సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteజీవితమంటే యింతేరా ! వాత్సాపు వేదాంతం :)
94 సంవత్సరాల వయసు
80 సంవత్సరాల రాజకీయ జీవితం
50 సంవత్సరాలు ఒక పార్టీకి అధ్యక్షుడు
13 సార్లు ఎమ్మెల్యే
5 సార్లు ముఖ్యమంత్రి
చివరికి 6x3 అడుగుల కోసం కోర్టు అనుమతి .
లైఫ్ అంటే ఇంతే....
“ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్” బ్లాగర్ బొందలపాటి గారు కరుణానిధి గారికి జనాల నివాళి మీద బ్రిలియంట్ పోస్ట్ వ్రాశారు. అదేమాట వారి బ్లాగ్ లోనే చెబుదామనుకుంటే వారు కామెంట్ల పెట్టె తీసేసినట్లున్నారు, ప్చ్.
ReplyDelete
ReplyDeleteఎక్కడండి టపా కనిపించలేదు
జిలేబి
ఆశ్చర్యం, టపా కనిపించలేదా? బొందలపాటి వారి wordpress blog లో “కొత్త టపాలు” సెక్షన్లో “కరుణానిధి” అనే Aug 8 వ తేదీ టపా చూడండి.
Deletebondalapati.wordpress.com
Deleteమరీ టపా ' చిక్కి పోయి ' రష్యా క్యూబా వెనకాల పోయె :)
టపా బాగుంది గాని ఆ మడిసి కై అన్ని మంది వచ్చేరు కదా నివాళుల నివ్వటానికి దాని కేమంటారు ?:)
జిలేబి
95 సంవత్సరాల మనిషి చనిపోతే పడీ పడీ ఏడవనక్కరలేదు అనిన్నూ, ఆత్మకి చావులేదు కదా మళ్ళీ పుడతారులే అనిన్నూ, 80 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం సాధించాడనిన్నూ ఆయన ఉద్దేశ్యం అయిఉంటుంది.
Delete
Deleteసూపర్ :)
జిలేబి
ఎన్నా ఇండ్రు ఎన్నా నాళై?
Deleteయారు కాగే యారు కాగే?
ఏది రష్యా ఏది క్యూబా?
ఎవరు స్టాలిన్ ఎవరు కాస్ట్రో?
ఎక్కడ గిండీ ఎక్కడ మరీనా?
ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు అమావాస్య?
ఎందుకు సమోసా ఎందుకు జిలేబీ?
ReplyDeleteబై ది వే విన్న కు కోట కు మధ్య స్థలం వదిలితే గుర్రంటారుగదా మీ వంశ చిహ్నము నకు అర్థమేమిటి ? :)
జిలేబి
జిలేబీ గారూ:
ReplyDeleteఈ నెల IIT Kharagpur Home Page Slide Show (bottom left) లో Prof G. P. Sastry (gps) photo ఉన్నది...మీరు చూడాలనుకుంటే...
http://www.iitkgp.ac.in/
Deleteఅయ్య బాబోయ్!
జీపీయెస్ గారు మీరు ఉస్తాద్ బడే మియాఖాన్ లావున్నారు ! సీనియర్ ఫాకల్టీ యున్న మాట!
నేనేదో సరదాగా అప్పుడప్పుడు మీపై పేర డీ లను వేసేస్తున్నా!
క్షమార్పణలు
జిలేబి
😊
Deleteముప్ఫై యేళ్ల క్రితం నా క్లాసులో కూర్చొన్న చంద్రలేఖా సింగ్ (బీహారి) ఆకస్మాత్తుగా నన్ను తలచుకొని నా పేరున సరి క్రొత్తగా ఒక Student Excellence Annual Award (Rs 50,000 per year for the best poor student) స్థాపించినది కొద్ది రోజుల క్రితం. ఉలుకూ పలుకూ లేకుండా. ఆవిడకు ధన్యవాదాలు చెప్పడానికి ఆమె e-mail id Google నుంచీ సంపాదించ వలసి వచ్చినది. ప్రస్తుతం ఆవిడా ఆవిడగారి అమెరికన్ భర్తా University of Pittsburgh లో Professor లు...
ఈ వార్త తెలిసి మా iit friends అందరూ నాతో మాట్లాడడం మానేశారు :)
ఆడువారు ప్రళయాంతకులు...
Deleteనమో నమః
జిలేబి
అభినందనలు gps గారూ. మీ పూర్వ విద్యార్థి మీ పేర అవార్డ్ నెలకొల్పారంటే మీపట్ల, మీ బోధన పట్ల ఎంత admiration ఉందో తెలుస్తోంది. ఇది ఒక అరుదైన గౌరవం కదా 👏.
DeleteIIT.KGP వారి హోమ్ పేజ్ లో ఈ వార్త వ్రాస్తూ “in the memory of” అని వ్రాశారు 🙁. దాని బదులు in honour of అంటే సబబుగా ఉంటుంది కదా. వారికి మెయిలిచ్చో ఫోన్ చేసో చెప్పరాదూ ? ఓహో, మీ ఫ్రెండ్స్ మీతో మాట్లాడడం మానేశారు అన్నారు కదా పైన 😀. మరెలాగ సవరణ చేయించడం 🤔?
అయ్యా విన్నకోట వారూ:
Deleteధన్యవాదములు. ఆ శుభ వార్త నాకు తెలిపి నన్ను ఈ Foundation Day Award Function కి ఆహ్వానించిన Alumni Dean గారికి నేనింకా ఈ భూలోకంలో బ్రతికి ఉన్నానని తెలుసు. కానీ ఏమి చేయగలరు వారు...అది ఒక కీకారణ్యం. Home Page తయారు చేశే వారు వేరొకరు. ఆమెకు ఏమి చేయాలో తోచలేదుట...నాతో పాటు ఈ "గౌరవాన్ని" అందుకున్న మందాకిని మజుందార్ గారేమో ఎప్పుడో స్వర్గస్థులైరి...
పోయినదేమున్నది...నా పింఛన్ నాకు నెల నెలా వస్తూనే ఉన్నదిగా...
😊
If this is an indicatipn of the type of behaviour on the part of their staff then hereafter better think twice before booking your ticket on this airline.
ReplyDeleteబ్రిటిష్ ఎయిర్వేస్ వారి స్టాఫ్ ప్రవర్తన
Deleteబుద్ధి లేని మేధా జీవులు
జిలేబి
Deleteఆ బుడుగు కి -విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము తాపించి బొజ్జోయించి వుంటే అయి పోయే దానికి ఇంత సీన్ క్రియేట్ చే సా రా బ్రిటీష్ ఏర్వేస్ వారు ?
జిలేబి
అహంకారం అయ్యుంటుందండీ, అహంకారం.
Deleteమీలాంటివారే స్కూల్లో మాకో టీచర్ ఉండేవారు. ఆయన్ని ఏమన్నా అడగాలంటే ... పిల్లి అంటే ఏమిటి సర్ అని అడిగితే మార్జాలం అని అర్థం చెబుతారని ... విద్యార్థులు జంకేవారు 🙂 .
Deleteఅసలు ఇటీవలి కాలంలో చాలా ఎయిర్ లైన్స్ లో స్టాఫ్ - ముఖ్యంగా ఫ్లైట్ లో స్టాఫ్ - ప్రవర్తన చాలా దురుసుగా తయారయింది. యునైటెడ్ ఎయిర్-లైన్స్ (అమెరికా కంపెనీ) వారి ఉదంతాల గురించి వినే ఉంటారుగా. Safety in the skies అనే మిషతో ప్రతి చిన్న విషయానికీ ప్రయాణీకులతో వాదన, కిందకు దింపెయ్యడం / ఈడ్చెయ్యడం. మనదేశపు ఇండిగో వారి అనుచిత ప్రవర్తన గురించి కూడా విన్నాం కదా (గ్రౌండ్ మీద అనుకోండి. కానీ ఏదైనా అమర్యాద అమర్యాదే). ఎదురు డబ్బిచ్చి వారి చేతుల్లో అవమానం పొందడంలా అనిపిస్తుంది ... అటువంటి వార్తలు విన్నప్పుడల్లా.
Delete
Deleteటికెట్టు బుక్ చేసేటప్పుడే రిజెక్ట్ ఆప్షన్ పెట్టుకుంటారేమో వాళ్ళిక :)
జిలేబి
Deleteఇట్లాంటి ఇంసిడెంట్లు నాలుగైదు అయితే మన మహారాజా ఏర్ లైన్స్ వారికి గిరాకీ ఎక్కువై పోతుంది :) ఏమంటారు ?
