Sunday, June 30, 2024

కల్కి ౨౮౯౮ ఒరు కన్నోట్టం

 


భగభగ మండెను నిప్పులు 

ధగధగ లాడె సినిమా వధలనేకమ్ముల్

జగడములకు కొదవేలే

దు! గడగడాకొట్టుకొనిరి దుష్టప్రజలున్



జిలేబుల్స్

108 comments:

  1. -

    గురుపూర్ణిమ శిష్యులతో
    జరుపుకొనిన వేళలో ప్రజానీకముతో
    వరుసలు గట్టిన చిత్ర
    మ్ము రండి బ్లాగ్గురువులను ప్రముఖులను చూడన్

    ReplyDelete
  2. -
    మెరుగులు దిద్దితి వారల
    పరిపూర్ణపు జ్ఞానమొసగి ప్రజ్ఞయు తోడై
    గురువును మించి ప్రతిభ పదు
    గురుజనులకు వారొసంగ గురుతెరుగంగన్


    గురువుగారు ఆశ్రమవాసియై బొద్దుగా తయారైనారు :)



    ReplyDelete
  3. -

    వేసితి నుచ్చు తెలుసుకొన
    గా సాధ్యంబగునకో నిఖార్సుగ చెబ్తా
    వేషాలేయక పదపద
    శోషగిలిపడుటకు మునుపు సుత్తేయకురోయ్

    ReplyDelete
  4. -
    తెలుగు గోస్పెలు బాజారు తీట యయ్యె
    యేమి చేతురా నాగప్ప యేమి చేతు :)


    ReplyDelete
  5. -

    నాలాంటమాయకునరరె
    మీలా అనుకుంటె యెట్ల ?మించారెన్ బో
    చాల సొగసు! జగమెరిగిన
    చాలాకీ మడిసి వారు సరె చెవి పువ్వుల్

    ReplyDelete
  6. ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి గారు 83 యేళ్ళ వయసులో ఇవాళ (ఆగస్ట్ 03, 2024) స్వర్గస్తులయారట. 🙏

    ReplyDelete


  7. -

    మాది తెనాలి! తెనాలియె
    మీదిన్ను లయోల అల్యుమినియని కలదం
    డీ దానిపేరు ఆల్కా!
    గోదా వాత్సాపు కలదు గోకుకొనుటకున్


    ReplyDelete
  8. -

    మీరున్ను లయోలా వా
    రా!రండు మొబయిలు నంబరహొ నాకివ్వం
    డీ! రాసెద సెక్రటరీ
    గారికి వాట్సప్ మెసేజి గబుకున జేర్చన్



    ReplyDelete
  9. -

    అరకొర పదముల పద్దెము
    నరరె జిలేబి‌ సదనమ్ము నన్ వ్రాయంగా
    విరివిగ తలపంకించుచు
    "నరసింహుడు" భక్తి మ్రొక్కె నారీమణికి‌న్


    ఎవరా (వి)/ నరసింహుడు :)


    ReplyDelete
    Replies
    1. కురు లారబోసి నెలతుక
      అర కంటను కన్నుగీట అదిరిపడి వడిన్
      కరములు జోడించి మరీ
      "నరసింహుడు" భక్తి మ్రొక్కె నారీమణికి‌న్

      Delete
  10. -
    కలియుగాంతము రావచ్చు కాన వచ్చె
    సూచనలు రాశులు వరుస జొచ్చె నోయి
    హిందువులొకటవండర్ర హింసకు బలి
    గాక నిలుతురు పుడమిని గట్టిగాను !


    బ్లాగ్ జ్యోతిష్కులు నిదుర లేచినారు :)


    ReplyDelete
  11. ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు గ్రహాలు తిరిగి తిరిగి మానవులపై ప్రభావం చూపుతున్నాయి. యురేనస్ గ్రహం నవగ్రహాలలో లేదు అయినా ఇంత ప్రభావం చూపడం ఏమిటి🤔 గురువులు ఏదైనా రెమిడీలు చూపించవచ్చు కదా.

