Friday, February 16, 2018

పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !




పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !




పడికెట్టు రాళ్ల గూర్చుచు
పిడివాదమ్ముగ పదముల పిండు జిలేబీ
గడినుడి కాదే పద్యము
పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !


శుభోదయం
జిలేబి




202 comments:

  1. పిడిబాకులు, చురకత్తుల సంగతేమోగానీ “శంకరాభరణం” బ్లాగులో మీరీరోజు వ్రాసిన ఈ క్రింది పద్యం మాత్రం (సమస్యాపూరణ) బాగుంది (self-appraisal అనుకోవచ్చా? 🙂). పైగా “ఆంధ్రభారతి” సహాయం లేకుండానే మా బోంట్లకు అర్థమవడం విశేషం 🙂🙂 (jk).

    “గణితమువలె లెక్కల గట్టి గడగడ యని
    పదముల నటునిటు పరచి పద్యములను
    చేర్చెడు జిలేబి రగడల చేవ గాన
    నెంతయో యనుకొంటి మీ రింతె యంద్రు :)”
    (“జిలేబి” విరచిత)

    ReplyDelete


  2. చక్కని గురువుల్లాపై
    చక్కని నరసన్నలాటి చదువరులుండన్
    చిక్కని కవిత్వమున్నెం
    చక్కగ వచ్చు నగణితము చక్కని చుక్కా :)

    జిలేబి

    ReplyDelete


  3. అల్పజ్ఞుడ! నే నెంత! అ
    నల్పము మీ తర్కముగద ! నలకన గంటిన్
    చల్పుల చేయనికన్ మీ
    జల్పములకు రామురాము చట్టుల రాయా :)

    జిలేబి

    ReplyDelete


  4. బ్లాకు మెయిలింగు లేలా
    సాకుల చెప్పి బెదిరింప సారు బెదురుచున్
    వాకట్టువారమున్ కా
    మే!కరపాలిక కమింట్ల మీరిన వాడిన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అస్థానపతితమైన నా వ్యాఖ్యలను అక్కడినుండి తొలగించాను. గమనించ ప్రార్థన.

      Delete


  5. అస్థాన మాయెను గదా
    ప్రస్థానపు కబురు లెల్ల బాధయు కలిగెన్
    ప్రస్థానమ్మిదియె జిలే
    బీ! స్థావరమందు గొల్తు వేలగ రామున్ !

    జిలేబి

    ReplyDelete


  6. ఓయమ్మ!వింత జీవి సు
    మా! యామీ పద్మ! బతుకు మాయను మీరన్
    సాయంబట్టి గుభాళుల
    గాయమ్ముల రేపిరమ్మ గట్టిగ సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  7. మీ భావ కవిత్వమ్ములు
    ఓ భామా బాగు బాగు గోండ్రించెనుబో
    తాబాజారీ లేకన్!
    వాబిస్తాలము జిలేబి వాహ్వాహ్ యిదిగో !

    జిలేబి

    ReplyDelete


  8. ఈలయు వేయక నే మా
    లోలోపల దూరి చేసెలోతుగ జిబిజీ
    ఓ లైలా నీవే కొ
    డ్తే లైకుల తోడు కన్ను డేరా యేబో :)

    జిలేబి

    ReplyDelete


  9. అనయము సీతారాముల
    మనసున గొల్వగ విడువక మరిమరి మేలు
    న్ననవరతంబును గాంచుచు
    మనుజులు తరియింతురమ్మ మహిని జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  10. ఎన్నాళ్ళీ కోలుముసుగు
    లెన్నాళ్ళీ కొట్టుమిట్టు లెమ్మా పద్మా
    యెన్నాళ్ళే మేలి ముసుగు
    లెన్నాళ్ళే కవుగిలింత లెన్నెన్నాళ్ళే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆగవూ.....ఆగవూ...
      మీ పద్యాలూ...పద్మార్పిత కవిత్వాలూ.....
      అగితే సాగదూ....
      ముందుకు సాగదూ....

      Delete


    2. ఆగవు మీపద్యంబు
      ల్లాగవు ! ఆగిననికన్ సలాపము లెల్ల
      న్నాగును మీ యిరువురివీ
      పాగలు ఖానా జిలేబి పడతుక లారా :)

      జిలేబి

      Delete


  11. విరుపును గనన్ విరామము
    పరుగుల కిమ్మా విసుగు, కపణములు బోవన్
    సరసపు పలుకుల గమకము
    సరిసరి యనుచున్ గబగబ సరసకు వచ్చున్ :)

    జిలేబి

    ReplyDelete


  12. భానుమతి యెవరె జిలేబి ? పంచ పాండ
    వులకు భార్యగ వచ్చిన వువిద యెవరె?
    భీము నాయుధ మేది?; కవికుల విదుర!
    దుష్ట దుర్యోధనుని భార్య; ద్రోవది; గద!

    జిలేబి

    ReplyDelete


  13. బొమ్మకు చిత్రము వేసా
    వమ్మోయ్ పద్మాజి ! బాపు వారసు రాలా !
    కొమ్మా ! పద్యపు గుమ్మా
    క‌మ్మని తెమ్మరవు నీవు కవితల రాజ్ఞ్నీ !

    జిలేబి

    ReplyDelete


  14. వాతలు వలదను కుంటిన్
    ఓ తరుణీ పెట్టుకొనను బోవే తంటా
    నీతో ! యేమనగ జిలే
    బీతో యేమగు నెవరికి వివరము తెలియున్ :)

    జిలేబి

    ReplyDelete


  15. నిజమే! మీరొక వింతై
    న జిలేబి! విచిత్రమైన నడకన కవితల్
    రజనికరుని వెల్లువగా
    ప్రజలకనవరతము గాను పంచిరి పద్మా :)


    జిలేబి

    ReplyDelete
  16. జిలేబీ గారూ:

    మన త్రిమూర్తులను ఇచ్చట దర్శనం చేసికొనుడు:

    http://gpsastry.blogspot.in/2018/02/three-deities.html?m=1

    ReplyDelete
    Replies


    1. అంచనా తప్పలేదుస్మీ :)


      జిలేబి

      Delete


  17. ఏమయి నాదో బ్లాగరు
    కేమయి నాదో కమింట్ల కేమయి నాదో
    ఓమాలిని చెప్మా! నే
    డే మీ టెంప్లేటు మార్చుడీ సర్దుకొనున్

    జిలేబి

    ReplyDelete


  18. చూడకనే జీవితమను
    హోడము లో భావకుసుమ ఓడము లున్ మా
    టాడక పాఠము లన్ తా
    రాడక నేర్చుకొనుచుండె రమ్య జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  19. ఏమీ చేయ నసక్తుల
    మై మేము నిలబడినాము మహిలో పద్మా !
    మా మనసు లోని మాట సు
    మీ మీ కలమున జిలేబి‌ మించారెనుగా :)

    జిలేబి

    ReplyDelete


  20. లోకము కోసంబేదో
    పీకేస్తున్నామనుకొను బీరము లేలా!
    కోకొల్లలుగా నీతుల
    పాకం పప్పులుపయోగ పడెనా యూజీ :)


    జిలేబి

    ReplyDelete
  21. జిలేబీ గారికోసం:

    http://gpsastry.blogspot.in/2018/02/telangana-animutyam.html?m=1

    ఎంత కావాలంటే అంత zoooom చెసికొనుడు... లాభం: సార్ ను చూడవచ్చు :)

    ReplyDelete
  22. చిరు మార్పులతో వ్యాసం ఇచ్చట చదవండి... అన్నపరెడ్డి వారి కృపతో!:

    http://kandishankaraiah.blogspot.in/2018/02/2599.html?m=1

    ReplyDelete
    Replies


    1. చెన్నుగ శంకరాభరణ సేవగ కందివరుల్ సభాస్థలిన్
      మిన్నగ జేయ పూరణల మిక్కిలి సాయము బట్టి తీర్చగన్
      సన్నక సన్న పద్ధతిగ సాంకవ మెల్లెడ నద్దుచున్ భళా
      అన్నపరెడ్డి గారి అవగాహము అద్భుత మండి శాస్త్రి జీ!


