Tuesday, July 31, 2012

నేనెందుకు రాస్తున్నాను ?

నేనెందుకు రాస్తున్నాను ?

ఈ ప్రశ్న అడిగితే, టపీ మని ఇవ్వగలిగే సమాధానం - మా ఖర్మ కాలిన కొద్దీ అని వేడిగా, వాడిగా చెప్పేస్తారు మా అయ్యరు గారైతే.

ఇంతకీ అప్పుడప్పుడు ఇట్లాంటి మనో ప్రేరిత సంక్లిష్ట అసమాధాన ప్రశ్నలు ఎందుకు ఉదయిస్తాయి చెప్మా అని ఆలోచిస్తే, అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు మన రాతల వల్ల బాగు పడ్డ వాళ్లె వారైనా ఉన్నారా అని.

రాతల్ చదివి తలరాతల్ మారుతాయా అని అడిగితే, తప్పక ఉంటుందను కుంటాను. ఉదాహరణ కి స్వామీ వివేకానంద వారి సంభాషణలు, పుస్తక రూపేణా చదివి ఎంత మంది ఉత్తెజితులవటం లేదు ఇప్పుడు కూడా?

అంటే ఈ రాతలు మనస్సు అట్టడుగు పొరల్లో నించి, వస్తే వాటికి  ఆకర్షింప బడే వాళ్ళు  ఖచ్చితం గా ఉంటారని పిస్తుంది.

సో, మన మనస్సులో జరిగే సంఘర్షణ లకి మరో వ్యక్తీ వాక్కులో, లేక రాతల లో వాటి ప్రతిధ్వని వినిపిస్తే వాటికి మనం ఆకర్షితులవుతామని అనుకోవచ్చా?

ఈ ఆలోచనని ఇంకొంచం పొడిగిస్తే, ఐరన్ ఫైలింగ్స్ కి అయస్కాంతం, అయస్కాంతానికి ఐరన్ ఫైలింగ్స్  ఒకటి కి మరొకటి సహాయ కారి లా ఉన్నట్టు భావ సారూప్యం కలవిగా ఉన్నట్టు ఉన్న రెండు మనస్సుల కలయిక ఐన రాతలు వాక్కులు దగ్గిరైనప్పుడు వాటికి మధ్య ఓ అవినాభావ సంబంధం కలిగేటట్టు అనిపిస్తుంది.

అబ్బా , నేను కూడా ఓ థీసిస్ ప్రతిపాదించేసా ! 

చీర్స్
జిలేబి
తిరగేస్తే 'బీ లేజీ' !

Saturday, July 28, 2012

ప్రణబానందుని ప్రసవ వేదన

భాగం ఒకటి


'ఆండోళ్ళ  కే ప్రసవ వేదన ఉండా  లా '? ఏం  మగరాయుళ్ళకి  ఎందుకు ఈ ప్రసవ వేదన లేదు? ఎందుకు లేదు ? అని బ్రహ్మ ని నిల దీసింది సరస్వతీబాయ్.

బ్రాహ్మ్స్ మౌనం గా ఉన్నాడు

'బ్రాహ్మ్స్, దిజ్ ఈజ్ టూ మచ్, నేనడు గు తున్నా, సమాధానం చెప్ప కుండా ఉన్నావ్' మళ్ళీ డిమాండ్ చేసింది సరస్వతీ బాయ్.

'ఏం  చెయ్య మంటావ్ సరసూ' బిక్క మొగం పెట్టి అడిగాడు బ్రాహ్మ్స్.  ఈ ప్రకృతి చేసే మాయలో మరీ ఈ ఆండాళ్ళు లిబెరల్ థింకింగ్ వాళ్ళయి పోయేరు అనుకుంటూ.

'నిక్కచ్చి గా చెబుతున్నా, వచ్చే రోల్ అవుట్  నించి మగోళ్ళ  కే ప్రసవ వేదన ఉండేలా చేయి' ఆర్డర్ డిమాండ్ చేసింది సరస.

'ప్రసవ వేదన మాత్రమె నా ?' క్లారిఫికేషన్ అడిగాడు బ్రాహ్మ్స్ .

'అవును పరధ్యానం లో అన్నది సరస్వతీ బాయ్.

స్పెసిఫికేషన్ ఫ్రీజ్ చెయ్య మంటావా ? అన్నాడు భ్రాహ్మ్స్.

దిజ్ ఈజ్ మై స్పెసిఫికేషన్. ఐ యాం గివింగ్ మై సైన్ ఆఫ్' చెప్పింది సరస్వతీ బాయ్.

