ಕಾಮೆಂಟಾಲಂಟೇ ಇಕ್ಕಡ ಕಾಮೆಂಟುಡೀ :)
ಜಿಲೇಬಿ
"హమ్మయ్య! పీడా విరగడయ్యె!!!
పేపర్ చదవడం అలవాటెప్పటిదీ? అరవైఐదేళ్ళ కితంది. పద్నాలుగో ఏట నాలుగో ఫారం చదివేటప్పుడైనది కదూ! అలవాటెలా అయిందీ? ఆరోజుల్లో పేపర్ పల్లెటూరికి రావడమంటే, అదో యజ్ఞం. ఈ రోజు పేపర్ రేపో ఎల్లుండో టపాలో వచ్చేది. ఆ పల్లెలో ఎంత మంది కొచ్చేది పేపరు? ఒకటి హైస్కూల్ కి రెండవది ఓ కలిగిన షావుకారు గారికి. .
http://kasthephali.blogspot.com/2019/09/blog-post_3.html
ReplyDeleteಕಾಮೆಂಟಾಲಂಟೇ ಇಕ್ಕಡ ಕಾಮೆಂಟುಡೀ :)
ಜಿಲೇಬಿ
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteచదవను గాక చదవనిక
ముదమారగ చదివినట్టి ముందటి దినముల్
సదనము లోతలచుకొని వి
సదీక రించి యిక న్యూసు చదువననిరిగా :)
జిలేబి
చందమామకు సూర్యుడు పిల్లనిచ్చిన మామ అవుతాడా?అవునని ఋగ్వేదమే బల్లగుద్ది చెప్తుందహో!
ReplyDeleteకౌసల్య దశరధుడు చేసిన అశ్వమేధ యజ్ఞంలో ఒక రాత్రి గుర్రం పక్కన గడిపిందా?
మనం నెలకు ఇచ్చే 30 రూపాయలకు ప్రతి రోజూ పేపర్ ఇంట్లో టైముకు అందించిన మనిషికి మనం ఇచ్చే గౌరవం 'హమ్మయ్య పీడ విరగడ అయ్యింది'. Now we have tv and internet. We can afford to jettison newspaper. Somehow I felt sorry for the vendor boy in this episode.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఏంటి జిలేబీ ఇది?
ReplyDeletehttps://vouhini.blogspot.com/2018/09/blog-post_16.html
గీతాసారం గురించి ఈ గొట్టాంగాడు అన్ని పోష్టులతో అంత సొల్లు రాస్తుంటే చెత్త పజ్యాలు రాసుకుంటూ కాలక్షేపం చెయ్యడానికి సిగ్గు లేదూ!
గీతాకర్తగా శ్రీకృష్ణుణ్ణి చెప్పడం తప్పట!ఆయన పరమపిత కాదనీ సర్వవ్యాపి కాదనీ తను నిరూపించి చెప్పేస్తున్నాడు!నదుల్లో నేను గంగని అని చెప్పడం వల మిగిలిన నదుల్లో దవుడు లేడని అర్ధం చెప్తున్నాడు!
2015 సెప్టెంబరు నుంచి మొదలుపెట్టి అంత ఛండాలం వెదజల్లుతుంటే ఇంతమంది హిందువులు బ్లాగుల్లో ఉండి ఏం పీకుతున్నారు?
నేను ఆల్రెడీ ఉతుకుడు మొదలెట్టాను.
మీ సంగతేంటి?
Deleteమూల పడివున్న మూర్ఖుణ్ణి లాగి అగ్రపీఠం వేసేస్తున్నారేమో :)
జిలేబి
మూల పడి ఉండటమా?నా చాప కిందకి నీళ్ళు రాలేదు లెమ్మని కూర్చోబట్టే గదా తితిదే మొత్తం కిరస్తానం అయిపోయింది!పాస్టర్లకి నెల జీతాలిచ్చే ధైర్యం ఆంధ్రా ముఖ్యమంత్రికి ఎలా వచ్చింది?
Deleteమొదటి పది పొష్టుల దగ్గిరే చావగొత్తి చెవులు మూస్తే అన్ని పోష్తులు వేసేవాడా?
క్షాత్రం లేని బతుకులు బతుకుతూ వాడు మూల కూర్చున్నాడని సొల్లు కబుర్లు చెప్తున్నారా?
మాకు సంఘాలు ఉన్నాయి, శిక్షణ ఇస్తాం రండని పిలుస్తున్నాదు. అలాంటివాళ్ళు వందమందో తయారయి ఆ చెంపా ఈ చెంపా వాయిస్తుంటే నెప్పి తెలిశాక గానీ మెలకువ రాదా!
ఎదవ సంత! పిరికి మేళాలు!టైం పాస్ బఠానీ కబుర్లూ పిచ్చ పజ్జ్యాలూ తప్ప పనికొచ్చే పనులు చెయ్యరు - అవసరమై ముందుకురకాల్సిన చోట యెదందుకూ పనికిరారు.
ఛత్!
మిషన్ ఫెయిలైందని న్యూసొచ్చాక "ఇది నాకు ముందే తెలుసు,చక్రం వేసి చూసేసా, కాకపోతే నువ్వు ఫీలవుతావని చెప్పలేదు" అనే పనికిమాలిన ఆలోచనా తరంగాలకంటే "ఈ సాయంత్రం లైలా తీరం దాటుతుంది, ఆరబెట్టిన వడియాలు, అప్పడాలు ఇంట్లోకి తెచ్చుకోవడం మరచిపోవద్దు" అని ముందుగానే చెప్పే రేడియో తరంగాలే నాకిష్టం!!☺️
ReplyDeleteYEs, I Like Your Comment!
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteమొదలైందా? 👇
ReplyDelete(ఆంధ్రజ్యోతి దినపత్రిక (Hyd) మొదటి పేజ్ 14-సెప్టెంబర్-2019 లో వార్త)
ABN పై ఏపీ ప్రభుత్వం నిషేధం?
Deleteగడిబిడిని యేబియెన్ను ద
వడ వాయంగొట్టుచునిలు వంగల వాడె
వ్వడెవడు సూవె జిలేబీ
గడగట్టినిలువ గల పిలగాడెవ డోయీ :)
జిలేబి
ప్రసారాలను నిషేదించారని సదరు కామెడీ ఛానెల్ వారు గగ్గోలు పెట్టడం ప్రత్యక్షంగా వీక్షించిన విశాఖపట్నంలో వింత పరిస్థితి. తమ కళ్ళతో తామే చూస్తున్నాం కనుక నిషేధ వార్త అబద్దమా లేక షరా మామూలుగా వేమూరి మాటను గుడ్డిగా నమ్మడమా అన్న ధర్మ సందేహాలు ఎన్నెన్నో. అసమదీయ రివ్యూ సిస్టం (ARS aka YRS) కోసమని ఈనాడు/ఈటీవీ/టీవీ5 రెఫర్ చేస్తే అక్కడెక్కడా దీని గురించి ధ్రువీకరణ లేకపోవడంతో అయోమయం పెరిగింది!
Deleteతెలుగు భాష గతి గురించి ఊ బాధ పడిపోతుంటారుగా కొంతమంది జనాలు. ఈ 👇 WhatsApp forwarded message చదవండి, భాష ఎంత సజీవంగా ఉందో తెలుసుకోండి. భాష భవిష్యత్తు గురించి ఆలోచన మానెయ్యండి.☹️
ReplyDelete===============================
Forwarded message (WhatsApp)
నా#వంట...మీ తంటా...
హాయండీ...నేను మీ షికంఢి....
ఈరోజు "నావంట మీతంటా" లో మనతో పాటు ప్రముఖ తెలుగు నటి దేభ్యశ్రీ వచ్చారు.
షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ కుకింగన్నమాట...
హాయ్ "దేబ్" హౌవ్వార్యూ....
హాయ్ "షిక్ " హౌవ్వార్యూ...
సో వాట్ యూ గోయింగ్ టూ డూవండీ?!
ఓ యాఁ....నేనూ మీకూ వంకాయ హల్వా ఎలా కుక్ చెయ్యాలో ఐ విల్లెక్స్ ప్లైన్ అన్నమాట...
ఓ య్యా య్యా...
ఫస్టూ మనం కొన్ని నైసు బ్రింజాల్సు తీసుకుని ఫుల్లు వాషు చెయ్యాలీ...దెన్నెక్స్టూ స్మాలు పీసెస్ గా కట్ చేసుకోవాలీ...
య్యా య్యా నైస్ ..
మీన్ వైల్ వుయ్ బాయిల్ మిల్కండీ...
