Thursday, October 13, 2016

కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)


 
 
 
కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
అరచూపు! వాలుచూపు బె
దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
బి రుసరుస చూపు తా కను
లెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
చీర్స్
జిలేబి
 






212 comments:



  1. విద్యుత్తూ విద్వత్తూ
    నాద్యంతము చుక్కెదురులన దినంబున మా
    వేద్యంబు టీవి ప్రాసం
    గోద్యము లా మనవరాలు కోరు ప్రోగ్రామ్స్ !

    జిలేబి

    ReplyDelete



  2. మన చారు యరవల రసము
    గుణంబొకటిగాదు! చారు ఘుమఘుమ లాడున్
    మన పోపు విష్ణుమాయన్
    వినవోయి జిలేబి రసము విడు చారుగొనూ :)

    జిలేబి

    ReplyDelete


  3. పదముల విభజన తెలియక
    చదువను తెలియన గుణితపు జంజాటములన్
    పదునుగనవలెను పడిపడి
    చదువుచు తాత్పర్యములను చట్టున రమణీ !

    జిలేబి

    ReplyDelete


  4. అదిరిందా ? కుదిరిందా ?
    ముదిరిందా! నా పరాకు ముద్దుల విద్యు
    త్నదురుల దాగెన్బోవే !
    కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !

    జిలేబి

    ReplyDelete


  5. ఎట్టెట్టా సూపర్గా
    పెట్టేర్గా వేడిమీద, పేష్కారుల్నీ
    గొట్టేరు బోల్డు గన్నూ
    గొట్టాంగాళ్ల కికలేదు గొడ్డూ గోదా !

    జిలేబి

    ReplyDelete


  6. అలనాటి సంధ్య వేళన
    చెలికాడి సరసపు లాట చేసిన సెగలన్
    వలపుల దోచిన తొలి వే
    ళల వయ్యారము గుసగుసలాడె జిలేబీ

    జిలేబి

    ReplyDelete


  7. చంద్రముఖీ గనుమోయీ
    రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే,
    యాంధ్ర కవిత్వపటుత్వపు
    కేంద్రమదియెనయ్యె కళల కేదారంబై!

    జిలేబి

    ReplyDelete


  8. బంధాలనుబంధాలన
    నెందులకే సందియంబు నెచ్చెలి పద్మా !
    పిందెకు చెట్టుకు గలదే
    బంధము నొకటి మరొకటికి బాంధవి తెలియన్

    జిలేబి

    ReplyDelete


  9. అక్షరముల బోలి మరి
    న్నక్షరములు యున్ననూ మనమదిన్ భావం
    బక్షయము గాన రమణీ
    వీక్షించ వలయు కవిత్వ వినువీధులనూ !

    జిలేబి

    ReplyDelete


  10. బ్రహ్మ కడిగిన పాదము పావనమ్ము
    యేడు కొండల రాయుని యెలమి‌ గాంచి
    కాసులమ్మ లచ్చి కరుణ గాను మమ్మ
    జీవనమ్మునందు జిలేబి సిరియు బడయ !

    ReplyDelete


  11. విశ్వ మోహన కారుడు విపులమయ్యె
    బతుకు బండిని నాతడు బంతి జేసి
    కాలమగుచు తా భువిలోన గాన నయ్యె
    వెదుక నాతడు వెనువచ్చు వెంకటేశు !

    జిలేబి

    ReplyDelete


  12. అమ్మ గౌరమ్మ గావమ్మ యన్ని నీదు
    రూప గుణముల మూలమ్ము రూఢి గాను
    వెలసె నిలలోన నంతయు వేద మగుచు
    వివిధ కాలము నందును విరివి గాను !

    జిలేబి

    ReplyDelete


  13. కుంచె కదలదు కదలదొక
    యించుక పద్మా కలంబు యీభువి నందున్
    మంచి నిబంధనలలరుచు
    మించన బంధము వలయు సుమీ కారుణ్యం!

    జిలేబి

    ReplyDelete


  14. చుట్టపు చూపుగ వచ్చితి
    పట్టపు రాణియనుకొంటి పగటికలలలన్
    గట్టిగ గంటి జిలేబీ
    చుట్టగ తా చాప నేను శూన్యంబైతిన్

    జిలేబి

    ReplyDelete


  15. ఈపొత్తంబుగ వేయుచు
    నే పొందు పరిచెద రామ నీగానములన్
    నే పాడెదనూ రామా
    నోపిక యున్నంతవరకు నోరారన్నిన్ !

    జిలేబి

    ReplyDelete

  16. కమలయొకతె కనకన యని
    కమలాప్తుని రశ్మి సోకి కమలె, గమలముల్
    ఘుమఘుమ లాడుచు విరిసెను
    రమణీ! పేరులొకటైన రమ్యంబొకటౌ ?

    జిలేబి

    ReplyDelete


  17. నా నాలుకగను రుచి రా
    మా నీ నామంబుగాన మరిమరి యనెద
    న్నీ నామంబును, రామా
    నానాటికి తీపినిచ్చు నామము నీదే !

    జిలేబి

    ReplyDelete


  18. రాంభట్ల పార్వతీశ్వర !
    యంభోజుపదమ్ములందు యవధానంబున్
    సంభారము సెహభేషను
    సంభవమౌ వేంకటేశు సాన్నిధ్యమునన్

    జిలేబి

    ReplyDelete


  19. లెక్కల మాటున దాపిన
    నొక్కిన దస్కము జిలేబి నొకపరి జూసెన్
    బొక్కసపు లెక్క తేల్చగ
    యెక్కడి తలనొప్పివచ్చె యేమందును బో !

    జిలేబి

    ReplyDelete


  20. నల్లధనమ్మట నొకడౌ
    చిల్లర పదివేల కోట్లు చిట్టా తెలియన్
    పిల్లోడు రాసె చిట్టీ
    గల్లా లెక్క బురఖాలు గల్లంతెట్లౌ :)

    జిలేబి

    ReplyDelete


  21. సింకార్డులేని మొబయిలు
    ఘీంకా రంబులన భుక్తి గీతము పాడెన్
    కుంకల కేమి తెలియు నా
    ఢంకా భాజా జిలేబి ఢమఢమ లాటల్ :)


    జిలేబి

    ReplyDelete


  22. మదినిచ్చిగిచ్చితివిబో
    పదునుగ గుచ్చగను హింది పాటల గంటీ !
    కుదిరెను పదములు చకచక
    బెదురక నేనిక తెలుగున పేల్చెద హిట్లన్ :)

    జిలేబి

    ReplyDelete

  23. గురువా ! గుట్టుగ రాస్తుం
    టి!రట్టు జేయకు జిలేబి టింగని వచ్చున్
    బిరబిర గాలిని బీకున్
    పరువును కాపాడవయ్య పలుకుల రాజా :)

    జిలేబి

    ReplyDelete


  24. నాకంటే బాగా తెలు
    సా కుందనబొమ్మకోయి సవివరము గనన్
    నాగూర్చొకమార్రాసి వి
    వేకానందుల టపాను వేసితి నన్నా :)

    జిలేబి

    ReplyDelete


  25. చూడన గుండ్రము గానుం
    డూ ! డబ్బా చదురమోయి, డూపరు టేష్టౌ
    వేడిన త్రికోణ పిజ్జా !
    జోడుగ కోలాహలంబు జోరుగ గనుడూ :)

    జిలేబి

    ReplyDelete


  26. ఓహో యెంత మధుర మో
    యీ హంసల హావభావ యిష్టాయిష్టం
    బౌ హాసంబులు మేని
    న్నాహార్యంబులు జిలేబి నాజూకులునూ !

