Friday, June 11, 2010

హృదయం - మనస్సు

హృదయం - మనస్సు రెండూ ఒకటేనా ? కాకుంటే వేరు వేరా? మీకేమైనా ఈ విషయం గురించి తెలిసి ఉంటె చెప్పగలరు. ఆధ్యాత్మిక పుస్తకాలలో చాల మటుకు ఈ మనస్సు గురుంచిన ప్రస్తావన వస్తూ వుంటుంది. కొన్ని మార్లు హృదయం తో మాట్లాడండి లాంటి పదాలు కూడా చదవడం కద్దు. మీ కేమైనా తెలిసి ఉంటె విశదీకరించగలరు.

చీర్స్
జిలేబి.

Tuesday, June 8, 2010

విన్నూత్న 'వరుడు' - వధువు ఎక్కడ?

పై చిత్రం- పల్లెకు పోదాం అంటున్న ముఖ్య మంత్రి- సిమిలారిటీ ఫోటో- వరుడు- ఆడియో లాంచ్ -

వధువు ఎక్కడ మరి?

చీర్స్
జిలేబి.

Sunday, June 6, 2010

మనః ద్వయం

మాట మౌనం
చేత అచేతనం
స్వరం నిశ్శబ్దం
గమనం అగమ్యం
వీరం నిర్వీర్యం
మనః ద్వయం చంచలం
అచంచలం మహా బాహో -
కిం కర్తవ్యమ్ మమ ?
చీర్స్
జిలేబి.

Saturday, May 29, 2010

గోవిందా గోవిందా గోవిందా

మా తిరుపతిలో జన సందోహం చెప్పలేనంతగా ఉంది.
గోవిందా గోవిందా గోవిందా !
రాజ్యం లో కల్లోలం చెప్పలేనంతగా ఉంది
గోవిందా గోవిందా గోవిందా
గుడి గోపురాలు నేల మట్టం
గోవిందా గోవిందా గోవిందా
కష్టాలు కార్పణ్యాలు కన్నీళ్లు వరదలు వానలు
గోవిందా గోవిందా గోవిందా
రాజ్యం వీర భోజ్యం !

జిలేబి.

Wednesday, May 26, 2010

మనసే ఊయల - కోతి కొమ్మచ్చి

ఊయల జూమ్మని ముందు వెనుక ఊగుతుంటే మనసుకి ఆహ్లాదం.

కోతి కొమ్మచ్చి ఆడుతుంటే పిల్లలకి పరమోత్సాహం

ధ్యాన మార్గం లో మరి మనసుని కోతి తోనూ - అదీ కల్లు తాగిన కోతితోనూ పోల్చి - మానవాధమ - నీ మనసు కోతి - దాన్ని వక్ర మార్గం నుంచి మళ్ళించి ధ్యానం చేయ్యవోయీ అంటారు.

అర్థం కాని విషయం. పిల్లకాయి కోతి కొమ్మచ్చి ఆడితే తాత గారికి పరమ సంతోషం

అదే తాతగారు - గురువుగారు తన మనసుని కోతితో పోలిస్తే పరమ విషాదం !

విష్ణు మాయ కాకుంటే - దేవుడు కోతిని పుట్టిన్చడమేమిటి- ఆ డార్విన్ మహాశయుడు- పోతూ పోతూ - వోయీ నరుడా - నీవు కోతినుంచి పుట్టావోయ్ అని ఓ కేక పెట్టి తానేమో బాల్చి తన్నేసాడు.

డార్విన్ పోయినా మన వాళ్ళు ఇంకా వాణ్ని వదల కుండా - " ఆ కోతి చేష్టలు ఏమిటి వెధవా- సరిగా నడవ లేవూ? అని రంక వెయ్యడమేమిటి

చాదస్తం కాకుంటే - ప్రతి ఒక్క శతాబ్దం లోను ఓ మోస్తరు సో కాల్డ్ గొప్పోల్లు పుట్టి మన ప్రాణాల్ని తోడేసాల అలా కామెంట్లు విసిరి ముసి ముసి నవ్వులతో వెళ్లి పొతే - మనమేమో సుద్ధ వెర్రి వాళ్ళలా, వాళ్ళు చెప్పిన దే వేదం అని గిరి గీసు కోవటం ఏమిటి? కొంత బుర్ర ఉపయోగించాల కాదా?