    ReplyDelete
  12. ఇంకా యేమేమి వచ్చునో :)


    అభిమానపుటాశీస్సులు
    గుభిల్లు మను విధముల పద గుంఫనముల జొ
    ప్పు బలము నిచ్చె గురూజీ!
    సభికుల ఫుట్బాలుతాచి సాధింతునయో :)


    ReplyDelete
  13. తాను రెమిడీలు చెప్పే గురువుని కానని తరచూ చెబుతుంటారే?

    ReplyDelete
  14. -

    సరి క్రొత్త కారెక్టరు ఎంటరయ్యె :)

    సుబ్బ రాయ శాస్త్రి సుదతి జిలేబిగ
    బ్లాగు లోకమందు వ్యాఖ్యలాట
    లాడు చుండె బండి రావు వారి పెడార్థ
    ములను త్రోసి పుచ్చి ముందు పొండు :)


    జి లే బుల్స్ :)



    ReplyDelete
  15. చెదరిన స్వప్న వాహిని

    చితుకులవుతారు చలిమం
    ట తాకిడికి మీరు బావుటా ధర్మపు దు
    ష్టత చేయు జనులకెగరే
    య! తల్లి భారతిని ద్రొక్క!జాగ్రత్త జనుల్!




    ReplyDelete
  16. -

    హల్లొ! జిలేబీ శాస్త్రీ !
    ముల్లోకపు నారదుని ప్రముఖ శిష్యా; బ్లా
    గ్కల్లోలములకు కారణ
    మల్లా నీ పద్యములె సుమా! రాకాసీ!


    ReplyDelete
  17. Google translation :)

    Hallo! Jilebi Shastri !
    A prominent disciple of Mullokapu Narada;
    the cause of blog chaos
    is your poems Suma! Rakasi!


    ReplyDelete
  18. -
    అవ్వా!జిలేబి చోద్యం
    బవ్వవ్వా! బండి వారి పై లక్కాకుల్
    చువ్వన కందంబొక్కటి
    రువ్విన తీరదిరె పో నురుకుల పరుగులన్ :)



    ReplyDelete
  19. -

    కైలాహూన్! భారత ఆ
    ర్మీ లైఫండెత్! సునిశిత రీజ్నింగ్లాజిక్
    మేలైన స్ట్రేటజీలను
    చాలా వేగముగ నెరపి సైన్యంబెస్కేప్

    https://sangharshana.blogspot.com/2024/08/operation-khukri-major-general-rajpal.html?

    Operation Khukri - Major General Rajpal Punia, Damini Punia




    ReplyDelete
  20. -
    ప్రశ్నా! నీవెక్కడ వున్నావు ?


    చూసా! ప్రశ్నించానోయ్
    వేసా చక్రమ్ము జాత వేదసు పనుపై
    మోసాలగుట్ట నాయకు
    లే సాక్షిగ దుండగులు మలిచిన చెడగు సూ!

    ReplyDelete
    Replies

    1. // "ప్రసన్నలక్ష్మి, మీరాజాస్మిన్, ప్రత్యూష, సుశాంత్ సింగ్ " //

      బ్లాగు జ్యోతి‌ష్కుల వారేమిటండీ మీరా జామీ ఎప్స్మిపన్ పేరుని కూడా ఆఖరి పేరాలో ఇచ్చిన ఉదాహరణల్లో కలిపారు? ఆవిడ బాగానే ఉన్నారుగా (మలయాళ నటి గనుక అయితే; తెలుగు సినిమాల్లో కూడా బాగానే వెలిగింది). ఆవిడ గురించి అత్యాచార.వార్తేమీ ఎప్పుడూ.వినలేదే.

      Delete
    2. వినరా వారు

      చెంపలేసుకోండి

      మీరు మరో క్యా రెక్టరుని తీసుకొచ్చేరు :)

      Delete
    3. మీరా జామీ ఎప్సీ పన్ :)

      మీ రాజా మీ ఎప్సీ పన్‌ :)



      పేరు బావుంది

      Delete
    4. మీరా జాస్మిన్ ఆండీ. టైపో అయ్యా / అమ్మా‌. కాస్త అడ్జస్ట్ చేసుకోండి.

