చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ జై :)
"స్వామీ మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ " ఓ భక్త పరమాణువు ఊపందు కున్నాడు !
మరో భక్తుడు జై జై జై అంటూ నినాదాలిచ్చేడు!
దాంతో భక్త పరమాణువుల సంఘం జోషందు కుంది.
ఆ పవిత్ర కృష్ణా తీరాన ఆకాశం దద్దరిల్లింది !
ఇరు రాజ్యాల రాజులతో మహా పొత్తు గల్గి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న నానుడి కి ప్రతీక గా , మారు పేరుగా మిత్రత్వ బిరుదాంకితు లైన స్వామీ జీ తమ రఫ్ పెప్పర్ గెడ్డం తడి మేరు !
అనుగ్రహ సంభాషణం మొదలెట్టి నారు !
జనాలు తండోప తండంబులు గా వేంచేసి ఉన్నారు ! ఇవ్వాళ మీ కందరికీ జిలేబీ ప్రసాదం గా అంబాళ్ కు నైవేద్యంగా సమర్పించు కున్న ఖీరు తో బాటు స్వీకరించి గాని మీరు వెళ్ళ కూడదని "కట్టళై " పెట్టి నారు స్వామీ వారు !
వారి పరమానంద శిష్యుడు మరో మారు ఊపందు కున్నాడు ! జై బోలో స్వామీ ....
వారు చతురులు ! ప్రస్తుతం రేపటి నుంచి చాతుర్మాస్య వ్రతం లోకి వెళ్ళ బోతున్నారు ! అందుకే "చాటురా" నందా బిరుదాంకితు లై , భక్త జన సందోహం చేత 'చతుర' స్వామీ జీ గా పేరు గడించినారు !
ఎక్కువ గా ఆయాసం ఆయన్ని పట్టి పీడించేది ! అదిన్నూ పాయసం తాగేక మరీ ఎక్కువయ్యేది ! దాంతో వారు బెనారెస్సు కెళ్ళి పాయసాన్ని త్యజించినారు ! అప్పటి నుంచి వారికి పాయసానంద బిరుదు కూడా దక్కింది !
వారి మాటే ఒక వినోదం! వారు మహా వినోదానందులు ! ఆనందం ఫాస్టు ఫుడ్డేతి వ్యాజనాత్ అని వారి ఆశ్రమం ఛాయలలో జిలేబీ ఫాస్టు ఫుడ్డు స్టాల్ ప్రముఖ స్థానం కల్పించి వినోదానంద స్వామీ బిరుదును గాంచి నారు !
ఇట్లా ఎన్నెనో బిరుదులు గలిగిన మా స్వామీ వారికి, పాతకులారా ! సారీ, పాట(ఒత్తు ట) కులారా ! చదువరులారా ! మీరు కూడా ఓ మారు జై కొట్టు డీ !
స్వామీ మిత్రత్వ వచస్ శ్రీయుత చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ !
జై
జై జై
జై జై
జై జై జై !
చీర్స్
జిలేబి