    జిలేబి

    ReplyDelete


  27. ఔరా హితముల జెప్పెడి
    వారల కీ లోకమందు వాసము గలదా !
    పోరీ జిలేబి పోరుల
    హోరా హోరీ గనుము నహోరాత్రంబుల్

    జిలేబి

    ReplyDelete


  28. మోక్షపు మార్గము గనుమూ
    మోక్షణ మదియే జిలేబి మోహము బోవన్
    వీక్షించగ నంతయునూ
    సాక్షీ భూతముగనుండు సనతుని లీలల్

    జిలేబి

    ReplyDelete


  29. యేలేటి చంద్ర శేఖర !
    మాలావౌ కథల గూర్చి "మనమంతా" పూ
    మాలవలె బేర్చి మోహన్
    లాలుకి "విస్మయ" తెలుంగు లబ్జుగ గరిపెన్ :)



    జిలేబి

    ReplyDelete


  30. చక్కగా వచ్చె తెలగాణ చంద్రుడిచ్చె
    హామి, జనులార తెచ్చెద వరద లున్ను
    మేలు వర్షంబు సంద్రము నేర్పరచగ
    హైదరాబాదులోన నౌకాశ్రయంబు !

    జిలేబి

    ReplyDelete


  31. పూరించగ శంఖమ్మును
    సారధి, వడవడ వణికిరి జనులెల్లరటన్
    గారెను రక్తమ్మేరుగ
    పారెనదో సెగ లొలుకుగ పార్థుని శరముల్

    జిలేబి

    ReplyDelete


  32. శరణుయన శరణు నిచ్చుచు
    వరమడుగగ నిచ్చితీవు వరముల, రామా
    పరమపద మడుగు వారము
    కరుణను జూపి దరిచేర్చు కరుణాకరుడా !

    జిలేబి

    ReplyDelete


  33. అంత సులభమా స్వామీ
    కొంతయు తొలగించ నహము కొండగ నుండెన్?
    నింతయు రాముని తలువన్
    వింతగ బోవును జిలేబి విజ్ఞత గలుగన్ !

    జిలేబి

    ReplyDelete


  34. కోకిలొక్కటి పాడెనేయని కోరి శర్కరి వెళ్లనే
    తాకినంతన తా ఫెడేలని ధారణమ్ముగ వ్రాసెలే
    యేక మాయెను మార్గమెల్లను యేక మవ్వగ వేదమే
    నాకమొక్కటి తాను గాంచి సనాతనమ్ము‌ను నేర్చెనే

    జిలేబి

    ReplyDelete


  35. వై వీ ఆరెస్స్ చెప్పుడు
    నోవా చేరా కథేమిటోయని యడిగెన్
    రావు తెలుసుకొన! మాచన
    రావుల పలుకుల రహస్య రాత తెలుసనెన్ !

    జిలేబి

    ReplyDelete


  36. ఏరుల నక్షరములు తా
    పారెను వచనముల రాత పదముల గనుచున్
    మారెను కాదే లోకము
    వేరొక మారులవి యేలవే పలుక తగున్ ?

    జిలేబి

    ReplyDelete
  37. తనకు తానే వివాహం
    మనిషిలో ఆడ.. మగ ఇద్దరికి సంబంధించిన హార్మోన్లు ఉంటాయి. అయితే పుట్టిన శిశువు మగ అయితే టెస్టోస్టిరాన్‌.. ఆడ అయితే ఈస్ట్రోజన్‌ విడుదలై వారి శరీరాన్ని, మనస్తత్వంలో మార్పులు తెస్తాయి. దీన్ని బట్టి ప్రతీ మనిషిలో ఆడ.. మగ ఇద్దరు ఉంటాయి. ఇదే విషయంలో ఎవరికిరాని ఓ ఆలోచన ఓ యువతికి వచ్చింది. తనలోని ఉన్న ఆడ.. మగకి పెళ్లి చేసింది! ఆ కథేంటో చదవండి.

    ఇస్టోనియాకి చెందిన లక్స్‌మి తనలోని ఆడతనానికి ‘క్రిస్టల్‌’ అని.. మగతనానికి ‘రా’ అని పేరు పెట్టుకుంది. వారిద్దరికి వివాహం చేయాలని నిర్ణయిచుకుంది. తన బంధువులు.. సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా తనకు తానే ఉంగరాలు మార్చుకొని వివాహం చేసుకుంది. చూడటానికి తనకు తానే వివాహం చేసుకున్నట్లు ఉన్నా.. తనలోని క్రిస్టల్‌ అనే వధువుకి.. రా అనే వరుడితో వివాహం చేశానని చెబుతోంది.

    అయితే తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉందట. ఇది కేవలం వివాహం ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి అనుభవంగా ఉపయోగపడుతుందని అంటోంది లక్స్‌మీ
    http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break119

    ReplyDelete


  38. ఆ రాముడు శివుని మది
    న్నారామంబుగ గొలువగ నారాయణునిన్
    నా రాముని నామము మన
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై!

    జిలేబి

    ReplyDelete


  39. కాలము రాగన్ మిడుతకు
    చాల తెలివివచ్చెనోయి చాలని దినమున్
    కాలము గడుపుటకు తనకు
    మేలగు చీమ పొదుపుతనమే రక్షగదా !

    జిలేబి

    ReplyDelete


  40. కాదేదీ తెలియన్ జిలేబి వరమై కామింటు పద్యంబు లై
    యేదేదో ఘనమై లభింప ఝరియై యేమైన తాయల్లు మేల్
    బాదుళ్లే రవముల్ యనంగ కవితా పాదమ్ము తాడించు టే
    లా దుర్భేద్యముగా తెలుంగు రమణీ లావణ్యమెల్లన్ చెడన్



    జిలేబి

    ReplyDelete


  41. కాదేదీ మా తలకున్
    బాదుళ్ళకునూ జిలేబి పదతాడనముల్ !
    పోదురు బడాయి నరసిం
    హాదుల కామింటులందు హాస్యములకునూ :)

    జిలేబి

    ReplyDelete


  42. భంగిమల గనుచు తమతమ
    యంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్
    రంగము హిరణ్య గర్భము
    రంగుల జీవన జిలేబి రసగుళికయటన్

    జిలేబి

    ReplyDelete


  43. యెన్నేళ్లకు మంచి టపా!
    హన్నా రాసపు కథల సుహాసిని గాదా !
    మిన్నగ నుండె జిలేబీ !
    కణ్ణమ్మా వలదు కంద కామింట్లున్నూ :)

    జిలేబి

    ReplyDelete


  44. మాతెలుగు సీరియల్సుల
    మోతలు గనవమ్మ మేల్మి మోదంబొందన్ !
    జోతలు సినిమా వలదోయ్
    మాతల బాగుండ మాకు మాటలు చాలున్ :)

    జిలేబి

    ReplyDelete


  45. సౌదీ అరేబియాలో
    మాదీ యనుకున్నదంత మాయంబయ్యెన్
    బాధాకరమౌ వలసలు
    వేదన మిగిలిన బతుకులు వెనుబడి వచ్చెన్

    జిలేబి

    ReplyDelete


  46. చమురౌ మన జీవనములు
    కమల షరాబులు జిలేబి కారుల చనిరీ !
    సమసెను వేగము చమురుకు
    సమస్య లైతిమి సమాన సఖులము గామే !

    జిలేబి

    ReplyDelete


  47. నమ్మక శక్తిని పెంచన
    నమ్మగ శక్తిని జిలేబి నమరిక యగునౌ
    నమ్మయు నీవున్నొకరని
    నిమ్మది నరయన్ననంత నిముషము నీవే !