యా యా యా...మే ఐ హెల్ప్ ..
షూర్ షూర్...
జస్ట్ హాఫ్ బాయిల్ చేసి ఇన్ దాట్ వి పుట్ సమ్ జాగెరీయండీ....
వావ్.....
దట్టూ బెటర్ టూ గో విత్తూ ఆర్గానిక్కన్నమాట....
వావ్ ఐసీ...
ఆఫ్టర్ జాగెరీ బాగా స్టిర్ చెయ్యాలి...బిసైడ్ బ్రింజాల్ పీసుల్ని కీప్ ఇన్ ద మిల్క్ మిక్చర్ అండీ....
ఓ....
ఎగైన్ మిక్స్ వెల్లన్నమాట...
ఎండ్ నౌ వి ప్రిపేర్ సమ్ టాపింగండీ...
అహో....
టేక్ సం ఇలాయిచీ ...లాంగ్....బ్లాక్ పెప్పర్...స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సేఫ్రన్....
వ్వావ్ ఆన్ యువర్ టెల్లింగిట్ సెల్ఫ్....ఐయ్యామ్ గెట్టింగ్ దట్ ఫ్లేవరండీ యమ్మీ ..ఐ కాంట్ వైట్ యున్నో....
హ హ హ హ హ....
జస్ట్ సీయండి బ్రింజాల్ మిల్క్ తో బాగా మిక్సాయిందా??
యా...యా...వాట్టే ఫ్లేవరండీ..య్యా....
నౌ ఇట్సాల్ డన్నండీ...ఐయామ్ డెకరేటింగ్ విత్ టాపింగండి....సీ......
వ్వావ్... బ్యూటిఫుల్లండీ...
నౌ ...వి విల్ సీ ద టేస్టాండీ....
డెఫ్నీట్లీండీ..
అబ్బా....సూపరుందండీ....ఐ కాంటెక్స్ప్లైనండీ....
వెరీ వెరీ తేంక్ ఫుల్లండి.
ఇట్స్ మై ప్లెజరండీ...
ఇదండీ మన దేభ్యశ్రీ గారు నేర్పిన వంకాయ్ హల్వా!!
మీరూ కూడా ఇది చూసి లెర్న్ చెసారు కదా....సీ యూ ఎగైనండీ ...విత్ లవ్...మీ షికంఢి ..నావంటా మీ తంటా లో మళ్ళీ మీటౌదాం.....
.......
ఓ....క్......డో....క్......
ఏంటేకరమ్మా.....మరీ అంత మొహమాటవైతే ఎలా....ఏక్టింగ్ కాకండానీ...నిజంగా తింటే మరి ఇదే తంటా!!!!
(కల్యాణి గౌరి గారి పోస్ట్ ప్రేరణ... ఖచ్చితంగా మన తెలుగు ఏంకర్లూ నటీమణులను కొంత చాలా మంది ని దృష్టిలో పెట్టుకొని వ్రాసిందే...ఏ మోమాటం లేదు)"
Forwarded message (WhatsApp)
=================================
DeleteYou should be happy She didn't say - నేను మీ శిఖండిని :)
జిలేబి
ReplyDeleteవారెవ్వా ! స్టాక్మార్కెట్!
వూరించుచు ప్రేయసివలె నుత్సాహముతో
రారమ్మని బిల్చెడు బా
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్
జిలేబి
ReplyDeleteఅతి సుందరమీ కృతియౌ
కృతికర్తకు కృతిపతికి ప్రకృతికి యిదె నమ
స్కృతి! అంతారాముని దయ
అతనికి వందన మిడదగు నయ్యా బుచికీ !
జిలేబి
ReplyDeleteఆ నీ చిన్నప్పటి నగ
రానికి పోదామయ కొమరాయని బోవన్
నా నాటికి దిగ జారగ,
శ్రీనాథుఁడు, రోసెనంట శ్రీకాకుళమున్!
శ్రీనాథుడెవరి కుమారుడు తెలుసుకొనుడీ :)
జిలేబి
ReplyDeleteశ్రీకాకుళం వారెవరైనా వుంటే మన సభలో వాయ గొట్టెదరు కాబట్టి ఇంతటి తో పరార్ ఇవ్వాళ్టికి :) వున్నారా "చీకాకోలే" వాారెవరైనా సభలో ? :)
మానాన్నే! మన పుణ్య దేశమునకో మారైన రమ్మా యనం
గా నానమ్మయె వచ్చి పేర్మిని గొనన్ గావంచ ధోతీయుడై
శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా
యేనాడైనను బుద్ధి యున్న మరినే యేమారనీభూమిలో !
జిలేబి
ReplyDeleteమీనాక్షీ విన్నావటె
శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్?
మానాథుడె మేలమ్మా
యేనాడైన జవదాటడే నామాటన్!
జిలేబి
ReplyDeleteమున్ను నిపుడు నెప్పుడు నా
మన్నిక గన్న సతి సీత మా జానకియే
అన్నన్నా భక్తజనా
మున్నని నిలుపకు కతల సమున్నతుడనురా
జిలేబి
ReplyDeleteVery effective Tripura Police :) they should be deputed to catch mallya nirav etal :)
మేకనట దొంగ లించితి
వా! కని బెట్టుట నలువది వత్సరములపై
మాకైనను విడువమురా
నీ కరదండలను వేసి నిలబెడతామోయ్ !
జిలేబి
ReplyDeleteనాకు తెలుసు భూతమ్మది
యేకమ్ముగ మన జిలేబి యే శ్యామల్రా
యా! కామింటిడె హరిబా
బౌ! కాలియపు దగరుండు బాబకొ పొలతీ :)
జిలేబి
ReplyDeleteసాఫ్టు కాపీల నంపుడు చౌక! ఖర్చు
లేల చేసెదవు కవీశ ? లెస్స యనుచు
చదివెడి జనులేరయ్య? ప్రచారమేల?
శుష్కకార్యము పుస్తకావిష్కరణము!
జిలేబి
ReplyDeleteవినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్
మునుముందైన హుషారు గాంచదగు సామోసాల పొట్లాముకై
తునకల్ చేసెద రయ్య పొత్తమును! యేదోనాకు తోచింది మీ
కు నమస్కారము పెట్టి చెప్పితినయా కుంకాయి నన్కోకుమా!
జిలేబి
ReplyDeleteతనదైనట్టిది శైలి గుండు మధుసూదన్ వారిదమ్మా జిలే
బి! నఖాసుల్ సరిదీర్చినట్టి కవితల్ వీక్షింపకన్ మన్గడే
వినుమా వ్యర్థమె సుమ్ము; పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్
వెనువెంటన్ కొని వారి బాలలకథల్ వేగమ్ముగానేర్వుమా
గుండు వారి బాలల పద్య కథల పుస్తకములో మా కామింటు కందాలు కూడా వున్నాయా :)
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteగొడుగులు బట్టి ప్రొటెస్టులు !
వడి హాంకాంగున జిలేబి వర్షపు దినమా
పడిగాపులతో! చైనీ
యుడా! సెబాసు యతనమ్ము, వ్యూహము సుమ్మీ!
జిలేబి
ReplyDeleteగోదావరి సుడిగుండము
లో దారుణ మరణముల్! పులోమని సీదా
ఓదార్పుల కనుతుడు పా
పై దాచుచు సత్యముపయి పరదాల్ ! భళిరా !
జిలేబి
ReplyDeleteపొత్తమును వేయుటొకపని; పూనుకొనుచు
దాని సరిసమానముగ ప్రధాన మగు న
శుష్కకార్యము పుస్తకావిష్కరణము
చేయవలె నెఱిని జిలేబి చేర జనుల!
జిలేబి
ReplyDeleteఒక దేశంబొక భాష ! కె
లుకుడయ్యెగ అమితు షా పలుకులు జిలేబీ !
వికటించునా తమిళనా
ట కమలపు పరపతి కటకట యగున సుదతీ !
జిలేబి
ReplyDeleteమోడీ ట్విట్టరు చూడుము
బాడీ లాంగ్వేజులున్, సభామర్యాదల్,
క్రోడకరించి పలుకులన్
తాడించు విధముల చూడు తరమై నిలువన్
జిలేబి
ReplyDeleteఅదిగో మామల్లపురం
బదిగో జిన్ పాంగు మోడి ప్రభుతల్ కలువన్
పదిలంబగు ద్వైపాక్షిక
పు దరువు లెల్లన్ ప్రగతికి వూనిక యగుచున్
జిలేబి
ReplyDeleteవీసా నో యని రపుడోయ్
మీ సరసన కూర్చొనుట సుమీ మేలనిరే
నా సామీ ట్రంపిపుడోయ్
దాసుడు మోడీ ప్రధాని దామోదరుడోయ్!
