Wednesday, August 8, 2018

కరుణానిధి - బై బై


కరుణానిధి - బై బై 
 
The Last in the Row
 
Bye Mr Karuna
కరుణానిధి !
 
నివాళి

కరుణానిధి! తమిళుల"మా
బెరుం కళై న్యరు"లకట కుబేరుని తలద
న్న రయముగ పయన మైనా
ర, రడారుడిగ హరివాసరమున జిలేబీ !

ఏకాదశి కి ముహూర్తం బెట్టుకున్నావా సామి!

ఇండ్రు పోయి నాళై వా !
 
హ్యాపీ ట్రావెల్ ఎహెడ్ 

జిలేబి
 

42 comments:


 1. జీవితమంటే యింతేరా ! వాత్సాపు వేదాంతం :)


  94 సంవత్సరాల వయసు
  80 సంవత్సరాల రాజకీయ జీవితం
  50 సంవత్సరాలు ఒక పార్టీకి అధ్యక్షుడు
  13 సార్లు ఎమ్మెల్యే
  5 సార్లు ముఖ్యమంత్రి
  చివరికి 6x3 అడుగుల కోసం కోర్టు అనుమతి .
  లైఫ్ అంటే ఇంతే....

  ReplyDelete
 2. “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్” బ్లాగర్ బొందలపాటి గారు కరుణానిధి గారికి జనాల నివాళి మీద బ్రిలియంట్ పోస్ట్ వ్రాశారు. అదేమాట వారి బ్లాగ్ లోనే చెబుదామనుకుంటే వారు కామెంట్ల పెట్టె తీసేసినట్లున్నారు, ప్చ్.

  ReplyDelete

 3. ఎక్కడండి టపా కనిపించలేదు


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఆశ్చర్యం, టపా కనిపించలేదా? బొందలపాటి వారి wordpress blog లో “కొత్త టపాలు” సెక్షన్లో “కరుణానిధి” అనే Aug 8 వ తేదీ టపా చూడండి.

   bondalapati.wordpress.com

   Delete

  2. మరీ టపా ' చిక్కి పోయి ' రష్యా క్యూబా వెనకాల పోయె :)

   టపా బాగుంది గాని ఆ మడిసి కై అన్ని మంది‌ వచ్చేరు కదా నివాళుల నివ్వటానికి దాని కేమంటారు ?:)


   జిలేబి

   Delete
  3. 95 సంవత్సరాల మనిషి చనిపోతే పడీ పడీ ఏడవనక్కరలేదు అనిన్నూ, ఆత్మకి చావులేదు కదా మళ్ళీ పుడతారులే అనిన్నూ, 80 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం సాధించాడనిన్నూ ఆయన ఉద్దేశ్యం అయిఉంటుంది.

   Delete

  4. సూపర్ :)


   జిలేబి

   Delete
  5. ఎన్నా ఇండ్రు ఎన్నా నాళై?
   యారు కాగే యారు కాగే?
   ఏది రష్యా ఏది క్యూబా?
   ఎవరు స్టాలిన్ ఎవరు కాస్ట్రో?
   ఎక్కడ గిండీ ఎక్కడ మరీనా?
   ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు అమావాస్య?
   ఎందుకు సమోసా ఎందుకు జిలేబీ?

   Delete

 4. బై ది వే విన్న కు కోట కు మధ్య స్థలం వదిలితే గుర్రంటారుగదా మీ వంశ చిహ్నము నకు అర్థమేమిటి ? :)


  జిలేబి

  ReplyDelete
 5. జిలేబీ గారూ:

  ఈ నెల IIT Kharagpur Home Page Slide Show (bottom left) లో Prof G. P. Sastry (gps) photo ఉన్నది...మీరు చూడాలనుకుంటే...

  http://www.iitkgp.ac.in/

  ReplyDelete
  Replies

  1. అయ్య బాబోయ్!

   జీపీయెస్ గారు మీరు ఉస్తాద్ బడే మియాఖాన్ లావున్నారు ! సీనియర్ ఫాకల్టీ యున్న మాట!


   నేనేదో సరదాగా అప్పుడప్పుడు మీపై పేర డీ లను వేసేస్తున్నా!