    జిలేబి

    ReplyDelete


  48. బుద్ధావతారమున తా
    సుద్దుల గరపుచు జిలేబి శూన్యత్వంబున్
    పెద్దగ నేర్పెను జనులకు
    విద్దెల్ ధ్యానంబులాయె వివిధ జనులకున్

    జిలేబి

    ReplyDelete


  49. కవితే మన బతుకమ్మకు
    నవతా ప్రతినిధి, ప్రతీక !నవ్య తెలంగా
    ణ వరము జనులకు పండుగ
    భువి నెల్లెడలను జిలేబి భూరిగ జరిపెన్

    జిలేబి

    ReplyDelete

  50. కష్టే (కందే) ఫలి :)

    నిదురన గల టిల్డే కీ
    కుదురుగ నొక్కి ర అ నొక్క కులుకుచు తా కం
    డ్లెదురుగ వచ్చు ఱ యక్షర
    మది కష్టపడితి నుపాయ మదియని తెలియన్ :)

    జిలేబి

    ReplyDelete


  51. ఱ ను పలుక బండి గంటను
    గణగణ మోగించుచు గబగబ వచ్చెను! హా!
    తెనుగుకు గల గొప్పదనము
    గనుమోయి జిలేబి మేలు ఘనమగు భాషా !

    జిలేబి

    ReplyDelete


  52. భక్తులను తెలుసుకొన యను
    రక్తత లేదా జిలేబి రావడి జేయన్,
    వ్యక్తావ్యక్తుండీశుడు
    భక్తాగ్రేసరిని గాంచి భయపడి పోయెన్ :)

    జిలేబి

    ReplyDelete


  53. విధవిధ ములైన దారుల
    వదులక యత్నములజేయ వరదుని గానన్
    కుదురును నాతడు మేలౌ
    చదరంగపు టాటలోన చక్కగ దాగెన్ !

    జిలేబి

    ReplyDelete


  54. సంచిత యోగంబు లధిగ
    మించిన సౌఖ్యంబు కారు మీద నమెరికా
    నెంచక్కగ చుట్టగల మ
    టంచు జిలేబి థమసప్పు టప్పున జేసెన్ :)

    జిలేబి

    ReplyDelete


  55. తెలవారె నుపాహార మ
    సలు గనరాలెను సమస్య సమరము జేయన్
    పలువిధ పూరణలను గా
    న లచ్చిమి జిలేబి వేచె ననఘా నిచటన్ !

    జిలేబి

    ReplyDelete


  56. రైడుల షికారు బోవన్
    కీడుల గనవచ్చునోయి కీచకులచట
    న్నోడింపగ మనల జిలే
    బీ, ఢీ కొనవలయవచ్చు భీకరుల సుమీ !

    జిలేబి

    ReplyDelete


  57. సారా కలవాటు పడితి!
    నేడు శుభోదయము దాని నేగన రాకన్
    వేరు పనుల పోలేకన్
    హోరెత్తె మెదడు జిలేబి హోషీయారౌ !

    జిలేబి

    ReplyDelete


  58. ఏమిటి మీరే నా! వావ్
    భామన్నడిగెన్ పురాణపండ ఫణి గదా !
    మేమే మేమౌ మరి యే
    మో మేమే తాను గాదు మొత్తము మీదన్ !

    జిలేబి

    ReplyDelete


  59. మొహమాటానికి బోయా !
    నహనా పెండ్లాము మాట నైనా వినలే :)
    షహరున జిలేబి జనులే
    ను! హుషారు వలయు తెలిపెను నొడికారి సుమీ !

    జిలేబి

    ReplyDelete


  60. గాంధీ కార్డుల్ బోయె సి
    సింద్రీ మెయిలుల్ జిలేబి శీఘ్రము బోయెన్ :)
    చంద్రాకారపు వాత్సపు
    కంద్రీ గవలెను మనుజుల కరముల జొచ్చెన్ :)

    జిలేబి

    ReplyDelete


  61. అనుమానము భయ మాత్రుత
    మనిషి‌ని భయపెట్టునోయి మాచన జెప్పె
    న్ననురాగమున్న చోటన్
    వినుము జిలేబి విధిరాత విభునిది గదవే !

    జిలేబి

    ReplyDelete


  62. నలుబది వేలు పయిబడుచు
    నలరెడి పద్యపు పసిడి ధనాగారమిదీ !
    కలకా లము వెలుగుల ని
    చ్చు లక్షణముగ పలుకుజెలి చూడా మణియై

    జిలేబి

    ReplyDelete


  63. చరఖా తిప్పెను మోడీ
    పరిశ్రమల కొచ్చునోయి పైరాబడియున్
    పరుగులు దీయును దేశపు
    పరపతి నలుదెస ప్రపంచ పౌరులు గానన్

    జిలేబి

    ReplyDelete


  64. ఒక రూపాయికి ఒన్ ప్లస్
    యిక నిత్తురట మొబయిలుల యినవే లచ్చీ!
    చకచక కోట్లన నివ్వన
    నొక రూపాయను జిలేబి నోడిరి పలురూ :)



    జిలేబి

    ReplyDelete


  65. కోటప్పకొండ యిక ప
    ర్యాటక క్షేత్రమగునోయి రాత్రింబవలూ
    నాటల పాటల గాంచుచు
    కోటను చుట్టగలమోయి కోడెల హామీ :)

    జిలేబి

    ReplyDelete


  66. దొంగలకు కాప లానా
    లంగట పాములకు కాప లాయా బెంబే
    లంగనె పో పోలీసూ
    చెంగట సర్పము జిలేబి చీకాకు గదా !


    జిలేబి

    ReplyDelete


  67. ముంబయి మార్కెటు నాకా
    శంబున కెగిరెను జిలేబి చట్టున గనుమా!
    జంబూ ద్వీపపు పరపతి
    సంభవ మిదియే సమస్త జనులకు తెలియన్ !

    జిలేబి

    ReplyDelete


  68. గురుపత్నిగారు మానసి
    క రుగ్మతల బాగుగాను కనుగొనెదరుగా!
    నెరుగుదురు వారు పక్కిం
    టి రమణులను వారి చక్కటి బుకాయింపున్ !

    జిలేబి

    ReplyDelete


  69. పదవుల పేర్లను మార్చుచు
    సదరు మహాజనులు నేటి సంకటములకున్
    విధవిధ సమస్యలకునూ
    నెదురగు కష్టములకున్ను నెపమయ్యిరిటన్

    జిలేబి

    ReplyDelete
  70. ఇక్కడ "నెపం" అనే మీ పదప్రయోగాన్ని నేను ఖండిస్తున్నాను. నాయకుల అనాలోచిత చర్యలవల్ల ప్రజలకి ఇబ్బంది అంటుంటే నెపం వేస్తున్నారంటారేమిటి ?

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు

      నెపము అంటే కారణము.

      జిలేబి

      Delete
    2. "నెపము" అనే పదానికి ఉన్న నానార్ధాల్లో "కారణం" కూడా ఒకటి అని తెలుసండి. పద్యం వరకూ మీకు అది పనికొచ్చుండచ్చు. టెక్నికల్‌గా మీ పదప్రయోగం కరక్టే అయ్యుండచ్చు. కానీ సాధారణంగా "నింద" (blame), "సాకు" అనే అర్ధాల్లోనే సామాన్య జనులు ఎక్కువగా వాడతారని మీకు తెలుసుగా. అందువల్ల మాబోంట్లకు అలాగే అర్ధమవుతుంది.
      పామరులకు కూడా సరిగ్గా అర్ధమవడం పద్యం యొక్క ముఖ్యోద్దేశ్యాల్లో ఒకటిగా ఉండాలి. అదీ నే చెప్పదలుచుకున్నది. మీరు "కొరకొర" చూడకండి 🙂

      Delete


  71. కొరకొర చూడకు నను, పా
    మర జనులకునూ జిలేబి మరి యర్థంబై
    పరమార్థంబుల నివ్వ వ
    లె రమ్యముగ నుండు పదము లెస్సగ నుండూ !


