Friday, January 1, 2016

ప్రముదితవదన - జిలేబీయం !

ప్రభ (ప్రముదితవదన , ప్రభాత , మందాకినీ , గౌరీ , చంచలాక్షీ) (పంచపాది)

నూతన సంవత్సరాన క్రొత్త జిలేబి ప్రయత్నం !

ఇవ్వాళ మన శ్యామలీయం వారు ప్రముదిత వదన వృత్తం మీద టపా పెట్టేరు !

సరే ఏలాగూ ఇవ్వాళ క్రొత్త సంవత్సరం కాబట్టి వారి పంథా లో ఒక టపా కడతామని వారు చెప్పిన ప్రముదిత వదన తో నే మొదలెడతాము ఛందస్సు కలిగిన పద్యం ఒకటి (జిలేబి స్టైల్ లో ) రాద్దామని ప్రయత్నించడం జరిగినది !

వారి బ్లాగు లోను, శ్రీ కంది శంకరయ్య గారి బ్లాగు లోను ఛందస్సు సాఫ్ట్ వేర్ లింకు ఉండడం తో అందులో జిలేబి వ్రాసిన పద పేర్పులను (శ్రీ శ్యామలీయం వారి శైలిని అనుకరించి) కట్ పేస్టూ చేసి సాఫ్టు వేరు సాఫ్టు వేరు నన్ను కొలువు అంటే జిలేబి యు ఆర్ స్మార్ట్ ! అరవై శాతం అంది !


సరే అని మరింత కుస్తీ పడితే 'యతి' యంటూ (ఎనిమిదవ స్థానం యతి ) తప్పులు చూపించింది !

యతి యంటే ఏమిటో ఎట్లా తెలిసేది అని గూగులమ్మ ని వేడుకుని , మళ్ళీ కంది వారి ఛందస్సు ఒకటవ టపా క్షుణ్ణంగా చదివి మళ్ళీ మళ్ళీ శ్యామలీయం వారి టపా చదివి , ఛందస్సు సాఫ్ట్ వేర్ తో మేళ మాడి మొత్తం మీద  మొదటి జిలేబి ఛందస్సు పద్యం వ్రాయ గలిగింది !

చదువు నేర్పిన గురువులు - శ్రీ శ్యామలీయం వారికి, శ్రీ కంది శంకరయ్య వారికి , గూగుల్ బ్రహ్మ వారికి ఛందస్సు సాఫ్ట్ వేర్ ని అత్యద్బుతం గా కనిబెట్టిన  ఆ సైట్ అడ్మిన్ గారికి ఈ జగతి వృత్తం అంకితం !

నమో నమః !

ప్రముదిత వదన ! (ముదిత జిలేబి -> ప్రముదిత వదన - జిలేబి వదన మన్న మాట ! జేకే !)

ప్రభ (ప్రముదితవదన , ప్రభాత , మందాకినీ , గౌరీ , చంచలాక్షీ) (పంచపాది)

ప్రభ పద్య లక్షణములు

1.ఈ పద్య ఛందస్సుకే ప్రముదితవదన , ప్రభాత , మందాకినీ , గౌరీ , చంచలాక్షీ  అనే ఇతర నామములు కూడా కలవు.
2.వృత్తం రకానికి చెందినది
3.జగతి ఛందమునకు చెందిన 1216 వ వృత్తము.
4.12 అక్షరములు ఉండును.
5.16 మాత్రలు ఉండును.
6.మాత్రా శ్రేణి: I I I - I I I - U I U - U I U
మిశ్రగతి శ్రేణి (3-5) : I I I - I I I U - I U - U I U
మిశ్రగతి శ్రేణి (5-3) : I I I I I - I U - I U U - I U
మిశ్రగతి శ్రేణి (4-5) : I I I I - I I U I - U U - I U
మిశ్రగతి శ్రేణి (5-4) : I I I I I - I U I - U U I - U
7.5 పాదములు ఉండును.
8.ప్రాస నియమం కలదు
9.ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
10.ప్రతి పాదమునందు న , న , ర , ర గణములుండును.

====================

జిలేబి మొదటి ఛందస్సు పద్యం
 
నినువిన రమణా నిధీ మాతృకా
సునయనవరుడా సుకావ్యా రమా
కనుకొలకున శంకరా కాయరా
మనన మిదిర రామ రామాయరా
మ నిను వినుతు శ్యామలీ యా రమా !


చీర్స్
జిలేబి

19 comments:

  1. Replies
    1. నీహారిక గారు,

      యథో కర్మః తథో "ఖర్మః" :)

      చీర్స్
      జిలేబి

      Delete
    2. ఆహా, గీతాచార్యుల లెవెల్లో చెప్పారు కదా "జిలేబీ భగవాన్"!

      Delete
  2. నారదా వాంగో! వాంగో!! అంగారం కొండువా!!!

    ReplyDelete
    Replies

    1. ఆహా వంక సన్నం వారు,

      నా 'రోలు' కర్ర ని మీరు పుచ్చేసు కున్నారన్న మాట !

      జిలేబి

      Delete
  3. కొండ నైతేను త్రవ్విరి , కోర్కె దీరె ,
    యెలుక యెటువోయెనో పట్ట గలరు వారు
    కంది వారి నేనియు , తాడిగడప వారి
    నేనియు బిలిపించండి జిలేబి గారు !