   క్షమార్పణలు


   జిలేబి

   Delete
  2. 😊

   ముప్ఫై యేళ్ల క్రితం నా క్లాసులో కూర్చొన్న చంద్రలేఖా సింగ్ (బీహారి) ఆకస్మాత్తుగా నన్ను తలచుకొని నా పేరున సరి క్రొత్తగా ఒక Student Excellence Annual Award (Rs 50,000 per year for the best poor student) స్థాపించినది కొద్ది రోజుల క్రితం. ఉలుకూ పలుకూ లేకుండా. ఆవిడకు ధన్యవాదాలు చెప్పడానికి ఆమె e-mail id Google నుంచీ సంపాదించ వలసి వచ్చినది. ప్రస్తుతం ఆవిడా ఆవిడగారి అమెరికన్ భర్తా University of Pittsburgh లో Professor లు...

   ఈ వార్త తెలిసి మా iit friends అందరూ నాతో మాట్లాడడం మానేశారు :)

   ఆడువారు ప్రళయాంతకులు...

   Delete

  3. నమో నమః


   జిలేబి

   Delete
  4. అభినందనలు gps గారూ. మీ పూర్వ విద్యార్థి మీ పేర అవార్డ్ నెలకొల్పారంటే మీపట్ల, మీ బోధన పట్ల ఎంత admiration ఉందో తెలుస్తోంది. ఇది ఒక అరుదైన గౌరవం కదా 👏.

   IIT.KGP వారి హోమ్ పేజ్ లో ఈ వార్త వ్రాస్తూ “in the memory of” అని వ్రాశారు 🙁. దాని బదులు in honour of అంటే సబబుగా ఉంటుంది కదా. వారికి మెయిలిచ్చో ఫోన్ చేసో చెప్పరాదూ ? ఓహో, మీ ఫ్రెండ్స్ మీతో మాట్లాడడం మానేశారు అన్నారు కదా పైన 😀. మరెలాగ సవరణ చేయించడం 🤔?

   Delete
  5. అయ్యా విన్నకోట వారూ:

   ధన్యవాదములు. ఆ శుభ వార్త నాకు తెలిపి నన్ను ఈ Foundation Day Award Function కి ఆహ్వానించిన Alumni Dean గారికి నేనింకా ఈ భూలోకంలో బ్రతికి ఉన్నానని తెలుసు. కానీ ఏమి చేయగలరు వారు...అది ఒక కీకారణ్యం. Home Page తయారు చేశే వారు వేరొకరు. ఆమెకు ఏమి చేయాలో తోచలేదుట...నాతో పాటు ఈ "గౌరవాన్ని" అందుకున్న మందాకిని మజుందార్ గారేమో ఎప్పుడో స్వర్గస్థులైరి...

   పోయినదేమున్నది...నా పింఛన్ నాకు నెల నెలా వస్తూనే ఉన్నదిగా...

   😊

   Delete
 6. If this is an indicatipn of the type of behaviour on the part of their staff then hereafter better think twice before booking your ticket on this airline.

  బ్రిటిష్ ఎయిర్వేస్ వారి స్టాఫ్ ప్రవర్తన

  ReplyDelete
  Replies

  1. బుద్ధి లేని మేధా జీవులు


   జిలేబి

   Delete

  2. ఆ బుడుగు కి -విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
   ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము తాపించి బొజ్జోయించి వుంటే అయి పోయే దానికి ఇంత సీన్ క్రియేట్ చే సా రా బ్రిటీష్ ఏర్వేస్ వారు ?


   జిలేబి

   Delete
  3. అహంకారం అయ్యుంటుందండీ, అహంకారం.

   Delete
  4. మీలాంటివారే స్కూల్లో మాకో టీచర్ ఉండేవారు. ఆయన్ని ఏమన్నా అడగాలంటే ... పిల్లి అంటే ఏమిటి సర్ అని అడిగితే మార్జాలం అని అర్థం చెబుతారని ... విద్యార్థులు జంకేవారు 🙂 .