      జిలేబి

      Delete


  23. బంగరు రేకుల బువ్వకు
    చెంగున దూకుచు జిలేబి చేరువ కమ్మా
    చెంగట వచ్చును భేషుగ
    వింగడ మౌ తిన్నదనము విదురుని బల్కౌ :)

    జిలేబి

    ReplyDelete


  24. మాలిక లో కనిపించద
    దేలా మీ బ్లాగు శరము దేవర శర్మా
    జీ!"లా" చిక్కే గదయా :)
    చాలనకర్త మన రౌడి చట్టు కలుపలే :)

    జిలేబి

    ReplyDelete


  25. మనసుపడే తపనను మీ
    దను శైలి వివరణ బాగు! దమ్ముగ బద్మా
    షును పో పొమ్మని తెలిపి మ
    దిని మీటిరిగద జిలేబి దిరిసెన పువ్వా !

    జిలేబి

    ReplyDelete


  26. సాహిత్యమ్మును చదువుచు
    ఆ హితమగు పలుకుల మనసార‌ జిలేబీ
    నాహము గా జేసుకొనుచు
    వాహిని యై సాగిబోవ వశమా తరమా !

    జిలేబి

    ReplyDelete


  27. నేనంతటి తుంటరినే
    కానండీ గురువుగారు కష్టే ఫలుడన్
    మీనమ్మకమై నోణ్ణీ!
    మానను వెనువెంట నడక మాచన వర్యా :)

    జిలేబి

    ReplyDelete


  28. మమతా బేన్! కేజ్రీ వాల్!
    కమలుని కందింతురంట గట్టి సపోర్టున్ !
    తమిళ జనులకిక పండుగ
    అమితంబగు రజనియున్ సయాటల్లాడన్ :)

    జిలేబి

    ReplyDelete

  29. సెబాసో ఆదిత్య గుండు హనుమంతరావులకు తగిన తనయుడి వయా!



    హనుమంతరావుకు నివా
    ళి! నవ్వులన్ జేర్చితివి భళి తెలుగు తెరపై!
    తనయుని సుపుత్రునిగ పెం
    చి నడవడిక మంచిగాను చేసితివి భళా!

    జిలేబి

    ReplyDelete


  30. రోబోలొస్తున్నాయ
    ర్రా! బిలముల మెరుగు జేయ రయ్యనుచు సఫా
    యీ బెహతరగును ; నౌకరి
    గాబాగూబి మటుమాయ గాభర పడుమోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  31. రేపే కమల హాసనుడి ఎంట్రీ :)



    అదిగో మరో చిరంజీ
    వి! దగుల్బాజీల కెదురు వేలంవెర్రై
    కదన కమలహాసనుడం
    ట దిగుటకు యతనము జేయుటా! హ! హతవిధీ !


    జిలేబి

    ReplyDelete


  32. రజనీ కాంతుడు కూడా
    భజన పరుల బల్కు గాంచి బరిని దిగునటా!
    మజ గాంచు రాజకీయపు
    భుజంకషమ్ముల జిలేబి భుగభుగలున్నూ :)

    జిలేబి

    ReplyDelete


  33. మంచి ముహూర్తమునట బె
    ట్టించె కమలహాసనుండు టేక్ ఒన్ షాట్ ఒన్!
    సంచల నాత్మక వ్యాఖ్యలు
    మించారునికన్ జిలేబి మిరుమిట్లగుచున్ !

    జిలేబి

    ReplyDelete


  34. ఆధ్యాత్మిక మార్గమున సు
    సాధ్యము గావించి జనుల సద్గతి, రజనీ
    బాధ్యత గా మెలగుచు నా
    రాధ్యుడగున ? వేచి చూడ రమ్మ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  35. మగవారిని తిడుతూ సయి
    పొగడుచు పద్మార్పితా కపోలపు కైపు
    ల్నెగడుల ణిసిధాత్వర్థపు
    బిగువుల వేలా జిలేబి పిరియము గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  36. షాకింగు పోస్టు లెట్టే
    రే! కిందా మీదగయి పరీక్షించామం
    డీ కించిత్ భీతిగ ప
    ద్మా! కెలికిరిగద పురుషుల దమ్ముగ జూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  37. ఆలో చించుచు మేమౌ
    మాలోకమ్ముగ జిలేబి మాదిరి రాసే
    స్తూ లో గుట్టుల నెరుగము
    మీలా గన్నాచరణ సుమీ!చిత్రాంగీ :)

    జిలేబి

    ReplyDelete


  38. స్త్రీ జాతుల బోల్చిన మగ
    రాజుల గతి యింతయే పరాకులు బోవున్ !
    మీ ఝాటమ్ము భళారే
    బాజథువుగదా జిలేబి బాగుగ నేడున్‌ !

    జిలేబి

    ReplyDelete


  39. అతుకుల బొంతగ జీవిత
    ము తునియగన్నెల్లపుడు విముక్తియు లేకన్
    సతతము వెనువెంబడి "ఆ
    పతి" సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్!

    *ఆపతి - ఆపద ఆపత్తు
    జిలేబి

    ReplyDelete


  40. ఏ పేపరు చూసినా నేడీ కథలే!

    అతలాకుతలంబాయెన్
    పతి ;సరసము లాడఁగ సతి, పరువులు వెట్టెన్
    పతితుని కనుగొని వేసెన్
    కుతకుత లాడుచు నిరువురి కుత్తిక లివిగో!!


    జిలేబి

    ReplyDelete


  41. పతి వర! వినుమయ! కాదిది
    జతగని సయ్యాడగాను సమయము విడటం
    చు తరుణియు తూగ, గాంచుచు
    పతి సరసము లాడగ సతి పరువులువెట్టెన్ !

    జిలేబి

    ReplyDelete


  42. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ :)


    అత్రత్యపు భువి మాయగ
    చిత్రంబగు జీవితమిది! చింతయు గూడన్
    విత్రస్తుని మది లో భళి
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్!


    జిలేబి

    ReplyDelete


  43. మైత్రిగ ముదిమిని జేరగ
    పత్రిక లకునెక్క కథయు పఠితయె సతియై
    క్షేత్రిన్కవ్వింప భళిర
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్!


    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  44. మాతృభాషా దినోత్సవ సందర్భంగా రండి కొన్ని తెలుగు పదాలను నేర్చుకుందాం :)


    ఈతర్ దేశాలు
    చానకూనీతి
    తొలిదస
    సత్రువు
    బైతపడి


    :)

    నారదా!

    ಜಿಲೇಬಿ

    ReplyDelete
    Replies
    1. నదురూ బెదురూ లేని చాణక్యనీతి – షాడ్గుణ్యం అంటే ఏమిటో చూపిస్తున్నారు!చాణక్యుడు ఇతర దేశాల మీద గురిపెట్టమన్నాడు,వీళ్ళు స్వదేశపు ప్రతిపక్షం మీద ప్రయోగిస్తున్నారు.నేను చాణక్యనీతిని చదివాను.వాళ్ళకి తొలినాటి విజయాల వల్ల కలిగే అహంతో తెలియడం లేదు గానీ ఇందులో ఒక చిక్కు ఉంది.వాళ్ళు ఇదంతా వ్యూహప్రకారమే చేస్తుంటే శత్రువులు కూడా పెరుగుతారు.శత్రువుకి బలం తగ్గడం తొలిదశలో ఇప్పుడు భాజపా వాళ్ళకి ఉన్నట్టు సమ్మగానే ఉంటుంది.బలమైన శత్రువుకి చాటుదెబ్బలు తియ్యాల్సిన అవసరం లేదు గానీ బలం తగ్గినప్పుడు ఎంత తెలివితక్కువ వెధవకయినా బైటపడి పోట్లాడ్డం కన్న సందు దొరికినప్పుడు దొంగదెబ్బ తియ్యడమే బెస్టని!

