Wednesday, August 17, 2016

శ్మశాన వాటిక లో జిలేబి


శ్మశాన వాటిక లో జిలేబి



ఫోటో కర్టసీ : ది హిందూ దినపత్రిక - 16 ఆగస్ట్ 2016

నిన్న మా హిందూ వారు తమిళ నాడు ఎడిషన్ లో ఒక ముఖ్యమైన సమాజం లో మార్పు గాన వచ్చు రీతి లో ని ఒక వార్త ను ప్రచురించారు .

తమిళ నాడు ప్రభుత్వం ఒక జిలేబి కి కల్పనా చావ్లా అవార్డు బహుకరించింది . కారణం ?

శ్మశాన వాటిక శివుని కే సొత్తు. మహిళలు అక్కడికి వెళ్ళడం లో నూ (ఆఖరికి అందరూ అక్కడి కే వెళ్ళినా ) సమాజ పరమైన నిషేధాలు ఉన్నాయి .

అయినా వాటి నన్నిటిని అధిగమించి ఒక జయంతి (ఈవిడా జగణమే - జిలేబి లా :)
శ్మశాన వాటిక కేర్ టేకర్ రూపం లో ఉద్యోగ బాధ్యత లను తీసు కోవడానికి పూనుకొంది.

జేజేలు .

గగనానికి ఎగిరినా ఆఖరుకి శ్మశానానికి గూడా వెరవమంటూ శ్మశాన వాటిక లో ఇంచార్జ్ గా ఈ జయంతి ఉద్యోగం లో చేరడానికి కారణ మైన విషయం ఏమిటి ?

ఆవిడ, ఆవిడ సోదరి యిద్దరూ ఆడువారు. తండ్రి చని పోయినప్పుడు దహన కార్య క్రమాలకి ఆవిడ తన కజిన్స్ మీద ఆధార పడ వలసి వచ్చింది, ఇబ్బందుల నెదురు కోవాల్సి వచ్చింది. 

అందులో నించి పుట్టినదీ జాగృతి ఆలోచనా స్రవంతి .

ఆ జిలేబి కి శుభాకాంక్షల తో !

ఫోటో కర్టసీ మా హిందూ వారు.

పూర్తి నిడివి వ్యాసం  లింకు


చీర్స్ టు జయంతి
జిలేబి

7 comments:

  1. కాటికాపరిగా సత్యమణి
    Posted On: Monday,March 7,2016

    అమలాపురం రూరల్‌ : కాటికాపరి వృత్తిని జీవనో పాధిగా చేసుకుని ఓమహిళ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. శాస్త్రాలను కాదని తమకూ ఈ పనిలో భాగముం దంటూ అందరికీ చాటి చెబుతోంది బండారులంక గ్రామానికి చెందిన కర్రి సత్యమణి.
    శ్మశానవాటికలోకి మహి ళలు ప్రవేశించడాన్ని నిషిద్దమంటారు. హిందూ శ్మశానవాటికలో ఎక్కడా మహిళలు కనిపించరు. కాలం మారింది. బండా రులంకలో సత్యమణి ఒక్కరే మృతదేహాలను ఖననం చేయడంతో పాటు కర్మకాండలు క్రతువులను పూర్తి చేస్తుందంటే ఆమె ధైర్యాన్ని మెచ్చు కోవాల్సిందే. గ్రామంలో ఎవ రైనా చని పోతే ముందుగా పిలుపు అందుకునేది సత్య మణే. శ్మశానవాటికలో అన్ని క్రతువులూ పూర్తిచేసే ఆమెకు రూ.500 నుంచి రూ.వెయ్యి మధ్యలో గిట్టు బాటవుతోంది. బండారులంక హిందూ శ్మశానవాటికలో కర్రి సత్యమణి చిన్నపాకలో జీవిస్తుంది. భర్త పల్లప రాజు మద్యానికి బానిస కావడంతో అంత్యక్రియల సమయం విధులు సక్రమంగా నిర్వర్తించేవాడు కాదు. గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకు రావడంతో సత్యమణి అన్నీ తానై ఈ వృత్తిలోకి మళ్లింది. ఆమెకు ఒక కుమారుడు. తల్లికి చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా కూలి పనులకు వెళుతున్నాడు. ఆమె కుమార్తె ఇంటి వద్దే ఉంటోంది. జంగమదేవర్ల కుటుంబానికి చెందిన సత్యమణి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పదేళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతుంది. గ్రామంలో ఎవరికైనా చనిపోయిన వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వారైతే పురోహితుడు నిర్వహించాల్సిన కర్మకాండల విధులను ఆమెచేస్తోంది. అలాగని ఆమె ఏ శాస్త్రాలూ చదువుకోలేదు.
    ఇళ్లస్థలం కేటాయించాలి
    సొంత గూడు లేకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు సైతం చేయలేకపోతున్నాను. శ్మశానవాటిక చెంతనే ఉండటంతో తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. కాటికాపరిగా సేవలందిస్తున్న తనకు ప్రభుత్వపరంగా ఇళ్లస్థలాన్ని కేటాయించి ఆదుకోవాలి.
    కర్రి సత్యమణి, కాటికాపరి

