బఫ్ఫెట్ (వార్రెన్) తాతయ్య మా మావయ్య బిల్ తో కలిసి ఇండియా రావడం
మా దేశం లో ని బడా బాబూలతో నూ - ఖుషీ ఖుషీ లక్ష్మీ పుత్రులతో మీటింగ్ లు పెట్టుకొని - చందా లివ్వండి - అందరం కలిసి చారిటి చేద్దాం అనడమూ చూస్తె నాకు మరీ ముచ్చట వేసింది.
బంగారం తాతయ్యలు - ఊరికే రారు.
అదీ మావయ్యని వెంట బెట్టుకుని నిజం గా నే ఊరికే రారు.
వారికి మెకన్నాస్ గోల్డ్ ఎక్కడ ఉందొ నిర్ధారణగా తెలిస్తే గాని రారు.
వచ్చారు కాబట్టి - మన దేశం లో ఖచ్చితం గా వారికి బంగారు గనులు (ఘనులు సుమండీ) కనబడి ఉంటాయి.
మరి భారత దేశం - భావి తరం లో - ప్రకాశవంతం తప్పక అవుతుందనడం లో సందేహం లేదు. !
బంగారం ఘనులు - మా తాతయ్య, మావయ్యలతో కలిసి మంచి పనులు చెయ్యండి. - ఈ పెట్టు 'బడి' తో - దేశాని కి ఇంకా కాస్తా విద్యా 'ధనాన్ని' ప్రసాదించండి !
చీర్స్
జిలేబి.
లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 9
-
లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 9 అదృశ్యాదృశ్యరహితా విజ్ఞాత్రీ
వేద్యవర్జితాయోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరాఇఛ్ఛాశక్తి జ్ఞానశక్తి
క్రియాశక్తి స్వరూపిణీ సర్...
2 hours ago


No comments:
Post a Comment