      చాటుదెబ్బలు ఎటూ ముందు తెలిసేటట్టు ఉండవు – రోజుకో తలనెప్పి,నిద్రలేమి,ఉలికిపాటు,తడబాటు!ముందుంది ముసళ్ళ పండగ.కుక్కచావు చస్తారు – కాంగ్రెసు పతనాన్ని చూసి కూడా నేర్చుకోవడం లేదు వెధవలు వేమన్న “నిన్న మొన్న దగ్ధులైనవారు తనయంతవారని యెరుంగరు” అన్నాడు.అంటే,కొవ్వు బలిసిన ప్రతివాడికీ హిరణ్యకశిపుడూ,రావణుడూ,ఔరంగజేబూ,ఇంగ్లీషువాళ్ళూ అని గుర్తుచేసి నీతులు చెప్పబోతే “వాళ్ళు తెలివితక్కువ దద్దమ్మలు!నేను వాళ్ళకన్న తెలివైన వాణ్ణి కదా, నేనెందుకు చస్తాను?” అని అనిపిస్తుందట.బీజేపీ చావుని కూడా చూశాక వేమన వాక్యం మరోసారి నిజమవుతుంది తధాస్తు

      Delete


  45. నేటికాలపు "కాలమ్" కథలు !


    మిత్రుడ! ముది! చింతవలదు !
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁ, "గాలమునన్"
    పుత్రిక వయస్సు పడతిన్
    మైత్రి ని బడవేసి పెండ్లి మాట కలుపగన్ :)


    జిలేబి

    ReplyDelete


  46. "మక్కళ్నీది " యె కమలుని
    చక్కని "మయ్యము" కతవిన చక్కగ రావే
    మొక్కెను కలాము గారికి
    పక్కన కేజ్రీ "బలముగ" పార్టీ మొదలౌ :)

    జిలేబి

    ReplyDelete


  47. శరణాగతి యిది యే దే
    వర? కాస్త తెలుపుడి మాకు వసుధన్ వెలుగన్
    వరముల నేదియు కోరను
    దరి యతనిది చాలు! నిధియదై నిలచు సుమీ

    జిలేబి

    ReplyDelete


  48. కరుణాంతరంగ డాతడు
    మరిమరి గొల్చెద జిలేబి మా రాముని నే
    శరణా గతిగానుచు నే
    వరమ్ము లేవియు నడుగను వరదుని సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  49. ముకుతాడు వేయుము బృహ
    త్తుకు ! తాడున్ వేయజూడ తుంగన్ ద్రోయన్!
    తకపికలాటలవేలా
    దకలుపఱచుమా జిలేబి దైవము మదినిన్ !

    జిలేబి

    ReplyDelete


  50. హా!యాడువారి జాతుల
    నోయమ్మా యక్షరముల నొప్పుచు సేద్యం
    బే! యాడాడి కబురులన
    మాయా బాజారు నిల్పి మరిపించితివే :)

    జిలేబి

    ReplyDelete


  51. స్త్రీ వంక చూడడము ప
    ద్మా వాస్తవముగను ప్రకృతి ధర్మము పురుషుల్
    బేవార్సులుగా రమ్మా
    యావత్తు జగముల మాయ యామి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  52. నీవే గురజాడవి ! ప
    ద్మా! వేణీ ! స్త్రీ ల జాతి దరువుల విభజిం
    చావే ! నెరజాణవు బో !
    భావి తరము నిన్ను గొల్చు బాగు జిలేబీ !

    జిలేబి

    ReplyDelete

  53. ఇంటిపేరు మార్చిన జిలేబి

    Published Wednesday, 21 February 2018

    కవిత్వంలోనో, పాండిత్యంలోనో, సాహిత్యంలోనో నటనలోనో తనదైన ప్రత్యేకత సంతరించుకుని తన పేరుకన్నా ముందుగా వారి ఇంటిపేరోవారి రచన పేరో వారిపేరుకు ముందుగా ఉచ్చరించే ప్రాచుర్యం పొందిన సందర్భాలు మనకు సాధారణమే.కాని పల్లెటూరులోని చిరు హోటల్‌లో తయారయ్యే జిలేబి వ్యాపారమే ఆయన ఇంటిపేరును మార్చివేసిందంటే ఆ వంటకానికి ప్రజల్లో ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పకనే తెలుస్తుంది.
    సంతమాగులూరులో 50 ఏళ్ల క్రితం వీధి అరుగుపై అర్వపల్లి వారు ప్రారంభించిన జిలేబి వ్యాపారం నేడు మూడంతస్తుల భవనంలో నడుస్తుడటం వ్యాపారాభివృద్ధికి నిదర్శనమైతే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల పేర్లకు ముందు జిలేబి అని చేరిస్తేనే గాని వారి చిరునామా తెలిసే పరస్థితికి వచ్చిందంటే వారి వంటకానికి ప్రజల్లో ఎంతటి ప్రాచుర్యం ఉందో చెప్పవచ్చు.
    మండల కేంద్రమైన సంతమాగులూరులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన అర్వపల్లి వెంకటేశ్వర్లు చిన్నతనం నుంచి బేల్దారి పనులు చేసేవాడు. పెళ్లయిన తరువాత బేల్దారి కూలి పనులతో ఇల్లు జరగడం కష్టమైంది. అప్పడే తమ కులవృత్తి వ్యాపారం చేయాలని భార్య సూచన మేరకు గడ్డం వెంకటరెడ్డి ఇంటి ముందు వీధి అరుగుపై చిన్న గంపలో జిలేబి వంటకంతో వ్యాపారం ప్రారంభించారు. వారి జిలేబి వంటకం నాణ్యతతో కూడి రుచికరంగా ఉండటంతో సంతమాగులూరుతోపాటు పరిసర ప్రాంతాలవారు కూడా వివాహాది శుభకార్యాలకు ప్రత్యేకంగా సంతమాగులూరు జిలేబి వడించేవారు. ఈ నేపధ్యంలో జిలేబి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది వీధివ్యాపారం కాస్తా పదేళ్లకు మూడంతస్తుల సొంత భవనంలోకి మారింది. వ్యాపారాభివృద్ధితో పాటు అర్వపల్లి వెంకటేశ్వర్లుతో పాటు కుటుంబ సభ్యులనందరిని ప్రజలు జిలేబి వెంకటేశ్వర్లు, జిలేబి ప్రసాద్, జిలేబి రాము అని పిలవడం అలవాటైపోయింది. దీంతో వారి ఇంటిపేరు కాస్త జిలేబిగా మారిపోయింది. ప్రస్తుతం వారి కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. వ్యాపారం ప్రారంభించిన కుటుంబ పెద్ద వెంకటేశ్వర్లు ఐదేళ్లక్రితం కన్నుమూశారు. అయినా ఇద్దరు కుమారులతో వెంకటేశ్వర్లు ధర్మపత్ని రాజేశ్వరమ్మ తమకు అన్నంపెట్టిన జిలేబి వ్యాపారాన్ని కొనసాగించాలనే సంకల్పంతో కుమారులతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒక కుటుంబం జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ఇంటిపేరునే ‘జిలేబి’గా మార్చిన ఆ వంటకం మధురాతిమధురం..
    http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=10091996

    ReplyDelete
    Replies


    1. మూడంతస్తులసొంత మేడలన సొమ్ముల్జేర్చినావా! జిలే
      బీ! ఢంఢంబను గుండు మామి! గలరే బింబోష్ఠి లోకమ్ములో
      నీ డాంకారపు సాటి ! వేల్పువు గదా! నెక్కొల్పి నావే మజా!
      జోడిన్గట్టెద నీకు వృత్తములతో జొత్తిల్ల వేడిన్ సుమా !


      చీర్స్
      జిలేబి

      Delete
    2. ఆ జిలేబి మధురమే గానీ పిచ్చి పద్యాలతో వెర్రెత్తించే ఈ జిలేబికి మాత్రం అంత సీను లేదు:-)

      త్రీ చీర్స్
      చిచ్చరపిడుగు

      Delete


    3. చిచ్చర పిడుగుల పల్కుల
      కచ్చకు పడకే జిలేబి గాభర ! మజ ! క
      ల్లచ్చున నరగన్ దీయుము
      గుచ్చుచు కందమ్మునొకటి గుమ్మా యిపుడే :)

      జిలేబి

      Delete


  54. జాకు పాటు గొట్ట జక్కి పాడి నరయ
    లెక్క యెక్కు వైన లేదు సుఖము
    నాట వెలది గట్ట నాడి తెలియవలె
    లెక్క తక్కు వైన లేదు పటిమ!