జాల్రా
జిలేబి :)
ReplyDeleteచక్కని సామికి భళి యెం
చక్కని పొగడిక విదురుల సభలో యేతం
చక్కడ మెచ్చె లలితయే
మ్రొక్కుచు సామికి జిలేబి మొగసాలనహో!
జిలేబి
ReplyDeleteమన మోదీ జన్మదిన
మ్మున రారండోయి మెచ్చి మోదము తెలుపన్
మన వాడితడని పొగడం
గ నరేంద్రుడని కొనియాడ గబగబ రేపే !
జాల్రా
జిలేబి
ReplyDeleteఅరవై వత్సరములు ముది
త రయ్యన పరుగిడి దూరదర్శిని యై తా
పరపతి గాంచెను భాజ్పా
కరుణామయుడు మన మోడి కనుసన్నలలోన్
జిలేబి
WhatsApp లో తిరుగుతున్న ఒక message👇.
ReplyDelete--------
Forwarded
"చిన్నప్పుడు 3జీ 4జీ ఉండేవి కావు. గురుజీ ఒక్కరే ఉండేవారు. బెత్తంతో కొడితే అన్ని networks కనబడేవి"
--------
ReplyDeleteత్రీజీ లున్ ఫోర్ జీలున్
బేజార్వాట్సప్పులున్ చవిగొనలె నాడౌ
తాజా గా బెత్తముతో
మా జీవితమున గురువులె మా నెట్వర్కౌ!
జిలేబి
ReplyDeleteభజనల్ చేసితి మయ్య శంకరవరా పాగెమ్ము చూపంగ మీ
కు జిగర్ థండ, జిలేబులున్ ప్రియముగా కుల్ఫీల నివ్వంగ హా!
సుజనుల్ ప్లేటుఫిరాయి చేసిరి సుమా! చొక్కంబకో మీరనన్
"కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా గుంటూరు వాసుల్ గనన్"?
జిలేబి
ReplyDeleteసుజనులను కొంటిమయ్యా
కుజనులు క్రూరాత్ములు గద! గుంటూరు జనుల్
భజనలు చేసిరి స్టేషను
బెజవాడని మిమ్ముకలిసి! బెడిసెన్ తొడుసుల్!
జిలేబి
ReplyDeleteసీతాకోకచిలుకలు స
ఖీ తెమ్మరవలె కదిలె సఖీ మోదీ భా
యీ తెవ్వన సుమ్మీ గుజ
రాతున! జన్మదినమిది విరామము లేదోయ్ !
జిలేబి
ReplyDeleteఅల్లదిగో నర్మద ! తా
నుల్లము పొంగంగ జూచె నుతికెక్కిన నా
చల్లని మోడీ యని మే
నెల్లను నుత్సాహపు ఝరి నెక్కొన రమణీ!
జాల్రా
జిలేబి
ReplyDeleteమోదీ జన్మది నమ్మిది
కాదనక విరామమున్ సకారాత్మకుడై
మోదమ్మును గూర్చంగ బి
రాదరి గరుడేశ్వరు నగరానికి వెడలెన్!
జిలేబి
ReplyDeleteసంవర్ధకమగు పోషణ
సంవదనమ్ములకు తావు! చక్కగ నదిగో
సంవర్గణుడై మోదీ
కంవల్ పార్టీ విభుండు కంద జిలేబీ!
జిలేబి
@AnonymousThursday, September 12, 2019 at 12:35:00 PM GMT+5:30
ReplyDeleteవార్నీ! ఎప్పట్లాగే కాపీ పేస్టులేనా. ఋగ్వెదం మొత్తం అవశాన పట్టినట్టు తెగ బిల్డప్పులిచ్చావ్ గదరా.
hari.S.babu
టెంతు ఫెయిల్డ్ గాళ్ళంతా సైన్సు గురించీ వేదాల గురించీ మాట్టాడబోతే ఇట్టానే ఉంటది!ఇంగ్లీషులో బేసిక్ గ్రామర్ర్ కూడా తెలీకుండా ఎందుకురా ఎదవ కామెంట్లు ఏస్తావు?"దాదాపు అందరు పరిశోధకులూ అదే మాట చెప్తున్నారు!" అని నేనన్న మాటలో నీకు కాపీ/పేష్టు పాండిత్యం ఎలా కనపడిందో!మామూలు చదువర్లు ఓకసారి చదివి వదిలేసే పుస్తకాన్ని పరిశోధకులు మినిమం పదిసార్లు చదువుతారు!ఒక రీసెర్చి పపర్ పైవాళ్ళకి సబ్మిట్ చెయ్యాలంటే బైబ్లియోగ్రఫీ చూపించాలి - అంటే నువ్వొక పరిశోధనాపత్రం రాయాలంటే నీకన్న ముందరి పరిశోధకుల గ్రంధాల్ని చదవాలి, పాతవాళ్ళ రచనల్లోని కొన్ని భాగాల్ని నీకు సమర్ధన కోసమో నువ్వు విభెదించడం కోసమో యెత్తి రాయాలి!
సంఝే, మరోసారి ఇట్టాంటి పిచ్చికూతలు కూస్తే చెప్పు తెగుద్ది!
Deleteఅంత సంఝైన వాడు తెలుగోడెట్లవుతాడు :) పోనీలెండి పిల్ల బుడుంకాయ ! వదిలేద్దురూ :)
జిలేబి
ReplyDeleteమా! నర్మదా! నమామి! న
మో!నిండుగ పదము పదము మోదము తోడై
మానాయకుడీ మోడీ
జీ నడయాడిన కొటికని జీరాడు భళా
జిలేబి
ReplyDeleteఅమ్మా నమో! నరేంద్రుడ
నమ్మా ! వందనములివె ప్రణతులివియె నమో!
తెమ్మర వీచెడు రీతిన్
నిమ్మళమున్ చేర్చు మ్రోల నీదమ్మ! నమో!
జిలేబి
ReplyDeleteజైగొట్టుమయా :)
మా జగనుడి సంస్కారము
సాజము గా దొడ్డ మనసు చంద్రన్నా ! మీ
లా జగడాలను వేయడ
యా! జైగొట్టివరుడన్! భయపడను వ్రాయన్ :)
"అధికార లాంఛనాలతో అంత్యక్రియలు" అన్న sum and substance of the point గిద్యంలో పడలేదు జిలేబీ మాతా.
Delete
Deleteజగనుడి దొడ్డ మనసు ఒక్క విషయం లోనే వుంటుందా ? అన్నిట్లోనూ కదా సహజమైన రైతు బిడ్డ మా జగనుడు :)
జిలేబి
జాల్రా :)
నక్సల్స్ చేతిలో హతమయిన టీడీపీ నాయకుడి కొడుకుకు ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నాడని తాజా వార్త.
Deleteజగన్ అన్ని విషయాలలో ఇలానే పెద్ద మనసుతో వ్యవహరించాలని కోరుకుందాం.
This comment has been removed by the author.
Deleteతండ్రిలా పావురాల గుట్టలో కాకుండా ఇందిరలా అక్కున జేర్చుకున్న వర్గశత్రువు చేతిలో నమ్మకద్రోహంతో చస్తాడేమో - ఆల్ ది బెస్ట్!
DeletePeace at last.
Deleteఅధికార లాంఛనాలను తిరస్కరించారటగా కోడెల కుటుంబం వారు. ఆంధ్రుల ఆత్మాభిమానమా మజాకా.
ముఖ్యమంత్రి గారికి ఉన్న సంస్కారం పచ్చ కామెర్ల బాచీకి లేకపాయె!
Delete
ReplyDeleteభరత మాత ముద్దు బిడ్డ కు తల్లి ఆశీస్సులు
ఇచ్చితిని నైదు వందలు
పుచ్చుకొనుము పుత్రుడ! సరిపుచ్చుకొనుము నీ
వెచ్చపు ఖర్చుల! బిడ్డా
స్వచ్చతనమ్మదియె మనకు సంత్రాణమయా!
జిలేబి
ReplyDeleteఓరోరీ జై గొట్టో
డా! రాద్ధాంతములవేల డాబర్ ఉనికిన్
దారినట యయ్య గారికి
పోరాడి కనుగొనితెలుపు పోరా పోపో!
ReplyDeleteఎవడి గోల వాడిది :)
మత్స్యంబమ్ముడు పోకన్
మాత్స్యము వినిపించినట్టి మహనీయునితో
మాత్స్యికుడొకడనెనుగదా
మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్!