      Delete
    5. వినరా వారు

      మనం చేస్తే టైపో :)

      గురువు గారు చేస్తే వామ్మో వామ్మో అంటూ కా మంటేయడమే ?


      హన్నా ! చెంపలేసుకోండి మరోమారు


      Delete
  21. వామ్మో ! వామ్మో
    పద్యాల్రాసి ప్రకటనలతో కొల్లగొట్టేస్తున్నారు దస్కం :)

    ఆటవెలది‌ తోడుగా చిత్రమాలిక
    ల వెలయించిరి వఝల కవివరులు
    వ్యాఖ్య వేయ జూడ ప్రకటనలెగయునే
    గాని పేజి తెరువ దాయె సుదతి :)



    ReplyDelete
  22. -

    డాలర్ల పంట నా ప
    ద్యాలోయి జిలేబులవలె దానివిలువ యె
    న్నో లక్షలు; రాధేశ్యా
    మాలంకారములతో సమాయుక్తంబై :)





    ReplyDelete
  23. -
    ఏ పుట్టలోన రాజా
    యే పాము కలదను తెలివి డెవ్వరి కన్నా
    ఓ పండిత రాయా ! మీ
    తోపులకిక బండివారు తొండరులె సదా :)


    ReplyDelete
  24. -

    ఏమండోయ్ వినరావారు

    తాతగారి టపాలు కనరావటం లేదేమిటీ నడుమ ?
    కులాసాయే కదా ?


    ReplyDelete
    Replies
    1. నేనేమయినా Boswell లా కనిపిస్తున్నానా?

      Delete
  25. రత్న మేదుర , ముత్యాల రా బసిండి
    నిగ నిగల కల్కితురాయి , ధగ ధగల వి
    నీల శిఖిపింఛ మొనరు , వన్నియల కృష్ణ !
    వినుత పరమాత్మ ! శరణు నీవే మహాత్మ !

    ReplyDelete
  26. వెడద మోమున , కస్తూరి నిడుద నామ
    మొనర , దీసిన దేభామ మోహనాంగ ?
    పెదవులకు పెదవు లలది , సుదతి యెవరొ ,
    రాగ రంజిత మొనరించెరా ముకుంద !

    ReplyDelete
  27. మాధవుడు గుర్తు కొచ్చెడు , మరల మరల
    ఎందుకో యేమొ !? , అంతగా నెక్కె నేమొ
    తలకు , తలపుల నుండి సుంతయును దాను
    విడడు పరమాత్మ , దయగల యొడయడు గద !

    ReplyDelete
  28. ఈ కోవెలలో జీవుడు ,
    ఆ కోవెల చేరు కొఱకు , అటమట పడెడిన్ ,
    చేకొని , మది నిండుగ , హరి
    శ్రీకృష్ణుని నిడి , కొలువుము , చేర్చును సఖుడా !

    ReplyDelete
  29. -


    వెలవెల పోయిన జీవుడు
    వెలుగుకతీతుడగు ప్రభువు ప్రేయసి ప్రియుడై
    పలుకే బంగారంబుగ
    చెలువము మీరంగ కలువ చెంగట రారే


    ReplyDelete
  30. -

    తలకెక్కెనో తలంపుల
    నిలిచి చెడుగుడనెనకో మునీశ్వరుల మదిన్
    వెలుగై నిండెనొ ప్రాణుల
    వలరసమై వ్యాప్తి చెంది వసుధ నిలచెనో!


    ReplyDelete
  31. అంతర్ముఖుడై యొకపరి ,
    అంతట , నెదురుగ నొకపరి , నగుపించె , మరీ
    చెంతనె నిలువడి , సఖుడై
    పంతము లాడెడు మరిమరి , పరమాత్మ హరీ .