    ReplyDelete
  2. జ్వలించే దారులు!
    బోటు నడిపే ఉషను.. శవాలను తగులబెట్టే జమునను.. పూజలు చేసే ఉమను చూసి వారణాసి సంబురపడుతోంది. పురుష వారసత్వ బురుజు కోటల్ని ధ్వంసం చేసి కొత్త భవంతులకు వేదికలు నిర్మిస్తున్నారు. తోడు లేనివాళ్లను చలింపజేస్తూ.. తోవల్ని జ్వలింపజేస్తున్నారీ మహిళలు!

    పడవెళ్లి పోతుంది..
    UshaDevi

    వారణాసిలో బోటు ప్రయాణంతో భక్తులు కిక్కిరిసి ఉంటారు. బోటున్నవాడిదే అక్కడ రాజ్యం. పదివేలకు పైగా బోటు నడిపేవాళ్లుంటారు. గంగానది అలలు ఎగిసిపడుతుండగా వాటిని ఛేదించుకుంటూ ఒక ఘాట్ నుంచి మరో ఘాట్‌కు బోటు నడపాలంటే అలసిసొలసిపోతారు వాళ్లు. అలాంటి కష్టతరమైన పని చేస్తుంది ఒకావిడ. కుటుంబ పోషణే లక్ష్యంగా.. తండ్రి నుంచి వారసత్వ సంపదగా తీసుకుందామె. విధి నన్ను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయిక్కడ. ఆడదేంటి పడవ నడుపుతోంది అనే అవహేళనలు రోజూ ఎన్నో చూస్తా అంటున్న 35 సంవత్సరాల ఆమె పేరు ఉషాదేవి. పడవెళ్లీ పోతుందిరో ఓ మానవుడా బతుకు పడవెళ్లి పో తోందిరా అంటూ పాడుకుంటూ పయనాన్ని సాగిస్తున్నది. భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడు. ఏం చేయాలో తెలియక.. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని బతుకు నావను లాగుతున్నది. ఇతరుల ఆకలి కూడా తీరుస్తోంది ఉషాదేవి.

