Sunday, March 29, 2015

శ్రీ రామ నవమి శుభాకాంక్షల తో -

శ్రీ రామ నవమి శుభాకాంక్షల తో -

 నీ దయ రాదా ! స్వామీ నీ దయ రాదా అంటూ విన బడుతున్న ఓ పంచ దశ లోక శ్యామల వాసి ఆర్త నాదం తో స్వామి వారు ఉలిక్కి పడేరు !

రామనవమి వస్తోంది !


తన 'భర్త' డే ! సీతమ్మ దిగాలు గా ఉన్న మిస్టర్ పెళ్ళాం గారి ని జూస్తూ బుగ్గ న వేలెట్టు కుని - వీరేనా వీరేనా ఆ అరివీర రావణా సురుణ్ణి సంహరించింది - ఓ భక్తుని ఆర్తనాదా నికి ఇంత ఆదుర్దా పడి పోతున్నాడే నా స్వామి - అనుకున్నది తల్లి . 

'స్వామీ' వారు, మీ బర్త డే ని హ్యాపీ గా సెలెబ్రేట్ చేసు కో కుండా ఇట్లా ఈ పంచ దశ మానవుని ఆర్త నాదానికి బెంబే లెత్తి పోతూన్నారేమిటి ? స్వామీ వారి ని సముదాయించి , 'స్వామీ ! మీరు ఎంత భక్త జన మం దార కులైనా  కూడా, ఇట్లా భక్తుల్ని మీ మీద సదా 'డిపెండ్' అయ్యేలా చేసుకోకూడదుస్మీ ! అమ్మవారు చెప్పింది . 

ఏమి చేయా లంటావోయ్ మిస్సేస్స్ రామం ? అడిగేడు శ్రీ రాముల వారు . 

ఏముంది ? మీరు వాళ్ళ ని 'ఎంపవర్' చెయ్యాలి ' చెప్పింది సీతమ్మ తన డ్వాక్రా మహిళా మీటింగుల ని గుర్తుకు తెచ్చు కుంటూ , మహిళా బ్యాంకు చైర్ పెర్సన్ మాటలు గుర్తు చేసుకుంటూ !

అంటే ? స్వామీ వారు ప్రశ్నా ర్థకం గా జూసేరు !

అంటే స్వామీ , వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పురోగతి ని వాళ్ళు వాళ్ళే చూసు కోవట మన్న మాట ! చెప్పింది సీతమ్మ , "వాళ్ళ కై వాళ్ళే అభివృద్ధి లో కి రావాలి " - స్వామీ వారి మరో జన్మ ఉద్గ్రంథం భగవద్ గీత ని గుర్తుకు తెచ్చు కుంది ఈ మారు - ఉద్దరేత్ ఆత్మ నాత్మానం అనుకుంటూ !

ఓస్ ! అంతే కదా అన బోయి స్వామి వారు సందేహం లో పడేరు !

ఇందులో ఎన్ని 'వాళ్ళు' ఉన్నాయో అర్థం గాక స్వామీ వారు కొంత బుర్ర గోక్కున్నారు !

అవును, మరు జన్మ లో శ్రీ కృష్ణా వ తారం లో అర్జునుని తో తానేం జెప్పాడు ? "అర్జునా ఫలమును ఆశింపక  పని జెయ్య వోయి అని కదా ? అంతకు మించి 'నాహం కర్తా , కర్తా హరిహి ' అనుకోవోయ్ అని కూడా చెప్పినట్టు గుర్తు !.  మరి అందుకే కదా మానవ మాత్రుడు నీ దయ రాదా అంటున్నాడు ? సందేహం లో పడ్డారు స్వామీ వారు . 

చదువరీ, స్వామీ వారే సందేహం లో పడితే , ఇహ మన లాంటి కోన్ కిస్కా హ్యూమన్ లం ఏ పాటి ??

అంతా విష్ణు మాయ !

 

Wednesday, March 25, 2015

కాలం లో కరిగిన మేఘం !


కాలం లో కరిగిన మేఘం !
 
ఆకసం వైపు చూస్తోంటే 
 
ఓ మేఘ మాలిక 
 
అలవోకగా వెళ్లి పోతూ 
 
కాలం లో కరిగి పోయింది !
 
జిలేబి 

 

Saturday, March 21, 2015

'మనమధ్య' జిలేబీయం !

'మనమధ్య' జిలేబీయం !
 
మన్ 
మదీయ 
జిలేబీయం !
 
 
మన్మధ నామ 
తెలుగు సంవత్సరం 
ఆరంభం 
 
అందరికి
ఉగాది శుభాకాంక్షల తో !
 
మన్మధ జిలేబీయం !  

Friday, March 20, 2015

Tuesday, March 17, 2015

ఆరోగ్యమే భాగ్య మనెదరు అజ్ఞుల్ మూర్ఖుల్ !!

