Thursday, June 2, 2016

జూన్ రెండన 'తారీఫు' !

జూన్ రెండన తారీఫు ! 

 
ధర్మ పక్షము నాడిగా ధర్మ మార్గ
మందు జనులెల్ల నుత్సాహ మతిశయింప
తెలుగు గడ్డకు రెండన తీరు లొచ్చె!
జూను రెండవ తారీకు చుక్క లొచ్చె
!
 
కర్మ మార్గపు దారిన  కాంగిరేసు
పూని విభజింపగ జనుల వునికి తెలిసె
బాగు పడుదురు మునుముందు  భారతీయ
జనుల మాటకు విలువయు జాల కలిగె !
 
చిన్న రాష్ట్రాల  పాలసీ చిగుర తొడిగె
దేశమున కిది మేలు సందేశము యన 
నేడు తెలుగు వారి పలుకు నేర్పు  తెలిసి
భాజపా కూడ  జతగట్టి  భాగ మయ్యె !
 
దుష్ట పార్టీలనిరి వారు తోడుదొంగ
లనిరి తప్పేమియునులేదు రాజకీయ
నాటకము! జన వాహిని నాడి తెలియ
గుండె దిటవు గలిగి తెలంగాణ తెచ్చె!
 
బాట  యిదికాదని జనులు భావ గీతి
గ యిక తప్పొప్పుల సరితూకమును వలదు !
రాష్ట్రమునకు నేడు వలయు రాజ మార్గ
ము! శరవేగము బోవలె ముందు సాగ

యింపుగా వచ్చినది వారి  యిచ్చ ! తెలివి 
గలిగి యాంధ్రుడు మేలగు కాల మిచ్చు
విభవమొప్పార సత్కీర్తి ప్రభలు తోడ
తేజరిల్లవలె  భువిని  దిక్కులదర!

తెలుగు వారి విజయములు దేశమునకు
నాత్మశక్తి యొసంగుచు నవత  నిచ్చు 
కాల గతిలోన మనకెల్ల!   కరుణ జూపు 
ధర్మపరులకు దైవమే దారి చూపు

కాన పునరంకితులు కండు జూను రెండు
నవ తెలంగాణ రాష్ట్రము నాది యనగ
నవ నవోజ్వల దివ్యాంధ్ర నాది యనగ
చెప్పి ఘనదీక్ష బూనుడీ చిత్తములను!
 
తెలుగు తేజమా యీదీక్ష తీసు కొనుము
తెలుగు వీరుడా యీదీక్ష తీసు కొనుము
తెలుగు యామినీ యీదీక్ష తీసు కొనుము
అందరీ దీక్ష గొనవలె  యనె జిలేబి ! 
 
శుభోదయం!
చీర్సు సహిత
సావేజిత
జిలేబి

14 comments:

  1. హాస్యానికి కూడా హద్దులుంటాయి.

    ReplyDelete

  2. హాస్యము గాదు! కవీ ! అప
    హాస్యపు పద్యము జిలేబి అసలిది గాద
    భ్యస్యపు రీతిగ గను! అయ
    శస్యము కలిగించలేదు సఖుడా గనుమా !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. అసభ్యస్యం! ఇదెక్కడి మాట? అదటుంచుదాం. మీ పద్యాభ్యాసంలో తప్పులెంచటం గొంగడిలో తింటూ వెండ్రుకలు లెక్కించటం వంటిది కదా. నా టపాను కనీసం ప్రస్తావించకుండా, పేరడీ పద్యాలవంటివి వ్రాయటం అపహాస్యం చేయటం కాదన్న మాటను ఎలా అంగీకరించగలను? కష్టం తెలుసుకొనకుండా ఇలా ఎద్దేవా చేస్తూ వ్రాయటం అపహాస్యం చేయటం కాదన్న మాటను ఎలా అంగీకరించగలను. మీ విశృంఖలత్వం తెలిసిందేకాబట్టి పట్టించుకొన నక్కర లేదనుకుంటాను.

    ఒరుల బాధల కూడ ననుచితమైన
    హాస్యమును పిండుకొనుచుండు నట్టి మీకు
    దెబ్బతగిలిన నితరులు దెప్పి నవ్వు
    కాల మరుదెంచి నప్పుడే కలుగు బుధ్ధి.

    ReplyDelete
  4. "తెలుగు వారి విజయములు దేశమునకు
    నాత్మశక్తి యొసంగుచు నవత నిచ్చు
    కాల గతిలోన మనకెల్ల! కరుణ జూపు
    ధర్మపరులకు దైవమే దారి చూపు

    కాన పునరంకితులు కండు జూను రెండు
    నవ తెలంగాణ రాష్ట్రము నాది యనగ
    నవ నవోజ్వల దివ్యాంధ్ర నాది యనగ
    చెప్పి ఘనదీక్ష బూనుడీ చిత్తములను!"

    జిలేబి గారు!

