కామింటు కింగు వారి మకుటము పై
శతకమునకు నాందీ పలకడమైనది.
కేజ్రి వాలు వెడలె కేజు లో ఎక్సైజు
కేసు మాయ యీడి క్రేకు చేయ
అన్న యేమొ తీవ్ర మైన చింత పడెను
విన్నకోట విదుర వినుమ రాయ! (౧)
***
నిఫ్టి చార్టు లోన నిండు చుక్కయొకటి
కన్బడెనని జ్యోస్య కారు లచట
పైన పోవు ననిరి పైపైకి పోకడ
విన్నకోట విదుర వినుమ రాయ! (౨)
ఇట్లు
పనిలేని ......
జిలేబి
కా మింట్ కింగ్ వారి ఆజ్ఞ పై కొత్త పేచీ తెరవడ మైన தீ :)
ReplyDeleteఈ ఏర్పాటు చాలా సౌకర్యవంతం కదా. 🙂🥹
ReplyDeleteనెంబరు కూడా ఇచ్చినట్లున్నారు (తెలుగు సంఖ్యలనుకోండి 😏)
ధన్యవాదాలు 🙏
-
ReplyDeleteచంద్ర బాబు మహిమ జనసేనకు తిరుక్ష
వరము తిరుపతాయె వరము లబ్బి
నట్టె కాన వచ్చు నట్టేట మునకేను
విన్నకోట విదుర వినుమ రాయ ! (3)
-
ReplyDeleteస్మార్టు వ్యసన మాయె స్టైలిష్షు మోబైలు
చేయి చాచినంత సేవలెన్నొ
మాటమంతిలేని మనుజుడు శవమాయె
విన్నకోట విదుర వినుమ రాయ ! (4)
స్మార్ట్ ఫోన్ వ్యసనం మీద తెలంగాణ గాయకుడు రషీద్ పాడిన ఈ సరదా పాట వినండి (విడియోలో మొదటి ఒకటిన్నర నిమిషాలు) 🙂👇.
Deletehttps://youtu.be/CsmIsLETNIU?si=htd9heGrFehMNW18
-
ReplyDeleteఎండ లెక్కువయ్యె నెండిపోవున పైరు
లెల్ల? క్రోధి నిదుర లేచు వేళ
సూచనలివియొ పరిశోధింప దగునకొ?
విన్నకోట విదుర వినుమ రాయ!
-
ReplyDeleteబాల్టిమోరు బ్రిడ్జి పడవయొక్కటితాక
పురణ మందు కూలె పూర్ణమాసి
రాతిరి ఫలమిదని వ్రాయ వచ్చునొ జ్యోసి
విన్నకోట విదుర వినుమ రాయ (6)
-
ReplyDeleteటోలు బోవునన చటుక్కున నురుకుచు
చదువగా తెలిసెను సాటిలైటు
మాధ్యమము కలెక్షనౌర టాక్సులకటా
విన్నకోట విదుర వినుమ రాయ!
-
ReplyDeleteశర్మగారి మాట చల్దివణ్ణపు మూట
మకుట మందుకొనుచు మాటకారి
శతముఖినటు త్రిప్పి సాయించవె జిలేబి
సదరనానిమస్సు చక్కబోవ :)
-
ReplyDeleteఅయిటి వేసె వాటు కాంగ్రేసునకు కోట్ల
టాక్సు ! బాజపా కుతంత్ర మంచు
గ్రేపు వైను టాకు గీరి చూడను సుమీ
విన్నకోట విదుర వినుమ రాయ !
-
ReplyDeleteఅప్పుడప్పు డల్లనల్లన వేయుచుం
దును గురూజి! దూకి దుమికి చూడ
గీత మారలేదు గిచ్చి యీడ్చపదము
లన్ను యేమి చేతు నయ్య సామి
-
ReplyDeleteమందు పాటల స్పెషలిస్టు మాన్యులు మన
బండివరులు! మహా ఊపు వారి కొచ్చు
నేమొ నా పాటలను వ్రాయ నెమ్మిమీర
విన్న కోట నరసరాయ వినుమ విదుర
ఓ యబ్బో మా టెల్గూకీడేదీ :)
ReplyDeleteనేనమ్మను నీకు కొమర!
నేనమ్మను నీదు మాట ! నేద్రావంగా
తే, నీరు! వలయు తేనీ
రా? నేనమ్మను! తెలుగు సురభి తెలుగౌరా!
వేడి తేనీరు …. వేడితే నీరు.
Deleteఇలా కోకొల్లలు ఉదాహరణలు.
-
ReplyDeleteకడప రాయా? అవునుసుమా ! కాస్త చల్ల
దనము చేర్చు కడపరాయ! తండ్రి నీదు
కడ పరాయ నా దేవ వేంకటరమణుడ!
నాగ ఫణి శర్మ వరు రచన చద వండి!
-
ReplyDeleteఎన్నికల లో
ఎన్ని కలలో
ఎన్ని, కల, లో
ఎన్ని క లలో
మా టెల్గూ కీడేదీ :)
-
ReplyDeleteగురుపూర్ణిమాదినమ్మున
సరిజేసుకొని నడవడిక సాధనను మరిం
త రయముగా జేయను రం
డి రహస్యమ్ములను నేర్వ డింగరు లారా!
-
ReplyDeleteబాగా చెప్పారు జిలే
బీ గారండోయ్! మునుపటి విదురులు శ్రీశ్రీ
సాగించిన పోరాటపు
వేగానికి యీడుకలద భేష్ భేషండీ!
-
ReplyDeleteదిక్కు దిక్కులు నలు దిక్కులు తిరుగుచు
మ్రొక్కు లంచు సిరసు మొత్తు కొనుచు
తిరుగ నేలనొ? ప్రణతి హృదిని గానరా
విన్న కోట విదుర వినుమ రాయ !
-
ReplyDeleteగౌ. భారతిగారూ! యీ
మీ బ్లాగ్పోస్టద్భుతము సుమీ! విజ్ఞానం
తో బాటు ప్రశాంతత కూ
డా బాగుగ జేర్చెనౌ! నమామి నమామీ !
నేను మీ భుజముల తట్టెదను మీరు నా భుజముల చరచుడీ :)
ReplyDeleteఆవలింపగాను నక్షరమైన రా
దండి గురువు గారు తరచు తోచు
నట్లు రాయు చుందు నందమాయెను మీకు
నచ్చె విన్న కోట నరస రాయ!
ఆమాత్రం ఇంగిలీసు నానుడులు మాకూ వచ్చు.
