Thursday, December 31, 2015

గీత సంహిత - షోడశ గీతః


గీత సంహిత - షోడశ గీతః
 
హే  మదీశ్వర మాం రక్ష యతో విశ్వసిమి త్వయి
 
పరేశం మన్మనో వక్తి త్వమేవాసి ప్రభుర్మమ
క్షేమం త్వహ్యతిరిక్తం హి మమ కిశ్చిన్నవిద్యతే
 
పవిత్రాణమహం సంగీ ధరణీతలవాసినాం
 నృణానామాదరీణాయానాం యేషు సర్వా రుచిర్మమ
 
పరదేవగ్రహీతారో వర్దయంతి స్వ యాతనాః
తేషు రక్తనివేకశ్చ మయా నైవ కరిష్యతే
నా ధరాభ్యాం గ్రహీవ్యంతే తేషాం నామాని వా మయా
 
పరేశో మన్మదీయ పానపాత్రం స ఏవ మే
త్వశ్చ భాగం మయా లబ్ధం సంయక్సమేధవిష్యసి
 
మత్క్రుతే మాపనీరజ్జుర్నపతత్ సుందరే స్థలే
మామకీనోధికారాపి సమ్యగేవ విశోభతే
 
ధన్య  పరేశం తం యో మహ్యం మంత్రణామదాత్
త్వమేవ రాత్రౌ మమ హృదయ చేతనం  
 
నిజసాక్షాదహం నిత్యం స్థాపయామి పరేశ్వరం
స మద్దక్షిణపార్శ్వస్థో న స్ఖలిష్యామి కర్హిచిత్
 
తస్మాద్యుంజతి మచ్చిత్తం మమ స్వాంతశ్చ నందతి
మామకోనశరీరంచ  నిర్విఘ్నం సుశయివ్యతే
 
పరలోకే మమ ప్రాణాన్యస్మాత్వం న విహాస్యసి
స్వకీయం పుణ్యవంతం త్వం క్షయం ప్రాప్తుం న దాస్యసి
 
త్వమేవ  జీవనస్య మార్గ దర్శకః  
తవ సమ్ముఖే ప్రాప్యతి  మహానందం
విద్యతే తవ దక్షిణే నిత్యవర్తి విలాసం  !
 
 
శుభోదయం
జిలేబి 

Wednesday, December 30, 2015

గీత సంహిత - ప్రథమ గీతః

గీత సంహిత - ప్రథమ గీత

ధన్యః స మానవో యో న దుష్టానాం మంత్రణా చరేత్
న తిష్టేత్ పాపినాం మార్గే  నాసీత్ నింద కాసనే
 
సః శాస్త్రే పరేశాస్య మనస్తుష్టి మవాప్రయేత్
విదధీత చ తస్యైవ శాస్త్రే ధ్యానం దివానిశం
 
స జలస్త్రోతసాం పార్శ్వే రోపితాం తరో సమః
ఫలదస్య నిజే కాలే చామ్లానవపల్లవస్య చ
యే యథా క్రియతే తేన తత్ సర్వస్చ ప్రసిద్ధ్యతే
దుష్ట్వా న తాద్రుశాః తవ వాయుకీర్ణతుషోయమాః
 
అథో హేతో విచారోపి న స్థాస్యంతి దుర్జనాః
దార్మికాణామ్ సభాయాం న స్త్యాస్యంతి పాపినాః
 
మన్యతే పరమేశ్వరః దార్మికాణామ్ మార్గే
మార్గే దుష్టమనుష్యాణామ్ నాశం గమిష్యతి
 
 
శుభోదయం
జిలేబి
 

Friday, December 25, 2015

Jesus జిలేబీయం !



Zoom
in

love &
ever
be
in Him!


క్రిస్స్మస్సు శుభాకాంక్షలతో

జిలేబి

Thursday, December 24, 2015

అయ్యరు గారి తో జిలేబి బాలి విజయం !

అయ్యరు గారి తో జిలేబి బాలి విజయం !

