Saturday, April 8, 2017

దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)


 
 
దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)


హి దటీజ్ ది లేడి ! యూనో!
హి దేర్ షి గోస్!యట్ట లేడి! హీ దట్జ్ హర్ ! ఐ
సీ ! దేర్ ద డెవిల్ గోస్ ఓహ్ !
దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)
 
కందోదయం :)
జిలేబి     
 
ప్రాస యతులు మన కేల
న్నా! సరసపు పలుకుల మజ, నలుగురి తోనన్
కూసింత చతికిలబడుచు
యాసల సయ్యాటలన పయనమును జేయన్ !

210 comments:

 1. అమ్మయ్య! తెనుగు పనైపోయినట్టుంది, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ కర్మ కాలిందా? :)

  ReplyDelete


 2. దీపంబునకన్యాయం
  బోపను ! తప్పక జిలేబి పొద్దుట వేతు
  న్నోపిక గాంచి మరియొక ట
  పా పాడెద రా మనామ పదకవితలనౌ !

  జిలేబి

  ReplyDelete


 3. హమ్మయ్య ! తెనుగును విడిచె
  బామ్మయు, యింగ్లీషు ఖర్మ బాగుగ కాలన్
  బొమ్మాళి గట్టెనిట ప
  ద్యమ్మున్ దుంపతెగునింక దరువు ఫిరంగీ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఆశ్చర్యమేముంది శర్మ గారు? జిలేబి గారు బహుభాషాకోవిదులు కదా.
   సాధన చెయ్యనివ్వండి. అసలు పైన ఇంగ్లీషు భాషాపద్యాలకు వేసిన నమస్కారబాణంలోనే "దుంపతెగునింక" అంటూ రాబోవు కాలం గురించి చేసిన సూచన చూశారా? Keep it up Zilebi garu 🙂.

   Delete


 4. మమతల కట్టుబడి నటన్
  సమతుల్యతగని విదురుడు సాధించె భళా
  సుమనస్విని యాజ్ఞగనన్
  జమలించె జిలేబి యొజ్జ జాగ్రత్త పడన్!

  జిలేబి

  ReplyDelete
 5. ఓయబ్బో ! ఈ టింగ్లీష్
  ఙ్ఞేయం మా బడిలొ హాపు నిక్కర్లపుడే ,
  హాయిరె ! కందకు లేదే !
  కోయంగా దురద కత్తి కేలర ! బన్నా !

  ReplyDelete


 6. బచ్చలి తో కూరల జే
  యొచ్చని తెలియును జిలేబి యొత్తుల కందం
  బచ్చొత్తింప తెలియదే !
  యిచ్చగ గుచ్చగ పదముల యిట్లొచ్చునదీ :)

  జిలేబి

  ReplyDelete


 7. మాటల్లో విన్నైనటి
  కోటీశ్వరుడు గద విన్నకోట జిలేబీ
  మేటి లలితమ్మ పలుకుల
  ధాటిగ కందపు గమకము ధమధమ వచ్చెన్ :)

  జిలేబి

  ReplyDelete


 8. ఆంగ్లమ్మున కందమ్మును
  బెంగ్లూర్వాహిని జిలేబి బేర్చెన్ జూడన్
  యింగ్లీష్వింగ్లీషన్నీ
  జింగ్లీ బెల్సయ్యెను మజ చిక్కటి ఛందస్ :)

  జిలేబి

  ReplyDelete


 9. గోడకు కొట్టిన బంతికి
  ఆడన్ చెప్పిన కథకును అందక బోయెన్
  కూడిక జిలేబి గదవే
  గూఢము నటు విన్నకోట గుర్తింపవలెన్ :)

  గుర్తెరిగిన తెలుపదగున్ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. నాపై ఈ విసురు దేన్ని గురించి? ముందు మీరది చెప్పండి ప్లీజ్.

   Delete

 10. అడుగడుగుల మడుగులనొ
  త్తెడి యయ్యరుగారు కమ్మ తెమ్మర గానన్
  పడతుక జక్కవచంటికి
  గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. నడినెత్తి కెక్కు యెండకు
   గొడుగును మథ్యాహ్న వేళ గోరుట తగు , నే
   డడుగడుగున సెగ దగిలెడు ,
   వడ దెబ్బను బడకు , గొడుగు వదలకు హితుడా !

   Delete


 11. విసురది కాదండీ ! మీ
  పసందగు పలుకుల వాటి పరమార్థములన్
  పిసరంత తెలుప గోరితి
  పసగుల జేయగ కథనటు పరిశోధింపన్ :)

  జిలేబి

  ReplyDelete
 12. ఓహో, గోడకు కొట్టిన బంతా? ఇప్పుడు వెలిగింది మీరడుగుతున్నదేమిటో 🙂. కానీ .... ప్చ్ ప్చ్ ..... మీకే అర్థం కానిది, మా బోంట్ల బుర్రలేపాటి? 🙌

  ReplyDelete


 13. హా! విన్నకోట నరసిం
  హా వారట తెలియదనిరి హాస జిలేబీ !
  హా!వినవలె సుశ్రీ ఆ
  హావము ! రండిటు తెలుపన యక్కజముగనన్ :)

  జిలేబి

  ReplyDelete
 14. "పసగుల జేయగ"
  -----------------------
  మీ పద్యరచనా వ్యాసంగం నేను సమర్ధిస్తున్నదే. కానీ మీరిలా మరీ "శబ్దరత్నాకరం" వగైరాలు పక్కన బెట్టుకుని వాటిలోనుండి పదాలు తెచ్చేసి పద్యాలు వ్రాసేస్తే మాలాంటివారు ఏమైపోవాలి జిలేబి గారు? ��

  ReplyDelete
 15. < " దేర్ ద డెవిల్ గోస్ ఓహ్ !"
  -----------------
  ఈ ముక్క నాకు నచ్చిందండోయ్ 👌 🙂.

  ReplyDelete
  Replies
  1. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు కదు సార్ :)

   Delete


 16. రొండి దస్కము కొంతయు రొక్క మటు వ
  లసిన కారణమున మరి లాత సేసి
  కొంత అప్పును గుమిగట్టి కోరి గట్టె
  మమతల బడిని కోటగా మాచనుండు !

  జిలేబి

  ReplyDelete


 17. సిరియా పై క్షిపణులు యు
  త్తర కొరియా పై జిలేబి తావెళ్ళుచునుం
  డె! రణములికమొద లౌన ? య
  మెరికా యౌనో మరియొక మెరమన దేశం ?

  జిలేబి

  ReplyDelete


 18. చంపెను సంస్కరణలు మేల్
  కొంపల కొక కుర్రవాడు కోటీశ్వరుడై
  సంపాదించె జిలేబీ
  నింపాదిగ వెళ్ళితి నట నిశ్చేష్టుడవన్ !

  జిలేబి

  ReplyDelete


 19. హా! విన్నకోట వారికి
  కావల డోసులు జిలేబి గట్టిగ నిడెనో !
  యేవని యన్నా రో యవి
  లేవే ? యెట్లా తెలియును లెస్సగ యిపుడౌ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. " ధనజాతకానికి డబ్బలా వొస్తూ వుంటుంది " అని కన్యాశుల్కంలో రామప్ప పంతులంటాడు చూసారా, అలాగే కొన్ని జాతకాలకు ఉత్తిపుణ్యానికి అక్షింతలు వచ్చి పడిపోతుంటాయి (మొన్ననొకరోజు మీకు పడినట్లుగా 🙂). ఏం చేస్తాం పెద్దలు కదా, చల్లించుకుని ఊరుకోవడమే (మనం మొదట మాట్లాడింది వారి పట్ల అభిమానంతోనయినా కూడా). ఊరుకున్నంత ఉత్తమం లేదని ఉన్నమాటే కదా 🙏.