'నోటేడ్ ' బ్రాహ్మ్స్ బగ్ ఫిక్స్ కొట్టాడు.


భాగం రెండు

ఓ సక్కూ బాయ్ కి తొమ్మిదో నెల.

పురిటి నొప్పులు రావటం లేదండీ అన్నది.

ప్రాణ పతి ప్రణ బా నందు నికి పోద్దిటి నించీ కడుపులో దేవుతోంది. వికారం గా ఉన్నది అదే చెప్పాడు సక్కూ బాయ్ తో.

ఇద్దరూ డాక్టరు దగ్గిరకి పరిగెత్తేరు.

డాక్టర్ జిలేబీ  ప్రేగ్నంట్ స్పెషలిస్ట్ తల తిరిగి పోయింది, ఈ కేసు చూసి

సక్కూ బాయ్ ఓ బెడ్డు మీద, పతి  ప్రణ బా నందుడు మరో బెడ్డు మీద.

ప్రణ బా నందుడు మెలికలు తిరిగి పోతున్నాడు. ప్రసవ వేదన ఎక్కువై పోతోంది. కాని ఫలితం ఏమీ కాన రావడం లేదు.

సక్కూ బాయ్ నిమ్మళం గా ఉన్నది. కడుపులో చల్ల కదల కుండా పడు కొని ఉన్నది.

ఇదిగో అమ్మాయ్, ఇక పై ఏమీ చెయ్యలేం, ఆపరేషన్ చెయ్యాల్సిందే ' డాక్టర్ జిలేబీ చెప్పింది

కత్తి  కస్సు మంది. బిడ్డ కెవ్వు మన్నాడు.

మరో ప్రణ బా నందుడు ఉదయించాడు.

బెడ్డు మీద ఉన్న పతి  దేవుడు నిమ్మళం చెందాడు.

ఆపరేషన్ అయి సక్కూ బాయ్ నీరసం గా బెడ్డు మీద 'రెష్టు' తీసు కుంటోంది.

భాగం మూడు 

ఇదేమిటీ ఇట్లా అయింది సరస్వతీ బాయ్ బ్రాహ్మ్స్ ని అడిగింది సూటిగా చూస్తూ.

అదేమీ సరస్ నువ్వేగా అలా కోరేవు? ' బ్రాహ్మ్స్ వచ్చే నవ్వుని ఆపెట్టు కుంటూ అన్నాడు.

సరస్ కోపం తో రుస రుస లాడింది .

'రివర్ట్ బేక్ ' చెప్పింది.

'ప్రొడక్షన్ రోల్ అవుట్ రోల్ బెక్' బ్రాహ్మ్స్ ఆర్డర్ ఇచ్చాడు.

'నిద్దర నించి బయట పడి  , బాక్ పాక్ బకరా బాబు ధమ్మని బెడ్డు మీంచి  కింద పడ్డాడు.

నిద్దర మత్తు వదిలింది.

రాత్రి ప్రొడక్షన్ రోల్ బేక్  గట్రా ఆలోచనల తో నిద్దర పోతే ఇట్లాంటి కలలు  గాక ఇంకా ఎట్లాం టివి వస్తాయి అని మళ్ళీ ముసుగు దన్ని పడు కున్నాడు, అబ్బా, ఈ కలల్లో కూడా ఈ జిలేబీ ల దాష్టీకం ఎక్కువై పోతోందే మరి అని ఉసూరు మను కుంటూ.

కథ కంచికి మనం వారాంతానికి !చీర్స్
డాక్టర్ జిలేబీ,
ప్రసవ స్పెషలిస్ట్

(ఐటీ లోకం లో అన్నిటికి ఒక స్పెషలిస్ట్ ఉంటా రట   మా మనవడు చెప్పాడు, డాక్టర్ల లోకం స్పెషలిస్ట్ లా వీళ్ళ కీ బుర్ర మోకాలి లో ఉంటుం దట , ఏమిరా అబ్బీ అంటే , ఒక స్పెసిఫికేషన్ ఇచ్చారంటే దాని పూర్వా పరాలు పూర్తీ గా ఆలోచించక స్పెసిఫికేషన్ ఇస్తారట. అక్కడి నించి 'నాలుగు స్థంబా లాట మొదలు, ఫైనల్ గా ప్రొడక్షన్ ప్రాబ్లెం, రోల్ బెక్ అంటా  రని  చెప్పాడు.. ఈ బ్లాగ్ లోకం లో బ్రాహ్మ్స్ అండ్ సరస్వతీ బాయ్స్ చాలా మంది ఉన్నారను కుంటా. సో, వారి కందరికీ ఈ టపా అంకితం.)

