Friday, April 20, 2018

ధర్మ పోరాట దీక్ష !

ధర్మ పోరాట దీక్ష
తెలుగు తేజపు డీ !
నారావారి దీక్ష
 


అదిగో మెదలెట్టెన్ దీ
క్ష! దీకొనుచు చంద్రబాబు ! కాలున్ దువ్వెన్
కదిలెన్ తెలుంగు తేజము
వదులరికన్ వేద సమర వారిజమిదియే!
 
చంద్రన్న దీక్ష! మద్దతు
సంద్రంబుప్పొంగెనే! విజయమిక మనదే
కంద్రీగతుట్టె కదిలె! న
రేంద్రుడ దిగిరమ్మ భువికి రిమ్మను విడుమోయ్


పోరాటమ్మిది!ధర్మ దీక్ష! భళిరా పూరించె శంఖమ్ము మా
నారా వారు! తెలుంగు తేజమిదిగో! నాలాయకీ వీడి, మో
డీ!రమ్మా!దిగిరమ్మ ! ఆంధ్ర ప్రజలొడ్డేరయ్య చాలెంజు!భా
జ్పా!రాష్ట్రమ్మును తీర్చిదిద్ద సలుపన్ సాయమ్ము జైహిందనన్


జిలేబి
 

201 comments:

 1. dear sir very good blog and very good content
  Telugu News

  ReplyDelete
 2. అల్లాగే బాలయ్య స్పీచు వర్ణించుడీ చదువరుల మనములుప్పొంగగన్

  ReplyDelete
 3. “జిలేబి” గారూ, మహానుభావుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు నిన్న దివికేగడంతో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది.

  ఈ సందర్భంగా బ్లాగ్ లోకంలో వారి స్మరణ జరిగినట్లే కనిపించలేదు (నా కళ్ళకు)! ముఖ్యంగా పాటల బ్లాగ్ ల వారెవరైనా బాలాంత్రపు వారిని తలుచుకుని వారిది ఒక పాట - ముఖ్యంగా టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన “మాదీ స్వతంత్ర దేశం, మాదీ స్వతంత్ర జాతి” లాంటి పాటేదైనా - పోస్ట్ చేస్తారని ఆశించాను 🙁.

  అన్నట్లు, నిన్న ఒక టీవీ ఛానెల్ ఏంకరమ్మ “బాలా త్రిపుర” రజనీకాంతరావు గారు అని పలికింది, ఖర్మ ఖర్మ 😡. “బాలాంత్రపు” అనే మాట నోరు తిరగలేదేమో పాపం 🙄.

  బాలాంత్రపు వారి ఆత్మకు శాంతి కలుగు గాక 🌸🌸 🙏.

  ReplyDelete
  Replies

  1. బాలాంత్రపు వారికి నివాళి.

   మీ కోరిక తీరిందా ?


   జిలేబి

   Delete
  2. యెస్సూ .... వైవీఆర్ గారి సౌజన్యంతో. వారికి ధన్యవాదాలు.

   Delete
 4. నరేంద్రుడు రాయబారిగ
  నరసింహుని పంపన్
  నారానగధీరుడు,మెట్టుదిగి
  నేరాపొమ్మనియెన్
  (P.n : ఛందస్సులు వెతకరాదు)

  ReplyDelete
  Replies
  1. బోడి చందస్సు....మీ పద్యం చక్కగా అర్ధం అయిందండీ...బాగా వ్రాసారు.

   Delete


  2. కుస్తీ ఛందస్సులతో
   మస్తుగ మనకేల!వైవి !మాంఛిక వితయౌ !
   దోస్తుల్ చెప్పిన పల్కుల
   కాస్తై నన్వినలవలెను గాద జిలేబీ :)

   జిలేబి

   Delete


  3. శ్రీ నరేంద్రుని రాయబారిగ జిలేబి
   వచ్చి రట నారసింహులు !వారి పల్కు
   కౌర బాబు నో నో యని రౌర! తెలుగు
   తేజ మయ్య నారావారు తీక్ష్ణదంష్ట్ర!

   జిలేబి

   Delete


 5. వలదీ సందేహమయా
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో,
  కలమును చేర్చగ పద్యపు
  జలతారెటులో యటులనె చక్కగ రాజా!

  జిలేబి

  ReplyDelete


 6. బలమెంతో గలదండీ
  వలపుల రాణీ జిలేబి పద్మార్పిత మీ
  పలుకులలో! పడెదరు మీ
  వలలో తప్పక సుమా కవనపు నెలతుకా !

  జిలేబి

  ReplyDelete


 7. చచ్చో చంపో తిట్టో
  బుచ్చబ్బాయి హరిబాబు బుచికీ యాయెన్
  ముచ్చటగ వారిరువురు
  న్నిచ్చుక పోవ తడకట్టు నిడిరి జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 8. కవివర్యుల పంథాలో :)


  కిలకిల నవ్వుల నడిగె
  న్నిలన్ తిరుకణామధువున నిన్గనినారో?
  వలపుల భూజ! మహీసుత!
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?

  జిలేబి

  తిరుకణామధువు - పాయసము

  ReplyDelete


 9. తెలుసుకొనుమా జిలేబీ
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో
  కలకాదిది నిజ మోయీ
  తలచన్ బ్రహ్మయ్య సాధ్య తరమగు నమ్మా !

  జిలేబి

  ReplyDelete


 10. పట్టు పట్టరాదు పట్టి విడువ రాదు
  గట్టి యత్న మున్న గడ్డిలోన
  బుడత బుట్టునయ్య బుడిబుక్క లాటగన్
  మడత కాజ పాల మహిమ యనగ :)

  జిలేబి

  ReplyDelete


 11. అదిగో మళ్లీ వచ్చెను
  సదనమ్మునకు హరిబాబు చక్కగ వేయన్
  బెదరక మరో టపా ! భళి
  కదనమ్మిక సాగునమ్మ కసబిస యనుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 12. నరసింహన్ గుడి కెళ్తే
  అరె! హిందూత్వపు జిలేబి ! యర్ఫాను మసీ
  దు రయముగ బోవ భక్తియు
  ను రహమతున్ గల జిలేబి ! నుజబా పలుకుల్ :)

  జిలేబి

  ReplyDelete
 13. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఊతపదాల్లాగా మీరు కూడా “సన్నాసులు”, “శుంఠలు” అంటూ మొదలెట్టారేమిటి ఈ మధ్య?😡
  (“శంకరాభరణం” బ్లాగ్ లో ఈ రోజు మీరు కట్టిన ఒక పద్యం లో మీరు వాడిన పదం)

  ReplyDelete
  Replies

  1. ఆ పదము "సాధువా అసాధువా" తెలుసుకుందామని విన్నకోట వారు :)

   జిలేబి

   Delete


  2. ఇంతకీ ఆ ముమం యెవరండీ !

   జిలేబి

   Delete
  3. మరీ అమాయకత్వం నటించకండి “జిలేబి” గారూ. మీకు అన్నీ తెలుసు.

   Delete


 14. వాడేమనెను జిలేబీ
  వీడే మనియెన్నటంచు వెస పల్కులవే
  లా?డంబమదేలా ? యే
  నాడైనన్ నీవు గాంచిన ఋతము గలదా?

  జిలేబి

  ReplyDelete


 15. ఈ కురువృద్దుల చూడ
  న్నా కాంక్షయు తగ్గుచుండె నలమేనిదొరా!
  నాకిక చివ్వి వలదు ! బా
  వా! కౌపీనము ధరించు వాఁడెధ నికుఁడౌ!

  జిలేబి

  ReplyDelete


 16. వినకోయి జిలేబీ నుడు
  వన,కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ
  యనుచున్ సన్నాసులు పలు
  కన! కష్టేఫలి! మనుగడ కదియే సృతియౌ!

