రోనెలతల్ గణేరువుల రొమ్ముల తేలెడు నిత్యభోగి నీ వా నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట? నీకు యుక్తమే నా? నలు వైపు లన్ తిరిగి నచ్చని వారల తిట్టుటేలనో? మానవ మార్పు చెందుము సమాశ్రయ మైనది సత్యలోకమే
శంకరార్యుల కల! దుష్టులెల్ల రాముని లా మారి పరిపాలిస్తే ఎంత బాగుండునో నద్వందమై, ఏకం సత్ గా వెల్గు భువి కదా!
ఆ ముని మాపు వేళ కల నా కనులంబడె కైపదమ్ముగా సామము గాను దోచినది చక్కటి పూరణ లెల్ల చేయనా రాముఖ మైన వాక్యముగ! రండి సవాలును స్వీకరించుడీ "రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా"
తెలుసుకోవాలి గదండీ మరి. మీరిచ్చిన లింక్ లో “హైకూ”ల గురించి ఉంది. విదేశీ ప్రక్రియ. “నానీ” స్వదేశీ అనుకుంటాను. ఏదైనప్పటికీ కవిత వ్రాయడాన్ని సరళం చేసినట్లున్నాయి. లింకిచ్చినందుకు థాంక్స్.
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
ఇది తవికా ?
ReplyDeleteరాజు గారి దేవతావస్త్రాల లాగా ఇది తవికా అని అడుగుదామని చాలా మందే అనుకునుండవచ్చు గానీ అడిగేసింది మాత్రం మీరే, నీహారిక గారూ 👌🙂.
ReplyDelete🤦
Deleteఎర్ర సూరీడు
ReplyDeleteనీలి సంద్రం
మాటున.
లేచి వచ్చె
తెల్లవారె!
ReplyDeleteమేస్త్రీ పెండ్లాడెనయా
ఆ స్త్రీ కొన్నేండ్లు వేచెనా సంతతికై
శాస్త్రము తెలిపిన సమయము
శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్
జిలేబి
ReplyDeleteఏకలింగము తీసివేసెను నేయగాను కమింట్లనే
కాకులెత్తుకు పోవు మాలిక కష్టమాయె జిలేబియా
జిలేబి
మా లక్కు పేట రౌడీ మొరనాలకింపవయ్యా !
ReplyDeleteపామును కలుగున విడువం
గా మీనమ్ములు వడివడి గా వెలుబడె! ఓ
యీ మానవుడా కలదా
నీ మేధాశక్తికి సరి నెవ్వపు వేళన్!
జిలేబి
ReplyDeleteకందగీతి
అకటా జిలేబి! "పాండవు
ల కంటె మూర్ఖులు వసుధఁ గలరె" చూడగ పా
చికలాడి వారి రాజ్య
మ్ము కట్టు కున్నట్టి భార్య మొదలు విడిచిరే
జిలేబి
ReplyDeleteకందోత్పల
మరిమరి జూదమునకు బి
ల్తురు! పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్
మఱి లేరు లేరు గా పో
యి రొంపిని పడుదురు దురద యిదియె జిలేబీ
జిలేబి
ReplyDeleteజూదమునకు బిలువగ హుజూరటంచు
పోయి యున్నదంతయునట పోచుపుచ్చు
కొనుట లోన జిలేబులు కోరి కోరి
పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె?
జిలేబి
ReplyDeleteవండలి పూసుకోవలదు వద్దిక పాచికలాట మాటలే
దండగమారి జూదమది! దాయని బిల్వగ పోయి పోయి రా
రండని నాటలాడుచు హిరణ్యము భార్యను నొడ్డుటందు హా!
పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా
జిలేబి
ReplyDeleteతతరతి కారణమాయె పొ
లతి ముందటి జన్మ కర్మలవలన ప్రార
బ్ధతగానై పాండు నృపుని
సుతులే పతులనెను కృష్ణ చొక్కఁపు మాటౌ!
జిలేబి
ReplyDeleteపతి మౌద్గల్యుని కామరూపముల నాప్యాయమ్ము లే మూల? నా
రతి యున్మాదము తీరనా పశుపతిన్ రాత్రింబవళ్ళున్ మన
స్సు తిరమ్మై కొని యాడె వాని కృపగా సొంపారు కౌంతేయులీ
సుతులే, నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా!
జిలేబి
ReplyDeleteమబ్బు - వాన - ముసురు - వరద
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
హే కృష్ణా ముకుందా మురారి ! దౌపది పిలుపుగా
రావా ననుకావన్ వర
దా!వలమబ్బురము వ్రేకదనమును కావం
గా వేగిరము! సురుగు నె
త్తావికి సాయమ్ముగ నగధరుడా రమ్మా!
జిలేబి
ReplyDeleteఇవ్వాళ జీపీయెస్ వారు రాయ లేదు కాబట్టి , వారి తరపున నేటి భారతం వారి ప్రియతమ బెంగాలు+ మమతా దీదీ :)
రావా! నరేంద్ర మోడీ!
యీ వానల గనుము సురుగు లిచ్చెను బెంగా
లే వరదల మయమై! నీ
వే వరదాయివి! మమతయె వేమబ్బుకొనెన్!
జిలేబి
ReplyDeleteసూరట్టుకు జారె సుమీ
వారగ చూచి కనుగొట్టె వాడే పోయా
నే రేతిర్ని తడిసి! సలి
కోరల్తో ఉరిమి ఉరిమి కుదిపేసేడే !
జిలేబి
ReplyDeleteపిచ్చి రాము డొచ్చె పిలవాండ్రు ర్యాగింగు
విరివి గాను జేయ వేసె నొక్క
దెబ్బ చూడ గాను దేశవాళి సరుకు
గడుసు పిండ మే నిఖార్సు గాను :)
జిలేబి
ReplyDeleteకందోత్పల
వదినా ! అబద్ద మింత వ
లదె?శాంతినిఁ గోరు వార లనె శత్రువులం
చుఁ దలంత్రు సజ్జనుల్? పద
పదవే తప్పుల తడకల పలుకులవేలా ?
జిలేబి
ReplyDeleteమిత్రు డగును మనకు మిన్నగను జిలేబి
శాంతిఁ గోరువాఁడె, శత్రువు గద
చేటు కలుగ జేయు చింతల ద్రోయుచు
విశ్వదాభిరమణి వినవె భామ
జిలేబి
ReplyDeleteఅమ్మ మాట అందాలబాటౌ జిలేబి
రావు గారి పల్కులవియె రసగుళిక క
దా వినవె బాల సుద్దుల తరము గాను
విశ్వదాభిరమణి యిది విశ్వగీతి !
జిలేబి
ReplyDeleteఆదివారము సూర్యగ్రహణము వచ్చు
సుజను లార తెలుగుయోగి సూచనలను
చూడవలె తెలివిడి తోడు సురుగు లేను
సురుగు నెల్ల దేశములకు సుగుణ బాల !
జిలేబి
ReplyDeleteప్రకటించితి ప్రచురింపం
గ కూర్పు పూరణల మాలికగ చూడగ నా
డికముగ నెన్నుకొనగ పొ
ల్తుక! వే లకొలఁది సమస్యలు వెతలఁ గూర్చెన్!
శంకరుల వారి మాటగా
జిలేబి
కందగీతి
ReplyDeleteకందోత్పల
గసవచ్చె నెన్నుకొన కే
సిస! వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రో
చె సమస్య లియ్యెడన్! జ
గ్గు సాధనమున పనులు సమకూరు ధరణిలో!
జిలేబి
ReplyDeleteతొందరగాను కూర్పునదె తొయ్యలి! చేయదలంచి చూడగా
వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్!
కొందరు సాయమీయగ నకుంఠితమైన సమస్యలెన్నగా
చందము గాను దోచినవి చాలిక తోడుత, వచ్చు తప్పకన్!
జిలేబి
ReplyDeleteచేయ దలచితి ప్రచురణ చెంగలువల
దండగ పలుకులచెలికి! దాని కొరకు
పూర్వపు టపాల చూడగ పూవుబోడి!
వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె
నెన్ను కొనగ కఠినమయ్యె నేదియనుచు !
జిలేబి
ReplyDeleteఓహో యీ నాటి నిఫ్టీ నాట్యము !