    ReplyDelete
  32. పరమాత్మ నామధేయము
    పరములలో కెల్ల కృష్ణ ప్రభుని వరించెన్ ,
    తిరు నామము లన్నియు , ఆ
    కరుణాకరు దివ్య చరిత క్రమ్మిన ఘటనల్ .

    ReplyDelete
  33. -
    ఒకపరి చట్టని‌ కనిపిం
    చొకపరి సందియము లేపు శూన్యంబో తా
    నుకలడొ లేడొ యని వెరసి
    నికరము గా తెలుసుకొను మనీషులు కలరో?



    ReplyDelete
  34. భాగవతుల మధ్య , పరమాత్మ ధ్యానమం ,
    దాడి పాడు బతుకె , అసలు బతుకు ,
    బతుకుకు కొఱగాని , పసలేని రచ్చల
    పొద్దు పుచ్చనేల బుధజనులకు ?

    ReplyDelete
  35. ఉన్నాడు లెస్స మాధవు ,
    డున్నాడదె భాగవతుల , నుర్వి సుజనులం ,
    దున్నాడు బుధుల చర్చల ,
    నున్నాడిదె సర్వజనుల , నున్నాడు కనన్ .

    ReplyDelete
  36. -

    పుచ్చన్నది లేనియెడల
    మెచ్చుట కేది గలదండి మేష్టారూ ! పే
    రిచ్చెడు రొచ్చే పుడమిని
    ముచ్చటగా త్రిప్పు చుండె ముక్కాలములోన్

    ReplyDelete
  37. వద్దన కండి! త్వరిత మీ
    రిద్దరిని జిలేబులున్ సరి సమానముగా
    దద్దోజనమ్ము తినెదము
    చద్దన్నము తోడు జేర్చి సౌకర్యముగా !


    ReplyDelete
  38. ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే

    పరమేశ్వరున కిడు పాద పూజ

    ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే

    పాలిచ్చు తల్లికి పాద పూజ

    సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే

    భాషా మతల్లికి పాద పూజ

    తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే

    పంతులు గారికి పాద పూజ 


    గ్రాంధికము వీడి  గ్రామీణ కమ్మదనపు 

    తెలుగు నుడికారముల సొగసులు కుదిర్చి 

    పద్యములు కవితలు వ్రాసి పాడుకొనుటె 

    మోదముగ  తెల్గు తల్లికి పాద పూజ . 



    ReplyDelete
    Replies
    1. లక్కాకుల వారూ : మా ఇంట్లో అక్షరాభ్యాసానికి ప్రతిసారీ నేను ఒక ఇంగ్లీష్ పద్యం వ్రాస్తూ ఉంటాను , ఇంకో మనవడికి అక్షరాభ్యాసం త్వరలో రాబోతోంది దానికి మీరు మంచి ఐడియా ఇచ్చారు . థాంక్స్ .

      Delete
    2. సార్ ,
      ధన్యవాదాలు , నమస్సులూను 🙏

      Delete
    3. :)

      ఒకరేమో ఇంగ్లీషు! మ
      రొకరేమో తెలుగులో ! వరుస పద్యములన్
      ప్రకటించు రాజులు ! నడుమ
      టకటక పదపేర్పుల వికట జిలేబీయు‌న్



      Delete
  39. -
    మీరాహా వోహో నా
    ప్యారా భాయి అనుకున్న చాలా రాజా
    వారూ ! వారనుకొనవలె
    సారూ మావారని మనసార దృఢముగా :)


    నారదా


    ReplyDelete
  40. :)

    సుబ్బరాయ శాస్త్రి ! చుప్పనాతి జిలేబి
    చూడ చూడ నొకరె శొంఠి కొమ్మ

    ReplyDelete
  41. కష్టేఫలి శర్మ గారు కనిపించడం లేదేమిటీ బ్లాగుల్లో ?


    ReplyDelete
    Replies
    1. మీ ప్రశ్నని శర్మ‌గారి బ్లాగులోనే పోస్ట్ చెయ్యరాదా? ఇక్కడ స్వగతం ఎందుకు?