జిలేబి
బుడ్డోడు అంత గట్టిగా ఏడుస్తుంటే రేసిజం అని ఎలా వ్రాస్తారండీ ?
Deleteఅవ్వాలి కూడా. మహారాజా గారి స్టాఫ్ కి కూడా అహంకారం, నిర్లక్ష్యం తక్కువపాళ్ళేమీ కాదు. కానీ
Deleteప్రయాణీకులు ఆ అవమానపడేదేదో ఇంటివాళ్ళ చేతుల్లో అవమానపడడం నయం కదా, హ్హ హ్హ 😀😀.
బుడ్డోళ్ళు ఏడవడం సహజమండీ నీహారిక గారూ, విమానప్రయాణం, క్లోజ్డ్ స్పేస్, బంధించినట్లున్న సీట్ (బుడ్డోడి దృష్టిలో) ... ఇటువంటి రకరకాల భయాల వలన ఆ టైములో చిన్నపిల్లలు ఏడవడం ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన కిటికీలోంచి బయటకు విసిరేస్తాను అన్నాడన్న ఆ ఎయిర్-లైన్స్ ఉద్యోగి ప్రవర్తన పూర్తిగా అసంబద్ధమైనది. ఆ బుడ్డోడే గనక తెల్లవాడయ్యుంటే ఆ ఉద్యోగి మాట వేరే రకంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఆ కుటుంబం శ్వేతేతరులు కాబట్టి ఆ ఉద్యోగి చేసిన పనిని రేసిజం అనే అంటున్నారు.
Delete
Delete- బుడ్డోళ్ళు ఏడవడం సహజమండీ నీహారిక గారూ
ఈ విషయం నీహారిక గారికి తెలియక పోయి వుండచ్చంటారా విన్నకోట వారు ?
నారదా!
జిలేబి
పుల్లమ్మా....
Deleteబుడ్డోడు ఏడ్చిందుకు గాదు ఆవిడ బాధ....విమానం నుండి దింపేసినందుకు కూడా కాదు....డబ్బులు వాపస్ ఇవ్వలేదని రేసిజం అంటగట్టింది.ఆవిడ కూడా కేసీఆర్ లాంటిదే.....ఆంధ్రా వాళ్ళవల్లే మేము బాగుపడటం లేదు అని ఏడవలా ?
>>> కిటికీలోంచి బయటకు విసిరేస్తాను అన్నాడన్న ఆ ఎయిర్-లైన్స్ ఉద్యోగి ప్రవర్తన పూర్తిగా అసంబద్ధమైనది>>>
Deleteఛ...ఊరుకోండి సార్, మీరు గాసిప్ వార్తలు భలే నమ్మేస్తారు.ఆ విమానంలో అంతమంది ఉంటే ఆ మాట అన్నందుకు ఊరుకుంటారా ?
నేను ముందే చెప్పినట్లు మీరు ఇంకా 1947 లోనే ఉన్నారు.బయటికి రండి సర్ !
// “ ...... అ మాట అన్నందుకు ఊరుకుంటారా ?” //
Deleteఊరుకోక ఏం చేస్తారట, అహ ఏం చేస్తారని? జనాల మనస్తత్వం గమనించలేదా? ఎక్కడన్నా గొడవ జరుగుతుంటేనూ / రైల్లోనో బస్సులోనో ఒక ప్రయాణీకుడిని(...రాలిని) ఆ ఉద్యోగో మరొకరో సతాయిస్తుంటేనూ ... పక్కనున్నవారు కల్పించుకోవడం ఎన్నిసార్లు చూశారు మీరు? అందులోనూ విమానంలో .. తామేదో చాలా హైక్లాస్ అనుకునే ప్రయాణీకులే ఎక్కువగా తగులుతుంటారు. ఇప్పుడు ఆ ప్రయాణీకుడికి జరిగినది రేపు మనకు కూడా జరగచ్చు అనే ఆలోచన ఆ టైములో రాదు.
మీరు కూడా 1957 ప్రాంతంలోనే ఉన్నట్లున్నారే ?! 😀😀
"జిలేబి" గారికి "పుల్లమ్మ" అని భలే పేరు పెట్టారే నీహారిక గారూ 👌. చాలా apt పేరు 😅😅.
Delete
Deleteపుల్లమ్మాయని పేరునిచ్చి తగుకైపున్ గౌరవమ్మిచ్చిరే
యెల్లోరుమ్ యిని పోట్రి వాழ்తిడ యిదో యెన్ సీయెమాన్ వృత్తముమ్
పల్లాండాయిర కాలమిద్ది నిలువన్ పాండిత్యలోకంబులో
మల్లాగుల్లల చేసి చూడ కవులున్ మా పద్యమర్థంబవన్
ಜಿಲೇಬಿ
స్వయం ప్రకటిత నారదులవారని వారే సెలవిచ్చిన తరువాత ఇంతకన్నా మంచిపేరు తట్టలేదు :)
Deleteపండిత వృషభాల దండి మన్నన లొంది
Deleteతెలుగు పద్యమందు వెలుగుచున్న
బుధుల నిట్లు పిచ్చి పుల్లమ్మ యని బిల్చి
నారదీయ మనుచు నగెద రేల ?
అబ్బే, నవ్వడం కాదు రాజారావు గారూ, వారిని సరిగ్గా గుర్తించడం.
Deleteనారదుల వారి స్ఫూర్తి నిండా నింపుకున్నవారు "జిలేబి" గారు. గురుభ్యోన్నమః అని అభివాదం చేసినట్లే వారు నారదులవారిని స్మరించుకుంటారు ☺
@వెంకట రాజారావు . లక్కాకుల
Deleteఇది మరీ బాగుంది...మీరే పిచ్చి తగిలించారు.ఆవిడే అందరినీ గేలి చేస్తూ నవ్వుకుంటారు.మాకు అంత సీనుందా ? వృషభాలే ఆవిడను ఆపగలరు కానీ ఆంధ్రభారతిలో ఆవిడ వ్రాసే పదాలకు అర్ధాలు వెతుక్కునే మేము అంతటి సాహసం చేయగలమా ?
కుఠార మంటే గొడ్డలి . చెట్టు అనే అర్థంలో ప్రయోగించి ఆంధ్రభారతిని చూపించారు .
Deleteఅహింసనూ - హింసనూ ఒకే పదానికి
కట్టేశారు . అమేయ ధిషణా ధురీణులైన
' అక్కడి ' కవి-పండిత వృషభాలే జుట్లు
పీక్కున్నాయి . అంతటి ' నవ నవోన్మేష
ప్రతిభా భాంకార భేరికా డాండ డడాండ
డాండ నినదాండ చండ కవి ప్రచండ పండిత
ప్రకాండులకు ధిక్కారమా ? ' యని ..... ఇంచుక మది కలంచె . (Jk)
Deleteఈ కుఠార మే దో మా పై కుట్రలా వున్నది :)
లింకు ఇవ్వండి :)
జిలేబి
"నవ నవోన్మేష ప్రతిభా భాంకార భేరికా డాండ డడాండ డాండ నినదాండ చండ కవి ప్రచండ పండిత
Deleteప్రకాండులకు ధిక్కారమా ?"
👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
👌..👌..👌..👌..👌..👌..👌..👌..👌
జిలేబీ గారూ:
ReplyDeleteపిట్ట కొంచెం తోక ఘనం: 👇
*****************************
Sastry Ji : My heartiest congratulations on your being recognised and honoured.for an illustrious life as a great teacher of IITKGP.
With warm regards
KL Chopra
Prof (Dr) K. L. Chopra (Padamshri)
FNA, FASc, FNASc, FNAE, D.Sc.(hc)
Former Director, IIT Kharagpur & Former Professor & Dean, IITDelhi
President , Society for Scientific Values
Distinguished Honorary Professor,IITD,IITKGP,IITBhb,NITP,IIEST and NCU
Res : M-70, Kirti Nagar, New Delhi-110015
Tel :25154114; (M) 9213433266
E-mail : choprakl@gmail.com
ReplyDeleteమంచి కాలము చోప్రా గారికి తెలుగు తెలియక పోవడం :)
జిలేబి
నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు.... చోప్రాగారికి చెప్పేస్తాను.