Delete-
ReplyDeleteఅంతంత భయంకరమగు
వింతైన సమాసములు గుభిల్లుమనెన్ గుం
డెంతయొ చదువన్ సంస్కృత
మింత కఠినమేల నయ్య మేధావులకున్
-
ReplyDeleteహాడు చెన్నాగి దే బండి స్పీడు కూడ
నిమగె కన్నడవూ గొత్త? నేను సారు
తెలుగు నల్లి థింకించెద తేలు కన్న
డ పదములు వాటికవె వడి ఢమ ఢమలని :)
ఓ ఓ ఓ :)
-
ReplyDeleteఆ మాత్రపు టింగ్లీషర
రే మాకున్ వచ్చు సుందరీ తెలు గున నే
లా మార్చి వ్రాయు ట జిలే
బీ? మన్నింప మని కోరు విదురుల నిపుడే !
నేను చదివిందే వేదమోయ్ !
ReplyDeleteఇతరులదంతా హుళు హుళుక్కియె పో :)
తిరగేసా భాగవతము
ను రాధ ప్రస్తావన అసలు కనుల బడలే!
విరివిగ యిస్కానో త
స్కరులు బ్రిటీషు చలువయొ ప్రకటనంబాయెన్
-
ReplyDeleteశాంతి స్వరూపుని ఆత్మకు
శాంతి కలుగుగాక! వార్త లంతయు మధురం
బెంతయొ చదివెడు తీరు! ప్ర
శాంతంబగు మోము వారి సౌభగమాయెన్!
-
ReplyDeleteజయదేవుని రచనలలో
ప్రియమగు రాధయె కనబడు విహరించుచు గ్రో
వి యశోదేయుని పిలుపుల
పయోఘనమున కనలేము భాగవతములో
-
ReplyDeleteనవవిధ భక్తి తెరగులం
దు వరలెడు విధానమిది మృదుత్వము తోడై
జవరాండ్రులగుచు గొల్వం
గ వెన్నుని త్వరపడుదురు జగన్నాథ యనన్
-
ReplyDeleteగేదెలు కావా ప్రాణులు ?
రాదా వాటికి జ్వరము, చిరాకుల్ కుట్టం
గా దోమలు? రండి తెరల
వేదామిక గావ పాలు వెల్లువ లెత్తన్ !
-
ReplyDeleteఅగ్గిపెట్టె ఖాళి ఔరౌర యింటిలో
భగ్గు మంట లెగసి పడ చెకుముకి
వ్యాఖ్య తోడు వచ్చు వడిని జిలేబియు
వేచి చూడు మా ఉవిద! క్షణమున
-
ReplyDeleteఅందరికి శుభాకాంక్షలు !
సందడి చేయంగ వచ్చె సరదా పర్వం
బందరి ఆశల తీర్చన్
డెందంబొందంగ హ్యాపి డేస్ హ్యాపీ డేస్ !
ఉగాది శుభాకాంక్షలతో
మీ జిలేబి
-
ReplyDeleteప్రాస యతి గణములను సర
దా సన్నగ మొదలగున్ పిదప దురదగ ప
ద్యాసక్తి కలుగు నాపై
వ్యాసంగమగు వ్యసనమగు వరలక్ష్మి సదా!
:)
జి లేబుల్స్
-
ReplyDeleteలడలకు యతి కుదురు గదా!
వడిని జిలేబులను వేయి వరలక్ష్మీ ఢాం
డడఢాండఢాండ నినద
మ్ము డాబుసరి నింగికెగిరి ముద్దిడ వలెనే!
-
ReplyDeleteతనను తాను మనిషి తరచి తెలుసుకొన
గలడ? మరి యితరులు కనుగొనంగ
నెట్లు వీలు కలుగు? నేర్వ సత్యమిదియె
విన్నకోట విదుర వినుమ రాయ ! (11)
-
ReplyDeleteహరిబాబు గారి వివరణ
పరమాద్భుతమండి! వారి పరిపక్వత, వే
ద రహస్యమ్ముల కర్థము
సరియైన తెరగుల తెలుపు సహనము సెహభేష్!
జి లే బుల్స్ :)
-
ReplyDeleteఏదో చెప్పాలనెడా
వేదన కోరిక వదులుట వేంకట రమణా
సాధించుట మాతరమా!
క్రోధిని మముగావుమయ్య కొండలరాయా!
తిరువేంగడపు నివాసా!
ReplyDeleteసిరితోడైనిలచినావు సిరికోరుచు నె
ల్లరి నుండి కుబేరుని వ
ద్ద రుణమ్మును తీర్చగాను తట్టములెన్నో!
-
ReplyDeleteసత్యమ్మె శివమె సుందర
మత్యల్పమె యద్భుతముగ వ్యాపించె దెసల్
కాత్యాయనియే జోడై
ముత్యాలసరములుగా సముచిత ప్రకృతియై
-
ReplyDeleteకంది శంకరయ్య కవివర! మేలగు
రామ రామ యనుట; రంకు బొంకు
లెల్ల పనికి రావు! లేవండి ! లేకున్న
శంకరాభరణము చవటబాఱు!
-
ReplyDeleteఅన్నమయ కీర్తనలవియె
పెన్నిధి తిరువేంగడపతి పేరోలగమున్
తిన్నగ చేరగ మార్గము
లెన్నెన్నో చూపునోయి లెస్సగ లేమా!
-
ReplyDeleteరోజూ దర్శన మివ్వరూ :)
చైనాకు గినా మీరే
మైన వలస బోయి నారొ మమ్మిక మరిచా
రో నన్న సందియము కలి
గేను సుమా! పండుగలపుడే దర్శనమా ?
-
ReplyDeleteశ్రీరాముని మీమాంస భ
ళారే బాగౌ! వశిష్టులనడుగ వలసిం
దే రామనవమి కిదె మన
సార శుభాకంక్షలండి సారూ మీకున్
సారా శుభాకాంక్షలు :)
-
ReplyDeleteమీకు పనీపాటా లే
దా? కందాలల్లుకొనుట తప్పించి ? సదా
యీ కసరత్తుల తోటే
మీ కాలమ్ము గడిచేన మెలుత ! జిలేబీ !
-
ReplyDeleteనాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్ నానెంగే పోవేన్ :)
ఎక్కడికీ వలసా? నే
నెక్కడ బోదు నడుగడ్డ నే నమ్మితి నెం
చక్కా జీవితము గడుప!
చుక్కానిగ రఘుపతియె సుశోభిల్లంగన్!
మీ నివాసమూ ఆ ఊరేనట కదా?
Deleteమన YVR ని మీరు అప్పుడప్పుడు పలకరిస్తుంటే వారి భోగట్టా తెలుస్తుంటుంది కదా?
ఎవరండీ ఆ ఆసామి?
Delete-
ReplyDeleteశ్రీ శర్మగారు ! అవునూ
ఆ సుబ్రాజున్ను సత్తి బాబను శాల్తీ
ఆసాంతము తమరే నే
మో సందేహము కలిగె నయో వివరింపన్
-
ReplyDeleteసందేహపు ప్రాణి సుమా!