    ఆఖరి చితిమంటలలో..
    JamunaDevi

    మనిషి చనిపోతే కడసారి చూపుకోసం ఆడవాళ్లకు స్మశానవాటికలోకే ప్రవేశం లేదు. దహన సంస్కారాలకు కొన్నిచోట్ల మహిళలు దూరంగా ఉండాల్సిందే. అలాంటి పరిస్థితుల్ని సవాలుగా తీసుకుని ఏకంగా శవాలకు దహన సంస్కారాలు చేసే వృత్తిని చేపట్టింది జమునాదేవి. 65 సంవత్సరాలు పైబడిన ఈమె అనాథ శవాలకు అమ్మ అయి కాష్టం పెడుతున్నది. గంగానదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, ఘాట్లపై వచ్చే శవాలకు కాటికాపరిగా అన్ని సంస్కారాలు ఈమే చేస్తున్నది. ఇక్కడ మొదటి మహిళా కాటికాపరి జమునా దేవే. భర్త మరణించడంతో కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముందు ఈ వృత్తిలోకి రావడానికి సంకోచించా. కానీ తెలిసిన పని ఇదొక్కటే. వారసత్వంగా కాటికాపరి వృత్తిని స్వీకరించి పనిచేస్తున్నానని ఆమె చెప్తున్నారు.

    చీరలో దారంలా..
    WaliaKhatoon

    చీరలు నేస్తేనే జీవితం సాగే కుటుంబం వారిది. షాపు పెట్టలేని పరిస్థితి. చిన్న గదినే షాపుగా మార్చుకుని చీరలు నేస్తూ జీవితాన్ని గెలిచిన ఆమే వాలియా ఖాతూన్. వారణాసిలో ఈమె చీరలు నేయడంలో ప్రావీణ్యురాలు. నెలకు రూ. 4,500 వరకు సంపాదిస్తూ జీవనం కొనసాగిస్తున్నది. తండ్రి నుంచి వారసత్వంగా ఈ వృత్తిని ఎంచుకుంది వాలియా. ఎంతో మన్నికైన చీరలు తయారు చేసే ఆమెనే ఒక్కసారైనా అటువంటి చీరల్ని కట్టుకోలేని దుస్థితి ఆమెది. తక్కువ సంపాదన.. ఎక్కువ శ్రమ ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా చీరలో దారంలా ముందుకు సాగుతోంది.

    చేతిగీతలే తలరాతగా..
    సోది చెబుతానమ్మ సోదీ.. అంటూ వెనకట ఆడవాళ్లు భవిష్యవాణి వినిపించేవారు. అయినా ఇప్పుడు అమ్మాయిలు జ్యోతిష్యం చెప్తానంటే వినడానికే జోస్యం చెప్పినట్లు అనిపిస్తుంది కదా! కానీ అంజలీ సోనీ చేతి మహిమతో చాలామందికి జరగినదీ.. జరుగుతున్నదీ.. జరగబోయేది చెప్తోంది. ఈమెది హర్యానా. ఆస్ట్రాలజీ చదువుకునేందుకు వారణాసికి వచ్చింది. జ్యోతిష్కురాలిగా పనిచేయడం ఈమె కోరిక. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా అంజలి తన ఇష్టాన్ని చంపుకోలేదు. జ్యోతిష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉంది.

    వేద మంత్రాల సాక్షిగా..
    అమ్మాయేంటి పూజారిగా పనిచేయడమేంటని ఎందరు తప్పుబట్టినా పట్టించుకోలేదు పూజారి ఉమాభారతి ఆర్య. పదకొండు సంవత్సరాల క్రితమే బీహార్ నుంచి వారణాసికి వచ్చి.. ఐదు సంవత్సరాలుగా పూజారి వృత్తిలో సెటిల్ అయింది. పూజారిగా పనిచేయవద్దని చెప్పిన తల్లిదండ్రులే ఇప్పుడు ఉమను చూసి గర్వపడుతున్నారు.

    ReplyDelete

  3. ప్రాణాలతోనే పాతిపెట్టబోయారు
    పురిటిగుడ్డుపై కన్నవాళ్ల కర్కశత్వం
    ఆంధ్రభూమి......April 24th, 2010