Delete
Deleteమీకు భాషలు రావచ్చండి . చెప్పనూ వచ్చండి . ఆయన కర్థమయ్యే టట్లు చెప్పటం మీ వల్ల అవుతుందంటారా ? :)
జిలేబి
మీరెవరినైనా కదిలించగలరు. మీ శక్తిసామర్ధ్యాలు మాకు తెలియనివా ? నా మీద కంపైంట్ చేసి నా బ్లాగు పీకించిన ఘనత మర్చిపోతానా ? రచ్చబండ బ్లాగులో జరుగుతున్న రచ్చ కనబడడం లేదా ? ఆగ్రిగేటర్లలో అంత పొడుగు కమెంట్లతో నిండిపోతావుంటే మీరు కూడా చేరి గుప్పెడు పేలాలు వేస్తున్నారే ! నీహారిక ఒక్కతే ఏం పుణ్యం చేసుకుందీ?
Deleteఔరా! మీ బ్లాగును ఎవరో పీకించటం ఏమిటి నీహారిక గారూ?
Deleteమీ రమ్యంగాకుటీరాన> బ్లాగు నిక్షేపంగా కనిపిస్తూనే ఉందిగా అందరికీ?
మీ రన్నట్లు ఆ రచ్చబండ బ్లాగు ఒక బురదగుంట మాదిరిగా ఉంది. అటువైపు వెళ్ళకపోవటమే అందరికీ క్షేమం అనుకొంటున్నాను. అక్కడ పేలాలు కాదండీ బాబూ కంకర్రాళ్ళు ఎగురుతున్నాయిలా ఉంది.
Deleteఏ ప్రొఫైలు నీహారిక అంటున్నారో
ఏ ప్రొఫైలు నీహారిక బ్లాగులు పోయేయో
ఏ ప్రొఫైలు ఇక్కడ నీ గారి కో
ఔరా ! ఎవరికెరుక !
అంతా విష్ణు మాయ విష్ణు మాయ
జిలేబి
నా బ్లాగుని మాలిక ఆగ్రిగేటర్ నుండి తీయించారు అని అంటున్నాను.మీకు ఏమీ తెలియనట్లు నాటకాలా ? పిడకిచ్చుకు కొడితే నీహారికెవరో బాగా గుర్తుంచుకుంటారు.ఆ రోజు కోసం వెయిటింగ్ ఇక్కడ (ఖైదీ నం 150 చిరంజీవి స్టైల్ లో)
Deleteవిన్నకోట వారూ:
ReplyDeleteమీ సూచన ననుసరించి IIT KGP వారు వారి Home Page Website లో తగిన మార్పు చేశారు...నా ప్రమేయం ఏమీ లేకయే 😊👇
http://www.iitkgp.ac.in/
వరూధిని బ్లాగు చదివిరి కాబోలు :)
DeleteHow nice శాస్త్రి గారూ. సవరించిన హోంపేజ్ చూశాను. ఇప్పుడు సొంపుగా ఉంది 👌.
DeleteIIT.KGP లో ఎవరో ఒకరు (తెలుగువారు) “వరూధిని” బ్లాగ్ చదివే ఉండే అవకాశాలు లేకపోలేదు. చాలా పాప్యులర్ బ్లాగ్ కదా 🙂.
Delete:)
జీపీయెస్ వారికి యెక్కడ లింకు పెడితే యెక్కడ అంటుకుంటుందో తెలుసు కామోసు :)
జిలేబి
ఇక్కడ దాచిన సవరణ
Deleteయెక్కడికో పోయి పోయి యింపుగ వ్రాలెన్
చక్కని జిలేబి తీపును
మక్కువతో పంచుకొనుడు మగువలు పురుషుల్!
Delete:)
అంతా విష్ణు మాయ :)
జిలేబి
ReplyDeleteవాజపేయుడు వెడలెను వసుధ విడిచి
భరత మాత యు కోల్పోయె వ్యాహృతీశు
ని! తన వంతుగ భాజ్పాకు నిగనిగమను
రూపు చక్కదీర్చినవాడు రూఢి గాను !
జిలేబి
RIP Vajpayee Ji
అవునండి. గొప్ప వక్త, కవి, రాజకీయ పరిణితి కలిగినవాడు, ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చినవాడు, స్టేట్స్-మన్ శ్రీ వాజపాయి గారు.
Deleteనిండైన జీవితం గడిపినవారున్నూ. వారి ఆత్మకు సద్గతి కలగాలి 🙏.
కాశ్మీర్ పాకిస్థాన్ అంతర్భాగమని అంటే "పాకిస్తాన్" భారత్ అంతర్భాగమని అన్నందుకు నాకు నచ్చి
Deleteబీజేపీ లో "వాజ్‌పేయి" గారికోసం ఒకసారి ఓటు వేసాను.
మనుమరాలు ఏతెంచిన స్మృతులు:
ReplyDeleteశంకరాభరణం పద్య రచన - 1038
కవిమిత్రులారా!
“కలయో వైష్ణవమాయయొ...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
కలయో వైష్ణవమాయయొ
తిలకించగ నెల క్రితమిది తెలియక నెచటో
నిలలో కానగ రాకయె
కిలకిల నరచుచును నేడు కేరింతలిడెన్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
https://kandishankaraiah.blogspot.com/2015/10/1038.html?m=1
ReplyDeleteకలయో వైష్ణవమాయయొ
తెలిసీ తెలియక జిలేబి తెలుగున నేర్వన్
జల జల రాలెను కందం
బులు పంచదశపు జగమున బుధుల తల తినన్ :)
జిలేబి
శిఖరసమానమైన వ్యక్తిత్వం కలిగిన వాజపాయి గారు నిన్న గతించారు, ఈ రోజు సాయంత్రం వారి అంత్యక్రియలు ముగిశాయి. ఆణిముత్యంలాంటి ఒక రాజకీయవేత్తను కోల్పోవడం దురదృష్టకరం.
ReplyDeleteఅయితే ఆ విచారంలో, ఆ హడావుడిలో మరొక ప్రముఖ వ్యక్తి (వాజపాయి గారంత కాదు కానీ ఈయన కూడా చాలా పాప్యులర్) కూడా ముందు రోజున కాలం చేశారన్న సంగతి వెనక్కు వెళ్ళిపోయింది. వారే అజిత్ వాడేకర్ ... ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్. 1960 దశకం చివరిలోనూ, 1970 దశాబ్దం మొదటిలోనూ విదేశీగడ్డపై మొదటిసారిగా మనకు విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్. ఎడమచేతి వాటంతో సొగసుగా ఆడిన బ్యాట్స్-మన్. స్లిప్స్ లో మంచి ఫీల్డర్. అన్నిటినీ మించి ఒక జెంటిల్మన్ క్రికెటర్ - ఆటవికపు ఎక్ప్రస్పరెషన్లు పెట్టి కంపరం పుట్టేట్లు ఫీల్డ్ లో ప్రవర్తించే ఇప్పటి ఆటగాళ్ళ మాదిరి కాదు. ఆనాటి ఆ వాడేకర్ కు కూడా నా శ్రద్ధాంజలి.
కొన్ని నెలల కింద ఇండియా టుడేలో రాజదీప్ సర్దేసాయ్ క్రికెట్ పుస్తక ఆవిష్కరణ సభ చూపించారు, సభకు వాడేకర్ కూడా హాజరు అయ్యారు. రాజదీప్ ప్రసంగంలో తన తండ్రి మాజీ క్రికెటర్ దిలీప్ సర్దేసాయ్ గారికి గవాస్కర్, వాడేకర్ లాంటి వారికి ఉన్న స్నేహాన్ని ప్రస్తావించారు.
Deleteఇవాళ్టి ఇంగ్లాండు టెస్ట్ మాచిలో వాడేకర్ మరణం & ఇమ్రాన్ ప్రధాని పదవి రెంటి గురించి కామెంటేటర్లు చర్చిస్తారేమో చూడాలి.
చర్చించే అవకాశాలు లేకపోలేదు జై గారూ. కామెంటేటర్లలో గవాస్కరో, సంజయ్ మంజ్రేకరో ఉంటే గనక కనీసం ప్రస్తావన అయితే వస్తుంది. ఇతరులు వాడేకర్ కంటే ఎక్కువగా ఇమ్రాన్ గురించి చర్చించినా చర్చించవచ్చు .... ప్రధానమంత్రి అయిన ఒకప్పటి గ్లామర్ బోయ్ ప్లేయర్ కదా 🙂.
Deleteఎవరైనా చర్చించారా జై గారూ? నేను టెలీకాస్ట్ చూడలేదు.
Deleteఈ రెండు విషయాలు కూడా చర్చకు రాలేదండీ. గవాస్కర్ & మంజ్రేకర్ కామెంటరీకి రాలేదు.
