిటికి, పెక్కుగ జేబులు ఖాళియయ్యెనే

    జిలేబి

    ReplyDelete


  153. వేకువజాము జోగి సయి వెంగలివిత్తు వలెన్ జిలేబి! హా!
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్?
    నీ కల నివ్వటిల్లదు! సునిశ్చలు నిన్మది నెంచి యత్నమున్
    సాకము చేయ గావలయు శాశ్వతు డాతడు లోన వెల్గగన్ !



    జిలేబి

    ReplyDelete


  154. రమేశు గారి భావనకు


    వేకువ తో తురీయమును వేగముగాను‌‌ రమేశ దాటగ
    న్నాకడ నీకడన్ జనుడ ! నమ్ముము నేకడ యైన నే మయా!
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పక
    న్నీకది సత్యమైవెలయు నిత్యము బాహ్యపు దృష్టి వీడగన్

    జిలేబి

    ReplyDelete


  155. వాకబు చేసి చూడగను వాక్కున కాయము లోగలండు;పెం
    జీకటి కావలన్ గలడు! జీవుని కాతడు పట్టు గొమ్మగా
    పాకలమై సదాశివుడు భాగ్యము గాగలడయ్య నాతడిన్
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్

    జిలేబి

    ReplyDelete


  156. భూతల మందు దక్కుటకు భూరిగ సంపద లెల్ల సోదరా,
    నీతల రాత మార్చుటకు నీ యతనమ్ము జరూరు చేయరా
    కోతల గట్టు పల్కు లను కుంచి కుదించుచు, మేలు వీడుచున్
    భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!



    జిలేబి

    ReplyDelete


  157. భం భం రాహుల్ కీ జై :)


    ఖాతరు జేయకన్ ధృతిని ఖద్దరు బట్టల తాత లెల్లరన్
    నీ తలపుల్గొనంగ సయి నీ దగు పోరును సల్పు రాహులా
    నీతివిధుండ వైన భళి నిక్కము కన్నడ రాజ్యమయ్య! ని
    ర్భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    జిలేబి

    ReplyDelete


  158. వేతును కత్తిపోటులన వెంగలివిత్తువలెన్ సహోదరా
    నీతిని వీడుచున్ బతుక నీమము కాదు సుమా! జనాళియున్
    కోతుల మూక గా తిరుగ కూడదు; కొంతసయోధ్య,కొంతయున్
    భీతిని, ముందు కేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా

    జిలేబి

    ReplyDelete


  159. ఇదెక్కడో చదివినట్టుందే :) అబ్బే పేరడీ కాదండి :)


    చేతము పొంగ సోనియ వచించెను రాహులుడా!కొమారుడా!
    ఆతత ధైర్య సాహస గుణాదులతోడ పురోగమింపుమా !
    ఖ్యాతియు వచ్చు, నిక్కముగ కన్నడ రాష్ట్రము నీకు దక్కు! ని
    ర్భీతిని ముందుకేగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా!

    జిలేబి

    ReplyDelete


  160. అల్లదిగో జనార్ధనుడి యాలయమౌ! యవధాన చత్వరం
    బల్లదిగో! యదే దివియు ! భాగ్యమిదేగద ! వేంకటేశ్వరుం
    డల్లన గాచు చుండ భళి డంగురి వేసెద నిచ్చె నిచ్చెనే
    చల్లదనంబు నిచ్చెను కృశానుఁడు వేసవి మండుటెండలన్!

    జిలేబి

    ReplyDelete

  161. ఎక్కడో తగలాలనుకున్న 'రాయి ' వేరెక్కడో కలుక్కుమంది :)

    నా శాపంబిది విన్నకోట నరసన్నా పారి పోవంగ నే
    నాశాల్తిన్ విడువన్ సుమా వినుమయా నాదాష్టికంబిద్ది! కా
    వేశంబుల్ విడనోయి పట్టి కొడతా ! వింజామరన్ కాదొరేయ్
    నే శల్కంబునుగాను కాళికనురా నీహారికన్ షార్కునౌ

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కాదొరేయ్.....బాగోలేదు.

      కాదోయ్ అంటే ఉత్పలమాల ఒప్పుకోదా ?