    జిలేబి

    ReplyDelete


  72. ఘనమై నొప్పు రమణికిన్
    స్తనములు; లేని పురుషుండు స్తవనీయుండే
    మనమున దోసపుటాలో
    చనలును ;నీ వాక్యమిట్లు చదువగ తగునౌ !

    జిలేబి

    ReplyDelete


  73. ధరణములట రే‌కెత్తిం
    చె రణరణకలను జిలేబి చెకబెక తోడన్
    స్వరములు పలికెను వివిధము
    ధరణిన్నిది పాతపద్య తటమే సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  74. అహ ! హిందూమత మందున
    బెహతరు యిస్లాము మొదలు భేషుగ గానన్
    తహతహ లాడుచు భాయీ
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్



    జిలేబి

    ReplyDelete


  75. పిలవని పేరంటమునకు
    వలదని మగడన్నను విడువక చనెనూ, తా
    కలతయు చెందన్నగ్నిన్
    నిలచుచు శివతాండవంబు నెలగొల్పెనటన్ !

    జిలేబి

    ReplyDelete


  76. తెలుగున రాయీ యనుచు గు
    ములుచు రమణి రాసిరంపమున బెట్టునటన్
    యలకల కొలికికి తెలుగ
    న్న లంపటమదేలనో పనసతొన ప్రీతీ !

    జిలేబి

    ReplyDelete


  77. సిలికానాంధ్రా మనబడి
    పలుకుల యెకిమీడు గరికపాటి జిలేబీ !
    వెలిగించె తెలుగు దీపము
    పలుకుల తల్లికి, ప్రవాస భారతి యనఘా !

    జిలేబి

    ReplyDelete


  78. వచ్చెను జిలేబి చూడగ
    మెచ్చెను బీలేజి మేడ మెల్లెడ లను తా
    నిచ్చును మైలేజీ బో!
    గిచ్చును లేజీబి తప్పు గిప్పుల గానన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అక్కడి వ్యాఖ్యకు ఇక్కడ జవాబు మర్యాద కాదు:-)
      అక్కడ కూడా వెయ్యకపోతే మా నాబోరు దక్కదు:-(

      Delete


  79. కాలేజీ మేష్టర్లే
    నా లలితా ట్యూషనుకును ? నరసింహా రా
    వుల్లడి గిరిగద !తెలియన
    మేలౌ ప్రశ్నల నడుగను మేలిమి‌గానన్ :)


    జిలేబి

    ReplyDelete


  80. గానన జిలేబి సొబగుల
    దానిని గని దాగనిదని దాగదనిరి గా
    దా నిమిషంబైనను సర
    సానికి సమయమిదికాదు సామీ విడుమా !

    జిలే‌బి

    ReplyDelete


  81. మావూళ్లో గోదావరి
    యావూళ్ళో గౌతమి నరయగ వేరౌ రై
    లౌ ! వడివడి చను నిలువక
    తావులు వేరవ్వబండ్ల తానము వేరౌ :)

    జిలేబి

    ReplyDelete


  82. తానంబాడి మనీషివి,
    తానంబున కర్థమిచ్చి తానంతట సం
    తానంబన దగి మగసం
    తానంబున నతడు ముదము తానంబయ్యెన్ !

    (రా.వి- ఆంధ్రభారతి)

    ReplyDelete


  83. ఈటీవీ మాటీవీ
    యేటీవీ యైన నేమి యేతావాతా
    పోటీ జిలేబి‌‌ పోటా
    పోటీ!మా యేబియెన్ను పోక సుపారీ !

    జిలేబి

    ReplyDelete


  84. కదలండి! సమాచారము
    కుదురుగ నేర్వన్ జిలేబి కూతల్ ఘనమౌ!
    యెదుగుటకు మార్గ మిదియే
    పదునుగొనవలెన్ స్వశక్తి పఠనాసక్తీ !

    జిలేబి

    ReplyDelete


  85. బుట్టల మాటున నుంటిమి
    పుట్టితిమిగద జనులెల్ల పూటుగ మెక్కన్
    గట్టి నరులు మీరందరు
    పుట్టుక యున్న సరి మీకు ఫుడ్డే ఫుడ్డూ !

    జిలేబి

    ReplyDelete


  86. పెళ్ళెప్పుడే జిలేబీ ?
    పెళ్లవ్వంగను చదువును పేర్మిని గనవే
    బళ్ళున్నపుడే పెండ్లీ
    మళ్ళనమాకే వలయును మగువకు మగడూ :)

    జిలేబి

    ReplyDelete


  87. లింకుల రాముండతడౌ
    పెంకి ఘటంబులకు చెంప పెట్టు ఫెడేలన్
    రంకెలు వేయుచు నిచ్చున్
    కింకరుల కతడు సరి యమ కింకరుడు సుమీ :)

    జిలేబి

    ReplyDelete


  88. రేటింగిస్తే పుణ్యం
    ఓటింగూవుంది రమణి ఓమారిటు రా
    వే టింగురంగనుచునూ
    కోటింగొకటివ్వవే పకోడి జిలేబీ !

    ReplyDelete


  89. ఫీల్గుడ్ మూవీ సాంగూ
    ఫీల్గుడ్ యైటం జిలేబి ఫెంటాస్టిక్కూ
    గోల్గప్పలచిత్రమదీ
    బాల్గేమ్ బాయ్ బాయ్ గరల్సు బాలీవుడ్గుడ్ !

    జిలేబి

    ReplyDelete


  90. అదిగో యనాత వరమూ
    మదితాకెను నాటికాల మధురస్మృతులౌ !
    పదిలంబాయెన్ హృదిలో
    కదిలిక లిడిరప్ప దొడ్డ కరుణా మూర్తుల్!

    జిలేబి

    ReplyDelete


  91. అదికోరితి నిది కోరితి
    కుదురుగ నినుకోరలేదు కొండల రాయా !
    హృదినిచ్చినవాడవు మరి
    మదినేలర యిచ్చినావు మరిమరి మరువన్ !

    జిలేబి

    ReplyDelete


  92. పౌరోహిత్యము తగ్గెను!
    నారా ధించిరట యైటి నాసా, సిలికాన్
    దారి సిరిగేస్తులై వ్యా
    పారంబుల బారుదీరి పారుల్ బోవన్ !

    జిలేబి

    ReplyDelete


  93. మనసే మనసని తెలియక
    ఘనసేవల సమయములను గడుపుచు కాల
    మ్మను నావయందు పయనం
    బును సాగించెను జిలేబి బుద్భుద జీవీ !

    జిలేబి

    ReplyDelete


  94. నాయాత్మబాంధవివి నీ
    వే యమ్మణ్ణీ జిలేబి వేగిర రావే!
    రాయసములొలుకు రమణీ
    గాయమ్మునుజేసితీవు గంధమ్మిడవే !

    జిలేబి

    ReplyDelete


  95. ఉచితంబుగనిచ్చినను స
    ముచితంబగునా తిరుమల ముంగిట వేర్వే
    రు చినచిన దేవుల రచన
    ల చిల్లర పురాణగాధ లను పేర్మి గనన్ !

    జిలేబి

    ReplyDelete


  96. బాగా రాయగ లరటా
    బేగం సాయిబ జిలేబి, భేషౌ గానన్!
    రాగము తీయగ తీయగ
    పాగెము గనెనోయి రమణి పారుడు చెప్పెన్ :)

    జిలేబి

    ReplyDelete


  97. వారసులు లేక పోయిన
    పోరికి తప్పదు జిలేబి పోరుల్ హోరుల్
    కారెవ్వరు కాలమ్మును
    మీరగల మహా పురుషులు మిన్నగు వారల్ !

