Thursday, August 12, 2010

జ్యోతిష్యం ఒక నమ్మక వాహిని

నమ్మకం అన్నదానికి అర్థం - తర్కికానికి ఆవల ఒక దాన్ని విశ్వసించడం అనుకో వచ్చు.

ఈ డెఫినిషన్ కింద ఆలోచిస్తే - జ్యోతిష్యం నమ్మే కొద్దీ దాని ప్రభావం మన జీవితాలలో పెరగడం దీన్ని నమ్మే వాళ్ళలో చాల మంది గమనించడం జరగడం సర్వ సాధారణం. - ఇందులో తల మునకలైన వాళ్లకి - ప్రతి విషయం జ్యోతిష్యం అలా చెప్పినందు వాళ్ళ ఇలా జరగడం అయ్యిందన్న మాట అని సరిపెట్టుకోవడం కాకుంటే దానికి పరిష్కారం చూడాలనుకోవడం లాంటి మరిన్ని "బై ప్రొడుక్ట్స్ " కింద వెళ్ళిపోవడం గమనించ వచ్చు.

సో, దీన్ని పాటిస్తే - ఓ మోస్తరు - అందులో నే మన జీవితం నిబిడీ కృతం అయినట్టు అని పిస్తుంది. ఉదాహరణకి ప్రతి పనిని మంచి గంటలో నే చెయ్యాలనుకుని - రాహు కాలం అనో కాకుంటే యమ గండం అనో - ఏదో ఒక గుళిక అనో ఎన్నో సార్లు చెయ్యాల్సిన మంచి పని ని కూడా వాయిదా పద్దతుల మీద సాగించే సాదా సీదా జనసాంద్రత మనం గమనించ వచ్చు.

సో, ఒక నమ్మకం మరో నమ్మకానికి - ఆ పై అది మరో నమ్మకానికి - ఇలా విచక్షణా రహితం గా - ఓ లాంటి పరమ పద సోపానం లో పామునోట పడ్డట్టు ఈ ఊబిలో చిక్కు పోతూ - మానవుని కర్మ సిద్ధాంతాన్ని - మరిచి పోయే తంటగా ఈ "కిక్కు" ఇవ్వ గలడం ఈ జ్యోతిష్యం యొక్క వీక్నేస్స్ అని చెప్పుకోవచ్చు కూడా.

వాహిని - ఒక ప్రవాహం. అందులో కొట్టుకుపోవచ్చు. ఈతాడ వచ్చు. జలకాలా వాడచ్చు. ఎంత కావాలంటే అన్ని నీళ్ళు ఉపయోగించ వచ్చు. కొంత ఆలోచిస్తే - ఈ జ్యోతిష్యం కూడా ఒక నమ్మక వాహిని అనిపిస్తుంది నాకైతే. దాన్ని ఎలా ఉపయోగించు కుంటామో దాన్ని బట్టి- మన ఇచ్ఛా శక్తి కూడా అభివృద్ధి చెందడానికి దోహద కారిగా నా కాకుంటే - మన మూఢ నమ్మకాలకి సోపానం గానా- అన్న దాని బట్టి ఈ శాస్త్రం ఉపయోగం అనిపిస్తుంది.

మరో విధం గా ఆలోచిస్తే- దీన్ని గురించి - ఈ శాస్త్రం గురించి తెలియని వాళ్లకి - "Ignorance is Bliss"!

చీర్స్
జిలేబి.

Wednesday, August 11, 2010

జ్యోతిష్యం నమ్మకమా లేక సాయిన్సా లేక కళా?

నమ్మకం
సాయిన్సు
కళ
ఈ మూడు మూడు విధాలు
నమ్మితే సాయిన్సు అక్కరలే
సాయిన్సు అనుకుంటే - నమ్మకాల పని లేదు
కళ - మనోల్లాసం
ఇంతకీ ఈ అంతు పట్టని జ్యోతిష్యం లెక్కల గారిడీయా లేక సాయిన్సా లేక కళా లేక నమ్మకమా?
చేసుకున్న వారికి చేసుకున్నన్త !
నమ్మకం ఉంటె ఫలితం !
శాంతి అన్నిటికి ఉండనే ఉంది !
ఉపశాంతి కూడా ఉంది !
కిటుకు ఎక్కడ ఉంది?
మన ఆలోచనా విధానం లో నా?
కర్మ సిద్ధాంతం లో నా?

