Monday, February 4, 2013

ఇక మీదట సీరియస్ టపాలు రాయ దలచుకున్నా !

అయ్యరు  గారు, ' ఇక మీదట సీరియస్ టపాలు రాయ దలచుకున్నా  నా బ్లాగు లో' చెప్పా మా జంబునాధన్ కృష్ణస్వామి అయ్యరు గారితో.

అయ్యరు  గారు ఫక్కున నవ్వారు.

ఏమోయ్ జిలేబీ, నీకు సీరియస్సు కి చుక్కెదురే ? ఎట్లా 'సీరియస్' టపాలు రాస్తావ్ ?' అన్నట్టు చూసేరు.

'జాన్తా నాయ్ , ఎట్లైనా క్రిందా మీదా పడి , అట్లా ఇట్లా పొర్లి అయినా సీరియస్ టపాలు రాయ దలచు కున్నా.

'జిలేబీ ఎందుకు నీ కిట్లాంటి ఐడియా వచ్చే?' అడిగేరు మా అయ్యరు  గారు.

కాదండీ, బ్లాగుల్లో చాలా మంది మరీ సీరియస్ టపాలు, రాస్తూం టారు . అట్లాంటి వి చదివినప్పుడు అబ్బా, మన మిట్లా రాయక పోతే గెట్లా  అని 'ప్చ్' అని పెదవి విరుస్తా. అప్పుడు అనిపించి, అట్లా అది 'వటుడింతై' అన్నట్టు సీరియస్ టపా రాద్దారి అని పించడం దాకా వచ్చిం దన్న మాట' చెప్పా.

ఓ, అయితే, ఇది నీ సొంత బుర్ర ఐడియా కాదన్న మాట. పులిని  చూసి... సామెత ఎందుకు లే' అని మధ్య లో ఆపేరు అయ్యరు  గారు.

ఏమిటి మీ అర్థం అంటే నేను....' అన బోయి, అబ్బే, మన గురించి మనమే ఇట్లా 'ట్యూబులో' గాలి పీకేసు కుంటే బాగోదు అనుకుని ఆగి పోయా!

సో, చదువరులారా, ఇక మీదట  మీరు నా బలాగు లో మరీ సీరియస్ టపాలు చదివే 'ఆస్కార్లు' ఉన్నవి. కాబట్టి 'బీ తయ్యార్'!

(ఈ టపా చదివేక మీ అభిప్రాయములను మాకు తెలియ జేయ గలరు. ఇది సీరియస్ టపా కింద వచ్చునా? జిలేబీ సీరియస్ టపా రాయగలదా ? అన్న విషయం గురించి తెలుపుడూ!)


చీర్స్
జిలేబి.

3 comments:

  1. జిలేబీ గారు..మీరు సీరియస్ విషయం అయినా హాస్యోక్తంగానే చెపుతారు. మరిక సీరీయస్ టపాలు ఏమిటబ్బా..?
    ఏమో..అవి ఎలా ఉండునో! అయోమయం కాదు కాని ఆత్రుతగా ఉంది. ఐ యాం రెడీ! సీరియస్ బ్రహ్మాస్త్ర టపాలు వేయండీ!!

    ReplyDelete
  2. నిఝంగా :) :) :)

    ReplyDelete
  3. mee friend bulusu ekkadunnaru?? kanpinchaaraa ?ledaa??

    ReplyDelete