      Delete
  42. -

    ఇదె! ఆ ప్రదేశ మిదె! బం
    డి దేవర నివాసమిదె! వడి పదములను వా
    ర్చ దభాలుదభాలన వా
    రదురహొ రాజన్న వత్తురాదరణ నిడన్ :)


    ReplyDelete
  43. -
    గుత్తి వంకాయ కూర! హే గురు! తెలుంగు
    తేజ మా! శ్యామ రమ్మ! కొంతిచ్చట విశ
    దింపు గసగసా ల గురించి దేని కి ఉప
    యోగ మగునో యటంచునయో త్వరితము



    ReplyDelete
    Replies
    1. శాస్త్రిగారికి నాన్ వెజ్ మ‌సాలు గసగ
      సాలుపై మనసు పడెన ? శ్యామ రమ్మ
      తెలుగు తేజమా దేనికో తెలుపు మనుచు
      నెవరినో బిల్చు చున్నారు అవసరపడి .

      Delete
    2. అవసర పడి కాదండోయ్ రాజన్న వారు అవసరం పడి :) వారేమో కటకటాల వెనుక దాగిపోయేరు ఆహ్వానము లేనిదే ఊచలు తెరచుకొనవు సూవె యని :) అందుకని....... పిలచిన పలుకునేమో మా శ్యాముడని...


      :)

      Delete
  44. విరాళాల కాలము వచ్చెన్

    వరదలు వచ్చెను వచ్చును
    విరాళముల సేకరణకు పెడబొబ్బలతో
    డరరే ఎన్ జీ వోలున్
    పెరుమాళ్లకెరుక జిలేబి వీటికి లెక్ఖల్ !



    ReplyDelete
  45. -

    తాతగారి టపాల పత్తా కనుబడ
    కుండ పోవటానికి చిక్కె కుదురు కార
    ణమ్ము, రాయటానికి ఐడియాలు లేక
    పోవుటయె బుర్ర ఖాళియగుటయె సూవె


    ReplyDelete
  46. -
    మాలిక పత్రిక ఓపెన్
    కాలే! ప్చ్! సర్వరేమొ కారణము జిలే
    బీ? లాగినయి మరల చే
    యాలే రీస్టార్టొ? రౌడి యాడుండావో ? :)

    :(


    ReplyDelete
  47. -
    వినరా వీరకుమారా !
    బిగిసిన బిగువట త్వరితము విడువడ రౌడీ
    దిగవలె చట్టని సర్వరు
    జగమొండిని కాలదన్ని జరలేపవలెన్ :)


    ReplyDelete
  48. పెద్దలు మౌనముద్రలు దాల్చి రుధ్ధతులయి ,
    కాస్త గోకరాదా శాస్త్రిగారు ! భయమ ?
    తమకు భయమేల ? కలహభోజ్యమము దొరుక
    వదలుదర ? లోక కళ్యాణ ప్రదము గోరి .

    ReplyDelete
  49. రాజారావు మాస్టారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🙏.

    ReplyDelete
    Replies
    1. పెద్దలు నరసింహరావుగారికి ,
      నమస్సులు ,
      ధన్యవాదములున్నూ .

      Delete
  50. చైంచిక్ జాల్రా :)

    ముద్దుగ నొజ్జల దినమున
    పెద్దలు నరసన్నవారు పేర్మియు తోడై
    ప్రొద్దు పొడువంగ చట్టని
    నిద్దరి రాజన్న వారిని పొగిడిరి భళా


    ReplyDelete
    Replies
    1. శ్రీపాద వారి కెందుకొ
      ఓపని మనసాయె , పెద్దలొచ్చి , శుభాకాం
      క్షాపదనిసలు వచింపగ ,
      కోపము లేవైన గలవ కోవిద ? శాస్త్రీ !

      Delete
    2. :)

      బెత్తం బుచ్చుకు కొడితే
      ముత్తాతలుకూడ వాలి ముంగట గురువుల్
      పెత్తనమునకు సలామని
      వత్తాసుపలుకవలెన్ సెబాసని రాజా :)

      Delete
    3. శ్రీపాద వారా రాజారావు మాస్టారూ? "జిలేబి" గారి ఇంటిపేరు కూడా కనిపెట్టేశారా? జాసూసీ బాగానే చేసారే 🙂👏👏.

