సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
ReplyDeleteచెవుల కుండల దీప్తి చెలువు వాడు
నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు
ఉరమున కౌస్తుభం బొలయు వాడు
నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
కరమున వేణువు మెరయు వాడు
చర్చిత మైపూత హరి చందనము వాడు
గళమున ముత్యాల కాంతి వాడు
తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
నంద గోపాల బాలు డానంద హేల
లీల బృందావనము రాస కేళి దేల
వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .
ఇప్పటి కుర్రాళ్ళు సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తున్నారు తప్ప తెలుగు బ్లాగుల్ని చూడటం తకువ.ఎప్పుడయినా వచ్చినా వయస్సులో పెద్దవాళ్ళు తమ అనుభవంతో నాలుగు మంచిమాటలు చెప్తారేమో అనే ఆశతోనే వస్తారు.అలాంటి మంచివాళ్ళకి కూడా వీళ్ళ దగ్గిర నేర్చుకోవడానికి ఏమీలేదు అనేలా బ్లాగుల్ని తయారుచేస్తే ఎవరికి నష్టం?లక్కాకుల వారు "దేముడు" అనే పదం కోసం ఆయనే వరసపెట్టి రాసిన పద్యాల్లో ఉదహరించిన జనభాషని అవమానించడం అన్నట్టు ఆవేశపడిపోవటం అవసరమా?మరి ముళ్ళపూడి వెంకటరమణ గారు "ద్యాముడు" అనే వెక్కిరింత పదాన్ని కూడా సృష్టించారు.దాన్ని కూడా నెత్తిమీద పెట్టుకుని వూరేగడమే జనభాషని గౌరవించినట్టు అవుతుందా?అదీగాక శ్యామలీయం ఏది చెప్పినా నేను చెప్పాను గనక చెయ్యాల్సిందే అని మొండిపట్టు కూడా పట్టనప్పుడు ఇంత రాద్ధాంతం దేనికి?జనరలుగా చెప్పానని సమర్ధించుకోలేరు,అందరికీ అన్నీ స్పష్తంగా అర్ధమవుతూనే ఉన్నాయి.ఏ మాటకి ఏమి అర్ధం వస్తుందో ఏ మాటకి కొమ్ములు తగిలించి వాడితే అది ఎవరికి తగలాలని అనుకుంటున్నారో తెలియనంత అమాయకులు ఎవరు ఉన్నారండి ఇక్కడ!
ReplyDeleteనాకయితే మనసులో ఒకటి పైకి ఒకటి తరహా ముసుగులో గుద్దులాట అసలు నచ్చదు.ఎదటివాళ్లని తిట్టాలనుకున్నా సరే మొహం మీద ఫెడీమని అనెయ్యటం తప్ప అన్యాపదేశపు విసుర్లు నేనెప్పుడూ చెయ్యను.ఒకవేళ శ్యామలీయం కాదు,వేరొకరు పద్యాలను కొట్టేశారు అని చెప్పాలనుకున్నా తిన్నగా పేరు చెప్పి తిడితే ఎవరు తప్పు పడతారు?
నన్ను నేను "చిచ్చరపిడుగు" అని చెప్పుకున్నా అది కేవలం సరదాకి మాత్రమే!వాదనలో వ్యతిరేకించినా నీహారికతో సహా ప్రతి ఒక్కరిపట్లా నాకు గౌరవం ఉంది.ఎంత సీరియస్ విషయాన్ని అయినా సరదాగా తీసుకోవడం నాకు అలవాటు.కానీ శ్యామలీయం మీద జరుగుతున్న అన్యాపదేశపు విసుర్ల దాడిని మాత్రం సరదాగా తీసుకోలేకపోతున్నాను.
ఒక పెద్దాయన తన సొంత నిర్ణయంతో బ్లాగుల నుంచి నిష్క్రమిస్తే వారికి తెలియకుండా ధారావాహికగా నా బ్లాగులో వేస్తాననడం వరకూ వచ్చింది వ్యవహారం.ఇప్పుడు శ్యామలీయం బ్లాగుకు కూడా అదే గతి పట్టిస్తే తెలుగు బ్లాగుల్లో పనికొచ్చే బ్లాగులు ఎన్ని ఉంటాయి?ఇంతకన్న యాగ్రిగేటర్లతో సహా మొత్తం బ్లాగుల్ని మూసెయ్యడం బెస్ట్?!
P.S:తనవైపునుంచే చూసుకుంటూ తనది కేవలం హాస్యదృష్టీ,చతురతా అని జిలేబీ తనకు తాను మురిసిపోవచ్చు,కానీ జిలేబీ ధోరణి వెకిలితనం స్థాయికి దిగజారింది - పోరంబోకుతనం వరకూ దిగజారకుండా ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప గౌరవనీయతా/విశ్వసనీయతా తిరిగి రావు.
స్వస్తి!
జిలేబీల వినాయకుడు..!
ReplyDeleteముంబయి: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల పదార్థాలు ఉపయోగించి వినూత్నంగా బొజ్జ గణపయ్యలను తయారు చేస్తారు. మట్టి, బియ్యం, చాక్‌పీస్, ఛాక్లెట్‌లు ఇలా రకరకాల వాటితో చేసినవి చూస్తూనే ఉంటాం. కాని ముంబయికి చెందిన కొందరు కళాకారులు జిలేబీల గణపయ్యను తయారు చేశారు. పసుపు రంగులో ఉన్న ఈ జిలేబీల గణనాథుడు సందర్శకులను తెగ ఆకట్టుకుంటుంది. సోమవారం వినాయకచవితి సందర్భంగా ముంబయిలోని ఓ వీధిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break165