Deleteఆ తెల్ల కామెంటేటర్లయినా ప్రస్తావన తీసుకొచ్చుండచ్చు. ఏమిటో, ఇదివరకటి మర్యాదలు మాయమైపోతున్నాయి 😔.
Delete"మాలిక" పట్టీలో ysrcp బ్లాగ్ లో కుయ్ కుయ్ లు రాత్రుళ్ళు వద్దట అనే టపాలో ఇచ్చిన ఈ లింక్ చూడండి.
ReplyDeleteఇదే గనక నిజపరిస్ధితి అయితే ... మేరా భారత్ మహాన్. మనమూ, ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటూ నిర్లక్ష్యపూరితమైన ప్రైవేట్ సంస్థలకు కూడా పెద్దపీట వేసే మన ధోరణీనూ ... ఏదీ మరొక్కసారి -> మేరా భారత్ మహాన్.
108 ambulances
Deleteపశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్ :)
జిలేబి
Deleteవిన్నకోట వారి న్యూసు 108 ఇక మీదట లిమిటెడ్ సర్వీస్ :) ఇవ్వాళ సమస్యా పూరణకు సరిపోయె :)
నిశ్చయముగ చెప్పండి న
భశ్చక్షువుని సమయమ్ము వరకే డ్యూటీ
పశ్చాత్తు యాంబులెన్స్ నో!
పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్!
జిలేబి
ReplyDeleteఅనఘా! షట్రిపువులనడ
చినవా డున్ పుట్టువడుగు చినవాడుగదా
తనకలి యయ్యె నెటులనో
హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్?
జిలేబి
ReplyDeleteహీరో హనుమంతు :) గాలి కన్న వేగము
సాజాత్యములు కనబడిన జిలేబి పూచీ లేదు :)
మనసైనది నాకు దొరుకు
ననుచు మసకమసక రేయి నాట్యము లాడన్
వెనుకల బడుచున్ హీరో
హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్ !
జిలేబి
ReplyDeleteనేటి భార్యాబాధితుడు :)
వినుమా జిలేబి హరికథ
హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్
తనఖా పెట్టిరి నతడిని
మన సేటంగటిన సూవె మనుగడ లేకన్ :)
జిలేబి
ReplyDeleteబులుసు వారి అమ్మాయే మొదటి మహిళావధాని అవధానము చేయటం అనుకంటా చిత్తూరులో
కణ్ణను కాలేజీలో
క్షుణ్ణముగా చేసిరి బులుసు అపర్ణ భళా
మన్నిక గానవధానం
బన్నా!మొదటి "తడవ" యగు వనితయు జేయన్ !
జిలేబి
ReplyDeleteభావాల వరదలో సా
మీ వారికి తెలియకుండ మించారు పదా
లే! వాహినిగా నరస
న్నా! విదురుల పల్కులెల్ల నవనవ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఓ తరుణి జిలేబీ ! యా
పోతన కావ్యమ్మున రసపోషణ, లేదే
మీ తరహా పద్యంబుల
లో? తరమై వ్రాయరాదె లోకము మెచ్చన్ :)
జిలేబి
ReplyDeleteఏతంబెత్తు వివిధముల
పోతన కావ్యమ్మున రసపోషణ, లేదే
మోతాదు మించు పదములు
జాతము తో వచ్చినట్టి సాంకవముగదా!
జిలేబి
ReplyDeleteమల్లి! చెప్ప కోయి మాట తప్పగు సుమా !
పిల్లి పుట్టెఁ బులికి వింత యగు! నె
పుడు సజాతి తత్వపు జననంబగు! పిల్లి
పిల్ల పిల్లి పులికి పిల్ల పులియె !
జిలేబి
ReplyDeleteకుడియెడమాయె జిలేబీ
వడివడి గా వచ్చెనోయి వరుసగ కామిం
ట్లు డిగనురికి మాలికలో
గడగడ యికనే కమింట్ల కందము గూర్తున్ :)
జిలేబి
ReplyDeleteఇడుములు వచ్చును పోవును
విడువకు నీశుని జిలేబి విభుడాతడు నీ
కడుగడు నగుపడు దృష్టిని
సడలింపక గాన సూవె చక్కగ తోడై !
జిలేబి
ReplyDeleteచదివానండీ కథ! ఆ
సదనంబందున కమింటు చట్టని నిడితిన్
పదయమ్మి చూసుకొనుడచ
ట దరిమిలా నాదు తలపు టాకాఫ్ది టవున్ :)
జిలేబి
😆😆😆😆😆
Delete
ReplyDeleteహరిబాబు తెలుగోడు తమిళనాట ముఖ్యమంత్రినైపోతా అని సలహా అడిగేరు :)
పంచ దశలోక మందు టపాల వేయు
హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె
తాను మంత్రియైవెలయగ తమిళ నాట
సభికుల తలపుల తెలుప సాయమడిగె :)
జిలేబి
ReplyDeleteజననీ జనకుల పదములు
వనితా విడువక జనులు గవనముగ గానన్
మనుగడ ప్రగతిని గాంచును
వినుమా విదురుల పలుకుల విని సల్పు పనిన్!
జిలేబి
ReplyDeleteమంట లెగయగ మసియయ్యె మనుగునొందె
కంటి దీపమౌ సుతుఁడయ్యెఁ, గాలయముఁడు
చిన్న వాడని చూడడు చీటి చింప
గాను చిత్రగుప్తుడచట గాలమేయు !
జిలేబి
ReplyDeleteపిరియపు పలుకులకు రవం
త రుచికరపు కటు పలుకుల తరుణము గానన్
పరచుచు పలుకన్ చేరును
మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే!
జిలేబి
ReplyDeleteప్రాఙ్నగము! తూరుపుకటకి!
ప్రాఙ్నగ శృంగంబనశిఖరంబు జిలేబీ
ప్రాఙ్నగము తెలిసెనకొ? యే
ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్?
జిలేబి
ReplyDeleteతిండాడుదు యెన్ వుళ్ళమ్
కొండాడువు దర్కు నీ రుకుమణి జిలేబీ
యేండీ పక్కత్తుల వర
ముండాక్కై పోట్టుకుణ్ణు ముణుముణుకిర చొల్ :)
జిలేబి
ReplyDeleteగుట్టుగ వంటల వండుచు
పట్టుగ తనునింట నుండి పనియే హముగా
చట్టన తన మాటకు ఊ
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్ :)
జిలేబి
ReplyDeleteఓరయ్యోనామగడా
నీ రతిని జిలేబిని యివి నీకై యనగా
సారము లేనట్టి రసము
కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.
జిలేబి
ReplyDeleteఓరయ్యోనామగడా
నీ రతిని జిలేబిని యివి నీకై యనగా
సారము లేనట్టి రసము
కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.
జిలేబి
ఓరయ్యో బంగారుసామీ, ఓరబ్బీ బంగారుసామీ .........
Deleteమెచ్చకేం జేస్తాడు? 😀
@V N R గారూ,
Delete>>>దేశంలోకెల్లా అత్యధిక విడాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇవ్వబడ్డాయట. కారణం, విడాకులు తీసుకుంటే, రెండు యూనిట్ల కింద లెక్కేసి ఎక్కువ భూమి ఆ కుటుంబానికి ఉంటుంది.>>>>
http://oomencartoons.blogspot.com/2018/09/blog-post_1.html?m=1
ఈ వ్యాఖ్య నిజమేనా ? మీ అభిప్రాయం చెప్పండి.
ReplyDeleteదామము వలె తిరిగె వరుగు
పామునుఁ దినఁ గోరి, కప్ప బారెఁడు సాగెన్
చీమను తినగోరి, నరుడు
నీమము వీడి మనుజుని తిని బతుక నేర్చెన్ !
జిలేబి
// “ఈ వ్యాఖ్య నిజమేనా ? మీ అభిప్రాయం చెప్పండి. “ //
ReplyDeleteనిజమే అయ్యుంటుందండీ నీహారిక గారూ, కృష్ణాజిల్లావారు బహు తెలివైనవారు కదా 🙂.
ఏమైనప్పటికీ భూసంస్కరణల రూల్స్ నుంచి తప్పించుకుని ఆస్తి కుటుంబంలోనే ఉండేటట్లు చూసుకోవడానికి కనిపెట్టిన మార్గం.