  జిలేబి

  ReplyDelete


 17. మనసైనవాడు మామయు
  తననర్థము జేసుకొనక తపియించెనుగా
  వనితా జిలేబి పద్మన
  యన! నీ కవితల్లతనికి యమపాశమ్మే !

  జిలేబి

  ReplyDelete


 18. సన్నాసులు శుంఠలనుచు
  మన్నెల మజ జేర్చు ముఖ్య మంత్రివరుండే
  వెన్నెల రేడో గద నర
  సన్నా జర తెల్పుడీ విషయమున్ననఘా !

  జిలేబి

  ReplyDelete


 19. పనియున్ బోయె జిలేబీ
  మునినయ్యెదనింక ముక్కు మూసుకొనెద ! చు
  వ్వన దస్కము దక్కన్, తె
  వ్వన కౌపీనము ధరించువాడె ధనికుడౌ!

  జిలేబి

  ReplyDelete


 20. హుందాగన్ జావళి యుం
  డందమ్ముగ నౌ జిలేబి డమడమ కాదే
  బిందాసౌ యైటంసాంగ్
  చందమ్మవదు బుచికీ కిచడియున్ కాదే :)

  జిలేబి

  ReplyDelete


 21. కలువాయిబ్రహ్మజ్ఞా
  నుల పల్కుల నెల్ల వినుచు నూతిన్ బడిరే
  జలకమ్ము లాడి రే జను
  లు లబ్జుగా భళి జిలేబు లూరన్ సుదతీ :)

  జిలేబి

  ReplyDelete


 22. మా లక్కుపేట రౌడీ
  రూలును మార్చిరొ జిలేబి రూపము మార్చెన్
  మాలిక? యైదుకు పైబడి
  జాలపు కామింట్లు బ్లాగు జాబిత లోనన్ ?:)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ????? 🤔🤔🤔🤔🤔. మీరేమంటున్నారో బోధపళ్ళే 🙁.

   Delete


 23. విన్నకోట నరసరాయ వినుడు రామ
  గాధ! ధన్వము విరిచెను గణుతి కెక్కె
  పుడమి పుట్టువు! మైథిలి! భూజ! పసిడి
  తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మధ్యలో నన్ను గిల్లకండి ☝️.
   వీటిల్లో నాకేమీ ప్రవేశం లేదు. అయినా, లవకుశుల తల్లి అనచ్చేమో అనుకున్నాను. తీరా ఆ బ్లాగ్ చూస్తే ఈశ్వరప్ప గారు ఆ విధంగానే పూరించినట్లు తెలుస్తోంది 👏. శభాష్ కదా (నన్ను కూడా 🙂). మీరన్న పసిడితల్లి కూడా బాగానే ఉంది 👌.

   Delete


 24. మ్రొక్కె తన తండ్రికిన్ సయి మ్రొక్కె నతడు
  తల్లి కౌసల్యకున్ సుమిత్రకును కైక
  తల్లికిం, దాళిఁ గట్టెను దాశరథియె,
  జగము నేలు తల్లికి పురజనులు చూడ,
  దహరులున్ను కాలుత్రొక్క తమ సతులను!

  జిలేబి

  ReplyDelete


 25. శనికుజులు ధనుర్రాశిన్
  పనిగట్టుకు వచ్చినారు పట్టుగ సుమ్మీ
  మనసాములోర్ల కిక చు
  వ్వన తప్పదు శంకటములు వడివడి సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 26. బస్కీ లను దీసెనతడు
  మస్కును కొట్టె ప్రెసిడెంట్లు మంచిగ చూడ
  న్నాస్కా రంబే లేదన
  విస్కీ త్రాగి యవధాని వెస సభ కేఁగెన్ :)

  జిలేబి

  ReplyDelete


 27. అతిగా చదువన్ కనులు
  న్నతివ జిలేబీకి బోవ నలుపుచు వాటిన్
  పతినిసతిగ చదివెనయా
  సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్!

  జిలేబి

  ReplyDelete

 28. అతడును నామెయు నొకరై
  వెతలన్ మరచి మరులొలుక వెసనట మంద
  స్మితముగ గడుపంగన్నవ
  సతి, సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్

  అవసతి - రాత్రి
  జిలేబి

  ReplyDelete


 29. సతి యర్ధపతి! పతియున
  ర్ధ తరుణి! కలువాయి లోన రాసపు కేళిన్
  సతిపతి యో? మరి పతియో
  సతి? సతి క్రీడింపఁ బురుష! సంతతి గల్గెన్!

  జిలేబి

  ReplyDelete


 30. మితిమీరుచు నాస్వాదిం
  చితివో దుష్ట!కలువాయి! చిత్తభ్రాంతిన్
  మతితప్పిపల్కుటే? యే
  సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్?

  జిలేబి

  ReplyDelete


 31. వేసా చక్రము బాపూ
  ఆశారామునిది నేను ! హాశ్చర్యములే
  దీశాల్తితప్పు చేయన్;
  ఓ శర్మన్! తెలుగువాళ్ల గురుడవు నీవే :)

  జిలేబి

  ReplyDelete


 32. శరణు శరణు సహకార శకార జిలేబి!  రార! శకారుడ! నేర్పుమ
  యా రామాయణమనన్ సయాటల చెప్పెన్
  "చారంబందున బుట్టెన్
  శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై"

  జిలేబి

  ReplyDelete


 33. కారున విడిచితి! నెంచెన్
  శ్రీరాముఁడు శివునిఁ , జంపె సీతకు సుతుఁడై
  యా రాముని నహము లవుం
  డా రామకథ గొనుచు కుశుడవ సైదోడున్!

  జిలేబి

  ReplyDelete


 34. తేరిచి రావణు నెంచెన్
  శ్రీరాముడు శివుని; జంపె సీతకు సుతుడై
  ధారాళమ్ముగ నసురుల
  పోరుల సల్పుచు కుశుండు పోరి, జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 35. రాను రాను కలము రసములూరె లలిత
  రవళి కృష్ణ పక్ష రజని పదము
  నీ నివాళి యున్ను నీదైన బాణిని
  తీర్చి నావు సూవె తేటగొనుచు!

  జిలేబి

  ReplyDelete


 36. రజనీ కాంతులకు నివా
  ళి! జగము నేలితి రయా లలితమౌ సంగీ
  తఝరి అలల ఆకాశము
  న జనుల చేరి మదిలోన నాటుకొనంగన్ !

  జిలేబి

  ReplyDelete


 37. నారి! జిలేబీ ! శివుడౌ
  గౌరికిఁ ,గేశవుఁడు భర్త గావలె నెన్నన్
  వారిజ నేత్రౌ లక్ష్మికి!
  సారసగర్భుండు నొడువు జవ్వనికిగదా!

  జిలేబి

  ReplyDelete


 38. కుండ - దుత్త - చెంబు - గరిటె
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
  భారతార్థంలో

  ***

  యక్షుడు ధర్మరాజు తో

  మీ తమ్ముల దుత్త ఢమడ
  మే! తరగరి!టెంకణమిడు! మేటిజవాబుల్
  ద్యోతింపకుండ విడువన్!
  యాతన కొంచెంబు వారి యాయువు సుమ్మీ!

