వేరుని
కనిపించక నిలిచా
వేరని చూసేరు
వేరూనిన నాపై
వారు పెరిగినారు
పెరిగిన వారు
కనిపించేరు
మెచ్చినారు జనులు
కనిపిస్తేనే కదా
దేనికైన ఉనికి ?
ఉనికి
లేదు నాకు.
అయినా
జీవగర్రను నేను
వేరుని
వేరూని నిలచా.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
-
ReplyDeleteబావా! రోగానికి రా
మా! వరద! అనవలె నదియె మందోయ్ శివుడే
కైవల్యంపు కషాయము
గా వర్ణించిన భలే సుఖమునిచ్చెడిదోయ్
-
ReplyDeleteనిను నమ్మి యుంటి పరలో
కనాథుని తనయ ! జనాళి కసటుల పోగొ
ట్టిన ప్రేమరూప! పాప
మ్మును పోగొట్టు ప్రభు యీశ! మోక్షపు దాయీ
హేపీ సిబ్లింగ్స్ డే , హేయ్
ReplyDeleteచూపుడు వేళ్ళింక నీవు చూపుట మానెయ్
పాపము తగులుద్ది , హితుడ !
రాపాడుట వద్దు పద్య రాతల యందున్ .
-
ReplyDeleteనారాయణుడే నన్నియు
రా! రాముడు కన్నడునతడాయెన్ నమ్మం
గా రక్షయు సుఖమున్ మన
పై రహి కురిపించు నతడె పరమాత్మయగున్
-
ReplyDeleteహరివేరితరులు వేరని
పరిపరి వాపోవనేల ? పరమాత్మ యొకం
డె రుజువని తెలిసి భేధము
లరసి తరసి చూడనేల ప్లాయన వీరా!
-
ReplyDeleteచదివాక నిజముగా
మదియె ద్రవించె కనుల జలమానందపు భా
ష్పధరుణధానమయెన్ రా
మదాసు జన్మస్థలపు సమాచారముతో
-
ReplyDeleteధర్మము కాదిది పలికిరి
ధర్మముఁ దప్పిన వనితకు, దండము లిడిరే
ధర్మము దప్పిన మనిషికి
ధర్మంబు విచక్షణ మను ధర్మంబగునౌ
-
ReplyDeleteఆది వాసుల బతుకుల నరసి చూడ
గొంగళి వలె నిస్తేజము గోచరించె
డెబ్బది పయి బడిన మన దేశ ప్రగతి
కాలమున చూడగా వీరి కష్టములను
ఓరీ మూర్ఖ భక్త శిఖామణులారా !
ReplyDeleteఅల్ప ప్రాణులార ! వినండర్రా
గురువు గారు వచ్చి గుడ్డి నమ్మకముల
మూఢ భక్తుల నడుము పయి గుద్దు
గుద్ది మూర్ఖులార కొంతైన మారండ
టంచు బోధ చేసి టాట్ అనిరయొ
-
ReplyDeleteమామిడాకుల తోరణ మాల లచట
మంచమునకు శోభనుఁ గూర్చె; మత్కుణములు
వాటి వాసనకు బెదిరి పరుగు లిడుచు
నక్కె మూలలో; కత కంచి నగరి చేరె
కవివరులు నిదురను జారు కాలమాయె
బుధ్ధితొలగె , మంచమునకు శోభను గూర్చె ,
ReplyDeleteమత్కుణముల జాతి మలగి పోయె
నెన్నడో , యిదేమి యీ పండితుల గోల ?
అహహ ! తెలివి గలదె ? బహు పసందు 😁
-
Deleteపట్టి పట్టి పదమ్ముల బాహు బలము
తోడు గట్టిన పేరుకు తొంక బారు
గోల చేయకున్న నిలుచు కొంత యైన
పేరు ? రాజరాజ! జనుల పెన్నిధులవె
:)
నారదా!
అస లేమిటి తమ గోలా ?
Deleteపస గలదా ? ' అంతరించె మత్కుణములు ' తా
మసము మతుల కెక్కెన ? యే
వృషబం బీనె ? బుధ ! దూడ నెక్కడ గట్టిర్ ?
-
ReplyDeleteపండిన తల మీరండీ
కొండాడిరి రామదాసు గూర్చి విషయముల్
దండిగ తెలిపి జనాళికి
భండన భీముడు మిము ప్రతిపాలింతురుగా
-
ReplyDeleteపోరాడెదము విడువకన్
వేరూనె జులుమ్ము సేయ పెడదారులలో
నేరము సేసిరని దుమికి
ఘోరంబన్యాయముగను గురిపెట్టుటయున్
-
ReplyDeleteఅన్నా! మధుమేహము కలు
గన్నా ! క్షీణించు శక్తి కచ్చితముగ! ఓ
రన్నా! మాటవినుము పర
మాన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ
-
ReplyDeleteవిలువైనది నీ వదనము
పలుకులు నీవి మధురమ్ము ప్రభు పరలోక
మ్ములకిల లో మార్గముగా
నిలచిన కరుణామయా పునీతా జోతల్
-
ReplyDeleteజీవితమే పులకించగ
నీ వీణను సవరిచి మది నిండుగ కృష్ణా
రావేలరా యని బిలచి
నీ వేలా పాడవే మునిజనులు పొగుడన్
' రామా ! కృష్ణా ! ' యని , కవి
ReplyDeleteసామజములు వలుక రేల ? స సమస్యా రో
గామిత కుమతులయి , కుమిలి ,
పామర జను లటుల నేల పడి చావంగన్ ?