ఓహోహో డౌజోన్సు ఆడబోయే నాట్యము
ఓహోహోహో రేపిక నిఫ్టీ నాట్యము !
చూడ రెండు కన్నులు చాలవే :)
వేయి పాయింట్ల పైన నవిన్ని నీవె
గిరిన డౌజోన్సు రేపిక గిరగిర పయి
పైకి పోదె మా నిఫ్టి శుభమ్మనంగ
యేల యీ చిలిపిదనము లేల దూల !
జిలేబి
ReplyDeleteకందోత్పల
కనులు కునుకు తీసెన్ ! చ
య్యన గర్భముఁ దాల్చె భర్త యని భామ వచిం
చెను సంతసంబునన్ వ
చ్చిన కల లో తల్లితో కచిక్కున నవ్వెన్ !
జిలేబి
ReplyDeleteనిదుర రాక మంచము పయి నిటునటు దొర
లుచునదే చట్టనుచు కనులు కునుకుబడ
యంగ కలవచ్చె నందు హయారె నిండు
గర్భముందాల్చె మగఁడని కాంత మురిసె!
జిలేబి
ReplyDeleteఅవిరళముగ కన్నీరు! త
నివి! ఆరని మంటలారె నెవరార్పక ము
న్నె విచిత్రమౌనటుల్, జల
మవి దీర్చు వెతల మృదువుగ మహిళల హృదిలో!
కందోత్పల
జిలేబి
ReplyDeleteపొలతుక మది లోన బుసబుస కసకస
లారనట్టి మంట లారె నెటుల?
కంట నీరు చింద కందివరార్య, జి
లేబి పలికె వడిని లెస్స గాను
జిలేబి
ReplyDeleteఅరయన్ వృద్ధావస్థను
పరిచయములు మెండగున్ ప్రభాతపు వేళన్
మెరుగౌ పూరణలను చే
యరె! బుద్ధి బలమ్ము వృద్ధియగును జిలేబీ
జిలేబి
జాల్రా
అరయన్ బుధ్ధి నశించును ,
Deleteగురిడికి డబ్బందు,సాలెగూడున జిక్కున్
పురుగులు , మేథస్సుచెడును ,
సురుగును ప్రతిభలు,కవిత్వ శోభలు వోవున్ .
Deleteఏల ఈ నిస్తేజము రాజావారు :)
జిలేబి
ReplyDelete'ర-రి-రు-రె'
పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందంలో
వృద్ధావస్థను వర్ణించండి.
అరయన్ వృద్ధావస్థను
పరిచయములు మెండగున్ ప్రభాతపు వేళన్
మెరుగౌ జాగింగుల చే
య రెక్కల బలమ్ము వృద్ధియగును జిలేబీ
రియాలిటీ :)
జిలేబి
ReplyDeleteఅమ్మమ్మో! కల్లోలము!
తమ్ములఁ జంపంగఁ గోరెఁ దనయుఁడు, దండ్రిన్,
సొమ్ముల కొరకై నరుకన్
దమ్మున దూకె నురుకుచు మదమున జిలేబీ
జిలేబి
ReplyDeleteకందోత్పల
గడిబిడి కుటుంబమందు వి
నుడు! తమ్ములఁ జంపుమంచు నొక తండ్రిని పు
త్రుఁడు కోరెఁ నమ్రుఁడై బో
లెడు సొమ్ముల పై దురాశ లేకారణమై!
జిలేబి
ReplyDeleteసూర్యగ్రహణము ఫలితాలు
అదిగో మెరాపి పర్వత
మదిగో గ్రక్కెను పొగల నమావాస్యదిన
మ్ము! దినమణి దాగను గ్రహణ
పు దినమ్మున జోస్యము సరి పోయె జిలేబీ!
జిలేబి
సరిసరి బాగుంది వరస ,
Deleteనిరతము రగిలే 'మెరాపి' నిందుకు కతమై
కరముదహరించ ' నదిగో !
నరయుము , చీకట్లు గమ్మె నమవస నిశిలో .
ReplyDeleteస్పాముల పుట్టించెడి వా
డా మాలికుడేనకో ? బిడాలమన జిలే
బీ మార్జాలమకో ఓ
సామీ యేమాయయొ తెలుసా నీకైనన్ !
జిలేబి
ReplyDeleteకందాట
విబుధా! బుద్ధి గల జనుల
కు బూది మిగులుననుచు పలుకుదురా మూర్ఖుల్
తబమున నిలకడ గాంచిన
ప్రబుద్ధులనుచు తెలియక నిరాధారముగా !
జిలేబి
ReplyDeleteవిబుధ! తెలివి లేక విస్తృతముగనరె
బుద్ధి గల జనులకు బూది మిగులు
ననుచు పలుకు దురిలన పెళుచులయ్యరో
వారి పోకకు కలవరపడకయ!
జిలేబి
ReplyDeleteఅనుమానమేల మూర్ఖులి
లన "బుద్ధులు గల్గు వార లకు బూదియె ద
క్కును నిక్కువంబు" గంజా
యిని బీల్చి పలుకుదురయ సయింపక సుమ్మీ
జిలేబి
Wah!!
ReplyDelete
ReplyDeleteవిడువరు జిలేబులు సుమా
పడఁతులు! సరి, పోరు మధుర పద్యరచనకున్
వడియాలనువేసినటుల
గడియగడియకున్ దడదడ గడగడ విడిగా!
జిలేబి
ReplyDeleteఔరౌరా యేమి యీ అభాండముల్ !
కాంతల్నేర్వగ లేని విద్య గలదే కందోత్పలమ్మాది పూ
బంతుల్కట్టిరి శంకరాభరణ దివ్యారామమున్ ప్రీతితో
చెంతన్ చేరుచు కైపదమ్ములలరన్ చిత్రాతిచిత్రమ్ముగా
నింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్?
జిలేబి
ఎమీటి జిలేబి ఈ కవితల పైత్యం ఇంకా తగ్గినట్లు లేదు? మాలిక వ్యాఖ్యల లో అంతా ఇవే.
ReplyDelete
Deleteఎనుబోతులు వచ్చినాయి :)
చాలా హృద్యంగా రాశారు శ్రీరామ్ గారూ , Really very nice :)
జిలేబి
ReplyDelete"పొడుపు" కథ :)
బ్లాగే లేని నరుడను స
రాగము లన్ భళి కమింట్లు రాస్తుంటాన
ర్రా గట్టిగ ప్రోత్సాహము
బ్లాగరులకు చేర్చువాడ పద నేనెవరోయ్ ?
జిలేబి
ReplyDeleteమించారును మేలెల్లెడ
మంచి నొనర్చెడి జనులకు, మరణమె దక్కున్
కుంచితబుద్ధిని చూపను
వంచన వలదోయి నరుడ వాంఛల విడుమోయ్!
జిలేబి
ReplyDeleteకందోత్పల
వరమాల తధ్యముగ ను
ల్లరి, మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్
వరియించు, మృత్యువే ప
ల్లరులకు, కల్లరి తనము వలదు వలదు సుమా
జిలేబి
ReplyDeleteసంచిత కర్మ భోగముల చట్టని తీర్చుకొనంగ మేలగున్
పంచన చేరు నీశ్వరియె వాంఛల వీడను మోక్షమార్గమే
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు, మృత్యువే
కుంచిత మైన బుద్ధిగల క్రూరుల కింక ఘటిల్లు తధ్యమై
జిలేబి
ReplyDeleteఏమన్నానూ పద్యా
లే మాపై కత్తులై భలే యెగురు జిలే
బీ మామి కమింట్లుగ సు
మ్మీ!మాకెందులకు గొడవ మీపై సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఅహరహము పనుల మునిగితి
మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే,
విహితుని గా కన రాడే
సహవాసియని పలికెదరు సాక్షి పలుకడే !
జిలేబి
ReplyDeleteచంపకమాల పాద గర్భిత కందము
కందా చంప్స్
వయసాయె సుమీ దీనుడ
నయ! మహిమలు గల్గు దేవునకు మంచి రవం
తయుఁ గానుపించ దేలన్,
ప్రయత్నములచేసినాను వరమివ్వడయా!