    జిలేబి

    ReplyDelete


  98. ఆమె యతి సుందరియటా !
    యేమే ప్రియమణి యటంచు యేకట గానన్
    భామా కలాపముల తా
    నో మారైనను గనంగ నోర్మియు గనదే :)

    జిలేబి

    ReplyDelete


  99. హరిబాబు యాపుని గనుడు
    పరిశోధన గాంచి హోర పద్ధతి నందు
    న్నరయ శుభాశుభ ఘడియల
    హరి ఓం యని తెలియజేసె యద్భుత మనగన్

    జిలేబి

    ReplyDelete


  100. హ! యచంచల యక్షరముల
    భయంబుల గనితివిగాద! పద్మార్పితవై
    పయనంబు గొనుము పరువపు
    నయగారంబుల రహస్య నగరియటగనన్ :)

    జిలేబి

    ReplyDelete
  101. .... యచంచల క్షరముల ....
    అచంచల అన్నది సంస్కృతపదం. అక్షరం అన్నది సంస్కృతపదమే. అందుచేత ఆరెండు పదాలకూ‌సంధికార్యం జరిగి అచంచలాక్షరములు అవుతుంది కాని మీరు చేసిన వికృతమైన యడాగమం చచ్చినా రాదు. మీవి అకటావికటపు పద్యాలని విసుక్కుంటే నొచ్చుకుంటారు. కాని భాషమీద కాస్త శ్రద్ధ పెట్టి మాత్రం జనం మీద కనికరం చూపరు! గొంగడిలో తింటూ వెంటుకలు లెక్కించటం అన్న మాట ఒకటుంది. మీ పద్యాల్లో భాషాదోషాలూ అన్వయదోషాలూ ఇంకా సవాలక్షదోషాలూ ఎంచుకుంటూ‌ కూర్చోవటం కూడా అలాంటిదేను. మీరు సుష్టువుగా అభ్యసించి మీ‌పద్యాలను జనానికి వినిపిస్తే అదో అందం. కాని జనాన్నిలా బాధించి చంపటం కూడా ఒక అందమే అని మీ‌ ఆలోచన అనుకుంటాను!
    తమాషా ఏమిటంటే మీరు వ్రాస్తున్నవీ‌ పద్యాలే అని నమ్మే జనం కూడా నాకు బ్లాగులోకంలో కొందరు కనిపిస్తున్నారు. ప్రతిగా మీ మెప్పును కోరే వారు కొందరైతే అమాయకంగా కొందరు. అంతా కాలప్రభావం!

    ReplyDelete


  102. శ్రీరాముని లింకుల దయ
    నారూఢిగ తెలిసెనోయి నమ్మిక గొనవే
    ఫారిను జోకర్లకటా
    ఘోరీ గనిరి మన వేద గోపురములకున్!

    జిలేబి

    ReplyDelete


  103. సంధుల యడాగముల సం
    బంధము తెలియక జిలేబి చంపకు మమ్మూ !
    ఛందం బనంగ గణితపు
    గంధంబొకటే యనకు సుగంధము వలయున్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “గురువు లఘువుచేసి కుదియించి కుదియించి లఘువు గురువుచేసి లాగిలాగి కవితచెప్పినట్టి కవిగులామునుబట్టి ముక్కుగోయవలయుఁ దొక్కిపట్టి " అన్న పద్యం విన్నారా? ఈ మమ్మూ ఏమిటీ ఎక్కడిది దీర్ఘం? ఇలాంటివి కొల్లలు మీ నుండి! వికటంగా రాయకండి బాబో అంటే దానికి జవాబు (మళ్ళా దీనికీ జవాబు) మరొక అకటావికటపద్యమా?

      Delete


  104. పది నిమిషంబులని వెడలి
    పదిరెట్ల పది నిమిషంబు పలుమార్లిట నే
    కుదురుగ వేచితి నిక వే
    చెదనను కోమాకు మగడ, చెంతకు రానోయ్ !

    జిలేబి

    ReplyDelete


  105. అకటా వికటపు పద్యము
    లకటా బేర్చెను‌ జిలేబి లాక్షణిక గురుల్
    చెకబెక వాపోయె సుమీ,
    పకోడి పొట్లము లవెంట పడనేలన్ బో :)

    జిలేబి

    ReplyDelete


  106. శుభమశుభంబులు చూడగ
    నభయము కోరిన శుభాంగి నద్దరి రాదే !
    ప్రభువుని మనంబున గొనుము
    శుభోదయ సమయమశుభము శుభముగ మారున్ !

    జిలేబి

    ReplyDelete


  107. వేడి జిలేబి జిలేబీ
    వేడితి గాదే శుభాంగి వేడిని వీడన్ :)
    బాడబ పలుకుల వినవే
    బాణలి పెట్టితి జిలేబి బాగుగ గాయన్ :)

    జిలేబి

    ReplyDelete


  108. నాన్నమ్మపాట నానో
    టన్నాడెను నేడు, వినుడు, టంకంబిదియే !
    మిన్నగ టపాన పదములు
    యెన్నగ యూట్యూబునందు యేక్ రంగీలా !

    జిలేబి

    ReplyDelete


  109. జనులకు తెలియవలెనోయి చక్క గాను
    రక్త దానమ్ము సేయుట, రాక్షసమ్ము
    నితరులకు కీడు తలపెట్టు నింగితమ్ము
    సుజనులై మెలుగవలయు శుభము గలుగ !

    జిలేబి

    ReplyDelete


  110. మమ్ము యనన్సుడిగాలి గ
    దమ్మా మమ్మూ జిలేబి దరువులు‌ మేలౌ
    దమ్ములు ముదమ్ము బొందన్
    బామ్మల టైం పాసు టీము పాకం పప్పుల్‌ :)

    జిలేబి

    ReplyDelete


  111. కోడలిని కొట్టుటకు నుడి
    కారము సామెతలనిచ్చె కష్టే ఫలి మా
    స్టారట నల్లుళ్ళనబడు
    వారల గొట్ట నటువంటి వాక్యము లెవ్వీ :)

    జిలేబి

    ReplyDelete


  112. మగవాళ్లని మిస్టరనెద
    ముగదా యాండోళ్ళపేరు ముదితా, యాంగ్లం
    బు గతికుని మాట మిస్టరి :)
    బిగి జేయకు, మా జిలేబి బిగ్మిస్టరియౌ :)

    జిలేబి

    ReplyDelete


  113. దండుగ దండుగ యనుచున్
    మెండగు జీవన మునందు మేల్మిని గనకన్
    గుండెల నైరాశ్యంబుల్
    నిండ కవి బతుకులబండి నీడ్వన్నేలన్

    జిలేబి

    ReplyDelete


  114. లలితా మహిళా మండలి
    భళి సంబరములు కథలును భళి యాటాపా
    టలునూ చిత్రములు భళీ
    పలువిధ వంటలు జిలేబి భళిభళి భళియౌ !

    జిలేబి

    ReplyDelete


  115. ఓహొ ! కరాచీ సూజీ
    యాహూ మైసూరు పాకు యన్నిటికి జిలే
    బీ హాయని చెప్పవలదు
    బాహాటము గావలయును భారత్ భక్తీ :)

    జిలేబి

    ReplyDelete


  116. తలచెంత నొకండు పద క
    మలముల చెంత మరియొకడు మద్దతు గానన్!
    తలయెత్తు నొకని గర్వము
    తలవంచి యొకని వినమ్రత మన కథలివీ !