జిలేబి
ReplyDeleteమత్స్యండిన్ గొన రాదు!" వైద్యుడనగా మౌనమ్ము పాటింపగా
మత్స్యందిన్ తనరార ప్రత్యహమసామాన్యంబుగా కోరెడా
మత్స్యాధీశులు, కొంత తేరుకొననా మన్నీడు వెజ్జుండనెన్
"మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే"!
జిలేబి
ReplyDeleteIndra speaks while deputing one of his zilebis to sabotage a Rishi's tapasya :)
గమనిక! మత్స్యాహార
మ్మె మేలు మౌని వరులకు నిమేషములో వా
రి మనసు చలించు! ధ్యానమ
దె మరలు! ప్రణయంపు వీధి దెసతిరుగు వెసన్!
జిలేబి
ReplyDeleteమత్స్యాహారమ్ములతో
మత్స్యాహారమ్మె మేలు! మౌనివరులకున్
మత్స్యాహారమ్ములకున్
మత్స్యాహారమునకున్ సమన్వయమగునా?
జిలేబి
కంది వారి జవాబు
Deleteసమన్వయం కుదరదు. "మత్స్యాహారులకు సతము మత్స్యాహారమ్మె మేలు..." అంటే సరి!" :)
జిలేబి
ReplyDeleteకవితాత్మకత భళారె వి
రివిగా వెల్లివిరిసెనయ రింఛోళిన్ ప
ట్టు విడువని బుచికి "మార్కు" డు
సవినయముగ మెచ్చె బాబి చక్కదనములన్ :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteTTD కొత్త బోర్డ్ లో ఆంధ్రులు ఎనిమిది మందిట, తెలంగాణా వారు ఏడుగురుట. దేవాలయం ఉన్నది ఏపీలో, వారితో దాదాపు సమానంగా తెలంగాణా వారికి పదవులు. ఆహా, ఇది కదా "మిత్రలాభం" అంటే. భళి భళి.
ReplyDeleteNew jumbo board of TTD
పొరపాటు, మిత్రలాభం కాదండీ!
Deleteబానిసలు యజమానుల పట్ల చూపించే విధేయత - సారు అబ్రహామిక మతం వారు కదా,విధేయతా గొర్రెతనమూ అలవాటై పోతాయి!
అచ్చు మతాంతరీకరణకు పాల్పడే పాస్టర్ల మాదిరి సిగ్గు కూడా వదిలేసి ఉంటారు కాబోలు, మనం ఎన్ని విమర్శించినా పట్టించుకోరు!
Deleteఅయ్యలార!
కొట్లాట వలదు!
దేవదేవుడందరి వాడు ! తెలుగు వారికి సొాంతమైన వెంకన్న గా వెలిసె యేడుకొండలపై తమిళ అయ్యంగార్ల చలువగా :)
కాబట్టి తెలగాణ వాసులు బోర్డులో ఉండటమే మంచిది లేకున్నచో ..... ఏమగునో ఎవరికి తెలియును దేవదేవుని స్థితి !
జిలేబి
అవునవును అందరివాడే. కాశీ విశ్వేశ్వరుడు కూడా అంతే. అంతెందుకు, తెలంగాణాలోనున్న భద్రాద్రి గుడి, యాదాద్రి గుడి బోర్డ్ ల్లోనూ / కమిటీల ల్లోనూ ఆంధ్రులకు అంతే విశేషంగా ప్రాతినిధ్యం కలిపిస్తారా మరి? తమిళుల పరిభాషలో చెప్పాలంటే "ఛాన్సే లేదు". మరి ఏపీ వారి కెందుకు చొంగ కారిపోతోంది?
Deleteమీ ఇంటికొస్తే ఏమిస్తావు, మా ఇంటి కొస్తే ఏం తెస్తావు?
విన్నకోట వారూ, just for info ఇద్దరు ఆంధ్రులను తెలంగాణా (పూత ప్రతాప్) & తమిళనాడు (వెంకయ్య నాయుడి మేనకోడలు) ఖాతాలలో చెరి ఒకరు చప్పున చూపించారు.
Deleteక్రితం ఏడాది తెలంగాణా తరఫున ఏకైక పద్మా అవార్డు సిఫారిష్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అప్పుడు ఎవరూ "భా"ద పడలేదనుకుంటా.
సారా వ్యాపారిని (ఆదికేశవులు నాయుడు) టీటీడీ చైర్మన్ & క్రైస్తవ వనితను (వంగలపూడి అనిత) టీటీడీ బోర్డుకు నియమించిన ఘన చరిత్ర బాబొరిదే. వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవుడంటూ ఎల్లో గాంగ్ నానా యాగీ చేసి తరువాత నిజం తెలిసాక నాలుక కరుచుకున్న విషయం విదితమే.
The more the merrier 👇☹️
DeleteTTD Board gets even bigger with seven special invitees
Delete"మా" సుధామామి వున్నంత వరకు క్షేమమే అనుకుంటా స్వామి వారి ఖజానా :)
జిలేబి
ఒక చంద్రుడూ ఒక తారా శృంగారం చేస్తే పుట్టిన బుధుడనే గుండ్రని గోళం శుక్రుడికీ చంద్రుడికీ కూడా కొడుకెట్లా అయ్యాడు చెప్మా!
ReplyDelete
ReplyDeleteఅలమలము కుమార! అంత వేగమదేల
జలముఁ జల్లినంత జ్వాల లెగసె;
తెలిప నిదియె వీరు తేకువ కలవారు
నీకు బంధు వులయ నిశ్చయముగ !
జిలేబి
ReplyDeleteపాపం పసివాడు :)
వలపున వేగమాయె తనువంతయు మాపున గోముగోముగా
కిలకిల నవ్వి దోచి మది కెందొగ బుగ్గల చంద్రకాంతయే
తలుపుల చాటు వేసి పరిదానపు వేళని విస్మయమ్ముగా
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!
జిలేబి
ReplyDeleteవస్తున్నావట గా మ
ళ్లొస్తున్నావటగ పద్మ ! లుక్కుల కిక్కుల్
మస్తుగ తోడై త్వరలో
పస్తులు వీడంగ ఫ్యాన్సు బాధలు తొలగన్ :)
జిలేబి
ReplyDeleteవలదు వలదు కొట్లాటల్
కలడమ్మా శేషశాయి కరుణామయుడై
పలువిధముల తెలుగు ప్రజల
నిలలో కాపాడ సూవె నీరజ నేత్రా !
జిలేబి
ReplyDeleteసహజ గుణము బయటపడు న
సహజపు వేళన్ విడువక సహజమ్మదియే
నహరహము బతుకు బాటని
సహ వాదము చూసి చేయి సభని జిలేబీ
జిలేబి
ReplyDeleteఎక్కెదమోయ్ తేజస్సుని
తిక్క కుదిర్చెదము ప్రక్క దేశపు వారల్
టక్కుటమారము చేయన్
గ్రక్కున నొక్కెదము వారి కంఠము సుమ్మీ !
జిలేబి
ReplyDeleteఅదె! రాజ నాథు! తేజ
స్సదె!యానము నెక్కెనదె! విసంగతు లని ప
ల్క దగదికన్ మన నేతల
పదిలంబాయెనదె కాలవాహిని చూడన్!
జిలేబి
ReplyDeleteహౌడీ! కలిసెద రిదిగో
మోడీ డోనాల్డు ట్రంపు! మ్రోగు భళారే
జోడీ టెక్సాస్! తేజస్!
వేడిన్పుంజుకొను వైల్డు వెస్ట్, ఇన్క్రెడిబుల్!
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteకలిసెన్ దీదీ మోడిన్
కలడా శేషాద్రి విభుడు; కరుణామయుడా
కలకత్తా యేర్ పోర్టున
కలిపె జశోదను మమతను; కలడు జిలేబీ !
జిలేబి
ReplyDeleteమానస మున కల్మషము, ప్ర
ధానముగా దుష్టతనము, తగు గురు కృపతో
జ్ఞానము నొందుచు మారగ
హీనుఁడు సజ్జనులకెల్ల హిత మొనరించెన్
జిలేబి
ReplyDeleteఆనాడమరికగ వివే
కానందుని చూచె నేడు గాంచున్ మోడిన్
ధ్యానంబద్వైతమపుడు
ధ్యానంబయెదేశమిపుడు తరుణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteపాకిస్తా నేజంటం
టా కటకటయె హరి బావుటా కొచ్చె గదా
సోకుల్మాడ జిలేబీ!