    కనిగిరిరూరల్, ఏప్రిల్ 23: అంగవైకల్యంతో పుట్టిన ఓ పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టేందుకు ప్రయత్నించిన దారుణ సంఘటన కనిగిరి పట్టణంలో జరిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కనిగిరి పట్టణంలోని ఆరామక్షేత్రం (స్మశానవాటిక) ప్రాంతంలో నివాసం ఉంటున్న కె అచ్చమ్మ అనే మహిళా కాటికాపరి వద్దకు ఓ రిక్షాకార్మికుడు అంగవైకల్యంతో పుట్టిన పురిటిగుడ్డును తీసుకువచ్చాడు. కేవలం ఒక్కరోజు వయస్సున్న పాపను ఆమె చేతిలో పెట్టి చనిపోయిందని, స్మశానవాటికలో పూడ్చాలని చెప్పాడు. అందుకు ఆరువందల రూపాయలు కూడా ఇచ్చాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఓ మహిళ ఈ బిడ్డను జన్మనిచ్చిందని, వివరాలు తనకు తెలియదని చెప్పాడు. కానీ ఆ పాప సజీవంగా ఉన్నట్లు గుర్తించిన అచ్చమ్మ రిక్షాకార్మికుడిని గట్టిగా ప్రశ్నించడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆ పాపను పరిశీలించగా, రెండు పాదాలు వంకరగా తిరిగి ఉండటం, రెండు చేతులకు ఉండాల్సిన వేళ్లలో ఒక వేలు మాత్రమే ఉన్నట్లు గుర్తించింది. దీంతో పాపను ఇంటికి తెచ్చుకుని తన సంరక్షణలోనే ఉంచింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ భీమ్‌నాయక్ ఆ ప్రాంతానికి వెళ్లి సంఘటనా వివరాలను అడిగి తెలుసుకుని పాపను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాపను తానే పెంచుతానని అచ్చమ్మ చెబుతున్నప్పటికీ ఒంగోలులోని మాతాశిశుగృహానికి తరలిస్తున్నట్లు సిడిపిఓ కళావతి తెలిపారు.
    ******************************
    అవును… ఆమె కాటికాపరి

    By K Hanmandloo on Jun 13, 2013

    ఆమె చేస్తోన్న ఉద్యోగం గురించి ఉహించడానికి కూడా చాల మంది మహిళలు భయపడతారు. అంత్య క్రియల కోసం కట్టెలు పేర్చడం నిప్పు పెట్టాక అవి మొత్తం కాలేదాకా కూర్చోవడం ఆమె పని.

    http://www.sirisampada.co/telugu/wp-content/uploads/2013/06/20130526a_007101006.jpg

    ReplyDelete
  4. పులకాంకిత మయ్యె తనువు
    లలనల తెగువలకు, ధైర్య లక్ష్ముల కిదుగో
    తలవంచి నమో నమ యని
    పలుకుదు , మనసాగ లేదు , భారత మాతా !

    ReplyDelete
  5. సిరి లేని వాసు ల వారు,

    మీరు నింపిన జిలేబీ ల వైనం టచింగ్ గా ఉంది

    నెనర్లు

    @లక్కాకుల వారు,

    నమో నమః !

    సూపర్ !

    నెనర్లు

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. విద్యుత్ శ్మశానవాటికలో పనిచేయుట కన్నా దుర్గంధభరితమైన, ఘోరమైన బహిర్భూమి పరిసరాలు గల పల్లెల, పట్టణాల శ్మశానవాటికలు పనిచేయుట అతి క్లిష్టతరం. వారిని ఈ రోజువరకూ ఎవ్వరూ పట్టించుకోలేదు. వారికి కూడా ఎప్పుడో అవార్డులు ఇవ్వవలసివుండె.
      వారిని మీరైనా పట్టించుకుంటారనే ఈ సమాచారం ఇచ్చాను. మీ పేరుతో వారికి జిలేబీ శ్మశాన శ్రీ అవార్డు లిప్పింతురని మాతా జిలేబీ తీర్థ స్వామినివారికి విజ్ఞప్తి.
      ....శ్రీనివాసుడు

      Delete


    2. అవన్నీ మన ఇలాఖా కావండీ ! అంత సీను‌ జిలేబి కి లేదు

      జిలేబి

      Delete