కొందరిని నివాసమడుగు,కొందరినేమో
నెందరితోడో బోల్చున్
వందారనమను నితరుల ప్రతిదినము సుమీ :)
// “నాలు పక్కం తణ్ణీర్ తణ్ణీర్” //
Deleteఅంటూ వగచిన వారెవరో? తమరు కాదా? నివాసప్రాంతం ఏదో తెలియకుండానే వగచారా?
-
ReplyDeleteజగమున వారెచ్చట తా
ము గలరని తెలియక పద్యమును వ్రాసిరకో?
వగచిన దెవరోయీ నా
లుగు వైపుల నీరమని పలుకుచు జిలేబీ ?
-
ReplyDeleteవ్రాయడ మదేల యెంగిలి
రో యనెడా భాషలోన రోదించనదే
లా యేమండీ మన్నిం
చేయండీ తప్పులున్న నెనరులటంచున్ :)
జి- లేబుల్స్
-
ReplyDeleteకాదెచ్చట కనరాని కనర్హం :(
గువ్వల్లోనూ శ్రీశ్రీల్
తవ్విన మనమదిని గలరు దండిగ తాతా!
చివ్వున నెగయును రాగము
లివ్వన నెన్నెన్నొ లెస్స లెస్స జిలేబుల్
జి- లేబుల్స్
-
ReplyDeleteపూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
కాలు లేని వాడు నడచె కష్టపడక
కరము లసలు లేని మనిషి గాంచె శక్తి
ఓ ప్రభూ ! నీదు దయని ముప్పోకలాడ!
-
ReplyDeleteనా మొబయలు లోన తెలుగ
దేమో కనరాదటంచు నేడ్వనదేలా!
ప్రామాణికమగు గూగుల్
మీ ముంగిట సేవ చేయ మిడిసిపడె గదా!
గూగుల్ కీ బోరని మో బయలు గలదే :)
-
ReplyDeleteనిజమేను! ఇంద్రునిధనువు
సజావు గా కనబడేది ! చక్కగ చిత్ర్రం
బు జిలేబియై నిలిచి వెలు
గు జిలుగుల ముదావహమ్ము కురిపించేనౌ! :)
-
ReplyDeleteకుదుమట్టంగా అను పద
మదేమి ప్రాంతంబులోన మాట్లాడెదరో?
సదనమ్ములోననిలడిగి
రి! దీనికి జవాబు చెబుదెరే యెవరేనిన్ ?
:)
కుదువ మట్టము :)
కృష్ణా జిల్లాలో అయితే వాడుకలో ఉంది (ఉండేది అందామా? ఈ కాలంలో తెలుగు మాట్లాడేవారే కరువైపోతున్నారు; “సెండ్ చేశాను” వంటి భాష మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఇక కుదుమట్టం లాంటి పదాలు వాడడం కూడానా?)
Deleteఏం ఫర్వాలేదండి, క్లియర్ గా అర్ధమైంది.
Deleteసుబ్బు సత్తి పేరిట తమ చురక లెల్ల
ReplyDeleteవిసురు చుండ్రి కాంగ్రేసుపై విదురులచట
విన్న కోట రాయా కని పించ లేదు
మీదు వ్యాఖ్యోపచరణ అదేల సూవె ? :)
సూవె లేదు, సుమ్ము లేదు. శర్మగారు చెప్పినది తేటతెల్లంగానే ఉందిగా. అయినా ప్రతి పోస్ట్ మీద ఎందుకు వ్యాఖ్యానించడం?
Deleteఅబ్బే!/ టపా కన్నా మామూలుగా మీ కింగ్ కామెంట్ ముందస్తుగా కనబడేది :) కనబడకపాయె :) దాంతో తలీ ఉంగలీ దబాయా ఇస్లియె :)
Deleteవానప్రస్తాశ్రమములో చింతాగ్రస్తులు :)
ReplyDeleteఅకటా! ఈ విద్యలు తె
ల్వక పోయెను చిన్ననాట వారెవ్వా! మ్యా
జికులెన్నెన్నో చేయం
గ కుదర లే సూవె! యెంతగామిస్సయ్యా!
వానప్రస్థాశ్రమంలో చింతచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని “చింతలు” కలగక తప్పదండీ. కృష్ణా రామా అని ఎంతసేపు జపం చేస్తారు ఎవరయినా?
Deleteతాతగారి మీద మీరు సెటైరు వేస్తున్నారా! ఎంత ధైర్యమండి మీకు !
Deleteవార్నీ, మీకలా అర్థమయిందా 😳?
Deleteమీతో జాగ్రత్తగా ఉండాలి సుమండీ, లేకపోతే తంపులు పెట్టెయ్యగలరు 😕.
-
ReplyDeleteఎవరర్రా మీరంతా ?
ప్రవచనముల మధ్య దూరి వ్యాఖ్యల హోరుల్?
చవిలేని అవాకులతో
చవాకులు వలదు పదండి స్థలమున్ వీడన్
-
ReplyDeleteశీలవతి జిలేబి ! తురుము
పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ
వాలుజ డలోన నీ కో
పాలంకారమ్ములన్ తుపాకీ గుళ్ళన్
-
ReplyDeleteరాజుని చూసిన కన్నుల
తో జవ్వని మగని జూచె తోనెగురున్ తా
రాజువ్వై నాతనిపై
మోజన్నది చూప నతడు మొత్తును తలపై
-
ReplyDeleteమలమల మాడ్చే నెండా!
యిలలోన పెరిగెను పాప మెంతెంతో ! కా
వలె నుల్లిపాయ ముక్కల్
భళి మేలొనరించునద్దె ప్రాణమ్మునకోయ్
కుష్టు ఫలములు తోడ కనికట్టు
ReplyDeleteమాటలు జతకట్టి పల్కిన పల్కులున్
జూడ జూడ, నోటితో నవ్వి నొసటితోన్
వెక్కిరింప బూనిన కుత్సిత బుద్దుల్
భహిర్గతమయ్యేన్, నిక్కము సుమతీ !
"హే హ్హే ఎందుకు ఈ పిచ్చి పద్యాల పా దమ్ము లతో హింస పెడతారండీ ?/ చక్కగ ఛందో " భద్దం" గా రాయకూడదూ :)
Delete-
ReplyDeleteఎక్కడ సమస్యయో? రణ
మెక్కడ నో ? పూ రణంబదెక్కడ? ఔరా
యెక్కడ తోరణమో? తై
తక్కల నెగిరె నొకడు కడు తల్లడిలి సుమీ :)
-
ReplyDeleteఎన్నిక ల తేది వరకున్
మన్నింతురు ఓట్లకై సుమా కుర్రోకు
ర్రన్న పిదప తుర్రో తు
ర్రన్నన్నా ఐదు వత్సరమ్ముల దాకన్
-
ReplyDeleteచాకి రేవు బ్లాగరు వార్ని యేకి పార
వేసినారు వైవీయసు విదురులచట
దీనికేమందురోకదా దీర్ఘదర్శి
గారు వేచి చూడవలె మాకందమౌత
సరదాగానే ...