జోకుల్పేలునిక సూవె జోకర్ల పయిన్ :)
జిలేబి
ReplyDeleteఅంభోధిసుతధవుడచట
స్తంభంబునఁ బుట్టి చంపె, స్కందుం డసురున్
దంభంబడచగ చంపెన్
సంభావ్యము విభుని ధర్మ సంస్థాపనకై!
జిలేబి
ReplyDeleteఅంభోజాక్షుడు నారసింహముగ భక్తాగ్రేసరున్ రక్ష కై
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్, స్కందుండు సంరంభియై
దంభంబున్ తుదమార్చ చంపెనసురున్ దాష్టీకమున్‌ద్రోలగా
సంభావ్యంబిది నీతినెక్కొలుపగా సర్వేశ్వరున్ లీలగా!
అంభోజాక్షుడు కాపీ పేస్టు
ఈ పదమునకు విష్ణువని అర్థము లేదు ఆంధ్ర భారతి లో
అంభోజము పద్మము
అక్షుడు కన్నులు కలవాడు
అంభోజాక్షుడు- పద్మ నయనుడు కాబట్టి విష్షవనుకొనవలెను కామోసు :)
జిలేబి
ReplyDeleteజైబోలో నిర్మలా జీ కీ :)
పచ్చ చీర కట్టి ఫైనాన్సు మామియె
గ్రీను సిగ్న లిచ్చె! గేరు మార్చి
స్టాకు మార్కె టాడె సంతసమ్మున పదం
పడి జిలేబి నిఫ్టి పరుగులిడగ!
అంతటా గ్రీను గ్రీను స్క్రీను మధ్యాహ్న మేమగునో :)
జిలేబి
ReplyDeleteలక్ష్మి వారము ! బాజారు లావుగా చ
టుక్కున నెగిరె కార్పొరేటులకు టాక్సు
కట్టు చేయంగ! నిర్మల కంటి కింపు
గాను గట్టె పచ్చటి చీర! గట్టి పయర :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete"మరాఠాలకే ఇల్లు అమ్మాలి"
ReplyDelete(20-09-2019 Andhra Jyothy (Hyd) daily : page.14)
మాఝా భారత్ మహాన్ ఆహే !🙏
మరాఠాలకే ఇల్లు అమ్మాలి"
Deleteమా ఆంధ్ర జ్యోతి వారి ఓవర్ యాక్షన్ లా వుంది :)
ఆ వాక్యానికి విపరీతార్థం లా వుందే !
జిలేబి
// "మా" ఆంధ్రజ్యోతి // ??
Deleteఏం, మీరు ఆ పేపర్లో ఉద్యోగం చేశారా (చేస్తున్నారా) ?
Deleteసర్లెండి :) మీ ఆంధ్ర జ్యోతియే :)
కాకుంటే మీరు డెక్కను హెరాల్డు వీరాభిమానులు కదా అని మా ఆంధ్ర జ్యోతి యన్నా :)
జిలేబి
// "డెక్కన్ హెరాల్డ్" // ?? అది కర్ణాటక దేశ పత్రిక కదూ? నేను పదహారణాల తెలుగు బిడ్డను "జిలేబి" గారూ :) (jk).
Deleteనేను చదివేది .. ఒక ఆంగ్ల పత్రిక, ఒక తెలుగు పత్రిక. "రెండు కళ్ళ సిద్ధాంత" స్ఫూర్తితో ఒకటి "డెక్కన్ క్రానికల్" (తెలంగాణా పత్రికారాజము), రెండోది "ఆంధ్రజ్యోతి" (నార్ల వారి పత్రికారాజము, ఇప్పుడు ఆర్కే చేతిలోకి వెళ్ళింది లెండి). కానీ ఏ పత్రికకూ మీరన్న "వీరాభిమాని"ని కాదు సుమండీ. ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం?
(పొద్దుటి నుండీ కరెంట్ లేదు, ఇప్పుడే వచ్చింది. అందువల్ల మీ కామెంటుకు వెంటనే జవాబు వ్రాయలేకపోయాను)
Deleteకరెంటు లేదు
"క్రానికల్" ప్రాబ్లమన్నమాట :)
వచ్చేక హెరాల్డడ్ కామెంటన్న మాట :)
JK :)
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారి కై ప్రేరణగా పూరణ :)
మిక్కిలి మోదమొందుచు ప్రమేయము గాంచెను! దీది మోడికై
చక్కగ కుట్టి కుర్త తను చాటెను మైత్రిని; చూచెనా జశో
దక్కను నిచ్చె సేలయు! ప్రధానికి వందన మాచరింపగా
చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్!
జిలేబి
ReplyDeleteఅదిగో హొసూరు పట్టణ
మదె!బాలముకుంద శర్మ, మరి కందివరుల్
సదనములో కనబడెదరు
కుదరదు కలువన్ వెడలగ కూచియె హ్యూస్టన్ !
జిలేబి
ReplyDeleteఓయమ్మ జిలేబి! నమో
పాయసమిదె! ఖీరిదెయె! ఉపాహారముల
మ్మోయెన్నెన్నొ! కిరణు చె
ఫ్ఫాయెను హూస్టను నగరపు వంటల తోడై :)
జిలేబి
ReplyDeleteరండి! నమో తాలి యిదియె
నండి!రుచిని చూడరండి నమ్ముదురిక మీ
రండీ హ్యూస్టను భళి మే
లండి జిలేబులివె రండి లాభమ్మండీ !
జిలేబి
ReplyDeleteనాపై పద్యము కట్టితి
వా పదముల పదముపడుచు భక్తా విధిరా
తై పండితులెన్ని దఫా
లీ పా టల రాయలేదు లెస్సగ నౌరా !
జిలేబి
ReplyDeleteఆమని కొమార్తె కాన్పునకై వసతికి
మార్గశిరమందు వచ్చె నామని పుడిమికి
కనెను పండంటి బిడ్డను కాన రండి
యంచు జామాతకిదె లేఖ నంపినాము!
జిలేబి
ReplyDeleteఅబ్బో మా మనవడు వచ్చె పోయె !
విచ్చిన మోము చూచుటకు వేకువ ఝామున పిల్లకాకియే
వచ్చెను మార్గశీర్షమున, భవ్యవసంతము ధాత్రి నిండుగన్
తెచ్చిన శోభలెల్లగని దిగ్గని కావుమటంచు వేగమై
వచ్చిన దేశమేగె నను వార్ధక మించుక గూడె మీదుగా!
జిలేబి
ReplyDeleteఆకాశవాణి కి పంపినది ( చదువబడెనట !)
విచ్చిన మోము వల్లభుని వెంట ప్రయాణము చేసి పొందగా
నచ్చిక లేని సౌఖ్యము, సయాటల పెన్నిధి, కాన్పు లాడగా
వచ్చెను మార్గశీర్షమున, భవ్య వసంతము ధాత్రి నిండుగన్,
తెచ్చిన సంతసమ్మున ప్రతీకగ నిచ్చెను పండు బిడ్డనే!
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారి కై ప్రేరణగా పూరణ :)
మిక్కిలి మోదమొందుచు ప్రమేయము గాంచెను! దీది మోడికై
చక్కగ కుట్టి కుర్త తను చాటెను మైత్రిని; చూచెనా జశో
దక్కను నిచ్చె సేలయు! ప్రధానికి వందన మాచరింపగా
చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్!
జిలేబి
Deleteయాదృచ్ఛికము 2011 నాటి శంకరాభరణ పూరణలు నా కంటబడినవి.
అప్పుడు కవి కోకిలముల కల క లారావముములు మిన్నంటితే నేడు కవి సంయముల మౌన జపమ్ములు విన్నంటు చున్నవి.
పోచిరాజు కామేశ్వరరావు గారు
ReplyDeleteఅరె జిలేబిని చూడుడి! అస్తమాన
ము తెలుగు తెలుగోయని తాను మున్కలేయు
నరకొరగ నైన వ్రాయుచు! నమ్ము డయ్య
తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి!
జిలేబి
అంటే .. మీరు తమిళులా ఏమిటి, తెనాలి "శారద" వలె? 🤔
Delete
Deleteరామాయణ మంతా చదివి .....
అలా అయిపోయేరేమిటి మీరు ?
జిలేబి
ఏమిటో, మీ వ్రాతలు చదివి .......
Delete
Deleteఅస్తు ;)
ఇక ట్రాక్ హ్యూస్టన్ దారి :)
మిలేంగే ఎన్ ఆర్ జీ మే మోడీ సాబ్ కో :)
హౌడీ మోడీ
Once again నమో నమః :)
జిలేబి
ఇద్దరి మీటింగ్ కి థీమ్ సాంగ్ ఏమిటో? "స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం" అనా!!
