Thursday, May 3, 2018

స్వాయంభువు - శత రూప



స్వాయంభువు - శత రూప
 
Tracking back పూరుడు !



శతరూప -స్వాయంభువుని భార్య. ఈమె బ్రహ్మచే మొట్టమొదట సృజియింపఁబడిన స్త్రీ.
స్వాయంభువుఁడు : ఒక మనువు. ఇతఁడు బ్రహ్మమానసపుత్రుఁడు. ఇతని భార్య శతరూప.

కొడుకులు ప్రియవ్రతుఁడు, ఉత్తానపాదుఁడు. కొమార్తెలు ప్రసూతి, ఆకూతి, దేవహూతి.

కర్దమప్రజాపతి : బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన యతఁడు. భార్య దేవహూతి. కొడుకు కపిలుఁడు.

మరీచి : బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. ఇతనికి కర్దముని కూఁతురు అగు కళయందు కశ్యపుఁడు అను కొడుకును, పూర్ణిమ అను కూఁతురును పుట్టిరి. ఈపూర్ణిమను కొన్ని ఎడల కొడుకు అనియు చెప్పి ఉన్నారు

కశ్యపుఁడు : ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను.

వివస్వతుఁడు : ద్వాదశాదిత్యులలో ఒకఁడు. తండ్రి కశ్యపుఁడు. తల్లి అదితి (దక్షప్రజాపతి రెండవ కుమార్తె). ఇతనినే సూర్యుఁడు అని చెప్పుదురు. ఇతఁడు విశ్వకర్మ కొమార్తెలు అగు సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనువారిని వివాహమయ్యెను. ఈవివస్వతునికి వైవస్వతమనువు, యముఁడు, శని అని మువ్వురు కొడుకులును, యమున, తపతి అని ఇరువురు కొమార్తలును పుట్టిరి. 

వైవస్వతుఁడు : ఒక మనువు. వివస్వతుని కొడుకు. భార్య శ్రద్ధ. కొడుకులు ఇక్ష్వాకుఁడు, నృగుఁడు, శర్యాతి, దిష్టుఁడు, ధృష్టుఁడు, కరూశుఁడు, నరిష్యంతుఁడు, వృషధ్రుఁడు, నభగుఁడు, కవి అను పదుగురు. వారలలో కవి అనువాఁడు బాల్యమునందే మృతుఁడు అయినందున సాధారణముగ ఇతనికి తొమ్మండ్రు కొడుకులు అనియే ఎల్లవారలు చెప్పుకొందురు.
ఈకుమారులు పుట్టకమునుపు వైవస్వతుఁడు పుత్రార్థియై ఒక యజ్ఞము చేయగా, అపుడు వైవస్వతుని భార్య తనకు కూఁతురు పుట్టునట్లు వేల్వుము అని యజ్ఞము నడపెడు హోతను వేఁడెను. కావున అతఁడు అందులకు తగిన మంత్రములను పఠించి వేల్చెను. అంతట ఇల అను కూఁతురు పుట్టెను. ఇల బుధుని పెండ్లాడి అతనివలన పురూరవుని కనెను. వానివలన చంద్రవంశము అభివృద్ధి పొందెను


పురూరవుడు - •వైవస్వతమనువు కొమార్త అగు ఇలకును చంద్రుడు కొడుకు అగు బుధునికిని పుట్టిన రాజు.
పురూరవునకు ఊర్వసి వలన ఆయువు, ధీమంతుఁడు, అమవసువు లేక విజయుఁడు, చిరాయువు లేక శతాయువు, శ్రుతాయువు లేక వసుమంతుఁడు అను పుత్రులు ఉదయించిరి
ఈతని రాజధాని ప్రతిష్ఠానపురము.
నహుషుఁడు : ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవి (స్వర్భానవి - Name of the Wife)  యందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఈతని భార్య ప్రియంవద. పుత్రులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, ఉద్ధవుఁడు అని ఏవురు

యయాతి : నహుషునికిని ప్రియంవదకును పుట్టిన ఏవురు కొడుకులలో ఒక్కఁడు.
ఇతఁడు శుక్రాచార్యుల కొమార్త అయిన దేవయానను పెండ్లియాడి ఆమెయందు యదువు, తుర్వసువు అను ఇరువురు కొడుకులను, వృషపర్వుని కూఁతురును దేవయాన చెలికత్తెయును అగు శర్మిష్ఠయందు ద్రుహ్యుఁడు, అనువు, పూరుఁడు అను మువ్వురు కొడుకులను కనియెను

(సోర్స్ - పురాణ నామ చంద్రిక - యెనమండ్ర వెంకట రామయ్య - వయా - ఆంధ్ర భారతి ఆన్ లైన్ నిఘంటువు)


Tracking back పూరుడు !