    జిలేబి

    ReplyDelete


  55. చక్క పెండ్లి యాడి చంకన బిడ్డల
    గంపె డంత బెట్టి గట్టి నిదుర
    బోవ నేల మగడ ! లేవర లేవర !
    లెక్క యెక్కువైన లేదు సుఖము

    జిలేబి

    ReplyDelete


  56. కోట్లు కోట్లు కోట్లు కోటాను కోట్లు ! "ప
    రపతి పత్ర" కథల రభస గాన
    నీరవుడ! సెబాసు ! నీకథ జూడగ
    లెక్క యెక్కు వైన లేదు సుఖము !

    *letter of credit- పరపతి పత్రము

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  57. ఉద్గంశమ్ముల గాంచితి
    ఉద్గంధి భరింప లేక నురికితి చంపన్!
    మద్గణిత మత్కుణమ్ములు
    సద్గతి నివ్వవలె నిదుర చక్కగ బోవన్!

    జిలేబి

    ReplyDelete


  58. చాలా మందికి జాతుల
    గోలలు తెలియవు జిలేబి గుమ్మలు ఓల
    మ్మీ లబకున తానము మా
    రాలనుకున్న నిలుప మగరాయల తరమా :)

    జిలేబి

    ReplyDelete


  59. మరమనిషి తెలివి తేటల
    ఒరవడి ఆ సృష్టికర్త పోడిమి పైనన్
    హరి ఆధారపడునకొ? వి
    వరము తెలుపుడయ్య బాబు ప్రశ్నించిరటన్ !

    జిలేబి

    ReplyDelete


  60. అవునండి! పుచ్చుకొనడము
    చవుకన్ కొట్టేయడమ్ము చక్కదనముగా
    నవనాగరీకమాయెన్
    హవణియిదిగదా జనులకు హద్దరి బన్నా !

    జిలేబి

    ReplyDelete


  61. ఆయువుపట్టు జిలేబీ
    కాయమునకు గుండెకాయ !ఖాయము పగులున్
    సాయము దానికి నివ్వక
    మీ యానము వేగమైన మిడిసిపడకుమా !

    జిలేబి

    ReplyDelete


  62. బరువెక్కిందేమో గద!
    పరుగెత్తెను గుండెకాయ పద్మార్పిత! తా
    పరుగున వచ్చును నీదరి
    శరణంబని దెబ్బలగన చల్లగ మళ్ళీ :)

    జిలేబి

    ReplyDelete


  63. నిబ్బరముగ నుండుటెటుల!
    తబ్బిబ్బవుతుంటిమిగద తరుణీ పద్మా
    నబ్బురముగ నీ శైలిన్
    కబ్బమునట జేర్చి చెప్పు గజగామినియై!

    జిలేబి

    ReplyDelete


  64. ఎన్నెన్ని లీలలమ్మా !
    మన్ను తినెను కన్నడమ్మ! మరులుగొలిపెనే
    అన్నుల మిన్నగ చెలులన్
    కన్నయ్యా! నీ కథల జిగజిగ భళారే!

    జిలేబి

    ReplyDelete


  65. భావపు వలలో చిక్కం
    గా వనితా మేలు బావ గారి వలన క
    న్నా! వారిజనేత్ర! జిలే
    బీ!వరమై వెలిగినావు విశ్వమున సుమీ !

    జిలేబి

    ReplyDelete


  66. మీ గుండెపోయిన దిగులు
    బాగుగ కనిపించెనమ్మ పద్మార్పిత! ఓ
    యీ గుమ్మ! జిలేబీ ! విన
    వే గౌరమ్మా ! పలుకులివియె నీ పలుకై :)


    జిలేబి

    ReplyDelete


  67. శ్రీ రామరాజ్య మౌరా!
    రా రమ్మని పిలిచె సీత, రాధాలోలున్
    పేరున్న బాలకృష్ణుని,
    తార నయనతార సూవె తరుణి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  68. హా! రోజులు మారెనుగద !
    రా! రమ్మని పిలిచె సీ! తరాధా లోలున్
    పోరియు వాటేసుకొనుచు
    నారేసుకొనమని కోరె నమ్మ జిలేబీ !

    *తర- వేగము
    *అధ - సర్వము
    తరాధాలోలుడు - వేగమే సర్వము గాగల లోలుడు - జాణ:)


    జిలేబి

    ReplyDelete


  69. హా!యీ ప్రేమయనగనిం
    తే! యిది గో గుండెయనుచు తేకువ గానన్
    సాయి‌చి ఆపై పోయెను
    గాయని యేడ్తురు జిలేబి గాయంబుగనన్

    జిలేబి

    ReplyDelete


  70. పోదెక్కడికిన్ గుండెయు
    మీదరి తను తిరిగి వచ్చు మిక్కిలి బిగువై!
    సోదరి పద్మార్పిత! విన
    వే! దక్కాదినగ నేమి వెంటదగులుకో!

    జిలేబి

    ReplyDelete


  71. ప్రాతఃకాలంబందున
    చైతన్యమును కలిగించు సేవల నిడిరే!
    జోతలు ! కైపద తారణి
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే ?

    జిలేబి

    ReplyDelete


  72. ఆశల నాశయముల నవ
    కాశముల విడిచిన యామి గజగామిని ! ప
    ద్మా! శక్తికి నీవు గదా
    కోశము, నీపల్కులెల్ల ఘుమలన్ జేర్చన్!

    జిలేబి

    ReplyDelete


  73. పెనవేత రెండు మనసుల
    ది నలుదెసల తిరుగనేమి దిరిసెన పువ్వా !
    వినదగు నెవ్వరు చెప్పిన
    గునగున రమ్మా జిలేబి ఘుమఘుమలనగన్!

    జిలేబి

    ReplyDelete


  74. చచ్చినటులె గుండెయునట
    గుచ్చుచు బోవన్ జిలేబి గునపమ్మదియే
    సొచ్చెము గా ప్రాణములున్
    లచ్చనమైబోయినటులె లక్ష్మీ వినవే !

    జిలేబి

    ReplyDelete


  75. అంసము మీదన్ భారము
    కంసము లోననటకూడు గద మన బాధౌ!
    హంసోయా సోహంబా?
    సంసారికి లేని చింత, సన్యాసి కగున్!

    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  76. మా సత్యమ్ము సమూహము
    కోసము! శ్రీదేవి జనన గోలన పడినా
    రే సిన దాన జిలేబీ
    యేసారే చక్రమొకటి యెంకట సామీ :)

    జిలేబి

    ReplyDelete


  77. కోన్యాకున్ గాన ముదము?
    అన్యాయమటంచునసుగు నాతడదేలన్?
    గణ్యమగు భంగు కోరిక?
    సన్యాసికి! లేని చింత ;సంసారికగున్ !

    జిలేబి

    ReplyDelete


  78. సీమల నివ్వండర్రా!
    సీ!మా మూలముల నెరుగ చింతయు గనిరే ?
    మీ మాటలమత్తున భా
    జ్పా మమ్మిక ముంచలేరు జాగ్రత్త సుమీ !

    జిలేబి

    ReplyDelete


  79. ఇచ్చెదమనిన పాకేజి నివ్వ కున్న
    నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
    చంద్రుడయ్య రాష్ట్రమునట చక్క దనము
    వెలయ నాయకుడతడేను వేల్పు గాను !


    జిలేబి

    ReplyDelete

  80. నవలల చదివాననకోయ్
    తవరేమిటి నేర్చిరో మతలబు తెలుపుడీ !
    గవనము ముఖ్యము నరుడా
    చవటవలె చదువుట యెకటె సరికాదోయీ !

