తరాల వెనుక మూగబోయిన గొంతులు,
పెద్దల మాటలో కొట్టుమిట్టాడిన మనసులు,
కుంటువడిన బంధనాల్లో చిక్కుకున్న కలలు,
నోరు మెదపలేక నిలబడిన బొమ్మలు.
హెరాల్డ్ గుండె మాట చెప్పలేదు నాడు,
క్లాడెట్ కోరిక గుండెలోనే ఆగిపోయింది,
రేమండ్ డెలోరిస్ పెళ్ళి పెద్దల చేతుల్లో జరిగింది,
మూడు తరాల కన్నీరు గుండెలోనే ఇంకిపోయింది.
రావెల్లె లేచింది తెల్లవారుజామునే,
"ముందు మాట్లాడదాం, తర్వాత చూపులు"
బ్లాక్ కాఫీలా చేదుగా నిజాయితీగా,
జీవితం చర్చించారు ఇద్దరూ ధైర్యంగా.
"నేను వాకబు 'చేసుకోనా' " అనలేదు "కుంటాను" అన్నది.
ఆడ్రియన్ మనసు ఆగిపోయింది ఆ మాటకు,
అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు మెల్లగా,
స్వేచ్చా జీవుల విహంగ యానం.
తరాలు మారాయి, మనసులు విప్పారాయి,
బొమ్మలు మాట్లాడే కాలం వచ్చింది,
కొత్త అర్థం సంతరించుకుంది —
స్వేచ్ఛగా ఎంచుకోవడమే నిజమైన జీవన శుభారంభం.
ఎల్లెమ్మ జిలేబీయము


No comments:
Post a Comment