  ***

  కుచేలుడు కృష్ణుడు  తనదుత్తరీయమును జా
  పెను కొంచెంబు! యవనారి పేర్మి నటుకుల
  న్ననుకోకుండ గొనెను పొం
  తన!డింగరి టెంకణమిడె తరుణి‌ జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 39. సర్వంబును తెలుసుగదా!
  పర్వంబిదియె కొనియాడు పద్యము గూడెన్
  తర్వాయి భళి జిలేబీ,
  దర్విని ద్రిప్పవలయున్ సదనమున సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 40. అందంబుగాను పదముల
  డెందంబరయగ జిలేబి డెంకణమిడుచున్
  బంధమ్ముల పదబంధము
  ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్

  జిలేబి

  ReplyDelete


 41. అజ్ఞాతలన నెవరహో?
  విజ్ఞానమ్ము కలవారు విదురుల్ సుమ్మీ !
  ప్రాజ్ఞులు జిలేబులున్ సా
  మ్రాజ్ఞులు సిరులొల్కువారు మాన్యులు సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 42. పెండ్లి చూపుల తరువాయి మా అయ్యతో మా బామ్మ పలుకులు :)  మన జిలేబికి చూచిన మగడు, తల్లి
  తండ్రులకు మ్రొక్కెను! పతివ్రతా సుతుండు
  జూచు కొనె వారి నెల్లర సుఖము గాను
  మేలుబంతియొజ్జయు!నిత్తుమీమె నయ్య :)


  జిలేబి

  ReplyDelete


 43. ఎన్ డీ టీ వి వార్త చదివేక

  ఆదరముగ చెట్లనటన్
  వేదారణ్యంబుగాను వేడ్కగ నిలుపన్
  బాధాతప్తులవంగన్
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!


  తెలంగాణా లో ట్రీ ట్రాన్స్ ప్లాంట్ !  https://www.ndtv.com/telangana-news/a-telangana-hospital-that-gives-dying-trees-a-second-life-1845101


  జిలేబి

  ReplyDelete


 44. స్త్రీభావనార దీయపు
  వైభవముగ వెల్గితీవు వయ్యారముగన్
  స్వాభావమ్మిది యేనా
  ఓ భామామణి జిలేబులూరెన్ గదవే :)

  జిలేబి

  ReplyDelete


 45. పూరించెను చంద్రన్నయు
  పోరాటపు శంఖమున్ను పూర్ణిమ రోజున్
  పారాహుషారనుచు భళి
  హోరాహోరిగను మోడి హోప్లెస్సనగన్ :)

  జిలేబి

  ReplyDelete


 46. కొబ్బరి నూనియ కన్న
  న్నబ్బోడా నా కమింటు నచ్చక జిడ్డై
  తబ్బిబ్బుల బోతివయా !
  జబ్బల్బట్టి సయి చళ్ళు చళ్లన చెంపన్ :)

  జిలేబి

  ReplyDelete
 47. స్పెల్లింగ్ స్పెల్లింగ్, “జిలేబి” గారూ ☝️.

  ReplyDelete
  Replies

  1. ఏమి స్పెల్ అండి ? స్పిల్లింగ్ అన్నారా ?


   జిలేబి

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. This comment has been removed by the author.

   Delete
  4. పైన “స్పెల్లింగ్ స్పెల్లింగ్” అని నేను సున్నితంగా ఇచ్చిన హింట్ ఇప్పుడైనా అర్థమైందా, “జిలేబి” గారూ?

   Delete

  5. ఓహో నిజంగానే చెళ్ళు మనిపించాలని మీ ఉద్దేశమా ?

   సరే ! నేను చల్లు చల్ల ని కొంత 'సాధువు' గా చెప్పే నని కోపమన్న మాట :)


   జిలేబి

   Delete
  6. చల్లు ....చళ్ళు

   ఏది వ్రాసావో కూడా సోయ లేదా ?
   మళ్ళీ "నారాయణ" లాగా కవరింగు ఒకటీ !

   Delete


 48. అన్నింటి నధిగమించుచు
  మిన్నగ పద్మార్పిత పద మీదారియనన్
  చెన్నుగ నిలిచెద వమ్మా
  మన్నిక గానుచు నిలన్ సమస్యల ద్రోలన్

  జిలేబి

  ReplyDelete


 49. ఈవిరహమ్ములలుక లే
  లా! విరచించండి పద్మ లాస్యపు కవితల్!
  సేవింతుము మధు పాత్రన్
  కావలె కావలె జిలేబి కావలె ననుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 50. పవనుండే దేవుడు!మా
  నవుడా! మనకెల్ల జీవనాధారమతం
  డవనిన్ తెలుసుకొను! జిలే
  బివలెన్ దేశప్రగతికి విభుడతడేనౌ!

  జిలేబి

  ReplyDelete


 51. ఓ జీ! కట్పేష్టులతో
  యా జీవి బతికె జిలేబియై!వెన్నాడన్
  హా!జీ యనకుండున్? పో
  నీ జీ విడుమయ్యనతడిని పనేమియు లే ? :)

  జిలేబి

  ReplyDelete


 52. హీనంబైన గుణమ్ముల్
  స్థానంబులు తప్పిన సహజత్వము లెల్లన్
  జీనము జేయన్ వాటికి
  హానింజేయకయె యెటుల నాచార్యుఁ డగున్?

  జీనము - నాశనము


  హీనంబైన గుణమ్ముల్
  స్థానంబులు తప్పిన సహజత్వము లెల్లన్
  చీనము జేయన్ వాటికి
  హానింజేయకయె యెటుల నాచార్యుఁ డగున్?

  చీనము - బంగారము

  జిలేబి

  ReplyDelete


 53. కనిపించవే జిలేబీ
  వినికిడి బోయెడు విధమ్ము విఱిగాలివలెన్
  నిను గొట్టెద!నీహారిక
  ను నేను విడువను విడువను నులిచేయుదనే !

  జిలేబి

  ReplyDelete

 54. కోరుకున్న వారికి కొంగుబంగారమ్మై :)


  కొబ్బరి నూనియ కన్న
  న్నబ్బోడా నా కమింటు నచ్చక జిడ్డై
  తబ్బిబ్బుల బోతివయా !
  జెబ్బల్బట్టి సయి చెళ్ళు చెళ్ళన చెంపన్ :)

  నారాయణ
  జిలేబి

  ReplyDelete


 55. లకుళకు తెలియదె మీకు ఫ
  రకు?నారాయణ యనంట రా మళ్లీనూ ?
  టకుటకు లాడి జిలేబీ
  తకరారిక జేయకోయి తన్నుల్ తప్పవ్ :)

  జిలేబి

  ReplyDelete


 56. డోనాల్డు ట్రంపు కివ్వా
  లీ నాడే శాంతి దూత లెంక యవార్డున్ !
  తానముతో దక్షిణ కొరి
  యా నుత్తరపుకొరియా సయాటల జేర్చెన్ !

  జిలేబి

  ReplyDelete


 57. సోయి లేదుటే దొరసాని సోయగమ్ము
  ల దొరసాని లేదుటె సోయి? లబ్జుగాను
  నేర్వవే పదముల నెల్ల నీరజాక్షి
  యాంధ్ర భారతి చూడవే యంబుజాక్షి :)

  జిలేబి

  ReplyDelete


 58. మకర రాశిలోన మస్తుగ కుజుడు జి
  లేబి యై నిలిచెను లేవు మయ్య
  నరుడ నిదుర లెమ్ము నమ్ముము నీతిబా
  హ్యపు నడతవిడువ ముదావహమ్ము

  జిలేబి

  ReplyDelete


 59. కోడి కూర లోన కొబ్బరి వేయను
  పల్లికాయలు సరిపడవు నాకు
  తిండి తినగ నరగ దీయ శక్తియులేదు
  కస్సు బుస్సు లేను ఘమఘమలయ!

  జిలేబి

  ReplyDelete


 60. తలపై కొట్టంబైనను
  నిలబెట్టండయ్యలార నిలకడ గానన్
  విలవిల లాడితి! మీరో
  కులికిరి గద యేసిగదుల కూల్ కూల్ యనుచున్ !