    ಜಿಲೇಬಿ

    ReplyDelete
    Replies
    1. అభ్యంతరం అధ్యక్షా ☝️, నవలలు చదివే వారిని “చవట” అంటున్నారు “జిలేబి” గారు 😡. ఆ మాటను రికార్డులనుండి తొలగించాలని కోరుతున్నాను అధ్యక్షా ✍️.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete


  81. డబ్బుల సంపాదన మజ
    నబ్బురముగ మార్చు పడతి నడవడికల నో
    రబ్బీ శ్రీకాంతుడ! యీ
    సుబ్బమ్మ పలుకుల వినుమ సూక్ష్మము గనుమా :)

    జిలేబి

    ReplyDelete


  82. యోగా అంటే చేయుట
    యే గాదోయ్! జీవితమున యెగుడుదిగుడులన్
    యోగమయమ్ముగ చూడట
    మే! గురువులపల్కు వినుమ మేధా జీవీ !

    జిలేబి

    ReplyDelete


  83. జనులను చూడగ నవ్వొ
    చ్చెను గురువులకట జిలేబి చేరెన్ బోవే
    వినువీధిని యోగ గురువు
    కనుల మునుపు తెలిసెనన్ని కశ్మలముగబో :)

    జిలేబి

    ReplyDelete


  84. కవ్విస్తుండగ రాహులు
    డవ్వా ఉలుకడట పలుకడటవే మోడీ !
    సువ్వీ జిలేబి మొత్తము
    తవ్వును ఆపై కెలుకును తరుణము గానన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కెలకడానికి ఎన్ని సంవత్సరాలు కావాలేవిటీ ?

      Delete


  85. కుక్కలు చింపిన విస్తరి
    పక్కా చెప్పెనుగ బుచికి పారునికట! హా
    చిక్కెను వలలో లంఖిణి
    చక్కగ గాన్పడెనుగాద సాయంపూటన్ :)

    జిలేబి

    ReplyDelete


  86. విన్నపమట నధ్యక్షుల
    కన్నన్నా విన్నకోట కస్సనె చవటల్
    యెన్న దగిన బల్కవదో
    యన్న! జిలేబికి దురాయి యటనిమ్మ వడిన్ :)

    జిలేబి

    ReplyDelete


  87. తెలియని జిలేబి పాకము
    వలగా వెన్క పడెనర్ర వణికిరి జనులున్!
    పలుకుల కొల్కికి పనియే
    మిలేదకో బ్లాగుల తడిమి తడిమి జూచెన్ :)

    జిలేబి

    ReplyDelete


  88. పిడకుచ్చుకు కొడతానే
    గడసరి బామ్మా జిలేబి గప్పున చవటై
    లొడలొడ వాగేవంటే!
    బడబాగ్ని పగిలెనకో సభాసదనమునన్ :)

    జిలేబి

    ReplyDelete


  89. ముంపది మూతికి వచ్చును
    సంపంగియు పల్కె గాద సరసము విడుమోయ్!
    చింపెను బో యమ్మియునొక
    గంపెడు చాన్నాళ్లు సూవె కంద జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  90. ఎవరిచ్చారే అధికా
    రవరేణ్యు లెవరె ? పదముల రయ్యన దువ్వెన్
    పవరున్న భామ గద! సో
    యెవరే గురువుల్ జిలేబి యెక్ రంగీలా :)

    జిలేబి

    ReplyDelete


  91. గుండె యది చిన్నదే కా
    నండీ పోరచిగ బాధలండీ పద్మా !
    గుండెయు మీలో పదిల
    మ్మండీ ! బెంగ విడవండి మనన జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  92. చవటను పదమున కింతటి
    సవాలు విసురు అభిమాన సంఘము గలదా !
    కవనమును చదువ నపుడపు
    డు విసురు మమ్మ యిటువంటి డుమ్మా పదముల్ :)

    జిలేబి

    ReplyDelete


  93. కెలికే దానికి కావా
    లె లిప్త కాలము జిలేబి, లేవే దమ్ముల్ !
    బలముల్ సన్నాసులకే
    దె లేమ వివరంబరయుము దిరిసెన పువ్వా !

    జిలేబి

    ReplyDelete


  94. నే దెప్పానోయి నరుడ!
    గాదే తలపుల తెలిపితి కదనంతే రా
    వేదన చెందకు మయ్యా
    రోదన మానుముర ఊసురోమన కయ్యా !

    జిలేబి

    ReplyDelete


  95. పోయిందని కంప్లైంటి
    చ్చేయండీ దొరక వచ్చు చేరగ మిమ్మున్ !
    సాయంబట్టుదు రో య
    మ్మా యెంకట సామి మీకు మామాట వినన్‌!

    జిలేబి

    ReplyDelete


  96. మా తెలుగు సినీమాలని
    జోతలనిడి వెళ్ళినాము జోకర్లయినా
    మే!తై తక్కల జూడన్
    వాతలు పడెనయ్య మాకు వద్దిక మళ్ళీ :)

    జిలేబి

    ReplyDelete


  97. ఇంట నుండె నయ్య చిన్నాన్న యొక్కరు
    వర్షములయె పెండ్లవలె; జిలేబి
    యొకతె కుదురగ, నయయొ మురిసి బందరు
    వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ!


    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  98. నలభై వత్సర ములుగా
    నిలబడె నటరాజకీయ నేతగ చంద్ర
    న్న! లలాట లిఖితమైనది
    విలాస మైనది జిలేబి విభుని వరమహో!

    జిలేబి

    ReplyDelete


  99. ఏ యాసలోన నవలో?
    రాయల సీమ పలుకేన ? రాయుడి వివరా
    లీయండి నెమలి కన్నుల
    సోయగములలోలలాడు సొగసరి మురళీ :)

    జిలేబి

    ReplyDelete


  100. భాషను గురించిన వివర
    మీషణ్మాత్రము మరిచితి మిక్కిలి గా సం
    తోషము మీరడిగారం
    డీ! సవరించితి టపాను రివ్వున నెనరుల్!

    జిలేబి

    ReplyDelete


  101. కడగండ్లన్ని జిలేబీ
    అడమానము బెట్టిన మన రాష్ట్రపు నేతల్
    కడతేర్చినవి! మదినిటన్
    బడబాగ్ని రగిలెను లోన భారంబగుచున్!

    జిలేబి

    ReplyDelete


  102. పోపో పోతే పోనీ!
    ఈపాపపు జగతిలోన నిక్కంబెవరో !
    సోపానంబిది యేన
    ర్రా పలు కర్మల నివృత్తి రాటున దేల్చున్ !

    జిలేబి

    ReplyDelete


  103. పోలీసుల్ రక్షిత టా
    క్సీలు గలవె? తెలుపుడయ్య కింద తిరుపతిన్?
    దాలత్తు గుండు కొట్టుడు
    వేలకు వేలగను మధ్య వీళ్ళది లెక్కే :)

    జిలేబి

    ReplyDelete
  104. “వీళ్ళది లెక్కే” అంటూ మీరేమీ తీసిపారెయ్యనక్కర్లేదు. దూరాభారాల నుండి వచ్చిన వారికి రైలో బస్సో దిగడంతోనే కష్టాలు మొదలైపోతే ఎలా?

    మీరన్న “దాలత్తు” వారికి (అర్థం “ఆంధ్రభారతి” లో చూశా 🙁) దౌలత్తు మీద మక్కువ ఎక్కువేమో user-friendliness కంటే??

    ReplyDelete


  105. తానము లాడుచు జారిప
    డేనట తరుణమది బోవ డెక్కల కైపున్
    మీనాక్షి పల్కు లనరయు
    మా నాడీ మండలమది మహిని జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  106. కాసున్న వారికేగద
    యీశుండును నరసరాయ ! యెన్కటి వడ్డీ
    కై శుల్కము దాలత్తుకు
    వాసుని సన్నిధికి గాను వారికి శుల్కం :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అవునవును, పెద్ద బాకీదారుడు కదా మన వెంకీ. ఎప్పటికప్పుడు వడ్డీ కట్టేస్తూ NPA అవకుండా చూసుకుంటున్నట్లున్నాడు. దానికోసం కాసులు కావాలిగా మరి 🙂.