ReplyDeleteఫర్వా లేదు జిలేబీ
తర్వాయి కతలను చెప్పు తరగతి లోనన్
కర్వలి కబురులు కాదోయ్,
అర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్ :)
జిలేబి
ReplyDeleteబొట్టెట్టుకొనక బోవగ
చట్టని నద్దెకు నెవరును సరసన జాగా
పట్టుగ నివ్వక బోయిరి
కుట్టి కిరస్తానియకొ? దిగులు బడిరిగదా :)
జిలేబి
దత్తపది -
ReplyDeleteహర - శివ - భవ - కపాలి
అన్యార్థంలో
శ్రీకృష్ణుని స్తుతి
శ్రీకృష్ణం వందే జగద్గురుమ్
వెన్న దొంగ :)
కృష్ణ ! పరమాత్మ ! భవహర ! కేలు మొగువు
యాదవ కరుణారాశివయ! నిను మేము
లవము ధ్యానించి నంతనే లయము గాన
చిత్తమేకాగ్ర మగునయ! చిద్విలాస!
మమ్ములనిక పాలించుము మైందహనుడ!
(ఎక్కడో చదివినట్లుందే :)
జిలేబి
ReplyDeleteసిల్కు రోడ్డు వృద్ధి చీనిచీనాంబర
ములవి చిక్కు బడెను ముందు చూపు
మొహతిరు మొహమదుని మొండాటమయ్యె జ
వాబు అడ్డు కట్ట వంకకత్తి !
జిలేబి
ReplyDeleteకన్నడు రామారావుని
సన్నగ తలపించుచుండె సరియేనా ఓ
రన్నా వైవీయారుడ!
మిన్నగ కిత్తాత్తమిన్ కమితముగ గనిరే :)
జిలేబి
ReplyDeleteఅదె! రొచ్చుబండ వచ్చెను
సదనంబునకు సుమి కొత్త సత్తా తోడన్
యెదురొడ్డునకొ అహమదు చ
వుదరిని తరుముచు బిరబిర వురుకుచు సుమ్మీ:)
జిలేబి
ReplyDeleteదండిగ యెన్నిక లొచ్చిన
పండగ యందరికి సూవె పప్పూ సాంబార్
పండగ లప్పుడు పనులవి
ఆండోళ్ళకుయెక్కువయ్య హద్దరి బన్నా :)
జిలేబి
ReplyDeleteఅనఘా ! సామ్రాజ్ఞి యగజ
వనరాజుకు, మూషికమ్ము వాహన మయ్యెన్
తన కొమరునకు, జిలేబీ,
వనమే మూలము ధరణియు వర్దిల్ల సుమీ !
జిలేబి
ReplyDeleteకంది వారి మన్ కీ బాత్ :)
అనుమాన మేమియునులే!
నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్,
పనిలేని జిలేబీ పూ
రణల చదువ కర్మ కలిగె రసనయు బోయెన్ :)
జిలేబి
కంది వారితో బాటు ఇది మరెంతోమందికి కూడా “మన్ కీ బాత్” అండీ 😀.
Delete(jk 🙂)
Deleteఔరా! నాపద్యంబుల
ఘోరంబనిరిగద విన్నకోటపు నరసిం
హారావులున్ సమస్యా
పూరణలన్ కష్టపడుచు పూరించంగన్ :)
జిలేబి
☺
Deleteపుచ్చు సమస్య లెన్నొ తమ పూరణ ధాటికి నిల్వజాలకన్
Deleteరచ్చల క్రంతలన్ బడియె , ప్రాజ్ఞులు మీరు పరిష్కరించుటల్ ,
మెచ్చని వార లుండుటలు మేదిని గల్గునె ? ' విన్నకోటి ' యున్
మెచ్చిరి , పండితుల్ కవులు మెచ్చిరి నచ్చి , జిలేబి మిత్రమా !
Deleteపుచ్చిన నేమి అనుదినము
తెచ్చిరి సభలో ఉరవడి తెలుగున కయ్యా
మెచ్చితిమి యనవరతముగ
పచ్చగ కళకళల దేలు బ్లాగును గానన్ :)
జిలేబి
ReplyDeleteకమితమను కొత్త పదము తి
రముగ తె లిసెనోయి నాకు రయముగ నిపుడే
ఘుమఘుమ కందం బొక్కటి
సమూహమునవేసెదన్ పసందుగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteమాట వినని వలపిదియే
తూటాలా గుచ్చె మదిని తుమ్మెద గొలుసై
ఆటాపాటల కాలము
టాటా చెప్పగ జిలేబి టాంటాం మిగిలెన్ !
జిలేబి
ఒక సోషల్ మీడియా ‘గ్యానం’👇
ReplyDeleteArguing with a woman is like reading the Software Licence Agreement. In the end you ignore everything and click “I agree”.
😀
Deleteసాఫ్టువేరు లైసెన్సుల సన్నిభృతము
లెన్ని మార్లు చదివినను లెస్సగ మన
కర్థ మవక సమ్మతి సంతకమును పెట్టి
నట్లు పొలతుల తోడు పెనకువలయ్య !
జిలేబి
ReplyDeleteగుణములను తెలుపుచు గూఢములన్ కుదు
రుగ తెలియబరచుచు రూఢములను,
దేవమాయ నడచి, తెరగుల మనకెల్ల
వరము గా తెలుపు సవరణముగను !
జిలేబి
ReplyDeleteకనుదోయిలోని బింబము
మనసున మనసైనవాడు మహిని జిలేబీ!
అనుకుని ప్రేమించేదని
యనుకో నే ప్రేమయన్న అంబుజ వదనా !
జిలేబి
ReplyDeleteవాడే అహ్మదు చౌదరి
వాడేనయ్య అభిలాషు వాడే డుండుం
గాడూ వాడె చిరంజీ
వీ డప్పాకొట్టు చుండు వీధిన బడుచున్:)
మీరు కాస్త నోరు మూస్తారా ? రొచ్చు పోయిందని అనుకుంటుంటే మళ్ళీ మీరు మొదలెట్టారా ?
Delete
Deleteబండబూతుల రచ్చబండలు బ్లాగులోకము వీడెగా
చండశాసను డైన మాలికు చాకిరేవుల సాఫుగా
పిండిపిండిగ జేసివేసెగ పిప్పిపీ టక డుంటకా
నిండుగా మన బ్లాగులెల్లను నీటుగా కనుపించుగా !
జిలేబి
ReplyDeleteఛందస్సుల పద్యంబుల
భందిలముల కోరుగాని పద్మార్పిత తా
కొందల పడదు సుమీ మేల్
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!
జిలేబి
ReplyDeleteఆపిలు పండును తినగన్
నీపై యవ్యాజమైన నెమ్మిక తోడై
తా పదుగురి లో శిలువను
వీపున మోసెను జగతికి ప్రేమను పంచెన్!
జిలేబి
ReplyDeleteకనియెన్ రా ! ముడుకులపై
వనితా మణి నొప్పి నంట వంగిన నడుమై
గునగున నడవను శక్తియు
కనకనలాడ సయి లేక కష్టపడెనుగా !
జిలేబి
ReplyDeleteసత్కార్యమ్ముల చేసిన
సత్కార్యంబులను నెంచ సద్గతి కలదోయ్
సత్కారముకై చేసిన
సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్!
జిలేబి
👌.
Deleteసరళంగా ఉన్న ఈ పద్యం అర్థమయిందండీ 🙂. బాగుంది కూడా.
విన్నకోట వారూ ఈ పద్యానికి అర్ధమూ తాత్పర్యమూ వివరింపుడూ ?
Delete🤓
పద్య భావ మేమొ పలుమార్లు చదివినా
Deleteబోధ పడుట లేదు పూర్తిగాను
విన్నకోటి వారు విశద పరచు కొఱకు
విన్నవింతు మరియు సన్నుతింతు .
Deleteహై చక్కా :)
జిలేబీ నీక్కూడా భాష్యకారులు వచ్చేస్తున్నారోచ్ :)
రాబోవు కాలము లో జిలేబీ కందములు ( విన్నకోటి వారి భాష్యంతో ) అన్న పొత్తంబొచ్చినా బొచ్చొచ్చు:)
జిలేబి
ఎంచక్కా తమ పద్యభావమును తామే వ్రాసి చంపొచ్చుగా ,
Deleteదించొద్దీ ఘనకార్య భారమును సాధించంగ వేరెవ్వరిన్ ,
కాంచన్ లే రితరుల్ కడున్ , గనక , టీకా టిప్పణుల్ తామె వా
యించన్ మేలగు క్రింద , పాఠకులు నందించంగ కందాంబుధీ !