  జిలేబి

  ReplyDelete


 61. ఆర్యావర్తము లోనన్
  ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్
  శౌర్యంబుకూడ లేదౌ
  క్రౌర్యంబేయాయుధమ్ము కవివర గానన్ !

  జిలేబి

  ReplyDelete


 62. భువనములు పదునాల్గు విభునికటంచు
  చెప్పుదురట! నీరేడుల చేవడి పదు
  నాల్గు రెండయ్యెనట! నల్లనయ్య కౌర
  లెక్క లెన్నిగలవయ జిలేబులూర !

  హమ్నయ్య
  ప్యాసయ్యా!

  జిలేబి

  ReplyDelete


 63. నావెన్నుపూస లోనన్
  బీవీవీ హైకు వేలు పెట్టిన ఫీలింగ్ !
  సావి! జిలేబీ బుచికీ
  నావెన్పూసనటతొక్కి నంతటి ఫీలింగ్ :)

  జిలేబి

  ReplyDelete


 64. చుక్కై యుంటి హతవిధీ !
  యెక్కవ చేసెన్ వయస్సు యెంచక్కా న
  న్నక్కా యని కాయ బిలిచి,
  తక్కువయితినే ! జిలేబి ! తక్కువయితినే :)

  జిలేబి

  ReplyDelete


 65. సోకక దూరముగ నిలిచి
  మాకిక పద్యములు రావు మల యన నేలా ?
  జోక పడగన్ కవులతో
  చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్!


  మల - కొండ
  జిలేబి

  ReplyDelete


 66. శ్రీ కంది వరులు పలికిరి
  చీకటిలో వస్తుచయము చిక్కును వెదుక
  న్నా కందుకనే యిష్టం
  బీ కవి వరుల సభ! దొరకు విరివిగ పదముల్ !  జిలేబి

  ReplyDelete


 67. వేరొకరి సమస్యలు మన
  కౌరా టైం పాస్ బఠాణి! కాదన కోయీ !
  తేరే మేరే బీచ్ మే
  ప్రారబ్ధవశమ్ముగాను ప్రకృతివరమయా !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. @శరత్చంద్రిక,
   పొలం మీద వచ్చే ఆదాయాన్ని కౌలు అంటారు. పొలం మీద కట్టే పన్నుని శిస్తు అని అంటారు.

   Delete
  2. పొలం మీద వచ్చే ఆదాయాన్ని “అయివేజు” అంటారు.

   Delete


 68. లాఫింగు బుద్ధుడు బుచికి
  కాఫిరు తా పుణ్య జీవి కంద జిలేబీ !
  బేఫికరుగట్టు పద్యము
  తోఫా వలెనౌ బిలేజి తొయ్యలి! వనితా !

  జిలేబి

  ReplyDelete


 69. రెమిడీ చెబ్తా రండ్రా !
  నమిలేస్తానర్ర మిమ్ము నా దురదయు బో
  వు, మహిని పీడా వదులున్
  కమాన్జిలేబులవగన్ సుఖమ్ముగ రండ్రా !

  జిలేబి

  ReplyDelete


 70. పిట్టల ఫోటో పట్టే
  మిట్టే జనులార రండు మీకోసమ్మే
  పెట్టామోయ్ వీటినిటన్
  చట్టు నిదుర వీడి చాకచక్యము గానన్ !

  జిలేబి

  ReplyDelete


 71. వేయండయ్యా తలపై
  వేయండీ కొట్టమొకటి వేడి మరీ మా
  కాయమ్మును కాల్చెనయా!
  సోయగముల మీరు యేసి సోకుల గలరే!

  జిలేబి

  ReplyDelete


 72. బ్లాగుల నుంచే వెళ్తు
  న్నా! గూబన గుయ్యటంచు నాల్గిచ్చు ఫెడేల్
  శ్రీ గురువులు హరి హడ్తాల్!
  వాగుడు కాయల కిక పరవాణ్ణం యెట్లే ? :)

  జిలేబి

  ReplyDelete

 73. నే చెప్పిందే వేదం :)

  తలకట్టులోన పెట్టెద
  తెలివిగ నీవడ్డ గాడిదే యని టైటిల్ !
  పలుకన్ రాదడ్డుగ కొం
  డలరాయా!యెదురు బల్క డామ్మని కొడ్తా !

  ReplyDelete


 74. హరికాలము యేట్లో పో
  యెర మానవుడున్ విడిచెను యెట్లో బ్లాగున్
  అరె! కింగ్ హరి తెర వేసెన్!
  అర కాలము మాలికకిక అడ్డా ఖాళీ :)

  జిలేబి

  ReplyDelete


 75. దిక్కిక మాలికకు జిలే
  బక్కే నర్ర! హరిబాబు పక్కకు బోయే!
  చుక్కెదురే లేదిక భళి
  యక్కోయ్ నీసాటిగలరె యవనిన్ సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 76. కులమేదని అడిగేవుగ
  తెలిపితి వినుమా జిలేబి తేకువ తోడై
  సలుపన్ ప్రేమనొకరి కొక
  రు,లబ్జు గనదియె సుమా జరూరుగ వనితా !

  జిలేబి

  ReplyDelete


 77. చవియె లేక చప్ప చప్పగ బతుకన
  ధవుఁడె కారకుండు తనయు మృతికి!
  కవియె కారకుండు కద పద్య సృజనకు
  భువియె కారణమగు బొందకున్ను!

  జిలేబి

  ReplyDelete


 78. నొచ్చు కున్నాడ హరిబాబు ? నోటి కొచ్చి
  నట్లు జనుల తిట్టిన తిట్టనక జిలేబి
  తిట్టుచుండె గాద జనుడు ? తిక్కకుదిరె
  కొండ తోడమోదె కడకు కొట్టు పోయె !

  జిలేబి

  ReplyDelete


 79. పీడ విరగ డయ్యె పిచ్చివాడట కొట్టు
  కట్ట గాను లకలకలును తగ్గు
  తెలుగు బ్లాగు లున్ను తేరుకొనునిక జి
  లేబు లూరు కొత్త లేగలొచ్చు :)

  జిలేబి

  ReplyDelete


 80. సన్యాసిదీక్ష ! భళిరా
  విన్యాసములున్ ! జిలేబి వీగెను కదవే !
  మాన్యుడు బ్లాగు‌న్ వీడడు !
  నాణ్యత బోయెనయ మాట నాటని‌లవకన్ :)

  జిలేబి

  ReplyDelete


 81. పోతా పోతా ననినో
  డేతా వాతా జిలేబి డేరా యెత్తున్ ?
  కోతల రాయలెపుడయిన
  హా! తానము విడుతురో ?కహానీ లంతే :)

  జిలేబి

  ReplyDelete
 82. పాపం, బ్లాగ్ లోకంలో మీ ఏకఛత్రాధిపత్య కోరికకు నీళ్ళొదిలేసుకోండిక. He is back కదా. 😀

  ReplyDelete
  Replies


  1. ఏక్ దిన్ కా బైరాగి :)


   జిలేబి

   Delete
 83. 👌.
  తెలుగు సినిమాల పరిభాషలో అయితే “సూపరెహే” 🙂.

  ReplyDelete


 84. చిచ్చర పిడుగున్రోయీ
  పిచ్చుచ్చుకుకొట్టెదన్ గుభిల్లన్రోయీ !
  బచ్చా గాడిని కాన్రోయ్
  దచ్చాయిస్తే దగరము తప్పదు మీకున్!