లేక - ఈ మధ్య బడా బడా దేశాలు - చేసే తుక్కు టమారం చెత్త చెదారం డంప్ చేస్తున్నట్టు
పాతకాలం లో అర కోర - లెక్కల జ్యోతిష్యం - మన దేశం లో ఇంకా అలాగే నిలిచి పోయిందా?

ఉదాహరణకి హోమిఒపతి - జర్మనీ దేశం లో - తూ తూ మంత్రం గా ఉంది- మన దేశం లో - ఓ గొప్ప వైద్య విధానం గా వెలుగొందు తోంది. హోమిఒపతి తాను పుట్టిన దేశం లో చచ్చింది. మన దేశం లో బతికి ఉంది.

ఈలాగే - ఈ జ్యోతిష్యం కూడా బతుకుతోందా కాలం తీరి - దాని కథా కమామీషు ఎవరికీ అర్థం కాక ఏదో నేనూ జాదూగర్ లా ఉన్న అన్నట్టు పడి ఉందా మన దేశం లో?

చీర్స్
జిలేబి.

Tuesday, August 10, 2010

బలపం పట్ట కుండానే భామ ఒళ్ళో వాలు తారా ?

అదేదో పాత పాట లా - బలపం పట్టి భామ ఒళ్ళో - అ ఆ ఇ ఈ నేర్చుకున్న అన్నట్టు - మన చిరంజీవి గారు - ఈ మధ్య బలపం పట్టకుండానే - భామ వళ్ళో అంటే - కాంగిరేసు వళ్ళో - వాల తారేమో అని జన సందోహం సందేహం !

ఈ నేపధ్యం లో - జీవి గారి వ్రాక్కులు - నర్మ గర్భం గా ఉంటున్నాయీ కూడా!

ఎ పొట్టలో ఎ వోట్లు ఉన్నాయో ఎవరికీ ఎరుక ఎంకటేసా ? ఆ మధ్య అన్న గారు తిరుపతి కొండ కాలి బాటన ఎక్కితే - అయి - మా ఆదికేశవుల తరువాయి - మా చిరు ఎ - మా కొండ దేవరని కొలుచు నన్నారు మా ఊరోళ్ళు !

ఇప్పుడు- అడక్కుండానే - రోశయ్య గారు - చిరుగారి సహాయం మాకి సమ్మతం అంటారు !

చిరు గాలి - ప్రభంజనం గా మారుతుందేమో గాని నాకైతే తెలియదు గాని - ఈ మా చిరుగారు - ఈ రాజకీయ ఎత్తుల తో పై ఎత్తులతో - హాం ఫట్ అని గాయబ్ అవకుండా ఉంటారో లేదో వేచి చూడ వలసిందే !

అయినా భామ వొళ్ళు - ఎవరికి చేదు ? మా జగన్మోహనుడు - కూడా దానికే కదా పోటీ పడుతూంట?

చీర్స్
జిలేబి.

Monday, August 9, 2010

భగవంతుడు ఉన్నాడా?

చాల పాత ప్రశ్న భగవంతుడు ఉన్నాడా?
సరికొత్త జవాబు - ప్రతి మనిషి తన జీవితం లో వెతుక్కోవాలని చూడడం ఈ ప్రశ్న మహాత్మ్యం!
మానవ పుట్టుక నించి నేటిదాకా - ఇంకా చెప్పా లంటే - భవిష్యత్తు లో కూడా ఈ ప్రశ్న ఎవెర్ తాజా ప్రశ్నే!
కలడు కలమ్డనేవాడు కలడో లేదో అన్న సందేహం ఉత్పన్నమవుతూనే ఉంటుంది.
ప్రతి మానవుడు తన పరిధిలో నించి దీనికి సమాధానం ఇస్తాడు.
ప్రతి సమాధానం ఈ ప్రశ్న కి ఖచ్చిత మైన సమాధానం లా అనిపించిడం ఈ ప్రశ్న గొప్పతనం
అందుకని ఈ ప్రశ్న చాలా నిగూడమైన ప్రశ్న గూడ కాదు!
ఉన్నాడా లేదా?
అంతే!
ఆ పాటి దానికి ఎందుకీ కాలాల తరబడి నడుస్తూన్న సమాధాన పరంపరలు ?
అక్కడే కిటుకు ఉన్నట్టుంది
సమాధానం తెలిసిన వాడు - దాన్ని విసదీకరించలేక పోవడం - కాకుంటే దానికి నిర్వచనం - ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వలేక పోవడం- బహుసా నిర్వచనానికి అది ఆవల ఉండడం హేతువేమో? - ఈ ప్రశ్న గొప్ప తనం !
సో , ఈ సమీకరణం లో - ఉన్నాడని నిరూపించలేక పోవడం - లేదని నిరూపించ లేక పోవడం - సమీకరణం యొక్క లిమిటేషన్ కూడా కావచ్చు. !
చూద్దాం - భవిష్యత్తులో - సైన్సు ఎలాంటి కదం తోక్కుతుందో- ఈ సమీకరణానికి ఎలాంటి జవాబు ఇస్తుందో?