   Delete


 20. క్రూయిజుల లోన నవలల్
  వ్రాయ వలెననుచు జిలేబి వావ్ కోరికయౌ !
  సాయం తకదీర్ గానగ
  మా యాసను పూర్తిజేయు మార్గము గనెదన్ :)

  జిలేబి

  ReplyDelete

 21. మానధనుండు సుయోధను
  డేనాడైన తలయొగ్గ డే! వాడు, జిలే
  బీ, నమ్మునమ్మ రుక్మిని ?
  యేనాటికి కుదరదు, తను యేమరి గాదోయ్ !

  జిలేబి

  ReplyDelete


 22. తమరికి తెలియక జరిగిన
  గమకంబేదైన యున్న గణ్యంబగునో !
  విమలమ్మ జిలేబి గనన్
  కమలము విరియును శుభాంగి కవకవ యనుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 23. ధనజాతకమునకు జిలే
  బి, నవనవ యనియటు కాసు బిరబిర వచ్చున్ !
  గనలేదా మీరున్నటు
  కనకన లాడెడి లతాంగి కామెంటులటన్ :)

  జిలేబి

  ReplyDelete

 24. మన కాపురమ్ము లట,గా
  లిని గలవౌ, యొజ్జ పలుకు లివ్వి జిలేబీ !
  గనవమ్మ, నేటి జీవిత
  మున పరుగులు తీయు రీతి ముంగటవడనన్ !

  జిలేబి

  ReplyDelete

 25. గుమ్మపు చెదలైన జిలే
  బమ్మ యదటులైన నేమి పారుని గానన్
  జామ్మని సరిజేయు గదా !
  వామ్మో ! పతి దేవుడైన వాడౌ సుమతీ !

  జిలేబి

  ReplyDelete


 26. మానిని జిలేబి గనవే
  వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్
  తానై నిలచెను విభుడై
  కానన మతనిది జలనిధి కారణ మతడౌ !

  జిలేబి

  ReplyDelete


 27. వేణి సౌగంధములలర వేణు నాద
  ములట రమ్మని బిలువగా ముద్దు గుమ్మ
  లగుచు మురిసిబోవు రమణు లార పుష్ప
  బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడచులకును

  జిలేబి

  ReplyDelete


 28. ఓయమ్మ జిలేబీ ! కా
  వోయీ యర్థమ్ము మాకు వోకారంబ
  య్యే ! యీ పద్యము లేల
  మ్మా! యినవే తల్లి పద్య మాలిక వలదే :)

  జిలేబి

  ReplyDelete


 29. చిందర వందర గా సం
  బంధము లేక నిటయొక టపా గట్టితి ధై
  ర్యం తెలుగు జిలేబులుగద !
  విందురు చదువుదురు కర్మ, విధి, యోపికగన్ :)

  జిలేబి

  ReplyDelete


 30. అరరే! ముకుదాడువలయు
  పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ,
  వరమై నెలయున్నయ్యరు
  కరముల దాటిన నతనికి గాలము వేయన్ :)

  జిలేబి

  ReplyDelete


 31. అరుబది పైబడి వయసున్
  పరిమళ మొప్పారు పద్య పాటవములతో
  జరిగిన కాలపు స్మృతులన్
  సిరిసిరి మువ్వల వలెనట చిన్కుల నద్దెన్ !

  జిలేబి

  ReplyDelete

 32. వంటగది కత్తులనటన్
  జంటగ గానగ జిలేబి జాకీ చానై
  యింటన మార్షల్ ఆర్ట్సున్
  గుంటడి వలె జేసె సూవె ఘుమఘుమ గురువౌ :)

  జిలేబి

  ReplyDelete


 33. నా నవలా దురదలనన్
  నేనిక దీర్చు కొనవలెను నేసెద నవలల్
  పూనిక వచ్చె జిలేబీ
  గానుము పరపర రపరప గాధల తీరున్ !

  జిలేబి

  ReplyDelete


 34. అసికపు సొగసుల మసినుసి
  రసికత సరసపు పలుకుల రమణి జిలేబీ,
  విసవిస వలదు వలదికన్
  కసికసి గనుచు సమరమ్ము కాంచన మాలా !


  జిలేబి

  ReplyDelete


 35. అసలుసి సిసలాధ్యాత్మిక
  త! సలాము గొనవె గురువుల దంట జిలేబీ !
  మిసమిస ఫోటో గనుమా
  పసకొరకున్ బొమ్మ, శిష్య! పరిణితి గొనవే :)

  జిలేబి

  ReplyDelete


 36. తలమిది విభునిది కనులకు
  తలపులు తొలగన వెలుగుగ తరమగు క్షేత్రిన్
  తలచెద, కలయన కలయును
  తలరులు, మదియు వికసింప తరుణంబిపుడే !

  జిలేబి

  ReplyDelete

 37. మళ్ళీ యదిగో బాంబులు !
  కళ్ళెము వేయన్ జిలేబి కసబిస యనుచున్
  ఊళ్లకు ఊళ్ళను లేపే
  టోళ్ళకు విసిరెను సవాలు డోనాల్డ్ ట్రంపూ !


  జిలేబి

  ReplyDelete


 38. బాలింత మెలకువగనన్
  పాలివ్వన బిల్చెనో దభాలున తెచ్చెన్
  బాలను నర్సమ్మ జిలే
  బీ! లోల వెతికెను యభియభి మొబైలునటన్ !

  జిలేబి

  ReplyDelete


 39. ముక్తిని కోరుచు కర్మను
  రక్తియు గాంచక మనుజుడు రంజిల జేయన్
  శాక్తము నటు, కర్మ ఫలపు
  భుక్తియె లేనట్టి పరమభోగి యతండే!

  జిలేబి

  ReplyDelete

 40. ఈర్ష్యా ళువులకు లోటౌ !
  ఈర్ష్యుం డెవడో జిలేబి యిక్కట్లగన
  న్నీర్ష్యాద్వేషమునన్ యౌ
  త్కర్ష్యంబులకటు యినాము తానము మారెన్ !

  జిలేబి

  ReplyDelete


 41. అంతా అమ్మ దయ గదా!
  వింతల జీవితము గాంచి విదురుడు పలికె
  న్నంతయు మన జేతులలో
  నెంతయు లేదౌ జిలేబి నిజమును గనుమా !

  జిలేబి

  ReplyDelete


 42. అద్భుత మన్నయ్యా ! మీ
  సద్బుద్ధిగనన్ జిలేబి సాదర పలుకౌ !
  బుద్బుద జీవిత మందు య
  దద్బుదజమువలె గలవివి తరమగు రీతిన్ !

  జిలేబి

  ReplyDelete


 43. శల్యుని కథనన్ యొజ్జ య
  కల్యము,యెత్తుగడ రాచ కార్యము లన్ కౌ
  శల్యము వివరించె, భళా
  మాల్యము తగునౌ జిలేబి మాచన కచటన్ !

  జిలేబి

  ReplyDelete

 44. కోతలు కోసెడి వారలు
  భీతిల్లిన వారలు, రణవీరులు ధీరుల్
  చేతురు కార్యము లెల్లన్
  హాతువును గనుచు జిలేబి హాకము వోలెన్ !