  జిలేబి

  ReplyDelete

 85. నీహారిక! వినవే! సం
  దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
  స్నేహంబున తక్కువగా
  డే! హంకారియునుగాడు!రేడితడేనే !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఎవరిగురించి చెపుతున్నారో అర్ధం కాలేదు.ఏదో మిస్సయినట్లున్నాను

   Delete


 86. ఓహో నేనే యనకోయ్!
  దేహము విడనాడి చూడు, ధీరత్వమున
  న్నీ హర్మ్యంబునట జిలే
  బీ, హాంకారములు నిన్ను విడి కల తొలగున్!

  జిలేబి

  ReplyDelete


 87. భగ్నంబవగన్ ప్రేమయు
  లగ్నాష్టకముల కికన్ పొలతి పని లేదే!
  మగ్నమయినట్టి బతుకున
  యగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్!

  జిలేబి

  ReplyDelete


 88. ఎవడీ రేడు జిలేబీ !
  గవనము విడిచితి తెలియదు కాస్తతెలుపుమా !
  మవురిని వాయించదగున్
  కువకువ లాడన్ జనుల్ శకునమిది యేనౌ !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. స్నేహంబున తక్కువగా
   డే! హంకారియునుగాడు!రేడితడేనే !

   ఎవరిగురించి చెపుతున్నారో అర్ధం కాలేదు.ఎవడీడు ?

   Delete


 89. తప్పు లెంచు టేల! తరముగాను తెలుసు
  కొంటి నయ్య రామ కోసలేంద్ర !
  నిన్ను వీడ నింక నీదయ చాలయ్య
  మంచి నడత గల్గి మహిని నిలుతు

  జిలేబి

  ReplyDelete


 90. పరమశివుడా డ్రయివరుని
  తిరముగ కూర్చుండ బెట్టి త్రిప్పెను వీలున్
  మురిపెము తోడు కలెక్టరు!
  కరూరు జిల్లా జిలేబి కథ! భళి భళిరే !

  జిలేబి

  ReplyDelete


 91. మగవాళ్లువంట లన్నే
  ర్వగ మారును వారి బుద్ధి రయముగ సుమ్మీ !
  జగమున నపుడే స్త్రీ వా
  ద గరిమ లబ్జుగ నెలకొను తరుణి జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 92. భూతలమున మార్చగ తల
  రాతల ధైర్యము వలయు, పరమును తలచుచున్
  చైతన్యముతో, వీడుచు
  భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్!

  జిలేబి

  ReplyDelete


 93. ఖ్యాతిని కోరక, జనుడా
  సోతాపన్నుడ వగుచు వసుధలో నీవ
  జ్ఞాతుడ వై నెక్కొనుచు న
  భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్!

  జిలే‌బి

  ReplyDelete
  Replies


  1. సోతాపన్న : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
   [బౌద్ధ]
   సంసార చక్రానికి కట్టిపడేసి ఉంచే బంధాలలో మూడింటిని తెంచుకొని నిర్వాణాన్ని చేర్చే జ్ఞాన ప్రవాహం (మార్గం)లో ప్రవేశించినవాడు.

   ఆంధ్ర భారతి ఉవాచ

   జిలేబి

   Delete


 94. మూడుకు కొబ్బరి చిప్పలు
  జోడగునా ? చికెను ముక్క జోడగునయ్యా ?
  ఆడోళ్లకు మగ వాండ్లకు
  జాడీల కొలది జిలేబి సబబా శరతూ?

  జిలేబి వారి జాంగ్రీ :)

  ReplyDelete


 95. అంతర్గతలావాయే
  వింతగ ఉప్పొంగుతోంది విరిబోణి గనన్
  చెంత మనోభావములట
  యింతై అంతై జిలేబి యింగితమయ్యెన్‌!

  జిలేబి

  ReplyDelete


 96. ఇంట గెలిచి రచ్చ గెల్వగావలయు జి
  లేబి సొబగు లద్ది లెస్స గాను
  వింత యిదియె నమ్మ వీపున బరువున్న
  జనుడు కొంత నేర్వ జాల డమ్మ !

  జిలేబి

  ReplyDelete


 97. పలికెదరు వీరెటువయిపు
  న లిఖించుచు పద్యములను నమ్మదగునటుల్,
  వలువ వలె నాకతాయి,య
  కలుషాత్ముల కెల్ల కవులకారణమిత్రుల్

  జిలేబి

  ReplyDelete


 98. అన్నా! యేమంటిరి ! ఓ
  రన్నా ! యిట్లా పలుకుట రవ్వంతయు గా
  దన్నా సరి! అనవలదే
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్!

  జిలేబి

  ReplyDelete


 99. అన్నార్తులయా కవివర
  చిన్నారులు! హాలహలము సేవింపఁ దగున్
  మిన్నాగున్నాభరణము
  గన్నార్త జనుల విభుండు కామారిగదా!

  జిలేబి

  ReplyDelete


 100. మనసుకవి శిష్యురాలవు!
  వనమున పద్మార్పితవు !కవనముల రమణీ
  య నెమలివి జిలేబివి! కా
  దనగల వారెవరు సూవె తరుణీ లలనా !

  జిలేబి

  ReplyDelete


 101. నే లవ్ గురుడిని కానం
  డీ! లెస్సగసెక్సుకు గురు డినికానండీ !
  చాలా మందికి పైబడి
  బాలా, జ్ఞానము బెటరు సభా చర్చ పయిన్

  జిలేబి

  ReplyDelete


 102. చాలీసా వెనుక యొకరు
  పోలీసై వారి వెనుక పోయెడు మరొకం
  డౌ లాఠీ పుచ్చుకొనుచు
  బాలకుమార! సరి జూడు పదముల తప్పుల్ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. పొద్దు పొద్దున్నే మీ పద్యాలు(అర్ధమైతే) భలే నవ్విస్తాయండీ ! హాస్యమే ఆరోగ్యం...ఆరోగ్యమే మహా భాగ్యం !

   Delete


 103. ఇతిహాసాలు పురాణా
  లు తుక్కు ! విద్యుత్తు నే వెలుపరించితిన
  య్య తృణమును మధించి సుమా!
  జత యంబపలుకు జిలేబి జకముకరాయీ :)

  జిలేబి

  ReplyDelete


 104. చెత్త ఇతిహాసముల నెల్ల చెత్త యగు పు
  రాణముల మధించితి నేను! రాయిడించి
  వెలువ రించితి విద్యుత్తు వేల వేల
  గాను యంబపలుకులన కవిత పారె:)

  జిలేబి

  ReplyDelete


 105. కడిగేసుకున్న చెత్తని
  వడివడి మరల పులమకుడు ! వలదువలదయా
  పొడిపొడి చేసెద మిమ్ముల
  నడిరోడ్డుననిల బెడత కనకన హరినహో !

  జిలేబి

  ReplyDelete


 106. సరిసరి ! గ్రామస్థులకిక
  కరణము వద్దనుచుఁ జెప్పు! కాలము వచ్చెన్
  భరియింపలేమికన్ వీ
  ళ్ళ రావడిన్! నందమూరి లసితపు హుకుమౌ!

  జిలేబి

  ReplyDelete


 107. తెల తెల్లవార మీ ప
  ద్యలహరి చదువ సదనమున దరసల్ నవ్వుల్
  పలువిధములుగా వచ్చును
  పొలతి జిలేబీ మజ పడి పోతిని పోవే :)

  జిలేబి

  ReplyDelete


 108. అరరే! ట్రంపూ కిమ్ముల
  సరసపు సంభాషణలకు సమయము వచ్చెన్!
  మరి వారిరువురు కలిసి యి
  క రణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్!