      Delete
  107. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించం అంటూ రేపు ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షల అభ్యర్ధులకు అధికారుల హెచ్చరికలు మొదలయినాయి టీవీలో. పోటీ పరీక్షలకు ఇటువంటి హెచ్చరికలు విని విని అలవాటు పడిపోయాం - అది అన్యాయమని నాలాంటి సామాన్యజీవి అభిప్రాయమైనప్పటికీ. ఈ ఓవరాక్షన్ ఇప్పుడు మామూలు వార్షిక పరీక్షలకు కూడా చూపిస్తున్నారన్నమాట. ఇదేమి శాడిజమో నాకర్ధం కావడంలేదు. ఆలస్యంగా వస్తే ఆ నష్టం ఆ అభ్యర్ధే భరిస్తాడు. అంతే కానీ అధికారుల సొమ్మేం పోతుంది? బ్రిటిష్ ఇండియా రోజుల్లోనే (ఆ తరువాత మా రోజుల్లో కూడా) అరగంట వరకు ఆలస్యాన్ని అనుమతించేవారు.మరి ఇప్పుడేం తేడా వచ్చింది? ఆ మాటకొస్తే ఆ రోజుల్లో ఇంత భీభత్సమైన ట్రాఫిక్ లేదు, జీవనం ఇంత అతలాకుతలంగా ఉండేది కాదు, పరీక్షాకేంద్రానికి జేరుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడ్డ కాలం కాదు అది. అయినా అరగంట ఆలస్యం అనుమతించేవారు. ఈ రోజుల్లోనే బాగా కష్టమైపోతోంది. అటువంటప్పుడు మరింత సానుభూతి చూపించవలసినది పోయి, అభ్యర్ధికి ఒక సంవత్సరం వృధా పోయేటట్లు ఈ వికృత నిర్ణయాలేమిటి? అధికారులకు కనువిప్పు కలిగించడం ఎలాగ? ఎలాగ?

    ReplyDelete
    Replies

    1. లేటుగా యేల బోవలె? ఓ గంట ముందే వచ్చి వెయుటింగు లో యేల వుండరాదు ?

      సినిమాలకు ట్రైలరు సమయానికే వెళ్ళికూర్చుంటారే?

      Be disciplined first for any competition.

      RIP :)


      నారదాయ నమః
      జిలేబి

      Delete
    2. విన్నకోట వారి మొరవిని, ఏలికలు దీన్ని మారిస్తే బావుండు. పిల్లలకి ఏడాది పోవటం అంటే ఏమిటో వాళ్లకి అర్థం అవుతున్నట్టు లేదు.

      Delete
    3. ఏకీభవించినందుకు థాంక్యూ అన్యగామి గారూ. ఈ భూతాన్ని ఎలా కట్టడి చెయ్యాలో తెలియడం లేదు. కోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ కేసు (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేస్తే ఉపయోగం ఉంటుందా అని ఆలోచించవలసిన విషయం.

      Delete


  108. పైత్యము బట్టును గానక
    సత్యమ్మిది శంకరార్య! సందియమేలా
    ముత్యాలకుచ్చు కై పున్
    నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్ :)

    జిలేబి

    ReplyDelete


  109. సత్యంబై వెలుగు విభుడు
    నిత్యము గావలె ; సమస్య నెమ్మది గలుగ
    న్నాత్యంతికమైనను విడు
    దత్యుని వరమై జిలేబి దమ్ము విడువకోయ్ !

    జిలేబి

    ReplyDelete


  110. పోనేల లేటు మనవడ
    ఓ నాడైన సమయమున కున్ముందుగ బో
    తే నీ సొమ్ములు పోయెన?
    హానికరమ్మ క్రమశిక్షణల్? విద్యార్థీ !

    జిలేబి

    ReplyDelete


  111. పరుగుల మయమాయెన్ జీ
    వి రయ్యనుచు నెందుకో! భవితయే మౌనో!
    కరముల మోడ్చెన్ రాయలు
    పరిగొనకండయ్య యువత భావితరమ్మౌ !

    జిలేబి

    ReplyDelete


  112. పదిలక్షల లంచమటన్!
    పదిలంబాయెనుర కేసు పట్టుగ సుమ్మీ !
    కుదురక బోవ విచారణ
    కుదించిరయ నొక్కరోజుకు రిమాండునటన్ !

    జిలేబి

    ReplyDelete

  113. తల - మెడ - కడుపు - వీపు, భారతార్థంలో

    అవతల పోరొక వైపా
    యె!వరుస దునిమె డమడమలయెన్ శపథములున్ !
    అవకరలుకడు,పుడమిలో
    నవస్థ లున్కడు జిలేబి నలి వీపునబో !



    జిలేబి

    ReplyDelete


  114. మసి యొనర్చెను, శంకరున్ మన్మథుండు
    కామపు వికారము మదిని కలుగ జేయ,
    అతనుని,కమనుని,అజుని, అంగజుడిని,
    పుష్ప ధన్వుని ,మారుని , పొడుము గాను!

    జిలేబి

    ReplyDelete


  115. లండన్లోన డయానన్
    చెండాడిరి దేశమందు శ్రీదేవిని హా!
    పండుగయె మీడియాకున్
    నిండుగ నుసురులును బోవ నెలతలకకటా!

    జిలేబి


    జిలేబి

    ReplyDelete


  116. పిల్లుల మీదన్ పిల్లుగ
    నల్లన మోపెడుగనుండె నరసన్న! మరో
    పిల్లున్ పట్టించుకొనెడు
    చల్లని న్యాయపతి యెవరు చక్కని రాయా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదుగా - ఆ భూతం తప్ప. సినిమాలో కన్ను కొట్టిన సీను, పాడిన పాట గురించే కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్న కేసు కంటే తీసిపోయిందా పిల్లల భవిష్యత్తు గురించి వేసే “పిల్లు”.

      Delete

    2. సినిమా పిల్లుకి మీ పిల్లో లెక్కా :)
      వేసి చూడండి ఆల్ ది బెష్టు :)

      వారు వినక పోతే జిలేబి పద్యాన్ని వినిపిస్తానని చెప్పండి. జడుసుకునైనా ఒప్పేసుకుంటారు :)



      చీర్స్
      జిలేబి

      Delete
    3. క్యా ఐడియా హై జిలేబి జీ 👌. థాంక్యూ.

      Delete


  117. నేనెందుకు చదువుత! చా
    నా నమ్మకముగ జిలేబి నరుడట చెప్పెన్
    కానీ చదువెందుకు భా
    మా నిత్యము?హృదిని తెరువుమా జ్ఞానమదే !


    జిలేబి

    ReplyDelete


  118. పొద్దుగూకుల నేలర బుద్ధి సుద్ది
    లేని వార్తల మేళము లేకి తనము
    గాను దేశమందువెలసె కాల్చె జనుల
    నెల్ల!పోకడ మారగ నెమ్మి గలుగు !

    జిలేబి

    ReplyDelete


  119. చూడండట రోడ్ల గతిన్
    పాడై పోయెను మన గతి పద్ధతి గాదే!
    వేడెద నిషేధము వలయు
    చాడుపు కారుల నడుపన జాగ్రత్త యు బో!

    జిలేబి

    ReplyDelete


  120. ఉమ్మడి కుటుంబ మంటే
    నెమ్మది యైన బతుకా? పనెవ్వడు జేయున్
    దమ్ములెవరివి? ములుగెవరి
    వమ్మ విషయమెల్ల తెలియ వలె బండన్నా !

    జిలేబి

    ReplyDelete


  121. కామెంటుల జూడ జిలే
    బీ మై మరచి చకచక గుభిల్లను రీతిన్
    తా మత్తున తూలు రమణి!
    ఓ మాలిని! రాములమ్మ! కోపమ్మేలా :)

    జిలేబి

    ReplyDelete


  122. మారు మూల బుడ్డోడికి కూడ తెలుసు
    నే జిలేబి శ్రీదేవిని, నిక్క మేను
    శ్రీజయేంద్రులనెరుగున ? చిత్రమైన
    జీవి చింగిలిబింగిలి జీవి గాదె!