      Delete


  162. తర్చుచు బోయెనెచ్చటికి తండ్రికి వందన మంచు జాకెబూ?
    అర్చకు డా సుమాళియు తటాలున వెళ్ళెనదేల నోగదా?
    వార్చర వాన లోన సయి పట్టుగ జేయ నమాజు కై భళా?
    చర్చికి; సంధ్య వార్చుటకు; సాయబు పోయెను సత్వరమ్ముగన్!

    జిలేబి

    ReplyDelete


  163. సర్కసు డేరా - ఊరూరా - జీవన మిదే ఆత్మ వినోద మిదే


    బాగలు కోట చంద్రముఖి, బమ్భర యై తిరుగాడుచున్ భళా
    రే! గజగామినీ యనగ రెక్కల చాపుచు నాట్య మాడుచున్,
    నాగుల ముద్దులాడె లలనామణి యాత్మ వినోద కేళికై,
    సాగెను రంగ భూమి సయి సార్థక జీవన యాత్ర కూటికై !

    జిలేబి

    ReplyDelete


  164. వీరుడ వయ్య మోడి! భళి వీడకు సాహసమున్! జనాళికిన్
    దూరముగాఁ జరింపకుఁడు ;ధూర్తుల కుత్తములం ద్యజింపు,మా
    నా,రవణంబు గాదయ వినాశము కాగల దయ్య ప్రోదియున్!
    చోరుల చేత నివ్వకయ చూకురు తప్పదు కీర్తి బోవునే!

    జిలేబి

    ReplyDelete


  165. కన్నులు బాయె ! పద్యముల కాచిన చారుగ చేసి చేసి ! హా !
    మిన్నగ వచ్చె నో,మరియు మీగడకట్టుగ పద్య మాయెనో
    దున్నున? చిత్తగించి, మది తూగగ, గాంచితి నయ్య స్వప్నమున్,
    నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్!

    జిలేబి

    ReplyDelete


  166. తిన్నదరక్క గట్టితివి తిండియు బట్టయు గూర్చునే యి దే
    మన్న ? దుకాణమైన నిడి మజ్జిగ నమ్ముకొ నంగ మేలదే
    నన్నయ? తిక్క, నాదులె! ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్,
    మిన్నగ నిచ్చటన్ కవులు, మిచ్చెన వేయుచు మీదు బోవగన్!

    జిలేబి

    ReplyDelete


  167. నిన్నటి కాలమిట్టులనె? నీ కవితల్ భళిరా భళీ యనన్
    మిన్నగ మెచ్చు భూపతులు మెండియముల్నెఱి కొల్పు భూభుజుల్
    కన్నడ రాజు లేరి? అహ! గాసట బీసట యైన నేమయా
    నన్నయ తిక్కనాదులె, ఘనంబని, మెచ్చిరి నాకవిత్వము
    న్నెన్నుచు కబ్బమేదియు మనీషులు గానక నో కవీశ్వరా :)

    జిలేబి

    ReplyDelete


  168. పందియముల్ జిలేబులన, భామల జూచుచు చేసి రంటనే
    నందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా? సఖా
    సందియ మేల యందినను నందక పోయిన నా లలామలే
    డెందపు సేద దీర్చు దురు, డెప్పకు డెప్పకు నన్ను మిత్రమా !


    జిలేబి

    ReplyDelete


  169. కొంతవరకు కిట్టింపు :)


    తొందర దేల రేపటికి తొంగలి దాని జిలుంగు దానిదే!
    కొందలమేల నో మదిని కోరిక తీరక బోవ మిత్రమా!
    డెందము బోవ స్వప్నమున డీనపు కైపుల నిక్కమయ్యెనో
    నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!

    జిలేబి

    ReplyDelete


  170. జోతల తోడు చెప్పెదను చొప్పడు రీతిని భారతమ్మునన్
    నే తలతున్ ధనుంజయుని నెప్పటి కైనను శూరు డెవ్వడో,
    ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు,డుత్తరు నేఁ దలంచెదన్,
    చేతల డాంబికమ్ము లకు చెప్పు నుదాహరణమ్మనన్ సుమా !