జిలేబి
కందగర్భమందు కరములు పాదాలు
Deleteచీల్చి దోపి కుట్టు చెలువములను
గురుడు నేర్పినాడ ? గోప్పసర్కసుగాడు!
యెంత ఫీజు గుంజె నింతవరకు ?.
Deleteకుట్టుట జిలేబులకు న
ట్టట్టే సులభముగ వచ్చు టకటక రాజా
గట్టిగ నెవ్వరు నేర్పక
పట్టుగ నే నేర్చినట్టి బాణియిదయ్యా !
జిలేబి
ReplyDeleteఇహమున ధ్యానమార్గమున నిమ్ముగ నీశుని గొల్చుచుంటి నే
నహరహ మాతడే విభుడ
నంగ దయాళువనంగ వేడినా
మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించ దే
ల! హితము లేవి దక్కవె ఫలమ్ములు లేవె! జిలేబి చెప్పవే!
జిలేబి
ReplyDeleteమించారును దుర్బుద్ధియె
వంచనతో, సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్
కొంచెము మేలును చేర్చుచు
కుంచించుకొనక నరుడు ముగుద! తెలివిడితో
జిలేబి
ReplyDeleteకందోత్పల
మరణము కోరెద రోయి వి
దుర వంచనఁ జేయుచున్ బ్ర తుకువాని, నుతిం
తురు సజ్జనుండుగన్ చే
తల, మాటల కీడు చేయ తలచని నరుడిన్!
కందోత్పల శతకమునకు
అతి సమీపము :)
జిలేబి
ReplyDeleteకుంచిత బుద్ధి వీడుమిక కోరరు చెంగట చేరగన్ సుమా
వంచనఁ జేయుచున్ బ్రతుకువాని, నుతింతురు సజ్జనుండుగన్
కొంచెము మేలు కూర్చగ నకుంఠితమై జనులెల్లరున్ సదా
పంచన చేర వత్తురు నివాసముగానదె మూర్ధకర్ణిగా !
జిలేబి
ReplyDeleteమాయా మహేంద్ర జాలము!
ఛాయా లక్ష్మీ షకీల సరసి జిలేబీ
సోయగములొల్కెడు టపా
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
జిలేబి
ReplyDeleteకందోత్పల
భళి బొమ్మలు రంగుల నా
వల కాయలు పెక్కులున్న వవి గావు ఫలం
బులు చూడ నెన్నఁడున్ కా
వలెనని కోరెను బుడతడు ప్రసువు వలదనెన్!
జిలేబి
ReplyDeleteవేయికి పైన కైపులన వేగము గానదె వెళ్ళి చూచినా
నోయమ! పోయె నామతియు నొవ్వె! బజారున పేర్లు బాపురే!
మాయ! జిలేబి! ఇందుముఖి! మాధురి! లక్ష్మి! భళా!భళా టపా
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్!
జిలేబి
ReplyDeleteకంది వరుల సప్తతి సంచిక కై
శ్రీ కంది శంకరయ్య సు
ధాకాంతుల పూరణలు సదా ప్రవహించెన్
మాకందపు తీయదనము
లై కబ్బపు సేవ చేసె బ్లాగ్లోకమ్మే!
అలుపా? చెంగట రాదు! కర్తగ సమస్యాపూరణల్ చేయగా
పలుదేశస్థుల చేర్చి ముద్దుగుడిచెన్ పారాయణీ సేవలో
తొలినాటన్ చిరు డాలుగా నిపుడు ప్రత్యూషాంశువై వెల్గె! దా
ఖలుచేసెన్ తన దైన స్థానమును ప్రఖ్యాతమ్ము జాలమ్ములో!
అనవరతమ్ము గా నొక దశాబ్దము పైబడి కైపదమ్ములి
చ్చెను! తనివారగాను పరి శీలన చేసి సమీక్ష నిచ్చి నూ
తనముగ చేర నాదరపు దారము తోడుగ కట్టి వేసి సా
ధనమును చేయ నుత్సుకత తాండవ మాడగ చేసె నొజ్జయై!
శరణం పండిత మానసాపహరణం ...
డెబ్బది యేండ్ల బాలుడితడెవ్వడు? శంకరుడీతడంట నా
కబ్బము గొల్వ బ్లాగునిడి కైపదముల్ నునుపార దీర్చి తా
నబ్బుర మొందగాను శరణాగతి తోడు విశాలజాలమం
దిబ్బడి చేసె పూరణల ద్వీపము చందపు కాంతులీనగా
సేవాతత్పరుడీతడౌత స్రుతియై జీరాడ పద్యమ్ములే
శ్రీవాగ్దేవిని వందనమ్ముల సదా సేవించె బ్లాగ్లోక మం
దావాలమ్మున మబ్బుపూవులను విస్తారించి క్రొంగొత్త నె
త్తావిన్పంచెడు పుష్పదమ్ములకు సుస్థానమ్ము కల్పించెగా!
సరదాగా జిలేబీయము :)
సరదాగా పేర్చుచు నే
వరుస జిలేబులను వేయ వాటిని త్రుంచె
య్యరు మీదుమిక్కిలిని మె
చ్చి రవంతగ జోక జేర్చి చీర్సందురుగా!
జిలేబి
అంతొద్దు , మరీ వొగడన్
Deleteవింతగు , దివినుండి దిగి భువికి పడడు , భలే !
గంతకు తగ్గవి పద్దెపు
బొంతలు గురుడికి , కడు సరిపోయినవి , హితా !
Deleteఉడుకుతనమింత రాజ
న్న! డిగనురుకరాదు వలెననగ మీపై నన్
వడి వడి జిలేబులను వే
యు డింగరిని నేను సామి యోరన్నన్నో!
నారదా
ఎక్కడ వున్నావయ్యా :)
జిలేబి
ఎక్కడ వున్నావయ్యా
Deleteపక్కనె పద్యాలజల్లుపైనెక్కి సదా
సొక్కుచు సోలుచు వొగుడుచు
చెక్కిలి సెయిసేర్చి గురుడి సేవ తరిస్తూ .
ReplyDeleteకందాట
శ్రీ, భూ, నీలా శక్తులు.
నీలా శక్తి సమేత విష్ణువు శివుని గా ప్రళయ కాలములో.
అక్కడ విష్ణువు విలయము
నెక్కి నిలువు బొట్టుఁ బెట్టె, నీలగళుడు తా
చక్కగ ముస్తాబయ్యెను
ఱిక్కుగ నీలయమరె తుదిరేయికి సుదతీ!
జిలేబి
ReplyDeleteకమలాక్షుని విలయము నిధ
నమె నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుం
డు! మురారి, భక్తుఁడై నీ
మముగా ప్రార్థించె మోక్షమార్గము కొరకై !
Cheers👍
ReplyDelete
ReplyDeleteజ్యోత్స్నల్ జ్యోత్స్నల్ జ్యోత్స్నల్
జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్
జ్యోత్స్నా దేవియె దివ్వెల
జ్యోత్స్నల్ కన్బడక దీర్చి జోజో యనగా!
జిలేబి
ReplyDeleteజ్యోత్స్నాదేవియె క్రోధమొందె నరులే జువ్వాడ గాంచెన్ వెసన్
జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్
జ్యోత్స్నల్ చేర్చెను దాని కారణముగా ఝుంపాకముల్ తీరుగా
జ్యోత్స్నల్ వెల్గుల గాంచి మానవులు సద్యోజాతుడిన్ గొల్చిరే!
జిలేబి
ReplyDeleteఇలలో ప్రణతార్తిహరుడ
ని,లెస్స!శంకరుడటంచు నీకెవ రిడిరో
తెలుపుము పేరెవరిడిరో
యులుకవు పలుకవు గదా అయోనిజ శంభో!
జిలేబి
ఇలలో ప్రణతార్తి..... త్యాగరాజ కృతి
ప. ఇలలో ప్రణతార్తి హరుడనుచు
పేరెవరిడిరే శంకరుడని నీ(కిలలో)
అ. తలచి కరగి చిర కాలము పదమున
దండమిడిన నాయెడ దయ లేదాయె (ఇలలో)
చ. కర చరణయురము నొసలు భుజములు
ధరణి సోక మ్రొక్కగ లేదా
శరణనుచును మొరలిడ లేదా
పంచ నదీశ త్యాగరాజ నుత నీ(కిలలో)
ReplyDeleteఓ శకార! రమ్మ ఓకథ చెప్పు మా
కంది శంకరులకు కరుణ మీర
గాను నిపుడె విని పకాలుమనుచు నవ్వ
"పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె
జిలేబి
ReplyDeleteకందోత్పల
రతిపతిని విరజుని నభి
శ్రుత పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను ప
ర్వతరాజ పుత్రికన్ తీ
వ్రతపము చెదరగ శరములు వాడిగ తాకన్!