Friday, July 27, 2012

కోతకి పెరిగిన పైరు


రైతన్న నారు పోసి నీరు పోసాడు 

పైరు గాలికి ఉల్లాసం గా తల లూపు తోంది.

పైరు కోత  కొస్తోంది రైతు సంతోష పడ్డాడు.

పైరు మరింకా సంతోషం తో తలూపుతోంది.

తలవొగ్గని పైరు కి ప్రకృతి లో పరిపూర్ణత్వం లేదు.

ప్చ్.. ఈ మానవుడు మేధావి అనుకుంటున్నాడు 

తలవొగ్గని మానవుడికి ప్రకృతి  లో పరిపూర్ణత్వం ఉందా 

ఈ మేధావి కి ఆ పైరు కున్న పాటి నిశ్చింత ఉందా?
చీర్స్ 
జిలేబి.

Thursday, July 26, 2012

వయ్యారాలు పోయిన వరూధిని ప్రవరాఖ్య !

అమ్మాయి వరుడి ముందు బుట్ట బొమ్మలా ఉన్నది

వరుడు అమ్మాయి తలెత్తి చూస్తుందేమో అని వేగిర పడుతున్నాడు

అమ్మాయి సిగ్గు మొగ్గై ఉన్నది.

మనసు ఆరాట పడు తోంది, తల పైకెత్తి చూడొచ్చు గా?

ఊహూ.. సంకోచం ఆందోళన కలగలసిన చూపుల సమయం

అమ్మాయ్ ఓ మారు తలెత్తి చూడవమ్మా అబ్బాయి నీ వైపే చూస్తున్నాడు , ఓ ముత్తైదువ ఉవాచ.

ఊహూ.

సీతా కల్యాణం అయిపోయింది.

పందిరి మంచం మీద అమ్మాయి చుబుకం పైకెత్తి అబ్బాయి కనులలో కనులు కలిపాడు.

వరూధిని వయ్యారాలు పోయింది!

ప్రవరాఖ్యుని కౌగిలి లో కరిగి పోయింది.


భాగం రెండు

'హాయ్ ప్రవర్ హౌ ఆర్ యు యార్ '

ప్రవర్ అమ్మాయి పలకరింపుతో బెరుకు పడ్డాడు.

అమ్మాయి కిసుక్కున నవ్వింది.

'నిన్నే పెళ్ళాడుతా తప్పక ' అమ్మాయి అబ్బాయి బుగ్గ గిల్లి వెళ్ళింది.

అబ్బాయి సిగ్గు మొగ్గయ్యేడు.

పట్టు బట్టి, పంతం బట్టి అమ్మాయి అబ్బాయిని స్వంతం చేసుకున్నది.

సీతా కల్యాణం అయింది

పందిరి మంచం మీద అబ్బాయి  చుబుకం పైకెత్తి అమ్మాయి  కనులలో కనులు కలిపింది.

ప్రవరాఖ్యుడు  వయ్యారాలుపోయాడు

వరూధిని కౌగిలి లో కరిగి పోయాడు!

సర్వ భూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే!


చీర్స్
జిలేబి.

Wednesday, July 25, 2012

అమావాశ్య అర్ధ రాత్రి

అమావాశ్య అర్ధ రాత్రి చందురూడు గబుక్కున 
మేఘాల మధ్య నించి బయట పడినాడు 

నిండు వెన్నెలై ప్రియుని కౌగిలి లో 
వాలి పోదామనుకున్న చిన్నది సిగ్గు పడి పోయింది.

పున్నమి వెన్నల నాడు 
చందురూడు మబ్బుల మాటున దాగాడు 

పండు వెన్నెల లో ప్రియుని కౌగిలి లో 
మమేకం అవుదామనుకున్న చిన్నది చిన్న బోయింది.


తారలు చండురూడిని ముద్దాడి ముక్కు పిండి 
లాక్కు వెళ్లి పోయేయి చిన్నదాని వ్యధ గమనించి 

చందురూడు నవ్వాడు ప్రియుడు పరవశం చెందాడు 
చిన్నది చుక్కయై చమక్కు మన్నది పరవశం తో 

కమ్మ తెమ్మర వయ్యారాలు పోయింది
తన ప్రియుని వెతుక్కుంటూ సాగి పోయింది.చీర్స్ 
జిలేబి.

Tuesday, July 24, 2012

అసూర్యం పశ్య !

ఓ దొరసనాని అసూర్యం పశ్య !