   Delete
  5. అసలు ఇటీవలి కాలంలో చాలా ఎయిర్ లైన్స్ లో స్టాఫ్ - ముఖ్యంగా ఫ్లైట్ లో స్టాఫ్ - ప్రవర్తన చాలా దురుసుగా తయారయింది. యునైటెడ్ ఎయిర్-లైన్స్ (అమెరికా కంపెనీ) వారి ఉదంతాల గురించి వినే ఉంటారుగా. Safety in the skies అనే మిషతో ప్రతి చిన్న విషయానికీ ప్రయాణీకులతో వాదన, కిందకు దింపెయ్యడం / ఈడ్చెయ్యడం. మనదేశపు ఇండిగో వారి అనుచిత ప్రవర్తన గురించి కూడా విన్నాం కదా (గ్రౌండ్ మీద అనుకోండి. కానీ ఏదైనా అమర్యాద అమర్యాదే). ఎదురు డబ్బిచ్చి వారి చేతుల్లో అవమానం పొందడంలా అనిపిస్తుంది ... అటువంటి వార్తలు విన్నప్పుడల్లా.

   Delete

  6. టికెట్టు బుక్ చేసేటప్పుడే రిజెక్ట్ ఆప్షన్ పెట్టుకుంటారేమో వాళ్ళిక :)


   జిలేబి

   Delete


  7. ఇట్లాంటి ఇంసిడెంట్లు నాలుగైదు అయితే మన మహారాజా ఏర్ లైన్స్ వారికి గిరాకీ ఎక్కువై పోతుంది :) ఏమంటారు ?

   జిలేబి

   Delete
  8. బుడ్డోడు అంత గట్టిగా ఏడుస్తుంటే రేసిజం అని ఎలా వ్రాస్తారండీ ?

   Delete
  9. అవ్వాలి కూడా. మహారాజా గారి స్టాఫ్ కి కూడా అహంకారం, నిర్లక్ష్యం తక్కువపాళ్ళేమీ కాదు. కానీ
   ప్రయాణీకులు ఆ అవమానపడేదేదో ఇంటివాళ్ళ చేతుల్లో అవమానపడడం నయం కదా, హ్హ హ్హ 😀😀.

   Delete
  10. బుడ్డోళ్ళు ఏడవడం సహజమండీ నీహారిక గారూ, విమానప్రయాణం, క్లోజ్డ్ స్పేస్, బంధించినట్లున్న సీట్ (బుడ్డోడి దృష్టిలో) ... ఇటువంటి రకరకాల భయాల వలన ఆ టైములో చిన్నపిల్లలు ఏడవడం ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన కిటికీలోంచి బయటకు విసిరేస్తాను అన్నాడన్న ఆ ఎయిర్-లైన్స్ ఉద్యోగి ప్రవర్తన పూర్తిగా అసంబద్ధమైనది. ఆ బుడ్డోడే గనక తెల్లవాడయ్యుంటే ఆ ఉద్యోగి మాట వేరే రకంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఆ కుటుంబం శ్వేతేతరులు కాబట్టి ఆ ఉద్యోగి చేసిన పనిని రేసిజం అనే అంటున్నారు.

   Delete

  11. - బుడ్డోళ్ళు ఏడవడం సహజమండీ నీహారిక గారూ

   ఈ విషయం నీహారిక గారికి తెలియక పోయి వుండచ్చంటారా విన్నకోట వారు ?


   నారదా!
   జిలేబి

   Delete
  12. పుల్లమ్మా....

   బుడ్డోడు ఏడ్చిందుకు గాదు ఆవిడ బాధ....విమానం నుండి దింపేసినందుకు కూడా కాదు....డబ్బులు వాపస్ ఇవ్వలేదని రేసిజం అంటగట్టింది.ఆవిడ కూడా కేసీఆర్ లాంటిదే.....ఆంధ్రా వాళ్ళవల్లే మేము బాగుపడటం లేదు అని ఏడవలా ?

   Delete
  13. >>> కిటికీలోంచి బయటకు విసిరేస్తాను అన్నాడన్న ఆ ఎయిర్-లైన్స్ ఉద్యోగి ప్రవర్తన పూర్తిగా అసంబద్ధమైనది>>>
   ఛ...ఊరుకోండి సార్, మీరు గాసిప్ వార్తలు భలే నమ్మేస్తారు.ఆ విమానంలో అంతమంది ఉంటే ఆ మాట అన్నందుకు ఊరుకుంటారా ?
   నేను ముందే చెప్పినట్లు మీరు ఇంకా 1947 లోనే ఉన్నారు.బయటికి రండి సర్ !

