Saturday, February 27, 2010

అయస్కాంతం -

ఐశ్వర్యం తో వయసు
కనకం తో కాంతం
వెరసి అయస్కాంతం

మమత జుక్ జుక్ రైలు బండి
ప్రణబ్ ఫైనాన్స్
వెరసి 'బంగ్లా' ఖాతం!

సర్దార్జీ - ముఖర్జీ-బెనర్జీ
వెరసి "సోనార్" భారత్
మేరా భారత్ నేటి భాగోతం !

చీర్స్
జిలేబి.

Tuesday, February 16, 2010

జల పుష్పం

నిప్పు వేడి
గాలి వేగం

సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు

మేఘ గర్జన
ఋతువుల రాగం

అన్నీ నేనే అన్నది జల పుష్పం

ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !

(మంత్ర పుష్పం ఆధారం )

జిలేబి

Thursday, February 11, 2010

సౌగంధికా పరిణయం

ఈ మధ్య భీమాంజనేయ యుద్ధం చిత్రం చూడటం జరిగింది. ఈ చిత్రం లో కథ స్థూలం గా నలకూబరుని సౌదామిని పరిణయం - దాని పర్యవసానం గా భీమాన్జేయుల మద్ద్య యుద్ధం జరగటం లాంటి సంఘటనలతో కథ నడుస్తుంది. సౌగంధిక పుష్పం - కుబేరుని శివార్చన మొదలైన సన్నివేశాలతో సౌగంధిక పుష్పం తీసుకు రావలసిన సౌదామిని నల కుబేరుని ప్రేమలో పడి శివార్చానకి ఆలస్యం గా రావడం అందులోను పూజ అప్పుడు కుబేరుడు ఒక సౌగంధిక పుష్పం తగ్గడం గమనించడం, ఆ పుష్పం సౌదామిని శిరుస్సులో ఉండడం, సౌదామిని ని శపించడం, సౌదామిని భూలోకం లో రావడం లాంటి విచిత్ర సన్నివేశాలతో కథ రమ్యం గా జరుగుతుంది.
ఈ చిత్రం చూస్తున్నప్పుడు వచ్చిన సందేహం ఏమిటంటే - సౌగంధికా పరిణయం అన్న మరో కథ ఉందా? లేక ఈ సౌదామిని నలకుబెరుల కథనే సౌగంధికా పరిణయం అంటారా?
మీ కెవరికైనా తెలిసిన చెప్పగలరు

జిలేబి.

Wednesday, February 3, 2010

ఆలోచనా స్రవంతి

మనసులోని మర్మమెల్ల తెలిసిన వారెవరైనా ఉంటారంటారా? ఎట్లాంటి టైటిల్ బ్లాగ్ లో రాయాలో ఆలోచన లేకుండా మనసులోనించి వచ్చే ఆలోచనలకి అక్షరం రూపం ఇవ్వగలడం సాధ్యమా? అంటే వచ్చే ఆలోచనలని ఏవిధమైనటువంటి నిబంధనలకి కట్టుబాట్లకి తావివ్వకుండా అక్షర రూపం చెయ్యడం అన్నటువంటి సాధనా ప్రక్రియ ఉందంటారా
ఆలోచించి చూస్తే ప్రతి మనిషి అక్షర రూపమివ్వడానికి మునుపు తన ఆలోచనలకి ఓ సామాజిక పరమైన లేకుంటే సిద్దాంతిక పరమైన కట్టుబాట్లని పెట్టుకుంటా డేమో? ఎందుకంటే ఆలోచనలని యదా తధంగా ప్రచురిస్తే అది ఒక ద్రౌపది లాంటి రచన ఐతే దాన్ని విశ్లేషించడానికి లేక విమర్శించ డానికి ఎల్లప్పుడూ జనం ముందు ఉండ వచ్చు. కాకుంటే అది ఒక రామాయణ విష వృక్షం అవ్వచ్చు.

ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, February 2, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

బ్లాగ్ భాన్ధవులకి
నూతన సంవత్సర శుభాకాంక్షలతో

మీ
జిలేబి.