ఏమండీ అయ్యర్వాళ్ ! ఇండోనేషియా వారు ఇండియా వాళ్లకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారంట ! ఫ్లైట్ టికెట్టు తీసుకుని చేతి లో కోట్లాది ఇండోనేషియా రుపయ్యాలతో (జేకే -> ఒక కోటి ఇండోనేషియా రుపయ్యా దరిదాపుల్లో మన యాభై వేల రూపాయలు :) వెళితే చాలంటా ! అక్కడే వాళ్ళు ఫ్రీ గా వీసా స్టాంపు చేసేస్తారట అని మా అయ్యరు గారి తో చెప్పి (అంటే వారి కి పని పురమాయించి ) మొత్తం మీద బాలి ద్వీపానికి ప్రయాణం కట్టాము !

ఇండోనేషియా దరిదాపుల్లో పది హేడు వేల పై చిలుకు ద్వీపాల సమూహం; అందులో సుమారు ఆరు వేల ద్వీపాల ల లో జన సాంద్రత ఉన్న దేశం; మిగిలిన పదకొండు వేల చిల్లర ద్వీపాల కి అసలు పేర్లు ఉన్నాయా అన్నదే సందేహం :)
జనాభా దరిదాపుల్లో రెండు వందల అరవై మిలియన్లు (ఇరవై ఆరు కోట్లు ) ; అందులో అరవై శాతం జావా ద్వీపం లో నివాసం !

బాలి ద్వీపం (పురానా జమానా లో దీని ని వాలి ద్వీపం అనే వారట!) జనాభా సుమారు నాలుగు మిలియన్ (నలభై లక్షలు ) పై చిలుకు; అందులో ఎనభై శాతం హిందూ మతం !

బాలి ద్వీపం లో ని హిందూ మతం ప్రాముఖ్యత అక్కడి ప్రతి ఇంటిలో ఉండే దేవళం లో ప్రతి బింబిస్తుంది ! పెండ్లాము ని   ఇంటికి తెచ్చుకుంటే అయ్యరు వాళ్ ఇంట్లో ఒక దేవళం కట్టు కోవాల ట ! (పెండ్లాము ని తెచ్చుకుని తల పై బొబ్బ కట్టించు కోవడం తో బాటు దేవళం కూడానా జేకే !)

బాలి టూరు లో తీసిన కొన్ని ఫోటో లు -> బాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -> దిగగానే మనకి ఆకర్షణీయం కనిపించే ది బాలి ద్వీపపు సాంప్రదాయ దేవాలయపు నమూనా ! ఆ పై ఆకర్షించేది -> స్వస్తి అస్తు అన్న బ్యానరు తో సుస్వాగతం చేసే వెల్కం బోర్డు :)





స్వస్తి అస్తు అని ఇండియా లో వెల్కం చెబితే సేక్యూలరిస్ట్ లు ప్రొటెస్ట్ చేస్తా రనుకుంటా :) జేకే !

ప్రతి పేరులో నూ దాని రూట్ పదం సంస్కృతం లో ఉందేమో అనిపించే లాంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి నగరం మొత్తం లో ;

బాలి సముద్రం కడు సుందరం; ఆకర్షణీయం ; అయ్యరు గారికి నీళ్ళంటే భయ్యం ! సో నీళ్ళ దగ్గిరకి రాకుండా ఉండి పోయేరు :)

బీచ్ ! బీచ్ బీచ్ !

దేవళం దేవళం దేవళం !

జోక్ ఏమిటంటే ఏదో దేవాలయం అనుకుని వెళ్లి మొత్తం తిరిగి చూస్తూంటే ఒకావిడ నవ్వి 'నేను పని కోసం వెళ్ళాలి - ఇల్లు లాక్ చేసు కోవాలంది :) దేవళం ఇంట్లో దేవళం :)

బాలి లో గరుడా వారికి పెద్ద పీట ! అతి పెద్ద రాతి తో మలచ బడ్డ గరుడ ని చూడ వచ్చు; ఆ పై విష్ణువు మూర్తి కూడా;

భారతం నించి పంచ పాండవులు కుంతీ మాత తో కలిసి ఉన్న శిల్పాలు ! పాండవా బీచ్ దగ్గిర;

తానా లువాట్ దగ్గిర హిందూ దేవళా లు !