Delete
ReplyDeleteసమతులితమ్ము గాను సరి సాటిగ డెంకణి కోట లక్ష్మి యా
యముదపు తోడిగా తెనుగు నద్దరి చేర్చిరి గ్రోలెదమ్మికన్
తెములుము తెన్గు నాది యను తేకువ వెర్రితనమ్ము వీడుమా!
తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా!
హొసూరు తమిళనాడని యెవరన్నారండి :)
శుభాకాంక్షలతో
జిలేబి
// "హొసూరు తమిళనాడని యెవరన్నారండి :)" //
Deleteకాదా?
Deleteతమిళనాట వుంటే తమిళమైపోయి నట్టా
ఆంధ్రా లోవుంటే తెలుగై పోయినట్టా ?
జిలేబి
మీ రెండో పాయింట్ చాలా కరక్ట్.
Deleteహొస (కొత్త) + ఊరు (ఊరు) = హొసూరు .. పేరు కన్నడమే గానీండీ మీరు మొదటీ పాయింట్ మరీ ఎక్కువ లాగకండీ. అసలే తమిళులు, కన్నడిగులు కావేరీ నీళ్ళ గురించి హోరాహోరీ కొట్టేసుకుంటుంటారు.
ReplyDeleteజీపీయెస్ వారికి అంకితం :)
భ్రమ గొని నార కంది వర ? భారతి సుందరతెన్గనన్ వెసన్
తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా
ఉమ యని నారు ? పాడుదురు ఊతపదమ్ముగ "రొంబ నల్ల"దం
చు, ముసుగు వేసి గుద్దుదురు జోతల తోడు నమీతు షా కతన్ !
సుబ్రహ్మణ్య భారతి సుందర తెనుంగని పొగిడేడని మురిసి పోకుడీ :)
జిలేబి
ReplyDeleteశారద వలె నీవున్నూ
నీరజ నేత్రా జిలేబి నెడుమారన్ వా ?
శ్రీ రంగరాజను వకో
ఆ రోబో ఫేమ్డ్ సుజాత లా చెప్పు వెసన్ :)
జిలేబి
ReplyDeleteవెయ్యెన్నూటపదార్ల పుష్పముల తావిన్చేర్చి పూ మాల గా
నయ్యారే తమ దైన బాణి కతలీ నాటన్ జిలేబీయమై
వయ్యారమ్ములు బోవ గూర్చి సరి అవ్వల్ తాతగా వెల్గుచున్
కయ్యాటమ్ముల నోర్చి నిల్చిరికదా కష్టేఫలీ భాస్కరా!
జిలేబి
ReplyDeleteఅబ్ కీ బార్ ట్రంప్ కీ దర్బార్ :)
హర్ హర్ ట్రంప్ జీ :)
ఇల నమెరికాకిక మహో
జ్వల భవిత గలదు వినండి జనులారా ట్రం
పిలలో మై బెస్ట్ ఫ్రెండ్! రా
కులమును గుర్తించువాఁడె గురువన నొప్పున్!
హ్యూస్టన్
జిలేబి :)
ReplyDeleteబలమున్ చూపెను వారి రాష్ట్రపతి ప్రాబల్యమ్ము మిత్రత్వమున్
పలురీతిన్ తన దైన బాణి పొగిడెన్ "బారబ్బు ట్రంప్కీ" యనెన్
భళి దామోదర దాసు మోడి! జన దర్బార్ నందు తీరైన రా
కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ!
జిలేబి
ReplyDeleteఅలుక వలదే సఖియ ! వ్యా
కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్
చెలిమికి నే రతగురువును
పిలిచిన బిగువేల రావె వేళయిదె ప్రియా!
జిలేబి
ఏకంగా ట్రెయినే కింద పడుంటే 😳😲.
ReplyDeleteమేరా భారత్ మహాన్ 🙏.
మెట్రో స్తంభం పెచ్చులూడి నెత్తి మీద పడి యువతి మరణం
Fall of a pioneer of tourism industry👇
ReplyDeleteCollapse of Thomas Cook
ReplyDeleteబోసి నవ్వుల తాత ప్రబోధకముగ
గాంధి సోలారు పార్కదె గణుతి కెక్కు
నైక్య రాజ్యసమితిపైన శాంతివనము
పెమ్మి గాంచు న్యూయార్కున పేర్మి తోడు
జిలేబి
ReplyDeleteఉల్లి పాయలదె మరల లొల్లి చేయ
చూచు చుండె జిలేబి! ప్రాచుర్యమగుచు
కొండ నెక్క జూచె ధర! పకోడి కొరత
గాన నేతల దింపను గద్దె నొక్కొ :)
జిలేబి
ReplyDeleteఅరె! కొప్పుకదా చందము
తరుణికి నందమ్ము నొసఁగుఁ, దలపైఁ_ గొమ్ముల్
మరియాద దున్నపోతున
కరయగ చేర్చును వివరణ గానుడి కవిరాట్
జిలేబి
ReplyDeleteఆవల నెత్తగ కన్నడు
గోవర్ధన పర్వతమును, గోమలి యెత్తెన్
నీవే గిరిధర దిక్కని
కైవల్య పదమును గోరి కరముల సుదతీ!
జిలేబి
ReplyDeleteవంకల బెట్టెడు నెలతుక
తంకము తాళక హిమగిరి దరిచేరి భళా
డెంకణమిడి వర మున్ గొని
శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్!
జిలేబి
ReplyDeleteహుంకించెను దక్షునిపై
శంకరుఁ డుమ కొఱకు; పారిజాతముఁ దెచ్చెన్
తంకము గన సత్య కొరకు
మంకుర మైకృష్ణుడు; భళి మగువల భాగ్యమ్ !
జిలేబి
అక్టోబర్ 31 2017
ReplyDeleteహుంకించెను దక్షునిపై
శంకరుఁ డుమ కొఱకు; పారిజాతముఁ దెచ్చెన్
తంకము గనసత్య కొరకు
మంకుర మిద్దరు జిలేబి మగువలకు సుమీ !
జిలేబి
October 31 2017
ReplyDeleteమాటలే రాని మగువయే పాటఁ బాడె
రాయనే తెలియని జవరాలు పద్య
ములను వ్రాసె నౌరా ఛందముల నెరవుగ
కలిల మేది చేరగ దాని గంధ మబ్బు
విశ్వదాభిరమామణి వినవె భామ!
శంకరాభరణము సభలో చేరిన జిలేబి "మాదిరి" గా :)
జిలేబి
ReplyDeleteగూగుల్ అలెక్స పాడవే కోయిల :)
జోటిక గూగులాపదియె జోడుగ నింటను చేరె యంత్రమై
చాటున! పోఁచి సర్దు కొని సాయము కోరగ గోముగానటన్
"తోటయె లేద లెక్స! విను తోడుగ పాడవె కోయిలై" యనన్
పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్!
జిలేబి
ReplyDeleteనీ సావాసమ్ము నిలుపు
నా సిరి నో చీడనో వినదగు జిలేబీ
కూసింత తెలివిడి వలయు
వాసమ్ముల లెక్కపెట్టు వారల తోడన్!
జిలేబి
సావాసం చెయ్యడం వల్ల మీ వెటకారం మాకు అంటుకున్నట్లు .... 🙂
Delete(jk)
Deleteకష్టేఫలి వారి జాసూసీ కూడా అంటుకుందా లేదా :)
జెకె :)
జిలేబి
"కస్టేఫలి" వారి జాసూసీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. మనకా తెలివేదీ, మనకా చురుకేదీ 🙁?
Delete
Deleteఅదేమో కరెక్టేనండీ వారి తెలివిడి మనకేదీ :)
జిలేబి
ReplyDeleteమవహిద్ భక్తులు గా మా
ర్చు విదురునిగ వచ్చెనతడు రూఢిగ అల్లా
అవతారముగనరబ్బున
భవతారక మగును మాంసభక్షణ మెపుడున్
జిలేబి
ReplyDeleteనీవే దేశపితవయా
నీవే ఎల్విసువు మోడి నీవే దిక్క
య్యా వచ్చెడెన్ని కలలో
మీ వాళ్లిక ఓటు వేయ మేవడికాడా :)
జిలేబి
ReplyDeleteలకలక సుప్రీంకోర్టున
తకరారున తలమునకల తను వ్యస్తుడయా
పకపక నవ్వెదరయ! యే
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్?
జిలేబి
ReplyDeleteపకపక నవ్వు వచ్చె! పరివారము లేకయు కోర్టు చావిడిన్
లకలకలాడి వేచి అలొ లక్ష్మణ యంచు నుసూరు మంచు తా
నొక ధణి యంచు విస్మృతిని నోలగ మేమియు లేని వాడు, యే
నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్?