Deleteనారదశిష్యాయ విద్మహే కలహభోజనాయ ధీమహి
తన్నో _ _ _ (🥨🥨🥨) ప్రచోదయాత్ 🙏😊
నేను చెప్పిన 'రేవు' తెలుగు రాష్ట్రాలది కాదండి, కర్నాటకలో వుంది.
Delete-
ReplyDeleteపడిపడి యేడ్వాలోయీ
వడి కార్పోరేట్లపై దబాయింపులతో
జడి వారల ద్రోలుడి మన
యిడుములకరెకారకులిల వీళ్లే వీళ్ళే!
- తాతగారి నీతి బోధ :)
ReplyDeleteతెలిపెదనిదే శుభాకాం
క్షల నెండల వేడిమికి ప్రజలకెల్లరకున్
విలవిలలాడండర్రా
పలువిధములకారణమ్ము భళిమీరే సూ!
-
ReplyDeleteసాపేక్షాలోయ్ సుఖదుః
ఖాపచయములిలని; కార్మికసహోదరులెం
తో పని జేయుట మనమం
తా పరితుష్టిగ బతుకుట తవణించు సదా!
-
ReplyDeleteఒంటికి బట్టయె బరువై
మంటలెగసె కాయమెల్ల జంట జిలేబీ
వెంట పడుచు వ్యాఖ్యలతో
తంటాలను రేపుచుండె తవణించునకో?
-
ReplyDeleteఎప్పటిదీ కులముల్ ? మును
పెప్పటి కాలపు వ్యవస్థ? పెనుభూతంబై
ముప్పుకలిగించె ప్రజలకు
తప్పును సరిచేయ వలయు తమ్ముల్లారా!
-
ReplyDeleteజిందా బాద్ పల్కండీ
బిందాసుగ కల్లు తాగ బింబాధరలున్
హుందాగా మగ రాయు
ళ్లందరు కారేసుకు చనిరా గ్రామములన్
-
ReplyDeleteఅంతే అలాగె చేయా
లంతే తలిదండ్రులంత నపుడె కలుగు ర
వ్వంతైన బుద్ధి పిల్లల
కంతా మాతృదినపు శుభకామనలండీ!
-
ReplyDeleteతొలగిస్తున్నా బ్లాగ్పోస్ట్స్
అలంకరించెదను పుస్తకాంతర్భాగం
బిలవాటినెల్ల జీవిత
ము లబ్ధి నొందు మహనీయముగ జనులారా!
-
ReplyDeleteఆలోచనాతరంగా
లేలా! గాలికబురుల జిలేబీల్! పది కా
లాలకు నిలచెడు రాతల్
బాలా వ్రాయి విరివిగ ప్రభాసింపంగన్!
స్వస్తి
-
ReplyDeleteవినుమా ! కరోనిలనగా
పని యేమియు చేయవలదు ! పైత్యం బద్వై
తుని బుద్ధిపోకడయొ? కొం
త నాకు కలిగెననుమానమండి తెలుపుడీ !
-
ReplyDeleteఓటేసా నడగకుమా
వేటెవరికటంచు ! భాజ్ప? వేరేదా? చె
ప్పే టయమొచ్చి నపుడు చె
బ్తా! టాటా చెప్పెదన్ కడాదేమొ యిదే!
-
ReplyDeleteప్రేమా, పెండ్లియు శిక్షయె
భామయొకతె పలుకకుండ పలికె నిజము విం
దాము కథనమ్ము రారం
డీ మన వనజమ్మ చెప్పెడీ విషయమ్ముల్
-
ReplyDeleteనర జన్మనాదటంచున్
మురిసి మురిసి పోకు ప్రకృతి ముంగిట సర్వం
బరయన్ సమమే విదురా
పరమాత్ముడు ప్రేమమయుడు పరిపాలకుడోయ్!
-
ReplyDeleteసాకీ ! నెరనమ్మితి ని
న్నే! కరుణన్ జూపి మధువు నింపవె మది నీ
కై కలత చెందె ననుదిన
మీ కడ గండ్ల సుడిగుండమే నను లాగన్
-
ReplyDeleteకొందరు వచ్చిన మనకా
నందము కొందరు వెడల మనకికన్ మహదా
నందంబరయన్ జీవిత
మందానందమ్మె నికర మయ్యరొ వినరా!
-
ReplyDeleteఈ మగ పురుషుడు తానొక
భామయటంచు తిరిగెనయొ బ్లాగ్లోకమునన్
ఈ మానసికపు రోగము
నేమో అందురట వైద్య నిపుణులు వినరా!
జి- లేబుల్స్ :)
-
ReplyDeleteపొత్తమ్ముల మేతయకో ?
చిత్తమ్మును దాటి గాంచి శ్రీహరిని సదా
తుత్తునియల జేయుచు తల
నెత్తుకొనిన వగల భక్తి నీరాజనమో!
-
ReplyDeleteనాగరికత మాటున తూ
నీగలు మదిని కలకలల నింపెన్ విండోస్
బ్యాగీ ప్యాంట్లకు యాపి
ల్లోగిలి నాభికి గరికలలో సారికలున్
-
ReplyDeleteవీరంతా ఒకటేనా ?
బారిస్టరటార్ని న్యాయవాది వకీలున్
బారు కవున్సిలు ప్లీడరు?
పోరి! తెలియజేయి తాత పొస్టు కెడ వెసన్
-
ReplyDeleteరేవు రేవని మానవ రేవకయ్య
రేవు లేని శ్రీ నగరికి రేవ నెవరు
వత్తురయ్య భూతలమున ప్రాపు గాన
కోటి కోటి జనులు పరుగులిడి వడిని
జి- లేబుల్స్ :)
-
ReplyDeleteతిరుమల సామియె పూనగ
వరుసగ వచ్చెన్ తలపులు వ్యాఖ్యానములై
పరుగులిడె నన్నెరుగకన్
పరమాత్ముని చలువ యిద్ది భళిభళి వినరా
-
ReplyDeleteఅల్లో నేరేడు జిలే
బుల్లాంటి మహారుచికరపు ఫలములు సుమీ
పుల్లగ తీపిగ నోట్లో
చల్లగ కరుగున్ పసందు సరియెచ్చటనోయ్
-
ReplyDeleteపొత్తముల ముద్రణ వృధా
విత్తపు కోత మదిలోన వేదన శ్యామా
పిత్తంతయు లాభము లే
వృత్తముల చదువు జనుల ప్రవృత్తి కలదయో!
జి- లేబుల్స్
చేతి చమురు గోవిందా! :)
తెలవారక ముందే E- కాకుల గోల యేమిటో ;)
ReplyDeleteలోకులు పలుగాకులు ! హ
య్యో! కూసెదరెన్నొ! వలదయో కొందలముల్
ఛీ! కాకులనకు మదిలో
చీకాకుల్ వలదయో! వచించిరి తాతా!