ప్రతి చోట్లా కనిపించే గణపతి బప్పా మోరియా :)

ఒక స్కూలు ముందర పెద్ద గణపతి విగ్రహం ! (భారద్దేశం లో స్కూలు ముందర గణపతి వారిని పెడితే ఇక సేక్యూలరిస్టులు ధర్నా చేస్తారేమో :) 

ఇట్లా రాసు కుంటూ పోతే బీచ్ దేవళాలు అంటూ రాసు కుంటూ పోవాలి :)

ముఖ్యం గా గమనించినది ఏమిటంటే అన్నిటికి బేరమా డోచ్చు ! బేర మాడితే గిట్టు బాటు ! (జిలేబి కి ఇంక మజా చెప్పాలా ! బేర మాడి గీచి గీచి బేర మాడి తే గదా మానసోల్లాసం:)


గరుడ వాహన మహా విష్ణువు -> గరుడ విస్తా


పాండవా బీచ్

ఉలు వాటు దేవాలయం పై నించి సుందర సముద్ర నాయిక :)
 
 
తానా లవుట్ బీచ్ సీనిక్ వ్యూ
 
 
పార్థ సారథి ఆనగా పార్థుని వీర సౌరభం
 
 
 బాలినీస్ డ్యాన్సు - గరుడ విస్తా
 

 ఇందు గలడందు లేడని సందేహం వలదు -
ఎందెందు తిరిగిన అందందే విఘ్న వినాయకుడు

 
The Magnificent Garuda-Garuda Wista 
 
 
శుభోదయం
జిలేబి

Wednesday, December 23, 2015

ఋగ్వేదం - దీర్ఘ తమస్ - తురీయం వాచ !

ఋగ్వేదం - దీర్ఘ తమస్ - తురీయం వాచ !


ఋగ్వేదం మొదటి మండలం లో దీర్ఘ తమస్ ఋషి ప్రణీత సూక్తులు వరుసగా 140-164 మధ్యన వస్తాయి.

ఈ దీర్ఘ తమస్ ఋషి పుట్టుక - కథా పరం గా  పుట్టుక తోటే గుడ్డి వాడు . గుడ్డి వాడుగా పుట్టినా జ్ఞానం లో మేధ .

ఈతని ఋక్కులు ఆంగ్లం లో చెప్పాలంటే రిడిల్స్ .

రెండు వాక్యాల లో అనంతమైన అర్థాన్ని ఇమిడింప జేయడం ఈతని గొప్ప తనం .

వాక్కు గురించి చెబ్తూ నాలుగు రకాలైన వాక్కు ఉందంటాడు ; (అవి ఏమిటి అని ఋక్కు లో లేదు ) కాని ఆ నాలుగు రకాలైన వాక్కులో మూడు గుహ్యమైనవి ; ఒక్క నాలుగో వాక్కు మాత్రమె మనుష్యలకి తెలిసినది అంటాడు .


చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్ బ్రాహ్మణా యే మనీషిణః
గుహా త్రీణి నిహితా నేన్ఘయంతి తురీయం వాచో మనుష్యా వదంతి    --- ఋగ్వేదం - మండలం ఒకటి 164-45


Speech is of four types ;the sages who are wise know them; three that are hidden in the cave -non-speak able; men speak the fourth speech.


 
వాక్కు నాలుగు విధాలు ;

అందులో మూడు గుహ్యమైనవి;

నాలుగో విధమైన ది మాత్రమె మనుష్యులు పలుక గలిగినది-> వైఖరి - (వాక్య రూపకమైన వాక్కు )

నాలుగు విధాలైన వాక్కు ->


పర - పరవాణి లేక పర వాక్  --> పరమాత్ముని స్పందన
పశ్యంతి  -> తమ ధ్యానం లో చూడ గలిగినది ? -> ఋషులు
మధ్యమ -> మనస్సు కి మేధ కి సంబంధించినది -> మేధావులు
వైఖరి -> వాక్య రూపక మైన వాక్కు ; --> మనుష్యలు


Kabir Das:

ऐसा वाणी बोलिये , मन का आपा खोये
अपना तन शीतल करे, औरों का सुख होयें

Speak in a manner that brings peace and tranquility to the mind; One’s speech should calm and pacify not only the listener, but also the speaker.

