Tuesday, April 20, 2010

కొంప దీసి మీరు తెలుగు వారు కాదు కదా?

కొంప తీయ కుండానే మేము తెలుగు వారమే!
ఈ మధ్య జరుగుతున్న రాజకీయ 'కళేబరాలు' చూస్తూంటే - రాజ్యం లో ని దేశం లో ని పరిస్తితుల్ని గమనిస్తుంటే ఇది తప్పని సరిగా తెలుగు వారి తెగులే అని పించక మానదు! ఆ మాటకి వస్తే కొంప దీయ కుండానే మేము తెల్గు వారమే అని మరీ బల్ల గుద్ది కాకుంటే - మేడ ఎక్కి మా నాయకులు భాజాయిస్తున్నారు.
విష్ణు మాయ కాకుంటే - ఈ వూరికి ఆ వూరు ఎంత దూరం అంటారు? ఆ వూరికి ఈ వూరు ఎంతో ఈ వూరికి ఆ వూరు అంతే దూరం కాదు సుమా!

చీర్స్
జిలేబి

Saturday, April 3, 2010

జమీందారు హై స్కూలు - చిత్తూరు జ్ఞాపకాలు

బంగారుపాళ్యం జమీందారు హై స్కూలు -బీ జెడ్ హై స్కూలు - బోర్డు స్కూలు - లాంటి పేరు ప్రఖ్యాతలతో ఓ వంద సంవత్సరాలు పైగా చిత్తూరు నగరాని కి విద్యా దానం గావించిన మహోన్నత విద్యా పీఠం ఈ జమీందారు హై స్కూలు. స్వాతంత్రం మునుపు బోర్డు స్కూలు గా ఉండేది. అప్పట్లో "ఫారం" చదువులు. ఆ పై జమీందారు హై స్కూలు గా పరిణితి. దగ్గిరలో ఉన్న బంగారుపాళ్యం జమీందారు గారి పుణ్యాన ఈ నగరానికి ఈ స్కూలు ఆ కాలం లో వచ్చింది. అప్పట్లో ఈ స్కూలు ప్రఖ్యాతి రాష్ట్ర మంతటా ప్రబలి ఉండేదని వినికిడి. అంటే బెస్ట్ స్కూల్స్ లో అన్న మాట.

అప్పట్లో స్కూల్స్ తక్కువే కాబట్టి - ఈ స్కూల్కి డిమాండు ఎక్కువే. క్వాలిటీ విషయం లో పై చేయి ఉండడం తో ఇంకా ఎక్కువే అయ్యేది ఈ డిమాండు. అంటే - ఈ విషయం రామా రావు గారు విద్యని ప్రైవేటు గావించడానికి మునుపు అన్న మాట. ఆ పై ప్రైవేటు స్కూల్స్ రావడం - ఈ స్కూలు విద్యా రంగం లో వస్తున్న వేగమైన మార్పులకి అనుగుణం గా తనను తాను మలచుకోక పోవడం కారణం గా ఇప్పుడు ప్రాబల్యం తగ్గి ఓ మోస్తరు స్కూల్ గా మారి పోవడం జరిగిందన్నది సత్య దూరం కాని విషయం.

ఈ స్కూల్ గురించి - ఇందులో చదివిన విద్యార్తులు - విద్యార్థులు - వారు ఈ దేశం లో - విదేశాలలో ఎక్కడెక్కడో ఉండవచ్చు. ప్రతి ఒక్కరికి తమ స్కూల్ - పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. అట్లాంటి తీపి జ్ఞాపకాలతో ముడి పడి ఉన్న స్కూళ్ళలో పెను మార్పిడి జరిగి - ఆ స్కూలు నామ మార్తకం గా ఉంది అన్నది విన్నప్పుడు కొంత మనసు చివుక్కు మానక మానదు.

ఈ టపా ఎందుకంటే - మన దేశం లో ఇప్పుడు ప్రాథమిక విద్య అన్నది హక్కు కింద మార్చబడడం గుర్తింపు కలిగిన విషయం. ఈ మార్పులతో - ఇట్లాంటి ఎన్నో మరుగున పడ్డ మాణిక్యాలు మళ్ళీ - కొత్త పుంతలు తోక్కుతాయని ఆశిస్తాను.

చీర్స్
జిలేబి.