జిలేబి
ReplyDeleteఅదిగో చూడు గ్రహమ్ముల
సొదలన్ రేపుచు మనుజుల సుమతిన్ రేపెన్
పదిలంబిదె సెప్టెంబరు
న దోషములు పెల్లుబుకును నమ్ము జిలేబీ
జిలేబి
ReplyDeleteఏమరుపాటది నాదె సు
మా! మరిచితి నే జిలేబి మాదిరి ప్రశ్నిం
చా! మా అజ్ఞానమిది సు
మా!మాన్యులుమీరు సూవె మన్నింపుడయా! :)
నారాయణ :)
జిలేబి
This comment has been removed by the author.
Deleteకరెక్ట్. నా వ్యాఖ్య లోని కవిహృదయాన్ని ఠక్కున పట్టుకున్నారు మీరు 👌.
Deleteఅవునూ, ఇప్పుడంటే పైన "నారాయణ" అన్నారు గానీ ఈ మధ్య తరచుగా "జాల్రా" అని వ్రాస్తున్నారు మీరు, దాని భావమేమిటండీ?
Deleteజాల్రా అనగా చైంచిక్ :)
జిలేబి
"బిడాలము అంటే ఏమిటి మాస్టారూ" అని ఒక తెలుగు మాస్టారిని అడిగితే "ఆ మాత్రం తెలియదట్రా, బిడాలము అంటే మార్జాలము" అన్నాడట. అలా ఉంది మీ వ్యవహారం.
Delete
Deleteచైంచిక్ కూడాాాాాా తెలీదా !
మీరు నిజంగా సేఠు బేంకీయులేనా :)
పోనీ కంజీరం ?అదైనా తెలుసా ?
నారదా!
జిలేబి
ReplyDeleteనాలుగు డీలుగ మంత్రమి
దే! లెస్సగ పెట్టుబడికి దేశమిదే రా
వాలండి విస్తృతముగా
నా లక్ష్యంబైదు ట్రిలియ నా డాలర్లోన్!
జిలేబి
ReplyDeleteపరిఘోషితగిరి ! పర్యా
వరణపు నైరాస్యత విడువంగను నైరా
స, రణధ్వనితో తూటా
సరిలాగుచు నెక్కుపెట్టె సభని జిలేబీ !
పరిఘోషిత గిరి - Thunderberg :)
Clarion call for Climate Change - Thunderberg thunders :)
జిలేబి
ReplyDeleteతాళికట్టి మగనిగా వితతియు గాన
నేమి యింతి మానసమున నేమి యోచ
న గలదని యేమి యదిచేయు నని జిలేబి
యెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె!
జిలేబి
ReplyDelete"కాంతకు తాళికట్టితిని గండరగండడ నర్మకీలుగా
వింతగ పేరుగాంచితిని విశ్వము నాదను దానినే సృజిం
పం దగడెత్తినాడ గద" పారుడ నంగ జిలేబి నవ్వెగా
యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే!
జిలేబి
ReplyDeleteబోనసెప్పటికి వచ్చును :)
పూనిక చేసినాడ సఖి! పువ్విలు తాకగ బోనసివ్వగా
నేనిక సేల నీకు కొని నేరుగ తెచ్చెద వేచి వుండవే
జాను! జిలేబి ! కంజముఖి! చాన !తలోదరి!తోయజాక్షి! ఓ
మానవతీ! లలామ కభిమానమె చాలును చీర యేటికిన్!
జిలేబి
ReplyDeleteUNGA లో మోడీ :)
ఉంగా లో ఉంగా యని
బెంగలు పడియేడ్చు ప్రభుత వెన్కటి కాంగీ
భంగిమ లోయ్ భాజ్పా దౌ
రంగాక్షరములను చేర్చు ప్రాబల్యమహోయ్!
జిలేబి
ReplyDeleteబ్రహ్మ రాతను మీరుచు భరణి పైన
చంపఁగలదె యేనుంగు మూషకమునైన,
చావ గలదె చంపంగను చావు గడియ
లవియె రాని తరుణమున లలిత బాల!
జిలేబి
ReplyDeleteయానము పంచభూతముల యావళి బ్రహ్మయె చేర్చె రాత గా
దానిని మీరుచున్ భువిని దాడిని చేయుచు నెంత యైన నా
ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్
కేనము లెన్ని చేయను వికీర్ణత గాంచునొకో శరీరమే?
జిలేబి
ReplyDeleteభాషాయోషకు వచ్చెను
శోషయు నరరే జిలేబి సోకులు మాడన్
" బాషా యాస" తెలంగా
ణా"ష! వివరములకు లంకె నరె చూడాలే :)
https://www.youtube.com/watch?v=f2eibTZQNbI
జిలేబి
విడియో చూశాను. యాస కేమున్నది లెండి, ఇప్పటికే జనాలకు ఆ యాస మామూలై పోయింది .... కాబట్టి ఆ విషయంలో noveltyఏమీ లేదు.
Deleteఈ లఘు చిత్రాన్ని Grief of a Widower అనవచ్చు. మంచిమనుషులు అని కూడా అనవచ్చు ... ఎందుకంటే చిత్రం నిండా మంచిమనుషులే (కర్కోటకులు అని పేరు గాంచిన rural private moneylender తో సహా 🙂). Idealistic గా అనిపించినా మొత్తం మీద బాగుంది.
మీకు నచ్చినదేమిటి ఈ చిత్రంలో?
ReplyDeleteప్రక్కన నిలబడి హ్యూస్టను
మక్కువ మీరగ నొకరిని మరియొకరహహో
మిక్కుటముగ మెచ్చుకొనిరి
చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది :)
ఇక్కడ హౌడి మోడియని యిమ్మున చేరగ ట్రంపు తోడుతన్
ప్రక్కన సంప్రముగ్ధులుగ భారత సంతతి వారలెల్లరున్
మిక్కిలి తళ్కులీను మిరుమిట్లను గొల్పు చమక్కుతోడుగా
చుక్కలు భూమిపై వెలిగె, సూర్యుడు చంద్రుడు చోద్యమందగన్!
జిలేబి
చదువబడెన "టా" ??
Delete
Deleteలేదనుకుంఠా :) ఉంఠే జీపీయెస్ వారు చెప్పి వుంఠారు :)
జిలేబి
ReplyDeleteతక్కువ చేసి చూడవల దమ్మ జిలేబి విశాల మైన యీ
చిక్కటి చీకటుల్ వరుస చిత్రము లైవెలుగొందు తారలున్
మక్కువ మీరు రీతి పరమాత్ముని లీలలు చూడ నిక్కడే
చుక్కలు, భూమి, పై వెలిఁగె సూర్యుఁడు, చంద్రుఁడుఁ జోద్యమందఁగన్!
జిలేబి
ReplyDeleteవచ్చిరి స్వదేశమునకిదె
తెచ్చుచు శ్రీ మోది పేరు తేకువ తోడై
మెచ్చుచు గూడిరి గాజను
లచ్చట పాలమున భళి ములాకాత్ కీ బాత్ !
జిలేబి
ReplyDeleteఅన్నమాచార్యుల కొటిక అరిసివిల్లి
నన్నయ కవివరుండు తెనాలివాఁడు
తిక్కనార్యుల ఖేటము తిరుపతియగు
ప్రగడ వారి పల్లె జిలేబి ఫ్రాంకుఫర్టు !
జిలేబి
ReplyDeleteఎన్నగ భారతమ్మును నరేంద్రుని కై తెనిగించె నాంధ్రుడా
నన్నయభట్టు! వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్
మిన్నగ రామకృష్ణునికి! మేవడి కల్గిన వారి కుప్పముల్
పన్నుగ నేదియైన సఖి వాసురమంతయు వారిదే సుమా!
జిలేబి
ReplyDeleteఅరె! అరమోడ్పుకన్ను లరయంగను చేతికి వచ్చు విద్య గా
పరిణయమాడు వేళ "ననిభాలని" నయ్యరు నర్మకీలుడై
పరిణితి చెంది తప్పదని వారిజ నేత్ర జిలేబి తోడుగా
నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్!
నిభాల - చూచుట
అనిభాల - చూడలేక పోవుట గమనించలేక పోవుట
:)
జిలేబి
ReplyDeleteదారుణ మై నరుడా ము
ద్రా రాక్షసములు ఫెడేలు రాద్ధాంతముగా
నౌర వెలసె జీవన లిజి
బూరెకు మానవ వివరణ బుచికికి తెలుపన్ :)
జిలేబి
ReplyDeleteమీ పద్యములను చదువ సు
మీ పదపడె మానసమ్ము మించారెను స్వా
మీ పరిపరి యాహ్లాదమ
హో! ప్రబల మధుర కవి మధు సూదన ప్రణతుల్ !