      Delete
  51. నెత్తిన టర్బన్ , కోటూ ,
    వత్తుగ ధోవతి ధరించి వచ్చే శుంభద్
    ముత్తెపు టొజ్జల బంతికి ,
    బెత్తపు మాష్టారులకు సవినయ నమస్సుల్ . 🙏

    ReplyDelete
  52. :)

    నావికుడను కాను సుమా
    రేవుల వెంబడి భవనము లెన్నిన్నియొ యం
    చావల కొనివేయంగా
    కేవలమొక బ్యాంకరుని ఫకీరుని సుమ్మీ

    ReplyDelete
    Replies
    1. For a change, నా గురించి సరిగ్గా చెప్పారు‌"జిలేబి" గారూ‌ 🙂🙏.

      Delete
  53. ఇంకా జిలేబి గారని
    శంకించుదురేల వారు శాస్త్రి , ఇకపై
    వంకర జిలేబి యనవల
    దుంకించగ నసలు పేర నొత్తి పలుకుడీ !

    ReplyDelete
  54. ఎవరున్నారీరోజుల ,
    నవనిన్ , స్ఫూర్తి నిడు నొజ్జ , లధ్యాపన లన్
    నవ మార్గదర్శ కత్వపు
    జవసత్వము లొసగువారు , జన గణములకున్ ?

    ReplyDelete
    Replies
    1. అంత నిరాశ వలదండీ రాజన్న గారు
      కలరు మా మదరాసు ఐఐటీ‌‌ డీన్‌‌ గా/ డైరెక్టర్ శ్రీ కామకోటి గారి లాంటి వారీలోకములో యింకా !


      ఉన్నారు మచ్చుకకు రా
      జన్నా మద్రాసయయిటి డైరెక్టరుగా
      రెన్నెన్నో క్రొత్త చదువు
      లెన్నిటికొ ప్రణాళికల మలిచిరి మెరుగుగా


      https://www.hindustantimes.com/education/admissions/iit-madras-hosts-swayam-plus-national-workshop-6-new-skill-based-courses-added-101725424051567.html#webview=1

      Delete
    2. మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదములు .

      Delete
    3. :)

      మంచి సమాచారంబం
      దించిరి శ్రీపాద శాస్త్రి! ధీమంతులు ధ్యా
      నించిరి నాడూ నేడున్
      పంచగ జ్ఞానమ్ము జనుల బతుకులు మెరయన్


      Delete
  55. -

    శ్రీపాదవారివి జిలే
    బీ! పద నీ గుట్టుతెలిసె వివరములున్ సు
    మ్మీ!పరిశోధన చేసిరి
    గా పండితులున్ హుషారు గావుండుమికన్

    ReplyDelete
  56. కొలిచిన వారికి కొండంత వేలుపై
    సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
    పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
    కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
    ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
    ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
    కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
    మనసార దీవించు మహిత మూర్తి

    మూడు గుంజీలు దీసినా మోదమంది
    నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
    భక్త సులభుండు సకల సంపద ప్రదాత
    శ్రీ గణేశు డిచ్చుత శుభ శ్రీకరములు .

    ReplyDelete
  57. -

    శుభపరిణామమ్ములకై
    శుభకామనలివ్వి దారి చూపించవలెన్
    విభుడా పనిచెఱుపులదొర
    సభలోని జనాళికిన్ ప్రసాదింపంగన్

    ReplyDelete
    Replies
    1. నోరార గణేషు జపమె ,
      ఊరూరా , వీధి వీధి ఉఱ్ఱూతలె , మీ
      పోరడి కీ నీరాజన ,
      పారమ్యము లేల కలిగె ? పార్వతి మాతా !

