Wednesday, February 3, 2010

ఆలోచనా స్రవంతి

మనసులోని మర్మమెల్ల తెలిసిన వారెవరైనా ఉంటారంటారా? ఎట్లాంటి టైటిల్ బ్లాగ్ లో రాయాలో ఆలోచన లేకుండా మనసులోనించి వచ్చే ఆలోచనలకి అక్షరం రూపం ఇవ్వగలడం సాధ్యమా? అంటే వచ్చే ఆలోచనలని ఏవిధమైనటువంటి నిబంధనలకి కట్టుబాట్లకి తావివ్వకుండా అక్షర రూపం చెయ్యడం అన్నటువంటి సాధనా ప్రక్రియ ఉందంటారా
ఆలోచించి చూస్తే ప్రతి మనిషి అక్షర రూపమివ్వడానికి మునుపు తన ఆలోచనలకి ఓ సామాజిక పరమైన లేకుంటే సిద్దాంతిక పరమైన కట్టుబాట్లని పెట్టుకుంటా డేమో? ఎందుకంటే ఆలోచనలని యదా తధంగా ప్రచురిస్తే అది ఒక ద్రౌపది లాంటి రచన ఐతే దాన్ని విశ్లేషించడానికి లేక విమర్శించ డానికి ఎల్లప్పుడూ జనం ముందు ఉండ వచ్చు. కాకుంటే అది ఒక రామాయణ విష వృక్షం అవ్వచ్చు.

ఏమంటారు?

చీర్స్
జిలేబి.

2 comments:

  1. నిజమేనేమో! అన్ని ఆలోచనలను అందరితో పంచుకోలేముకదా. దేని పరిమితులు దానికి తప్పకుండా ఉంటాయి.

    ReplyDelete
  2. ఆ విధానంతో నన్నో పోస్టు వ్రాసేయమంటారా :))

    ReplyDelete