  జిలేబి

  ReplyDelete


 45. చల్లని చల్లని వేసవి
  పిల్లను జూడ వెనువెంట బిరబిర వచ్చె
  న్నుల్లము జల్లన గాలుల
  కెల్లలు లేకను జిలేబి కేరింతలిడెన్ :)

  జిలేబి

  ReplyDelete


 46. ఇంతే జిలేబి సంగతు
  లంతయు గనవమ్మ సంకలనమును రమణీ
  కొంతైన నేమి నలుగురి
  కింతై న చదువుటకు మజ, కిసలము జేర్చున్

  జిలేబి

  ReplyDelete


 47. వృకుడెవని సుతు జిలేబీ !
  నికటము గన కృపికి యనుజుని వరుస ? యెవర
  మ్మ కనకన కర్ణుని యెదిరి ?
  శకునికి; దమ్ముండు కృపుఁడు; సాత్యకి సుతుఁడున్!

  జిలేబి

  ReplyDelete


 48. సహవాసదోషము గనె
  న్నహహా పద్యంబు గూర్చె నార్యుడు రాగం
  బు హరిణగతి రగడాయెన్ !
  యిహ కొంతమిగిలె జిలేబి యిక మనదారే :)

  జిలేబి

  ReplyDelete


 49. నిత్య సహవాసి భాస్కర !
  సత్యము తోడైన లలిత సత్తువు నీవే
  గత్యంతరంబు నీవే
  గత్యనుశీలనము చేసి గతిగానెదమౌ !

  జిలేబి

  ReplyDelete


 50. వారి నటవోర గన్నుల వారిజాక్షి
  జూసె, మురిపెము గానుచు జుంజుఱించు
  మదియు తూగగ సుమముల మర్చి కోవి
  దారమే లేని హారము తరుణి దాల్చె!

  జిలేబి

  ReplyDelete


 51. పొంతన లెనిమిది జూడగ
  నెంతయు మంచిది జిలేబి నెరయు వివాహం
  బెంతయు సుఖానుభవముగ
  వింతలు విభునివి వినవలె విదురుల పల్కుల్ !

  జిలేబి

  ReplyDelete


 52. వచనమ్మున రాయవలయు
  కిచకిచ పద్యములు వలదె కింకవదులవే
  కచటతప యనుచు గూర్చన
  మచర్చికమవదు జిలేబి మత్తు విడువవే !

  జిలేబి

  ReplyDelete


 53. అంజనము వేయ రమణీ
  బంజరు భూమి కనులకగుపడె పసిడికళన్
  మాంజా దారము లాగన
  కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్ !

  జిలేబి

  ReplyDelete


 54. పద్యాలు చాలు ! ఈబ్లాగ్
  పద్యాలకు తావుగాదు పడతి జిలేబీ !
  విద్యల నేర్వన కామిం
  ట్లాద్యంతము పద్యములట టప టప వలదే !

  జిలేబి

  ReplyDelete


 55. విప్పారిన నేత్రంలో
  తప్పిన పరువాల శూన్య తత్వాలకటా
  యుప్పిరి గొన పద్మార్పిత
  విప్పెను పురి, నాట్యమాడె విలసత్వమునన్ !

  జిలేబి

  ReplyDelete


 56. భావుకత యనుచు బరువగు
  రావంబులతో జిలేబి రామక మేలన్
  మా వునికి మాకు తెలుసును
  జీవితమున జూచిన చిరుచిరు విషయములౌ !


  జిలేబి

  ReplyDelete


 57. మనకు మనమేనటన్ తో
  డు నమనము లిడవె జిలేబి, డుండుం డుండు
  మ్మనుకో వలదే యెవరో
  నిను కాపాడెదరని, గమనిక వలయు సుమా !

  జిలేబి

  ReplyDelete


 58. అంబర మణి "అ" ను మింగగ
  జంబల కడిపంబ రంగజము దిద్దెగదా
  బంబమ్మనుచు జిలేబీ
  యంబను తాళగలమా సయాటల తీరున్ :)

  జిలేబి

  ReplyDelete


 59. కుల్లూరు గుళ్ళ కథల
  న్నుల్లంబొప్పగ జిలేబి నుడివిరి కవిరాట్
  చల్లగ చూడవలె గురువు
  లెల్లర పరదేవత తెర లెత్తంగ భళా !

  జిలేబి

  ReplyDelete


 60. కిరణంబుల హారంబును
  సిరితోడై నెలయు చిన్న చెలియకు కంఠా
  భరణంబుగ వేసితివ
  మ్మ రమణి జోతలివియే సుమతి సీతమ్మా !

  జిలేబి

  ReplyDelete


 61. లేనే లేదోంకారము !
  జానా బెత్తెడు జిలేబి జాంజాం గురువు
  ల్లీ నాడు తయారై నా
  రే నీ ఖర్మ కెవరమ్మ రెక్కల సాయం !

  జిలేబి

  ReplyDelete

 62. గ్రామీణుల వాడుక భా
  షౌ మిన్నగనదు జిలేబి చందంగనదౌ
  నీమమ్ముగ విడువవలెను
  భామా వాడ వలదౌ సభామర్యాదౌ !

  నారదాయనమః !
  జిలేబి

  ReplyDelete


 63. వగల మారి జిలేబి కవనపు వేడి
  సెగల మధ్యన జనులటు సేద దీర
  పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
  రగడ యన యిదియేగద రత్నమాల !

  జిలేబి

  ReplyDelete


 64. పద్యపు కామెంటుల మా
  గద్యముల నలంకరించు గగనసఖీ ! మీ
  హృద్యంబైనటి పలుకులు
  సేద్యమ్మది భాషకున్ను సేవ జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 65. పర భాషా పదములు మా
  కు రాశి ! మీగ్రామ్య మొప్పు కోము జిలేబీ !
  సరసంబుగనన్ సుకవీ
  శ్వరులకు పేరోలగమ్ము సాక్షిగ నిమ్మా :)

  జిలేబి

  ReplyDelete

 66. అమరావతిలో పగలే
  సమరస వెన్నెల జిలేబి చంద్రుడు కురిపిం
  చి మహిష్మతి నగరపు రా
  జమౌళి చిత్రపు కలల మజను గనుచుండెన్ :)

  జిలేబి

  ReplyDelete


 67. ఖరగపుర వాసి శాస్త్రియు
  తరంగ వేగపు యిషాని తాతయు నొకరే !
  వరమాయె శంకరుని కొ
  ల్వు, రాసి పద్యముల వాసి వురుకులు పడెనౌ !

  జిలేబి

  ReplyDelete


 68. శ్రీ అరిపిరాల యద్భుత
  మైన కథనటు నడిపిరి సుమా! రమ్యంబౌ
  మానవ సంబంధమ్ముల
  తానము సరి జూపిరి మమతల తక్కెడనన్ !

  జిలేబి

  ReplyDelete


 69. మీ కందంబునకు జిలే
  బీ కాసులు దశ సహస్ర బిర్రగు సుమ్మా !
  మీ కంద దురద తీరదు
  పాకం బై నెలయు యిలన బామ్మా వినవే :)

  జిలేబి

  ReplyDelete


 70. ఎన్ని యెరలో జిలేబీ !
  యెన్ని వురుల్ మన బతుకున యేమీ మాయా !
  యున్నతి సద్గతి వలయున్
  యెన్నగ మార్గంబు గీత యెప్పటి కైనన్ !

  జిలేబి

  ReplyDelete


 71. మాటలు తగ్గించండని
  మాటల దామోదరుండు మాన్యుడు సలహా
  కోటన యిచ్చెనటా ! యక
  టా! టముకుల నేర్చుటెట్లటమరి జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete

 72. కాంతా కనకమ్ములెరల్ !
  శాంతము వీడి యవి గాన సరసి జిలేబీ
  యంతము యురియై నిలచున్
  వింతైన భువియిది సూవె విభుని సయాటా !