    జిలేబి

    ReplyDelete


  171. దోమల సంభాషణ :)


    "వక్తల మంచు తోయదము, పాలు,జిలేబుల, తైరులన్, భళా
    శక్తికి ద్రావి కొమ్ముగల సారము లొప్పు జనాళి యీ కవుల్ !
    ఫక్తుగ నీ మెయిన్నడతు ! పాముచు కుట్టుము వీరలన్,సఖీ,
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ", రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    జిలేబి

    ReplyDelete


  172. మా అయ్యరు గారు రావే జిలేబి రావే అని పిలిచిరి నాడు :) (నేడు దుడ్డుకర్ర భయం వదలటం లే :)


    చేరగ లక్ష్మి భాగ్యముగ చెంగట కట్టెను తాళినంట పూ
    జారులు ప్రస్తుతింప హరి, శైలజఁ గూడె సురాళి మేలుకై
    వారుని గేస్తురాలుగను, భారతి చేరెను నాత్మ సంభవున్,
    పారము రా, జిలేబి, సముపార్జన చేయగ ధర్మ పత్నిగా !

    జిలేబి

    ReplyDelete


  173. ఓపమి జూపి రయ్య నట నొడ్డుచు పత్నుల మానముల్ సదా !
    పాపము దైన్య పాటుగద, పాణిగృహీతల జీవితంబు సూ !
    శాపమకో శుభాంగులకు ? సామ్యము చూడగ మందసానమున్
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!


    జిలేబి

    ReplyDelete


  174. బాలకుమార! మేలగును పాటిగ లక్ష్మిని కొల్చుచున్ సదా
    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్!
    గోలల గోల గోల యన కోయి!పరామృతధార గా నిధుల్
    జోలెలు నిండగా సఖుడ జోస్యము చెప్పితి నిబ్బరించుమా !

    జిలేబి

    ReplyDelete


  175. విద్యయు లేదు నాకనుచు వెక్కుచు నేడ్చి జిలేబి చెప్పుచున్,
    పద్యము రాదనెన్, గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్,
    "సేద్యము చేయు మమ్మ" యని చెప్పిరి "నేర్పుదు రా కవీశులే
    వేద్యము గానగున్, తొడరువేగద ముఖ్యము, నాంధ్ర భారతిన్
    నాద్యపు శక్తి గా గనుము ! నాట్యము లాడును వృత్తముల్ భళా" !


    జిలేబి

    ReplyDelete


  176. సకియా! వ్యాసుడు తండ్రి తానెవడికో? సాక్షాత్తు భూభృత్తు తా
    ను కపోదమ్మును త్రెంచి సీత మగడై నుంపారుచున్ రాజుకున్?
    సకలంబున్త్యజియించి వర్ణి గ భళా శౌటీర్యు డెవ్వండయెన్ ?
    శుకయోగీంద్రున, కల్లుఁ డయ్యెఁ గద; భీష్ముం డంద రుప్పొంగగన్!

    జిలేబి

    ReplyDelete


  177. అకటా! భారత మేమి యిట్లు గలదే యంచున్ విచారంబకో?
    తకరారేమియు లేదు కైపదములో, దమ్మున్న పార్థుండ హో,
    శుక! యోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద ! భీష్ముం డంద ఱుప్పొంగగన్
    సకలంబున్త్యజియించి వర్ణి గ భళా శౌటీర్యుడాయెన్ సుమా

    జిలేబి

    ReplyDelete


  178. వీరులు శూరు లెల్లరును బెట్టును జేయుచు వచ్చి చచ్చిరే
    కారణ మాయె కర్మ, యనుకంపన మైనను జూప లేదు ! నా
    మారణ కాండ మాటుకొన మాధవు డాతడు వచ్చె నంచు నా
    దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచు నుండె సత్కవీ!

    జిలేబి

    ReplyDelete


  179. ఇలలో తిండియు లోటు బట్ట కొఱతై నిండారు దారిద్ర్యముల్
    కలలో తేలుచు జూచుచుండు నతడే గర్ముత్తు ధారాప్రవా
    హ లయల్ వేగముగా జిలేబులవలెన్, హాంఫట్! విచిత్రంబు! యీ
    తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్!