    జిలేబి

    ReplyDelete


  123. ఇంతటి విన్నాణమ్ముల
    చింత వలదు పద్మ నీకు చిక్కే సుమ్మీ !
    ముంతను దాచి వెదుకగ
    న్నింతైన దొరకు జిలేబి? నెలతుక వలదే !

    జిలేబి

    ReplyDelete


  124. గుండెయె బోవన్ పిల్లా
    నిండగు కవితల జిలేబి పిండావెట్లే ?
    దండంబమ్మా పద్మా
    చెండుల విసురంగ నీకు చేరువ యెవరే !

    జిలేబి

    ReplyDelete


  125. మగవాళ్ల నేకడములో
    న గట్టి వారుగద పద్మ నయన సితారా!
    పగబట్టిరదేల సదా
    జగణమ్ములతో జిలేబి జగడాలమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  126. హే! భగ వంతుడ ! నీవే
    గాభర పడురీతినయ్యె గాదా స్థితియున్
    మా భారతదేశంబున!
    సాబూతులుగావలెనట స్వాములకున్నూ !

    జిలేబి

    ReplyDelete


  127. త్రిగుణాత్మకమైనది, అ
    న్యగామి, లోకము, జిలేబి యై తామసమున్
    త్రిగుణము లలోన ఒకటై
    జగమ్ము నేలును గదా సుజన! మిత్ర! గనన్ !

    జిలేబి

    ReplyDelete


  128. సినిమా తారల కిచ్చిర
    య నివేదిత వార్తలెల్ల యతులక దేలన్
    చనవరి కవరేజివ్వరు
    మనమీడియ? జోగుటకయ మన టీవీలున్ ?:)

    జిలేబి

    ReplyDelete


  129. పిల్లకటన్నబ్బాయిని
    మెల్లిగ వెతుకగ లభించె మేనరికమ్మై
    చెల్లాగణపతియే మే
    నల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే?

    జిలేబి

    ReplyDelete


  130. రాముకు సోమ కుమారుకు
    భామకు లేమకు నెలతకు భార్గవుకు భళా
    భీముకు సుమిత్రుకు నటన్
    కాముకు మిత్రత్వమంట కంద జిలేబీ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఎంత వికారపు పద్యము
      నెంతటి తెంపరితనంబు నెంతటి దౌష్ట్యం
      బెంత వివేకవిహీనత
      యెంతగ తెగడినను తక్కువే యన వచ్చున్.

      Delete
    3. జిలేబీ గారి పద్యాలే కాదు వచనం కూడా అర్ధమై చావదు నాకు....

      https://youtu.be/ChbnWYkWuyQ

      Delete


    4. ఓయీ నీహారిక ! యే
      మే యేమేమే గురువుల మేధా శక్తిన్
      ఛా యనుటయా త గదు సు
      మ్మీ! యమ్మీ వలయు నే తమీజ్ మించారన్ :)

      జిలేబి

      Delete


  131. ఔరా! ఏమాయెన్ బో
    పోరికి! తెంపరి తనమ్ము !పోగాలమ్మే!
    నారికి గురువులెవరు? వా
    రీ రీతిని నేర్పనేల రించోళినటన్ !

    జిలేబి

    ReplyDelete


  132. మీ యిష్ఠంబగు రీతిన్
    సాయించడమే పదముల సరసర యనుచున్?
    వేయించెద గుంజీలన్
    ఓయి!హవేల్దారుడ నురకుచ్చుకొనెదనే !

    జిలేబి

    ReplyDelete


  133. స్ఖాలిత్యములిష్ఠంబే ?
    లాలిత్యములేని పలుకుల విడువ వలయున్
    కాలపు పోకడన నిలువ
    దే లలనా వినుమ! యేల తెంపరి తనమోయ్ !

    జిలేబి

    ReplyDelete


  134. ఊర కేల నుందు నుర్విని గాపాడ
    కంకణమ్ము గట్టి గాను కట్టి
    నాను వత్తు గావ నాభక్త వర్యుల
    కొంత నైన నాప కోరికలను !


    జిలేబి

    ReplyDelete


  135. రాముడు నీలో నిలుచట
    యే మాన్యుడ చాలదయ్య యెప్పటి కైనన్
    వామనగుంటల విడువన్
    రాముని లో నీవు నిలిచి రాజిల్లవలెన్ !

    జిలేబి

    ReplyDelete


  136. నీ రుణ మిదియె రిజెక్టెడ్!
    పోరా భావి తరమునకు పోగాలము త
    గ్గే రా పోపో ! యెగ్గొ
    ట్టే రోగ్లకిదేను బాంకు టెంకణమర్రా


    జిలేబి

    ReplyDelete


  137. నీ రుణమిదియె రిజెక్టెడ్!
    పోరా భావి తరమునకు పోగాలము త
    గ్గే రా పోపో ! యెగ్గొ
    ట్టే రోగ్లనుబట్టలేము టెంకియ నీకే !

    జిలేబి

    ReplyDelete


  138. అందరి పూరణలలరి
    స్తోందండి కవివరులార ! శోభస్కరమై
    డెందంబానందంబును
    సందోహంబున బడసెను చక్కగ సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  139. ఏమండోయ్ సామ్ గారం
    డీ! మీ బసయెక్కడండి ? డింగరి వచ్చెన్
    సామీ ! స్పామోయ్ సాముడు
    మా, మీ, యందరి టపాల మార్క్జేస్తుండున్ :)

    జిలేబి

    ReplyDelete


  140. రాజని రాయంగన్ మగ
    రాజే ? పొలతి దమయంతి వ్రాలని రా‌యం
    గా జాణయే? యెవరిక
    మ్మా జాతకమెరుక? విష్ణుమాయ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  141. ఏ మాత్రము నే చెప్పను
    రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ము
    ల్లీ మానుష జన్మాదిగ
    తామసి గా నిను తెలియని తనమదియె సుమా!


    జిలేబి

    ReplyDelete


  142. భామ జిలేబి విడువదయ !
    జాము పొడువక మునుపే సజావుగ వేయు
    న్తా మారు పద్యములనయ !
    రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్!


    జిలేబి

    ReplyDelete


  143. కోరగ కవచ కుండలములను విడిచి
    తన ఉసురులను తృణముగ తలచి యాచ
    కులడుగగ సంతసమ్మున, క్రుంగి యతడు
    భారతాజిలో గర్ణుండు, పార్థు జంపె!



    జిలేబి

    ReplyDelete


  144. వీరే మనుకొనెదరు మరి
    వారే మనుకొనెదరనుచు భవబంధములే
    లా! రయ్యనుచు సయి జిలే
    బీ రీతుల గానుము విరివిగ పూరణలన్ :)

    జిలేబి

    ReplyDelete


  145. కష్ట పడకుండ సుఖముల
    నిష్టంబైనట్టి వాటినిన్ చేర్చుకొనన్
    స్పష్టంబుగ తెలుసుకొనన్
    సృష్టిని తప్పదు శమలము సృకము జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  146. ఎండ మాడ్చె తలను వెంట తగులుకొనె
    కర్మ యున్ను నేడ్వగ సమయమును
    లేదు! మీదు శక్తి లేదు ఆపైన మో
    కాలు కష్ట పెట్టె గ్రామ జనుల !

    జిలేబి

    ReplyDelete


  147. తటాలు నాంధ్రు లెల్ల తిట్టి తాట నొల్చె చంద్రుడే!
    చిటారు కొమ్మ లోని బ్లాగు చిల్క కోప గించెనే
    కటాక్ష దృష్టి కాదు సూవె కస్సుబుస్సు మాటలున్
    మటాషు చేయ రాష్ట్ర మున్నిమానిమాలుగా సుమీ!


    జిలేబి

    ReplyDelete


  148. అడిగేరండీ మగరా
    యుడివా లేకన్ జిలేబి యువిదవటే బ
    ల్కుడియని ! యీ జాడ్యంబే
    ల డింగరివెధవలకో ?సి! లకలక యనుచున్ :)

    జిలేబి

    ReplyDelete


  149. ఓయీ అర్భకుడ ! పవను
    డా!యింకాస్తా వలయును రా పరిణితి నీ
    స్థాయి తగదోయి చతురత
    మాయలు తెలియవుర నీకు మా మాట వినూ :)


    జిలేబి

    ReplyDelete


  150. పవనుడ! సిఫార్సు లేలర ?
    రవంత మంచితనమున్న రాయులనుచు ? మా
    క‌వగతము కాదకో మం
    చి వారు కారని? విచార చింతన లేదా?