తన మానాన తా బతికేసుకుంటూ కుటుంబాన్ని లాక్కోచ్చేది.

మగడు ఏమి తెచ్చినాడో దానిని బట్టి ఇంటిని సర్దేది. గృహ శోభ తానె అయి , వన్నె తెచ్చింది.

ప్చ్!

కాలగతిన ఓ రాజా రామ మోహన్ రాయ్ ,గురజాడ, సర్వే పల్లి, ఆ గృహ శోభ కి మరింత వన్నె తెద్దామని కొత్త పుంతలకి వరవడి చుట్టేరు.

కాలం మారింది.

ఇప్పుడు ఓ షబనా, ఓ తస్లీమా, ఓ శోభా దే, గృహ శోభ కి మరిన్ని మెరుగులు తెద్దామని సరి కొత్త ఆలోచనలకి పట్టం కడుతున్నారు.

ఓ స్త్రీ నీ నాడు ఒకరు నిర్ణ యించారు . నీ ఈ నాడు మరొకరు నిర్ణయిస్తున్నారు.

మరి నీ మాటేమిటి? నీ రాబోయే కాలం ఎవరి చేతిలో ఉన్నది? అది నీదేనా ?

లేక ఒకప్పటి అసూర్యం పశ్య మళ్ళీ 'అసంపుస్ప్రశ్య   అయి పోతోందా ?

ఎవరీ ప్రశ్న కి సమాధానం చెప్ప గలరు?

జిలేబి.

Monday, July 23, 2012

తప్పు మొగుడి దే అయినా శిక్ష పెళ్ళా నికే !

ఏ జాతి చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం
'శ్రీ' జాతి సమస్తం
స్త్రీ హస్త పరాయణం

ఇది బయటి మాట
మరి अंदर की बात?

తప్పు మొగుడి దే అయినా శిక్ష పెళ్ళా నికే !

ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం లో
ఒక ఫిఫ్టీ మరో ఫిఫ్టీ కన్నా
ఎప్పుడూ ఎక్కువే

అని ఆమధ్య ఓ జిలేబీ అన్నది

చరిత్ర పునరావృతం.

భార్యా బాధితులు బాబా లయ్యే దానికి ఆస్కారం ఉన్నది

మరి


భర్త బాధితులు ?

ఈ ప్రశ్న కి బదులేది?

ఈ సమస్య కి కారణం ఎవరు?

ఫైనాన్షి యల్ ఫ్రీడం ఇచ్చింది ఎవరు ? పుచ్చు కున్నది ఎవరు?

చదువు నేర్చుకోమంది ఎవరు? చదువు కొన్నది ఎవరు ?

సమానత్వం లో అసమానత్వమా ?

ఆకు ముళ్ళు సమీకరణం లో ఎప్పుడూ ముళ్ళ కే ఎందుకు గొప్ప దనం ?

ఏమండీ మీ కేమైనా తెలుసా?

జిలేబి.
(జిలేబీ పరార్!)

Saturday, July 21, 2012

మందల్ దొర గురువు గారి కథ

పిచ్చాపురం లో గొర్రెల మందల ని మేపుకుంటూ తన మానాన తాను బతికేసు కుంటున్న  మందలోడు  ఓ తెల్లారి మందల్ని  బుజ్జగిస్తూ, గదమాయిస్తూ , చిన్ని బెత్తం తో పచ్చిక కోసం బయట పడ్డాడు.

నోట్లో కడా మార్కు బీడీ, చేతిలో బెత్తం, పై కెగ గట్టి న కొల్లాయి, ఓ బనీను 'సొగ్గుడ్డ' మొత్తం మీద పిచ్చాపురపు పిచ్చి మారాజు వాడు.
తినడానికి ఉంటే తింటాడు. ఎవరైనా పిలిచి అన్నం పెడితే బువ్వ తిని బ్రేవ్ మని 'బాగుండా దమ్మా బువ్వ' అనడం వాడికి తెలిసినది . అది ఎట్లాటి  బువ్వ అని వాడికి పట్టింపు లేదు. కవళం పెట్టిన తల్లి కనకాంగి అంతే.

ఇట్లాటి పిచ్చి మారాజు కి అవ్వాళ  ఆ వైపు కారులో వెళ్తూ ఓ సూటూ బూటూ వేసుకున్న ఆసామి కారులో వాడి మందలకి  అడ్డం పడ్డాడు.

'కంట్రీ బ్రూట్ ' అన్నాడు కారు దిగ కుండానే ముఖం చిట్లించి సూటూ బూటూ  వేసుకున్న ఆసామి.