శతరూప         - బ్రహ్మచే మొట్టమొదట సృజియింపఁబడిన స్త్రీ.

స్వాయంభువు - బ్రహ్మ మానస పుత్రుడు
కర్దమప్రజాపతి : బ్రహ్మచ్ఛాయయందు పుట్టిన యతఁడు
మరీచి : బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు.

శతరూప   + స్వాయంభువు  -> దేవహూతి.

దేవహుతి  + కర్దమ -> కళ

కళ +     మరీచి -> కశ్యప

కశ్యప + అదితి ->  వివస్వత

వివస్వత + సంజ్ఞాదేవి (I am assuming only as above does not show correctly) -> వైవస్వత

వైవస్వత + శ్రద్ధ (Not sure who are the parents of Shradda!) -> ఇల

ఇల + బుధ (చంద్రుడు కొడుకు) -> పురూరవుడు

పురూరవ + ఊర్వశి -> ఆయువు

ఆయువు + స్వర్భానవి (Not sure who are the parents of svarbhanavi) -> నహుషుడు

నహుష + ప్రియంవద -> యయాతి

యయాతి + శర్మిష్ఠ -> పూరుడు





ఇట్లా ట్రాక్ చేసుకుంటా పోతా ఉంటే కథ ఎప్పటికి తేలేది ?
ఒక్క పూరుడు ని ట్రాక్ చేయటానికి రెండు గంటలు పట్టింది ! పూరుడు తరువాత ట్రాక్ ఎవరికైనా తెలిసుంటే చెప్పండి .

ట్రాక్ ఫార్వార్డ్ ఇఫ్ యు కేన్ :)

శుభోదయం
జిలేబి

12 comments:

  1. మానస పుత్రుడు అంటే పుత్రుడేనా ?
    వరస వాయి లేకుండా ఉంది కదా(ధా) ?

    ReplyDelete
  2. పురు వంశం అలా విస్తరించి మరో 28 తరాల తర్వాత భరతుడు. ఆయనకి దాదాపు నలభై తరాల తర్వాత ధర్మజుడు, భీమ, అర్జున, నకుల సహదేవులు.

    ఇందులో మళ్ళీ భీముడు విరాట రాజు దగ్గిర జేరినప్పుడు వంట దగ్గిర పనిచేసే ఒక చిన్నది (భీముడు ఆవిడని చేరదీయలేదని గమనించాలి) ఆయన దగ్గిర నేర్చుకున్న పాక విద్య; ఆ విద్య అలా విస్తరించి, మరో అయిదారు వేల ఏళ్ళ తర్వాత అంతర్జాలం, అందులొ తెలుగు రాయడం, పద్యాల్రాయడం, అప్పుడు తెలుగు బ్లాగులొచ్చాయి.

    అందులొ జిలేబీ బ్లాగు రాసే ప్రౌఢ - సాక్షాత్తూ మన భీముడి దగ్గిర శిష్యరికం చేసిన చిన్నదాని తాలుకాయే. అంటే జిలేబీ ముత్తల్లి మేనమామ తమ్ముడి బామ్మర్ది తాత వాళ్ళావిడ మనవరాలి పింతల్లి కూతురే!

    ఇంతకి చెప్పొచ్చేదేమిటంటే మీ జిలేబీ విద్య భీముణ్ణుంచి ఇంకా ముందుకెళ్తే నలుడి దగ్గిర్నుంచీ, ఆ పైన పురు వంశం లొనిదే. జై జిలేబీ.