  జిలేబి

  ReplyDelete


 109. ఆట విడుపుపద్యముల స
  యాటగ వృత్తములలో వయనమొనరిచిరే !
  సాటి గలవారెవరయా
  మా టెంకణమిదియె మీకు మండలి వర్యా :)

  జిలేబి

  ReplyDelete


 110. ఊబరు వాడి కొరకు నా
  జేబు డెబిటు కార్డు స్వయిపు జేసా నయ్యా
  కాబూలీవాలా వలె
  నా బలజము దొక్కునో మన ప్రభుత్వమికన్ !

  జిలేబి

  ReplyDelete


 111. కవివర! శివపాడున యిరు గాలు గట్టి
  శవముఁ గాల్చెదరు! గుడిలో శివముఁ గోరి
  రెండు కాళ్ళు సాచి శివుని రేక రేక
  గాను గొల్తురు బేలరి గజరిపువని !

  జిలేబి

  ReplyDelete


 112. ఆహా! ఇంతగా పొగిడేస్తున్నారే కవివరులు నిన్ను జడా ! నిజమే నంటావా ?


  హా!కొత్తిమీర కట్టగ
  మా కంజముఖుల తలపయి మారితివిగదా
  నీ కుచ్చుల మెచ్చుచు భళి
  యీ కవి వరులొనరిచిరి కయితల సయి‌ జడా!

  ****

  మరీ సర్రియలిజ మయిపోతోంది‌:)

  హా! రెండు జడలు ముద్దన
  మా రాధ తలపయినొక జమానా లోనన్
  తీరుగ చక్కగ నుంటివి
  మారన్ కాలమ్ము మాయ మయినావె జడా!

  జిలేబి

  ReplyDelete


 113. మారితివే బాబ్డ్ భగినిగ
  మారితివే తేనెగూడు మదిరనయనగా
  మారితి వే బన్ను చెలిగ
  మారితివే కర్లి కర్లి మాధురిగ జడా !

  జిలేబి

  ReplyDelete 114. అల్లదియె తిరుపతి! ఆముదాల మురళి
  వారి అవధానమును చూడ వచ్చి నాడ !
  వేంక టేశుని డాపున వేంకటగిరి
  చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల

  తిరుపతి వేడెక్కి అగ్ని మండలం గా ఉన్నా అబ్బే కవర్యుల ఊహలకు అంతే లేదు :)


  జిలేబి

  ReplyDelete


 115. పెదవుల దాటని పదముల
  పదముల లో కనులలోన పల్కె జిలేబీ
  యెదలోని నిరీక్షణలున్
  పద ఫైండ్ మీనింగ్ సునిశిత పద్మార్పితవై !

  జిలేబి

  ReplyDelete


 116. ఇరవై మూడు నిమిషములు
  గురుడా చాలోయి మనిషి గుణములు మారన్
  సరి పదకొండు నిమిషముల
  పరిఢవిలు నెలమియు తీపి పరిపరి విధముల్ :)

  జలేబి

  ReplyDelete
  Replies
  1. ఇరవైమూడు నిమిషాల లెక్కేమిటి? ఒకప్పుడు ప్రఖ్యాత ఆంగ్ల నవలారచయిత Irving Wallace వ్రాసిన నవల The Seven Minutes లో లాగా ఈ ఇరవైమూడు నిమిషాలక్కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ☺

   Delete
  2. శిస్తు అంటే పన్ను,పట్టాదారు పాస్‌పుస్తకంలో భూమి శిస్తు అని వ్రాసి ఉంటుంది కానీ భూమి అయివేజు అని వ్రాసి ఉండదు.1969 నాటి బుర్రనే ఇంకా వాడుతున్నారు.ఇపుడు అణాకి పావలాకీ పుక్కట్ల జ్ఞానమెవరూ ఇవ్వడంలేదు.కృష్ణా జిల్లావారయి ఉండీ పార్లమెంటులో తలుపులుమూసి చేసిన భాగోతం మరిచిపోతారా నరసింహారావు గారూ ! ఆంధ్రుల పౌరషం ఏమయిపోయింది ?

   Delete


  3. ఆ మధ్య నీహారిక అని యెవరోనండీ యిలా యింకో బ్లాగులో చెప్పేరండి :) బిరాన యేది సరియో తేలుద్దురూ ప్లీజ్ :)


   @శరత్చంద్రిక, పొలం మీద వచ్చే ఆదాయాన్ని కౌలు అంటారు. పొలం మీద కట్టే పన్నుని శిస్తు అని అంటారు.

   Delete

  4. (1). శిస్తు అంటే పన్ను .... కాదన్నదెవరు ఇప్పుడు?
   (2). చంద్రిక గారి బ్లాగ్ లో .. పొలం మీద వచ్చే ఆదాయాన్ని “కౌలు” అంటారని మీ వ్యాఖ్యలో వ్రాశారు మీరు (అదే మాట “జిలేబి” గారి బ్లాగ్ లో కూడా అన్నారు మీరు). ఆ ఆదాయాన్ని “అయివేజు” అంటారని నేనన్నాను .... భూమిని కౌలు కిచ్చినప్పుడు కౌలు ఎంతండీ / కౌలు ఎంతయ్యా అని informal గా amount అన్న అర్థంలో మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు ... కొన్నిచోట్ల, కొంతమంది. అంత మాత్రాన అన్ని రకాల పంటభూముల మీదా కౌలు అన్న పదం అయివేజు (ఆదాయం) కి పర్యాయపదం అవదు.
   (3). అవును, పట్టాదారు పుస్తకం లో పొలం మీద ఆదాయం (అదే ... అయివేజు 🙂) ఎందుకు వ్రాస్తారు? వ్రాయరు, వ్రాస్తారని ఎవరన్నారు? శిస్తు మాత్రమే చూపిస్తారు ... అది ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ / ఆదాయం కాబట్టి.

   (4). మీ ఈ వ్యాఖ్యలో .. మీరు వ్రాసిన .. తతిమ్మా విషయాల .. రెలెవెన్స్ .. మీకు అర్థమయితే .. చాలు.
   ఏవో రెండు సినిమాలలో నుండి రెండు డైలాగులు ఉదహరించారిక్కడ. వాటికీ, ఇక్కడ చర్చిస్తున్న అంశానికీ సంబంధం నాకైతే తెలియడం లేదు.
   అన్నీ అలా కలగాపులగం చెయ్యకండి .... ప్లీజ్.

   (5). మీరు కూడా 1969 కి పెద్ద దూరంలో ఉన్నట్లు అనిపించదు అందామనుకున్నాను గానీ chivalrous గా ఉండదేమోనని తమాయించుకుంటున్నాను 🤔.

   (నా ఈ వ్యాఖ్య తయారయ్యే లోపే “జిలేబి” గారు beat me to it. వారి స్పీడ్ మనకెక్కడొస్తుంది 🙏?)

   Delete
  5. తెలివిగా మాట్లాడుతున్నానని మీరు ఫీలయితే నేను చెప్పలేను.చంద్రిక వ్రాసింది ముందు చదవండి. భూమి శిస్తుతో నగలు కొనుక్కుంటారు అని వ్రాసారు. నేను కౌలు అంటారని వ్రాసాను. నేను పుట్టిన దగ్గర నుండీ కౌలు అనే వింటున్నాను తప్పించి అయివేజు వినలేదు.కౌలు అని వ్రాయడం తప్పు అయితే మీరు చెపితే నేను సరిచేసుకుంటాను ఇపుడు వాడని/వాడుకలో లేని (కలవాయి )పదాన్ని నేనెందుకు చెప్పాలి ?

   Delete


 117. సీతమ్మ వారి వూరిని
  చూతము రారండి కొత్త శోభల తోడన్
  కేతన మూపిరి మోదియు
  మా తరమగు బస్సిదే సుమా రారండోయ్ !

