ఉత్కళిక - జిలేబి గుళిక !
నిన్న ప్రముదితవదన జగతి ఛందస్సు మీద చేసిన 'ఎక్స్పెరిమెంట్స్' లక్కాకుల వారి చలువ తో అట్లా ఇట్లా లాగ బడి కామెంట్ల తో జిలేబి వదన పండగ జేసుకుంది క్రొంగొత్త సంవత్సరాన్ని :)
లక్కాకుల వారు యతి స్థానం మార్చ వోయి అంటే అసలు యతి అంటే నే తెలియక హతోస్మి అనుకుంటూ ఉంటె వీరేమో స్థానమే మార్చుడీ యతి ని ఎనిమిదవ స్థానం నించి ఏడవ స్థానానికి మార్చుడీ అంటే ఏమి జేయాలో తెలియక అట్లా ఇట్లా ఛందస్సు సాఫ్ట్వేర్ తో మేళ మాడితే అది ఏమి జిలేబి ప్రారభ్దమో గాని వ్రాసిన ఆ పదాల్ (ఆపదాల్ రాకున్న మేలు :) ఉత్కళిక అనబడే జాతి రగడ గా అవతరించింది !
ఆహా జిలేబి కి రగడ యోగం ప్రారబ్ధ కర్మ (ఖర్మ) వసాత్ యాదృచ్చికం !
ఏది రాసినా అది రగడయే అయ్యే టట్టు ఉన్నది కామోసు అనుకుని ఏమి అయితే నేమి , అయినదేమో అయినది ఇక మేళ మేలా ప్రేయసి అనుకుని నేటికి ఉత్కళిక తో జిలేబి జాతి రగడ తో టపా కట్టేసింది :)
ఉత్కళిక - జాతి రగడ - జిలేబి గుళిక !
ఉత్కళిక పద్య లక్షణములు
- జాతి(రగడలు) రకానికి చెందినది
- 8 నుండి 12 అక్షరములు ఉండును.
- 2 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- అంత్య ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు నాలుగు 3 మాత్రలు గణములుండును.
ఉత్కళిక - జిలేబి గుళిక
లకలకయను లవణి తరచి
యొక పరి సరిగమలు గరిచె
అకట అదియు అరగొర అర
వ కత తెగులు వలె గనబడె !
యొక పరి సరిగమలు గరిచె
అకట అదియు అరగొర అర
వ కత తెగులు వలె గనబడె !
చీర్స్
జిలేబి
అరవ కత (CJK) :)
ReplyDelete
Deleteవంక సన్నము వారు :)
సిజెకె బట్టినారు క్రొంగొత్త గా :)
జిలేబి
రగడ లిందు నందు రగిలించుటలు మాని
ReplyDeleteరగడ ఛందములను రాయు టేమి
అరవ కతల తెగులు నరయ నిట్లుండునా
పరవశింతురేమొ పండితులిక .
మృదువు గల్గిన వానితో మృదువు జూపుదు
Deleteగరకు గల్గిన వానితో గరకు జూపుదు
నక్రమము సేయుటకు మాత్రమనుమతింప
దురాక్రమణ సేయుటకు జూసిన పిటాయింపే !
జేకే !
చీర్స్
జిలేబి
తేట గీతిక దాదాపు తేట యగుచు
ReplyDeleteచట్ర మందున కూర్చుంది ఛంద మలర
ఇంక కూసింత పదును గావింతు రేని
పండితుల తోటి పోటీకి పంప నగును .
Deleteలక్కాకుల వారు :)
అందులో ముప్పావు వంతు మా గోదావరి శ్రీ పాద వారిది :) ఛందం చత్రమందు 'రంధ్రం' జిలేబి చేసినందువల్ల అది చట్రం మందు కూర్చుంది :) శ్రీ పాద వారి తేట గీతి జిలేబి తీట గీతి అయి పోయింది :)
జిలేబి