   Delete
  14. // “ ...... అ మాట అన్నందుకు ఊరుకుంటారా ?” //

   ఊరుకోక ఏం చేస్తారట, అహ ఏం చేస్తారని? జనాల మనస్తత్వం గమనించలేదా? ఎక్కడన్నా గొడవ జరుగుతుంటేనూ / రైల్లోనో బస్సులోనో ఒక ప్రయాణీకుడిని(...రాలిని) ఆ ఉద్యోగో మరొకరో సతాయిస్తుంటేనూ ... పక్కనున్నవారు కల్పించుకోవడం ఎన్నిసార్లు చూశారు మీరు? అందులోనూ విమానంలో .. తామేదో చాలా హైక్లాస్ అనుకునే ప్రయాణీకులే ఎక్కువగా తగులుతుంటారు. ఇప్పుడు ఆ ప్రయాణీకుడికి జరిగినది రేపు మనకు కూడా జరగచ్చు అనే ఆలోచన ఆ టైములో రాదు.

   మీరు కూడా 1957 ప్రాంతంలోనే ఉన్నట్లున్నారే ?! 😀😀

   Delete
  15. "జిలేబి" గారికి "పుల్లమ్మ" అని భలే పేరు పెట్టారే నీహారిక గారూ 👌. చాలా apt పేరు 😅😅.

   Delete


  16. పుల్లమ్మాయని పేరునిచ్చి తగుకైపున్ గౌరవమ్మిచ్చిరే
   యెల్లోరుమ్ యిని పోట్రి వాழ்తిడ యిదో యెన్ సీయెమాన్ వృత్తముమ్
   పల్లాండాయిర కాలమిద్ది నిలువన్ పాండిత్యలోకంబులో
   మల్లాగుల్లల చేసి చూడ కవులున్ మా పద్యమర్థంబవన్

   ಜಿಲೇಬಿ

   Delete
 7. జిలేబీ గారూ:

  పిట్ట కొంచెం తోక ఘనం: 👇


  *****************************

  Sastry Ji : My heartiest congratulations on your being recognised and honoured.for an illustrious life as a great teacher of IITKGP.

  With warm regards
  KL Chopra

  Prof (Dr) K. L. Chopra (Padamshri)
  FNA, FASc, FNASc, FNAE, D.Sc.(hc)
  Former Director, IIT Kharagpur & Former Professor & Dean, IITDelhi
  President , Society for Scientific Values
  Distinguished Honorary Professor,IITD,IITKGP,IITBhb,NITP,IIEST and NCU
  Res : M-70, Kirti Nagar, New Delhi-110015
  Tel :25154114; (M) 9213433266
  E-mail : choprakl@gmail.com

  ReplyDelete

 8. మంచి కాలము చోప్రా గారికి తెలుగు తెలియక పోవడం :)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు.... చోప్రాగారికి చెప్పేస్తాను.

   Delete
 9. విన్నకోట వారూ:

  మీ సూచన ననుసరించి IIT KGP వారు వారి Home Page Website లో తగిన మార్పు చేశారు...నా ప్రమేయం ఏమీ లేకయే 😊👇

  http://www.iitkgp.ac.in/

  ReplyDelete
  Replies
  1. వరూధిని బ్లాగు చదివిరి కాబోలు :)

   Delete
  2. How nice శాస్త్రి గారూ. సవరించిన హోంపేజ్ చూశాను. ఇప్పుడు సొంపుగా ఉంది 👌.

   IIT.KGP లో ఎవరో ఒకరు (తెలుగువారు) “వరూధిని” బ్లాగ్ చదివే ఉండే అవకాశాలు లేకపోలేదు. చాలా పాప్యులర్ బ్లాగ్ కదా 🙂.

   Delete

  3. :)

   జీపీయెస్ వారికి యెక్కడ లింకు పెడితే యెక్కడ అంటుకుంటుందో తెలుసు కామోసు :)


   జిలేబి

   Delete
  4. ఇక్కడ దాచిన సవరణ
   యెక్కడికో పోయి పోయి యింపుగ వ్రాలెన్
   చక్కని జిలేబి తీపును
   మక్కువతో పంచుకొనుడు మగువలు పురుషుల్!

   Delete

  5. :)

   అంతా విష్ణు మాయ :)


   జిలేబి

   Delete