  జిలేబి

  ReplyDelete


 118. జనకపురికిన్నయోధ్యకు
  మన మోది జతగలిపిరి రమణిసీతకు రా
  మునికిన్ సయోధ్య భారత
  మునకున్నేపాలుకున్ను ముఖ్యము రమణీ!

  జిలేబి

  ReplyDelete


 119. ఏడు నిమిషాల లెక్కల
  తాడనము తెలుసునకో సితారా నీకున్ ?
  చాడుపులు మూడు తేలెను
  బోడీ! యింకెన్నికగలవో గద హార్నీ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. “ౘాడుపు” అని వ్రాయాలిట (ఆంధ్రభారతి మేమూ చూడగలం ☝️).

   సరే, ౘాడుపులు మూడు తేలెను అన్నారు మీరు. ఆవిడ చెప్పిన ఇరవైమూడు నిమిషాలు ఒకటి, నేను చెప్పిన ఏడు నిమిషాలు ఒకటి ... మరి మూడో ౘాడ్పు ఏమిటి?

   Delete


  2. ఇరవై మూడు నిమిషములు
   గురుడా చాలోయి మనిషి గుణములు మారన్
   సరి పదకొండు నిమిషముల
   పరిఢవిలు నెలమియు తీపి పరిపరి విధముల్ :)

   జలేబి

   Eleven Minutes :)

   Delete


 120. అయివేజంటారమ్మ తె
  లియ! ఆదాయమును పలికిరిగ నరసింహ
  య్య! యువతి నీహారిక మరి
  రయముగ రమ్మా జిలేబి రగడల జేయన్‌:)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. నన్ను గిల్లకపోతే మీకు ఏమీ తోచదల్లే ఉంది.

   Delete


 121. గీ యెండలకు పరేషా
  నైయుంటే పద్మనయన నయగారమ్ముల్
  పూయించితివమ్మ జిలే
  బీ!యేమనిపొగుడుదును సభికులు పరేషాన్ :)

  జిలేబి

  ReplyDelete


 122. జోసెపు ప్రభువునట వేడె జోరునెచట ?
  శాస్త్రి సూర్యుని తోడుగ సంజె వేళ ?
  తురకల గుడిలోన నమాజు దునియు నెవరు?
  చర్చిలో; సంధ్య వార్చెను; సాయబయ్య!

  జిలేబి

  ReplyDelete


 123. జీపీయెస్ వారి కల :)

  మోడి తలపైన టోపియు,మోమున తిల
  కమ్ము చేత బైబిలు కల కళగొనంగ
  మాప్రభాకర శాస్త్రియు మదిని నెంచె
  చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య!

  జిలేబి

  ReplyDelete


 124. వేంకటగిరిని దర్శించి వేడె మేరి
  బైబిలు చదివి; తురకల పక్క నొగ్గు
  చున్న మాజుల చేసెను శొంఠి శాస్త్రి
  చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
  సర్వ మత సామరస్యపు సభ్యులు భళి!

  జిలేబి

  ReplyDelete


 125. సర్వ మత సామరస్యము సరి యటంచు
  పడిరి పోటీల జనులెల్ల! పరవశించి
  యా ఇలాహి జీసెస్ రామ! యని, జిలేబి,
  చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య!

  జిలేబి

  ReplyDelete


 126. పొద్దు పొడువ చాలు భోరు భోరని జిలే
  బులను గూర్చుచుండు పువ్వు బోడి,
  నన్ను గిల్ల కుంటె నారి జలేబియా
  తోచ దమ్మ నీకు తోయజాక్షి !

  జిలేబి

  ReplyDelete


 127. దారి లోన ముళ్లున్నచో తరుణి కోర
  కే తివాచి! చెప్పులు కొన్న కేవలమ్మ
  దియె సురక్ష నిచ్చు రమణి దిరిసెన పువు
  బోడి యా జిలేబి వినవె పొలతి మేలు !

  జిలేబి

  ReplyDelete


 128. ఏమో యేమో అయ్యిం
  దీ! మీ మనసెందుకో బెదిరెనుగ పద్మా!
  రోమాంచితమయ్యిందీ
  కామా మేమూ జిలేబి కామా మేమూ :)

  జిలేబి

  ReplyDelete


 129. మీ నవ్వులోన జీవము
  కానగ రాదే జిలేబి? కలతబడెను కం
  డ్లేను సుమా పద్మార్పిత!
  ఆనంత్యము చెప్పినావు నాశుకవితలన్ !

  జిలేబి

  ReplyDelete


 130. మనము పరాయి యనుకొనం
  గ నెలతుక పరాయియే! సగర్వము గా చె
  ప్పన యంతా మన మంచిక
  ని నమ్మవె జిలేబి యన్ని నీదే యగునే !

  జిలేబి

  ReplyDelete


 131. నైజము నకిలీ నవ్వుల
  తో జాబిలివలె జిలేబి తోచెను గాదే !
  రాజిల్లదు గద నెల్లపు
  డూ! జాగ్రత్తవలయును కడుంగడు గా సూ !

  జిలేబి

  ReplyDelete


 132. ఈ వర్షమ్మున కే స్ప
  ర్శే వుంటే నీమనసును రేయింబవలున్
  కావాలని కోరేదే
  మో వదిలేందుకిక తాను మొండిబడేనో!

  జిలేబి

  ReplyDelete


 133. తెలుగు తమ్ముళ్ల టెంపరు దిక్కు పిక్క
  టిల్లె గదజగ నన్నయు టెంకణమిడ!
  పల్లె వాటు జనులు గాద పచ్చ సోద
  రులయ సర్వదా సిద్ధము రువ్వ రాళ్ల :)

  జిలేబి

  ReplyDelete


 134. నే విన్నది కౌలేన
  య్యా వినుమా విన్నకోట యయివేజను ప
  ల్కే వినలేదెప్పుడు నూ
  సావీ !కలువాయిపదపు‌ సంబంధంబో ?

  జిలేబి

  ReplyDelete
 135. అయివేజు : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004 Report an error about this Word-Meaning
  వ్యవసాయ భూమి మీద వచ్చే ఆదాయం [కళింగ మాండలికం]

  ReplyDelete
  Replies
  1. @ R L garu,
   వ్యవసాయం మీద వచ్చే ఆదాయం అయివేజు అయిఉండవచ్చు.ఇక్కడ రైతు (యజమాని)స్వయంగా వ్యవసాయం చేయడం లేదని వ్రాసారు కాబట్టి కౌలు అన్న పదమే సరి అయినది అని నేను భావిస్తున్నాను.

   Delete
  2. నీహారిక గారూ,
   చాలా మంది ఆ విధంగానే వాడుతారు (అర్ధం చేసుకొనుట). కొంత కాలానికి ఆ రెండూ ఒకటే అవుతాయేమో!

   Delete
 136. కౌలు : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 Report an error about this Word-Meaning
  విశేష్యము
  ఒడంబడిక పత్రము.
  హిందూస్థానీ విశేష్యము
  1. [వ్యవసాయశాస్త్రము] భూస్వామి నుండి కొంత భూమిని శిస్తు చెల్లించు పద్ధతిపై రైతు తీసికొనుట.
  2. [వ్యవసాయశాస్త్రము] భూభాగమందు రైతుకు భూస్వామి వ్రాసియిచ్చు పత్రము.
  3. [శాసనము; అర్థశాస్త్రము] రైతులు భూస్వాముల యొద్ద నుండి (సేద్యము చేయుటకై) నిర్దిష్టకాలమువరకు భూమిని తీసుకొను ఒప్పందము (Lease).