    మీకున్న చిత్తశుద్ధి, ధర్మబుద్ధి తెలుగువాళ్ళందరికీ ఉంటే బాగుంటుంది. రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించే సద్బుద్ధి అందరికీ కలుగు గాక!

    ReplyDelete
    Replies
    1. నిజం ఫణీంద్రగారూ, నాక్కూడా దైవం కాస్త ధర్మబుధ్ధీ చిత్తశుధ్ధీ యిస్తే సంతోషమేను.

      తమను మెచ్చెడువారిదే ధర్మబుధ్ధి
      తప్పుపట్ట్టెడు వార లుత్తములు కారు
      లోకు లీరీతి నుందురు లోతుపాతు
      లెఱుఁగు దైవంబు నిజమెంచి యిచ్చు శుభము

      తెలుగు రాష్ట్రాలు రెండుగా రెండవతారీఖున విడదీసిన వారు రెండు రాష్ట్రాల అభివృధ్ధినీకాంక్షించారని నమ్మటం నాకైతే అనిపించటం లేదు. అలా అభివృధ్హ్ది జరిగితే మంచిదే కదా.

      Delete
    2. శ్యామలీయం గారు ..

      కలసి ఉన్నప్పుడు, రెండు ప్రాంతాలు ఏ పాటి సమానంగా అభివృద్ధి చెందాయో .. ఏ ప్రాంతం ఎలా పబ్బం గడుపుకొందో .. చూసారు మరి! ఇప్పుడు ఏ ప్రాంతం నిజమైన బలం ఎంతో .. చూస్తున్నారు!
      మీరన్నట్టు .. "లోతుపాతు లెఱుఁగు దైవంబు నిజమెంచి యిచ్చు"!
      మనమెవరం చెప్పండి?

      మీకు "నవ్యాంధ్ర" రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు!

      Delete
    3. కం. మన మెవరమన్న స్పృహతో
      మన మూరక యుండవచ్చు మరి దైవంబే
      మనునో కాలము తేల్చును
      మన కేటికి వాదమింక మానుద మార్యా.

      Delete
  5. ఏమండోయ్ శ్యామలీయం వారు

    ఆ అసభ్యస్యం పదమెక్కడ యున్నదండీ ?

    ఈ టపాకి మీ టపాయే ప్రేరణ


    ఒరుల కొచ్చిన రాష్ట్రము ఓడు యనుట
    కవులకు తగునా కవివర ! కంట నీరు
    యనుచు క్షుద్ర దినమనిరే ! అవని లోన
    కాల మెపుడుచె డేనుర కావ్య కాయ ?

    జిలేబి
    పరార్ :)

    ReplyDelete
    Replies
    1. నాక్కాస్త తెలుగు అర్థం అవుతుందన్న గర్వం అణిగిద్దామని కుట్రలు చేస్తున్నారా జిలేబి గారూ? మీ పద్యం(?) నాకైతే అంత సుబోధకంగా లేదు మరి.

      Delete
    2. భలే వారండీ శ్యామలీయం వారు :)

      మీ రే గా తెలుగు మా స్టారు !

      మా నస కవివర! ఓ శ్యా
      మా! నవనవలాడు మేఘ మాలల కవిరా
      యా ! నవతా కవితా రమ
      ణా! నా పదముల జిలేబి నానా రీతీ !

      చీర్స్
      జిలేబి

      Delete
  6. చెవికింపుగ చవులూరుచు
    నవ నవకపు పద్య మాల నాణ్యత గంటిన్,
    చెవిలో సీసము వోసుక
    తివురు ఘనుల మాటతీరు తెలిసి హసింతున్ .

    ReplyDelete
  7. లక్కాకుల వారు !

    వెల్కం బెక బెక !

    చాలా రోజుల తరువాయి దర్శనం !

    ఆ నవ నవకపు పద్య మాల లో ముప్పావు వంతు గురువులుం గారి పదాలే !


    వారట్లా తారీఖు అంటే జిలేబి ఇట్లా తారీఫు అన్నదంతే !

    కాబట్టి మీ సెహభాషు లు వారికే జెల్లు !

    నెనర్లు !

    అవలీలగ కవితలనిడు
    కవనంబుల రేడితండు ! గణ్యము గానన్
    కువలయము లనంగ పదము
    ల వరుసలన ముత్యములిడి లక్కాకు నిడెన్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కం. ఆ పావువంతు పలుకులు
      మీ పాలైనందువలన మెప్పులు గలిగెన్
      మాపాలు మొత్తమగుచో
      సైపని వారపహసించు సందర్భమగున్

      Delete
  8. రామ రామ రామ యని నారాముగ కవి
    యుండె! దారి విడిచెనుగ ! యుద్ధ భూమి
    యనగ పాలిటిక్సును నాడి యతను బోయె
    కాల మహిమ యనగ నిది కద జిలేబి !

    ReplyDelete