  జిలేబి

  ReplyDelete


 73. దోషంబుల మంచి చెడుల
  కాషంబులు గానవచ్చు గద మాచనవ
  ర్యా! షాకంబుల పాకము
  శోషను పోగుట్టు మేలు సొబగులు గలుగున్ :)

  జిలేబి

  ReplyDelete


 74. స్వానుభవమ్మున తత్త్వ
  మ్మౌను చిగుర్చుచు జిలేబి మానస సత్యం
  బై నిలచు! యన్యగామీ
  గానుడు విదురుండు యొజ్జ కష్టేఫలియౌ !

  జిలేబి

  ReplyDelete


 75. కొబ్బరి కన్నుల చిన్నది
  యబ్బో కర్ణాటకమున యగుపించెనటా !
  యబ్బుర పడుచున్ జనులటు
  పబ్బము జేసిరి జిలేబి పరవశులగుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 76. సాంబా !రుగ్మత గాద!ని
  తంబిని వలెగాన్పడితివి ! తారసము గనెన్
  సంబోధము! రిపులు సుయవ
  సంబు! దురాచారులైరి ! శాపంబిదియే !

  జిలేబి

  ReplyDelete


 77. రేసున లేను జిలేబీ
  భూసురు డిట చంద్రుడే! సుపుత్రుండను నే!
  యీశుని యాశీస్సుల మన
  కేసీ యారు తెలగాణ కేంద్రకుడు సదా!

  జిలేబి

  ReplyDelete


 78. హా! రోజూ జుర్రెడి సాం
  బారాయెను యన్య దేశ పదము జిలేబీ !
  పోరీ మసాల దోసెల్
  పూరీ వలదే తెలుంగు బూరెల భాషౌ :)

  జిలేబి

  ReplyDelete


 79. మెట్రో లో సెల్ఫీ లౌ
  భట్రాజు పొగడ్త, యిల్లు పదిలం గావన్
  యిట్రావలదోయ్ వీసా
  గట్రాలిక లేవు సాఫ్టు కార్మికు లారా :)

  జిలేబి

  ReplyDelete


 80. మేనరికమ్ములు వలదోయ్
  మేనరిజమ్ములు జిలేబి మేలున్ గూర్చున్
  మానిని జీన్సులు ముఖ్యము
  మేనికి వలయును సుమేధ మేలున్ గానన్ !

  జిలేబి

  ReplyDelete


 81. మేమమెరికాన గూడన్
  ఓ మానిని జాతకమ్ము నోమారట జూ
  చామమ్మీ పూర్ణాయి
  ష్షౌ! మానులవలె బతుకన సార్థకమగునో ?

  జిలేబి

  ReplyDelete

 82. ఓరకనుల జూచుకొనుచు
  జోరుగనుచు జోడుగట్టి సోరణిదివియల్
  పాఱింప సయాటల చెలి
  కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్ !

  జిలేబి

  ReplyDelete


 83. మీ ప్రోత్సాహమునకు మా
  కై ప్రాతః కాలమిచ్చు కైపదములకున్
  మీ ప్రేరణలకు నెనరుల్
  మీ ప్రాపులు వన్నె దీర్చె మిక్కుటముగనన్ !

  జిలేబి

  ReplyDelete


 84. సోరణి దివియల్ తీరున
  బారులు దీర్చుచు జిలేబి పదముల్ బేర్చన్
  జోరుగ జోడుగనెను ప
  ద్యారవముల కందము సమతా రాగములన్ :)


  జిలేబి

  ReplyDelete


 85. హా! యెర్ర బుగ్గ కార్లిక
  మాయమగునటా జిలేబి మాదా కవళం
  బాయె బతుకు దా రులనౌ
  బోయే జనుల బతిమాలి పొంతల గానన్ !

  జిలేబి

  ReplyDelete


 86. ఎగిరే కార్లిక వచ్చున
  ట! గిరగి రతిరుగుచు బోవుటకు సుళువగునౌ !
  భగభగ ధర నాలుగు కో
  ట్లు గబగబ జిలేబి కొనవె టుప్పని యెగురన్ !

  జిలేబి

  ReplyDelete


 87. మధుకైటభులు జిలేబ
  మ్మ, దొరకక తిరిగు నుగాగమ యడాగమముల్
  సదనంబందు నటునిటు మ
  న దుంప త్రెంచుచు సయాటన యిటునటుగనున్ :)

  జిలేబి

  ReplyDelete

 88. మాయా ప్రపంచ మందున
  ఛాయా మాత్రంబుయోగి సాక్షిని గానన్
  హే!యంతరాత్మ ! యేమిటి
  నీ యునికి జిలేబి,యెచట నీ బస, యనెనౌ !

  జిలేబి

  ReplyDelete


 89. క్షేత్రము బీజము మేలై
  సూత్రము గావలె జిలేబి చుక్కగ మెరవ
  న్నాత్రపిత పాత్రముగనన్
  చిత్రము! భళిభళి విభుండు చిత్రకుడగునౌ !

  జిలేబి

  ReplyDelete


 90. మంచి కథల వెదుకుచు వివ
  రించెను గదవే జిలేబి రీతిని గానన్
  కుంచెన దిద్దిన చిత్రము
  గాంచగ వీక్షకుల మనసు కాలము గనునో ?

  జిలేబి

  ReplyDelete


 91. ఎండలటు మండెను జిలేబి యెచ్చట యెడ
  నీరు? మీదు జనుల కనునీరు జేర,
  వారుణి వలదనె ప్రభువర్యులట ! సోకు,
  నీరు చాలక దీపము లారిపోయె!

  జిలేబి

  ReplyDelete


 92. వారము గురువారంబౌ
  సారస్వత లక్ష్మివార సాయంత్రమ్మున్,
  సోరణి దివియల్లూగును
  మా రమణి జిలేబి నాట్య మాడ భళిభళీ !

  జిలేబి

  ReplyDelete


 93. నీమముల తప్పు నడవడి, నిశ్చయముగ
  రామ రాజ్యమ్మునన్ గనరాదు, నీతి
  పరుల లోకమది జిలేబి పదరు గనక
  భద్రము గనుచు జనులు శుభమ్ము గనిరి !

  జిలేబి

  ReplyDelete


 94. ఓయీ జిలేబి ! పిలిచితి
  వా! యిక్కట్లే సుమా! గవనమమ్మా ! బా
  జాయించెద నీ నెంబరు
  నౌ యీ పంచదశలోక నరులెల్లెరుగన్ :)

  జిలేబి

  ReplyDelete


 95. మా ఆవకాయ తినిర
  మ్మా యబ్బురపడుచు రంభ మాహేంద్రాదుల్
  ఓయమ్మ తిష్ట వేయగ
  మా యమరావతి పడుసర మయ్యె జిలేబీ :

  జిలేబి

  ReplyDelete


 96. జుట్టున్నమ్మకు యొప్పును
  చట్టున కొప్పేదయినను చక్కని చుక్కా !
  పట్టమ్మా దరి రమ్మా
  బొట్టందము జూడ చోఱబుడత జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 97. ఆ యడవి లోని జంతువు
  లాయనకు సలాము జేసె లయయొప్ప యిట
  న్నోయమ్మ మత్త కోకిల
  సాయము మత్తేభము ఘన శార్దూలమ్ముల్ :)

  జిలేబి

  ReplyDelete


 98. పద్యముల నడక కవనపు
  విద్య యు వన్యమృగ రాగ వింజోవిగన
  న్నాద్యంతమ్ము జిలేబీ
  సాధ్యమ్ముగ జేసిరిగద సత్కవులిచటన్ !