      Delete
    2. -

      కలిగినంటె నేనేమి చెప్పుదు
      వాడు కరివదనుడు పరశుధరుడు
      యేనుగుమొగమయ్య హేరుకుడు వినాయ
      కుండు గణపతి‌ సుముఖుడు గజాస్యు!


      Delete
  58. -
    అద్దె ఇంటి కథలనపుడపుడు తిరగ
    బోత బెట్టును; మరల ద్రిప్పును జిలేబు
    ల వలె రష్యా విశేషములనటునిటు; వి
    లేకరుల జీవనము గూర్చి లెస్స బలుకు



    ReplyDelete
  59. -
    జూదమ్ము, వెలది, మద్యము,
    వాదనల కటుత్వమున్, దుబారా ఖర్చుల్,
    వేదించెడు దండన, నా
    చ్ఛోదనమౌ యేడు వ్యసనములు తెలుసుకొనన్



    ReplyDelete
  60. -
    చీటీ లే? క్రోసిన్ ము
    మ్మాటికి అమ్మము! తుపాకి మాకేం ప్రాబ్లెం
    లే!టన్నులకొలదిగ తీ
    స్కో! టెస్ట్షూట్షూట్ జనులను షూట్ నో ఇష్యూస్


    ReplyDelete
  61. పెద్ద లేడ వొయిరొ , నిద్దుర లేపవా ?
    సుబ్బరాయ శాస్త్రి ! సూరికత్తి !
    గిల్లి గిచ్చి యైన , గిలిగిచ్చికాలాడి
    గోకి యైన , చేయి కొరికి యైన .

    ReplyDelete
    Replies
    1. ఏమండోయ్ రాజావారు

      ఎవరి మటుకు వారు వారి వారి అడ్దాలకు‌
      తాళాలు‌ బిగించి‌ నారు నేనేమి చేతునయ్యా !

      నిదుర బోయిన వారల నెత్తిపైన
      మొట్టి లేపగలము !నిదురోయి నట్లు
      నటన లాడు విదురుల హన్నా! యెటులయొ
      లేపుటా! రాజ ! తెలుపండి లెస్సగాను



      Delete
  62. Replies
    1. -

      స్టన్ను బౌండయిరకటా ! యేమియు జవాబు
      తెలియకనొ ? కుదరదు ! తేల్చవలె ని
      పుడె సమస్య రాజ ! పుర్రె‌ తొలచివేయు
      ప్రశ్న పలుకు డయ్య పండితార్య



      Delete
    2. వత్తురు బెత్తము లెత్తుక ,
      వత్తురు మన తాటదీయ , వామ్మో ! విదురుల్
      కత్తులు దూస్తురు , తమతో
      పొత్తిక వద్దండి శాస్త్రి ! పో ! దూరంగా .

      Delete
    3. ఆ మాత్రం‌ భయం వుండడం‌ మంచిదే :)

      Delete
    4. ముల్లోక ఙ్ఞానాంభసి !
      కల్లలు కపటాలు లేని , కమనీయ మనో
      ఫుల్లసరోజ ! తమరు సం
      ధిల్లని లక్ష్యము గలదె ! మదిన్ దలపంగన్ .

      Delete
  63. ఏ మనుభవించె కృష్ణయ్య , భూమి పైని ,
    పుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ
    గొల్ల లిండ్లను బెరిగె , మేనెల్ల యాల
    ధూళి దూసరితమయి దులకిసపడ .

    మేనమామ శత్రువయి యేమేమొ చేసె
    తనను చంపించ , తలిరాకు తనమునందె
    గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని ,
    యేరికైనను నిట్టి రాయిడులు గలవె !

    ఆల గాచెను , మన్నుల రాల విపిన
    తలములన్ , యెండ లనక , వాన లన కకట !
    అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల
    నిద్దురోయెను , ముద్దు మో మద్దె మురికి .

    రాచపుటక బుట్టె , మధుర రస విరాజ
    మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ
    నమ్ము లేవి ? వెన్నలకు ప్రాణమ్ము లూన ,
    గొల్ల లిండుల గోరాడె , గోస బడియె .