Delete:)
ఏదో ఉత్సాహ పడినారు అర్థమయిందని ఔట్ సోర్స్ చేసేసాం :)
జిలేబి
@విన్నకోట వారు,
Delete>>>సరళంగా ఉన్న ఈ పద్యం అర్థమయిందండీ 🙂. బాగుంది కూడా.>>>>
మీకేమి అర్ధమయిందో తెలుసుకోవాలని ఇక్కడ తెలుగు మాష్టారితో సహా వెయిట్ చేస్తున్నాం. మాక్కూడా గ్యానాన్ని ప్రసాదించండి.
వారి కేమర్థ మాయెనో , పద గతముగ
Deleteఅసలు పద్యార్థ మేవిటో , అందున గల
కొసరు పరమార్థ మేవిటో గూడ దెలియ
రావుగారికి , కవికి ప్రార్థనలు సేతు .
“ఉత్సాహ” పడిన కారణమేమి - “ఆంధ్రభారతి” తిరగెయ్యవలసిన అవసరం కలగలేదని, అంతే 🙂.
Deleteఇక పోతే “ఔట్ సోర్స్” లు ఫ్రీగా జరగవు. పాత “మిస్సమ్మ” చిత్రంలో రేలంగి గారు చెప్పినట్లు “తైలం” చేతిలో పడాలి. అటువంటి అవకాశమేదన్నా ఉంటుందంటే మాట్లాడుకోవచ్చు 🤑.
నీహారిక గారూ,
Deleteతెలుగు మాస్టారు వేచి చూస్తున్నారనేది పూర్తిగా మీ అతిశయోక్తి. స్వయంగా వారే పండితులు. ఇక నాలాంటి పామరుడి చేత భాష్యం చెప్పించుకోవలసిన అవసరం వారికేమిటండి? ఏదో సరదాగా ఆటపట్టించడానికి అడిగారనేది తెలిసిపోతోంది కదా 🙂.
మీ సంగతంటారా? వ్రాయక వ్రాయక అంత తేలిక పదాలతో “జిలేబి” గారు ఇన్నాళ్ళకొక పద్యం వ్రాస్తే దానికి అర్ధం తెలుపమని విద్యాధికులైన మీరు కూడా అడిగితే ... ఏమనాలి 🙁? “తెలిసియు( తెలియని నరు( దెల్ప బ్రహ్మదేవుని వశమే?” అనడం తప్ప 😀😀 ? (jk jk 👍).
అసలు ఆమాటకొస్తే “జిలేబి” గారి ఆ పద్యంలో అంత అర్ధంకాని భావమేముందండీ, పాపం? పూలదండలూ, శాలువాలూ, పొగడ్తలూ, బిరుదులూ, సన్మానాలూ ఆశించి చేసే పనుల కన్నా మంచి కోసం చేసే మంచిపనులు శ్రేష్ఠం .. అనే కదా ఆ సుభాషితం (నాకు అర్థమైనంత వరకు సుమా ☝️).
అయినా ఇన్నాళ్ళకి వారి పద్యమొకటి ఆట్టే కష్టపడనక్కరలేకుండా అర్థమైంది కదా అని నేను సంతోషిస్తుంటే మీరొచ్చి నీళ్ళు చల్లుతారా? పైగా ... సరిగ్గా చల్లానో లేదో అని మీకే అనుమానమొచ్చినట్లుంది ... మళ్ళా తిరిగొచ్చి రెండోసారి చల్లడం ... హన్నన్నా వెరీ బాడ్ 🙁.
ఇట్లు,
📘⭐️😎
Deleteఇదిగో పడవలె తైలము
పదిలముగా చేతిలోన భాష్యము వ్రాయన్
పదహారణాలయిన లే
నిదే కుదరదోయ్ జిలేబి నీరజ నేత్రా :)
జిలేబి
@ 📘⭐️😎,
Deleteరోజూ శంకరాభరణం లో తిరుగుతూ ఉంటే మీరూ పద్యాలు వ్రాసేస్తారనుకున్నాను.ఏకంగా పద్యాలకు భాష్యాలే వ్రాసేస్తున్నారే !
మీ భాష్యానికి పదహారణాల రేటు కూడా కట్టేసారీ గడసరి....పదహారణాలంటే ఎంతా ?
సూపర్ స్టారా మజాకా ?
సత్కార్యమ్ముల చేసిన
Deleteసత్కార్యంబులను నెంచ సద్గతి కలదోయ్
సత్కారముకై చేసిన
సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్!
పూలదండలూ, శాలువాలూ, పొగడ్తలూ, బిరుదులూ, సన్మానాలూ ఆశించి చేసే పనుల కన్నా మంచి కోసం చేసే మంచిపనులు శ్రేష్ఠం .. అనే కదా ఆ సుభాషితం
పై జిలేబీ గారి పద్యానికీ , క్రింది విన్నకోటి వారి
భాష్యానికీ పొంతన కనబడటం లేదు . భాష్యమంత సుళువుగా పద్యమేమీ అవగతం
కావట్లేదు . నా మట్టి బుఱ్ఱ కవగాహన లేమి
కారణం కావచ్చు .
సత్కార్యమ్ముల పట్ల చేసిన సత్కార్యమ్ములను
ఎంచితే సద్గతి కలదోయ్ ?
ఎంత గింజుకున్నా అన్వయం గానీ , ఫలితార్థం గానీ ఈ మట్టిబుఱ్ఱ కందడం లేదు .
ఇక , సత్కారమునకై చేసిన సత్కార్యముల ఫలము సంతాపములట !
ఏమిటో , మాయ !
కవయిత్రి గారైనా వివరిస్తే తెలుసుకుని మేమూ
సత్కారాలు పొందడానికో , సత్కార్యాలు చేయడానికో ఉద్యుక్తులౌతాంగా .
🙌 ఇక over to you “జిలేబి” గారూ 👍.
Deleteనేనేదో స్థూలంగా చెప్పాను. అది సరిపోయినట్లు లేదు కాబట్టి మీ కవిహృదయమేమిటో విపులంగా మీరే చెప్పండి 👍.
Delete
Deleteభాష్యమంత సుళువుగా పద్యమేమీ అవగతం
కావట్లేదు
ఇట్లా అందరికీ సుళువుగా అర్థమయ్యేటట్లు రాసేస్తే భాష్యకారులు, వ్యాఖ్యాతలు విశ్లేషకులు, సమీక్షకు లు, విమర్శకులు బతికేదెట్లా?/
అందుకని .....
తత్పర పరాత్పరాత్పర
మత్పర చిత్పరముగాన మహిలో రాజా
సత్పుర జిలేబి సన్నిధి
తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ !
జిలేబి
విన్నకోట వారి భాష్యము సరి
🙏 “జిలేబి” గారూ.
Deleteకవి హృదయమునకు కడు డగ్గరగ జేరు
Deleteఘనులు గద ! విన్నకోట వారు , నతు లిడుదు ,
తలలు బద్దలు కొట్టినా తట్టనట్టి
పద్య భావాన్ని సుళువుగా పట్టినారు .
// “..... పదహారణాలంటే ఎంతా ? “ //
Deleteవాట్, సీరియస్ లీ నీహారిక గారూ 🤔??
సరే కానివ్వండి. 1957 లో భారతప్రభుత్వం నాణాలకు metric system కు మారి నయాపైసలు NP (తరువాత తరువాత “నయా” అనే విశేషణం తీసేసారు లెండి) ప్రవేశపెట్టేంత వరకు ... పైస, కాణీ, అర్థణా, అణా, బేడ (రెండు అణాలు), పావలా (నాలుగు అణాలు) వగైరా నాణాల పద్ధతి ఉండేది.
ఇంతకీ మీరడిగిన ప్రశ్న కు జవాబు ... ఒక రూపాయికి పదహారు అణాలు (దాన్నించే పదహారణాలా తెలుగమ్మాయి లాంటి పదప్రయోగాలుండేవి 🙂).
సో, “జిలేబి” గారు కట్టిన వెల ఒక రూపాయన్నమాట. చూశారా ఎంత పిసినారితనమో? అయినా కళని సత్కరించే వదాన్యులు అరుదైపోతున్నారండీ 🙁.
ఇట్లు,
📘⭐️😎
(పైన నేను చెప్పినదంతా నిజంగా మీకు తెలియదా? లేక నన్ను పరీక్షించాలని అడిగారా? 🙁)
తెలుసుకోవలసిన మరొక విశేషం. బ్రిటిష్ పాలనలో అణా నాణెం మీద ఉన్న ఐదు భాషల్లో తెలుగు కూడా ఒకటి. నాణెం మీద “ఒక అణా” అని తెలుగులో కూడా ముద్రించి ఉండేది. ఆ కాలంలో తెలుగుభాషకు దక్కిన గౌరవం.