  జిలేబి

  ReplyDelete

 99. ఆట వెలది సీసమ్ముల
  మీటరు ద్రిప్పుచు ప్రమోద మిరిచూపేలా !
  మేటరు లేకున్న జిలే
  బీ టప్పునమూ లనుండు బీటింగ్స్ వలదే :)

  జిలేబి

  ReplyDelete


 100. చీత్కా రమ్ముల జూడకు
  సత్కార్యమ్ములను జేయ సత్కృప కలుగు
  న్నత్కుడు తరతమము గనక
  యత్కపు శీతలము గాంచి యవనిని నెరయున్ !

  జిలేబి

  ReplyDelete


 101. శ్రీరాజన్నా ! సుకవీ !
  మీరెట్లా చెప్పన యటు మీ మాటే రై
  టౌ ! రయ్యనవచ్చి జిలే
  బీ, రవ్వంతగని పద్య బీటిల్సివవే :)

  జిలేబి

  ReplyDelete

 102. శ్రీచక్రంబును తీరుగ
  నాచార్యులు తెలుగు యోగి నలుదిసలను గీ
  తాచార్యులవలె తెలుపన్
  ప్రాచుర్యముగాన సలిపిరౌ యత్నంబున్ !

  జిలేబి

  ReplyDelete


 103. చదువన యర్ధాంతరముగ
  పదునటు గానక టపాను పారుడు రమణీ
  కుదురక నిలిపెన్నో యని
  చెదురుముదురుగ యనిపించె చెవియొగ్గవయా !

  జిలేబి

  ReplyDelete


 104. లలితా సహస్ర నామ
  మ్ములమీద నుపన్యసించ ముంగట వచ్చున్
  పలుకన్, తామెల్లరటన్
  సులభము గా యర్థము సరి సూక్ష్మము గనుడూ !

  జిలేబి

  ReplyDelete


 105. సరళము జిలేబి కందము
  బిరబిర రాయన్ సులభము బింకంబేలన్
  చొరరాని ఛందములనన్
  గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్!

  జిలేబి

  ReplyDelete


 106. అల్లన మెల్లన చల్లన
  నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్
  కల్లా కపటంబెరుగ
  న్నెల్లెడ గలవాడ! నల్ల నిగ్గుల వాడా !

  జిలేబి

  ReplyDelete


 107. తిన్నగ పదముల మెలికల
  మిన్నగ బట్టిరి జిలేబి మించారుగనన్!
  జన్నటి వేగము బారెను
  వన్నువ గా శాస్త్రి వారి పద్యము రమణీ !

  జిలేబి

  ReplyDelete


 108. సంపూర్ణ సూర్య గ్రహణపు
  కంపనముల జూపి యోగి గట్టిగ చార్టున్
  దింపెను జిలేబి యమెరిక
  జంపారుల సూచిక గొని జంకించెనటన్ :)

  జిలేబి

  ReplyDelete

 109. దెబ్బల ముక్కలు చమకులు :)


  ————————————————————————————————-

  కష్టేఫలే

  https://kastephale.wordpress.com/

  ఈబ్లాగు మొదటిది. ౨౦౧౧ నుండి టపాలున్నాయి.

  ఈబ్లాగులో ప్రచురించిన టపాలు శోధినిలో మాత్రమే కనపడతాయి, వ్యాఖ్యలు శోధినిలో కనపడవు.

  నేటి టపాలు ఈబ్లాగులోనూ ప్రచురిస్తున్నా,కారణం,చాలామంది ఈ బ్లాగ్ నే బుక్ మార్క్ చేసుకున్నారుమరి.

  ———————————————————————————————————

  కష్టేఫలి

  https://sarmabc.wordpress.com/

  ఈబ్లాగులో నేటి టపాలు పై బ్లాగులో ప్రచురించినపుడే ప్రచురింపబడతాయి.

  ఈబ్లాగులో టపాలు శోధినిలో కనపడతాయి,వ్యాఖ్యలు ప్రచురితం కావు.

  మాలికలో ఈబ్లాగ్ టపాలు,వ్యాఖ్యలు ప్రచురింపబడతాయి.

  ———————————————————————————————


  కష్టేఫలే(పునః ప్రచురణ)

  https://kastephali.wordpress.com

  ఈ బ్లాగులో మొదటిబ్లాగులోని పాత టపాలు మరల ప్రచురిస్తున్నాను.


  ఈ బ్లాగులో ప్రచురించిన టపాలు శోధినిలో కనపడతాయి,వ్యాఖ్యలు ప్రచురితంకావు.


  మాలికలో మాత్రం ఈ బ్లాగులో టపాలు,వ్యాఖ్యలు ప్రచురితమవుతాయి.

  —————————————————————————————————


  మీ వ్యాఖ్యకి, మరొకసారి

  ధన్యవాదాలు.

  ————————————————–  ReplyDelete


 110. గురుడటు దాగెదనని బో
  వ రావడిగనన్ జిలేబి వరమై వెలసెన్
  పరిపరి విధముల బ్లాగుల్
  మెరయుచు పంచదశలోక మించారు భళా !

  జిలేబి

  ReplyDelete


 111. అల్లగ జిలేబి కథలన్
  మెల్లగ వృత్తంబగుచును మేధా జీవుల్
  నల్లన జూచిరి గదవే
  మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్

  జిలేబి

  ReplyDelete


 112. అప్పుడు యప్పిచ్చెనుదా
  చప్పున బాంకులకు తీరు చక్కగ గనుచున్
  యిప్పటి వారల తీరుల్
  యప్పను నిలబెట్టెనుగద యప్పును గోరన్ !

  జిలేబి

  ReplyDelete

 113. నా పంట పండె భళిరా
  నా పద్యమునిట జిలేబి నచ్చెను జూడన్ !
  జీపీయెసుశా స్త్రీ!మీ
  రౌ పదముల మేస్త్రి శంకరాభరణమునన్ !

  జిలేబి

  ReplyDelete


 114. అన్నా! జగదంబకరుణ
  యన్నుల మిన్నగ శుభముగ నద్భుత రీతిన్ !
  కన్నుల గాంచితి కన్నా!
  అన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్!

  జిలేబి

  ReplyDelete

 115. దాదాసాహెబుఫాల్కే !
  శ్రీద్రష్టృవు విశ్వనాధు సిరిసిరి మువ్వా !
  వేదం అణువణువు తెలుగు
  నాదం కలగలిపి నాడు నా జీవమనన్ !

  జిలేబి

  ReplyDelete


 116. పాము నోట బోయె బాంబుగా పేలెను
  మంజసమున దాచె మత్తు జేర్చె
  మంత్ర గత్తె మహిమ మత్తునట, జిలేబి!
  సామజమును గూల్చె దోమ యొకటి !

  జిలేబి

  ReplyDelete


 117. ఉస్మానియాకు నమనము
  అస్మాదృశులను జిలేబి యైదీవించెన్ !
  అస్మాకుడు తెలగాణా
  యాస్మాన్రంగు కలువలమయంబై దీర్చెన్ !

  జిలేబి

  ReplyDelete


 118. బాధాతప్తజనమ్ముల
  దాదాత సుమా జిలేబి దరువై గావన్
  మేధా జీవులు మేలు సు
  ధాధారలజేర్చువారు ధరణిన్ సుమ్మీ !