    జిలేబి

    ReplyDelete


  151. నష్టము చేసేరండీ
    యిష్టము కాకున్నను విడదీయుచు కాంగ్రెస్!
    ముష్టి విదిల్చిరి గదయా
    భ్రష్టులు పొత్తుల పలుకులు భద్రం భద్రం !

    జిలేబి

    ReplyDelete


  152. గంతకు తగ్గట్టుగనన్
    బొంతయిదియెగద జిలేబి పుత్తడి బొమ్మా !
    కొంతైన వలయు గదవే
    వింతల గాను మతియున్ వివిధముల నీకున్ !

    జిలేబి

    ReplyDelete


  153. కొమ్మూరి యుగంధరుల
    న్నిమ్ముగ నాడు చదివేము నీరజ‌ నేత్రా!
    రమ్మన్నా రాదే జో
    షమ్మాయీమళ్ళి యిపుడు షాడో తీరుల్ !

    జిలేబి

    ReplyDelete


  154. గుర్తుంచుకోవలసినవి
    భర్త గురుతు బెట్టుకొనక పరుగెత్త నటన్
    కర్తవ్యము జీవితమున
    వర్తుల మైనదనెనుగద వనిత జిలేబీ !.

    జిలేబి

    ReplyDelete


  155. రాదోయి మార్పు వరదవ
    లే తోసుకొనుచు జిలేబి లెక్కల గానన్
    నాతో నీతో నందరి
    తో తరుణి మొదలగునోయి తోరణమగుచున్ !

    జిలేబి

    ReplyDelete


  156. మారరిపువునికు కుమారుడు గాదమ్మ
    గౌరి కాత్మజుండు! కమల భవుడు
    భర్త యగును సూవె పడతి సరస్వతి
    కి! మరువకు జిలేబి, కెంపుకంటి !


    జిలేబి

    ReplyDelete


  157. లాపాయింటున్ బట్టిరి
    ఓపడతి!జువాలజీకి పొత్తెట్లగు లా?
    ఈ పాఠకుడు డిటెక్టివు
    రాపాడిచు తప్పులున్న రమణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. లాపాయింటున్ విప్పితి
      నే చెపితి!జువాలజీకి పొత్తెట్లగొ లా!
      ఏ పాఠకులు డిటెక్టివు
      లైనాను దొరకనంట తెలిపి జవాబే :)

      Delete


    2. లా పాయింటున్ విప్పితి
      ఓపికగ చెబితి జిలేబి పొత్తెట్లగు లా!
      ఏ పాఠకులు డిటెక్టివు
      లై పోరగనూ దొరకను లలితను నేనే :)

      జిలేబి

      Delete
    3. వారి తండ్రి గారు చదివినది వారికే బాగా తెలిసుంటుందనుకోండి. అయినా నా కుతూహలం కొద్దీ .. లా పాయింటును లా..గి... మరి కాస్త “డిటెక్టివు” పని చేద్దామనుకుని నా స్కూలు సహాధ్యాయిని ఇందాకే ఫోనులో అడిగాను - అతను అదే ఊరిలో అదే కాలేజ్ లో అదే బి.కాం డిగ్రీ అదే టైములో చదివాడు (కాకపోతే రెండు సంవత్సరాల తేడాతో 1967 లో జేరాడు ; మరి ఆ రెండు సంవత్సరాలలో రూల్స్ / సిలబస్ మారాయేమో తెలియదు). తమ బాచ్ కి అటువంటి నిబంధనేమీ ఉండలేదన్నాడు. ఇంకో మాటన్నాడు - సైన్స్ గోల తప్పించుకోవడానికే కద రా బి.కాం లో జేరింది - అని 🙂 . అఫ్కోర్స్ సైన్స్ లో ఆసక్తున్నా కూడా వేరే కారణాల వలన కామర్స్ వైపు వెళ్ళే వారు ఉండచ్చులెండి.

      Delete


    4. లాపాయింటును మళ్లీ
      నా పాత సతీర్థ్యునడిగినాను జిలేబీ
      ఆపాటి సైన్సు తెలియక
      నే బీ కాము గయినాము నేర్పుగ యనెనే :)

      జిలేబి

      Delete


  158. విష్ణు మాయగ జీవన వీధి నాట
    కంబు ! తరచిచూడ జిలేబి గాన్పడి మజ
    చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను!
    మాయ తొలగు నెప్పుడు పెరుమాళ్ళ కెరుక !

    జిలేబి

    ReplyDelete


  159. వెలయించితి రామునిపై
    వెలకట్టగలేని తావి వేడుచు మదిలో
    బలమతడే నాకు సుమా
    కలయగు జీవితములోన గమ్యంబతడే!

    జిలేబి

    ReplyDelete


  160. భక్త మహాశయులారా!
    రక్తిని కట్టించు పద్య రావంబులనే
    ముక్తిని గోరుచు జేసితి
    శక్తి కొలది మూడు నూర్లు సత్యుని పైనన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. 'పద్య రావంబులనే' ?
      నేను 'రామకీర్తనలు 300 సంపన్నం ఐనవి' అన్నాను కదండీ. మీ ధోరణిలో కీర్తనలు మీ దెబ్బకు పద్యా లైపోయాయేం! చిత్రం.

      Delete


  161. భక్త మహాశయులారా!
    నక్తమునన్ రామకీర్తనల గూర్చితి నే
    ముక్తిని గోరుచు గనుడయ
    శక్తి కొలది మూడు నూర్లు సత్యుని పైనన్ !


    జిలేబి
    పద్యారావముకాదు కీర్తనలవీ పట్టాభి రామున్ గనన్ :)

    ReplyDelete


  162. ఫలములనే భుజి యించుచు
    కలకాలము గడుపు చున్న కవివరుడ యెటుల్ ?
    ఫలదాయక మెపుడయెదవు
    యిలలో మనుజులకు నీవు యెంకట సామీ !

    జిలేబి

    ReplyDelete


  163. నోటి గూటి చిలుక నోముల నోచుచున్
    రామ నామమునహరహము బల్కు
    చున్ తె లిపెను భక్తి; చోద్యము గానుము
    లలన విష్ణుమాయ లక్షణమ్ము !

    జిలేబి

    ReplyDelete


  164. రెచ్చ గొట్ట నేల రెంటికి చెడిన రే
    వడి జనుడ! జిలేబి వరుసలనగ
    మీరు వేయ వచ్చు మిమ్ముల నొక్కమా
    ట యన రాదయా? పిఠాయిచె హరి :)

    జిలేబి

    ReplyDelete


  165. లోతైన భావమున్నది
    ఓ తరుణీ! పద్మ! నీదు జొళ్ళెము లోనన్
    రేతిరి బవలున్ చదువ
    న్నాతురతో యుంటి మమ్మ నవ్య జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  166. రంగ నాయ కమ్మ రాంగుగ బోవచ్చు
    కాని ఆమె కథల కారి యుమ్మి
    వేయ రాదు సుమ్మ వెంకట సామి! జి
    లేబి పలుకు వినుమ లెస్స గాను :)

    జిలేబి

    ReplyDelete


  167. గాంచితి తెలగాణ భళి నే కాన్క గాను
    జనుల కేమిత్తును జిలేబి చాల చాల
    దేశ ప్రగతియను మధుర తేనెలూర
    చీమ ముద్దాడె చంద్రుని చిత్రముగను

    జిలేబి

    ReplyDelete


  168. ఓం నమో వేంకటేశాయ! నొప్పు రాఘ
    వేంద్రునికి ప్రతారికలపై వేడ్క గాన
    నిద్దరన నాయికల బెట్టి నిమ్మళముగ
    చిత్రమును జూపగ జిలేబి చిగురు బోడి !

    జిలేబి

    ReplyDelete