  ReplyDelete


 137. ఈ వేదనా వ్యధల‌ ప
  ద్మా వీడుచు బయట పడుట మంచిది మగువా !
  నీవీ తరహా బాధల
  లో విహరించుట జిలేబులొప్పవు సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 138. తేటగీతి
  సమయ సీమిత సర్వ దర్శనము భక్త
  జనుల కిక శేష శైలవాస !తిరు వేంక
  టాద్రి నిలయ వాసుడ మా కటకట లెల్ల
  తీర్చి నావయ్య కొండపై తీరు గాను !

  జిలేబి
  Slotted Sarva Darshan

  ReplyDelete

 139. బాలాంత్రపు వారి గురించి ఈ మాట మే నెల సంచిక లో విస్తృతంగా

  http://eemaata.com/em/issues/201805/16036.html

  జిలేబి

  ReplyDelete
  Replies

  1. శోభనాచల వారి మరో ఆర్టికల్

   http://sobhanaachala.blogspot.com/2018/05/blog-post_11.html


   జిలేబి

   Delete


 140. అమ్మ చెప్పెనేల నబద్దమమ్మ తమ్ము
  డికి? వివరములవి తెలివిడికి, జిలేబి,
  చిక్కవుగదా ! మదిని మధించినది తల్లి
  పిల్ల వాడికొరకు సఖీ విస్తృతముగ !

  జిలేబి

  ReplyDelete


 141. జోలాలీ ! జో లాలీ
  జోలాలీ జోజొ! జోజొ జో లాలీ జో
  జో లాలీ జోలాలీ
  జో లా లీజోజొ! జోజొ! జో లాలీ జో !

  జిలేబి

  ReplyDelete


 142. తెల్ల కడుపు తిమి గరుడుం
  డల్లన వచ్చును జిలేబి డంగరి వేసె
  న్నల్లన వైవీ యారుడు
  చల్లగ వేసుకొను పద్య ఛందంబొకటిన్ :)

  జిలేబి

  ReplyDelete


 143. గమనింప గాన్పడడుగా
  యమవస దినమందు; చంద్రుఁ డగుపడె నింగిన్
  తమకపడుచు నా మర్నా
  డు మహిని వెల్గన సుమా కడుంగడు క్షయుడై !


  జిలేబి

  ReplyDelete


 144. మీ పుట్టినతేదియె ప
  ద్మా పూర్వపునటి కనుబడి తారీఖు సుమా!
  ఈపరితప్తత వీడం
  డీ!పాటియుగాదు మీకు డీకోలేలా :)

  జిలేబి

  ReplyDelete


 145. ఐ రెస్టిక మై కేసున్
  పోరీలన్నెదిరిచి భళి పోరాడగ లే
  నే! రయమున వీడెదనిపు
  డే!రావడి తాళలేను డీకోలేలా :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఆండాళ్ళూ నీకేవయినా అర్ధం అయిందా ? బ్రోచేవారెవరురా ... ట ట ట టా....

   Delete
  2. హతోస్మి, I rest my case అంటే మీకు ఇలా అర్థమయిందా “జిలేబి” గారూ 😡? కానీ మీరన్నటువంటి ప్రశ్నే లేదు ☝️👺.

   Delete
  3. :)

   "ఐ రెస్ట్ మై కేస్ అని మీరన్నారు :)

   దాన్ని మార్చి ఐ రెస్టిక మై కేసున్ అని నే రాసుకున్నా‌:)

   నారదా !

   జిలేబి

   Delete


 146. చాదస్తుల వీరవాయింపుడు :) మదర్స్ డే నా ఏం కూసావోయ్ ?


  దేవతలౌ యమ్మలకున్
  డే! వార్నీ పాసగూల ! డింగరుగా కొ
  ల్చేవా యేనా డైనన్?
  ఈ వెస్ట్రను మోజులేల యీప్సిత మే సూ ? :)

  జిలేబి

  ReplyDelete


 147. కాలపు తీరులు మారిన
  నేలను విడువకు జనుడ పునీత సుమా య
  మ్మౌ! లక్షణముగ కొలువుమ
  యా లచ్చిందేవిగ నభయమునిచ్చు సదా !

  జిలేబి

  ReplyDelete


 148. హ్యాపీ! మదర్సు డే! ఆ
  కౌపీనపు నాటి నుండి కాపాడెను తా
  నౌ పిరియముగా పిల్లల
  పాపిట సింధూరముగ సభామర్యాదౌ !

  జిలేబి

  ReplyDelete


 149. ధవళచ్ఛాయా కంజర
  తవిష చిరంభణము జూడ తనువుప్పొంగెన్ :)


  జిలేబి

  ReplyDelete


 150. రోజు నాడుగ మారెను రుక్కుమణి ! జి
  లేబి! అన్యభాష పదము లేల యనగ !
  తెలుగున పదసంపదయెంత తీరు గాంచె
  దేని కైన చిక్కును మంచి తేట పల్కు :)

  జిలేబి

  ReplyDelete


 151. వ్యధకూ వ్యధకూ మధ్యన
  మధించి చూడగ వెలుంగు మన్నిక గావె
  ల్గు దిరిసెన పువ్వు బోడియ
  విధియిది యేనమ్మ పద్మ వివరము‌ గనుమా‌!

  జిలేబి

  ReplyDelete


 152. శేష శైలం వెళ్లి వస్తే కోబ్రా ఎఫ్ఫెక్ట్ ఇంత ఉంటుందా :)


  అబ్రక దబ్రా యనెడా
  సుబ్రహ్మణ్యుడు మగడు, వెసులుబాటుగనన్
  జబ్రవముకాబలయనెడు
  కోబ్రా, తెమ్మనెను భార్య కోరిక లెసగన్!


  జిలేబి

  ReplyDelete


 153. కలలో, జీవన యానము
  న, లబ్జుగ మనుజుని మనసున, వెతుకగ జిలే
  బి,లయను, నాట్యము లోన, వి
  మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్!


  పాకమె జిలేబి కాయువు :)

  జిలేబి

  ReplyDelete


 154. పిలిచిన పలుకునతడు! కొం
  డల రాయుని దేవళమ్ము! డాంకృతి యదిగో!
  అలసిన మేనికి సఖి, తిరు
  మల, మును గనినంత, ముక్తిమార్గము దోఁచున్!

  జిలేబి

  ReplyDelete


 155. ఒక పద్యముతో పోయెడు
  యకమున కిప్పుడరరె యమ యాతన లాయెన్ !
  చకచక వేయు‌ జిలేబియు
  నిక పద్యములను టపటప నీహారికకై :)

  జిలేబి

  ReplyDelete


 156. మలమని వెరచెద వేలా!
  ఫలాదులను తాకినావు వర్చస్కమయె
  న్నిలను జిలేబి, మలమెవరు ?
  మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!

  జిలేబి

  ReplyDelete


 157. అయ్యిందా ? తెలుగు సినీ
  సయ్యాటల దీనినే రసములొప్పారన్
  వయ్యారముగా చెప్పుదు
  రయ్యా వైవీ ! జిలేబి రాద్ధాంతంబే :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. “వయ్యారముగా” చెబుతారనలేదు నేను. ముతకగా (మోటుగా అనే భావంలో) చెబుతారన్నాను ☝️.

   Delete


 158. ఆటవిడుపు పూరణలన్
  నేటి విషయముల పయిన కనికని యగువులో
  జాటరు డమాలు పదముల
  తాట వొలుతురు మన శాస్త్రి తరుణి జిలేబీ

  జిలేబి

  ReplyDelete


 159. నోట్లో సుపారి; ఒంటి పై మిన్నాగు; చూస్తే సర్కసు పొన్నారి :)


  బాగముల నములుచు, జిలే
  బీ, గబగబ వేదిక పయి పిరియమ్ముగ తా
  నే గళమున వేసుకొనుచు
  నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్

  జిలేబి

  ReplyDelete