-
ReplyDeleteబాలయ్య ఫిల్టరసలే
మీ లేని మడిసి మగసిరి మించారంగా
లోలాక్షులు కని పించిన
చాలు కరమ్ములకు నవ్వ చట్టని కలుగున్ :)
ఆయనగారి చుట్టూ వుండేవాళ్ళు కూడా అదే మొరటుతనం చూపిస్తుంటారు. మొన్న మే 28న వారి తండ్రిగారి పుట్టినరోజు సందర్భంగా వీరు తన తండ్రిగారి సమాధి వద్దకు వెళ్ళారట. అక్కడ వీరి కన్నా ముందర ఆల్రెడీ వున్న జనాల్ని వీరి అనుయాయమూక, అంగరక్షకులు ఎదరనున్నవారి వీపు మీద చెయ్యి పెట్టి బలంగా మోటుగా ముందుకు తోసెయ్యడం …. టీవీ మీద కనిపించింది. తన మనుషుల్ని వారించడం కూడా చెయ్యలేదు ఈ పెద్దమనిషి. కాబట్టే యథారాజా తథాప్రజా అన్నారు.
Deleteశ్రీమాన్ బాలయ్య , ప్రతారికాభ్రమరకేళీవిలాసునిపై ఇన్నేసి అభాండాలు వేస్తున్నారేమిటండీ రావుగారు ?
Deleteరాజధాని లేని రాష్ట్రమాయె తెలుగు
ReplyDeleteతల్లి ముద్దుబిడ్డ ధర్మమేన ?
చంద్ర బాబు గారి జాతక మేమైన
మారి వైభ వమ్ము మరల వచ్చు?
-
ReplyDeleteభారతావని నూత్న శకానికై
నిదరోతున్నాయి జనుల
తుది నిర్ణయములు గవాంపతుని వెలుగులకై
కదిలె గ్రహరాశులొక పొది
ప్రధాన సేవకునికై ప్రభవ భారతికై!
చీర్స్
జిలేబి
నేడే తెలిసేది
Deleteఈనాడే తెలిసేది 🙂
(ఎన్నికల ఫలితాలు)
గోవిందా
Deleteగో బిన్ దాస్
గో విన్ దా
-
ReplyDeleteఏమేమి చూడ వలసి వచ్చునో :)
దామోదరుడొకడు! నితీ
శో మరొకడు ! చంద్రబాబు చూడ మరొక్కం
డీ మువ్వురు దేశ ప్రగతి
కే మార్గము చూపెదరొ జిగేలు మనంగా!
-
ReplyDelete"బోల్డంత " వేదాంతమ్ము :)
All pervasive one law :)
వ్యాపించవలె ననంతము
గా! పదిలము శాశ్వతమ్ముగా నానందం
బే పరిమితిలేకన్! తరి
తీపులివే హేతువు ప్రకృతికి మూలమిదే
-
ReplyDeleteచెప్పేను కదా ! ఇక్కడ
గొప్పగ చదివే జనాళి కోకొల్లలు లే
ముప్పొద్దులకొకడూ రా
డెప్పటికిన్ వేచి జూడ డెందము డస్సెన్ :)
హయ్యో రామా :)
-
ReplyDeleteతాత గారిచ్చి నారయ్య తమ తరపున
హెచ్చ రికలెన్ని యో వారి కెంత తెలివి
యో కదా ప్రశాంతుకిశోరు వోలె! వినెడు
నాయకులెచట గలరయ్య నారసింహ!
ఎన్నికల ఫలితాల తరువాయి అనలిస్టుల " ఆంధీ " :)
మోడీ గారికి చురక లేవీ లేవాండి?
Deleteఉండవండి. అయోధ్యలో ఎందుకు ఓడిపోయారండి? యోగి ఎందుకు ఓడిపోయారండి? ఈ వృద్ధ జంబూకం వ్రాస్తే మనం చదవడం లేదా? కాంగ్రెస్ కూడా అంతే కొందరిని వదిలించుకుందామనుకున్నా వదలరు.కాంగ్రెస్ కి పెద్ద చురకలు, బీజేపీ కి చిన్న చురకలు.సిగ్గుండాలి.
ఛైం చిక్ జాల్రా :)
ReplyDeleteనిలువెత్తు నిదర్శనమత
డిలలో సహనానికి గలరెవరోయీ యీ
డిల చంద్రబాబునకు ! ఓ
జిలేబి కందమ్ము వ్రాలు సెహబాసనవోయ్
బండి యిరుసుల పై రాసిస్తా :)
ReplyDeleteమీరాశిస్తున్నట్టి స
కారాత్మక మార్పు లేవి కష్టేఫలి గా
రూ! రావండీ ! నేతలు
మారు ప్రసక్తి మరి లే సుమా రాసిస్తా!
జి- లేబుల్స్
-
ReplyDeleteప్రాచీన పట్టణముల స
దాచారమ్ములు భళి వ్యవహారమ్ములతో
డై చిత్రిక పట్టిన రచ
నా చాతురి చదువవలె జనాళి వడి వడిన్
ముఫత్ కా పీడీయెఫ్ వుంటే లింకు పెట్టండి
చదివేస్తాం వెస వెసన్ :)
శుభాకాంక్షలు
రచనా శైలి,
వస్తు సేకరణ,
వాటిని క్రోడీకరించిన
వైవిధ్యం అమోఘం!
చీర్స్
జిలేబి
This comment has been removed by the author.
Delete-
ReplyDeleteబ్రువ్వట బాబా ! బొల్లో
జవ్వల్ రచన యిది రండి చదివెద మండీ
రవ్వల నెక్లేసుపదా
లెవ్విధముగ చెక్కినారొ లెస్స! సెబాసో!
-
ReplyDeleteతూలిక తాత్విక చింతన
లో లయ మయ్యే సిరా తళుకులందారా
డే లబ్జుగ విన్నాణము
వ్రాలెన్ మాణిక్యముల్ సెబాసొ జిలేబుల్
-
ReplyDeleteఓ యబ్బో ! ఆశావాది :)
ఆశావాదిని నేను! ని
రాశ నడుమ ఆశ ఉందిరా అను కొని వ్య
త్యాశము వెదికెడు మనుజుడ
నా శక్తియె మూలమని సదానమ్ముదునే!
జి- లే బుల్స్
-
ReplyDeleteసమాధానము తెలియకుంటే ఉబోసించవలె :)
సామాన్యుడి లచ్చనమే
రామచిలుక ! నీకు తెలియ డానికి లేదే
యేమాత్రమ్మవకాశ
మ్మూ! మాటలనాపిపదవె మూతివిరువకే !
-
ReplyDeleteఓటరుల గురించి ఉబోస :)
బుచికి గారన్నదే సత్యమోయి ఓట
రులు తెలివిగలవారు వారు వలయునది
మెచ్చి అందలమెక్కించి మెల్ల గా ని
దురని జోగాడుదురరరె దుస్థితి యిదె :)
-
ReplyDeleteబండి ఊచలే సాక్షిగా :)
కాలమ్ము మారు! మనుజుల
వేళయు మారు మినహాయి వేరెచట?! మరే
యేలిన నేతల బోవన్
మేలనుకున్న సరికొత్త మేళము వచ్చున్ :)
-
ReplyDeleteహా! నిజమే ! పొర పాటే!