  జిలేబి

  ReplyDelete


 119. పడిగాపుల పడి యుంటిని
  గిడిగిలి ! యెండన బడ తిరిగెను తలయంతన్ !
  తడిసెను జిలేబి చేపా
  వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్ !

  జిలేబి

  ReplyDelete


 120. ఓయి జిలేబి ! సుయోధను
  మేయి సమయ బంధువో? హమేషా వత్తా
  సై యిట నిలచే వమ్మా !
  పాయక యిట పద్యములను పాడేవమ్మా ?

  జిలేబి

  ReplyDelete

 121. చూచె శమనపు రమణిని, చూర గొనగ
  మది, వనమునందు కుందన మగుచు రాజు
  తరుణిని వరించె గాంధర్వ తరము గాన,
  మరిచె నగరము వెడలగ, మవురి లలన !

  జిలేబి

  ReplyDelete


 122. భగభగ లాడే వూరిక
  టు కార్యములకై వెడలి యటుయిటునయితినౌ
  బిగువుగ యిపుడే గాద మ
  న గురువుల టపాను జూడనౌ వీలయ్యెన్

  జిలేబి

  ReplyDelete


 123. శూరుడ వీరుడ ననుచున్
  బారుల వెంబడి తిరిగెడి పారుండొకడౌ
  చేర గధాట్టు సమాధిని,
  బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్ !

  జిలేబి

  ReplyDelete


 124. వలయు నాధారు కార్డిక వర్ధి‌‌ లయని
  మంకి బాతున తేల్చగ మాన్య మోడి
  బాబు గారట తాకీదు పంప గాను
  కోతికొక జాబు వచ్చిన గొల్లుమనెను !

  జిలేబి

  ReplyDelete


 125. ముచ్చెల దెబ్బలు తాళెన్
  స్వచ్చము గా కృష్ణుడౌ రసమయ జగతికి
  న్నాచ్చాదనమతడే, సరి
  గుచ్చెడి వాడు సిరి గుబ్బ గుచ్చుల వాడౌ !

  జిలేబి

  ReplyDelete


 126. అయ్యరి మాట వినవలెన్
  సయ్యాటలనన్ జిలేబి సరసపు పల్కుల్
  కయ్యంబన సయ్య నెడౌ
  గయ్యాళి నిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్!

  జిలేబి

  ReplyDelete


 127. నేమాని సోమ కవివర !
  యీ మాలినియౌ బిలేజి యిష్టసఖియు న
  య్యా మా యయ్యరు గారికి
  ధామన్ ! గయ్యాళి పేరు ధన్య జిలేబీ !

  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 128. ఇందుగల దందు లేదని
  సందేహంబేల సోమ ! సరసి జిలేబి
  న్నెందెందైన గనదగున్
  కందము నందున సుమముల కౌసుమ మందున్ !

  జిలేబి

  ReplyDelete


 129. అల్లీ బిల్లీ యాంగ్లం
  బెల్లను నేర్వన జిలేబి బింకపు తెలుగున్
  కల్లా కపటము లెరుగక
  తల్లీయని పిలుచెనంట తండ్రిని సుతుడే :)

  జిలేబి

  ReplyDelete

 130. భయమే భయము! బతుకున మ
  న యవసరము లెక్కువై క్షణక్షణము జిలే
  బి, యతుకులబొంత భయమౌ
  పయనమ్మే భయము సరి యుపాయము లేకన్ !

  జిలేబి

  ReplyDelete


 131. ధీరత్వమువల యును సా
  హోరే యనుచును జిలేబి హోరెత్తంగన్
  వీరము మాన్యంబగు సహ
  కారమ్మును మించి తీపి కలదే పుడమిన్ !


  ---

  మా రీటైర్డు జనులకున్
  సారంబొప్పెడి కవులకు సరసి జిలేబీ
  యేరాల సమస్యా స్వీ
  కారమ్మును మించి తీపి కలదే పుడమిన్ !

  జిలేబి

  ReplyDelete

 132. మీ వ్రాతలు తెలుగు జనుల
  కై వ్రంతి సుమ! యమృత గుళికలు దీక్షితుడా
  మీ వ్రాయసములమోఘము !
  మా వ్రాతఫలము చదువక మానిన యొజ్జా !

  జిలేబి

  ReplyDelete


 133. అర్థము పరమార్థంబుల
  యర్థము తెలియన జిలేబి యగునా వైవీ
  వ్యర్థము శుభాంగి పలుకుల
  కర్థము జూడ గనుమయ్య కాకర వత్తీ :)

  జిలేబి

  ReplyDelete


 134. అంబ కనబడె జిలేబీ !
  బింబముగా ప్రతిమ గాను వివరము తెలియవ్ !
  శాంభవి గన్పడ కరణము
  గంపెడు లేదోయి నమ్మకము వలయు సుమీ !

  జిలేబి

  ReplyDelete


 135. పలికినది వైవి యటనౌ
  పలికించెను విన్నకోట ప్రశ్నలు సుమ్మీ
  పలుకులు జిలేబు లూరగ
  చిలుకల కొలికిగ పలికెను చినతమ్ముండౌ :)

  జిలేబి

  ReplyDelete


 136. మధుర పదార్థంబు జిలే
  బి!దురద తగిలె నిక వైవి విదురుడు మన దా
  రి! దరువులిక సాగించును
  పదనిస పదములన పద్య పాదము లలరన్ :)

  జిలేబి

  ReplyDelete


 137. ఏరాలముగ జిలేబియు
  ధారాళముగాను కంద దరువుల గానన్
  సోరణి దివ్వియల వలెన్
  పేరోలగమలర పద్య పేర్పులు పారెన్ !

  జిలేబి

  ReplyDelete

 138. జగడము లాడు జిలేబీ
  వగకత్తె పలుకులకున్ సువర్ణము గలదే :)
  పొగుడగ ధన్యమనును,నే
  తెగిడిన యర్థమవలే, ముదిత పలుకులనున్ :)

  జిలేబి

  ReplyDelete

 139. ఉత్కళిక

  కథలకు కాణాచిగదా
  వ్యథలకు కరణమును సదా
  యొనరిచి మదియలర భళీ
  యని సుమముల గూర్చు చెలీ !

  జిలేబి

  ReplyDelete


 140. తొందర పాటు యహంకా
  రం దరి గర్వము జిలేబి రయ్యన జేరె
  న్నందరి లోన పరుగిడెను
  డెందము వీడి సమకాల మందున రమణీ !

  జిలేబి

  ReplyDelete


 141. బ్లాగున్నది దేనికయా
  ఓ గురుడా మజ జిలేబు లూరన్ గదయా !
  మాగూడిది పద్యములన్
  సాగింపగ యత్నముల్ పసగన తలమహో !

  జిలేబి

  ReplyDelete


 142. పడకను విడ నిదురయటు పక్క తొలగ
  గడగడ యనుచు వడివడి గనటు నడచు
  నడక హానికారకము మానవుల కెపుడు
  యెడరు విడవలె నించుక యెవ్వరైన !

  జిలేబి

  ReplyDelete

 143. న్యూటను బేర్చెను సూత్రము
  లాటల రీతిన జిలేబి లావై చదివెన్
  పోటీ పడెనుర మానవు
  డౌ టోకుగ సూత్రములకు డౌటే లేకన్ :)

  జిలేబి

  ReplyDelete


 144. పడకు మగవాడి వెనుక చపలము గాను
  పడతి! నాతిని పెండ్లాడవలెను వలచి
  యాతడు దరి చేరుచు సూవె యవ్వనవతి!
  వినవలె జిలేబి పలుకుల వివరముగను !