చీర్స్
జిలేబి.

Friday, August 6, 2010

సనాతన ధర్మ ఉద్దీపకుడు క్రీస్తు ప్రభువు

ఈ మధ్య మా బాబాయి అబ్బాయి స్కూల్లో "బ్రిటిష్ వాళ్ళు ఇండియా కి రాకుండా ఉంటె ప్రస్తుతం మన భారత దేశం ఎట్లా ఉండేది ?" అన్న దాని మీద వక్తృత్వ పోటి పెట్టటం - ఆ టాపిక్ పై ఆలోచిస్తే - బ్రిటిష్ వాడు రాకుండా ఉంటె భారత దేశం లో హిందూ ధర్మ నిలిచి ఉండేదా అని సందేహం కలిగింది.

ఎందు కంటే పక్క దేశాలైన మలేసియా ఇండోనేసియా లాంటి దేశాల్ని చూస్తె - బ్రిటిష్ వాడి రాక మునుపు దేశం ఇస్లాం వైపు మొగ్గు వేస్తూన్నట్టు గా కనిపిస్తుంది. ముసల్మాను రాజుల దండ యాత్రలు - ఆ పై మన దక్షిణ భారత దేశం లో కూడా శ్రీ కృష్ణ దేవరాయల సంతతి తిరోగతి - సుల్తానుల ప్రాబల్యం ఎక్కువవుతున్న కాలం లో - ఆ సమయం లో బ్రిటిష్, వాడు ఇండియా కి రావడం = వాడి తో బాటు వాడి సంస్కృతి, మతం - ఇండియా కి రావడం - ఓ లాంటి చెక్ పాయింట్ అయ్యింది - ఇస్లాం ఇంకా తీక్షణం భారత దేశం లో ప్రాబల్యం కాకుండా ఉండడానికి - వీడే రాకుండా ఉంటె - సుల్తానుల ప్రాబల్యం తో భారత దేశం - ఓ మోస్తరు ప్రస్తుతం ఇస్లామిక్ దేశం గా ప్రస్తుతం ఉండేదేమో? -

ఇది ఊహా చిత్రం కాబట్టి - వాదనలకి చాల తావుంది ఈ చిత్రం లో - మీ అభిప్రాయలు - భిన్న అభిప్రాయాలు - కచ్చితం గా ఈ విషయం పై ఉంటాయీ.

గీత లో శ్రీ కృష్ణ భగవానుడు - యదా యదాహి ధర్మ స్య గ్లానిర్భవతి భారతా- తానూ మళ్ళీ మళ్ళీ వస్తానంటాడు. అంటే బ్రిటిష్ వాడి రాక దీన్ని సూచిస్తుందా? - క్రీస్తు మతం - ఇండియా కి రావడం - దీన్ని సూచిస్తుందా? -

ఆలోచనలకి మంచి పదును పెట్టె విషయం ఇది. అఆలోచించి చూడండి- భారతం - సంగమం - వివిధ మతాల సమ్మేళనం - ఆ నాటి భుద్దుడి సమయం నించి చూస్తె భౌద్ధం , జైనం, ఇస్లాం - ఈ నాటి బాబాలు , స్వాములు - గురువులు యోగుల దాక భారత దేశం లో మతం మీద జరిగినంత వెరైటీ ఎక్స్ పెరి మెంట్స్ ఇంకా ఎ దేశంలో కూడా జరిగి ఉండదు. -

ఈ లాంటి సంక్లిష్ట వాతావరణం లో సనాతన ధర్మ పద్దతి - ఇంకా కోన సాగుతూనే ఉంది- కారణం ఏమంటారు? -

మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్భందాలు లేకుండా- వ్యక్తీ స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు ఉంచుతుంది.

సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది. మీరేమంటారు?

చీర్స్
జిలేబి.

Thursday, July 29, 2010

బందీ ఐన భగవంతుడు

ఆ పై వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు
ఈ మన వాడు ఆ ప్రపంచం నాది అన్నాడు
నేను సర్వాంతర్యామిని అని చెప్పక చెప్పాడు ఆ పైవాడు
ఛత్- జానతా నై అని రాయిలో ఆ పైవాన్ని బందీ చేసాడు మన వాడు

పోనీ లే ఈ రాయిలోనే సెటిల్ అయిపోదామనుకున్నాడు ఆ పైవాడు
ఉండనివ్వలె మన వాడు-
ఊరూరా తిప్పి - ఊరేగించి బిజినెస్ చేసాడు మనవాడు
విష్ణు మాయ అనుకున్నాడు ఆ పై వాడు
నా హం కర్తా కర్తా హరిహి అని 'నీటి' వాక్యాలు రాసాడు మన వాడు!
యద్దామ పరమం మమ ?

చీర్స్
జిలేబి.

Saturday, July 3, 2010

వెంకన్నాస్ గోల్డ్ - గోల్మాల్ గోవిందా !

కొన్ని నెలల క్రితం - వెంకన్నాస్ గోల్డ్ గురించి రాసాను. మళ్ళీ ఇప్పుడు - రాయల వారి బంగారం గురించి - మా కొండ దేవర - తిరపతి వెంక టేశ్వర స్వామీ వారి ఆభరణాల గురించి వార్త !
ఐదు వందల సంవత్సరాల తరువాయి - రాయల కాలం నాటి కాళహస్తి గోపురం ధమాల్
ఐదు వందల సంవత్సరాల తరువాయి - రాయల బంగారు ఆభరణాల కానుకలు - గోవిందా గోవిందా -

వీటి గురించి చదువుతూంటే - మన జీవిత కాలం లో - డబ్బులకోసం, పదవులకోసం, కీర్తి కండూతి కోసం మనం చేసే కార్యాలన్నీ బేవార్సు - సుద్ధ పనికి మాలిన పనుల లాగ అనిపిస్తోంది. బాల్చీ తన్నేసాక - మనం కూడా బెట్టిన ధనం ఎ ఉండేలు దెబ్బకో హుష్ కాకి!

మా స్వామీ వారికే ఈ తిప్పలు తప్పనప్పుడు- నర మానవులం - మనం ఎ పాటి వాళ్ళం!

స్వామీ ఏడు కొండలవాడా - వెంకట రమణా - కుబేరుని కి నువ్వు పడ్డ బకాయి ఎప్పటికి తీరే టట్లులేదు.

ఈ బకాయి తీరనంతవరుకు నీవు - మా జిల్లాలోనే వుండవలె !

ఈ బకాయి తీర కుండా- మా దేశం వాళ్ళు - ఈ నగల్ని - ఆభారణాలని గాయబ్ చేస్తూ- నువ్వు మా జిల్లా లో నే - సదా నెలకొని ఉండేలా - చేస్తున్నందులకు - ఈ "గాయబ్" మేజిసియన్ లకి సలాములర్పిస్తూ-

కొండకచో - కొండ దేవర ఆశీస్సులు అందరికి దివ్యం గా వుండాలని కోరుకుంటూ-

చీర్స్
జిలేబి.

Wednesday, June 30, 2010

జ్యోతిష్యం ఎంత వరకు ఉపయోగం?