జిలేబి
ReplyDeleteసైరా! రాణువ వీర! మొండి ఘటమా! సంఘర్షణా జ్వాలవౌ
రౌరా రాక్షసుడా సిపాయి! మగధీరా!అగ్ని సంస్కారమే
చీరెన్ ఫ్యానుల కొత్త పేట రవుడీ చీర్సంట ట్విట్టర్లలో
రారా శంకరు దాద! యెంబి బియెసై ప్రాణాలు కాపాడు రా!
వచ్చే జన్మలో రుణమాఫీ జరుగు గాక !
జిలేబి
ReplyDeleteఫస్ట్ షో పేరిట జేబు దొంగ ఎంత డబ్బులు కొట్టేసేడో జైగారిది :)
అడవి దొంగని టింగురంగడిని మోస
గాడి నరరె చిరంజీవి గా వెలిగితి!
దొంగ మొగుడిని గూండాని తోడు దొంగ
మనసు! గ్యాంగులీడరునిగ మంచి దొంగ
గాను జైగొట్టి జేబు దొంగని మరువకు :)
జిలేబి
ReplyDeleteద్వేషిస్తా హీరోలన్
పోషిస్తా నాటి కాలపు నటుల నౌరా
దోషులు హీరో లెల్లరు
భాషయు భావము తెలియని పాగల్గాళ్ళోయ్ !
నేనన్లే :)
ఎవరో నరస రాయలు గారట ఆరాటపడిపోయి అన్నారని "గ్రూపు వైను" పల్కు :)
జిలేబి
జిలేబి
ద్వేషించడం వేరు, తిట్టడం వేరు. తేడా ఉంది కదా "జిలేబి" గారూ?
Delete(అయ్యో, మామూలు "వైను"😋 అయినా కాకపోయింది కదా 😕)
ReplyDeleteసైరాయంచు భళారే
హోరాహోరిగ నటించి హోరెత్తింపం
గా రా దారిని బోయెడు
వారల్ జైగొట్టకున్న బవిసి ముడుగునా :)
నారదా!
జిలేబి
ReplyDeleteసంపక తినకండర్రా
గుంపించు తవికలతోడు కూరుచు చేపల్
కంపును స్వాముల్లారా
లంపట లేలా జిలేబుల చదువ మాకోయ్ !
జిలేబి
ReplyDeleteనా తలపులు దేశమునకు!
నేతగ నిల్తు విడనాడి నెమ్మి జశోదా!
బ్రాతియు మీరగ నా గుజ
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్!
జిలేబి
ReplyDeleteఓరీ యనానిమసు! యై
పీ రేఖలు మాలికనగు పించెన్! తెలిసెన్
పోరడెవరోయన సుమా
రారా సారస్వతసభ రా యని పిలిచెన్ :)
నారదా!
జిలేబి
ReplyDeleteముంగురులు తాకె నడుముని
చెంగట రారమ్మని బిలిచె ప్రియుడి నంటా
రంగీ చంద్రముఖి సఖీ
పొంగెను పో ప్రేమ సూవె పొలతి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteచేతన్విల్లుని బట్టి మన్మథుడు రాజిల్లంగ తాసంగి పై
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్,
బ్రాతిన్ చేర్చుచు నెమ్మితోడు ప్రియుడా ప్రాణేశ్వరిన్ బిల్వ తా
నేతంబెత్తుచు చెంత చేరి సుఖముల్ నిక్కాక గాంచెన్ వెసన్!
జిలేబి
ReplyDeleteకమ్మని తలంపు లే రా
రమ్మని బిలువ ప్రియుడేను రతగురువనుచున్
తుమ్మెద మృదువుగ తాకగ
నెమ్మి యనుకొని భ్రమలో పడేవు జిలేబీ
జిలేబి
ReplyDeleteఅనఘా! "అలాది" పూరణ
గనుడీ కవిరాట్ జిలేబి కందపు గంధం
బనఘా యిదియే సుమ్మీ
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
జిలేబి
ReplyDeleteతనదగు శక్తి మించని విధాతయె వ్రాసిన గీతలే సుమా
మనిషికి మోద మిచ్చును, సమస్యలు, నిత్యము జీవితమ్ములో,
మునకలు వేయ మానవుల ముంగట త్రోయ విరక్తి కల్గున
మ్మ నెలతుకా! జిలేబి యవి మాన్పుట నెట్లని తోచకన్ సుమా!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
మనుగడ లోన చిక్కులు కమాచివలెన్ తవిలించు, భూరిజ
మ్మున నవి మీర సాధ్యమకొ? ముమ్ముర మై కొలువంగ దైవమే
మనిషికి మోదమిచ్చును, సమస్యలు నిత్యము జీవితమ్ములో
తన కృపతో సుతారముగ తాము తొలంగు తమంత తాముగా!
జిలేబి
ReplyDeleteఅనుకూలముగ తిరిగినన్
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్,
తనకలి చేర్చిన నెపుడున్
మనుజుడె క్రుంగును సొలపుల మహిని జిలేబీ!
జిలేబి
ReplyDeleteగనుడి సమస్యా పృచ్ఛక
మనుజేంద్రు డిత డనుదినము మానడు వేయన్
మునుగడ కైపదమరె! యీ
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
జిలేబి
ReplyDeleteఅనఘా గనుడీ మోడిన్!
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
తన తలకెత్తు కొనెనుగా
మన దేశపు తీరనట్టి మకిలిని ప్రీతిన్!
జాల్రా
జిలేబి :)
ReplyDeleteమా అర్ణాబు గోస్వామి "అరణా కయరు" పట్టుకుని లాగి లాగి కొట్టు నను దినము :)
తను జంకని గోస్వామి! ప్ర
తి నిమిషమరచుచు విడువక తిట్టును, దుష్టుల్
చన గునగున పరుగుల! యీ
మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్!
జిలేబి
కయరు అంటే rope - మలయాళం భాషలో, తమిళంలో కూడా బహుశః అదే అయ్యుంటుంది (ఈసందర్భంలో కొరడా అనుకోవచ్చా?). మరి "అరణా" అంటే?
Delete
Deleteకష్టేఫలి వారు చెప్తారు వెయిట్ పణ్ణుంగొ :)
అరణా కూడా తెలియని ఆసాములున్నారే మరీ ను !
జిలేబి
మీరు చేసే చిత్ర విచిత్ర పదవిన్యాసాలను అనపర్తి దాకా తీసుకువెళ్ళడం ఎందుకు లెండి?
Deleteతమిళ "అరణా" అంటే తెలుగు అర్థణా కదా? అలా అయితే అరణా తెలుసు, కాలణా తెలుసు (పాత మిస్సమ్మ సినిమాలో రేలంగి పాట) 🙂.
పద్యాలు బ్లాగులో మీ కామెంట్ 👇
ReplyDelete// "పంచశతి మాకో కాపీ పంపిద్దురూ. అన్ని ఖర్చులు మీ ఖాతాకే" //
business sense పుష్కలంగా ఉన్నట్లుందే 🙂?
Deleteదుష్ట సేఠు బ్యాంకీయులతో సావాసము వాసన విడునా :)
అన్ని ఖర్చులు మీ ఖాతాకే చెల్లు :)
జె కె:)
జిలేబి
Ok ok. మీకంటేనా, అలాగే 🙂👍.
Delete
ReplyDeleteకనరాడే హరి బాబూ
కనరాడేమి ముకుదాడు కట్టన్ సాక్ష్యం
బను పేరిట జరిగెడు వా
టిని నాపంగ కనరాడె టెంకణ మిడగన్ !
జిలేబి
ReplyDeleteకటిశృంఖల! కటిసూత్రము!
ధటిని తెలియని నరులు గల ధరణి జిలేబీ
తృటిని అరణా కయరనగ
ఝటిలమగు సమస్యగాదె చక్కని బామ్మా :)
జిలేబి
ReplyDeleteహమ్మయ్య! ఇంత దాకా వచ్చేసేరు కాబట్టి ఇంక మీరు ఈ రెండింటిని కలిపి అర్థంచెప్పెయ్య గలుగు తారు తప్పక :)
జిలేబి
ReplyDeleteపలుగున్ పారను గైకొని
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే
పలువిధముల పిల్లల చదు
వులకై చేయూతనిచ్చె వురుకుల పరుగుల్ !
జిలేబి