  జిలేబి

  ReplyDelete


 145. తిమిరమును పార ద్రోలుచు తిరముగ గతి
  రువ్వ మును గాక బతుకు హరువుగ పారు
  మతిని వేడుకొందును సామి మదిని గల మ
  లకలను తొలగించుమయ మలయజశీల !

  జిలేబి

  ReplyDelete

 146. భోజనము భోజ్యశక్తి, స
  దా జాయని యభిగమనపు దరువు, విభవమౌ
  సాజాత్వ దాన గుణముల్
  రాజిల్లు తపోఫలముగ రమణి జిలేబీ !


  జిలేబి

  ReplyDelete


 147. కేటుల కిమ్మ కితాబున్
  పాటవ మెల్ల గలవారు పారంగతులౌ !
  చోటా మోటా వారా ?
  వాటము గాంచన్ జిలేబి వాయించుదురౌ !

  జిలేబి

  ReplyDelete


 148. సత్కవులందరు హాలికు
  లుత్కర్షయుకాదు సూవె లూటాయించ
  న్నుత్కలికముగ హృదయము
  న్నాత్కడి వేసి చదివింప నాకర్షింపన్ !

  జిలేబి

  ReplyDelete


 149. భండన భేరియు మ్రోగన్
  డాండడ డాండాం డడాండ డా మ్మనె, వీణెల్
  నిండుగ సుస్వర నాదము
  మెండుగ జేసెన్ జిలేబి మేల్మిని గనుచున్ !

  జిలేబి

  ReplyDelete


 150. భండన భీముడు తాకన
  డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్
  గుండమ్మా ! యెల్లరికిన్
  నిండగు రీతిని విరించి నేర్పుగ జేర్చెన్ !

  జిలేబి

  ReplyDelete


 151. మనమిక రాజుగ కావలె
  యనుకొని నాయకు డొకండు యమహా గుర్తున్
  గొని యెన్నికలో యోడగ
  తన పార్టీ గెల్చినంతఁ దానేడ్చె నయో !

  జిలేబి

  ReplyDelete


 152. గురుడి యమెరికా కథ రం
  జు! రసమయ జగతిని యోగ జుంజము వెలుగన్ !
  మరి తలము దొరికెనా ? సా
  మిరన్తృ మాటల జిలేబి, మిక్కుటముగనన్ !

  జిలేబి

  ReplyDelete


 153. గడ్డన నిలచెను విభుడై
  వడ్డీ చెల్లింప లేడు వర్షించు సిరు
  ల్లడ్డంపొడుగుల తిరుమల
  యడ్డా యతనికి జిలేబి యవనిన్ మేలై !

  జిలేబి

  ReplyDelete


 154. గొంగటి వెంట్రుక మాస్టా
  ర్రంగము లోనగన వచ్చి రమ్మజిలేబీ !
  సింగారింపుపదములన్
  బంగారమ్మా పదనిస పాటల్ వలదే !

  జిలేబి

  ReplyDelete


 155. వరమాలవేయ ముదమున
  పురుషుని గళమందు చాన, పుస్తెను గట్టెన్
  చిరి సాకిగ వల్లభుడట
  కురిసెన్నాశీస్సులెల్ల కువలయములనన్ !

  *చిరి -అగ్ని
  *సాకి - సాక్షి

  చిరి సాకి = అగ్ని సాక్షి

  ఆంధ్రభారతి సాక్షిగా :)

  జిలేబి

  ReplyDelete


 156. పదచలనంబెరుగని పం
  డితుడతడు రమణి జిలేబి డిండీరవముల్
  చదువులు కావవి సుమ్మీ !
  పతంజలి పలుకుల బతుకు పారించె సుమా !

  జిలేబి

  ReplyDelete


 157. బాహుబలిన రామాయణ
  మాహా! భారతములెల్ల మనము వడయుచు
  న్నోహో గాంచె జిలేబీ
  జోహారులిడ వలెనోయి జోదిల్లనుచున్ !

  జిలేబి

  ReplyDelete


 158. మీరూ నేనే మిగిలా
  మౌ రోహిత్తు చ లువగ సుమా బరి లోనన్!
  భారీ గా విక్కెట్లిట
  నౌ రోహిణి పేరున పడెనమ్మ జిలేబీ !

  జిల్ :) యే సి

  ReplyDelete


 159. పోరీ!రావే ! టోరీ
  లోరా బోవు దినము మది లోమాట వినన్
  ఈరే డియో ముఖాముఖి
  వారము బుధవారము సవివరముగ నాతో !

  http://www.teluguyogi.net/2017/05/tori.html


  జిలేబి

  ReplyDelete


 160. అవగాహన నాటి జనుల
  వివరముగ నిలిచెను వారి విధియై గాచెన్ !
  సవరపు తెలివి, వవిరి బు
  ద్ధి, వరముగ గమిడెనుగాద దీలుగ నేడౌ !

  జిలేబి

  ReplyDelete


 161. గాతు వలయు సుమ్మీ ! రా
  జా! తూణీరము యవాయి సారించగనన్
  జూతము నీ శరములనౌ
  జూతుమె లవు, డా యటంచు సుందరి పలికెన్ !

  *లవు- బాగుగా

  జిలేబి

  ReplyDelete

 162. అగణితమగు వింతలు గల
  భగవంతుని సృష్టి లోన పాగెము గాన
  న్నిగుడన యంతర్దృష్టిని
  సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా!

  జిలేబి

  ReplyDelete


 163. జీవితమును వెదికారోయ్
  సావీ ! యేమర్థమొచ్చె సంశోధనలో !
  ఓ వైవీరాశ్రీ! యివి
  గో వీరత్రాళ్ళు వేసు కోండి విత వితా :)

  జిలేబి

  ReplyDelete


 164. జీవిత మంటే జీత
  మ్మే ?వై వీ చెప్పవయ్య మేష్టారకటా
  కోవిదుడే యడిగె జిలే
  బీ! వివరించితి నిఘంటు వేగములాడన్ !

  జిలేబి

  ReplyDelete


 165. అద్దరి శూర్పణఖ ‌చనవు ?
  ముద్దుల్లాడెడి కురంగ మును కోరినదో ?
  హద్దుల్దాట యడచె నెటు?
  ముద్దిమ్మనె; జానకి; దశముఖునిన్ బ్రీతిన్!

  జిలేబి

  ReplyDelete


 166. అడవి కథల రీతుల మన
  బడలిక తీర్చుచు జిలేబి పారుడు గాంచె
  న్నడకువ గలిగిన యెలుకను
  సడలని సామర్థ్యముల సుసంపత్తివలెన్ !

  జిలేబి

  ReplyDelete

 167. కన్నీటి విత్త నంబుల
  కన్నిటికీ నీళ్ళపాదు కట్టన్ తగదౌ !
  చాన్నాళ్ళవి వుండవు మన
  మన్నాసయు కారణము సమాళింప దగున్!

  జిలేబి

  ReplyDelete


 168. హీరా! యిదియ! సమస్యా !
  "సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"
  ఔరా! సమస్య యేమిటి ?
  పోరడు పోరిని వలచని పోకడ గలదే ?

  జిలేబి

  ReplyDelete


 169. మాలిక కే మా యెనహో !
  చాలన మవలేదు సూవె ? చాలమి యా యెన్ !
  ఓలక్కుపేట రౌడీ !
  లాలించవలయును యైపి లాగుల సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 170. ఔరా! కర్ణా! యెచటన్
  తాఱితి వయ్య! మన భటుల తాహతుకు సవా
  లై !రక్షణవలయంబున
  వారే రక్షగ జిలేబి వంకల కతయో ?