మీ నేత్రమ్ములెపుడున్ సుమీ తప్పులనే
గాన తపించునొ ? తెలుపం
డీ! నా కన్నులు భళారె రేజర్ షార్పోయ్
-
ReplyDeleteఏడు కొండల సామీ :)
హ్యాపీ జర్నీ అన్నా
నే పరుగిడి లెట్జగో అనెక్కడ అన్నా ?
ఓ పాఠకుడ చదువవో
యీ పదపడి వ్రాయనేల ? యింత వెసవెసా!
-
ReplyDeleteలాజిక్కు లేని లెక్కల
క్రేజీనెస్సుకి జవాబరే యెన్నికలం
దే జనులిత్తురు కాంగ్రే
సో జేడియొ భాజపాయొ సువ్వీ సువ్వీ :)
-
ReplyDeleteసాయిన్సు ముచ్చటలతో
వాయింపుల విదురులట సెబాసో అనిపిం
చే యీ వేళ భళి జిలే
బీయమె! కందంపు మాల వేయవె అమ్మీ :)
-
ReplyDeleteఅరె ఒప్పుకొందును సరే
సరి మీరే రైటు! తప్పసలు నాదేనూ!
సరిగా చూడక చెప్పా
మరి వ్రాయనిలా మరల సుమా! వందనముల్!
Ky cheez badi hai mast mast ...
DeleteWow..h...wah, kya tandrusth ...
Jawab nahi aap kaa ...
వందనముల్ ... 🙏🙏🙏
-
ReplyDeleteక్యా చీజ్బడి హై మస్త్ మస్త్
వౌ! చీర్స్! క్యా! తందురుస్తి వాహ్ వాహ్! లేదం
డీ చెక్పాయింటు జిలే
బీ!చెప్పెద వందనములు ! బీలేజి సదా!
బండి ఊచల సాచ్చి :)
ReplyDeleteరామ్మా ! పజ్జెమ్మేసుకొ
బామ్మా ! యెన్నాళ్ల బతుకు బాపుకొనెదమో
యిమ్మహిలోన జిలేబీ
యమ్ముగ ! వెస బండి ద్రోలదామిపుడె పదా :(
-
ReplyDeleteభయమాహారము మైథున
మయయొ నిదుర సర్వజీవుల కిల సమాన
మ్మె! యెట బఠానీల నములు
ట యమ్మొ పళ్లెటగలదు కటాకట్కటటా :)
-
ReplyDeleteఉరికొచ్చె కవిత్వము హ
ద్దరిబన్నా బండి వారిదన్నా పవనొం
టరి వాడు కాడటంచున్
పరుగెత్తించిరి పదముల వాహ్ మిత్రులకై :)
జి లేబుల్స్ :)
-
ReplyDeleteఅంతా అశాశ్వతమె! నా
వంతుగ పద్యాలనెల్ల పట్టిక గా బ్లా
గాంతము గానిల్పితి హా
సుంతయు చదువంగ రారె శుంఠలు తాతా!
ఒకడైనా రాడా చదువ యేమందును
అంతా వారి దయయే అయిననూ ఆశించెద
చదువ రావలె శుంఠలు
-
ReplyDeleteఎటుపోతున్నామండీ ?
కటాకటని వెనుకకేను కాదు సుమండీ
ఇటువంటి దుబారాలే
ల టంకశాల తెరువాటు లైన సుమండీ
-
ReplyDeleteఇదిగిదిగో వచ్చె సుమా
యెదురన్నది లేని బామ్మ యెవ్వరి నైనా
సదనమ్మున చెండాడున్
వదలదు బరికేస్తది జన వాహిని నెపుడున్
-
ReplyDeleteఅల్లితి రాముని పై కో
కొల్లలు గా పద్య మాలికోత్సవముగ నా
దుల్లము పొంగిపొరల రా
జిల్లవలె సదా భువిని సజీవము గానన్
-
ReplyDeleteమాటికి మాటికి పోతుం
డే టప్పనుచున్ కరంటరె కరువు సూచిం
చే టయమని మిత్రుడొకడు
దీటుగ చంద్రోదయమును తిన్నగ చూపెన్ :)
-
ReplyDeleteఏదీ జరగక ఆగదు
మీదైన కితాబు వచ్చు మించారగ రా
మా దయ నీదను భారము
మీదై న తెరగగు సొమ్ము మీ కండయదే
-
ReplyDeleteఆ మూత్రపు జాయి జనుల
కా మూత్రపు వాసనా నిఖార్సుగ కావా
లే మాష్టారూ లేకుం
టే మనుగడ సాగుటెట్లు ట్రెండిదె కాదా!
జి లే బుల్స్
// “మూత్రపు” //
Delete???????? 🤔🤔
This a truthful statement indeed🙂"
DeleteThis comment has been removed by the author.
Deleteమీ అనుకరణలు, వెటకారాలకేం లెండి గానీ మీరు వ్రాసింది అచ్చుతప్పు అని ఒప్పుకోరాదూ?
Deleteమీరు చెప్పింది నిజమే
Deleteకాదు
-
ReplyDeleteతాతా వారి అనాలిసి
సేతావాతా జిలేబి సేతయె సుమ్మీ
వేతనము లేని నౌకరి
ఖాతరెవరు చేతురోయి కలకండయకో :)
-
ReplyDeleteఅతివృష్టి యనా వృష్టియు
వెతలకు మూలమ్మె నోయి వినరా ఆ పై
ఉతుకుడు తప్పదెవరి కై
న తల్ల డిల్లంగ వలయు నయ్యరొ వినరా
-
ReplyDeleteగలదొక యూట్యూబ్ఛానలు
పళనిస్వామికి సుఖముగ వంట విషయముల్
తెలిపెదరు తెలుగు లో శ్యా
మలరాయలె మెచ్చిరోయి మహిని జిలేబీ :)
వెట్రివేల్ మురుగనుక్కు హరోహర
మురుగా పழమ్ నీయప్పా
-
ReplyDeleteచింత కాయల కాజ్ఞ రుచింప వచ్చు
గాని గుటకల కాజ్ఞ స్వీకార మవదు
తాత నానుళ్లకసలు కొదవయె లేదు
వాటి కి వివరణ తెలుప వారె సాటి :)
-
ReplyDeleteశ్యామల రాయలు మెచ్చిన
ప్రామాణిక పళని గారి వంట తయారీ
లేమో జిలేబు లే సు
మ్మీ! మదిదోచిరి కతల సమీకరణలలో
-
ReplyDeleteనాకు శ్రవణ మాధ్యమమున
కూ కంటే చుక్కెదురయ కొండంతైనా
యేకూతయు విని పించదు
సౌకర్యమ్ము కలదిందు శ్యామలరాయా :)
-
ReplyDeleteనాకు ఠారెత్తి పోయెనా ? నమ్మ దగిన
మాట యేనర్ర ? బుర్రన్న మాట లేని
జీవు లార చీరేస్తాను సిగ్గు లేన
నాని మస్సులార పదండి నడ్డి విరుగు
-
ReplyDeleteఒక చిన్న కత విను జిలే
బి! కతల కాణాచి తాత వివరించెనటన్
ముకుదాడు కట్ట గలడిత
డు కాలి కిన్ చేతికిన్ చెడుగుడు యటంచున్ :)
-
ReplyDeleteనిదురన్వీడెను సింహం
బదిరెన్ చేంతాడు నిడివి వ్యాఖ్యలు భళిరా
చదివెడు వారెచట గలరు ?