జిలేబి
ReplyDeleteకందాట
అతగాడు మన్మథుడు! తీ
వ్రతపమును చెదర్చెనతడు! పర్జన్యునభి
శ్రుత పుత్రుఁ జంపి శివుఁడు పొ
లఁతి నందె ననంగుడయె భళా రతిపతియే!
జిలేబి
ReplyDeleteమిత్రుడతండు ప్రేమికుల మిన్నగ చేర్చెడు పుష్పబాణుడౌ!
శత్రువు గాదతండు తన శల్యము నెక్కిడె మేలు కోరుచున్
చిత్రము ధ్యానమున్ విడిచె చేవిడిచెన్ క్షమ! పద్మగర్భుడిన్
పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్!
జిలేబి
ReplyDeleteచచ్చి నోళ్ళ జాతకమును చాన బాగ
చూసి నాను శిష్యులు రండి చూడు డయ్య
లార జరిగేది జరుగును "లా" అదియె సు
మా!ఘనమగు మా లాజిక్కు మాదె సుజన :)
జిలేబి
ReplyDeleteనమ్ముటకదె సిద్ధముగ జనాళి గలదు
దేశ మందు మాపుణ్యమదేను రాజ
వారి మూఢత్వమే పెట్టు బడి విధాత
చెప్పి నట్టి విద్యయె కూడు చేర్చె మాకు !
వకాల్తా
జిలేబి
ReplyDeleteఅత్తరి యిత్తరి చూడక
కత్తిని చూపించి కుత్తుకను కోయుటకై
తత్తర పడి దారిని మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్!
జిలేబి
ReplyDeleteకందోత్పల
కురిమింద దేవళపు స్థలపురాణము :)
పణమును గట్టెను గుడియం
దున, నత్తనుఁ గాంచి బల్లి దుఁడు నమ్రతతోఁ
బ్రణమిల్లె నత్తఱిన్ దే
వుని మహిమగ తలచి నశ్రువుల పారించెన్!
జిలేబి
*కురిమింద అంటే నత్తగుల్ల అట సో నత్త గుల్ల దేవళము జిలేబీయము :)
Deleteజి సీతాదేవి గారువాచ
జిలేబిగారు!మీ ఊహ అసమంజసము కాదు!ప.గో.జిల్లాలో నత్తారామేశ్వరం అనే ఊరుందట.
నత్తలు,ఇసుకతో సీతారాములచే ప్రతిష్ఠింపబడిన శివలింగము
అక్కడ పూజలందుకుంటోందట!
వాట్సప్ లో శర్మగారి ఉవాచ!
జి సీతాదేవి వ్రాలు
జిలేబి
అవును “జిలేబి” గారూ, ఈ మిత్రులందరూ కనిపించే “శంకరాభరణం” పద్యాల బ్లాగ్ “మాలిక”లో నుండి మాయమయిందేమిటి?
Delete
ReplyDeleteకురిమింద దేవాలయము లో పూజ
కొత్తుపడంగ జీవితము కొందలపాటులు తీరగానదే
విత్తము లెల్ల కూడగ పవిత్రముగా జప మాచరించె మేల్
చిత్తపు చింతబోవునని సేవలచేసెను దేవళమ్ములో
నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్!
జిలేబి
ReplyDeleteకందోత్పల
తృటిలో నిన్నే మరచి య
కట! వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెం
దుట నీకు యుక్తమేనా
పటపట పళ్ళుకొరుకుట నుభయులొకరేగా!
జిలేబి
ReplyDeleteకందాట
చెవులను ముక్కును గోకుచు
ప్రవరుల మని తలచుచునరె వానరు లనుఁ గాం
చి వగచఁ దగునె నరులు? తమ
ప్రవర్తనలకు ప్లవగములె వైనము కాదే?
జిలేబి
ReplyDeleteతప్పు లెల్ల వెదకి తనలాగెవరు లేద
నుకొనుచున్ భుజములను చరచుకొని
పనికి మాలి నట్టి పనుల చేయుచు, వారె
వా! నరులనుఁ గాంచి వగచఁ దగునె
జిలేబి
ReplyDeleteరోనెలతల్ గణేరువుల రొమ్ముల తేలెడు నిత్యభోగి నీ
వా నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట? నీకు యుక్తమే
నా? నలు వైపు లన్ తిరిగి నచ్చని వారల తిట్టుటేలనో?
మానవ మార్పు చెందుము సమాశ్రయ మైనది సత్యలోకమే
జిలేబి
ReplyDeleteసయ్యాటలలో పదనిస
లయ్యారే రాసలీలల సమయమదిగో
నొయ్యారముగ గుసగుసల
పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్!
నారదా
వింటున్నావా :)
జిలేబి
ReplyDeleteతనువెల్ల నూగిసల వా
నిని, పయ్యెద లాగు ధూర్తుని ,సెబాసని భా
మ నుతించెఁ బ్రీతితోన్ క్రీ
డనపు హరిమ చేరి ముద్దిడను సయ్యాటన్
పగలేవెన్నెలా :)
జిలేబి
ReplyDeleteనిశాంతమాయె నయ్య యిదేమి విడువడే
కయ్యపు రాసలీలల ప్రగాఢపు కౌగిలి లో సయాటలన్
చయ్యను ముద్దులాటలె విశంకట మాయె నిశాంత మాయె నా
నెయ్యపు మాట పోనిడిక నెమ్మిని చూపెడు ప్రాణనాథుడిన్,
పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్!
జిలేబి
ReplyDeleteనెయ్యపు మాటల ఫలితం
బయ్యరి ప్రేముడిని పుట్టె! పసిబాలుడతం
డయ్యెడు వేళను పాలకు
పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్
జిలేబి
ReplyDeleteవెన్నెల్లో సైకతమున
మున్నెన్నడు కలుగనట్టి మోహమ్మున నా
యన్నుల మిన్న జిలేబియె
తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్
జిలేబి
గుండుసున్న :)
ReplyDeleteఓదార్పు కందోత్పల
ప్రకటిత తిధపు సమయమా
నక, తన్నిన ధిక్కరించినను దాపము నొం
దక నవ్వుటొప్పగున్ కా
నుకగా తలచి వలదిక కినుక ప్రియ సఖుడా
జిలేబి
ReplyDeleteసన్నుతి చేయగా వలయు చక్కదనమ్ముల పేర్మితోడుగా
మిన్నగ కామసూత్రమిది మీవడ జుర్రుకొనంగ మేలు నా
యన్నుల మిన్న చంద్రముఖి యాసఖి నెయ్యపు వేళ నెమ్మితో
తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్!
జిలేబి
ReplyDeleteఏడుకొండల వెంకట రమణా గోవిందా గోవింద !
"తిన్నగ భూలోకమునకు
చెన్నుగ నే వెడలెదన్" వచించెను రమ, "నా
పెన్నిధి నా పతిని భ్రుగువు
తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్?"
జిలేబి
ReplyDeleteరాస్తూ పోతూంటేనూ
వస్తుందోయీ పదముల వరుస జిలేబీ
యిస్తా సమస్య నొక్కటి
చేస్తావా పూరణను కచేరీ లోనన్ :)
జిలేబి
ReplyDeleteమా కష్టేఫలి వారికి
బాకా వూదాలె రమణి వారెపుడు ఖుషీ
గా కని పించాలంటే
గీకేయవె కందమొకటి కెవ్వన వారే :)
జిలేబి
అర్థోస్తి చే న్న పదశుద్ధి రథాప్తి సాపి
ReplyDeleteనో రీతి రస్తు, యది సా ఘటనా కుతస్త్యా
సాప్యస్తి చే దపి స వక్రగతి స్తదేతత్
వ్యర్థం, వినా రస మహోగహనం కవిత్వమ్
Deleteవారట్లాగే అంటూ
టారండీ క్లిష్టతరము గా చేసి పడే
స్తారండీ భయపెట్టే
స్తారండీ చేయవలెను సాధన వినకన్
జిలేబి
Deleteవెంకట రాజారావు . లక్కాకుల has left a new comment on your post "నల్ల చంద్రుడు":
ఆషామాషి యవారమా కవిత వ్రాయన్ ? భావముల్ , దీటుగా
భాషాసంపద , శయ్య , రీతులు , తగన్ వక్రోక్తులున్ , విఙ్ఞతల్ ,
దోషాదోషవిచక్షణాచతురతల్ , తోరంపు టుక్తుల్ , సదా
భాషాయోష శుభాస్పదాక్షికిరణప్రాసాదముల్ గావలెన్ .