మందల దొర నవ్వాడు. ఆసామి ఏమన్నాడో తెలీదు గాని వాడి సూటూ బూటూ వాడి కి బాగా నచ్చింది. సోగ్గా ఉన్నాడే  అని అనుకున్నాడు.

మందలు దారి ఇవ్వలే. కారు దిగేడు ఆసామి. కుర్ర వాడి లా ఉన్నా వాడి పోయిన చెట్టు కొమ్మ లా ఉన్నాడు. ముఖం లో తెలియని వ్యధ.

ఆసామి మిథ్యా లోకపు ఐటీ మానవుడు.

బెంగుళూరు మహానగరం లో ఆనాటి బిజినెస్ మీట్ ఫ్లాప్ అవడం తో ఏ  పొద్దుట పూటో ఆఫీసు నించి బయట పడి  చికాగు గా రోడ్డు మీద పడి  దిక్కు తెలీక డ్రైవ్ చేస్తూ అప్పటి దాకా పిచ్చాపురం అని ఒకటుందని కూడా తెలీకుండా ఉన్న వాడు,

అసలు ఐటీ లోకం అంటూ ఒకటి ఉందని దాంట్లో సూటూ బూటూ  వాళ్ళు అప్పుడప్పుడు అర్ధ చడ్డీ లతో కూడా ఆఫీసు కొచ్చి పనిచేసే వాళ్ళు, పదివేళ్ళు , బుర్ర మాత్రం ఉండే వాళ్ళు, బడా బడా కార్లు ఉన్న వాళ్ళు, ఇత్యాది బహు విశేషాలు కల వాళ్ళు ఉంటారని తెలీని మందల దొర మరో వైపు,

వీళ్ళిద్దరూ ఆనాటి పొద్దుట పిచ్చాపురపు బయలు లో కలవడం అన్నది విధాత తలపున కలిగిన చిలిపి చేష్ట.

(ఇంకా ఉంది)

Thursday, July 12, 2012

బాక్పాక్ బకరా బాబు కథ (ఫణీంద్ర గారి కోరిక పై)

బాక్పాక్ బకరా బాబు కథ (ఫణీంద్ర గారి కోరిక పై)

మొన్న టపా రాయ డానికి మేటరు ఏమీ లేదంటే బాక్పాక్ బకరా బాబు కథలు రాయండని పీక్యూబ్ ఫణీంద్ర గారు చెప్పేరు.

బాక్ పాక్ బకరా బాబు గురించి చెప్పా లంటే మేటరు కు కొదవేంటి ?

ఇంతకీ ఈ బాక్బాక్ బకరా బాబు వేష ధారణ గురించి చూస్తే, మానవుడు బాక్పాక్ తో బాటు తలకో (చెవికో) పరికరం పెట్టుకుని (ఏమిటది ? నీలి పళ్ళు - అబ్బా పళ్ళు ఎందుకు చెవిలో పెట్టు కుంటారు సుమీ వీళ్ళు ? పళ్ళూడి పోయాయా అంటే అదీ లేదు మరి ) చేతిలో రెండు బ్లాక్ బెర్రీ లు పెట్టు కుని ( అదేదే స్ట్రా బెర్రీ ఉన్నా ఫర్లేదు , ఏదో అబ్బాయి ఆరోగ్యం గా వుండ డానికి  స్ట్రా బెర్రీ చేతిలో పెట్టుకుని ఉన్నాడు అనుకోవచ్చు!) కనబడ్డాడు మొన్న మహా నగర  వీధుల్లో.

హలో అని పలకరించా.

మానవుడు జవాబివ్వలే. మళ్ళీ హలో అన్నా. జవాబు లేదు ఇట్లా కాదనుకుని మొబైల్ నించి తనకి కాల్ ఇచ్చా. వెంటనే మబైల్ ఆన్ చేసి 'గుడ్ మార్నింగ్, బాక్పాక్ బకారాబాబు హియర్ అన్నాడు.

అబ్బో మానవుడు ఫోన్ లో గాని మాటలాడ డు సుమీ అని ముక్కు మీద వేలేసుకున్నా !

ఫోన్ కట్ చేసి బకారాబాబు బాగుండావా నాయనా అన్నా.

అప్పటికి తను ఈ లోకం లోకి వచ్చేడు.

ఆ ఎం బాగు  బామ్మ గారు అన్నాడు.

అదేమిటోయ్ లక్షల్లో సంపాదిస్తా వుండావు  అట్లా నీరస పడి  పోయావు అడిగా.

