Thursday, July 23, 2009

సంపూర్ణ సూర్య గ్రహణం - సంపూర్ణం !

సంపూర్ణ సూర్య గ్రహణం వస్తోంది వస్తోంది అని ఎదురు చూసిన ఆ గడియలు వచ్చి వెళ్లి పోయాయి. ఈ సంపూర్ణ గ్రహణం మళ్ళీ మరు జన్మలో చూడొచ్చు అని ఆశా పూర్వకం గా అనుకోవచ్చు. అందరూ ఈ జన్మలో ఇదే ఆఖరి సారి ఇది చూడగలగడం అనటం తో బోరు కొట్టి కొత్త విధంగా ఆలోచిస్తే మరుజన్మలో చూడచ్చోచ్ అని సంబర పడి పోయాను. ఈ మాటే మా వాళ్ళతో అంటే నీది మరీ చోద్యమే ! నువ్వు మరు జన్మలో వస్తావని గ్యారంటీ ఏమిటి? వచ్చావే పో లాస్ట్ జన్మలో చూసవన్న గ్య్నాపకం ఉంటుందా అన్నారు! ఇప్పుడు మాత్రం ఉండిందా? మరు జన్మ ఉందనుకుంటే లాస్ట్ జన్మలో కూడా ఇది చూసినట్టే కదా మరి అని వితండవాదం లేవ దీశాను. అంతా విష్ణు మాయ గాకుంటే ప్రతి రోజు సూరీడు పన్నెండు గంటలు కనబడకుండా పోతాడు అదంతా విచిత్రం గా అని పించలేదు - ఓ ఆరు నిముషాలు గాయబ్ అయి పొతే ప్రపంచం ముక్కు మీద నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తుంది! ఈ పాటి దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్స్తారో మరీ విడ్డూరమే !

ఛీర్స్
జిలేబి.

2 comments:

  1. మరు జన్మ దాకా ఆగనక్కర్లేదు. మీకు ఓపిక ఉండి వెళ్లగలిగితే దక్షిణ అమెరికాలో (చిలీ, అర్జెంటీనా, etc) వచ్చే ఏడాది జులై 11న ఐదు నిమిషాలుండే టోటల్ సోలార్ ఎక్లిప్స్ రానుంది :-) వచ్చే పదేళ్లలో ఆస్ట్రేలియా, అమెరికాల్లో అరడజను దాకా టోటల్ ఎక్లిప్సెస్ ఉన్నాయి.

    ReplyDelete
  2. eejanmaloenae maavaaru kallu paadavutaayani illantaa chiikati chesi chuudanii laedu.evarinii etuu kadalaniiyaledu.pillaluu sandu dorikindae chaalani school dummakottaesaaru !

    ReplyDelete