శుభోదయం

చీర్స్
జిలేబి

 

Wednesday, December 16, 2015

అందరికీ 'న' 'మాష్' కారాలు :)

అందరికీ 'న' 'మాష్' కారాలు :)
 
బ్లాగు లోకం లో పండితమ్మన్యులందరికి న 'మాష్' కారాలు :)
 
ఇంతటి తో జిలేబి బ్లాగు తెర వేసి బెట్ట బడినది.
 
అసహన ప్రక్రియా కార్యక్రమాల లో జిలేబి ని బక్రీ చేసి
 
చెడుగుడు 
 
చెమ్మా చెక్కా
 
చెస్సు  
 
ఆడిన వాళ్ళందరికి
 
'మొసలి' జిలేబి టాటా బై బై వీడు కోలు చెబ్తూ -
 
 
చీర్స్
సహిత
బిలేజి  జిలేబి !

Tuesday, December 15, 2015

శంభో ! షింజో అబే శంభో ! -హర హర "నిహోంజిన్ దేవ్ "!

శంభో ! షింజో అబే శివ శంభో ! -

హర హర  "నిహోంజిన్ దేవ్ "!

頑張ってください



Do your best!
頑張ってください Ganbatte kudasai
చీర్స్
జిలేబి

Monday, December 14, 2015

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !


కొన్ని కొన్ని బ్లాగులోళ్ళ కామెంటు బాక్సు ముందర కొన్ని విచిత్రమైన గొంతెమ్మ కోరికల్లాంటి నోటీసులు కనిపిస్తాయి.

కామెంట్లు తెలుగు లో ఏడవక పోతే మీ కామెంట్లు డెలీట్ !
మీకు ప్రొఫైల్ లేదా అయితే డెలీట్
మీరు టపాకి దూరం గా కామెంటు కొట్టారా డెలీట్ !
మీ కామెంటు నాకు నచ్చ లేదా డెలీట్
మీరు మేలా? ఫి' మేలా ? చెప్పరా ?  ! అయితే డెలీట్ !
అంతటికి అడ్మిన్ నిర్ణయాలే ఫైసల్ :)


ఇత్యాది అన్న మాట

ఇట్లాంటి సౌకర్యాలు కామెంట్లు రాసేవారికి అస్సలు లేవు.

టపా నచ్చ లేదా ఓ డెలీట్ కొట్టే సదుపాయం అస్సలు గూగులోడు కామెంటర్ల కి ఇవ్వలే !
 
అట్లా ఓ పది మంది కామెంటర్లు డెలీట్ కొడితే టపా హుష్ కాకి అయి పోవాలి.
 
ఇట్లాంటి సౌకర్యాలు కామెంటర్ల కి లేక పోయెనే !

ఎంత అసమానత్వం !

అంతా సమనానమే అంటారు. మరి కామెంటర్ల పట్ల  ఎందు కింత వివక్ష !

బ్లాగులోళ్ళు వెర్సస్ కామెంటర్లు అసమానత్వం ముర్దాబాద్ !


చీర్స్
జిలేబి.

Friday, December 11, 2015

'పద' తాడన కేళీ విలాసం !


రుషం లో

రువు

తాకిడి లో

మరుకం

వ్వుల పువ్వుల

కేకసలు రాదే భ

ళీ తంటా

విను వీధి

లాస్యం


సంగ్రామ కోలాటం !

జిలేబీ ఎందుకె

నీకీ వినువీధుల విహారం ?
 
మానవా నీ  
 
పద తాడన కేళీ విలాసం !

శుభోదయం!

చీర్స్
జిలేబి.

Thursday, December 10, 2015

బ్లాగ్కామెంట్ హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం - కాన్స్పిరసీ - జిలేబి ఉద్ఘాటన !

బ్లాగ్కామెంట్  హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం - కాన్స్పిరసీ - జిలేబి ఉద్ఘాటన !

