Monday, March 4, 2019

పృషోదరాదీని యథోపదిష్టమ్ ! (पृषोदराऽदीनि यथोपदिष्टम् )




పృషోదరాదీని యథోపదిష్టమ్ !
 
(पृषोदराऽदीनि यथोपदिष्टम् )



మొన్న ఓ శార్దూలం సమస్యా పూరణ మై వస్తే ,

ఊతంబెవ్వడు అంటూ జోష్ తో మొదలెట్టేసి యతి స్థానం లో
చిక్కుకుని కుస్తీ పడి  గూఢోత్ముడు అన్న పదాన్ని ఆంధ్ర భారతి లో   'డిస్కవర్' చేసేసి వేసేసు కున్నా :)


మామూలుగా గూఢ + ఆత్మ - గూఢాత్మ విని ఉన్నాము గాని గూఢోత్ముడు అన్నది చాలా తక్కువ.
ఏదో బాగుందే అనుకుని కిట్టించేసి ( యతి కోసం తంటా లు :)) వేసేస్తే కంది వారు సందేహం లేవ దేసేరు - గూఢోత్ముడు ఏమిటి అని :)

మనకేమి తెలుసు ! ఏదో ఆంధ్ర భారతి ఉవాచ కాబట్టి సరియే అయి వుండా లనుకుని అట్లే వదిలేసా .

ఈ పద్యాన్ని అట్లే మన బ్లాగు లో వేసేసు కుంటే అదే ప్రశ్న ని శ్రీ మాన్ లక్కాకుల వారు కూడా అదే ప్రశ్న లేవ దీయటం తో

అరె యిదేదో మరీ చిక్కు సమస్యే కామోసు అనుకుని గూగులిస్తే

(पृषोदराऽदीनि यथोपदिष्टम् )



పృషోదరాదీని యథోపదిష్టమ్ !

 పాణిని  - అష్టాధ్యాయి -  సూత్రము - 6-3-109 అంటూ కొంత 'జిలేబి' మయము గా ఒకటి కనబడింది.

యేమి దీని అర్థము అనుకుని మళ్ళీ ఆంధ్ర భారతి ని అడుగ గా

పృషోదరుడు - అనగా వాయుదేవుడు ( బాన కడుపు గలవాడు కామోసు :) అన్న దీన్ను, ఉపదిష్ట అంటే తెలుపబడినది అన్న అర్థమూ కనబడినది :) అంటే పృషోదర  గట్రా లాంటి పదాలు పండితులు వాడేరు కాబట్టి వాటిని సరియే అని తీసు కోవాలని పాణిని ఉవాచ :)

 (జిలేబి ఏ పదం రాస్తే అదే సరి కామోసు : జేకే - సూక్షి పదం లా :)

మొత్తం మీద దీని అర్థం ఏమిటంటే 'సో కాల్డ్ పండితులు వ్యాకరణ సూత్రానికి కట్టు బడని కొన్ని ప్రయోగాలు 'వారు చేసేరు' కాబట్టి అట్లాంటివి సరియే అని అనుకోవాలి అని అర్థమని భాష్య కారులు తెలిపేరు

ఈ  గూఢోత్ముడు అన్న పదం  బై ది వే కఠోపనిషత్ లో వస్తుంది

एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते ।दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥१२॥

(కఠోపనిషత్ 1-3-12)

హమ్మయ్య జిలేబి నీవు కూడా పండితుల జాబితా లోకి ఎక్కి పోయేవనుకున్నా :)


పృషోదరాదీని యథోపదిష్టమ్ !


చీర్స్
జిలేబి
పిశాచి

(పిశాచి కూడా జగణమే అది కూడా ఈ కోవలోకి వస్తుందట :  ఓపిక వుంటే ఈ యూట్యూబు వాచ్ చేయుడీ !)





ఊతంబెవ్వడు? ప్రత్యగాత్మగను గూఢోత్ముండుగా నంతరా
త్మై తావన్నది లేక కందువగ క్షేత్రంబై నిరాకారుడై
వాతాహారవిరోధి నెక్కి యజుడై, బ్రహ్మై, జిలేబీయమై
సీతా! వల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్!


జిలేబి