"ఏమిరా అబ్బిగా, ఈ మధ్య ఊళ్లూ ఊళ్లూ చుడుతూ గొప్ప సన్యాసి వై పోయావట ? " అడిగా, చిన్నప్పుడు చూసిన ఏబ్రాసి వెధవ అనబడే మా ఊరబ్బాయి ఈ మధ్య పెద్ద సన్నాసి అయిపోయాడని తెలిసి వాణ్ని  కలిసి అడిగా .
వామ్మో, జిలేబమ్మ తల్లీ మీరా అన్నాడు వాడు కనబడీ కనబడంగా నే! 
అవునోయ్ నేనే అన్నా
ఎట్లా మీ దర్శనం ఈ దేశం కాని దేశం లో అన్నాడు మాట తప్పించి. 
"ఏమీ లేదోయ్, మీ భాష లో చెప్పా లంటే చాతుర్మాస్య వ్రతం ! ఓ నాలుగు నెలలు ఇక్కడ ఉండి పోదామని వస్తే, మనవడు చెప్పేడు ఏబ్రాసి సన్నాసి కూడా ఈ ఊళ్ళో నే ఉన్నాడు బామ్మా అని. పోదారి మనూరి బుడతడే కదా చూసి పోదామని ఇట్లా వచ్చా " చెప్పా. 
'సరే ఎట్లాగూ వచ్చావు కదా తల్లీ, నా ఉపన్యాసం ఉంది విని మరీ వెళ్ళు'  అన్నాడు ఆప్యాయత తో. 
'నువ్వు చెప్పి నేను వినాలట్రా ఏబ్రాసీ ' అనబోయి ఏ పుట్టలో ఏ  పాముందో మా ఏడు కొండల పెరుమాళ్ళ కే ఎరుక అనుకుని 'అట్లాగే లేరా అనబోయి, ప్రక్కన ఎవరో పెద్దాయన మరీ వంగి పోయి స్వామీ వారికి నమస్కారం చేస్తూం టే , బాగోదని , సభా మర్యాద గా, అట్లాగే స్వామీ అన్నా! 
వాడు నవ్వాడు. 'ఏమి తల్లీ, నామోషీ పడి పోయావు, అట్లాగే లేరా అని ఉండ వచ్చు గా! అందరూ నన్ను గౌరవిస్తా వుంటే నా తల తిక్క మరీ బిగిసి పోదూ. ఇట్లా ఆప్యాయత తో 'రా' అని పిలిపించు కోవడం చాలా నాళ్లా యే ! గౌరవ స్థానపు ఇక్కట్లు' అన్నాడు. 
ఓ మారు నింపాదిగా చూసా ఏబ్రాసి వైపు. నిండా ముప్పై ఏళ్ళూ  లేవు. స్వామీ అయిపోనాడు. ప్చ్ అన్నీ గౌరవ సంబోధన లే మరి! 
కొంత విచారం వేసి,  'అట్లాగే లేరా అబ్బీ' అన్నా 'నీ ఉపన్యాసం విని ఆ పైనే పోతా' అన్నా. 
సంతోష పడ్డాడు అబ్బాయి. 
'ఉపన్యాస ప్రారంభం లో మా గొప్ప గా, నా గురించి చెప్పి, 'ఈ తల్లి ఇక్కడ ఉండడం చూస్తూంటే నా తల్లి ఆశీర్వచనాలే సుమీ! వేలాది మైళ్ళు దాటి వచ్చినా మన ఊరి వారిని మన దగ్గరికి పంపించింది ఆ తల్లి అన్నాడు.!
వామ్మో, వీడు మరీ నిజంగానే వేదాంతి అయిపోయేడు సుమీ అనుకున్నా !
ఏమైనా, మన ఊరి వాళ్ళు ఇట్లా ఏ  ఫీల్డ్ లో నైనా గొప్పగా పై కొస్తే, మనకు సంతోష మే కదా మరి! 
ఓకే, ఇంతటి తో చాతుర్మాస్య జిలేబీ 'వ్రాత' కథ ఇంతటి తో పరి సమాప్తం !
 శుభోదయం!
చీర్స్ 
జిలేబి. 
(The World is round, it has no point!)