-
ReplyDeleteఓరబ్బి తిక్క రేగిం
దా! రోజంతా కసబిస యా! తిక్కయు న
బ్బో రావడియు జరిగెనా
గోరంట్లా బస్సు నెక్కి కొట్లాడెదమోయ్ :)
-
ReplyDeleteతపమొనరిచె రామ యనన్
కపిసైన్యమ్మెల్లఁ , గొల్చెఁ గద లంకేశున్
కపటస్థులు రాక్షసులు సు
రపతియు వరుణాది తదితర మహాశక్తుల్
-
ReplyDeleteఆయిలు ధర పై కెగురన ?
ఓయి! జిలేబి తెలుపవె తిరుక్షవరమ్మా
తాయిలపు సంధి మాటల
మాయా జాలంపు తెర ప్రమద! యేమగునే :)
-
ReplyDeleteగమనిక చదువరి! నా బ్లా
గు మూత పడు; కొత్త సైటుకు తెరను తీసా
ను! మహా జనులారా రం
డు! మనమిక కలిసెదమచట రోచిస్సులతో
https://syamalarao.in/
పిలిచిన రాకుందుమా :)
వచ్చెదము వచ్చెదమిదే
మెచ్చుచు మీ కొత్తయింటి మెట్లని శ్యామా
తచ్చాడి పదమ్ములనిదె
తెచ్చుకొనుచు పద్యముల ప్రతిష్టాపింపన్
తమరా , జిలేబి పండిత !
ReplyDeleteనమము 🙏 , లహంకార శోభిత శిరో భూషా !
మము బోట్ల తిట్టి , ' ఘనతలు '
సముపార్జించండి సారు ! సంబర మొదవున్ .
-
ReplyDeleteరాధ స్నేహితి తన రారంగ నద్దాని
అన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
-
ReplyDeleteపరమాత్మ జపము విడువక
నిరతము సేయగ హృదయము నిమ్మళమొందున్
హరి హరి యనవే మనసా
తరతమ భేదములు తొలగు తరియించెదవే
-
ReplyDeleteఓండ్ర యన నేమియొ తెలుప నొక్క గురువు
గారు పిల్లలును బజారు గరిడి జేర
గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను
చూచి సంతస మొంది కిసుక్కు నగిరి
-
ReplyDeleteనీవు నన్ను విడిచినను నేను నిన్ను
విడువను బలికె నాసామి వేగము విడు
వంగను దురాశ విడుచును వ్యాకులమదె
నాకలి గొనిన జనులకు నాల్గు మెతుకు
లిమ్ము వెంకయ్య సామి బలికె జిలేబి
-
ReplyDeleteశాఫోని చదివెను బుచికి
సోఫాగా పిచ్చివాని సొంత కవితలా
కైఫీయతు తెలుసుకొనక
సాఫీసీదా వచించె సాంబారిడ్లీ :)
-
ReplyDeleteగంజాయిగొని బలికితివొ
కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే?
పింజారీవెధవా! నిను
రంజణి లో కాల్చెదగునురా దుశ్శీలా
-
ReplyDeleteపిలక కత్తరింపు పిట్టకతల తోడు
దేశ మందు జరుగు దెబ్బలాట
జోడి తాత బల్కె జుట్టురాలెడు తీరు
రాజకీయ మనగ రచ్చ యేను
-
ReplyDeleteబండ నిదురలోనన్ కన బడిన తృటిని
అమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె
ముద్దు గాను~ గౌరవమున ముందు సాగి
ల పడి నందులకు భళిభళారె యనుచు
అలనాటి నాటక ప్రస్థానం
ReplyDeletehttp://ishtapadi.blogspot.com/2026/04/blog-post_20.html
యూట్యూబు లింకులు
https://youtu.be/BKdeKebhJG4?si=l9t6UzvRzkg3ew3F
షార్ట్ వీడియోస్ వున్నాయి.
-
ReplyDeleteఫేకు బుక్కు బతుకులాయె పెద్దలార
యెచట చూసిన ఫ్రాడులాయె నవి తెలుపు
చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
నొక్కడు మొబయిలు బటను క్లిక్కులన్ను
Claude పూరణ
ReplyDeleteవిత్తమిచ్చుట గాదయా వేఁడువారి
చిత్తమందలి వేదన చెప్పకుండ
మెత్తని మాటలే చెప్పి మేలు చేయు
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె॥
General observation :
ReplyDeleteClaude as of date encounters issue with 3rd line always meter going for toss :)