చీర్స్
జిలేబి.

Monday, May 24, 2010

నేనెందుకు ఆంధ్రా వాలా/ వాలి కాను?

నేనెందుకు ఆంధ్రా వాలా / వాలీ కాను?

ఇట్లాంటి శీర్షిక పెడితే నా బ్లాగు కి ఎక్కువ క్లిక్కులు వస్తాయని ఓ అరవ అమ్మాయి చెప్పడం తో సరే పోనీ ఇట్లాంటి టపా తో పోస్టింగ్స్ చేద్దామనే ప్రయత్నం షురూ చేసి ఈ రెండు వ్యాఖ్యలతో ముగిస్తున్నాను.

ఆలోచించి చూడండి - నేనెందుకు ఆంధ్రా వాలా కాకుంటే - ఆంధ్రా వాలీ కాను? ఈ మధ్య తెలుగు పేపర్లు చదువుతుంటే నిజంగా మనం ఆంధ్రులమేనా అన్న సందేహం రాక మానదు. ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Thursday, May 13, 2010

కాంతం కనకం కర్పూరం

కర్పూరం తాను కరిగిపోతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది.

కనకం తానూ కరగదు తనని సొంతం చేసుకున్న వాళ్ళని కరిగించదు.

మరిక కాంతం మాట ఏమిటి ?

కాంతం కనకము కర్పూరం కూడాను.

కాంతం కర్పూరం లా తానూ కరిగిపోతుంది.

భామతి కథ చదివారా ఎప్పుడైనా?

కాంతం కర్పూరం అనడానికి భామతి ఉదాహరణ.

కనకం లాంటి "కాన్" తాలు లేక పోలేదు. మన బెనర్జీ లూ - లాగ.

మరి కాంతం లాంటి కాంతం ఉన్నారా?
అబ్బో ఉంటె - మా లా ఉంటారేమో ?

cheers
జిలేబి.

Tuesday, May 11, 2010

ఆది శంకర - గౌతమ బుద్ధ- స్వామీ వివేకానంద - ఆ పై?

శంకరాచార్యుల వారు జీవించినది ఓ ముప్పై సంవత్సరాల కాలం పాటు. గౌతమ బుద్ధుడు జీవించినది ఓ ఎనభై సంవత్సరాల కాలం పాటు. స్వామీ వివేకానంద విషయం తీసుకుంటే ఆయనా నలభై లోపే జీవనం పరిసమాప్తి చెయ్యడం జరిగింది.

వేదముల సూక్ష్మం మరుగుపడి కర్మ కాండలు అధికమై సనాతన ధర్మం అధోగతి పాలవుతున్నప్పుడు బుద్ధుడు దిక్సూచి గా మారి జన జీవనానికి వేదాన్ని దాని సారాంశాన్ని ధ్యాన మార్గం ద్వారా తెలియజేసి ఓ సరికొత్త పంధా కి నాంది వాక్యం పలికాడు.

అలాగే బౌద్ధం క్షీణించి కర్మ కాండల మార్గం లో దిక్కు లేని దిశలో ప్రయాణిస్తున్న సమయం లో ఆది శంకరులవారు సనాతన మతాన్ని ఉద్దీపనం చేసారు.

ఆ పై చరిత్ర పునరావృత్తం అయి సనాతన ధర్మం అడుగున పడి - అసలు సనాతన ధర్మం ఇక నిల దొక్కుగో గలుగుతుందాని సందేహం వచ్చిన సమమయం లో వివేకానందుని వాక్కు ప్రతిధ్వనించింది. భువి పర్వంతం ఓ సరికొత్త నిర్వచనం తో సనాతన ధర్మం కర్మ సిద్ధాంతం వైపు పరుగులు తీసింది.

ఆ పై ఎవరు? - ? ఈ కాలానికి తగినట్టు స్వాములు - బాబాలు ఉన్నారు.
కాకుంటే - ఓ సరి కొత్త దర్శనాన్ని చూప గలిగే ఆ వినూత్న శక్తీ కాకుంటే మానీషి ఎవరు? ఆ మలుపు ఎప్పుడు?

చీర్స్
జిలేబి.