అయ్యబాబోయ్, ఇది గీర్వాణభాషా ఏమిటి 😳?
ReplyDelete
Deleteగీర్వాణంలో చెబ్తే
పర్వణి యగు తెలుగులోని పండుగయె సుమీ
చర్వణ ఝుంకారంబుగ
కర్వటపు డగడ్తగ మన కగుబడు సింహా !
జిలేబి
బాగుందండీ 'సింహా',
ReplyDeleteఆగాగుడు,నరుడు తొలిగె, నట్లగునేనిన్,
రేగి తమ మీది కురికెడు,
ఆగాబాగపు పిలుపిది, అయ్యో సారూ !
ReplyDeleteపైత్యము పెరిగెనో కవి వరుడొకండు
వ్రాసె కైపద మొక్కటి వరుస గాను
పేర్లనతికించుచున్ భళి వింతగాను
"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"
జిలేబి
గురుడికి పైత్యము పెరిగెను
Deleteగురుదేవుడి శిష్యగణము గొఱ్ఱెల గుంపై
కరుణామయి సీత నిటుల
పరి పరి నిందించి పాపపంకిలులైరే !
ReplyDeleteకందోత్పల
"అనమానమేల నబ్జా
నన! కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా
జనియించె సీతయే! బో
డి నిక్కమిదియే!" శకారుడే పల్కెనుగా
జిలేబి
ReplyDeleteకుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే!
సుంతయు ముద్దు చేసిరిక శూర్పణఖాదులు! రాముడాతడే
గంతలు కట్టికన్నులకు కాంతను నెత్తుకు పోయె సూవె నా
క్రాంతము చేసి చట్టనుచు ద్రావిడులన్ తుదమాడి వింతగా
పంతము బట్టి చెప్పెనొక పామరుడేను తటాల్మటంచుపో!
జిలేబి
ReplyDeleteద్రవిడ రామాయణము గలదందులోన
కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత
వ్రాసి నాను నిరుడొక టపాను దాని
కైపు తెలియ లంకెను నొత్తగలరు క్రింద!
ద్రవిడరామాయణము గురించిన లింకు -
https://varudhini.blogspot.com/2018/05/blog-post_21.html
జిలేబి
మరి ఆరుద్ర రాసిన "రాముడికి సీత ఏమౌతుంది?" గురించి మాట్లాడరేమీ? ఆరుద్ర మన బాచ్చీ, ద్రవిడులు వైరి బాచ్చి కదా మరి!
Delete
Deleteబ్లాగుందిగా రాయవోయ్ నీవే చిరుజీవి
ReplyDeleteకందగీతి
ప్రకటిత మాయెను చుర్రన
గ కాల చక్రుండు వాడిగా శుషిరములో
న కనంగ పగలు, శశి పూ
ర్ణకళల తో నెగడె దివిని రాత్రి జిలేబీ!
జిలేబీయము
ReplyDeleteకందాచంప్స్
భగభగ దోచె వెలుగుల దొ
రగ పగలు; శశాంకుఁ డంబరముపై విలసి
ల్లెఁ గళాసమగ్రుఁడై రా
త్రి; గగన మందున జిలేబి తీరుగ విభుడే!
జిలేబి
ReplyDeleteఉద్ధతుల మధ్య పేదల "కుండ" తరమె
నిండు గాన జిలేబీజి నీటుగాను
నోటికుండయగును డొల్లబోవగాను
వలదె వారితోడాటలు వారిజాక్షి!
జిలేబి
ReplyDeleteఈ బుడతడి వందనము లి
వే! బండియటంచు నింటి పేరండీ నా
కో బాగుగ పేరడి రా
సే బాలాగుకలదండి సెహభేషుగనౌ :)
జిలేబి
ReplyDeleteపనిలేక
పని గట్టుకుని
అవిరామమ్ముగ కైపదమ్ములకు మాహాత్మ్యమ్ములన్ చేర్చెడీ
కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా,
వ్యవధానమ్మను మాటలేక శ్రమతో బండంత చిప్పమ్ము మూ
పు విధానమ్మగు రీతి నెత్తుకుని ప్రాపున్జేయు రేవళ్లకున్!
నారదా
జిలేబి
ReplyDeleteఅవిరతముగ పనిచేయును
కవి! కంటెను మేలు గాదె గాడిద భువిలో
న వరలును జావడి నదె క
నువెట్టుకుని కాచుకొనగ నొవ్వదు నెపుడున్
జిలేబి
ఎన్నో ఉన్నవి చుట్టుపట్లన గనన్, యీరోగముల్ వోవవా !
ReplyDeleteమున్నున్ పెక్కులు దైవదూషణ విధమ్ముల్ గా సమస్యల్ సదా
యెన్నంజూచితి, నెన్నిమార్లొ జెపితిన్ ,ఈపధ్ధతుల్ మానుడం,
చన్నా ! వింటిరె బుధ్ధి ఙ్ఞానములు లేవా? యెంత నికృష్టులో !
Avadhananni mostunna gadida goppadi👍
ReplyDelete
ReplyDeleteపోతన, సతి అనే వారి కల్యాళము
వినుకొండలోన జేసి టి
ఫిను బస్సును వెదకి యెక్కి పెనిమిటి తోడై
హనుమానుజంక్షనుకు "పో
తన-సతి", పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్!
జిలేబి
ReplyDeleteపనపాకమెక్కడుంది ? హనుమాన్ జంక్షనెక్కడుంది లంకెలేసు కుంటూ వృత్తము గోలు గోలు గా చుట్టుటయే కదా జిలేబి యనగా :)
"పనపాకంబున చిన్ననాటి చెలి! యాప్యాయమ్ముగా బిల్చె,నా
హనుమాన్ జంక్షను పట్టణమ్ము పదవయ్యా" చెప్పగా పేర్మితో
తన యర్ధాంగి, వివాహముం గనుటకై తానేగె నుత్సాహియై,
తనసంగాతి కొమర్తె పోవలెను ప్రాధాన్యమ్ము తోడై కదా!
హమ్మయ్య!
జిలేబి
ReplyDeleteజంబల మన "నిమ్మ" సుమా
అంబా! కడిపెండ ముద్ద గాదె జిలేబీ !
జంబల కడిపెండయె భళి
జంబల కడిపంబ యయ్యె సంబరము గనన్ !
కావున జంబలకడిపంబ అనగా నిమ్మ కాయ తో చేసిన అన్నము :)
చిత్రాన్నము :)
జిలేబి
ReplyDeleteజీవితమింతేనా ? మన
జీవితమింతేనకొ? వలచిన జీవితమీ
లా వింతగ గడ పాలా ?
కోవిదు వైరెస్సు తాను కోరేదేంటో ?
బచ్చన్ సాబ్
త్వరగా కోలుకోండి
జిలేబి
ReplyDeleteవిడువదమితాబు నైనా
గడుపను సహజీవనమ్మికన్ ముందు పడా
లె డిగనురుకుచు జనులికన్
తడకట్టుల దాటుకొనుచు తరుణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteచదివి నాను వహిని చాల మార్లయ నాదు
గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ?
పుస్తిని చదివి భళి పూర్ణము గా మార
గలవకొ? నడవడిక కాస్త మార్చు!
జిలేబి
ReplyDeleteశ్రోతవ్యంబుగ పాడి నాము మదిలో సొక్కుల్ ఘటిల్లంగ మా
కేతావాత ఫలమ్ము లేమి ప్రభు మా కెంతేని కష్టమ్ములే
కాతాళించకు ప్రశ్న వేసితినిదే కామమ్ము పోలేదయా
గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా!