  జిలేబి

  ReplyDelete


 171. బాలయ్యా !యేక్పెగ్గు ల
  కోలాటపు పాట పాడి కొట్టే వయ్యా
  మాలా వగు చాన్సునటన్
  చాలాకగు పోర్చుగీసు చక్కని ట్యూనూ :)

  జిలేబి

  ReplyDelete


 172. వాసి! టకటంకులట యి
  ఱ్రీ! సీతయు కోరె గోము ! రివ్వున పార
  న్తా శరవేగము, కముచన
  నా సీతాపతి జిలేబి యై వెంటపడెన్ !

  *కముచు- పట్టుకొను
  *టకటంకుల - మాయావి

  జిలేబి

  ReplyDelete


 173. చీమల్లా కష్టపడిన శ్రీకరమగు పద్య సొబగుల్ :)

  ఓ మాలిని! కష్టేఫలి !
  చీమలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్!
  నీమము గా వాటివలెన్
  కామా, ఫుల్స్టాపులేక కందము రాయన్!

  జిలేబి

  ReplyDelete


 174. మాయా లోకము లోనన్
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే
  గాయము లాయెను జీవన
  సాయం కాలపు సమయము సంకటపాటుల్ !

  జిలేబి

  ReplyDelete


 175. అదిగో ఉత్తర కొరియా !
  పదునగు మిస్సైలుబేల్చె పాఠంబనుచు
  న్నదనును జూచి; యమెరికా
  తదనంతర చర్య జేయ తయ్యారగునో ?

  జిలేబి

  ReplyDelete


 176. వెతికిరి కర్ణుని వల వే
  సి తలము చెన్నై నగరము ! సిన్నబ్బను గా
  న తరము గాలే ! పోలీ
  సు తంబి సాయమ్ములేక సూ ! దొరకున్నో :)

  జిలేబి

  ReplyDelete


 177. అయిసు గడ్డల కురిపించ మన్న రేయి
  మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన
  వయసు లుడిగిన నేతలు వాత కమ్మి
  భయము గాంచి రణమ్ముల పథము బోవ


  జిలేబి

  ReplyDelete


 178. చక్కని మొగ్గా వలపుల
  చుక్కా రావే జిలేబి సుందరి రావే
  పక్కా లానిల బడవే
  యక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

  జిలేబి

  ReplyDelete


 179. ఆడు వారి మనసు నా యింద్రు డైనను
  కనులు వేయి గలిగి కాంచలేఁడు
  వెసులు బాటు నిచ్చె వేలుపగమికాడు
  లేమ మది జిలేబి లెస్స సూవె !

  జిలేబి

  ReplyDelete

 180. కుండకు భాండంబులకున్
  నిండుగ లింకును జిలేబి నేర్పుగ జేర్చె
  న్నండగ బాహుబలి కథన
  మెండగు కడవల ధమాక మేల్మిని గాంచెన్ :)

  జిలేబి

  ReplyDelete


 181. ప్రతిదినము కనబడు దృశ్య రక్త కంద
  భాసము జిలేబి కన్నుల పండువగ స
  తతము కనిపించి మించారు తరము, తెన్ను,
  ముగతి గోధి కుంకుమబొట్టు ముద్దుగాఱు !

  జిలేబి

  ReplyDelete


 182. శ్రీ పాద వారి తేజము
  మాబోటి నరులకు తీరు మానిక గానన్
  మా పలుకుల వారి పదము
  లే పరిపరి నాట్యమాడె లేమ జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 183. సతతము వెనువెంట పడెడు సరసపు మగ
  డతడు నా పతి మఱి మగఁ డౌ నితండు
  సుందరి జిలేబి కిన్ విను సుందర వద
  నమ్ముల మగరాజతడౌత నమ్ము మయ్య !

  జిలేబి

  ReplyDelete


 184. శ్రీపాద వారి మత్తున
  తా పారెను తూగెనమ్మ యికపూర్తిగ తా
  నో పట్టుపట్టు చదువన్
  శ్రీపాదము లవి జిలేబి సిరిసిరి మువ్వా !

  జిలేబి

  ReplyDelete


 185. ఆ నారి రుక్మిణి స్థితిని
  యా నాగటిచాలు యతివ యగచాట్లనలన్
  తానెదురు చూపుల కథల
  దీనత్వము గాంచె తాన దివ్వెగ గురుడౌ!


  జిలేబి

  ReplyDelete


 186. జాజుల జడి వానలటన్
  గాజుల సవ్వడులలో సుగాత్రిని! ఓ ‌నా
  రాజా వలపుల వయసున్
  రాజేయకురా జిలేబి రమణిన్ రారా :)

  జిలేబి

  ReplyDelete


 187. బూడిదలో పోసిన ప
  న్నీరాయెను భాగవతము నీవు చదువనౌ
  వీడమ్మ డంబు! యెక్కడ
  గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్ ?

  జిలేబి

  ReplyDelete


 188. వెంకన్నా ! వన్నా క్రై
  రెంకలు వేయుచు తమరిని రేసుగ జూచెన్ !
  సంకటపెట్టెడి వైరసు
  నంగట నటు పారనొత్త నమనము లయ్యా !

  జిలేబి

  ReplyDelete


 189. పవనుడి ట్విట్టరు హ్యాకా
  యె! వడి వడిగనట ! జిలేబి యెకసక్కములా
  డ వరుసన వేయుచున్నా
  రవతల వన్నా క్రయి వయిరసు వీరులు హా !

  జిలేబి

  ReplyDelete


 190. కేటీ యారటన యమెరి
  కాటాకావేయవెళ్ళె కాణాచిగదా !
  మాటా మంతీ జేయును
  పోటీ గని వత్తురౌ సపోర్టు కుబేరుల్ !

  జిలేబి

  ReplyDelete


 191. రూపాంతరీకరణలౌ
  మా పాలసి సంస్కరణల మార్గము గాదోయ్ !
  మా పద్ధతి నవ్యంబౌ
  తాపాడి వికాసము జత తారాడ సుమీ !

  జిలేబి

  ReplyDelete


 192. హ్యూమా ఖురేషి ! మజ ! హా
  జీమస్తాను కథ యంట! జీ! హీరోయి
  న్నై మన రజనీ కాంతుని
  తో మత్తుల తూగునంట తోడుగ జోడై :)

  జిలేబి

  ReplyDelete


 193. పేటీయెమ్మిక మనకై
  పోటీ పడుచున్ జిలేబి బొంకణమగునౌ !
  మీటంకశాల దస్కము
  లాటల పారున్నిక గద లాఘవముగనౌ !

  జిలేబి

  ReplyDelete

 194. సమాళించావయ్యా సుజనులకు సామర్థ్యమున్ జూ
  పి,మాన్యంబై దేశమ్మునిట నడి పించావు సుమ్మీ !
  సమాకంపించెన్కాంగ్రెసు జనుల సామీచి నీకున్ !
  నమో!మోడీ! భారాత్మక జననినాదమ్ము నీవే !

  జిలేబి

  ReplyDelete


 195. హ! వాడిన్ మీరన్ మాచనవరులు హారమ్ము గా బాం
  డువన్నీటిన్ మూటై గనిరిగద! డూయున్నికన్నీ
  రు వేడిన్ వీడన్ సౌమ్యముగ యుసురుల్ చల్లగన్ గా
  వ! వాణీ వీరే సూవె గురువులు వంద్యుల్ జిలేబీ !

  జిలేబి

  ReplyDelete