Deleteఒక్క రూపాయి వెలకట్టి వెక్కిరించి
Deleteతవరి భాష్యాన్ని మివుల తక్కువగ జేసె
' గడసరి 'యనిరి ' వారు ', మీ కర్థమగు , తె
లియని వారెవ రిందులో , లేరు , విబుధ !
Jk
అణా, కాణీకి కొరగాని దాన్ని ...నిజంగా తెలియదు.😭😭😭
Deleteఒక్క రూపాయిని తక్కువగా చూడకండి.ఆవిడ వ్రాసిన పద్యాలు వేలల్లో ఉన్నాయి.
Deleteనేనొక రూపాయి బాకీ మీకు....రుణం ఉంచుకోకూడదు. మళ్ళీ వచ్చే జన్మలో కలుసుకోవలసి ఉంటుంది.
కలుసుకుందాం నీహారిక గారూ 👍. అందుకని ఆ రూపాయి బాకీ (?) అలాగే ఉండనివ్వండి 🙂.
Delete// “అణా, కాణీకి కొరగాని దాన్ని” //
Deleteమీ విలువ మీకు తెలియడం లేదు. Cheer up 👍.
// “కవి హృదయమునకు కడు డగ్గరగ జేరు
Deleteఘనులు గద ! విన్నకోట వారు ,” //
ఏదో ఫ్లూక్ మాస్టారూ. మీ పాండిత్యానికి నేనెక్కడ సరితూగగలను?
మరో జన్మలో కలుసుకోడానికి వీలుపడదు..నాకీ జన్మ చాలు ....బాకీలన్నీ తీర్చెయ్యాలి
Delete😌
Delete
Deleteవ్యాపార లావాదేవీలు వచ్చే జన్మ దాకా సాగేయే
భేషు భేషు
జిలేబి
ReplyDeleteఅల్లుకుని పోవు నైజము
కల్లాకపటంబెరుగని కన్నడు భళిరా
సల్లాపంబుల వచ్చెను
చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్!
జిలేబి
ReplyDeleteప్రేమను పంచడ మన్నద
దేమియు గొప్పవదు సూవె తిరిగి నిను జిలే
బీ మక్కువతో పిరియము
గా ముద్దాడు మగవాడు గలడా చెప్మా :)
జిలేబి
ReplyDeleteకలఁ డందురుడీశుని తా
కలడో లేడో తెలియదు కలయో నిజమో
తెలియదు తెలిసీ తెలియని
కులంభరుడగుచు హృదయపు కుహురము దోచెన్!
జిలేబి
ReplyDeleteకుస్తీ పడు కందముతో
మస్తీ గానన్ మరిమరి మధురిమ లూరన్
దోస్తీ గను పదములతో
నేస్తములగుచున్ జిలేబి నేర్పుగ నమరన్ !
జిలేబి
వేరే బ్లాగ్ లో మీ వ్యాఖ్యలో “కల్లు పోతాయ్ ....” అన్నారేవిటి మీరు 😡? కొంతమంది టీవీ ఏంకరిణులలాగా మీకు కూడా ‘ ళ ‘ పలకదా ఏం? ‘ ణ ‘ గతి కూడా ఇంతేనా?
ReplyDelete
Deleteఆ అబ్బోడి బాస అది :)
జిలేబి
ఓహ్, ఐ సీ 🙂.
Delete
Deleteయా యూ సీ :)
జిలేబి
ReplyDeleteతావిరి యించెను భట్టియు
రావణ వధయను చు సూవె రమ్యము గానౌ
పావన రాముని చరితము
"రావణు కథ", లేక వ్రాసె, "రామాయణమున్"
జిలేబి
ReplyDeleteపిడికిలి లో బట్టు నడుము
లడుగడుగున గాన కృష్ణ ! లయమై నినుగూ
డ డుబుక్కున స్లిమ్ లైనరు
నడుముగ గీచితనయా!మనసున గనకుమా :)
జిలేబి
ReplyDeleteసతి పుట్టింటికి నేగిన
వెతపడ కన్నా ! గునగున వెంబడిపొమ్మా
కతచెప్పి యత్త గారికి
జత తీసుకుని వెనుతిరుగు జగణ జిలేబిన్ :)
జిలేబి
ReplyDeleteసతి పుట్టింటికి నేగిన
పతి సాపాటుకు టికాణ పరగడ పస్తే
గతి! కావున మరి సీతా
పతి, కందము గూర్చుచు పదపదరా మెస్సూ !
సావేజిత
జిలేబి
Zilebiజనవరి 21, 2016 4:06 [AM]
ReplyDeleteఅదె! హిమాలయము జిలేబి యచట కలదు
సూవె కైలాస మది వారి సుందర గృహ
ము! అచట నటనమున సమున హిమవంతు
పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను!
శుభోదయం
జిలేబి
ప్రత్యుత్తరంతొలగించు
ప్రత్యుత్తరాలు
G P Sastry (gps1943@yahoo.com)సెప్టెంబర్ 07, 2018 5:46 AM
👏👏👏
అదిరింది పద్యం!
మూడవ పాదం యతిమైత్రి బోధ పడ లేదు...
Zilebiసెప్టెంబర్ 07, 2018 5:49 AM
సీక్రెట్ :) కనుక్కోండి చూద్దాం :)
జిలేబి
తొలగించు
కామేశ్వర రావు పోచిరాజుసెప్టెంబర్ 07, 2018 11:53 AM
జిలేబి గారు ఛందో దైత్యు వలలో పడ్డారు. అతఁ డన్ని వేళల సత్యముఁ బలుక నేరఁడు.
మీ పద్య తృతీయ పాదములో “ము అచ” – “నహిమ” లో ప్రాస యతి (ముఅ-నహి) యని భ్రమ పడ్డాడు.
గృహము + అచట = “గృహ మచట” యవుతుంది. అప్పుడు గణ యతి భంగములు.
అ – హ లకు యతి మైత్రి యున్నను ప్రాస మైత్రికి పనికిరావు. అంతే గాక పద మధ్యము నందు నచ్చు లుండ నేరవు. కనుక ప్రాస గా నచ్చులు రావు.
నటనమున సమున ? నటనమున సమను హిమవంతు పుత్రిని.
Zilebiసెప్టెంబర్ 07, 2018 2:51 PM
పోచిరాజు వారికి నమో నమః
సరియేనాండి సవరణ.
అదె! హిమాలయము జిలేబి యచట కలదు
సూవె కైలాస మది వారి సుందర గృహ
మదియె! నృత్యపులాటయమ్మ, హిమవంతు
పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను!
జిలేబి
ReplyDeleteభద్రము కొడుకో ! చేయదు
హృద్రోగము మేలు,సేయు నెల్లజనులకున్
ఛిద్రము జీవితమును! శ్రీ
మద్రామాయణము చదువుమయ పుణ్యమగున్ !
జిలేబి
ReplyDeleteజనగణమనోధినాయక
మనమంతా కలిసిమెలిసి మహిలో దేశం
బును మేలగు రీతిగ ని
ల్పి నలుగురు పొగుడగ భళి మలిచెదము రమ్మా !
ஜிலேபி
ReplyDeleteజిలేబి వారు రాళ్ళకు పద్యాలు నేర్పెద అనగా
తీండ్రింప చేతు రాళ్ళను
వేండ్రపడవలెనవి నాదు వేదముగానన్
రండ్రా నేర్పెద ననగా
గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.
జిలేబి
ReplyDeleteఏలిక వారి దురాయిగ
చాలిక పేర్పులు జిలేబి, సరసము గానన్,
మేలుగ వ్రాయన్ పాకము
తేలును, ముద్దాడి పల్కు తేనియ లూరన్!
జిలేబి
ReplyDeleteఅవియివి యని యన్నియు సూ
వివాద నిలయములు! విశ్వవిద్యాలయముల్,
కవిరాట్ వాటికి మూలము
చెవియొగ్గి వినదగనివయ చెకుముకి పలుకుల్:)
జిలేబి
ReplyDeleteగదిలో కూర్చుని గూగులు
ను దిప్పగ టకటక మారెను వరుసగ జిలే
బి,దెసయటునిటు భళిభళీ
యదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ
జిలేబి
గూగుల్ ను తిప్పితే తిప్పుకోండి గానీ ఢిల్లీ నగరంలో ద్వారక అనే పేరు గలిగిన ఒక కాలనీ / లొకాలిటీ / నివాసప్రాంతం ఉంది కదా. చాలా పెద్దది కూడానూ. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ సమస్యాపూరణ ప్రయత్నించరాదూ 👍?