    జిలేబి

    ReplyDelete


  117. ఈ భోగమ్మెన్నాళ్ళో!
    నాబోరుండో జిలేబి నాన్నా ళ్ళైనన్ !
    ఓ బోర్డిట నుంచవలెను
    కాబోలు విషయము తెలియ కాంట్రాక్టరుడిన్ :)

    జిలేబి

    ReplyDelete


  118. ఎక్కువ గా మరి చదివితి
    నెక్కు పెడితి బాణములను నెమ్మది గానన్ :)
    రెక్కల కష్టము వోలెన్
    గుక్కలు బట్టిన పలుకుల గుణకారమ్ముల్ !

    జిలేబి

    ReplyDelete


  119. విద్యయొసగు వినయంబని
    పద్యంబుల నల్లుచుండె పరపతి లేకన్
    సద్యోగంబు గనక తా
    విద్యను తాకట్టునిడెను విశ్వంబునకున్ !

    జిలేబి

    ReplyDelete


  120. మన పనికి రాని చదువుల
    ఘనముగ చదువ వలదోయి, గగనంబేగన్
    మనకు వలయు నాంగ్లంబు తె
    కినీకులు నమరిక గాను కీర్తిని బడయన్ !

    జిలేబి

    ReplyDelete

  121. కన్నియల చీరలన్నియు
    యెన్నికగా నొడిసిపట్టి యేమార్చెను తా
    మన్నిక గాంచె జిలేబీ
    యెన్నటికిన్ వెన్నదొంగ యెల్లరకున్నూ !

    జిలేబి

    ReplyDelete


  122. ధ్యానము సమకూరంగన్
    జ్ఞానమ్మభివృద్ధియగును చాదస్తమ్మున్
    మానవుడు వీడు మేల్తల
    మానీకంబగు జిలేబి మనుజల లోనన్ !

    జిలేబి

    ReplyDelete


  123. ఆ గుట్టు రెడ్డి గారివి
    దాగుడు మూతల పదముల దారపు చిక్కు
    న్తాగురుతుగ విప్పవలెన్
    మా గురువులు చెప్పిరచట మాలిని తెలియన్ !

    జిలేబి

    ReplyDelete


  124. వీలుకి ఫిట్టింగులనన్
    వాలు కనులతో తమ మగ వారల కున్నూ
    కాలికి బంధము గాంచిన
    మేలగు మహిలో జిలేబి మేగలి గొనవే :)

    జిలేబి

    ReplyDelete

  125. ఒక యూజీ!యొక జేకే
    యొక మూజీ! యేకహార్టు ! ఓషో! శ్రీ యెమ్ !
    యొక మాజీ! బాబాజీ !
    యొక లేజీబీ జిలేబి యోగా మేస్త్రీ !

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. *ఒక లేజీ బీ జిలేబి యోగా కిచడీ :)


      జిలేబి

      Delete


  126. వేదాలేంచెప్పాయీ ?
    కాదేదీ రంగనాయకమ్మ కథలకున్
    బాదుళ్ళకునూ లొంగని
    చాదస్తమ్ములు జిలేబి చళ్లను చమడాల్ :)

    జిలేబి

    ReplyDelete


  127. హబ్బుల బేర్చెద ననుచున్
    పబ్బము గడిపెను జిలేబి పైలా పచ్చీస్ :)
    గుబ్బిస లాడిరి జనులౌ
    నిబ్బర ముగ చంద్రబాబు నేలెన్నాంధ్రా :)

    జిలేబి

    ReplyDelete


  128. చెప్పె ములాయము సింగట
    గొప్పగ మోడీ గురించి గోసనపుచ్చెన్
    మెప్పులను భాజపా గన
    గుబ్బిస లాడిరి జిలేబి గురి యఖిలేశౌ :)

    జిలేబి

    ReplyDelete


  129. జనతా గారేజ్ దసరా
    దినంబు నట్టర్ఫె యిలట దిమ్మతి రిగెనౌ
    మనటీ వీవా రికటన్
    ఘనకార్యంబది యెవరది కబ్జా జేసెన్ !

    జిలేబి

    ReplyDelete


  130. అంద మైన కోతి యరవ బామ్మ యొకతె
    వింత గాను పద్య వీచికనిట
    పదము లెల్ల బేర్చి పదనిస లాడెను
    సాహితీ సదనము చ‌మకు‌ జూచి !

    జిలేబి

    ReplyDelete


  131. పనికొచ్చు ముక్క ప్రవచన
    మని నాస్తిక మిత్రుడొకడు మస్తుగ జూచెన్
    తను బతక నేర్చిన మనిషి
    యనుమానము లేదు మేలు యశముల బొందున్ !

    జిలేబి

    ReplyDelete

  132. జాతీయమైన తెనుగు
    న్నా తీయందనము లెల్ల నారీ జనుల
    న్నా తీరుబడి పలుకులన్
    సీతాకోకవలె గనిరి శ్రీపాద కవుల్ !

    జిలేబి

    ReplyDelete


  133. గుల్ గుల్ జిల్ జిల్ మల్ మల్
    పాల్ కోవా పూతరేకు బర్ఫి జిలేబీ !
    గోల్ గోల్ గప్పా రసగు
    ల్లా కాజూకత్లి రవ్వలడ్డూ కుల్ఫీ !

    జిలేబి

    ReplyDelete


  134. చిలుకకు నేర్పిన పలుకులు
    కలవరములలేపెనోయి కన్యా మణులన్
    నలరించిన పతిదేవుని
    కులుకులనది పలుక కోర్టుకు వెడలె పెండ్లాం :)

    జిలేబి

    ReplyDelete


  135. మూడో కాలొచ్చెను బో
    బాడబుని యునికిని గాంచి బాగుగ నుపచా
    రాడంబరములు జేసిరి
    మేడము గారికి తెలుపగ మెచ్చుకొనిరిగా !

    జిలేబి

    ReplyDelete


  136. పర్యావరణ హితముగన
    నార్యావర్తపు సకల జనావళి కనరుల్
    చర్యల దీపావళి యం
    గార్యము గావింపవలదు కాసుల రాశిన్ !

    జిలేబి

    ReplyDelete


  137. సంగీతము నాస్వాదిం
    చంగన్ భక్తిప్రపత్తి సంపతి లేలన్
    రంగుల రాట్నపు జీవ త
    రంగములనుగాన రంధి రావడి యేలన్ !

    జిలేబి

    ReplyDelete

  138. వలపు సుగంధము వేళ్ళన
    నలవోకగ యద్దు నవ్య నారి జిలేబీ !
    కలకల నగుమోము గనుచు
    నలరారింపు నయగార నాయిక వగుచున్ !

    జిలేబి

    ReplyDelete

  139. ఉపచారము వలదు సుమీ !
    నపచారము చేయకున్న నదియే పదివే
    లు పరంధాముని పేరున
    నపరాధము జేయమాకు నరుడా నరుడా !

    జిలేబి

    ReplyDelete

  140. స్వానుభవంబుల తా దై
    వానుగ్రహములను జీవ వాహిని నందున్
    భానుడివలె గాంచుచు, తల
    మానీకం బాయె యొజ్జ మానవతకునూ !

    జిలేబి

    ReplyDelete


  141. జీవిత మే యొక గ్రంధము
    మావి చిగురువలె జిలేబి మా రంజుగనన్
    తావికి పద్మార్పితవై
    తావితివమ్మ నయగార తమకము గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  142. నీ మనసు సుగంధంబౌ
    ప్రేమ సుధామధురమై యపేక్షత గూడన్
    కామక్రోధంబులు భా
    మా మది వీడగ జిలేబి మధురిమ గాంచున్ !

    జిలేబి

    ReplyDelete


  143. జగణపు జగంబిది జిలే
    బి గురువు రెండన లఘువుల బిగి కౌగిలిలో
    సగుణంబుగ చిక్కె సదా!
    భగణము జేయగ విభుండు వైభవ మగునోయ్ !