Tuesday, April 20, 2010

కొంప దీసి మీరు తెలుగు వారు కాదు కదా?

కొంప తీయ కుండానే మేము తెలుగు వారమే!
ఈ మధ్య జరుగుతున్న రాజకీయ 'కళేబరాలు' చూస్తూంటే - రాజ్యం లో ని దేశం లో ని పరిస్తితుల్ని గమనిస్తుంటే ఇది తప్పని సరిగా తెలుగు వారి తెగులే అని పించక మానదు! ఆ మాటకి వస్తే కొంప దీయ కుండానే మేము తెల్గు వారమే అని మరీ బల్ల గుద్ది కాకుంటే - మేడ ఎక్కి మా నాయకులు భాజాయిస్తున్నారు.
విష్ణు మాయ కాకుంటే - ఈ వూరికి ఆ వూరు ఎంత దూరం అంటారు? ఆ వూరికి ఈ వూరు ఎంతో ఈ వూరికి ఆ వూరు అంతే దూరం కాదు సుమా!

చీర్స్
జిలేబి

Saturday, April 3, 2010

జమీందారు హై స్కూలు - చిత్తూరు జ్ఞాపకాలు

బంగారుపాళ్యం జమీందారు హై స్కూలు -బీ జెడ్ హై స్కూలు - బోర్డు స్కూలు - లాంటి పేరు ప్రఖ్యాతలతో ఓ వంద సంవత్సరాలు పైగా చిత్తూరు నగరాని కి విద్యా దానం గావించిన మహోన్నత విద్యా పీఠం ఈ జమీందారు హై స్కూలు. స్వాతంత్రం మునుపు బోర్డు స్కూలు గా ఉండేది. అప్పట్లో "ఫారం" చదువులు. ఆ పై జమీందారు హై స్కూలు గా పరిణితి. దగ్గిరలో ఉన్న బంగారుపాళ్యం జమీందారు గారి పుణ్యాన ఈ నగరానికి ఈ స్కూలు ఆ కాలం లో వచ్చింది. అప్పట్లో ఈ స్కూలు ప్రఖ్యాతి రాష్ట్ర మంతటా ప్రబలి ఉండేదని వినికిడి. అంటే బెస్ట్ స్కూల్స్ లో అన్న మాట.

అప్పట్లో స్కూల్స్ తక్కువే కాబట్టి - ఈ స్కూల్కి డిమాండు ఎక్కువే. క్వాలిటీ విషయం లో పై చేయి ఉండడం తో ఇంకా ఎక్కువే అయ్యేది ఈ డిమాండు. అంటే - ఈ విషయం రామా రావు గారు విద్యని ప్రైవేటు గావించడానికి మునుపు అన్న మాట. ఆ పై ప్రైవేటు స్కూల్స్ రావడం - ఈ స్కూలు విద్యా రంగం లో వస్తున్న వేగమైన మార్పులకి అనుగుణం గా తనను తాను మలచుకోక పోవడం కారణం గా ఇప్పుడు ప్రాబల్యం తగ్గి ఓ మోస్తరు స్కూల్ గా మారి పోవడం జరిగిందన్నది సత్య దూరం కాని విషయం.

ఈ స్కూల్ గురించి - ఇందులో చదివిన విద్యార్తులు - విద్యార్థులు - వారు ఈ దేశం లో - విదేశాలలో ఎక్కడెక్కడో ఉండవచ్చు. ప్రతి ఒక్కరికి తమ స్కూల్ - పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. అట్లాంటి తీపి జ్ఞాపకాలతో ముడి పడి ఉన్న స్కూళ్ళలో పెను మార్పిడి జరిగి - ఆ స్కూలు నామ మార్తకం గా ఉంది అన్నది విన్నప్పుడు కొంత మనసు చివుక్కు మానక మానదు.

ఈ టపా ఎందుకంటే - మన దేశం లో ఇప్పుడు ప్రాథమిక విద్య అన్నది హక్కు కింద మార్చబడడం గుర్తింపు కలిగిన విషయం. ఈ మార్పులతో - ఇట్లాంటి ఎన్నో మరుగున పడ్డ మాణిక్యాలు మళ్ళీ - కొత్త పుంతలు తోక్కుతాయని ఆశిస్తాను.

చీర్స్
జిలేబి.