Delete
Deleteమీరడిగితే కాదనట మెట్లా నరసన్న గారు !
అసలే మా భాష్యకారులు :)
కుదిరెన్ టాక్సీ వాలా
పదరా ద్వారక నగరము పక్కన గలదా ?
అదె! ఫర్లాంగే సుమ్మీ
యదిగో ద్వారక యనఁ ,గననయ్యెను ఢిల్లీ :)
జిలేబి
బాగుంది 👌. చాలా వేగంగా పద్యం కట్టారు.
Delete(“తైలం” సంగతి ఇంకా తేలనేలేదు, అప్పుడే మీ భాష్యకారుడిని అంటే ఎట్లా?)
ReplyDeleteఇది తెలుగు టపా నరుడా
కుదరదు సూవె యనువాదకులగుచు మీకై
సదనంబున సాయంబౌ!
పదపద వయ్యా తెలుంగు బ్లాగిది సుమ్మీ :)
జిలేబి
ఇది తెలుగు టపా వనితా / ఇది తెలుగు టపా లలనా
Delete...............
పదపద వమ్మా / పదపద మామీ .....
అనండి 😀.
Deleteవిన్న కోట వారు
మీకూ కందం బొచ్చేసినట్లే !
ఖరార్ !
వెంఠనే శంకరాభరణంలో ఎన్రోలై ఎన్మాసు గా కందసింగము గా మారవలె !
చీర్స్
జిలేబి
థాంక్స్, అంతేనంటారా 🙂? “కందసింగం” పదం బాగుందండి 👌🦁.
Delete😎
ఇంకో కంద కవీంద్రుల !
Deleteఅంకిత మయ్యేర సభకు ! హాహా ! తమరే
యుంకించి గురివి గారయి
పొంకముగా దిద్ది తీర్చబోలు మహాత్మా !
.
Deleteఅంతే అంతే ఉరికేయండి విన్నకోటవారు
లక్కాకుల వారు
కంద కవీంద్రులు కాదండోయ్ కంద సింగము !
జిలేబి
శ్రీలంక తమిళ వాసన
Deleteఫీలింగున ' కందసింగ ' బిరుదము కటువై
నాలికపై చేదొలికెడు
లాలితమగు తెలుగు పేరు రాదా విబుధా !
Deleteపోనిద్దురూ మీరే ఓ మంచి లాలితమగు పేరెట్టేయండి. సింగము మాత్రము ఖచ్చితంగా వుండాలందులో. నరసింహులు కదా ! :)
జిలేబి
పెద్దలకా ! పేరెట్టుట !
Deleteతద్దయు నావల్లగాదు , తప్పుగదండీ !
పద్దతిగా యని పించదు ,
యెద్దేవా సేయ తగదు , హేళనయు నగున్ .
ReplyDeleteవేచి చూడుడీ రాబోవు వారము మా అనాలిసిస్ :)
ఈ రోజితర పనులలో
మారామారిగ జిలేబి మాదిరి గున్నా !
వారము తరువాయి భళా
తేరుకొనుచువత్తునయ్య తేకువ తోడన్ :)
జిలేబి
ReplyDeleteరానా నటియించు జిలే
బీ నారా చంద్రబాబు వేషము లోనన్
శ్రీనందమూరి సినిమా
లోన భళారే విచిత్ర లోకంబిదియే !
జిలేబి
ReplyDeleteలెక్కలకు గొట్టుడీ జై :)
లెక్కల వీరుండదిగో
ముక్కల చేసెను టికెట్ల మొత్తము సుమ్మీ
పక్కా యగున ప్రెడిక్షను ?
చక్కా రాబోవు కాల చక్రము దేల్చున్ :)
జిలేబి
ReplyDeleteనీ చెక్కిళ్ళ నిమర లే
నే! చక్కగ కాచినావు ణిసిధాత్వర్థం
బే చిక్కనీక రమణీ
నా చెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా !
జిలేబి
ReplyDeleteఏలిక వారి దురాయిగ
చాలిక పేర్పులు జిలేబి, సరసము గానన్,
మేలుగ వ్రాయన్ పాకము
తేలును, ముద్దాడి పల్కు తేనియ లూరన్!
***
వాహ్! క్యా రాశి హై :)
మేలగు రాశుల బోసిరి
లీలగ యవధానులిచట లెస్స! భళి భళీ,
లోలాక్షుల కైరాసులు
తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!
***
మైలవరపు రాసులివి! భ
ళీ! లోలాక్షుల కు రాశులివియె! జిలేబీ
లై లసితమై మగడి మది
తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!.
***
గోలా! జిలేబి శోభన
వేళను కొని యాడెదమ్ము వెసవెస రమ్మా!
పాలు మురిపాలు సరసము
తేలును! ముద్దాడి పల్కు తేనియ లూరన్!
జిలేబి
ReplyDeleteబూతు లేల యన న బూతో న రచ్చకా
మెర్లు! బూతు వూతు మెలిక వేయ
మాట లేమి లేకి మాటల పైదెచ్చు
విశ్వ దాభి రామ వినుర వేమ!
జిలేబి
ReplyDeleteజంక బోకు చెప్పు చప్పున నొక నస
త్యమును దిమ్మ తిరిగి ధమ్మటంచు
జనులు పడవలెను! సుజనులార వినుడయ్య
లంక నేలినాఁడు లక్ష్మణుండు
జిలేబి
ReplyDeleteచిరుజీవులు హరిబాబులు
బురుబురు లాడుచు కసబిస బుసుబుసు లాడన్
దరి పల్లె ప్రపంచం బక
ట రివ్వున సహా యమివ్వ టపటప లాడెన్:)
జిలేబి
మీ కథల్లోనే ఉందిగా.. చిరుజీవి అని వామనుడ్ని తేలిగ్గా తీసుకుంటే.. బలి పరిస్థితి ఏమైందో.. శుక్రాచార్యుడు సైడైపొయ్యడు, బలి పారిపొయ్యాడు.
Delete
Deleteఓ వా, మనుడివన్న మాట
జిలేబీ గారూ, బలి పారిపోలేదండీ. భాగవతం చదువకుండా ఏదో అంటే పొరపాటు.
Delete
Deleteసెల్ఫు ప్రొక్లైమ్డ్ బుడత గాడు :)
Deleteశ్యామలీయంగారు
పనీపాటా లేని కోన్కిస్కా బుడతల విన్నాణమది. యేం చేద్దాం అంతే అను కోవాలె.
రాదు. తెలియదు.అయినా బరుకతారు.
పోనీలెండి కుర్ర కుంకలు. మరో పెపంచం లో వున్నారు.
జిలేబి
ReplyDeleteపల్లె ప్రపంచము వారికి
బుల్లబ్బాయి చిరుజీవి బూతోపనిషత్
మల్లియ లార వినండోయ్
కల్లాకపటంబెరుగని కామింటరహో :)
జిలేబి
ReplyDeleteఒంటరి వానిగ బతికిన
తంటాలే లేకబోవు తన్ని తగలెడెన్
గంటల కొలదిగ నరులున్
జంటగ నెవరు మరి రారె జాల్రా వేయన్ :)
ReplyDeleteమీ డ్రామా పేరేమం
డీ? డ్రా మాలోన పురుషుడికి పాత్రయకో ?
మా డ్రామాపేరండీ
"గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్"!
జిలేబి
ReplyDeleteఫుల్లాబ్జాక్షి! భగవతీ!
యుల్లంబందు నినునిల్పి నూతనముగ శో
భిల్లం బల్కగ వేడెద
మల్లియ మధురిమ పదముల మరిమరి యిమ్మా
జిలేబి
ReplyDeleteనానాటికి జగమాయెన
యా నాటకము! నదులెల్ల యాలము బోవన్
పానాదిలోబడి, భళీ
కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్
జిలేబి
ReplyDeleteఐపీ యడ్రసులన్ హా
వీపీ యెన్ వెనుక దాచి వీరాంగములా
డే పీతగాళ్ళ మాటల
లో పడి పోనేల చల్ చలోరె చలోరే :)
జిలేబి
ReplyDeleteకంసుని నుఱిచియాడెను కన్నడెపుడు ?
విష్ణువు జలపుష్పంబుగ బెండు పరచె
నెవరి నకొ? రావణుని చంపె నెవరు సూవె ?
ద్వాపరమున; సోమకుఁ జంపె; దాశరథియె
జిలేబి
ReplyDeleteసాపాటుకు గతి లేదు సు
మా పరమాన్నముల నిత్తు మనిరి జిలేబీ
మా పాలకులు భళారే
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్!
జిలేబి