    జిలేబి

    ReplyDelete


  144. నామము నామంబనుచున్
    భామా మణినిడెనుగాద బాగుగ టోపీ !
    రాముడు బిక్క మొగంబిడి
    దామోదరుని దరిజేరె దారిని గానన్ !

    జిలేబి

    ReplyDelete


  145. చిక్కేమిటో యనుచు తా
    కిక్కుల మేల్కిక్కుజేర్చి కీర్తన లను మే
    ల్టెక్కుల జేయ జిలేబీ
    ఫక్కున నవ్వెను విభుండు పదముల గనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  146. వాళ్ళిద్దరొక్కటేగద!
    పెళ్ళామ్మగడివలె తాము పెంకి ఘటములౌ
    ఫెళ్ళని చెడామడా తి
    ట్టుళ్లన పోట్లాడు కొనుచు టుమ్రీ లౌరౌ !

    జిలేబి

    ReplyDelete


  147. బరబర డాక్టరు మందుల
    శరముల బరికెన్ జ్వరంబు చక్కగ బోవన్
    బరువుగ రాగన్ బిల్లుల్
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్

    జిలేబి

    ReplyDelete


  148. హృదయములో కేంద్రంబు గ
    లదందులోన నొకచుక్క లబ్జుగ వెలిగె
    న్నదిమూలము వృత్తంబై
    పదిలముగా వెలుగునిచ్చె పరమాత్మయనన్

    జిలేబి

    ReplyDelete


  149. మనసు బరువెక్కి మాటలు
    గనలేక తడబడెనోయి ఘనమగు వార
    ల్లెనలేని సేవలను జే
    సిన వారి కథలను చదువ చింతన గంటిన్

    జిలేబి

    ReplyDelete


  150. ణ్యాన్నొరు మళయాళీ యె
    న్మణ్ణిన్ కూట్టాళియెంగు మదిరుగళిళ్లా
    మణ్ణాణ జీవ మిదడీ
    పొణ్ణిల వింగే జిలేబి పొణ్మణి యాయ్వా :

    జిలేబి

    ReplyDelete


  151. వలపుల సర్టిఫికెట్టు
    న్నలవోకగ నిచ్చితీవు నాయెద సొబగు
    ల్లలరించెనోయి రమణీ
    కిలకిల నవ్వుల జిలేబి కిన్నెరసానీ !

    జిలేబి

    ReplyDelete


  152. శ్లాఘించదగిన పని మా
    బాగుగ జేసితిరి మీరు భళిభళి యనగ
    న్తా గురువులను పొగిడిరట
    భాగీదారు లయిరిగద బాడబ గురువుల్!

    జిలేబి

    ReplyDelete


  153. దీపం బెప్పుడు వెలుగు
    న్తాపం చునుగద జిలేబి నలుదెస లనటన్
    తాపమ్ముల గోపమ్ముల
    ధూపమ్ముగపారదోలు దోసము బోవన్

    జిలేబి

    ReplyDelete


  154. మా రంగనాయకమ్మకు
    సారము గల వేదతత్వ సత్యమ్ముల్లే
    వీ రమణీ లేనే లే
    వూ! రావమ్మా జిలేబి పుస్తకముగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  155. రమానాధుని కాకా బట్టి దీపావళి ని ఫాల్గుణమునకు మార్చేసిస శార్దూల విక్రీడితము


    రావమ్మాయని బిల్వ తా బిరబిరా రాదా రమానాథ ! మా
    దేవా! ఫాల్గుణమందు వచ్చును గదా దీపావళీ పర్వమే ?
    భావావేశము మీ కవీంద్రు లకు మేల్భాసించు సొమ్ముల్ గదా
    ధీ వాక్కేళియనన్ జిలేబి వినువీధిన్ తారలే మారు బో !

    జిలేబి

    ReplyDelete

  156. వలపుల కొండల మాటున
    తలపులు చెలరేగగ మది తహతహ లాడెన్
    కలవర మాయెను మదిలో
    సలసల కాగెను జిలేబి సరసము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  157. రవ్వల వలయము చీకటి
    కవ్వల దివ్వియ జిలేబి కాంతియు, తారా
    జువ్వలు రయ్యను వేళన్
    మువ్వల సవ్వడి మొగదల ముగ్గులు వేసెన్ !

    జిలేబి

    ReplyDelete


  158. హా! భాష లోన యాంకిరి
    ణీ భామలదే హవా! కణితిరీగల గో
    లా! బ్లాగుల్లో కంద జి
    లేబీ కామింట్లు!చెయ్యలేమేమి మనం :)

    జిలేబి

    ReplyDelete

  159. యమకింకరులే నేటికి
    యమ యాంకిరిణీ ముదితలు ! యమ "గోల" గనన్ !
    రమణులకీ యతులిత మధు
    రిమ యెట్లొచ్చెను తెలుంగు రింఖా ధ్వనిగన్ :)

    జిలేబి

    ReplyDelete


  160. మాయింటనేడు పండుగ
    సాయంకాలము జిలేబి చక్కగ వచ్చెన్
    మాయందరి దీపావళి
    మీయందరికీ శుభముల మీదటి గానన్ !

    జిలేబి

    ReplyDelete

  161. పద్యాలన్నిటినీ జిలేబి గమనింపన్మేలు పద్యంబు తా
    విద్యాదేవి వరంబు గా సగుణమై, వీరాంగణా సావధా
    నాద్యాత్వృద్దిగనౌ, వసంత రవళీ నాదంబు గీతంబుగన్ !
    సద్యోగంబిదియే లలామ గనవే శార్దూల లాలిత్యమున్ !

    జిలేబి

    ReplyDelete

  162. గొల్లడిగా బుట్టె నటా !
    గొల్లలు గోలలు జిలేబి గోవుల యవనా
    ర్యుల్లము లెల్లన్ గ్రోలిరి
    జల్లన హృదయము విభుండు చల్లగ గావన్ !

    జిలేబి

    ReplyDelete


  163. సాధన మనస్సు కేనా ?
    మాధన మనుచున్ జిలేబి మాటలు జెప్పెన్
    బోధన మేలౌ గనవే
    శోధింపగ తెలుసుకొన్న సూత్రమ్ములవీ !

    జిలేబి

    ReplyDelete


  164. కామింటుల్నిడుమా జిలేబి‌ దినమే ఖాళీ గదా వార్త లే
    వీ మేలౌ మరిలేదు చూడను సుమీ! వీరంగ మేమాయె నో!
    స్వామీ యయ్యరువాళ్ జిలేబి పలుకుల్ సాధారణంబౌన, మా
    టా మాటా కలపాలి మేలు కవితల్ టాంటాం భజాయించగన్


    జిలేబి

    ReplyDelete


  165. వెయ్యెన్నెనిమిదన టపా
    ల్జొయ్యన వేసెను జిలేబులొకపరి గనవే
    నయ్యలకు పనీ పాటా
    కయ్యంబులు బాగుగ గలగల టైం పాసౌ :)

    జిలేబి

    ReplyDelete


  166. చైనా సరిహద్దులలో
    సైనికు లెల్లరి కి మోడి సైదోడుగనన్
    ధీ నేతగ దీపావళి
    గానకచేరీ జిలేబి గారవముగనున్ !

    జిలేబి

    ReplyDelete


  167. రంగ నాయకమ్మ రామగోపాలు వ
    ర్మ, అయిలయ్య కంచె మచ్చు తునక
    లౌ ! మనుజుల కేమి లౌక్యము గలదో జి
    లేబి తెలియ రాదు లెస్స గాను :)

    జిలేబి

    ReplyDelete

  168. మీ తెలుగు భాష సేవకు
    జోతలివి గొనుము జిలేబి జోహారులిటన్ !
    మాతలరాత యిదిగదా !
    నేతలు గూడా తెలుంగు నేమార్చిరి బో !