పదిలము గా నిదుర బోవునిక ప్రభువు కెడన్
జి లే బుల్స్
-
ReplyDeleteఏల సుత్తి తాత యేల అశాశ్వత
ములకు సృష్టి తత్వమునకు లింకు
లేల ! బండి చుట్టుటేల నడకయు సా
గుటకు కాదకొ ! పదుగురి కొరకయొ!
-
ReplyDeleteశ్రమ జీవన సౌందర్యము
మమేక మైనట్టి ప్రకృతి మట్టిమనుజులం
దు మదిని తాకెడు సహజ
త్వము చూడగ ముద్దుగొలిపె తనివారంగన్
-
ReplyDeleteనా టపాలోన చెప్పినానండి లేదు
వినుచు నాహ్లాదమును పొందు విత్తి ! వినెద
నేను సాహిత్యముకొరకు నేటి కాల
మందు స్పష్టత లోపించె మాట బలుక
-
ReplyDeleteఏదీ తిన్నగ నీ కస
లేదీ అర్థమ్ము కాదు లే చిరు బుడతా
వాదించడమే ముఖ్యము
లేదా చిర్రెత్తుకొచ్చు లే చిరుబురులన్
-
ReplyDeleteఎందుకు దాగుడుమూతలు
బిందాసుగ చెప్పు వూరు పేరు జిలేబీ
అందరి కుతూహలమునకు
వందారని కందమొకటి ప్రకటించుకొనన్
-
ReplyDeleteసామాన్యుని సణుగుడయో
యేమానానా గొణుగుటయే విడువడయో
మైమరిచి ఓటు వేయును
కామాంధులు పదవి చేర కస్టపడునయో
-
ReplyDeleteఅసమానమైన నామము
పసందు శ్రీరామనామ పారాయణమున్
విశదమిది విష్ణునామము
నిశాచరుల నిదుర మాన్పు నిక్కము గానన్
-
ReplyDeleteఈసారికిలా పోని
స్తే సరి యంచున్ జిలేబి జీ ఉద్దేశ
మ్మో? సందేహము తెలిపిరి
మా సారచట నరసింహ మాయె వినదగున్
-
ReplyDeleteమీ వాక్యము కోసమెదురు
మావాళ్లందరు ప్రభువు ప్రమాణముగా చె
బ్తే వాళ్లెల్లరు సంతస
మే వారి ధనముగ నమ్మి మిము పొగుడుదురే
-
ReplyDeleteతెలుగు విద్యార్థులమెరికా దేశమందు
దాడులకు గురగుట చూడ తల్లడిల్లి
బ్లాగు రైటరొకరచట పాపమేమి
చేసిరో మనవారని చింతపడిరి
-
ReplyDeleteచిన్న హీరోల సినిమాలు సేదదీర
చూసె దమ్మిక మీదట సొబగు గా థి
యేటరులలోన మాత్రమే యిదియె నిర్ణ
యమ్ము లలితమ్మ పలికెరోయమ్మ నేటు
-
ReplyDeleteతంతే బూరల బుట్టలోన పడి యేతావాత పొర్లాడె మూ
తంతావాసన హవ్వ! పొంగెనయొ! జీతంలేని ఉద్యోగమెం
తెంతోవుండవు బోడిచేతి మెతుకుల్ దెప్పుల్ చెనిక్కాయలున్
కాంతారమ్మున కన్నగాడు మరువన్ గాబోడుధారాంగమున్
హేవిటో ఈ తలాతోకాలేని వాక్యాలు
:)
-
ReplyDeleteఅయ్యయ్యో ! హరిబాబుగారు!యెపుడోఅన్నారు ఎన్టీవొడో
భయ్యా!రెడ్డియొ! సీయెమౌననుచు అబ్బబ్బో! సెటైరేనుపో
కుయ్యోమొర్రొ యటంచు వ్రాయుమిక మూల్గుల్తో మరోమారు రా
వయ్యా! బ్లాగు టపాను జూసి జనులే వారెవ్వ చేంతాడనన్
-
ReplyDeleteఏదైనననాచారం
బేదైనాను పొరబాటు పెద్దగ లేపున్
వేదాంతపుటాక్రోశము
ఖేదంబల్లుకొను మేలు కేల్మోడ్చుటయే!
-
ReplyDeleteరాముడు చెప్పెను వినుమోయ్
వేమార్లు మరల మరల నివేదింపడు సు
మ్మీ! మడిసి విజ్ఞత గలిగి
కామెంటిడునపుడపుడు నిఖార్సుగ నెపుడున్
-
ReplyDeleteహాయిగ ఇంట్లో జోగక
సైయని సినిమాకు పోయి ఛా! హెడ్డేకం
చూ యేడ్వనేల జనులా
రా! యీ కల్కి మన కల్కి యా!తిక్కయె పో!
ఏమి బడాయి ఏమి బడాయి :)
ReplyDeleteతెలగాణ అసెంబ్లి కొరకు
నలుపు కలరునద్ది వేసిన సిరా గుర్తుల్
తిలకింపన్ పోలేదం
డి లోక్సభాయెన్నికల గడియలవరకునే!
-
ReplyDeleteఅవి ఒంటరి పక్షులు కా
వు!విరహమున మునిగి తేలి వూయల లాడం
గ వురికెడు జంటపక్షులు
కవులకు చేయూతనిచ్చు కావ్యములల్లన్
-
ReplyDeleteగతి విడిచినావు మతిని ప్ర
గతిని విడిచితివె జిలేబి కష్టేఫలి శ
ర్మ తిరముగ పలికె సుదతీ
స్థితితప్పిన అపరమేధ! తీయటి తిక్తా !
-
ReplyDeleteహరిబాబా? లేక మజా
క! రెచ్చితే రెచ్చి గిచ్చి ఖండించునురోయ్
సరికిసరియంచు సైయను
చిరుజీవుల తోలు వలిచి చీరేయునురోయ్
ఏమంటివి ? యేమంటివి ?