 
ఆరోగ్యమే భాగ్య మనెదరు అజ్ఞుల్ మూర్ఖుల్ !!
 
 
ఆ హా ఓ వారం పాటు 
అనారోగ్య కారణం గా 
రెష్టు తీసుకుంటే ఎంత హాయి !
 
అసలు అనారోగ్యం తరువాయి 
ప్రపంచమే సరి కొత్త గా కని పిస్తోందిస్మీ !!
 
అప్పుడప్పుడు డొక్కా వారు 
దబ్బున పడితే గాని శరీరానికి 
విశ్రాంతి లేకుండా పోయే ఈ జమానాలో !!
 
ఆరోగ్యమే భాగ్య మనెదరు అజ్ఞుల్ మూర్ఖుల్ !!
 
శుభోదయం 
జిలేబి 

Tuesday, March 10, 2015

అమెరిక జాబు- భారతి రక్త ధార !

 
అమెరిక జాబు- భారతి రక్త ధార !
 
మొన్నేదో అమెరిక జాబులు
మా బాగా పండు తున్నాయి
సో, వడ్డీ రేటు సవరిస్తా రేమో
అని నిన్న భారతి రక్త ధార
చిందించింది స్టాకు మార్కెట్టు లో
 
రష్యా లో వానొస్తే ఇండియా లో
గొడుగు పట్టే వాళ్ళ ని చెప్పు కునే వాళ్ళం !
ఇప్పుడు అమెరికా లో ఎండ కాస్తే
మా కాలి చ చెప్పులు కాలి పోతున్నాయి స్మీ !!
 
 
శుభోదయం
జిలేబి

Tuesday, March 3, 2015

కనుల పండువ గా ఉన్న మాలిక !

కనుల పండువ గా ఉన్న మాలిక !


ఆ మధ్య మాలిక కూడా జాటర్ ధమాల్ అయిపోయిందేమో అనుకున్నా ! ప్చ్ తెలుగు బ్లాగర్లకి హారం పోవడం తో కామెంట్ల 'మింట్ల' కొరత ఖచ్చితం గా వచ్చిందని అనుకున్న తరుణం లో మాలిక ఓ మోస్తరు వత్తాసు ఇచ్చింది . ఆ పై బ్లాగిల్లు శ్రీ నివాస్ గారు తమ బ్లాగింటి ముంగిటి ని తీర్చి దిద్ది జాటర్ ధమాల్ పరిస్థితి నించి తెలుగు బ్లాగు లోకాన్ని బయటకు లాగేరు .

మళ్ళీ 'పిచలె మహీనే' మే (హిందీ లో చదవవలె) మాలిక అటక ఎక్కింది ! మహిళ ల కోసం మాలిక ప్రత్యేక సంచిక తెస్తోంది అన్న వార్తా, ఆ పై మాలిక అగ్రిగేటర్ బంద్ అయి పోయి మూల కూర్చోడం జరగడం జూసి ఆ హా మహిళా బ్లాగర్లు ఏమి పవర్ ఫుల్ అని హాశ్చర్య పోయా !

మహిళా ప్రత్యెక సంచిక ఇంపాక్టు కాదు - అగ్రిగేటర్ ప్రాబ్లెం మాత్రమె అని శ్రీ మాన్ 'మా లక్కు పేట రౌడీ గారు జేప్పేరు - నొక్కి వక్కాణించేరు ! త్వరలో నే మాలిక జాటర్ మళ్ళీ పుంజు కుంటుందని జేప్పేరు !!

అట్లా గే ఇప్పుడు మళ్ళీ మాలిక కనుల పండువ గా కామెంట్ల మింటు ల తో, విసుర్ల తో, ఖబుర్ల తో కళ కళ లాడి పోతోంది !

అగ్రిగేటర్ మాలిక జిందా బాద్ !

మా , లక్కు, పేట రౌడీ అనబడు , భరద్వాజ గారికి జేజే లతో

చీర్సు సహిత
జిలేబి
జాటర్ నో ధమాల్ !!

 

Wednesday, February 25, 2015

మానస 'రోవర్' !

మానస   'రోవర్' !
 
మానస సరోవరం లో
మునిగి తేలుతా మనుకుంటే
మానస 'రోవర్'
అయ్యింది !!
 
మా ,నస, రోవర్ !
 
 
 
శుభోదయం
జిలేబి

Monday, February 23, 2015

బింబం - ప్రతిబింబం

బింబం - ప్రతిబింబం
 
బింబాన్ని చూద్దామని
ప్రయత్నిస్తే
ప్రతిబింబం అడ్డు పడింది
పోనీ
ప్రతి బింబాన్ని చూద్దామని
ప్రయత్నిస్తే
మనః కల్లోలం లో
చెదిరి పోయింది !
 
పూర్ణమేవ పూర్ణ అవశిష్యతే ?
 
శుభోదయం
జిలేబి