    జిలేబి

    ReplyDelete


  169. యా ! దీని సిగతరగ ! య
    బ్బో! దీనమ్మ! వసపిట్ట బోటిపలుకులన్
    గోదావరి నూతపదము
    లౌ! తెలుగువెలుగు జిలేబి లకలక లివ్వీ :)

    జిలేబి

    ReplyDelete


  170. బక్షీసిచ్చితిమి జిలే
    బీ! క్షిపణివలె జవరాల భీకర పదము
    ల్లక్షయముగ జల్లితివీ
    వే ! క్షమ గొనవమ్మ పద్య వేడుక చాలున్ :)

    జిలేబి

    ReplyDelete


  171. భగినీ భోజనము!జిలే
    బి గరిట తిప్పుళ్ల హాటు బిసిబేళాబాత్!
    పగ మాపై కట్టవలదు
    వగలాడీ వచ్చెదమిక వందన మిడుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  172. నామనసేలే రామా
    నీమనసాయెను జిలేబిని గనవలెను సు
    మ్మీ!మా సీతమ్మమగని
    కే మేము నమనములిడుచు కేల్మొక్కెదమౌ !

    జిలేబి

    ReplyDelete


  173. ఉండేది రాము డొక్కడు
    గుండెల నిండుగ జిలేబి‌ గుణికియు తెలియన్
    చండప్రచండుడతడే
    భండన భీముడతడేను భక్తజనులకున్ !

    జిలేబి

    ReplyDelete


  174. యముడును యమునయు సూర్యుని
    కొమరు,కుమార్తె, నొకనాడు కోరి యముడు తా
    యమున గృహంబున కేతెం
    చె ముద్దుల సహోదరి మురిసెను బువ్వనిడెన్ !

    జిలేబి

    ReplyDelete


  175. హిందువు లమోయి బాబా
    లెందరు వచ్చిన జిలేబి‌ లెస్సగ వారిన్
    డెందంబరయగ గొలుతుము
    యందం బైనది సనాత నంబిది హరి ఓం !

    జిలేబి

    ReplyDelete


  176. మా కలకత్తా దేవత
    తా కలతలు దీర్చెనోయి తాడిత జనము
    ల్లాకలి తీర్చి వెలిగె గా
    దే కలియుగమున సెయింటు తెరిసా యనగన్

    జిలేబి

    ReplyDelete


  177. యమహా నగరి గదా! మే
    ము మంచి బెంగాలివాళ్ళము! యెవరి కైనన్
    సముచితముగాను సత్కా
    రములను జేతుము జిలేబి రమ్యంబుగనన్ !

    జిలేబి

    ReplyDelete


  178. ఒకటీ సున్నా సున్నా
    నకటా నాపై యెనిమిది నదిరెను బోవే!
    చకచక వేసెను దోసెల్
    సకలము నచ్చెను‌ జిలేబి చక్కగ హాట్ హాట్ :)

    జిలేబి

    ReplyDelete

  179. భామా మన యర్నాబ్ గో
    స్వామి విడిచెనట యెడిటరు జాబును యేమో
    యేమాయెనో తెలియరా
    లే! మన టీవీ జిలేబులేమౌ నో బో :)

    జిలేబి

    ReplyDelete


  180. రామదురై టాటాయని
    రే మానవ వనరులకును రేపే మౌనో !
    యేమో టాటా కిక వీ
    రే మరి దిక్కో జిలేబి రెక్కలు తేగన్ ?

    జిలేబి

    ReplyDelete


  181. జీవన చక్రంబననిది
    యే!వనితామణి జిలేబి యేతా వాతా
    యీ వరుసచక్ర మందున
    నీవూ నేనూ మరిమరి నీడా జోడూ !

    జిలేబి

    ReplyDelete

  182. స్త్రీలబలలు గారోయీ
    మాలిని ధీశక్తిగలది మధువంతియునౌ !
    చాలీ చాలని జీవన
    జోలెల తానాయె నబల జోషయు నేడౌ !

    జిలేబి

    ReplyDelete


  183. కలిసె నవంబరొకటి కా
    ల లహరి లోతెలుగు ఠీవి లావులు తరిగెన్
    కలిసెను చరిత్ర లోనౌ,
    వెలిసెను రెండై జిలేబి వెలుగు తెలుగులై !

    జిలేబి

    ReplyDelete


  184. తొమ్మిది యెనిమిది నెంబ
    ర్లమ్మయ్యో తన్నుదురట రయ్యన బాల్చీ :)
    నమ్ముము సంఖ్యా శాస్త్రము
    నిమ్మది గనవే జిలేబి నీకే మేలౌ :)

    జిలేబి

    ReplyDelete


  185. తాహతుకు మించిన జనుల
    తో,హద్దుల మీరవలదు తొందర పడుచున్,
    స్నేహంబెల్ల నొకటిగా
    దౌ, హాస్యము లాడవలదు తంపులు కలుగున్

    జిలేబి

    ReplyDelete


  186. పెదబాలయోగి కనిపిం
    చి దర్శనంబిచ్చిరంట చిటపట జనజా
    గృతి రావుగార నిరి బో
    యిదియొక బూటక జిలేబి యిచ్చుకలాటల్

    జిలేబి

    ReplyDelete


  187. కందం

    బంజారా పలుకులటన్
    పింజారి జిలేబి మాట బింకముగానన్
    జంజాటము లేక వినుడు
    సంజీవని నంగదుండు సరగునఁ దెచ్చెన్

    జిలేబి

    ReplyDelete


  188. భాయీ మోడీ వోలెన్
    చాయి చటుక్కున జిలేబి చక్కగొనవలెన్ !
    వాయింపులతాళింపుల
    బోయింగుల బోవ కిక్కు భూరిగ గిట్టున్ :)

    జిలేబి

    ReplyDelete

  189. యేమందు నేమని చెపుదు ?
    యీ మానవునికి జిలేబి యీనాడిట హా!
    భామా భామా యనుచున్
    సోమరి యగుచుండెనోయి సొమ్మసి బోవన్ !

    జిలేబి

    ReplyDelete

  190. మడిసారై మామి చుడిదారుకి మారెన్ :)


    మడిగట్టుకున్న బామ్మై
    సడిజేయక నుండె డాబుసరి "ఈమాటా" !
    పడికెట్టుజారి పయిటను
    విడుచుచు చుడిదారు సొబగు విరజిల్లెను‌ బో :)

    జిలేబి

    ReplyDelete


  191. "e-రణము"! జిలేబీ లా
    రా రారండోయి శంకరాభర ణంబై
    పూరణ లజేయగన్నీ
    కారాగారమున ఘనసుఖంబులు దక్కున్!

    జిలేబి

    ReplyDelete


  192. నిప్పు లాంటి జనుడతడు నెగ్గు నరుడు !
    తగ్గ దతనిమెరుపు మేలు తరపు మడిసి !
    గోకవరపువాడతడాయె గోల్డు మాసి !
    బొగ్గు బస్సుల కాలపు 'బోల్డు' మనిషి !

    జిలేబి

    ReplyDelete


  193. వింధ్యారణ్యములందు భక్తజనుడై విద్వత్తు మేల్గాంచ భ
    ద్రం,ధ్యాతవ్యమునిగ్గు తేల వలయున్; దాంపత్య సంసార మో
    హం ధ్యానీయము మానవాళి కిచటన్ హాసంబు లావణ్యమై
    సంధ్యా, వందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!


    జిలేబి

    ReplyDelete


  194. లక్షణములులేక వసుమ
    తై క్షమయై నా విభుండు తత్సత్ గానన్
    భిక్షగ లక్షణ ముల్లా
    రీ క్షణము తెలుపు మనెను నిరీక్షణ లేకన్ :)

    జిలేబి

    ReplyDelete