    జిలేబి

    ReplyDelete


  180. టిట్ ఫార్ టాట్ గాల్ :)


    రా!తిరిగొచ్చెదమ్మనుచు రాధను త్రిప్పగ లేమయున్బడం
    గా తన బుట్టలోన కలి కాలపు పోకడ తీరు తెన్నులే
    రాతను మార్చగా నరరె రాముని కండ్లను కప్పి మందు మా
    కో,తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా :)

    జిలేబి


    ***

    రాతల జేర్చు బ్రహ్మ మజ రాణి జిలేబికి భర్త గా హరిన్
    తా తలచెన్! భళారె ముదితై తను ప్రేయసి యయ్యె చూడగా
    మాతర మిద్ది నిర్ణయము మాదని చెప్పుచు తా హుషారుగా
    కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా

    జిలేబి

    ReplyDelete


  181. నారా వారి మాట గా


    మీ దరఖాస్తు లెల్లను సమీక్షకు పంపితి నేను పోరగన్
    కాదని చెప్పు వారు సయి ఖాతరు చేసెదరయ్య! నమ్ముడీ
    వేదన లేల! తెచ్చెద సుభిక్షము రాష్ట్రము కొత్త దయ్యె, నే
    లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

    జిలేబి

    ReplyDelete


  182. గుండు అది.
    గుండు యిది
    గుండు లోనుండు గుండు
    గుండు లోనుండి గుండు
    గుండు గుండే గుండౌ



    వేదన లేల కర్వరిని ! వెంగలివిత్తుగ మారు టేలనో !
    నాదిది కాదదెద్దియు సనాతన మైనది దేహభుక్కు!నా
    దేదియు లేదు భూమిని విదేహము చెంద జిలేబియెచ్చటన్ ?
    లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్



    నేతి నేతి జిలేబి
    *పతంజలి వారి ఆవు నెయ్యి - జీపీయెస్ ఉవాచ :)

    ReplyDelete


  183. రమేశు గారి భావనకు

    కాదన లేదు కాదనగ కామము మోహము వీడు చిత్తునే
    చేదన లేదు చేదనగ చెక్కర తీపిని వీడు బంధముల్
    పోదన లేదు పోదనగ పోవు శరీరము కాల్చు వేదనల్
    లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్!

    జిలేబి

    ReplyDelete


  184. పోదురు మీదు డాబుసరి! పూర్తిగ తప్పు శుభమ్ము లివ్వవే!
    వేదము చెప్పదిట్లు పరివేష్టిత శోభలు జేర్చవే కవీ
    శా!దెసదిక్కు లేదనగ చక్కగ నొప్పునకో?మరెట్లయా
    లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్?

    జిలేబి

    ReplyDelete


  185. లేదని చెప్పు! నీశు డస లేలనకో యని ప్రశ్న వేయుమా
    లేదు విధాత భాగ్యమసలెక్కడ యంచు సవాలు చేయు మా
    లేదను నేను లేక భువి లేదని చెప్పుము ధైర్య శాలిగా
    లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్!

    జిలేబి

    ReplyDelete


  186. మహా నటి సావిత్రి


    చౌదరి యింట గుబ్బతిలె సాధన పత్రిక చిత్ర మివ్వగా
    నాదరణల్ సినీజగతి నాట్య మయూరి గణేశు జామిగా
    కాదన లేదు, కోరగ సుగంధము లొప్ప సహాయముల్ భళీ
    లేదన లేదు, లేదనఁగ ! లీలగఁ గల్గును భోగ భాగ్యముల్,
    మీద పడంగ గంధవతి మింకిరి జేసె మహానటిన్ గదా!



    జిలేబి

    ReplyDelete


  187. చిత్రిక బట్టి చూడవలె! చిత్రము గాన్పడు భూతలమ్ములో
    మిత్రుడ! నీకు శాంతి మరి మీటుగ బోవగ కష్టకాలమున్
    శత్రు చయం బొసంగును, బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్
    ఛత్రము బట్టి కాచు ననుసారకు లిత్తురు నిక్కమియ్యదే!

    జిలేబి

    ReplyDelete


  188. వీరుడు తానెవండు సఖి వెంబడి వచ్చుచు నిన్ను కోరుచున్?
    కారణ మెవ్వడే సఖియ కంజముఖీ!నిను చూడముచ్చటై
    సోరణి దివ్వె వెల్గుల సుశోభితుడై నిను చేరె నెవ్వడే?
    శ్రీరమణీ! లలామ! నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే!

    జిలేబి

    ReplyDelete