    రాధతో గూడి , యమునా తటీ , ధరాది
    తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ
    జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ?
    తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను .

    కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి
    ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు ,
    పూని గాంధారి శపియించె , మునిగె నీట
    ద్వారకాపురి యాదవుల్ పడిరి చచ్చి .

    ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె ,
    తను పరమాత్మ యయ్యును , ధరణి పూని
    ధర్మమును నిల్ప అవతారధారి యైన
    కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము !

    యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్

    ReplyDelete
  64. గోల్ మాల్ హై భాయ్ సబ్ గోల్మాల్ :)

    ఉచ్చ కలిపి జొయ్యని జ్యూ
    సిచ్చిన చప్పరిచి త్రాగి సీసాల్ సీసాల్
    నచ్చె భళారే టేస్టని‌
    మెచ్చుకొనెడు ప్రజలు చట్టు మేలుకొనండీ


    ReplyDelete
  65. -

    ఉమ్ము ఉమ్మని మొత్తుకునుచు జిలేబి
    పండ్లు కూరగాయలు జూడ భయమునొంద
    నేల! ఉమ్ములోన గలడు నిత్యముక్తు
    డంచు సరిపెట్టుకొనుము నడలుముడుంగు

    ReplyDelete
  66. -
    భగవంతునికి ప్రసాదము
    తగదోయీ మాంసము కస తగదు జిలేబీ
    తగు పంచభక్ష్యములె సూ
    వె! గడింపగలవు దయయపుడే నిక్కముగా!



    ReplyDelete
  67. బీమా భీమాల నడుమ
    రామా! చేంతాడు నిడివి రాద్ధాంతమ్ముల్
    ఈమానవులకు పనిలే
    దేమిటి ? కట్పేష్ట్లతో కుదేలుమనిరి పో :)


    బీమా యో భీమాయో డబ్బులొస్తే సంతోషించాలె గాని ఇలా వత్తులెతుక్కుంటే గెట్లా :)

    ReplyDelete
    Replies
    1. మీ ఈ మాట భండారు వారి బ్లాగులో సదరు కామెంట్ పెట్టిన “అజ్ఞాత” గారికి చెప్పండి, “జిలేబి” గారూ. మొదలెట్టింది వారు.

      Delete
  68. -
    శుచిమడి వలయు పరంజ్యో
    తి చిదాత్ముని కొలువను వినతి సుమా ఇట్లాం
    టి చెవాకుల వ్రాయుట తగ
    దు! చక్కగా ధర్మమరుగుదురనుచు ప్రణతుల్



    ReplyDelete
  69. నరస రాయల గారి విన్నాణమెంత
    యో అమెరికాసరస్సుల లోన పెద్ద
    వేవియో చిన్న వేవియో వింత లెవ్వి
    యో తెలియబరచిరినారహో త్వరితము


    ReplyDelete
    Replies
    1. Thank you 🙏.
      ఉద్యోగాల కాంపిటీటివ్ పరీక్షల కోసం నానా రకాలూ చదివేవాళ్లం కదా. ఆ విధంగా ఏదో కాస్త వొంట పట్టిన “విన్నాణం” లెండి.

      Delete
  70. నామాల సామి కే నామాలా !
    ఓర్నాయనో !

    తిరుపతి లడ్డులు నోరూ
    ర రుచికరముగా కలవని రాధనమొందం
    గరరే కల్తీ నెయ్యం
    చరయగ వచ్చె జగనన్న షడ్యంత్రమటా!


    ReplyDelete
  71. -
    ధరియింపగ కాషాయము
    పరివారము విడిచి జనుల భవబంధమ్ముల్
    త్వరితము‌ దొలగన్ తపమా
    చరింప గాంచి విభుడతని సన్నగ నవ్వెన్


    ReplyDelete
  72. -

    చూడ్డానికి కౌ బాయ్లా
    విడ్డూరముగ గలరండి పిలకాయవలెన్
    చడ్డీ యొక్కటె తక్కువ
    దుడ్డుగల విలేకరికి సుదూరపు కొటికన్


    ReplyDelete