ఎక్స్క్యూస్ మి , అని మళ్ళీ ఫోన్ ఆన్ చేసి చేతి తో సైగ చేసేడు.- ముఖ్య మైన కాల్ అన్నట్టు.

ఆ చెవిలో ఉన్న పరికరం, వాడి అవతారం చూస్తే, ఫక్కున నవ్వొచ్చింది

ఎవరైనా తమకు తామే మాట్లాడు కుంటూం టే  ఎవడీ పిచ్చోడు అనిపించేటట్టు  ఉన్నాడు మానవుడు.

తన ఎదుట ఎవరో ఉన్నట్టు వాడు ఊగేస్తూ తల ఎగరేస్తూ మాట్లాడు తున్నాడు

చేతులు విపరీతం గా ఊపెస్తున్నాడు.

భయం వేసింది బకరా బాబు కి ఏ  మైనా ఫిట్స్  వచ్చేస్తుందేమో నని.

బకరా బాబు బకరా బాబు అన్నా, వాణ్ని గట్టిగా ఊపా. .

ఐయాం ఆల్రైట్ అన్నాడు వాడు.

ఏమి రైటో ఏమి లెఫ్టో  పైనున్న మా వేంకటేశు స్వామీ వారికే తెలియాలి మరి !

అబ్బాయ్ ఇట్లా ఇంత సేపు మాట్లాడతా ఉండావే గొంతు పట్టుకు పోదా అన్నా.

బామ్మా, ఏం  చేసేది, ఇట్లా మాట్లాడు తానె ఉండాలాయే మరి అన్నాడు.

కొందరికి మాట్లాడ తానె ఉండటానికి కంపనీలలో డబ్బులు ఇస్తారట!

అంతే గాక, ఎవడేక్కువ మాట్లాడితే వాడికే పైసలు ఎక్కువట మరి. పొద్దస్తమానం మీటింగులూ, ఎక్సెల్ షీట్లలో కలర్ఫుల్ గా గ్రాఫులు గట్రా రాస్తే గీస్తే ఇంకా పైసలు ఎక్కువట మరి. బాక్పాక్ బకరా బాబు విశదీకరించాడు.

ఏమి బకారాబాబు మరి మీ ఆఫీసులో ఎవడు అసలైన పని చేస్తాడు ? అన్నా అర్థం గాక.

బామ్మోయ్,ఇట్లాంటి జవాబులు లేని ప్రశ్న అడగ మాకే, అన్నాడు వాడు.

సరే బకరా బాబు భోజనం  మాటేంటి ?  అని సందేహం పడ్డా.

నో భోజనం. ఓన్లీ వర్కింగ్ లంచ్ అన్నాడు.

సరే మీ ఆవిడ ఎలా ఉందోయ్ అడిగా..

తన్ని చూసి నెల రోజులాయె అన్నాడు.

ఏమిరా ఏమైనా విశేషమా పుట్టింట్లో ఉందా ? సంతోషం తో అడిగా, అబ్బా ఇన్నేళ్ళకి ముని మనవడు చూడొచ్చు సుమీ అని ఆశ పడి పోయి.

అబ్బే, తనది నైట్  డ్యూటీ నాది డే డ్యూటి. ఇద్దరం సరైన సమయం లో ఒక్క నెలదాకా ఇంకా కలవందే  అని కలవర పడి  పోయేడు !

ఏడు కొండల వాడా గోవిందా గోవిందా మరి!

ఏమండీ పీక్యూబు పురాణ పండ ఫణి గారు, మీ కైమనా బకరా బాబు మిసెస్ బకరీ బేబీ కనబడితే కాస్త బకరా బాబు ని కలవ మని చెబ్దురూ మరి !

చీర్స్
జిలేబి.

Tuesday, July 10, 2012

'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే'!!

మొన్నేదో కొత్త కణాన్ని , ఇప్పటి దాకా ప్రతిపాదన లో ఉన్న కణాన్ని ఫైవ్ సిగ్మా స్యూరిటీ  అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ మూడున్నర మిల్లియన్ లో ఒకటో వంతట  - దీటుగా చెప్పగలం ఇది ఉన్నది అని అన్నంత దాటీ గా చెప్పారని పేపర్లో చదివాకా మా అయ్యరు  గారు,,

'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే' అన్నారు..

కణముల లో కణం అన్న మాట ఈ దైవ కణం..

కణా లన్నిటికీ వాటి ఉనికి వాటి మాస్ కి ఈ దైవ కణం మూలాధార మట

సో,,

'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే'!!