జిలేబి
ReplyDeleteమైలవరపు వారి పూరణ
శ్రీతత్వార్థసుధాపయోధిమథనౌచిత్యప్రభూతాత్మసం....
జాతానందసుధారసోచ్చకితశాస్త్రంబెన్నగా గీతయే!
త్రాతా! జీవితమందునొక్కపరి నేర్వన్ బుద్ధిరాకున్నచో
గీతాశాస్త్రము.., గీఁత మార్చఁ గలదా కృష్ణా! యశోదాత్మజా!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
వామ్మో !
శ్రీతత్వార్థసుధాపయోధిమథనౌచిత్యప్రభూతాత్మసం
జాతానందసుధారసోచ్చకితశాస్త్రం !!!
శ్రీ
తత్వ
అర్థ
సుధ
పయోనిధి
మథన
ఔచిత్య
ప్రభూత
ఆత్మ
సంజాత
ఆనంద
సుధారస
ఉచ్చకిత -
శాస్త్రము !
జిలేబి
ReplyDeleteఇచ్చిన కందపాద మెక్కడే జిలేబి ?
నిజమును గ్రహింపుమోయీ
తుజుగు! విడువక సలుపంగ "దుర్వ్యాపారం
బె జనుల దుఃఖముఁ; ద్రోఁచున్
సుజనుల సాంగత్యము మనుజుల దోషములన్!
జిలేబి
ReplyDeleteలైకులు ఎఫ్బీ పోస్టుల్
వేకువ జామున కమింట్ల వేడి జిలేబుల్
తాకిన కరోన హుష్ కా
కీ! కాదనకండి దీని కిక్కును శాస్త్రీ :)
జిలేబి
చిట్కా బాగానే ఉంది గానీ ఈ శాస్త్రి గారెవరు?
Delete
Deleteఇంకెవరూ మా గోలీ హనుమచ్చాస్త్రీ గారేనూ :)
http://golikavita.blogspot.com/2020/07/blog-post.html?
జిలేబి
ReplyDeleteరాముఁడే రావణుండైన ప్రజకు మేలు
కలుగ నా జిలేబి యతడక్షరుని పుట్టు
కయని కొనియాడ బడునకొ? కర్మసాక్షి
వంశమునకు కీర్తియు మరి వచ్చు భువిని?
జిలేబి
ReplyDeleteకందోత్పల
తృటికాలము తలచితి బా
యిట రాముఁడె రావణుండయి ధరాతల మే
లుట పాడియౌఁ గదా యని!
తటాలు వచ్చెనదె నవ్వు తన్నుకొని సుమా!
జిలేబి
ReplyDeleteశంకరార్యుల కల! దుష్టులెల్ల రాముని లా మారి పరిపాలిస్తే ఎంత బాగుండునో నద్వందమై, ఏకం సత్ గా వెల్గు భువి కదా!
ఆ ముని మాపు వేళ కల నా కనులంబడె కైపదమ్ముగా
సామము గాను దోచినది చక్కటి పూరణ లెల్ల చేయనా
రాముఖ మైన వాక్యముగ! రండి సవాలును స్వీకరించుడీ
"రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా"
జిలేబి
ReplyDeleteమాయా వేదిక ! కందగీతి!
అనసూయ! అందియల వీ
డనొప్పు నాట్యమున రంభ, డంబము కాదోయ్
వినుమీ వేదిక ఘల్లను
తనువిచ్చి నటనము సేయ తరుణీ తానై!
జిలేబి
ReplyDeleteపాపియెవడు హీనుడెవం
డో పావనుడె దయచూప ద్రోహియగునెవం
డో పుట్టువడుగు కావం
గా! పీతాంబరుని గొల్వ ఖలుడెవ్వడగున్ ?
***
హీనుడ! పాపిని ద్రోహిని !
నేను ఖలుడనయ్య దేవ ! నీ దయ రాదా!
ఆ నరసింహుడవై నీ
వే నన్నిక గైకొనంగ వేడెద నయ్యా
జిలేబి
ReplyDeleteతెలియక పోతే
నేర్చేసుకుంటారు.
నరసింహానికి
తెలియనిది లేదు
https://varudhini.blogspot.com/2017/05/blog-post_4.html
జిలేబి
తెలుసుకోవాలి గదండీ మరి.
Deleteమీరిచ్చిన లింక్ లో “హైకూ”ల గురించి ఉంది. విదేశీ ప్రక్రియ. “నానీ” స్వదేశీ అనుకుంటాను. ఏదైనప్పటికీ కవిత వ్రాయడాన్ని సరళం చేసినట్లున్నాయి.
లింకిచ్చినందుకు థాంక్స్.
ReplyDeleteవరలన్ మీరలు సూవె గ్రోలవలెనా పాశ్చాత్యమాధుర్యముల్
వరమై పెంపును చేర్చు చెప్పెదరయా భాసిల్లి శీఘ్రమ్ముగా
భరతక్షోణి పురోగమించునఁట! భాస్వత్సంస్కృతిభ్రష్టమై
చిరకాలమ్మిక బానిసత్వము కదా చెండాడు దేశమ్మునే!
***
మాట వినవె విడవలె నమ్మ త్వరితమ్ము
వలదు ముసిమి పాశ్చాత్యపు వర్తనముల
పై జిలేబి మనకు సరిపడవు సూవె
భారతము సంస్కృతిభ్రష్టమై రహించు
జిలేబి
జిలేబి వారి పద్యాలు భళే వున్నాయ్
Deleteనా పూరణ ఇలా కుదిరింది
భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై
మత్తేభము
కరొనారోగపుభీతిచేచరమసంస్కారంబులన్ మానుచున్
సురపూజక్రతుకార్యముల్ విడుచు శాస్త్రోక్తాదులన్ వీడుచున్
చరియింపన్ ప్రజమందచిత్తతఁమనశ్శాంతంబుకోల్పోవుచున్
భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై
(కష్టసాధ్యమని భావము)
గాదిరాజు మధుసూదన రాజు
ReplyDeleteశ్రీమాన్ కంది శంకరయ్య గారికి జన్మ దిన శుభాకాంక్షలతో
ఒక దశాబ్ద కాలముగ జిలేబీ భళి
కంది శంకరయ్య కవులఁ జెఱ,చు
రుకరి యై విముక్తి రూఢిగ చేసెను
కైపదముల నిచ్చి కైపు జేర్చి
జిలేబి
ReplyDeleteఆటవెలది ఆడె నాట్యము ఉత్సాహ
ముగ జిలేబులమర ముందు వెనుక :)
శంకరాభరణపు చావిడి త్వరితము
రండి "కంది శంకరయ్య ఘనుఁడు
కవులను జె డఁగొట్టఁ గన్" వెలసె నిచట
కైపదమ్ములనెడు కాశ్య మిచ్చి
జిలేబి
ReplyDeleteఅందె వేసి నట్టి హస్త మాయె కైపదమ్ములన్
సుందరమ్ము గాను చేర్చి సుప్రతిభను పంచగా
నందరికి వెలసె జిలేబి నవ్యమైన పాంథుడై
కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్
ఉత్సాహమేనా ?
జిలేబి
ReplyDeleteవాల్టు డిస్ని చిత్రము సహవాసమైన
వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు
వేయ గాను గంతులు, సన్నివేశములకు
పిల్ల వాండ్రు పడిపడి నవ్విరి జిలేబి
జిలేబి
ReplyDeleteకందోత్పల
వడివడి మొక్కలము! పరుగు
లిడి "వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొ
క్కఁడు పుట్టె వింతగన్" వా
ల్టు డిస్ని చిత్రమును పిల్లలు పొడగనిరిగా
జిలేబి
ReplyDeleteమైలవరపు వారి కందోత్పల పూరణ
అడవిని గన భీతిని గూ..
ర్చెడు..
వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొ
క్కఁడు పుట్టె వింతగన్ ., మరి
వెడ కురురాడ్జన్మమట్టివేళనె జరిగెన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ReplyDeleteఆంధ్ర రచయిత్రుల సమాచార సూచిక
https://archive.org/details/Andhra-racayitrula-samachara-suchika/mode/2up
జిలేబి
ReplyDeleteలక్కాకుల రాజారావు గారేమంటారో ఇట్లాంటి సమస్యాపాదాలకు :)
ఆరణి పట్టుచీరకొనగా మురిపెంపు విహార యాత్రలో
చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్
కోరిక తీర్చె నామగడు కోమలులార యటంచు, ముద్దమం
దారపు టౌసు మారెనుగదా పులకోద్గమ పల్లవోష్ఠియే
మా అయ్యరు గారి వ్రాలుగా
జిలేబి
వాన ప్రస్తమందు వాసమ్ము తెగటారె ,
Deleteషష్షి వోయె వయసు సప్తతి గనె ,
నైన కృష్ణ రామ యన గుర్తు రాదేల
ముదిత చీర చాటె మది తలంపు .
ReplyDeleteఅతివలు గూడిరి దర్పో
న్నతి! చీరను విప్పి చూపినది చెల్వము నా
సతి యెల్లవారికిన్ గు
బ్బెతలార విహారయాత్ర విస్మయ మిదియౌ
జిలేబి
ReplyDeleteబతుకు దుర్భరమ్ము పతియె కొట్టెననుచు
చీర విప్పి చూపెఁ, జెలువ మతివ
చూప గాను నిండు చూలాలి పైన పో
లీసు మానవతి కులీనురాలు
జిలేబి
ముసలి పండితులకు ముదితల యందున్న
ReplyDeleteగౌరవాన్ని చాటు కారణ మిది ,
నీచ మొకటి జెప్పి నీతిగా పూరించ
వాచికమ్ము తొలగి వరలు నేమి ?
ReplyDeleteపోతుందాండి కరోనా ?
మా తరపున ప్రశ్న యిది సుమా శర్మాజీ
యీ తరుణము తీసుకొనం
డీ తీరికగా గణించుడీ చెప్పండీ
జిలేబి
ReplyDeleteమంచి వాడివయ శకార! మాకొక కథ
చెప్పు మయ్య వినెదమిదె చెవుల నొగ్గి
"పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె
బల్లి మ్రింగెను దానిని పసదనముగ"
జిలేబి
ReplyDeleteకందోత్పల
కబలనపు కథ వినుడి గబ
గబ పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొ
చ్చె బిలమ్ములోనికిన్, తృటి
ని బల్లి యొకటి తినె దానిని గుటుక్కు సుమీ
జిలేబి
ReplyDeleteఉల్లము ఝల్లనంగ కథ నొక్కటి చెప్పె శకారు డయ్య నా
పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్
కిల్లల బల్లి యొక్కటి టకీల్మని వెంబడి తోక లాగుచున్
వెల్లకి లంగ ద్రోసె భళి వేటరి యొక్కడు దూరెనప్పుడే
ఆ తరువాతేమయింది ? వచ్చే వారము బుల్లితెర పై చూడండి :)
జిలేబి
ReplyDeleteఅరుదుగ వంటగదికి తా
నరుగు భళారె వడి వడి మునగ పదమును గాం
చి, రుచికరమనుచు రయ్యన
గురుడీ కవిగారి తలను గుమ్మడి దూర్చెన్ !
జిలేబి
ReplyDeleteMercy killing
గుండెకాయ చూడ కొట్టుకొనుట తక్కు
వాయె శ్వాస బీల్చ బరువు బరువు
బతుక లేను వెజ్జు భారమాయెను జీవి
తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము!
జిలేబి
ReplyDeleteవిదూషకుడు జనుల తరపున రాజు తో
కొమ్మల్ పైనను వీధి గుమ్మములపై, క్రూరమ్ముగా జూచు దా
హమ్మంచున్ క్షతజమ్ము కోరు జనులీయాతంకమున్ తాళలే
రమ్మమ్మో ప్రభు! చేయిదాటెనిది మారామారి! టాటోటు భూ
తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారికి నెనరుల్స్!!
పొత్తంబెంతయొ నచ్చెను
బెత్తంబట్టని గురువుల పిరియమునకు రూ
పెత్తిన నీరాజనమై
మత్తిలు పద్యములతో సమాకర్షంబై!
సెబాసో సప్తతి!
జిలేబి
ReplyDeleteమూస్కో మూతి కరోనా
కాస్కో వచ్చెన్ విరుగుడు కాస్తైనా లే
వేస్కొమ్మ నిమ్మ కారము
చేస్కొమ్మా కొత్తిమీర చేర్చి జిలేబీ
జిలేబి
ReplyDeleteకందగీతి
అబలను పూలు సెగలఁ బొగ
లఁ బుక్కిళించె నడిరేయి లసమానంబై
విబుధుడు వెన్నెల కురిపిం
చి బీట లెగయంగచేసె చిత్తమును సుమీ
జిలేబి
ReplyDeleteకందోత్పల
ఎడదను వెన్నెల సడి ని
గ్గడి పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై
వడిఁ బుక్కిళించె రాడు మ
గడేల నో సంగడి యభిగమనపు వేళన్
జిలేబి
ReplyDeleteతావర మేది యామదిని ? తంపరపెట్టుచు మానసమ్ములో
నావల కామవల్లభుడి యక్కస మాయె సమీరడింభముల్
పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించె,రా
డే వడి వాడు ప్రేముడిని డీకొలుపంగ నిశాంత మాయెగా
జిలేబి
ReplyDeleteఇటుకలు సిమెంటు కాంక్రీ
టు టాపు లేకన్ గృహమ్మెటుల వచ్చునయా
కిటుకెక్కడ కష్టము పడ
క టక్కున గడి వడి విద్దె కయి వచ్చుటకున్
జిలేబి
ReplyDeleteవర్ణమ్మేదియొ తెలియని
కర్ణుఁడు; పినతండ్రి గాఁడె కౌంతేయులకున్
కర్ణుని తల్లి పెనిమిటి? వి
వర్ణమన గలమకొ? భళి సవర్ణుడె సుమ్మీ
మీమాంస
జిలేబి
ReplyDeleteమాకు శకారుడే ( వీడూ జగణమే ) గతి
వర్ణాలెన్ని శకారుడా తెలుపగా వడ్డించు మాకో కథన్
"కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ
వర్ణాలెల్ల సవర్ణముల్ తెలుసుకో బామ్మా జిలేబీ!" వెసన్,
పూర్ణంబాయెను బుర్ర పల్కులవి సంపూర్ణమ్ముగానేర్పగా
జిలేబి
ReplyDeleteపరువము పొంగిపొరిలెను మ
ధురమై పుష్పంబమరగ తురిమిన కొప్పున్
విరిబోణి జిలేబీ కవి
వరులెల్లరి మదియు తూగు పద్యములలరన్
నారదా బారో
జిలేబి
ReplyDeleteబొల్లోజు వారి కన్నీ
ళ్లల్లో న నమాజపు కథలావిష్కరణల్
మల్లాహియాలు కావివి
చెల్లదిరుగ జనుల మది, వచించిన కవితల్
జిలేబి
ReplyDeleteసరదాగా రాసిందిది
పరిపక్వత ఛందము గల పద్యము కాదం
డి రహిని వహించి చదవం
డి రస హృదయులార త్వరపడి తెగడకండీ
జిలేబి
ReplyDeleteబారాణాలకు గతిలే
బారుల బారుగ నిలచిరి పానమ్మునకై
తీరు గనలేము రాజా
వేరెక్కడయిన, తిరముగ వేదులు వీరే
జిలేబి
ReplyDeleteమదనరథపు చక్రంబును
సదనమ్మున త్రిప్పినారు జవరాలి పొదిన్
పదముల మాకందముతో
పదిలం బొనరించి కంద పద్యపు నెఱితో
జిలేబి
ReplyDeleteనాకెందుకు సుమ్మీ ప్ర
త్యేకపు టాహ్వానముల్ పొదికిలికి? శర్మా
జీ కూటమదేమన్నా
నాకు పరిచయమ్ము లేని నాడకొ సుదతీ
జిలేబి
ReplyDeleteరాబోవు శంకరాభరణము వారి అవధాన పత్రిక కై వేచి :)
శంకరాభరణపు కవి శంకరార్య!