ReplyDeleteయేమోయీవింటివి ? మరి యేమోయి కతల్ ?
యేమి సెపితివొ? సెపితివే
మో? మా కెట్లెరుకయగు ? దుముకవలదోయీ :)
-
ReplyDeleteధర్మంబు టకా! అరయన్
కర్మయగు టకా! టకాయె కైవల్యమగున్
మర్మంబెరుగు టకాయే
అర్మిలి! బ్రహ్మము టకాయె ! హాటక లక్ష్మీ !
-
ReplyDeleteడబ్బేనోయ్ ముఖ్యంబగు
పబ్బము వలె నను దినమ్ము పరితుష్టిగొనన్
డుబ్బుకు కొరగావు సుమా
డబ్బన్నది లేనిచో ఉడాలైపోతావ్!
-
ReplyDeleteతలపుల సుడిగుండములో
తల మునకలయిన జనాళి తప్పించుకొనన్
గలదొక చిట్కా కాగిత
ములోన వ్రాసి మరచిన సుముఖమగునోయీ
-
ReplyDeleteఆరాటములన్ని విడిచి
శ్రీరామునిమయముగ నివసించెను మనసే
శ్రీరాముడె తన ప్రాణము
గా రంజిల్లుచు వరలె ప్రగాఢముగానన్
-
ReplyDeleteనాదు సహజ శైలి చిన
బ్బా!దురుసుగ మాటలాడ బాదేస్తా! నా
నా దుర్భాషల నొలిచే
స్తా! దువ్వాడంగ ఖబడుదార్దువ్వాడ్తా!
బ్యూటిఫుల్ పోయెమ్ మిర్రర్ ఇమేజ్ :)
ReplyDeleteశాపములను, తొలగించుము
పాపములను దుష్టజనుల భావమ్ముల! నా
తాపములను తొలగించుము
శ్రీపురుషవర! పరమాత్మ! శ్రీకర! శ్యామా!
-
ReplyDeleteచెప్పగ నుపయోగము కల
దప్పా! వింటావ ? తెచ్చెదవు తంటాలన్
ముప్పువలదు పైపెచ్చుగ
దెప్పులు కూడా మొదలగు దిమ్మతిరుగునే
-
ReplyDeleteఓసి! ఉపేక్షిస్తున్నా
మే! సీ! మేమింక మాట యే కలుపము నీ
తో! సాంగత్యము వలదే
ఓ సుబ్బాయమ్మ ! కాస్త ఓరంబోవే
-
ReplyDeleteపిండి మావుల చూడగా వేచిరచట
ఇడ్లి యో దోసయొ దొరకు నిక్కమంచు
చూచి చూచివేసారిరి చోరులెల్ల
గూడి రాజ్యమేలన్ జూడ కోటరాయ!
-
ReplyDeleteహరిబాబేమియొ వ్రాయును
మరి చదువరులెవ్వరో సుమా తెలియదు! పా
మరజనుల ముంగట యతడు
మరి శంఖమ్మూదుచుండు మాదిరి కలదౌ !
హరిబాబేమియొ వ్రాయడు!
Deleteమరి చదువరులెవ్వరో అసలే తెలియదు! పా
మరజనుల ముంగట యతడు
మరి శంఖమ్మూదుచుండు లేబిజి వలెనున్!
-
ReplyDeleteతల్లికి వందనమనబడు
కల్లపు జీవొయిదిగో! ప్రఖాండులు చెప్పం
డెల్లరు దీనికి భావము
వల్లభుడా చాకిరేవు ప్రశ్నించె సుమా!
ఏమి తెలివి ఏమి తెలివి :)
ReplyDeleteకాదోయి మేక తోకా!
మేధస్సది కల్పితము కమేయని బిలువం
గా దగు సుబ్బారాయుడు!
వాదాడుట తగదు తాత ప్రతిభా శాలీ!
-
ReplyDeleteకమే యేమోయ్ నీ స్పెషాలిటీ ? :)
నీకూ గూగుల్ కూ తే
డా కాస్తా చెబ్దువంటె డాబుగ వడగ
డ్తా కాచి తూచి యిస్తా
నీకై యందా కమే! మనీషి జిలేబీ :)
-
ReplyDeleteతవికల లో బూతులకో?
కవివర! యేయ్! యేమిటిదయొ? ఖండించెనొకం
డు! వినదగురా యటంచున్
తవికనొకటి తాను చట్టు తాడించెనటన్
Crying baby gets milk :)
ReplyDeleteనాపై కారుణ్యమ్మును
చూపుమయా రఘుపతి! బెడసువలదు శ్రీరా
మా! పాటికాదు యిడుములు
నాపై కురియ నులుకంగనైన నులుకవే
-
ReplyDeleteనాకేల రామ వరములు
ఆ కోరికలున్ ధరనివి యవియు వలదురా
నీ కోదండపు ఛాయయు
నీ కరుణయె చాలు నాకు నిమ్మళమదియే
-
ReplyDeleteనమ్మగ రానివి సిరులా
కమ్మని దనిపించు ప్రేమ కంజముఖులతో
నమ్మదగనివి తనువులిక
నిమ్మళ మైనది ప్రభో కనికరము నీదే !
-
ReplyDeleteవర్తింపను సవినయముగ
ధూర్తత్వము లేక ప్రేమ తోడై "నాహం
కర్తా హరియేను సదా
కర్తా" యని చాగ వలయు కరుణయు నీదే
-
ReplyDeleteవరముల ఘనముగ నిత్తువు
పరిపరి కడగండ్లనుండి పరిరక్షణ సే
సి రహిని కురిపింతువయా!
సరియెవ్వరు రామ నీదు సాకతమునకున్
నిన్ను భజించెద రామా
ReplyDeleteమిన్నగ దశకంఠుని చిదుమి విభీషణుకున్
చెన్నుగ శరణమొసగిన స
మున్నత పరమాత్మ వీవు మ్రొక్కెద కృపకై
-
ReplyDeleteతెలియని తీరము చేర తె
రలువడుచు కడలిని దాటు రవణమ్మును ప
త్సలమరయక నిలువన్ క
ప్పలినెక్కి రఘుపతి వచ్చె బంటుని గావన్
-
ReplyDeleteచీరల గురించి తీసిన
ఆరా మరువరు జిలేబులౌరా వినరా
వారుల్ జోడించిరచట
పేరా తమదైన శైలి వేరూనంగన్ :)
-
ReplyDeleteశ్రీనివాసులు గారేన సిడిముడిని ట
పాను జేర్చి సెటయిరును బవిరి తీర్చి
చెళ్ళు మనురీతి గుజరాతి శ్రీపతుల వి
వాహము గురించి నిడివిగ వ్రాసినారు :)
-
ReplyDeleteసేయుచు తప్పులనుదినము
లేయపు ప్రాయమ్మునుండి లేకితనమ్ముల్
ప్రేయపు సూచనల సదా
ద్రోయుచు రామయ్య కావురో యన దగునా!