ఉంది అనే దాన్ని ఉంది అని చెప్ప డానికి   ఎన్ని తంటాలు పడ వలసి వస్తోంది సుమీ అని హాశ్చర్య  పోయా..  వాళ్ళ సెర్న్ రీసెర్చ్ సెంటర్ పది బిలియన్ డాలర్ల పై చిలుకు ఖర్చు తో కూడినద ట .

 ఏ హిమాలయాల్లో నో లేకుంటే ఏ  కుగ్రామం లో నో ఎ మూలో కూర్చుని ముక్కు మూసుకుని ఉన్నాడు ఉన్నది అన్న దాన్ని కనుక్కోగ ల మానవుడు ఓ వైపు,, దాన్ని ఉంది అని చూస్తే గాని ఉంది అని ఒప్పుకోలేని మానవుడు మరో వైపు, ఒకడి కి ఒకడి ప్రతి బింబం లా ఉండటం కూడా ప్రకృతి విశేషమే మో అనిపిస్తుంది మరి !


సో,, జిలేబి కావాలంటే డోంట్ బీ లేజీ సుమీ అని ప్రకృతి చెబ్తున్నది లా ఉన్నది ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే.. మీ రేమంటారు మరి ?


చీర్స్
జిలేబి.

Sunday, July 8, 2012

కామెంటిన కనకాంగి కోక కాకెత్తు కు పోయిందని ....

ఓ కనకాంగి కామెంటు దామని తీరిగ్గా బ్లాగు లన్నీ చదవటం మొద లెట్టింది..

ఓ లమ్మో బ్లాగులన్నీ ఏమి రాస్తారు సుమీ వీళ్ళు అని హాశ్చర్య  పోయింది..

మన తెలుగు బ్లాగు లోకం గత మూడు సంవత్సరాలు గా మారుతూ వస్తోంది.. కొత్త సరికొత్త బ్లాగరి ణీ  బ్లాగర్లు వస్తున్నారు.. సరికొత్త 'మేటరు'' తో మన బ్లాగు లోకం లో కొత్త పుంతలు తొక్కుతూ..

ఆ మధ్య రాయడానికి మేటరు ఏమీ లేక ఏమి చేద్దారి అని ఆలోచిస్తా ఉంటే,, మేటరు లేకుండా టపా 'కట్టడం'' ఎలా అని రాస్తే,, ఓ బ్లాగరు కామెంటు దారు టపా కట్టడం అంటే వేరే అర్థం వస్తుందండీ అని నాజూగ్గా చెప్పేరు.

సరే పోనీ సామేతల్లా బ్లాగ్ వితలు  రాద్దామని కొంత ప్రయత్నం చేశా.. అందులో ఈ కామెంటిన కనకాంగి కోక కాకెత్తు  కు పోయిందని రాయడం జరిగింది..

ఇతకీ ఈ మాట మళ్ళీ ఎందుకు అంటారా ?

ఇప్పుడు మళ్ళీ రాయడానికి ఏ మేటరూ లేదు మరి..

సో,, ఈ ఒక్క వాక్యం రాసి పోనీ ఏదైనా ఆలోచన వస్తే కొనసాగిస్తామని కొంత టీం పాస్ అండ్ టైం పాస్ చేద్దామని మరీ దురదస్య దురదః ఐన ఈ బ్లాగ్ టపా లోకం లో కొంత సేపు ఎంజాయ్ మాడీ  అని ఆలోచించి ఈ టపా శీర్షిక పెట్టడం...  ఆ పై రాయడానికి ఏమీ లేక బుర్ర గోక్కోవడం (సరిగ్గా ఈ విషయం మీదే బుర్ర గోక్కోవడం అన్న విషయం మీదే ఆలోచిస్తా ఉంటే,, బుర్ర గోక్కుంటే ఏమైనా ఐడియాలు వస్తాయా ఏమిటి జిలేబీ అని మా అయ్యరు  గారు కొంత 'సైడు కిక్కు'' ఇచ్చారు మరి!!)

ఇంతకీ ఈ టపా దేనికోసం కట్టా చెప్మా ? అబ్బబ్బా ఈ దురద వదలదు సుమీ ! రాత కోతలు లేకున్నా రాత కోటలు  దాటడం అంటే ఇదే నన్న మాట మరి !

దురద గొంటాకు
జిలేబి..

Friday, July 6, 2012

మహానగరం లో మంత్రవాది

 మహానగరం లో సూరీడు హర్రీ బర్రీ గా ఉదయించాడు.. తనకి నగరం లో వాళ్ళు నిద్దురోతే నప్పుదు లాగుంది,, పైకి వచ్చీ రావడం తోటే, సుర్రు  మని తీక్షణం గా నగరాన్ని చూసాడు..