సదనపు కవులెల్లను చేరి చంద మదియె
మించ గాను వాట్సాపున మేల్మి మేడ
సానితోఁ జేయవలె నవధానములను
జిలేబి
ReplyDeleteశంకరాభరణపు కంది శంకరయ్య,
సదనపు కవులెల్లరు చేరి చంద మదియె
మించ గాను వాట్సాపున మేల్మి మేడ
సానితోఁ జేయవలె నవధానములను
జిలేబి
ReplyDeleteకవితా వేశములెల్ల వెల్లివిరియంగా చందమొప్పారగా
నవధానం బొనరింపఁగా వలెను, వేశ్యాసంగతిన్ బొందుచున్
తవికల్ వ్రాయుచు పేరడీలను కవిత్వంబంచు ప్రాకర్షికా
కవిరాట్టుల్ వలె దీప్తినొంద వలదీ కాలమ్ములో "పండితుల్"
నారదా
జిలేబి
అవధానంబొనరింపఁగావలెను,వేశ్యాసంగతిన్ బొందుచున్,
ReplyDeleteఅవలీలన్ బులికల్లుకుండగొని యాహ్లాదంబుగాద్రావుచున్,
చివుకుల్ మెక్కుచు,సంతతాధమపథాజీవఛ్ఛవాలై కడున్
దివుటన్ బ్రేలుచునుఛ్ఛనీచముల,నందించంగ దద్దమ్మలున్
బామ్మా
ReplyDeleteసౌండిల్లే. నల్లా ఇరికారా.
శ్రావణ శుక్కులారం పూజలా :)
ReplyDeleteవెల్లుల్లీ ! నరసన్న గారికి గుబుల్వేస్తోందటా నువ్వు తూ
టాల్లా తాకెద వంచు వంటల టపా, టాక్ షోల చూడంగనే
తల్లీ వారిని కాస్త అక్కసపుటుత్సాహమ్ముతో చూడవే
కిల్లాకిద్దియె నీకు మాట వినుమా కిక్కున్న రోగఘ్నమా!
జిలేబి
ReplyDeleteరావయ్యా రాజా సై
రావడి తోడాటలాడ రాత్రియు, ఘృణియో,
ఆవల, యీవల తీరా
లేవియు లేని తలము దరి లేరెవ్వరయా!
జిలేబి
ReplyDeleteఎంత ఘటికులో భళి వీ
రెంత ఘటికులో సుమండి ! ఏడాదాయెన్
కొంతయు తెలియక పోయే
నెంతయొ ప్రచ్ఛన్నమైన నేర్పిద్ది కదా
జిలేబి
ReplyDeleteతిలకము బెట్టితి వీవు ప
దిలముగ మదిదోచినావు తియతీపిగ న
వ్వుల పూయించితి వీవు క
నుల పిరియము చూపినావు నుతులివె కృష్ణా
జిలేబి
ReplyDeleteపబిలికు రాయ! జిలేబీ
కబురుల కొంత సమయమ్ము కనులెట్టితి వా
కబు చేయుచు నైపీలను
సబూతు లున్నవి కెడ గ్రహచారముగ సుమీ :)
డిటెక్టివ్ నర్సన్ వర్సెస్ షెర్లాక్స్ తాత :)
జిలేబి
ReplyDeleteకూరుకు పోకు నిరాశని
ప్రేరణ జతగా యతనము పెంచు జిలేబీ
దారి కనులబడు సాధన
తో రహదారివలె మారు తూకొనుమిపుడే
జిలేబి
ReplyDeleteపూరణ చేసితినిటులన్
సారంబొప్పగ కవివర సద్భావనతో
ప్రేరణ కలిపించెడు మమ
కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్
జిలేబి
ReplyDeleteధోరణి నీదు కావలె ప్రదూషితులైనను సౌమనస్వులై
మారగ భాష కోమలము, మార్పును కోరెడు మానసమ్ముతో
ప్రేరణ పొందునట్లు సఖి పేర్మియు మీరగ పల్కు లెల్ల స్వీ
కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్
అయ్యేపనేనా :)
జిలేబి
ReplyDeleteకందోత్పల
కరకైననేమి సఖి యిత
కరి కారముఁ గల్గి యున్న, కలకాలము మె
త్తురు నీదు మాటలన్ విడు
వరు నీ స్నేహమ్మును పదపద నిజమిదియే
ఇతకరి కారము - హితము చేయు కరణము
జిలేబి
ReplyDeleteజతగాడివై సఖునిగ జ
గతి భక్తిపథమున శరణు గైకొనగా, ని
న్ను తలచిన తక్షణమున వి
నతి చేయగ దౌడురుకుల నన్జేరుదువే
జిలేబి
ReplyDeleteములకుగిరి కనుల మదిని వి
మలమణి వలె యొనరిచి చెలిమరి, దయ గొనుమా!
పలువరుసల నడుమ వికసి
త లసిత మృదుమధురపు లలిత కలిత కృష్ణా!
జిలేబి
ReplyDeleteప్లాటిన మండి జిలేబీ
పాటి యుడుకు గుండెకాయ పగలదు కనులం
దాటుచు చుక్కై నా రా
దీ టక టకయంచు వ్రాయు తెలిగంటి గడిన్
జిలేబి
ReplyDeleteఇంకా బుడతడు వస్తా
డింకా పై పైకి యని వడి పలికిరే? వా
డింకా రావటమేమీ
ఢంకా మ్రోగించి నిలిచె డాబుగ పైనన్
జిలేబి
ReplyDeleteప్లాటినము గుండె ధైర్యము
నోటడగకు చిల్లిగవ్వ నోచుకొనుట యే
నాటికి? తంగమగు మనసు !
నోటి గదురు ఉల్లి కంపు నొవ్వు జిలేబీ
జిలేబి
ReplyDeleteసంచితమగు కర్మ సుమా
వంచకులకు, మాధవుఁ డిడు వరమోక్షమ్మున్
పంచన చేరి కృపకొరకు
వంచిన తలయెత్తకనిక ప్రార్థింపగనే!
జిలేబి
ReplyDeleteకందోత్పల
సముచితముగాను కైవ
ల్యము, వంచన సేయువారల కవారిత మో
క్షము, మాధవుండిడున్ విడు
వము కృష్ణా నిన్నటంచు ప్రార్థింపగనే
జిలేబి
ReplyDeleteకొంచెము కూడ నా విభుడు క్రోధము నొందడు వేచి యుండు దా
నెంచిన మార్గమందు చన నిచ్చును వారిని, స్వీయమై నరుల్,
త్రుంచుచు కీడుసేసెడు దురూహల, నించుక మంచి, చేయకన్
వంచన, సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్
జిలేబి
ReplyDeleteప్రజ – ‘ప్రశ్న' మీదే.. ‘జవాబూ మీదే'.. శీర్షకతో గతంలో ఘనవిజయం సాధించిన విషయం విదితమే. ....
గతమెంతో ఘనకీర్తి కలవోడా :)
జిలేబి
ReplyDeleteశ్రీలల రంగ చంద్రకళ చెల్వున లేనును నవ్వు వెన్నెలల్
గీలుకొనంగ నంగజ శిలీముఖరీతి చెలంగు చున్న నీ
లీల కనుంగొనంగ నవలీల నఖండ సమస్త భూతలం
బేలిన కన్న సౌఖ్యమని యెంతు సుమీ మది సుందరీమణీ !
ReplyDeleteసరసము లాడు నేర్పు, కనుసైగలు సేసెడు నేర్పు, నా మనం
బెరిగెడి నేర్పు, నెమ్మది నొకించుక కోపము సేయు నేర్పు, క్ర
మ్మర మురిపెంబు తోడ బతిమాలెడు నేర్పు_ మనోజకేళిలో
గరగెడు నేర్పు, నీకె తగు గాదె తలంపగ సుందరీమణీ
ReplyDeleteతే వదనస్య చంద్రరుచి ధిక్కరణప్రతిభాస్తు తే దృశో
భావభవోత్పలాంబురుహ బాణకదంబ జయోస్తు సంతతం
తే వచనస్య కోకిలతతిప్రవరాయ సకృద్విధోస్తటం
తే వినుతింతు నీకు శుభమీయగ దేవుని సుందరీమణీ
ReplyDelete*సుందరీమణి శతకము - చంపకోత్పలమాలికా వృత్తముల శతకము రచన ఎవరిదో తెలియదు
A Triennial catalogue of MSS