నిన్న జరిగిన బ్లాగార్ల మెంట్ లో అతలా కుతలమైన బ్లాగ్ కామెంట్ ఫ్లోర్ !

 
బ్లాగ్ కామెంట్ల హెరాల్డ్ కేసులో తన్ను ఇరికించడం  ఓం ప్రథమం వారి కాన్సిపిరసీ అని ప్రముఖ వయోవృద్ధ బ్లాగిణి జిలేబి చెబ్తూ 'నేను నా బామ్మ గారి మనవరాలిని నన్ను ఎవ్వరూ భయ పెట్టలేరు ' అని ఉద్ఘాటిం చేరు !

ఈ సందర్భం లో ఆవిడ నుదిటి పై రూపాయి బిళ్ళ  సింధూరం తో , ఒక వైపు చూస్తె మిధిలాపురి మైధిలి లా , మరో వైపు నించి చూస్తే విజయవాడ కనక దుర్గమ్మ లా ,  అసమదీయులు , తల్లీ కంచి కామాక్షి, మధుర మీనాక్షి , కాశీ విశాలాక్షీ, అంటూ జేజేలు పలుకుతూ వస్తోంటే , 'కెలు కేశ్వరాంబ'   అంటూ తసమదీయులు కిసు కిసు లాడుతూ  వస్తోంటే బ్లాగ్మీడియా వారికి "నీలాంబరి"  లా ఫోటో షాట్ ఇచ్చారు :)

క్రితం కొన్ని రోజులు గా ముమ్మరం గా బ్లాగాగ్ర గ ణ్యు లు  ఏది చెప్పినా 'జీ' , 'ఎస్' అనాల్సిందే తప్పించి వారి కి ఎదురుగా 'తీటి' తే ధర్మాగ్రహం ,  అవమాన పరుస్తున్నారన్న ఆరోపణ ల తో బ్లాగ్ లోకపు కామెంట్ల లోకం అల్లకల్లోలం అయి పోయిన విషయం బ్లాగర్లందరికి ఎరుకైన విషయం 'ఇరుకైన' విషయమని విదితమే !

కామెంటుల చెండుల తో చెడుగుడు ఆడుతూ , నారదాయ నమః అంటూ అక్కడక్కడ ఘ్రుతం లాగిస్తూ విన్యాసాలు చేస్తూ ఒక వైపు జిలేబి 'ఆగడాలు' , మరో వైపు జిలేబి పై కేసు బనాయించి ఇది ఆవిడ, ఆవిడ అనుయాయుల కుట్ర , బ్లాగ్ దేశానికి నమ్మక ద్రోహం అంటూ ఉర్రూత లూగిస్తున్న పవనాలు ఈ 'హవా' లో ఎన్నేసి 'కామింట్లు' ద్రవ్య విలం బితం అయ్యే యో ఎవరి కెరుక అని ప్రముఖ పొలిటికల్ సెటై రిస్ట్ 'తేట 'గీతి  ట్వీటారు :)


ఇప్పుడు ఈ నమ్మక ద్రోహం కేసు 'జీ' ఎస్' లు తప్పించి టీకాలు పెట్ట కూడదన్న ధర్మాగ్రహం సమయం లో మళ్ళీ తెరపై రావడం,  రసవత్తరం గా జిలేబి ఇందులో ఓం ప్రథమం వారి కాన్స్పిరసీ ఉందని చెప్పడం ఇవన్నీ చూస్తూంటే తన తల తిరిగి పోతోందని  పిస్తుందని బ్లాగ్ పొలిటికల్ అనలిస్ట్ హర్రీ బర్రీ  తన అభిప్రాయాన్ని తెలియ జేసారు :)

ఇంతటి తో ఈ నాటి కాన్స్పిరసీ ఘట్టపు ఫ్లాష్ న్యూస్ పరి సమాప్తం !

రేపు మళ్ళీ ఏమి జరుగునో ఎవరి కెరుక !

శుభోదయం
జిలేబి
జీ , ఎస్ ఓన్లీ ; నో 'టీ' :) (యు ఆర్ వెరీ నాటీ:)