బ్యాక్ప్యాకు  బకరా బాబు నిద్ర లేచి  ఆవులించాడు.. ఇంకా నిదుర మత్తు వదల్లేదు తనకి.. మరో రోజుకి స్వాగతం చెప్పాలా వద్దా అని ఆలోచించి బుర్ర వేడెక్కటం తో ఆ ఆలోచనకి ఉద్వాసన .పలికాడు

మనిషి రేతిరి నిదుర లేమి తో డీలా పడి పోయున్నాడు.. ఆ పై కరెంటు .కోత . బస్సుల వాహనాల రణ గొణ ధ్వనులు..

సరిగ్గా అప్పుడే ఓ మంత్ర వాది మంత్రం వేస్తా నని రోడ్డు మీదికి వచ్చాడు..

బకరా బాబు ఇంటి ముందట నిలబడి కేక పెట్టాడు.. 'అయ్యా,, బాబు,, మీ అన్ని సమస్య లకి మంత్రం వేస్తా తలుపు తీయండి అని..

బకరా బాబు తలుపు తీసాడు..

'ఏమోయ్ మా మేనేజరిణి  కి ఏదైనా మంత్రం వేయి రాదూ.... పొద్దస్తమానం పనీ పనీ అని తెగ హైరానా పడి పోతూం టూంది అన్నాడు వాడు..

మంత్ర వాది బెరుకు పడ్దేడు .

అయ్యా మేనేజరి ణి  జిలేబీ గారేనా ? అడిగాడు వాడు..

అవునోయ్ నీకెట్లా తెలుసు ? చెప్పాడు బకరా బాబు..

అయ్యా ! ఆవిడ తలనొప్పి భరించ లేకనే కదా నే ఇట్లా మంత్ర వాది వేషం మొదలెట్టాను.. అన్నాడు మంత్ర వాది..

అప్పుడే ఆ వైపు ఓ టాటా సుమో గాడి దూసు కెళ్ళింది..

మంత్ర వాది వెంటనే వేషం మార్చి సీదా సాదా మానవుడు గా మారేడు..

సాదా సీదా మానవుడు సలాము కొట్టేడు టాటా సుమో గాడికి..

సలాం ముంబై !

(ముంబై కర్ లకి వారి ఓర్పు కి జోహార్లతో )

చీర్స్
జిలేబి..

Tuesday, July 3, 2012

గురు పూర్ణిమ - గుండు సున్నా

ఇవ్వాళ గురు పూర్ణిమ.

గురువు లేక ఎటువంటి గుణికి తెలియదని త్యాగరాజ స్వామీ వారి ఉవాచ.

అందరికీ ప్రస్తుత జమానా లో గురువు ఉండి ఉండ క పోవచ్చు.

అంటే, గురువు దొరకాలంటే దానికీ పెట్టి పుట్టి ఉండా లంటారు. నేను చెబుతున్నది సద్గురువు ల గురించి.

మన కర్మ కొద్దీ మనకు గుండు సున్నా గురువు లూ తగలవచ్చు.

గుండు సున్నా ఆహా ఏమి అమోఘం అని మనం వారి సున్నా లో భాగమై పోయి సుడి గాలి లోని నావలా కొట్టుకు పోవచ్చు.

కాబట్టి గురువు ని గురించి సదవగాహన కలిగి ఉండటం అన్నది మన ఈ కాలానికి కావలిసిన కనీస అవసరం. లేకుంటే గుండు సున్నా మనకి కలిగే అవకాశం ఉన్నది

కాషాయం కట్టిన వాడంతా గురువై పోతే మనం గుండు సున్నా లయి పోవడం ఖాయం.

ఓ ఫ్రిడ్జ్ కొనాలంటే మార్కెట్ లో కెళ్ళి వంద మార్లు విచారణ మొదలెడతాం. కాని స్వామీ వారల కొచ్చే సరికీ మన ఈ విచక్షణ హుష్ కాకీ అన్న మాట. !

ఇంతకీ గురు పూర్ణిమ అని ఇట్లాంటి సంభాషణ రాస్తున్నారేమిటి మీరూ ఏమైనా గుండు సున్నా గురువు లయి పోయారా అంటారా,మరి జిలేబీ రౌండు గా గుండు సున్నా లా నే కదండీ ఉండేది.?

అందరికీ శుభాకాంక్షల తో,

శ్రీ కృష్ణం వందే జగద్గురుం.

జిలేబి.