    అదలా ఉంచితే
    పురు వంశం గురించి ఇక్కడ..... https://en.wikipedia.org/wiki/Puru_and_Yadu_Dynasties
    ఇదంతా పోతన భాగవతంలోనిదే. తి.తి.దే వెళ్ళి ఆ పుస్తకాలు చదవొచ్చుగా ఇలా జిలేబీలు పబ్లిగ్గా వాయిలు దించకపోతే? :-)

    ReplyDelete
  3. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కలెక్టర్ గురించి ఒక బ్లాగ్ లో వ్రాశారు, మీరు చూశారా “జిలేబి” గారూ? తన ప్రభుత్వ వాహనపు డ్రైవర్ రిటైరయిన రోజున సాయంత్రం వీడ్కోలు పార్టీ ముగిసిన తరువాత ఆ రిటైర్డ్ డ్రైవర్ను, అతని భార్యను కారు వెనక సీటులో కూర్చోబెట్టుకుని తనే (కలెక్టరే) స్వయంగా కారు నడిపి వారిద్దరినీ వారి ఇంటి దగ్గర దిగబెట్టారట. ఇది కాదె ఆతని సంస్కారం, ఇది కాదె ఆతని graciousness, ఇది కాదె ఆతని ఉన్నత వ్యక్తిత్వం 👏 .

    ReplyDelete
    Replies

    1. ಓ హారిక! వినవే! సం
      దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
      స్నేహంబున తక్కువగా
      డే! హంకారియునుగాడు!డెంకణ మిడవే!

      జిలేబి

      Delete
  4. ఈ నాడు మన చట్టసభలలో చర్చలు ఏ రీతిన ఉంటున్నాయో చూస్తున్నాంగా. 50 సంవత్సరాల క్రితం నాటి కాలంలో (అప్పటి ప్రపంచం ఈ యుగానికి చెందినదేనంటారా? It feels like so distant in the past 😢) ఎంత సంస్కారవంతంగా ఉండేవో ఈ క్రిందనిచ్చిన లింక్ లో తెలుస్తుంది. అడ్వర్టయిజ్మెంట్లలో అశ్లీలత అనే అంశం మీద లోక్ సభలో జరిగిన చర్చ గురించి 50 ఏళ్ళ క్రితం ఇదే రోజున ఆనాటి Deccan Chronicle లో వచ్చిన వార్తట, UNI-PTI వారి భోగట్టా. ఇవాళ్టి (11-05-2018) Deccan Chronicle (Hyd) లో Oped పేజ్ లో “50 years ago in Deccan Chronicle” అనే column లో తిరిగి ప్రచురించారు. చదివి ఆనందించండి 🤙. బూతో అంటూ బుగ్గలు నొక్కుకునేవారు కూడా చదవచ్చు 🙂.

    http://103.241.136.50/epaper/DC/HYD/510X798/2018-05-11/b_images/HYD_2018-05-11_maip11_6.jpg

    ReplyDelete
  5. “జిలేబి” గారూ, academic interest కొద్దీ అడుగుతున్నాను 👇.
    సమస్యాపూరణం చేస్తున్నప్పుడు / ఏదన్నా సందర్భం గురించి చెబుతున్నప్పుడు చాలాసార్లు మీ కవులు “ఒక బ్రాహ్యణుడు / ఒక పేద బ్రాహ్మణుడు రాజు గారి దగ్గరకు వెళ్ళి” అనో “ఒక బ్రాహ్మణి ఇట్లనియె” అనో అంటారెందుకు, ఆ సందర్భంలో బ్రాహ్మణుడి ప్రసక్తి అవసరం కాకపోయినా? ఏం, వేరే కులాలలో పేదవారుండరా, వాళ్ళు సహాయం అర్థిస్తూ పెద్దల దగ్గరకు వెళ్ళరా? అలాగే ఇతర కులాల వారు తమ సందేహాలు తీర్చుకునే ప్రయత్నం చేయరా?
    ఇది కులవివక్షత అవుతుంది అధ్యక్షా. అందరినీ సమానంగా చూడాలి అధ్యక్షా.

    ReplyDelete
    Replies

    1. అభివృద్ధి లో పోటీ పడాలె :)

      అంతే కాని అడుక్కోవడం లో కూడానా :)


      జిలేబి

      Delete
    2. దీన్నే దాటవేయు జవాబు అందురు ☝️.

      Delete
  6. నహుషుడి భార్య ప్రియంవద ఎవరి కుమార్తె ?

    ReplyDelete