    ReplyDelete
  4. లక్కాకుల వారు :)

    నెనర్లు !

    మీకోసం ఈ జిలేబివదన :)

    అవుర అవుర ఈ అపారాపరా
    కవుల సొబగు ఈ కథాల్జెప్పు యీ
    కవుల దరువు మా కవీ జావళీ
    చెవుల వినుము వీచెనా మాధురీ
    జెవుల ? నగర రాజె వీరూ సుమీ

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కవుల బురద ఘాటుగా నంటెరా
      చెవుల దురద శ్రీకరం బాయెరా
      తవిక కవత ధారలై పారెరా
      చవుల వరద జావళీ పాడెరా
      అవుర అవుర హాయిగా ఉందిరా

      Delete
    2. లక్కాకుల వారు,

      వామ్మోయ్ !

      మీరలా ఊరికే వ్రాస్తేనే తొంభై మార్కులు గిట్టే చందం వారి తరపున ! మీకు సరి జోదు ఎవ్వారు ! కాలేము మేము ఎప్పుడూ అయినాను వ్రాసినాము ఇప్పుడు మరో సారి

      అందుకోండి మరో ఈ జిలేబివదన !

      మగువ రచన వేమతో తూగునా
      బిగువు చిలిపి మా బిలేజీయ మో
      యి గురువు గురి చేయితో నేర్చినా
      ము గురుతు తొలి జాములో రాసినా
      జిగురు ముదిత వాజినీ వేగమై !

      శుభోదయం
      జిలేబి

      Delete
    3. యతి 7 కు మార్చేయండి , తిప్పలు తప్పును . నడక బావుంటుంది . ఇతి శ్యా రా ఉవాచ .

      Delete
    4. లక్కాకుల వారు :)

      నమో నమః ! ఇంకా యతి అంటే నే పూర్తిగా అర్థం కాలేదు ! ఆ పై ప్రాస నియమం అంటే ఇంకా తెలియ లేదు ! అంత లో మీరు స్థానాన్ని మార్చ మంటే ఎట్లా !

      నా వల్ల కాదు బాబోయ్ !

      అయిననూ ప్రయత్నించితి ;

      అది జిలేబి ప్రారబ్ధమునకు తగినట్టు ఉత్కళిక అయి కూర్చున్నది :)

      ఉత్కళిక ! - జిలేబి గుళిక

      లకలకయను లవణి తరచి
      యొక పరి సరిగమలు గరిచె
      అకట అదియు అరగొర అర
      వ కత తెగులు వలె గనబడె !

      చీర్సు సహిత
      జిలేబి

      Delete
  5. మొత్తం మీద మీ ఛందోరచన మీద పెద్ద చర్చే జరిగింది. సంతోషం!

    ReplyDelete
    Replies

    1. కంది వారు

      నెనరస్య నెనరః :)

      జిలేబి

      Delete
  6. ఛందం లో మీ పద్యాలు ఉదాహరణలుగా ఉంచడానికి అనుమతించండి.

    ReplyDelete
    Replies
    1. Hi Dileep,

      Granted; So long as its acknowledged to "జిలేబి" its fine with the contributor/s of this Varudhini blog;

      cheers
      zilebi

      Delete
    2. Just to clarify for the ones that are of zilebi/signed by zilebi; For commentators like shri Lakkakula you may have to seek to them;

      Thank you.

      Delete
  7. కామెంట్ల లో కొట్టు కొచ్చిన లక్కాకుల వారి ముత్యాలు !

    గ్రాంధి కమ్ము బిగువు గ్రామీణ సొబగుతో
    సాటి రాదు , జనుల పాటి గారు
    పండితులును కవులు భావ సంపత్తిలో
    భాష కన్న హృదయ పధము మిన్న ."

    ౦౦౦
    "రాముని మీది ప్రేముడిని వ్రాసితి గాని , మరేమి గాదు , మీ
    రేమనుకున్న గ్రాంధికపు రీతికి నేను చనన్ , మనోజ్ఞమౌ
    కోమల గ్రామ సీమలను కూసిన కోయిల పాట తీరుగా
    ఆమనిలోని రాగముల హాయిని గొల్పును దెన్గు నెన్నుడుల్"

    ---

    "చెవి నిల్లు గట్టుక ’ సెల్ ఫోను ‘ విడువదు
    నిద్దుర చెఱుపక ‘ నెట్టు ‘ విడదు
    శ్రీవారు దిట్టక ’ టీవీలు ‘ విడువరు
    పది యడుగుల కైన ‘ బండి ‘ విడదు
    పన్నెండు దాటినా ‘ పడకలు ‘ పిలువవు
    పొద్దున్న లేవంగ బుధ్ధి గాదు
    ఉరుకులు పరుగులు – ఓరుముల్ తక్కువ
    సంతృప్తి యన్నది సుంత లేదు

    పనికి రాని ‘ ఇగో ’ లతో బతుకు నిండి
    మనసు , దేహము కృతకమై మారి మనిషి
    సహజ శారీర ధర్మము చచ్చి పోయి ,
    స్పందనల చురుకు కోల్పోయె బతుకు బండి .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ ,
      కానీ ,
      సాంప్రదాయబధ్ధ సద్గుణ సంపన్న
      బ్లాగులంట ! నాదు పద్యములట !
      పనికిరానివంట ! పరిహరించెదరంట !
      రాముడేమి - జేయు - భూమిజయును ?

      Delete