ఈ మధ్య తెలుగు యోగి శర్మ గారు వరుసగా జ్యోతిష్యం గురించి బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. అది చదివిన తరువాయీ ఈ శీర్షిక - జ్యోతిష్యం గురించి ఆలోచిస్తుంటే - అసలు అంతా ఆల్రెడీ నిర్ణయించ బడి ఉంటె మన కర్మలు ఆల్రెడీ డిసైడ్ అయి పోయి ఉంటె- ఇక మానవ మాత్రులం మనం ఎందుకు కష్టించాలి? మనం ఎందుకు ప్రయత్నించాలి అన్న సందేహం రాక మానదు. ఈ ఒక్క లాజిక్ చాలు జ్యోతిష్యాన్ని తీసి పారేయడానికి. కాని దీనికి కారణం చెబ్తారు- జ్యోతిష్యులు- అంటే- మీ జాతకం లో - మీరు కష్టించి పైకి వస్తారని ఉంది కాబట్టి- మీ ఆలోచన ఆ పరిధి లోకి వెళ్లి మీరు అభివృద్ధి లోకి వస్తున్నారానో కాకుంటే- అధోగతి పాలవు తున్నారానో - దీనికి సమాధానం చెప్పుకొస్తారు.

సో, ఈ నేపధ్యం లో ఈ సబ్జెక్టు ఎల్లప్పుడూ వివాదాస్పదమే. కర్మ సిద్ధాంతం, మానవుని సంకల్పం, దైవ నిర్ణయం, ఇట్లా వేరు వేరు సిద్ధాంతాలు - కలగలపుగా ఉన్న మన దేశం లో - ఈ సిద్ధాంతాలు - ఒక దాని మీద ఒకటి పోటి గా మానవ మేధస్సుకి దాటీ గా - ఓ లాంటి చాలెంజ్ లేవదీస్తాయి - మనిషి మేధస్సుకి పరీక్ష పెడతాయి కూడా- వాదం, ప్రతి వాదం తార్కిక చింతన, ధ్యానం, నిర్వకల్పం, శరణాగతి, ఇట్లాంటి వేర్వేరు సిద్ధాంతాలతో - ఓ పాటి విలక్షణం గా ఉన్న భారత సంస్కృతి - ఓ విభిన్న ప్రకృతిని ప్రతిపాదిస్తున్దనడం లో సందేహం లేదు. ఎవరి ఆలోచన పరిధికి ఏది అందుతుందో అక్కడినుంచి వాళ్ళు - ఆ పై గతి కి ప్రయాణం సాగించ డానికి దోహద కారి అనిపిస్తోంది కూడా ఈ భారత చింతనా స్రవంతి !

చీర్స్
జిలేబి.

Monday, June 28, 2010

చిత్తూరు కోవా - కేరళ భామ

మన ఊరిగురించి ప్రక్క రాజ్యం వాళ్ళు ఓ ఎపిసోడ్ టీవీ లో చూపితే ఎవరికైనా చూడ బుద్దేస్తోంది. అదీను పొగడ్తల తో కాకుంటే ఓ మోస్తరు మనకు తెలిసిన విషయం గురించి షో పెడితే ఇంకా నచ్చుతుంది. అంతే కాకుండా అది ప్రక్క రాజ్యం గాకుండా ఇంకా కొంత దూరం లో ఉన్న రాజ్యం లో చూపెడితే - ఔరా మన ప్రదేశం గురించి ఇంత ముచ్చట గా చూపెట్టారే అని మరీ మురిసి పోవడం కద్దు. ఆ బాణీ లోనే ఈ కేరళ భామ ఫేవరెట్ ఇండియా షో - కైరలి టీవీ లో ఈ మధ్య చిత్తూరు గురించిన షార్ట్ ఎపిసోడ్ -

http://www.youtube.com/watch?v=RNUqGUAEtUM

లింక్:http://www.youtube.com/watch?v=RNUqGUAEtUM

చీర్స్
జిలేబి.

Sunday, June 20, 2010

కాలం - కలం - కల కలం

కాలం
కలం
సాయం కాలం
కల కలం
కలల కడలి కదలింది
కాలం - కారుణ్యం
కాలమై న కలల కలం
సుఫలాం సస్య శ్యామలాం అన్నది
మరి జీవనం జీవిత గమ్యం అయ్యిందా
కాకపొతే జీవితం జీవనం గమ్యం అయ్యిందా?
తెలుసా మీకేమైనా?

జిలేబి.